బాక్సింగ్ పోటీలకు నారాయణ విద్యార్థి
Published Mon, Aug 1 2016 6:33 PM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM
గుంటూరు ఎడ్యుకేషన్ : బ్యాంకాక్‌లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్‌కు ఎంపికైన తమ విద్యార్థి పి. జానీ బాషాను నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ పిడికిటి తిలక్‌బాబు అభినందించారు. అమరావతి రోడ్డులోని సంస్థ జోనల్ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో తిలక్ బాబు పాల్గొని మాట్లాడారు. స్టూడెంట్స్ ఒలింపిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అండర్–17 జాతీయ స్థాయి ఉషూ బాక్సింగ్ పోటీలో బృందావన్ గార్డెన్స్‌లోని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థి జానీ బాషా ప్రథమ స్థానంలో విజేతగా నిలిచాడని చెప్పారు. త్వరలో బ్యాంకాక్‌లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాడని తెలిపారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగి దేశానికి అంతర్జాతీయస్థాయిలో ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు. జానీ బాషా మాట్లాడుతూ పోటీలో విజేతగా నిలిచేటందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా జానీ బాషాతో పాటు అతని తండ్రి మస్తాన్ ఖాన్, కోచ్ నరసింహారావును జీఎం తిలక్‌బాబు, డీన్ వీరగంధం శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు అభినందించారు.
Advertisement
Advertisement