
క్లియరెన్స్ మిస్ ఇండియన్ దివా
గుర్గావ్‌లో ఇటీవల ‘క్లియరెన్స్ మిస్ ఇండియన్ దివా’ పోటీ జరిగింది. దీనికి ‘ఆయుర్వేదిక్ రూప్ మంత్రా’ స్పాన్సర్‌గా వ్యవహరించింది. పోటీలో విజేతలుగా నిలిచిన వారికి దివిసా హెర్బల్ కేర్ సహ వ్యవస్థాపకుడు సంజీవ్ జునేజా అవార్డులను ప్రదానం చేశారు. సంజీవ్ జునేజా (ఎడమవైపు నుంచి రెండోవారు)తో పాటు ‘క్లియరెన్స్ మిస్ ఇండియన్ దివా’కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన నటి అదితి గొవిత్రికర్, బాలీవుడ్ నటుడు అస్మిత్ పటేల్, డిజైనర్ పూనమ్ భగత్ తదితరులు పై చిత్రంలో వున్నారు.