న్యూయార్క్ : డిసెంబర్, 2020లో జరగనున్న కన్వెన్షన్‌ను పురష్కరించుకుని ‘అమెరికన్ తెలుగు అసోషియేషన్’ ( ఆటా) ‘జుమ్మంది నాదం’ పేరిట ఆన్‌లైన్ సోలో పాటల పోటీ నిర్వహించనుంది. అమెరికాలో ఉంటున్న వారు ఈ పోటీలో పాల్గొనటానికి అర్హులు. మొదటి రౌండ్‌ను యూట్యూబ్ ద్వారా నిర్వహించనున్నారు. పోటీలో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ ఫాంలో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా ఆడిషన్స్ పంపాల్సి ఉంటుంది. ఫైనల్, సెమీ ఫైనళ్లు జూమ్ ద్వారా నిర్వహించబడతాయి. విజేతలను ప్రముఖుల చేతుల మీదుగా ఆటా టైటిల్‌తో సత్కరించనున్నారు.
పోటీలోని ఆరు విభాగాలు : వయసు పరిమితి
1) క్లాసికల్ : సబ్ జూనియర్స్( తొమ్మిదేళ్ల లోపు వయసు గల వారు)
2) క్లాసికల్ : జూనియర్స్ (10-14 సంవత్సరాల వారు)
3) క్లాసికల్ : సీనియర్స్ ( 15 పైబడిన వారు)
4) నాన్ క్లాసికల్ : సబ్ జూనియర్స్( తొమ్మిదేళ్ల లోపు వయసు గల వారు)
5) నాన్ క్లాసికల్ : జూనియర్స్ (10-14 సంవత్సరాల వారు)
6) నాన్ క్లాసికల్ : సీనియర్స్ ( 15 సంవత్సరాల పైబడిన వారు)
రిజిస్ట్రేషన్ చివరి తేదీ : జూన్ 7, 2020
రిజిస్ట్రేషన్ కోసం : https://tinyurl.com/ATA-JN2020 క్లిక్ చేయడి.
మరిన్ని వివరాల కోసం : https://tinyurl.com/ATA-JN-Details ను సందర్శించండి.
Comments
Please login to add a commentAdd a comment