వాషింగ్టన్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్వర్యంలో "ఝుమ్మంది నాదం" జూనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలు అద్భుతంగా జరిగాయి. ఈ పాటల పోటీలను జులై 4, 5,11 తేదీలలో ఆన్‌లైన్‌లో జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. దాదాపుగా 80 మంది గాయని గాయకులు అమెరికాలో పలు రాష్ట్రాల నుంచి ఆసక్తితో పాల్గొన్నారు. శ్రీ.రామ క్రిష్ణా రెడ్డి ఆల బోర్డు అఫ్ ట్రస్టీ శ్రీమతి.శారదా సింగిరెడ్డి ఝుమ్మంది నాదం చైర్ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు.
అమెరికా, ఇండియా నుండి సంగీత దర్శకులు శ్రీ. శ్రీని ప్రభల, సంగీత దర్శకులు శ్రీ.రాజశేఖర్ సూరిభొట్ల, ప్లే బ్యాక్ సింగర్, సంగీత దర్శకులు శ్రీ. నిహాల్ కొండూరి, ప్లే బ్యాక్ సింగర్ మరియు నందిని అవార్డు గ్రహీత శ్రీమతి. సురేఖ మూర్తి దివాకర్ల, సంగీత దర్శకులు శ్రీ..కార్తీక్ కొడకండ్ల, ప్లే బ్యాక్ సింగర్ శ్రీ నూతన మోహన్, ప్లే బ్యాక్ సింగర్ శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఆటా సంస్థ జూనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరి గాయనీ గాయకులు, 1.అభిజ్ఞ ఎనగంటి, 2.అభిరాం తమన్న, 3.ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల, 4.అదితి నటరాజన్, 5.అంజలి కందూర్, 6.హర్షిని మగేశ్, 7.హర్షిత వంగవీటి, 8.లాస్య ధూళిపాళ, 9.మల్లిక సూర్యదేవర, 10.మేధ అనంతుని, 11.ప్రణీత విష్ణుభొట్ల, 12.రోషిని బుద్ధ, 13.శశాంక ఎస్.యెన్, 14.శ్రియ నందగిరి, 15.ఐశ్వర్య నన్నూర్లను వర్జీనియా, న్యూ జెర్సీ, జార్జియా, కాలిఫోర్నియా, మసాచూట్స్, మిచ్చిగన్, వాషింగ్టన్ , టెక్సాస్, మిన్నిసోటా తదితర రాష్ట్రాల నుంచి ఫైనలిస్ట్స్గా ఎంపిక చేసారు.
ఆటా ప్రెసిడెంట్ శ్రీ..పరమేష్ భీం రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ. భువనేశ్ రెడ్డి భుజాల , బోర్డు అఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజనల్ డైరెక్టర్స్ ,రీజినల్ కోఆర్డినేటర్స్, ఆటా 2020 కన్వెన్షన్ టీం, ఝుమ్మంది నాదం టీం, సోషల్ మీడియా టీం ఫైనలిస్ట్స్ అందరికి అభినందనలు తెలియ చేసారు. పోటీలో పాల్గొన్న గాయని గాయకులు, వారి తల్లి తండ్రులు ఆటా సంస్థ కార్యవర్గ బృందానికి, న్యాయ నిర్ణేతల కు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ లో చూస్తున్న ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను పొందడం సంస్థకు గర్వకారణం. ఆటా ఝుమ్మంది నాదం సెమీఫైనల్స్ పాటల పోటీలు ఆగష్టు 2, 2020 వరకు ఫైనల్స్ ఆగష్టు 8, 2020 నుంచి ఆగష్టు 9 వరకు కొనసాగిస్తారు.
ఆటా సంస్థలకు లైవ్ ప్రచారం చేస్తున్న వివిధ టీవీ చానళ్లకు, జి.యెన్.యెన్, ఏ.బి.ఆర్ ప్రొడక్షన్స్, అలాగే తెలుగు ఎన్.ఆర్.ఐ రేడియో, టోరీ రేడియో మీడియా మిత్రులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఝుమ్మంది నాదం పాటల పోటీలు విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ఆటా ప్రెసిడెంట్ శ్రీ .పరమేష్ భీంరెడ్డి ప్రశంసలను తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment