juniors
-
భారత్ ‘పసిడి పట్టు’
అమ్మాన్ (జోర్డాన్): సీనియర్ స్థాయిలోనే కాకుండా జూనియర్ స్థాయిలోనూ అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లర్లు తమ పట్టు నిరూపించుకుంటున్నారు. ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి. గురువారం జరిగిన నాలుగు ఫైనల్స్‌లో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు ఎదురులేని విజయాలు సాధించి బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. అదితి కుమారి (43 కేజీలు), నేహా (57 కేజీలు), పుల్కిత్ (65 కేజీలు), మాన్సీ లాథెర్ (73 కేజీలు) ప్రపంచ చాంపియన్లుగా అవతరించారు. శుక్రవారం భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు చేరే అవకాశముంది. కాజల్ (69 కేజీలు), శ్రుతిక శివాజీ పాటిల్ (46 కేజీలు) నేడు జరిగే ఫైనల్లో స్వర్ణ–రజత పతకాల కోసం పోటీపడతారు. రాజ్‌బాలా (40 కేజీలు), ముస్కాన్ (53 కేజీలు), రజీ్నత (61 కేజీలు) కాంస్య పతకాల రేసులో ఉన్నారు. 49 కేజీల విభాగంలో భారత్ నుంచి ఎవరూ బరిలోకి దిగలేదు. ఓవరాల్‌గా భారత అమ్మాయిల జట్టకు టీమ్ ట్రోఫీ టైటిల్ లభించే అవకాశం కూడా ఉంది. 43 కేజీల ఫైనల్లో అదితి 7–0తో మరియా లుజా జికికా (గ్రీస్)పై గెలుపొందగా... 57 కేజీల ఫైనల్లో నేహా ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో 10–0తో జపాన్ రెజ్లర్ సో సుత్సుయ్‌ను చిత్తు చేయడం విశేషం. 3 నిమిషాల 59 సెకన్లలో నేహా జపాన్ రెజ్లర్‌పై పది పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై పది పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే ఆ రెజ్లర్‌ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. 65 కేజీల ఫైనల్లో పుల్కిత్ 6–3తో అంతర్జాతీయ తటస్థ రెజ్లర్ దరియా ఫ్రోలోవాపై నెగ్గింది. 73 కేజీల ఫైనల్లో మాన్సీ 5–0తో అంతర్జాతీయ తటస్థ రెజ్లర్ హనా పిర్స్కాయాపై గెలిచింది. -
ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం..
-
Viral Video: చెప్పినట్టు వినలేదని ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం..
ముంబై: ముంబైకి సమీపంలోని థానేకు చెందిన ఓ కాలేజీలో ఓ సీనియర్ ఎన్సీసీ విద్యార్థి జూనియర్ క్యాడెట్లను కర్రతో చితక బాదుతోన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. జూనియర్లను అమానుషంగా కొడుతున్న ఈ వీడియోను చూసి అనేక మంది నెటిజన్లు సీరియస్ అవుతూ ఆ సీనియర్ విద్యార్థిపైనా, కాలేజీ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసున్నారు. ముంబైకు సమీపంలోని థానే బందొర్కర్ కాలేజీలో జోరువానలో ఓ సీనియర్ ఎన్సీసీ క్యాడెట్ అతను చెప్పిన టాస్క్ చేయలేదన్న నెపంతో ఎనిమిది మంది జూనియర్ క్యాడెట్లను వరుసగా తల బురదనీటిలో ఆనించి వీపు భాగాన్ని పైకి లేపమని కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలను అక్కడి వారెవరో వీడియో తీసి వైరల్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్సీసీ క్యాడెట్లు అంటేనే క్రమశిక్షణకు మారు పేరు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణతో కూడిన నడవడికతోపాటు సేవాతత్వాన్ని అలవాటు చేసే విశేష కార్యక్రమం ఎన్సీసీ. అనేక మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ మిగతా వారికి మార్గదర్శకంగా నిలుస్తూ ఉంటారు. అలాంటిది తమ కాలేజీలోని ఎన్సీసీ క్యాడెట్లు ఇంతటి దుశ్చర్యకు పాల్పడటంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సుచిత్రా నాయక్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ సీనియర్ విద్యార్థి కూడా ఎన్సీసీ క్యాండిడేటే కాబట్టి అతనిపై తప్పక చర్య తీసుకుంటాము. మా కాలేజీలో 40 ఏళ్లుగా ఎన్సీసీ ట్రైనింగ్ నిర్వహిస్తున్నాము. కానీ ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదన్నారు. శిక్షకుడు లేని సమయంలో ఆ సంఘటన జరిగిందని మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనివారే అలా ప్రవర్తిస్తుంటారని ఆమె అన్నారు. ఇది కూడా చదవండి: సీఎం ‘కుర్చీ’లో అజిత్ పవార్.. -
IBS ర్యాగింగ్ కేసులో వెలుగు చూస్తున్న మరిన్ని నిజాలు
-
ఐబీఎస్ విద్యార్థుల మధ్య గొడవ.. కేటీఆర్‌కు వీడియో పోస్టు
సాక్షి, హైదరాబాద్: ఓ కళాశాలలో విద్యార్థుల చాటింగ్ వ్యవహారం గొడవలకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. అయితే జూనియర్‌పై సీనియర్లు ర్యాగింగ్ చేశారని, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌కు, సైబరాబాద్ కమిషనర్‌కు షేర్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి (ఐబీఎస్) కళాశాలలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 1న ఇక్ఫాయి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. ఇద్దరూ తమ స్నేహితులకు విషయం చెప్పారు. రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. ఈ విషయం ఇరువర్గాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు కళాశాల యాజమాన్యంతో చర్చించారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం శంకర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ గొడవ పడొద్దని రాజీ కుదిర్చి పంపారు. అయితే.. ఓ విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు.దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాత గొడవ వైరల్ చేస్తున్నారు: సీఐ ఇక్ఫాయి కళాశాల విద్యార్థుల మధ్య ఈ నెల ఒకటో 1న గొడవ జరిగింది. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి.. వారి సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇచ్చి పంపాం. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. అయితే.. కావాలని ఎవరో విద్యార్థులు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. చదవండి: మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..! -
World Junior Wrestling: ఒక రజతం, రెండు కాంస్యాలు..
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు కూడా పురుషులకు ధీటుగా పతకాలు సాధిస్తున్నారు. తాజాగా సంజూ (62 కేజీలు), భటేరి (72 కేజీలు) పసిడి పోరుకు అర్హత సంపాదించారు. దీంతో వీరిద్దరికి కనీసం రజత పతకాలు ఖాయమయ్యాయి. గురువారం ఫైనల్లో ఓడిన బిపాష (76 కేజీలు) రజతంతోనే సరిపెట్టుకుంది. సిమ్రన్ (50 కేజీలు), సితో (55 కేజీలు) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. (అప్పుడు ఎందుకు నవ్వలేదు: రవి దహియాను ప్రశ్నించిన ప్రధాని మోదీ) మహిళల 76 కేజీల టైటిల్ బౌట్లో బిపాష 0–10 స్కోరు (టెక్నికల్ సుపిరియారిటీ)తో ప్రత్యర్థి కైలీ రెనీ వెల్కెర్ (అమెరికా) చేతిలో పరాజయం చవిచూసింది. 65 కేజీల కేటగిరీ సెమీ ఫైనల్లో భటేరి 3–2తో అమినా రొక్సానా (రొమేనియా)ను ఓడించింది. ఫైనల్లో ఆమె మాల్డొవాకు చెందిన ఇరినా రింగాసితో తలపడనుంది. 62 కేజీల సెమీస్‌లో సంజూ దేవి 8–5తో బిర్గుల్ సొల్తనొవా (అజర్బైజాన్)పై గెలిచింది. తుది పోరులో ఆమె... ఎలీనా కసబియెవా (రష్యా)తో పోటీపడనుంది. 50 కేజీల కాంస్య పతక పోరులో సిమ్రన్ 7–3తో నటాలియా వరకిన (బెలారస్)పై, 55 కేజీల విభాగంలో సితో 11–0తో మెల్డా డెర్నెక్సి (టర్కీ)పై గెలుపొందారు. 59 కేజీల కేటగిరీలో కుసుమ్కు నిరాశ ఎదురైంది. కాంస్యం కోసం తలపడిన ఆమె 1–3తో జాలా అలియెవా (అజర్బైజాన్) చేతిలో ఓడింది. 72 కేజీల సెమీ స్లో సనేహ్ 0–11తో కెన్నెడీ అలెక్సిస్ (అమెరికా) చేతిలో ఓడింది. ఆమె కాంస్యం కోసం పోటీ పడనుంది. భారత పురుష రెజ్లర్లు రజతం సహా 6 పతకాలు సాధించగా... మహిళా రెజ్లర్లు ఇప్పటికే ఒక రజతం, రెండు కాంస్య పతకాలు గెలిచారు. -
'ఆటా' అధ్వర్యంలో పాటల పోటీలు
వాషింగ్టన్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్వర్యంలో "ఝుమ్మంది నాదం" జూనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలు అద్భుతంగా జరిగాయి. ఈ పాటల పోటీలను జులై 4, 5,11 తేదీలలో ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. దాదాపుగా 80 మంది గాయని గాయకులు అమెరికాలో పలు రాష్ట్రాల నుంచి ఆసక్తితో పాల్గొన్నారు. శ్రీ.రామ క్రిష్ణా రెడ్డి ఆల బోర్డు అఫ్ ట్రస్టీ శ్రీమతి.శారదా సింగిరెడ్డి ఝుమ్మంది నాదం చైర్ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు. అమెరికా, ఇండియా నుండి సంగీత దర్శకులు శ్రీ. శ్రీని ప్రభల, సంగీత దర్శకులు శ్రీ.రాజశేఖర్ సూరిభొట్ల, ప్లే బ్యాక్ సింగర్, సంగీత దర్శకులు శ్రీ. నిహాల్ కొండూరి, ప్లే బ్యాక్ సింగర్ మరియు నందిని అవార్డు గ్రహీత శ్రీమతి. సురేఖ మూర్తి దివాకర్ల, సంగీత దర్శకులు శ్రీ..కార్తీక్ కొడకండ్ల, ప్లే బ్యాక్ సింగర్ శ్రీ నూతన మోహన్, ప్లే బ్యాక్ సింగర్ శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఆటా సంస్థ జూనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరి గాయనీ గాయకులు, 1.అభిజ్ఞ ఎనగంటి, 2.అభిరాం తమన్న, 3.ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల, 4.అదితి నటరాజన్, 5.అంజలి కందూర్, 6.హర్షిని మగేశ్, 7.హర్షిత వంగవీటి, 8.లాస్య ధూళిపాళ, 9.మల్లిక సూర్యదేవర, 10.మేధ అనంతుని, 11.ప్రణీత విష్ణుభొట్ల, 12.రోషిని బుద్ధ, 13.శశాంక ఎస్.యెన్, 14.శ్రియ నందగిరి, 15.ఐశ్వర్య నన్నూర్లను వర్జీనియా, న్యూ జెర్సీ, జార్జియా, కాలిఫోర్నియా, మసాచూట్స్, మిచ్చిగన్, వాషింగ్టన్ , టెక్సాస్, మిన్నిసోటా తదితర రాష్ట్రాల నుంచి ఫైనలిస్ట్స్గా ఎంపిక చేసారు. ఆటా ప్రెసిడెంట్ శ్రీ..పరమేష్ భీం రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ. భువనేశ్ రెడ్డి భుజాల , బోర్డు అఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజనల్ డైరెక్టర్స్ ,రీజినల్ కోఆర్డినేటర్స్, ఆటా 2020 కన్వెన్షన్ టీం, ఝుమ్మంది నాదం టీం, సోషల్ మీడియా టీం ఫైనలిస్ట్స్ అందరికి అభినందనలు తెలియ చేసారు. పోటీలో పాల్గొన్న గాయని గాయకులు, వారి తల్లి తండ్రులు ఆటా సంస్థ కార్యవర్గ బృందానికి, న్యాయ నిర్ణేతల కు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్ లో చూస్తున్న ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను పొందడం సంస్థకు గర్వకారణం. ఆటా ఝుమ్మంది నాదం సెమీఫైనల్స్ పాటల పోటీలు ఆగష్టు 2, 2020 వరకు ఫైనల్స్ ఆగష్టు 8, 2020 నుంచి ఆగష్టు 9 వరకు కొనసాగిస్తారు. ఆటా సంస్థలకు లైవ్ ప్రచారం చేస్తున్న వివిధ టీవీ చానళ్లకు, జి.యెన్.యెన్, ఏ.బి.ఆర్ ప్రొడక్షన్స్, అలాగే తెలుగు ఎన్.ఆర్.ఐ రేడియో, టోరీ రేడియో మీడియా మిత్రులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఝుమ్మంది నాదం పాటల పోటీలు విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ఆటా ప్రెసిడెంట్ శ్రీ .పరమేష్ భీంరెడ్డి ప్రశంసలను తెలిపారు. -
చెప్పేవారు లేరు... చెబితే వినేవారు లేరు!
ముంబై: యువరాజ్ సింగ్ 2000 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. 19 ఏళ్ల కెరీర్ తర్వాత గత ఏడాది అతను ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలు చవిచూసిన యువీ... పలువురు దిగ్గజాలతో కలిసి ఆడాడు. ఈ క్రమంలో ఆటలో, మైదానం బయట కూడా వచ్చిన పలు మార్పులకు అతను ప్రత్యక్ష సాక్షి. తాను ఆడిన సమయానికి, ఇప్పటి తరానికి మధ్య పలు వ్యత్యాసాలు వచ్చినా... సీనియర్లకు గౌరవం ఇచ్చే విషయంలో మాత్రం ఈతరం ఒకరకమైన నిర్లక్ష్య ధోరణి కనబడుతోందని అతను అభిప్రాయపడ్డాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌లో సాగిన సంభాషణలో అతను ఈ వ్యాఖ్య చేశాడు. నిజానికి మార్గనిర్దేశనం ఇచ్చేందుకు కూడా ఇప్పుడు ఎక్కువ మంది సీనియర్లు లేరని యువరాజ్ అన్నాడు. యువీ తొలి మ్యాచ్ ఆడే సమయానికి జట్టులో సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, కుంబ్లేలాంటి దిగ్గజాలు ఉన్నారు. ‘మా సీనియర్లు ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఏకాగ్రత చెదిరే అవకాశాలు కూడా తక్కువ. సీనియర్లను చూసి మేం చాలా నేర్చుకునేవాళ్లం. ఎలా ఆడతారు, ఎంతగా కష్టపడతారు, జనంతో ఎలా మాట్లాడతారు, మీడియాతో ఎలా మాట్లాడతారు అనేవి తెలుసుకున్నాం. వారిలాగే ఉండేలా ప్రయత్నించేవాళ్లం. వచ్చే పదేళ్లు భారత్‌కు ఆడాలంటే మీరు ఇలా ఉండాలి అంటూ వారు మార్గనిర్దేశనం చేశారు’ అని యువరాజ్ గుర్తు చేసుకున్నాడు. ఆ ఇద్దరి తప్ప... నాటితో పోలిస్తే ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదని అతను అన్నాడు. మూడు ఫార్మాట్లు ఆడే వారిలో కోహ్లి, రోహిత్ తప్ప సీనియర్లు ఎవరూ లేరని చెప్పాడు. ‘ఈతరం కుర్రాళ్లను చూస్తే కొంత బాధ వేస్తుంది. మనకు అండగా నిలిచి సరైన దారిని చూపే వారు ఎవరన్నా ఉన్నారేమోనని చూస్తే జట్టులో అలాంటివారే కనిపించడం లేదు. ఫలితంగా సీనియర్లంటే గౌరవం కూడా తగ్గింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మేం ఎవరినైనా ఏదైనా అన్నట్లుగా యువ ఆటగాళ్లు తయారయ్యారు’ అని ఈ మాజీ ఆల్‌రౌండర్ ఆవేదన వ్యక్తం చేశాడు. జూనియర్ల ఇష్టారాజ్యం... ఒక టీవీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలతో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ నిషేధానికి గురి కావడానికి ఇది కూడా కారణమని యువరాజ్ విశ్లేషించాడు. ‘సోషల్ మీడియా, పార్టీలులాంటివే పాండ్యా, రాహుల్ ఘటనకు కారణం. మా రోజుల్లో అయితే ఇలాంటిది కచ్చితంగా జరిగి ఉండకపోయేది. అసలు ఊహించలేం కూడా. మేం సీనియర్లకు ఇచ్చే గౌరవం కారణంగా వారు సరైన దారిలో పెట్టేవారు. ఇలాంటి పనులు చేయకండి. ఇది మంచిది కాదు అని చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జూనియర్లు తాము ఏమనుకుంటే అది చేస్తున్నారు’ అని 2011 వరల్డ్‌కప్ విన్నర్ అభిప్రాయపడ్డాడు. అకస్మాత్తుగా వచ్చే డబ్బుతోనే... అయితే తాను కుర్రాళ్లను పూర్తిగా తప్పు పట్టడం లేదని, ఐపీఎల్ కారణంగా అకస్మాత్తుగా వచ్చి పడుతున్న భారీ మొత్తం వారితో ఇలాంటి పనులు చేయిస్తోందని యువరాజ్ వ్యాఖ్యానించాడు. ‘కొద్దిగా గుర్తింపు వచ్చిందంటే చాలు ఐపీఎల్ కాంట్రాక్ట్‌ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తోంది. చిన్న వయసులోనే ఏకాగ్రత చెదిరి వేరే అంశాలపై దృష్టి మరలుతోంది. వారు కెరీర్ ఆరంభంలోనే ఉన్నారు. ఇంకా భారత్ తరఫున కూడా ఆడలేదు కానీ ఆర్జన మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇంత డబ్బును ఏం చేసుకోవాలో వారికి తెలియడం లేదు. అందుకే తప్పుడు మార్గాల్లో వెళుతున్నారు. ఇలాంటప్పుడు సీనియర్లు, కోచ్‌ల మార్గనిర్దేశనం కావాలి. మైదానంలో శ్రమించాలని, దేశానికి ఆడటమే ముఖ్యమని వారికి తెలియాలి. నువ్వు బాగా ఆడితే చాలు మిగతావన్నీ నీ వెంటే వస్తాయి అని సచిన్ నాతో ఎప్పుడూ చెబుతూ ఉండేవారు’ అని యువీ చెప్పాడు. ‘టెస్టు’లపై నేటితరం అనాసక్తి... ఇటీవల జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి వెళ్లినప్పుడు కొందరు యువ ఆటగాళ్లను పరిశీలించానని, వారు టెస్టులు ఆడాలని ఏమాత్రం కోరుకోవడం లేదనే విషయం తనకు అర్థమైందని యువరాజ్ అన్నాడు. తమ రాష్ట్రం తరఫున రంజీల్లో కూడా ఆడాలని భావించడం లేదని, ఐపీఎల్ ఉంటే చాలనుకుంటున్నారని అతను పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ తప్పనిసరిగా ఆడాలని సూచించిన యువరాజ్... వివిధ పిచ్‌లపై ఆడి రాటుదేలితే భారత్ తరఫున కూడా బాగా ఆడగలరని అభిప్రాయ పడ్డాడు. యువీతో సంభాషించే క్రమంలో రోహిత్ శర్మ కూడా ... తన పరిధిలో జూనియర్లతో మాట్లాడుతుంటానని, వారికి సరైన దిశ చూపించేందుకు ప్రయత్నిస్తుంటానని వివరించాడు. -
బీసీ హాస్టల్లో జూనియర్లపై సీనియర్ల దాడి
నిజామాబాద్ : తమ బట్టలు ఉతకాలంటూ సెకండియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులపై దాడి చేసిన సంఘటన నిజామాబాద్ బీసీ హాస్టల్లో చోటుచేసుకుంది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక నిజామాబాద్ 3వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సీనియర్ల వేధింపులు ఎక్కువై ఐదుగురు విద్యార్థులు కూడా హాస్టల్ వదిలి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. బీసీ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం వల్లనే సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. -
సీనియర్లు కొట్టడంతో విద్యార్థులు పలాయనం
గుడ్లవల్లేరు : మచిలీపట్నంలోని ఒక ప్రైవేట్ గురుకుల పాఠశాలలో సీనియర్లు కొట్టడంతో జూనియర్లు పారిపోయి గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గుడివాడకు చెందిన పెద్దిబోయిన బాలాజీ, మండవల్లికి చెందిన రేమల్లి విశాల్ మచిలీపట్నంలోని ఒక ప్రైవేట్ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. అస్తమానం 8వ తరగతికి చెందిన విద్యార్థులు వారిని కొడుతున్నారు. దీంతో బాలాజీ, విశాల్ అక్కడి నుంచి గురువారం పారిపోయారు. రోడ్డు వెంట వెళ్తే ఎవరైనా పట్టుకుంటారని చిలకలపూడి నుంచి రైల్వే ట్రాక్ వెంబడి నడిచి వచ్చారు. వడ్లమన్నాడు రైల్వేస్టేషన్లో ఈ విద్యార్థులను గుర్తించిన స్థానికులు వారిని గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఆ పిల్లల నుంచి సమాచారం రాబట్టిన ఎస్ఐ ఎ.ఉమామహేశ్వరరావు వారి తల్లిదండ్రులకు అప్పగించటంతో కథ సుఖాంతమైంది. -
కళాశాలలో స్నేహగీతం..
-
ర్యాగింగ్లు... రీడింగ్‌లు...
టీనేజీ ఏజ్‌లో కాలేజీలో అడుగు పెట్టింది మొదలు... ఎన్నో అనుభవాలు, అనుభూతులు. ర్యాగింగ్లు... రీడింగ్‌లు... కొత్త వారికి స్వాగత సందడులు. ఇప్పుడా సరదాలు దాటి విద్యా సంవత్సరం చివరాంకానికి చేరుకుంది. కళాశాలలు వీడ్కోలు పార్టీలకు సన్నద్ధమవుతున్నాయి. ఆరంభంలో జూనియర్లకు సీనియర్ల వెల్కమ్... ఆఖర్లో సీనియర్లకు జూనియర్ల ఫేర్వెల్. నాడు ఉత్సాహంగా మొదలైన జర్నీ... నేడు బరువెక్కిన హృదయంతో టాటా చెబుతుంది. ఈ మధుర క్షణాలను మెమరబుల్‌గా మార్చేందుకు కుర్రకారు ఎంతలా ప్రిపేర్ అవుతున్నారో తెలుసుకొనే ప్రయత్నమే ఈ వారం ‘క్యాంపస్ కబుర్లు’. ఇదే టాపిక్‌పై సికింద్రాబాద్ జాహ్నవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల విద్యార్థులను కదిలిస్తే... ఎన్నెన్నో సంగతులు తలపోశారు. అవి వారి మాటల్లోనే... నరేష్: ఈ నెలాఖర్లో సీనియర్స్‌కి ఫేర్వల్ డే ప్లాన్ చేస్తున్నాం. చాలా గ్రాండ్‌గా... లోకేష్: లాస్ట్ ఇయర్ మా ప్రిపరేషన్ డేస్ గుర్తొకొస్తున్నాయి. ఈసారి మేం ఫైనలియర్ స్టూడెంట్స్ కాబట్టి పార్టీ తీసుకుని వెళ్లిపోవడం తప్ప ఏం చెయ్యలేం. మౌనిక: వెళ్లిపోవడం అంటే కాలేజీలో నుంచే. తర్వాత కూడా సీనియర్స్ టచ్‌లో ఉంటారు. కనిపిస్తే పలకరించడంలాంటివి కాకుండా, కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ వేడుకలప్పుడు పిలుస్తుంటాం. వచ్చి మాతో ఎంజాయ్ చేస్తారు. నరేష్: నేను సెకండ్ ఇయర్. మా సీనియర్స్ చాలా మంచివాళ్లు. అందరూ: ఓ... వేసేశాడు బిస్కెట్! లోకేష్: లేదండి మేం నిజంగానే మంచివాళ్లం. రోహిత్: నిజం చెప్పాలంటే... సీనియర్స్ ఎప్పుడూ బుద్ధిమంతులే! ర్యాగింగ్ రోజులు దాదాపుగా పోయినట్టే. వీరవేంద్ర: ఉన్నా... మంచి ర్యాగింగే. మా కాలేజీ మొదటి రోజు ఫస్ట్ క్లాస్‌కి ఒక లెక్చర్ వచ్చి సీరియస్‌గా పాఠం చెప్పడం మొదలుపెట్టారు. ఇంతలో ఫైనలియర్ స్టూడెంట్స్ క్లాస్‌లో మమ్మల్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. పాఠం చెబుతున్నది లెక్చరర్కాదు. ఫైనలియర్ స్టూడెంట్. అదే పెద్ద ర్యాగింగ్. తన్మయ్ఆనంద్రెడ్డి: ఫ్రెషర్స్ చాలా హుషార్. ఎదురుపడితే.. ఏం బావా అంటున్నారు. శ్రవంత్: బావ ఒక్కటేనా మావా, మచ్చా, జప్ఫా, డప్ఫా... కొంచెం క్లోజ్ అయితే చాలు సెకండ్స్లో లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. చారి: ఓకే టాపిక్ డైవర్ట్ అవుతోంది.. వాటెబౌట్ ఫేర్వెల్? శ్రవంత్: నో కాంప్రమైజ్. చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటున్నాం. డ్యాన్సులు, గేమ్స్, కథలు, కవితలు... ఇంకా ఎన్నో! రోహిత్: ఫుడ్ బాగుండాలిరా... నరేష్: నా ఎస్టిమేషన్ రెండు లకారాల వరకూ అవుతుంది. సుస్మిత: ఆ బడ్జెట్లో ఒకమ్మాయి పెళ్లయిపోతుంది. శరత్: హలో... చికెన్‌కే సగం అయిపోయిందక్కడ. వీరవేంద్ర: ఇంతకీ వెన్యూ ఎక్కడ? రాజశ్రీ: ఇంకా టైమ్ ఉంది కదా! ఈ నెల చివరి వారం రోజులు దానికే సరిపోతుంది. సుస్మిత: ఇలాంటి సమయంలో ఒక్క ఫేర్వెలే కాదు ఫ్రెషర్స్ పార్టీ విషయాలను కూడా గుర్తుచేసుకోవాలి. మా జూనియర్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. కొత్తేమీ లేదు.. మాతో కలసి చక్కగా స్టెప్పులేసేశారు. భార్గవి: సెలబ్రేషన్స్ మాటకొస్తే మా కాలేజీలో ఏడాదికి పది ఉంటాయి. మొన్న ఆగస్టులో ట్రెడిషనల్డే జరుపుకున్నాం. అమ్మాయిలంతా లంగావోణీ, చీరల్లో వచ్చారు. అబ్బాయిలు ట్రెడిషన్వేర్ ధరించారు. నరేష్: మా జూనియర్ మహేశ్ చక్కగా పంచె కట్టుకు వచ్చాడు. సీనియర్స్ పైజామా కుర్తాలాంటివి వేసుకొచ్చాం. కిషన్‌కుమార్: బోనాలు, వినాయకచవితి, క్రిస్మస్, సంక్రాంతి... అన్ని పండగల్ని కాలేజీలో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటాం. కల్యాణి: పార్టీకి ఇంకా పదిరోజులు కూడా లేదు. ఒక పక్క ప్రాక్టికల్స్ దగ్గరపడుతున్నాయి. అయినా పార్టీ గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందే. నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. నావంతుగా మంచి డ్యాన్స్ షో! మౌనిక: ఆ రోజు అందరి టాలెంట్లు బయటొకొస్తాయన్నమాట... నరేష్: నేనేమనుకుంటున్నానంటే... సీనియర్స్‌కి వీడ్కోలు పలికే సందర్భం కాబట్టి వారికి ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్లేమైనా ఇవ్వాలి లోకేష్: లాస్టియర్.. మా సీనియర్స్‌కి మేం ఫొటో ఫ్రేమ్‌లు ఇచ్చాం. ఇప్పటికీ క్రికెట్ గ్రౌండ్లో కలుస్తుంటారు. వారిని చూడగానే సొంతవారిని చూసిన ఫీలింగ్. -
ఫ్రెషర్స్ డే వేడుకల్లో రగడ!
-
సీనియర్ల పైశాచికం.. జూనియర్లకు ప్రాణ సంకటం
- కళాశాలల్లో జడలు విప్పుతున్న ర్యాగింగ్ భూతం - ఫిర్యాదు అందితే సీనియర్లు జైలుకే.. వరంగల్‌క్రైం : కళాశాలలో కొత్తగా అడుగుపెట్టేవారికి అదొక కొత్తబంగారు లోకం. మెడికల్ .. ఇంజనీరింగ్.. డి గ్రీ.. పీజీ.. ఇలా కోర్సులేవైనా కావొచ్చు. క్లాస్మేట్స్ పరిచయూలు.. కలుపుగోలు మాటలు.. అంతా కలర్ఫుల్గా ఉంటుంది. కానీ జూనియర్లకు వచ్చిన సమస్యల్లా సీనియర్లతోనే. ఐసీ(ఇంటర్డక్షన్) క్లాస్‌తో మెుదలయ్యే వేధింపులు.. దాడుల వరకు వెళుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో జూనియర్లను సీనియర్ విద్యార్థులు పరిచయం చేసుకునే కార్యక్రమాన్ని ర్యాగింగ్ అనేవారు. కాలక్రమంలో దాని అర్థం మారి.. వేధించడంగా స్థిరపడిపోరుయింది. ఒక మనిషిని.. ఇంకొక మనిషి మానసికంగా, శారీరకంగా వేధిస్తూ పైశాచికానందం పొందే అమానవీయ సంస్కృతిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎంత కఠినమైన చట్టాలు చేసినా.. అది చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. తమ సీనియర్లు తమను ర్యాగింగ్ చేశారు కాబట్టి.. మేం కూడా అలాగే చేస్తామనే ధోరణిలో విద్యార్థులు ప్రవర్తిస్తున్నారు. ఈ ర్యాగింగ్ రక్కసి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు. ఇది వరకు ఇంజినీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులుండే కళాశాలలకే పరిమితమైన ర్యాగింగ్ విషసంస్కృతి కొన్నేళ్లుగా యూనివర్సిటీల్లోని సోషల్‌సెన్సైస్ విభాగాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాకతీయ విశ్వవిద్యాలయం హిస్టరీ విభాగంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన కారాగారమే.. ►తోటి విద్యార్థులను సూటిపోటి మాటలతో వేధించడం, తమ చేతల ద్వారా పీడించడం, కలవరపెట్టడం, ఉద్దేశపూర్వకంగా వారిని బాధించడం, కుల, మతాల పేరుతో దూషించడంలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఆరు నెలల జైలు లేదా రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండు శిక్షలు విధించే అవకాశముంది. ►తాము సీనియర్లమని, చెప్పిన విధంగా నడుచుకోవాలని జూనియర్లను భయపెట్టడం, బెదిరించడం, దౌర్జన్యం చేయడంలాంటి చర్యలకు పాల్పడితే ఏడాది జైలు శిక్ష లేదా రూ.రెండు వేల జరిమానా ఉంటుంది. ఒక్కోసారి రెండూ విధించవచ్చు. ►విద్యార్థికి అపకారం చేయడం, బలవంతంగా వస్తువులు లాక్కుని వాడుకోవడం, వారితో కావాల్సిన వస్తువులు తెప్పించుకోవడం తదితర చర్యలకు రెండే ళ్ల జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా, లేదా ఒక్కోసారి రెండు శిక్షలూ పడవచ్చు. ►విద్యార్థులను కిడ్నాప్ చేయడం, అనవసరంగా అపరాధం చేయడం, శృతిమించిన టార్చర్ పెడితే ఐదేళ్ల జైలు లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ►విద్యార్థి మృతికి ర్యాగింగ్ దారి తీసినా.. ఆత్మహత్యకు పురిగొల్పినా పదేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 వేల జరిమానా, లేదా రెండు శిక్షలు విధించవచ్చు. ఫిర్యాదు చేయండిలా.. ర్యాగింగ్ విష సంస్కృతిని నిర్మూలించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో విద్యా సంస్థల్లో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి 1997లో చట్టం తీసుకొచ్చింది. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన సీనియర్ అధ్యాపకులతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేయూలి. ర్యాగింగ్‌ను సాధారణ చర్యగా భావించకుండా దీనిపై వెంటనే పోలీసు శాఖకు సమాచారమివ్వాలి. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ సరిగా స్పందించని పక్షంలో బాధిత విద్యార్థులు పోలీసు శాఖకు, జిల్లా న్యాయసేవాధికార సంస్థకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ►కళాశాలల్లో ఏర్పాటు చేసే ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలను జిల్లాస్థాయిలో కలెక్టర్ పర్యవేక్షిస్తారు. ►ర్యాగింగ్ విషయంలో స్పందించని కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్‌కు ఉంది. ►ర్యాగింగ్‌కు పాల్పడితే విధించే శిక్షలు తెలిపే బోర్డులను ప్రతి కళాశాలలో అందరికి క నిపించే ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. ►ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులు భవిష్యత్‌లో చదువును కొనసాగించేందుకు అవకాశం ఉండదు. వారి పేర్లను ప్రభుత్వ విద్యాశాఖ రికార్డుల్లో నమోదు చేసి భవిష్యత్తులో ఏ విద్యాసంస్థల్లోనూ ప్రవేశం పొందేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటుంది. ►అప్పటికే ఉన్న విద్యార్హతలతో ప్రభుత్వ ఉద్యోగంతోపాటు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కోల్పోతారు. ►ఇలాంటివారికి ప్రభుత్వం పాస్‌పోర్టు జారీ చేయకుండా నిలిపివేస్తుంది. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెనుక ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థి అని స్టాంప్ వేస్తారు. ఫలితంగా దేశ, విదేశాల్లోనూ ఏ యూనివర్సిటీల్లో కూడా అడ్మిషన్ ఇవ్వరు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయూలి ర్యాగింగ్‌ను నివారించేందుకు విద్యాసంస్థల్లో ప్రచారం చేయాలి. అడ్మిషన్ల ప్రక్రియ ముగియగానే సదస్సులు ఏర్పాటుచేసి జూనియర్లకు మనోధైర్యం కల్పిస్తూ.. ర్యాగింగ్ కేసు నమోదైతే జరిగే నష్టాన్ని సీనియర్లకు వివరించాలి. ఫిర్యాదు చేయూల్సిన ఫోన్‌నంబర్లు జూనియర్లకు కనిపించేలా ప్రదర్శించాలి. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి. - చెలమల్ల వీరన్న, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు క్షణికానందం కోసమే ర్యాగింగ్ క్షణికానందం కోసమే ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. తమను తమ సీనియర్లు ర్యాగింగ్ చేశా రు కాబట్టి.. మేము అలాగే చేస్తామనే ధోరణితో ప్రవర్తించడం సరికాదు. ర్యాగింగ్‌కు భయపడి అడ్మిషన్ తీసుకున్నాక కళాశాలకు రాని విద్యార్థులు కూడా ఉన్నారు. సీనియర్లపై ఫిర్యాదు చేయడానికి కూడా వారు ధైర్యం చేయడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -తూము మనోహర్, ఎమ్మెస్సీ(మ్యాథ్స్) -
కుర్రాళ్లు కొట్టారు...
సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్, కుంబ్లే...భారత టెస్టు క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఒక తరం ఆటగాళ్లు. కానీ వీరెవ్వరూ ‘క్రికెట్ మక్కా’గా పేరొందిన లార్డ్స్ మైదానంలో విజయం రుచి చూడలేదు. కానీ రహానే, భువనేశ్వర్, జడేజాలాంటి ఈతరం కుర్రాళ్లు ఈ 200 ఏళ్ల చారిత్రక మైదానంలో తమ కోసం కొత్త చరిత్ర ‘లిఖించుకున్నారు’. లార్డ్స్‌లో ఆడిన తొలిసారే లార్డ్‌లా సత్తా చాటి భారత క్రికెట్ అభిమానులకు చాలా కాలం తర్వాత ఆనందాన్ని పంచారు. యువ ఆటగాళ్లంతా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన చోట... నేనున్నానంటూ వెన్నుతట్టిన సారథి ధోని అండగా నిలవగా క్రికెట్ పుట్టింట్లో టీమిండియాకు చిరస్మరణీయ విజయం దక్కింది. అందరూ కలిసి... లార్డ్స్ విజయంలో దాదాపు అందరు ఆటగాళ్లూ కీలక పాత్ర పోషించారు. తొలి రోజు పచ్చని వికెట్‌పై బంతి స్వింగ్ అవుతున్న చోట పుజారా పట్టుదల కనబర్చాడు. చేసింది 28 పరుగులే అయినా వందకు పైగా బంతులు ఎదుర్కొని ఇన్నింగ్స్ కుప్పకూలకుండా కాపాడాడు. మరో వైపు తొలి ఇన్నింగ్స్‌లో గట్టిగా నిలబడ్డ ఓపెనర్ విజయ్, రెండో ఇన్నింగ్స్‌లో స్ఫూర్తిదాయక బ్యాటింగ్ ప్రదర్శించాడు. 18 ఏళ్లనాడు ద్రవిడ్ తరహాలో ఇక్కడే త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నా ఎంతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. లార్డ్స్‌లో సెంచరీతో దిగ్గజాల సరసన రహానే చోటు దక్కించుకుంటే...ఇందుగలడందు లేడంటూ భువనేశ్వర్ కుమార్ అన్నింటా తానై సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేసిన భువీ, రెండో ఇన్నింగ్స్‌లో తన బ్యాటింగ్ పదును చూపించి కీలక అర్ధ సెంచరీ సాధించాడు. ఈ వరుసలో రవీంద్ర జడేజా పాత్ర మరింత ప్రత్యేకం. తొలి టెస్టు వివాదం వెంటాడుతుండగా ఈ మ్యాచ్‌లో ఆటపై ఏకాగ్రత చెదరనివ్వలేదు. రెండో ఇన్నింగ్స్‌లో అతని దూకుడైన బ్యాటింగే భారత్ అవకాశాలు మెరుగు పర్చిందని చెప్పవచ్చు. అన్నింటికి మించి కొత్త శత్రువు అండర్సన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో అవుట్ చేసిన జడేజా... రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడిని డెరైక్ట్ త్రోతో రనౌట్ చేసి మ్యాచ్‌ను గొప్ప జ్ఞాపకంగా మలచుకున్నాడు. - సాక్షి క్రీడావిభాగం ఎన్నాళ్లకెన్నాళ్లకు... 1124 రోజులు... భారత జట్టు విదేశీ గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గి గడిచిన కాలం. సరిగ్గా చెప్పాలంటే 2011 జూన్‌లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై భారత్ 63 పరుగుల తేడాతో నెగ్గింది. అంతే...ఆ తర్వాత బయటికి అడుగు పెట్టిన చోటల్లా పరాభవమే వెక్కిరించింది. ఇంగ్లండ్‌లో 0-4, ఆస్ట్రేలియాలో 0-4, దక్షిణాఫ్రికాలో 0-1, న్యూజిలాండ్‌లో 0-1...ఈ వరుస 15 టెస్టుల పాటు గెలుపన్నదే లేకుండా సాగింది. ఈ క్రమంలో కెప్టెన్‌గా ధోని వైఫల్యంపై అనేక విమర్శలు వచ్చాయి. జొహన్నెస్‌బర్గ్‌లో, ఆ తర్వాత వెల్లింగ్టన్లో విజయానికి చేరువగా వచ్చినా...ఫలితం మాత్రం దక్కలేదు. సీనియర్లు పోయారు, జూనియర్లు వచ్చారు...కానీ పరిస్థితి మాత్రం మారలేదు. ఇలాంటి స్థితిలో ధోని, కుర్రాళ్లను నమ్ముకొని ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాడు. ‘గత రెండు టూర్లలో విజయం వాకిట నిలిచాం. ఈ సారి అవకాశం వస్తే వదులుకోం’ అని చెప్పిన ధోని దానిని నిజం చేసి చూపించాడు. తొలి టెస్టులో భారత్ ఆధిక్యం కనబర్చినా...లార్డ్స్‌లో పూర్తిగా పట్టు నిలబెట్టుకుంది. ముఖ్యంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లను మార్చడంలో, వ్యూహాల్లో ధోని ప్రత్యేకత కనిపించింది. అది చివరకు ఫలితాన్నిచ్చింది. ఇప్పటికే ఇంగ్లండ్‌ను చావు దెబ్బ కొట్టిన టీమిండియా ఇకపై అదే జోరును కొనసాగించి సిరీస్‌ను కూడా గెలుచుకోవాల్సి ఉంది. -
విల్లా మేరిలో ఫేర్ వెల్ హంగామా!
-
సైబర్ క్రైమ్‌లోకి ‘జూనియర్లు’
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలు చేయడంలో తమకంటూ ‘ప్రత్యేక స్థానం’ సంపాదించుకున్న నైజీరియన్లకు ‘జూనియర్లు’గా వ్యవహరించిన వారు ప్రస్తుతం సొంత దందా ప్రారంభించారు. హ్యాకింగ్ చేసే అవసరం లేని క్రైమ్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. వీటిలో ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ‘+92’ ఆధారిత నేరాలు పెరుగుతున్నాయని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ పంథాలో మోసగాళ్లు విసిరిన వల్లో పడి రూ.1.5 లక్షలు పోగొట్టుకున్న పాతబస్తీకి చెందిన ఓ యువతి కేసును దర్యాప్తు చేస్తున్నారు. లోకల్స్ సాయంతో రెచ్చిపోయిన ‘బ్లాక్స్’... నైజీరియా తదితర దక్షిణాఫ్రికా దేశాల నుంచి విద్య, వ్యాపార, పర్యాటక వీసాలపై వచ్చిన నల్లజాతీయులు ఉత్తరాదిలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తిష్ట వేశారు. అక్కడ నుంచే దక్షిణాదికి చెందిన వారికి వల వేసి అందినకాడికి దండుకునే వారు. వెబ్‌సైట్స్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేయడంలో ప్రావీణ్యం కలిగిన వీరు టార్గెట్‌గా ఎంచుకున్న వ్యక్తిని సంప్రదించడానికి సిమ్‌కార్డులు, వారితో డబ్బు జమ చేయించడానికి బ్యాంక్ ఖాతాల కోసం స్థానికులపై ఆధారపడ్డారు. ఇలా నల్లజాతీయులతో జట్టు కట్టిన ‘జూనియర్లు’ ఇప్పుడు తమంతట తాముగా మోసాలు చేయడానికి సిద్ధమయ్యారు. పాకిస్థాన్ నుంచి సిమ్‌కార్డులు... ఐటీలో అంత ప్రావీణ్యం లేని ఈ ‘జూనియర్లు’ హ్యాకింగ్‌తో అవసరం లేని నేరాలకు తెగబడుతున్నారు. ఓ వర్గం వారిని తేలిగ్గా మోసం చేయడంతో పాటు నేరానికి సంబంధించిన ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు పాకిస్థాన్ సరిహద్దుల నుంచి ఇంటర్నేషనల్ రోమింగ్ సదుపాయం ఉన్న ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు సేకరిస్తున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కేంద్రంగా కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో బోగస్ వివరాలతో ఖాతాలను తెరిచి రంగంలోకి దిగుతున్నారు. ఆన్లైన్ డేటాబేస్ నుంచి సేకరించిన ఫోన్ నెంబర్లకు లాటరీ తగిలింది అంటూ సంక్షిప్త సందేశం ఇవ్వడంతో ‘పని’ ప్రారంభిస్తున్నారు. స్పందించిన వారితో ఫోనులో సంప్రదించి వివిధ రకాలైన ఫీజులు, కారణాలు చెప్తూ అందినకాడికి తమ బ్యాంకు ఖాతాల్లో వేయించుకుంటున్నారు. నగదు పడిన మరుక్షణే మొత్తం డ్రా చేస్తూ సిమ్‌కార్డుల్ని ధ్వంసం చేస్తున్నారు. రూ. 5 లక్షలకు ఆశపడి...లక్షన్నర పోగొట్టుకుని... పాతబస్తీకి చెందిన ఓ యువతికి ‘+923003339611’ నెంబర్ నుంచి సంక్షిప్త సందేశం వచ్చింది. ఆమెకు రూ.15 లక్షల లాటరీ తగిలిందని చెప్పిన మోసగాడు మరో మూడు నెంబర్లతోనూ సంప్రదింపులు జరిపాడు. నగదు నేరుగా పంపడం కుదరదని, బ్యాంకు ఖాతాలో వేయడానికి వివిధ ఖర్చులుంటాయని చెప్పాడు. ఇలా కొన్ని దశల్లో ఆమె నుంచి రూ.1.5 లక్షలు బ్యాంకు ఖాతాలో వేయించుకున్నాడు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన యువతి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు చేపట్టిన దర్యాప్తులో అనేక వివరాలు వెలుగులోకి వచ్చినా... నిందితుల్ని గుర్తించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ‘+92’తో ప్రారంభమయ్యే నెంబర్లు పాకిస్థాన్‌కు చెందినవి, వీటి నుంచి వచ్చే ఎస్సెమ్మెస్, కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని క్రైమ్స్ డీసీపీ జి.పాలరాజు హెచ్చరిస్తున్నారు.