సీనియర్లు కొట్టడంతో విద్యార్థులు పలాయనం | seniors beat.. students jump | Sakshi
Sakshi News home page

సీనియర్లు కొట్టడంతో విద్యార్థులు పలాయనం

Published Thu, Sep 22 2016 9:09 PM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM

సీనియర్లు కొట్టడంతో విద్యార్థులు పలాయనం - Sakshi

సీనియర్లు కొట్టడంతో విద్యార్థులు పలాయనం

 
గుడ్లవల్లేరు : 
మచిలీపట్నంలోని ఒక ప్రైవేట్‌ గురుకుల పాఠశాలలో సీనియర్లు కొట్టడంతో జూనియర్లు పారిపోయి గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గుడివాడకు చెందిన పెద్దిబోయిన బాలాజీ, మండవల్లికి చెందిన రేమల్లి విశాల్‌ మచిలీపట్నంలోని ఒక ప్రైవేట్‌ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. అస్తమానం 8వ తరగతికి చెందిన  విద్యార్థులు వారిని కొడుతున్నారు. దీంతో బాలాజీ, విశాల్‌ అక్కడి నుంచి గురువారం పారిపోయారు. రోడ్డు వెంట వెళ్తే ఎవరైనా పట్టుకుంటారని చిలకలపూడి నుంచి రైల్వే ట్రాక్‌ వెంబడి నడిచి వచ్చారు. వడ్లమన్నాడు రైల్వేస్టేషన్‌లో ఈ విద్యార్థులను గుర్తించిన స్థానికులు వారిని గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఆ పిల్లల నుంచి సమాచారం రాబట్టిన ఎస్‌ఐ ఎ.ఉమామహేశ్వరరావు వారి తల్లిదండ్రులకు అప్పగించటంతో కథ సుఖాంతమైంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement