చాంపియన్స్ ట్రోఫీపై జై షా స్పష్టీకరణ
డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా గెలుస్తామని ధీమా
బ్రిడ్జ్‌టౌన్: అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించినా... ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. టి20 ఫార్మాట్‌కు సంబంధించి భారత జట్టులో మార్పు మొదలైందన్న ఆయన... పాండ్యాను కెపె్టన్‌గా నియమించే విషయం సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. 2025లో చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్నాయి. ‘ముగ్గురు కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత టి20 జట్టులో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయి.
అయితే ప్రస్తుతం సీనియర్లతో కూడిన మన జట్టు ప్రదర్శన చూస్తే మా తర్వాతి లక్ష్యం చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా గెలవడమే. దాదాపు ఇదే జట్టు అక్కడా ఆడుతుంది. సీనియర్లంతా అందుబాటులో ఉంటారు. భారత జట్టు అన్ని ఐసీసీ టైటిల్స్ గెలవాలనే నేనూ కోరుకుంటా. మన దగ్గర ప్రతిభావంతులైన రిజర్వ్ ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అవసరమైతే ఒకేసారి మనం 3 జట్లను బరిలోకి దించగలం’ అని జై షా అభిప్రాయపడ్డారు. తాజా వరల్డ్ కప్‌లో కీలక ప్రదర్శన చేసిన పాండ్యాపై షా ప్రశంసలు కురిపించారు. ‘పాండ్యా ఫామ్ గురించి గతంలో ఎన్నో రకాల సందేహాలు వ్యక్తం చేశారు. కానీ సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచి ఎంపిక చేస్తే దానిని పాండ్యా నిలబెట్టుకున్నాడు. అయితే టి20 టీమ్‌కు పూర్తి స్థాయి కెపె్టన్‌గా నియమించే అధికా రం సెలక్టర్ల చేతుల్లోనే ఉంది’ అని షా చెప్పారు.
టీమిండియా మరింత ఆలస్యంగా...
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత టి20 జట్టు స్వదేశానికి రావడం మరింత ఆలస్యం కానుంది. బార్బడోస్ దేశాన్ని తాకిన పెను తుఫాన్‌తో ఆటగాళ్లు ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. తీవ్రత ఎక్కువగా ఉండే కేటగిరీ 4 హరికేన్ వల్ల రెండు రోజులుగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. ముఖ్యంగా స్థానిక ఎయిర్‌పోర్ట్‌ను పూర్తిగా మూసేశారు. దాంతో భారత జట్టు ప్రత్యేక విమానం ద్వారా అక్కడి నుంచి బయల్దేరే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. విద్యుత్, నీటి సరఫరా కూడా అస్తవ్యస్తంగా మారింది. ఎలాగైనా ఇక్కడి నుంచి ఆటగాళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ చార్టర్డ్ ఫ్లయిట్ కంపెనీలతో మాట్లాడే ప్రయత్నం చేశామని... అయితే ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు సాధ్యం కావడం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడే వరకు వేచి ఉండటం మినహా మరో మార్గం లేదన్ని జై షా... భారత్‌కు చేరుకున్న తర్వాతే ఆటగాళ్ల సన్మానం తదితర విషయాల గురించి ఆలోచిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment