వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్ ఫైనల్ తేదీ మరియు వేదికను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించింది. ఈ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11-15 మధ్యలో లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను (జూన్ 16) కూడా ప్రకటించారు నిర్వహకులు. లార్డ్స్‌లో మొట్టమొదటిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. తొలి ఎడిషన్ అయిన 2021లో సౌథాంప్టన్, రెండో ఎడిషన్ అయిన 2023లో ఓవర్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి.
ఇప్పటివరకు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఎడిషన్లలో టీమిండియా ఫైనల్స్‌కు చేరుకోగా.. తొలి ఎడిషన్‌లో న్యూజిలాండ్ చేతిలో, రెండో ఎడిషన్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ప్రస్తుతం భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా అతి సమీపంలో రెండో స్థానంలో ఉంది. అన్నీ ఊహించినట్లుగా జరిగితే ఈ ఎడిషన్ ఫైనల్లోనూ భారత్, ఆస్ట్రేలియా జట్లే తలపడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment