యూఎస్‌ఏ క్రికెట్‌ జట్టుకు బిగ్‌ షాక్‌ | ICC Suspends USA Cricket Membership Over Governance Failures | Sakshi
Sakshi News home page

యూఎస్‌ఏ క్రికెట్‌ జట్టుకు షాక్‌.. ఐసీసీ వేటు

Sep 24 2025 7:27 AM | Updated on Sep 24 2025 10:49 AM

ICC suspends USA Cricket membership

దుబాయ్‌: యూఎస్‌ఏ క్రికెట్‌ (USA Cricket) సభ్యత్వంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వేటు వేసింది. ఐసీసీ నిబంధనలను అమలు చేయడంలో యూఎస్‌ఏ క్రికెట్‌ బోర్డు విఫలం కావడంతో  సస్పెండ్‌ చేస్తూ ఐసీసీ (ICC) నిర్ణయం తీసుకుంది. కాగా, ఏడాది పాటు సమీక్షలు జరిపిన తర్వాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇక, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

అయితే, 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఎస్‌ఏ ఒలింపిక్‌, పారా ఒలింపిక్స్‌ కమిటీ గుర్తింపు పొందడానికి యూఎస్‌ఏ క్రికెట్‌ బోర్డు ప్రయత్నాలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వట్లేదని ఐసీసీ వెల్లడించింది. ఈ కారణంగానే అమెరికా క్రికెట్‌ సభ్యతాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ వైఖరి అమెరికాతోపాటు ప్రపంచ క్రీడల ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉందని మండిపడింది.

ఇది కూడా చదవండి: భారత్‌కు ఎదురుందా!

ఇదే సమయంలో, ఒలింపిక్స్‌, ఐసీసీ ఈవెంట్లలో అమెరికా జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే, సస్పెన్షన్ దురదృష్టకరమని పేర్కొంది. క్రికెట్‌ దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడటానికి ఇది అవసరమైన చర్య అని ఐసీసీ పేర్కొంది. అమెరికాలో ఆటగాళ్లను రక్షించడం, క్రీడను అభివృద్ధి చేయడం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement