breaking news
USA Cricket Team
-
యూఎస్ఏ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్
దుబాయ్: యూఎస్ఏ క్రికెట్ (USA Cricket) సభ్యత్వంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వేటు వేసింది. ఐసీసీ నిబంధనలను అమలు చేయడంలో యూఎస్ఏ క్రికెట్ బోర్డు విఫలం కావడంతో సస్పెండ్ చేస్తూ ఐసీసీ (ICC) నిర్ణయం తీసుకుంది. కాగా, ఏడాది పాటు సమీక్షలు జరిపిన తర్వాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇక, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.అయితే, 2028లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను భాగం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఎస్ఏ ఒలింపిక్, పారా ఒలింపిక్స్ కమిటీ గుర్తింపు పొందడానికి యూఎస్ఏ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వట్లేదని ఐసీసీ వెల్లడించింది. ఈ కారణంగానే అమెరికా క్రికెట్ సభ్యతాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ వైఖరి అమెరికాతోపాటు ప్రపంచ క్రీడల ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉందని మండిపడింది.ఇది కూడా చదవండి: భారత్కు ఎదురుందా!ఇదే సమయంలో, ఒలింపిక్స్, ఐసీసీ ఈవెంట్లలో అమెరికా జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే, సస్పెన్షన్ దురదృష్టకరమని పేర్కొంది. క్రికెట్ దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడటానికి ఇది అవసరమైన చర్య అని ఐసీసీ పేర్కొంది. అమెరికాలో ఆటగాళ్లను రక్షించడం, క్రీడను అభివృద్ధి చేయడం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.🚨 USA suspension Clarity 🚨 Despite the suspension, the USA men’s team remains eligible and will participate in the upcoming ICC T20 World Cup. The ICC clarified that the suspension affects governance, not team eligibilityUSA Cricket was suspended by the ICC due to serious… pic.twitter.com/3nKLk63kbf— Vipin Tiwari (@Vipintiwari952) September 23, 2025 -
సెంచరీతో చెలరేగిన సాయితేజా.. యూఏఈను చిత్తు చేసిన అమెరికా
అమెరికా జాతీయ క్రికెట్ జట్టుకు ఆడుతున్న తెలుగు సంతతి క్రికెటర్ ముక్కామల సాయితేజా రెడ్డి (99 బంతుల్లో 107; 15 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ప్లేయర్ మిలింద్ కుమార్ (110 బంతుల్లో 155 నాటౌట్; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా శతకంతో చెలరేగాడు. ఫలితంగా ఐసీసీ పురుషుల ప్రపంచకప్ లీగ్–2లో భాగంగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుతో జరిగిన మ్యాచ్లో అమెరికా 136 పరుగుల తేడాతో గెలిచింది. ఈ లీగ్లో భాగంగా ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన అమెరికా ఆరో విజయంతో 12 పాయింట్లు ఖాతా లో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో యూఏఈ 36.2 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ ఖాన్ (51; 7 ఫోర్లు, ఒక సిక్సర్), రాహుల్ చోప్రా (52; 7 ఫోర్లు, ఒక సిక్సర్), హమీద్ (43 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్, నోస్తుష్ చెరో మూడు వికెట్లు తీశారు.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ!