సెంచరీతో చెలరేగిన సాయితేజా.. యూఏఈను చిత్తు చేసిన అమెరికా | Saiteja Hits Ton in USAs comfortable win over Canada in the 5th game | Sakshi
Sakshi News home page

సెంచరీతో చెలరేగిన సాయితేజా.. యూఏఈను చిత్తు చేసిన అమెరికా

Published Wed, Sep 25 2024 2:04 PM | Last Updated on Wed, Sep 25 2024 3:09 PM

Saiteja Hits Ton in USAs comfortable win over Canada in the 5th game

అమెరికా జాతీయ క్రికెట్‌ జట్టుకు ఆడుతున్న తెలుగు సంతతి క్రికెటర్‌ ముక్కామల సాయితేజా రెడ్డి (99 బంతుల్లో 107; 15 ఫోర్లు, ఒక సిక్సర్‌) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ప్లేయర్‌ మిలింద్‌ కుమార్‌ (110 బంతుల్లో 155 నాటౌట్‌; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా శతకంతో చెలరేగాడు. 

ఫలితంగా ఐసీసీ పురుషుల ప్రపంచకప్‌ లీగ్‌–2లో భాగంగా మంగళవారం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా 136 పరుగుల తేడాతో గెలిచింది. ఈ లీగ్‌లో భాగంగా ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన అమెరికా ఆరో విజయంతో 12 పాయింట్లు ఖాతా లో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో యూఏఈ 36.2 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్‌ ఖాన్‌ (51; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌), రాహుల్‌ చోప్రా (52; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌), హమీద్‌ (43 బంతుల్లో 50 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలు చేశారు. అమెరికా బౌలర్లలో సౌరభ్‌ నేత్రావల్కర్, నోస్తుష్‌ చెరో మూడు వికెట్లు తీశారు.
చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్‌.. టీమిండియాలోకి ఇషాన్‌ ఎంట్రీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement