UAE cricketers
-
సెంచరీతో చెలరేగిన సాయితేజా.. యూఏఈను చిత్తు చేసిన అమెరికా
అమెరికా జాతీయ క్రికెట్ జట్టుకు ఆడుతున్న తెలుగు సంతతి క్రికెటర్ ముక్కామల సాయితేజా రెడ్డి (99 బంతుల్లో 107; 15 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ప్లేయర్ మిలింద్ కుమార్ (110 బంతుల్లో 155 నాటౌట్; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా శతకంతో చెలరేగాడు. ఫలితంగా ఐసీసీ పురుషుల ప్రపంచకప్ లీగ్–2లో భాగంగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా 136 పరుగుల తేడాతో గెలిచింది. ఈ లీగ్‌లో భాగంగా ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన అమెరికా ఆరో విజయంతో 12 పాయింట్లు ఖాతా లో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో యూఏఈ 36.2 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ ఖాన్ (51; 7 ఫోర్లు, ఒక సిక్సర్), రాహుల్ చోప్రా (52; 7 ఫోర్లు, ఒక సిక్సర్), హమీద్ (43 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్, నోస్తుష్ చెరో మూడు వికెట్లు తీశారు.చదవండి: Ind vs Ban: అతడికి రెస్ట్.. టీమిండియాలోకి ఇషాన్ ఎంట్రీ! -
కోహ్లితో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! 155 పరుగులతో విధ్వంసం?
ఐసీసీ వరల్డ్‌కప్ లీగ్-2 (2023-27)లో విండ్‌హోక్ వేదికగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో అమెరికా జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఎస్ఎ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యూఎస్ఎ బ్యాటర్లలో భారత సంతతికి చెందిన మిలింద్ కుమార్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మిలింద్ యూఏఈ బౌలర్లను ఊతికారేశాడు. 110 బంతులు ఎదుర్కొన్న కుమార్.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 155 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు భారత సంత ముక్కముల్లా సాయితేజ(107) సైతం సెంచరీతో మెరిశాడు. అయితే యూఏఈ బౌలర్లను ఊచకోత కోసిన మిలింద్ కుమార్ క్రికెట్ జర్నీపై ఓ లుక్కేద్దం.ఎవరీ మిలింద్ కుమార్?33 ఏళ్ల మిలింద్ కుమార్ 1991లో ఢిల్లీలో జన్మించాడు. అతడు ఫస్ట్ క్రికెట్లో ఢిల్లీ, సిక్కిం, త్రిపురలకు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో ఢిల్లీ తరపున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన మిలింద్.. ఆ తర్వాత సిక్కిం, త్రిపురలకు ఆడాడు. 2018-19 రంజీ ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఆ సీజన్లో సిక్కిం తరపున ఆడిన కుమార్ ఏకంగా 1331 పరుగులు చేశాడు. అదేవిధంగా ఐపీఎల్లో కూడా మిలింద్ భాగమయ్యాడు. 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), 2019లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరపున అతడు ఆడాడు.టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో డ్రెస్సింగ్ రూమ్‌ను మిలింద్ పంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒకట్రెండు మ్యాచ్‌ల్లో కూడా ఆడారు. అయితే 2021లో పూర్తిగా బీసీసీఐతో సంబంధాలు తెంచుకున్న యూఎస్ఎకు మకాం మార్చాడు. మిలింద్ ఏప్రిల్ 2024లో కెనడాపై అమెరికా తరపున అరంగేట్రం చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో కూడా యూఎస్ఎ జట్టులో సభ్యునిగా ఉన్నాడు.చదవండి: Ind vs Ban: అశ్విన్ ఇంకో నాలుగు వికెట్లు తీశాడంటే.. -
యూఏఈ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) హెడ్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు లాల్‌చంద్ రాజ్‌పుత్ నియమితుడయ్యాడు. ఈ పదవిలో రాజ్‌పుత్ మూడేళ్ల పాటు కొనసాగుతాడని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. రాజ్‌పుత్ నియామకానికి ముందు యూఏఈ తాత్కాలిక కోచ్‌గా పాక్ మాజీ ఆటగాడు ముదస్సర్ నాజర్ వ్యవహరించారు. భారత మాజీ ఆల్‌రౌండర్ రాబిన్ సింగ్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం నాజర్ కొన్ని రోజుల పాటు తాత్కాలిక కోచ్‌గా పని చేశాడు. 62 ఏళ్ల రాజ్‌పుత్‌కు గతంలో అంతర్జాతీయ స్థాయిలో కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. టీమిండియా 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచినప్పుడు ఇతనే భారత జట్టు కోచ్‌గా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌కు టెస్ట్ హోదా లభించడంలో రాజ్‌పుత్ కోచ్‌గా క్రీయాశీలకపాత్ర పోషించాడు. 2018-2022 వరకు అతను జింబాబ్వే హెడ్‌కోచ్‌గా పని చేశాడు. యూఏఈ కోచ్‌గా నియమితుడైన అనంతరం రాజ్‌పుత్ ఇలా అన్నాడు. ఇటీవలికాలంలో యూఏఈ బలమైన అసోసియేట్ దేశంగా ఎదిగింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో యూఏఈ ఆటగాళ్లు టెస్ట్ హోదా కలిగిన దేశాల ఆటగాళ్లతో పోటీపడుతున్నారు. ప్రస్తుత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. వారితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కాగా, లాల్‌చంద్ రాజ్‌పుత్ 1985-87 మధ్యలో భారత తరఫున 2 టెస్ట్‌లు, 4 వన్డేలు ఆడాడు. -
అఫ్గానిస్తాన్‌కు బిగ్ షాకిచ్చిన యూఏఈ.. సంచలన విజయం
2023 ఏడాదిని యూఏఈ క్రికెట్ జట్టు సంచలన విజయంతో ముగించింది. ఆదివారం షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 11 పరుగుల తేడాతో యూఏఈ విజయం సాధించింది. ఓవరాల్‌గా అఫ్గాన్‌పై యూఏఈకు ఇది మూడో విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ వసీం(53), ఆర్యన్ లాక్రా(63) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అఫ్గాన్ బౌలర్లలో ఒమర్జాయ్, క్వైస్ అహ్మద్ తలా రెండు వికట్లు పడగొట్టగా.. ఫరూఖీ, నబీ చెరో వికెట్ సాధించారు. అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో నబీ( 27 బంతుల్లో 47) పోరాడనప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. యూఏఈ బౌలర్లలో అలీ నసీర్, జవదుల్లా చెరో 4 వికెట్లతో సత్తాచాటారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో టీ20 జనవరి 3న షార్జా వేదికగా జరగనుంది. -
5 వికెట్లతో చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్.. యూఏఈపై ఘన విజయం
యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 19 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ విజయంలో కెప్టెన్ టిమ్ సౌథీ కీలక పాత్ర పోషించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది. బ్లాక్‌క్యాప్స్ బ్యాటర్లలో సీఫెర్ట్(55),మెక్కన్చీ(31) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ, హమీద్ తలా రెండు వికెట్లు సాధించగా.. జహూర్ ఖాన్, ఫరాజుద్దీన్ చెరో వికెట్ పడగొట్టారు. 5 వికెట్లతో చెలరేగిన సౌథీ.. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈను టిమ్ సౌథీ ఆదిలోనే దెబ్బతీశాడు. కెప్టెన్ మహ్మద్ వసీంను తొలి బంతికే ఔట్‌చేసి కష్టాల్లో నెట్టాడు. ఈ మ్యాచ్‌లో సౌథీ 5 వికెట్లతో చెలరేగాడు. కివీస్ కెప్టెన్ సంచలన బౌలింగ్ ధాటికి యూఏఈ 136 పరుగులకే ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ(60) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 దుబాయ్ వేదికగా శనివారం జరగనుంది. చదవండి: IND vs IRE: ఐర్లాండ్‌తో తొలి పోరు.. శుభారంభం లక్ష్యంగా -
చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు
ICC WC League Two UAE VS NEP: యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ అలీ ఖాన్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అసోసియేట్ దేశ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ టు 2019-23లో భాగంగా ఇవాళ (మార్చి 16) నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 41 బంతుల్లోనే శతక్కొట్టిన ఆసిఫ్.. ఆసోసియేట్ దేశాల క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 7వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగి 11 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన ఆసిఫ్ మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 101 పరుగులతో (240.48 స్ట్రయిక్‌రేట్) అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా చూసినా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలో ఆసిఫ్ ఖాన్ నాలుగో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇతని తర్వాత వేగవంతమైన సెంచరీ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు కోరె ఆండర్సన్ పేరిట ఉంది. ఆండర్సన్ 36 బంతుల్లో శతకం బాదాడు. ఆతర్వాత పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది (37 బంతుల్లో ), ఆసిఫ్ ఖాన్, మార్క్ బౌచర్ (44 బంతుల్లో), బ్రియాన్ లారా (45), జోస్ బట్లర్ (46), విరాట్ కోహ్లి (52) 3 నుంచి 8 స్థానాల్లో ఉన్నారు. పాక్‌లో పుట్టి యూఏఈ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న 33 ఏళ్ల ఆసిఫ్.. తన కెరీర్లో 16 వన్డేలు ఆడి సెంచరీ, 3 అర్ధసెంచరీల సాయంతో 439 పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఆసిఫ్ ఖాన్ (101 నాటౌట్) శతక్కొట్టుడు, అర్వింద్ (94), ముహమ్మద్ వసీం (63) బాధ్యతాయుత హాఫ్ సెంచరీల సాయంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లు దీపేంద్ర సింగ్ (8-2-19-2) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. రాజ్‌బన్సీ (10-0-27-1), సోమ్‌పాల్ కమీ (9-1-74-1), సందీప్ లామిచ్చెన్ (10-0-80-1) వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్ 29 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 172 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కుశాల్ భుర్టెల్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. భీమ్ షార్కీ (62 నాటౌట్), ఆరిఫ్ షేక్ (30 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. నేపాల్ ఈ మ్యాచ్ గెలవాలంటే 21 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. -
నమీబియాపై యూఏఈ విజయం.. నెదర్లాండ్స్ సెలబ్రేషన్స్ అదుర్స్
టీ20 ప్రపంచకప్-2022 తొలి రౌండ్(గ్రూప్-ఎ) పోటీలు ముగిశాయి. గ్రూప్-ఎ నుంచి నెదర్లాండ్స్, శ్రీలంక జట్లు సూపర్-12 అర్హత సాధించాయి. జీలాంగ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో నమీబియా పరాజయం పాలవ్వడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ కీలక మ్యాచ్‌లో నమీబియా ఓటమి చెందడంతో నెదర్లాండ్స్ సూపర్-12కు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ రెండు విజయాలతో ఈ ప్రధాన టోర్నీలో అడుగు పెట్టింది. ఒక వేళ యూఏఈపై నమీబియా విజయం సాధించింటే రన్‌రేట్ పరంగా సూపర్-12లో అడుగుపెట్టేది. ఇక ఇది ఇలా ఉండగా.. గురువారం ఉదయం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ఓటమి పాలైంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత నెదర్లాండ్స్ ఆటగాళ్లు తమ హోటల్ గదులకు వెళ్లకుండా తమ భవితవ్యం తేల్చే యూఏఈ-నమీబియా మ్యాచ్‌ను వీక్షించారు. కాగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో యూఏఈ విజయం సాధించగానే డచ్ ఆటగాళ్ళు సెలబ్రేషన్లో మునిగితేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గ్రూప్-బి నుంచి ఏ జట్లు సూపర్-12లో అడుగుపెడతాయో శుక్రవారం తేలిపోనుంది. గ్రూప్-బి స్కాట్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లన్నీ రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో గెలుపోటములతో రేసులో ఉన్నాయి. శుక్రవారం(ఆక్టోబర్21) ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్‌తో ఐర్లాండ్... స్కాట్లాండ్తో జింబాబ్వే తలపడతాయి. గెలిస్తే చాలు... ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా గెలిచిన రెండు జట్లు ‘సూపర్–12’ దశకు అర్హత సాధిస్తాయి. Celebration by the Dutch cricket team, having just qualified for the follow-up by the narrow defeat of Namibia by UAE. Yet another nail biting experience. #ICCT20WC2022 #ICCT20WC @T20Worldcup #Australia #CricketNL @KNCBcricket pic.twitter.com/pVNjMVYgUG — VRA Cricket Amsterdam (@VRA_Cricket_AMS) October 20, 2022 చదవండి: T20 WC 2022: 'అతడు ఒంటి చేత్తో భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందిస్తాడు' -
భారత సంతతి క్రికెటర్‌పై 14 ఏళ్ల నిషేధం
భారత సంతతికి చెందిన యూఏఈ క్రికెటర్ మెహర్ చాయ్కర్పై ఐసీసీ 14 ఏళ్ల నిషేధం విధించింది. ఫిక్సింగ్ ఆరోపణలతో పాటు అవినీతికి పాల్పడడం.. వీటితో పాటు ఐసీసీ నియమావళికి చెందిన ఏడు నిబంధనలు, కెనడా క్రికెట్ ఆంక్షలను ఉల్లఘించినందుకు గానూ మెహర్ చాయ్‌కర్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడకుండా నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ బుధవారం పేర్కొంది. విషయంలోకి వెళితే.. 2018లో జింబాబ్వే, యూఏఈల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌తో పాటు అదే ఏడాది కెనడాలో జరిగిన గ్లోబల్ టి20 టోర్నీల్లో మెహర్ చాయ్‌కర్ బుకీలను సంప్రదించి ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ మెహర్ చాయ్కర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టింది. తమ విచారణలో మెహర్ చాయ్‌కర్ ఫిక్సింగ్‌కు పాల్పడింది నిజమేనని.. దీంతో పాటు క్రికెట్లో పలు నిబంధనలను గాలికొదిలేసినట్లు మా దృష్టికి వచ్చిందని యాంటీ ట్రిబ్యునల్ తెలిపింది. మెహర్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో అతనిపై 14 సంవత్సరాలు నిషేధం విధించినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఐసిసి జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ మాట్లాడుతూ.. "2018లో అజ్మాన్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో మెమర్ చాయ్‌కర్ తొలిసారి అవినీతికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బుకీలతో సంప్రదింపులు జరిపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడడం వంటివి చేశాడు. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకొని అతనిపై 14 సంవత్సరాల నిషేధం విధించాం. క్రికెట్‌ను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించే ఆటగాళ్ల పట్ల కనికరం చూపించం. అవినీతికి పాల్పడేవారిపై ఇలాంటి కఠిన చర్యలే తీసుకుంటాం'' అని హెచ్చరించాడు. మెమర్ చాయకర్ ఉల్లఘించిన క్రికెట్ నిబంధనలు ఇవే.. ►ఆర్టికల్ 2.1.1 ప్రకారం ఏ విధంగానైనా కుట్రకు పాల్పడడం లేదా తప్పుగా ప్రభావితం చేయడం.. ఫిక్సింగ్‌కు పాల్పడడం ద్వారా ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా తక్కువ ప్రదర్శన చేయడం ►ఆర్టికల్ 2.1.4 ప్రకారం.. ఒక ఆటగాడిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అభ్యర్థించడం, ప్రేరేపించడం, ప్రలోభపెట్టడం, సూచించడం, ఒప్పించడం ►ఆర్టికల్ 2.4.6 ప్రకారం విచారణకు సహకరించకుండా సమాధానాలు దాటవేయడం, తప్పును కప్పిపుచ్చుకోవడం ►ఆర్టికల్ 2.4.7 – ఏదైనా డాక్యుమెంటేషన్‌ను దాచిపెట్టడం, తారుమారు చేయడం లేదా నాశనం చేయడం.. దర్యాప్తును అడ్డుకోవడం లేదా ఆలస్యం చేయడం అయితే యూఏఈ క్రికెట్లో ఆటగాళ్లపై నిషేధం కొత్త కాదు. ఇప్పటికే నలుగురు యూఏఈ క్రికెటర్లు ఐసీసీ బ్యాన్‌ను ఎదుర్కొంటున్నారు. తొలిసారి మార్చి 2021లో యూఏఈ మాజీ కెప్టెన్ మహ్మద్ నవీన్‌తో పాటు బ్యాటర్ షైమన్ అన్వర్‌లపై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం ఉంది. ఆ తర్వాతి నెలలో మరో ఆటగాడు ఖదీర్ అహ్మద్‌పై ఐదు సంవత్సరాల నిషేధం.. గతేడాది సెప్టెంబర్‌లో ఐసీసీ నిబంధనలు ఉల్లఘించినందుకుగానూ యూఏఈ వికెట్ కీపర్ గులామ్ షబ్బీర్‌పై నాలుగేళ్ల నిషేధం పడింది. తాజాగా వీరి సరసన భారత సంతతికి చెందిన మెహర్ చాయ్‌కర్ వీరితో చేరాడు. చదవండి: ఫిట్నెస్ టెస్టులో క్లియరెన్స్.. ఆస్ట్రేలియాకు షమీ అంపైర్‌ను బూతులు తిట్టిన ఆరోన్ ఫించ్.. వీడియో వైరల్ -
హాఫ్ సెంచరీతో చెలరేగిన కింగ్.. యూఏఈపై విండీస్ విజయం
టీ20 ప్రపంచకప్-2022 తొలి వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విండీస్ గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్(45 బంతుల్లో 64), కెప్టెన్ పూరన్(31 బంతుల్లో 46) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్ధిక్ 5 వికెట్లతో చెలరేగగా.. జహూర్ ఖాన్ రెండు, దౌడ్, ఫరీద్ తలా వికెట్ సాధించారు. ఇక 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింద. యూఏఈ స్టార్ బ్యాటర్ మహ్మద్ వసీం(69 నటౌట్) అఖరి వరకు పోరాడనప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. విండీస్ బౌలర్లలో రేమాన్ రీఫర్ మూడు వికెట్లు, స్మిత్, మెక్కాయ్ ఒక్క వికెట్ సాధించారు. కాగా రెండు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన విండీస్ జట్టు.. నేరుగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ఆర్హత సాధించలేకపోయింది. ఈ మెగా ఈవెంట్లో వెస్టిండీస్ తొలుత క్వాలిఫియర్ మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: T20 World Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. నెట్స్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి -
జట్టును ప్రకటించిన యూఏఈ.. స్టార్ ఆటగాడికి నో ఛాన్స్!
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ జట్టును ప్రకటించింది. కాగా యూఏఈ క్రికెట్ బోర్డు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో సీనియర్ ఆటగాడు రోహన్ ముస్తఫాకు చోటు దక్కలేదు. ఇక ఈ మెగా ఈవెంట్లో యూఏఈ జట్టుకు సీపీ రిజ్వాన్ సారధ్యం వహించనున్నాడు. అదే విధంగా యువ పేసర్ అయాన్ ఖాన్‌కు కూడా టీ20ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. ఇక ఈ ఐసీసీ ఈమెగా టోర్నీలో యూఏఈ తొలుత శ్రీలంక, నెదర్లాండ్స్, నమిబీయా వంటి జట్టులతో క్వాలిఫియర్ మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 ప్రపంచ కప్‌కు జట్టు: సీపీ రిజ్వాన్ (కెప్టెన్), వృత్త్యా అరవింద్ (వైస్ కెప్టెన్), చిరాగ్ సూరి, ముహమ్మద్ వసీం, బాసిల్ హమీద్, ఆర్యన్ లక్రా, జవార్ ఫరీద్, కాషిఫ్ దౌద్, కార్తీక్ మెయ్యప్పన్, అహ్మద్ రజా, జహూర్ ఖాన్, జునైద్ సిద్దిక్, సబీర్ అలీ , అలీషన్ షరాఫు, అయాన్ ఖాన్. చదవండి: Mohammed Shami: షమీకే ఎందుకిలా? మొన్నటిదాకా బీసీసీఐ.. ఇప్పుడేమో -
ఆసియా కప్‌కు అర్హత సాధించిన హాంకాంగ్.. భారత్, పాక్‌తో ఢీ!
ఆసియా కప్-2022 కు హాంకాంగ్ ఆరో జట్టుగా అర్హత సాధించింది. బుధవారం ఒమన్ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన అఖరి మ్యాచ్‌లో విజయం సాధించిన హాంకాంగ్ ఆసియా కప్‌లో అడుగు పెట్టింది. హాంకాంగ్ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన హాంకాంగ్.. అన్నింటిలోనూ విజయం సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. తద్వారా ఈ మెగా ఈవెంట్ గ్రూప్-ఎలో భారత్, పాకిస్తాన్ జట్లతో హాంకాంగ్ చేరింది. హాంకాంగ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న దుబాయ్ వేదికగా టీమిండియాతో తలపడనుంది. కాగా ఆసియాకప్-టీ20 ఫార్మాట్లో పాల్గొనడం ఇదే తొలి సారి. ఇక ఈ మెగా టోర్నీ వన్డే ఫార్మాట్లో ఇప్పటి వరకు మూడు సార్లు భాగమైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 147 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో సీపీ రిజ్వాన్(49), ఫరీద్ (41) పరుగులతో రాణించారు. హాంకాంగ్ బౌలర్లలో ఇషాన్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా..శుక్ల మూడు, ఆజీజ్ ఖాన్ రెండు వికెట్లు తీశారు. ఇక 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. హాంకాంగ్ బ్యాటర్లో యాసిమ్ ముర్తాజా 58 పరుగులతో టాప్ స్కో్రర్గా నిలవగా.. నిజాకత్ ఖాన్ (39),బాబర్ హయత్(38) పరుగులతో రాణించారు. ఇక ఆసియాకప్-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికాగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చదవండి: Asia Cup 2022: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 8 పరుగులకే ఆలౌట్..!
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును అండర్-19 నేపాల్ మహిళల జట్టు నమోదు చేసింది. శనివారం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో నేపాల్ మహిళల జట్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నేపాల్ కేవలం ఎనిమిది పరుగులకే ఆలౌటైంది. తద్వారా క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్‌కే ఆలౌటైన జట్టుగా నేపాల్ నిలిచింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. నేపాల్ తరఫున స్నేహ మహారా 3 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక యుఎఈ బౌలర్లలో నాలుగు ఓవర్లలో 2 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఇక 9 పరుగుల లక్ష్యాన్ని 1.1 ఓవర్లలో యుఎఈ చేధించింది. కాగా జూన్ 3న (శుక్రవారం) తమ మునుపటి మ్యాచ్‌లో నేపాల్ ఖతార్‌పై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ ఖతార్‌ను 38 పరుగులకే ఆలౌట్ చేసింది. చదవండి: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. టీ10 చరిత్రలో అరుదైన ఫీట్.. తొలి ఆటగాడిగా..! -
ఇద్దరు యూఏఈ క్రికెటర్లకు గేల్ స్కాలర్షిప్
దుబాయ్: ఇద్దరు యూఏఈ టీనేజ్ క్రికెటర్లు క్రిస్‌గేల్ స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. 16 ఏళ్ల శోర్య చోప్రా, కార్తీక్ శేఖర్లు యూఏఈ జూనియర్, దేశవాళీ జట్ల తరఫున చక్కని ప్రతిభ కనబరచడంతో వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ స్కాలర్షిప్ను దక్కించుకున్నారు. ఈ స్కాలర్షిప్ కింద వారిద్దరికి రూ. 82 వేలు (1300 డాలర్లు) విలువ చేసే క్రికెట్ సామాగ్రి లభించింది. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో గేల్, మైకేల్ క్లార్క (ఆసీస్)లు వాడిన బ్యాట్లు కూడా అందజేశారు. విండీస్ మాజీ కెప్టెన్ జిమ్మీ ఆడమ్స శిక్షణలో చోప్రా, శేఖర్లు రాటుదేలిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న గేల్ ఇద్దర్ని అభినందించాడు. ‘ప్రాక్టీస్‌లో కష్టపడండి, ఆట కోసం చెమటోడ్చండి’ అని సూచించాడు.