యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 19 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ విజయంలో కెప్టెన్ టిమ్ సౌథీ కీలక పాత్ర పోషించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది.
బ్లాక్‌క్యాప్స్ బ్యాటర్లలో సీఫెర్ట్(55),మెక్కన్చీ(31) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ, హమీద్ తలా రెండు వికెట్లు సాధించగా.. జహూర్ ఖాన్, ఫరాజుద్దీన్ చెరో వికెట్ పడగొట్టారు.
5 వికెట్లతో చెలరేగిన సౌథీ..
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈను టిమ్ సౌథీ ఆదిలోనే దెబ్బతీశాడు. కెప్టెన్ మహ్మద్ వసీంను తొలి బంతికే ఔట్‌చేసి కష్టాల్లో నెట్టాడు. ఈ మ్యాచ్‌లో సౌథీ 5 వికెట్లతో చెలరేగాడు. కివీస్ కెప్టెన్ సంచలన బౌలింగ్ ధాటికి యూఏఈ 136 పరుగులకే ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ(60) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 దుబాయ్ వేదికగా శనివారం జరగనుంది.
చదవండి: IND vs IRE: ఐర్లాండ్‌తో తొలి పోరు.. శుభారంభం లక్ష్యంగా
Comments
Please login to add a commentAdd a comment