టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఐసీసీ నియమావళిని ఉల్లఘించినందుకు గానూ న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ మందలింపుకు గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో సౌథీ ఔటయ్యాక డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తూ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్‌ను పగులగొట్టాడు.
ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో గ్రౌండ్ పరికరాలను ధ్వంసం చేస్తే ఆర్టికల్ 2.2 ఉల్లంఘన కింద ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటారు. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను సౌథీ స్వల్ప మందలింపుకు గురి కావడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ పొందాడు. గడిచిన 24 నెలల్లో సౌథీకి ఇది మొదటి ఉల్లంఘణ కావడంతో ఐసీసీ మందలింపుతో వదిలి పెట్టింది. సౌథీ తన తప్పిదాన్ని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ముందు అంగీకరించాడు.
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో న్యూజిలాండ్ ప్రస్తానం ముగిసింది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడటంతో న్యూజిలాండ్ అధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగింది. న్యూజిలాండ్ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా..ఛేదనలో చేతులెత్తేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment