
టీ20 ప్రపంచకప్-2022 తొలి వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించింది. మెల్‌బోర్న్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విండీస్ గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్(45 బంతుల్లో 64), కెప్టెన్ పూరన్(31 బంతుల్లో 46) పరుగులతో రాణించారు.
యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్ధిక్ 5 వికెట్లతో చెలరేగగా.. జహూర్ ఖాన్ రెండు, దౌడ్, ఫరీద్ తలా వికెట్ సాధించారు. ఇక 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింద. యూఏఈ స్టార్ బ్యాటర్ మహ్మద్ వసీం(69 నటౌట్) అఖరి వరకు పోరాడనప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.
విండీస్ బౌలర్లలో రేమాన్ రీఫర్ మూడు వికెట్లు, స్మిత్, మెక్‌కాయ్ ఒక్క వికెట్ సాధించారు. కాగా రెండు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన విండీస్ జట్టు.. నేరుగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ఆర్హత సాధించలేకపోయింది. ఈ మెగా ఈవెంట్‌లో వెస్టిండీస్ తొలుత క్వాలిఫియర్ మ్యాచ్‌లు ఆడనుంది.
చదవండి: T20 World Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. నెట్స్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి