టీ20 వరల్డ్‌కప్-2022లో ఘోర వైఫల్యం చెంది.. పసికూనలైన ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్ల చేతుల్లో ఓడి, క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే ఇంటి బాట పట్టిన టూ టైమ్ టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టులో ప్రక్షాళన మొదలైంది. వరల్డ్‌కప్‌లోనే కాక కెప్టెన్‌గా ఎంపికైన నాటి నుంచి వ్యక్తిగతంగానూ ఘోరంగా విఫలమైన నికోలస్ పూరన్‌పై వేటుకు సర్వం సిద్ధమైంది. పరిమిత ఓవర్లలో విండీస్ కొత్త కెప్టెన్‌పై అధికారిక ప్రకటనే తరువాయి అని ఆ దేశ క్రికెట్ వర్గాలు ద్వారా తెలుస్తోంది. పూరన్ తదుపరి కెప్టెన్‌గా వైస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ ఖరారైందని విండీస్ క్రికెట్ బోర్డులోని కీలక వ్యక్తి వెల్లడించారు.
తాజాగా రోవ్‌మన్ పావెల్ సారధ్యంలోని జమైకా స్కార్పియన్స్ జట్టు 11 ఏళ్ల తర్వాత సూపర్-50 కప్ కైవసం చేసుకోవడంతో జాతీయ జట్టు పగ్గాలు కూడా అతనికే అప్పజెప్పాలని విండీస్ క్రికెట్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిస్తున్నాయి. శనివారం (నవంబర్ 19)జరిగిన సూపర్-50 కప్ ఫైనల్లో జమైకా స్కార్పియన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ట్రినిడాడ్ అండ్ టొబాగోకు షాకిచ్చి టైటిల్ ఎగురేసుకుపోయింది. జమైకా స్కార్పియన్స్ టైటిల్ సాధించడంలో కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ కీలకంగా వ్యవహరించాడు. కాగా, వరల్డ్‌కప్-2022లో విండస్ ఘోర వైఫల్యం తర్వాత.. జట్టు ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment