Rovman Powell
-
WI vs ENG 2nd T20: స్పిన్నర్ యార్కర్ వేస్తే ఎలా ఉంటుందో తెలుసా..?
క్రికెట్లో సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు యార్కర్లు వేయడం మనం చూస్తుంటాం. అదే ఓ స్పిన్నర్ యార్కర్ వేస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వీడియో చూడండి. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య తాజాగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అద్భుతమైన యార్కర్‌ను సంధించాడు. స్పిన్నర్ నుంచి అనూహ్యంగా యార్కర్ లెంగ్త్ బాల్ రావడంతో బ్యాటర్ చేసేదేమీ లేక నిశ్చేష్టుడిగా మిగిలిపోయాడు.AN OFF SPINNER WITH A YORKER. 🤯- Dan Mousley bamboozled Rovman Powell. 🔥 pic.twitter.com/UnFQHjOsmG— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2024పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ 40 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి జోరు మీదున్నాడు. ఈ దశలో ఇంగ్లండ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ డాన్ మౌస్లీ కళ్లు చెదిరే యార్కర్‌తో రోవ్‌మన్ పావెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మౌస్లీ సంధించిన యార్కర్ లెంగ్త్ బంతికి రోవ్‌మన్ దగ్గర సమాధానం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.కాగా, వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రోవ్‌మన్ పావెల్ (43) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. రొమారియో షెపర్డ్ (22), నికోలస్ పూరన్ (14), రోస్టన్ ఛేజ్ (13), మాథ్యూ ఫోర్డ్ (13 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మౌస్లీ, లివింగ్‌స్టోన్, సకీబ్ మహమూద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. జోస్ బట్లర్ (45 బంతుల్లో 83; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 14.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. బట్లర్‌కు జతగా విల్ జాక్స్ (29 బంతుల్లో 38), లివింగ్‌స్టోన్ (11 బంతుల్లో 23 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిల్ సాల్ట్ డకౌట్ కాగా.. జేకబ్ బేతెల్ 3 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో వెళ్లింది. -
SL vs WI 2nd T20I: విండీస్‌ను చిత్తు చేసిన శ్రీలంక
వెస్టిండీస్ చేతిలో తొలి టీ20లో ఎదురైన పరాభవానికి శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. దంబుల్లా వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నామమాత్రపు స్కోరుకే పరిమితమైనా.. బౌలర్ల విజృంభణ కారణంగా జయకేతనం ఎగురవేసింది. విండీస్‌ను 73 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.పరిమిత ఓవర్ల సిరీస్ కోసంకాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ జట్టు శ్రీలంక పర్యటనకు వచ్చింది. పొట్టి సిరీస్‌కు దంబుల్లా, వన్డే సిరీస్‌కు పల్లెకెలె ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తొలి టీ20లో విండీస్ గెలవగా.. మంగళవారం శ్రీలంక జయభేరి మోగించింది.నిసాంక హాఫ్ సెంచరీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్,ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పాతుమ్ నిసాంక (49 బంతుల్లో 54; 9 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో రాణించగా... కుశాల్ మెండిస్ (26; 2 ఫోర్లు, ఒక సిక్సర్), కుశాల్ పెరీరా (24; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు.బౌలర్లు పడగొట్టేశారుఇక విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 16.1 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రావ్మన్ పావెల్ (17 బంతుల్లో 20; ఒక ఫోర్, ఒక సిక్స్) టాప్ స్కోరర్. బ్రాండన్ కింగ్ (5), ఎవిన్ లూయిస్ (7), ఆండ్రూ ఫ్లెచర్ (4), రోస్టన్ చేజ్ (0) పూర్తిగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో టీ20 అరంగేట్ర ఆటగాడు దునిత్ వెల్లలాగె 3, మహీశ్ తీక్షణ, అసలంక, హసరంగ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లోని చివరిదైన మూడో టీ20 గురువారం జరుగనుంది.చదవండి: T20 WC: భారత్ అవుట్!.. ఇంత చెత్తగా ఆడతారా?: పాక్ మాజీ కెప్టెన్ -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడు దూరం
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు స్టార్ ఆటగాళ్లు ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోషఫ్, కైల్ మైర్స్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ జట్టుకు రోవ్మాన్ పావెల్ మరోసారి సారథ్యం వహించనున్నాడు. అతడి డిప్యూటీగా స్టార్ ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ వ్యవరించారు. ఇక ఈ జట్టులో వెటరన్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్, పేసర్ మాథ్యూ ఫోర్డ్, యంగ్ బ్యాటర్ అలిక్ అథనాజ్లకు చోటు దక్కింది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆగస్టు 23 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌లు కూడా ట్రినిడాడ్ వేదికగానే జరగనున్నాయి. కాగా ఇప్పటికే ప్రోటీస్ జట్టు విండీస్ టెస్టు సిరీస్‌ను 0-1తో సొంతం చేసుకుంది.దక్షిణాఫ్రికాతో టీ20లకు విండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, జాన్సన్ చార్లెస్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, ఫాబియన్ అలెన్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. -
చాలా బాధగా ఉంది.. అదే మా ఓటమికి కారణం: వెస్టిండీస్ కెప్టెన్
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆతిథ్య వెస్టిండీస్ ప్రయాణం ముగిసింది. సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన విండీస్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో(డక్ వర్త్ లూయిస్ పద్దతి) వెస్టిండీస్ పరాజయం పాలైంది.చివరి వరకు విండీస్ అద్బుతంగా పోరాడనప్పటకి విజయం మాత్రం ప్రోటీస్నే వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులకే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో ప్రోటీస్ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 123 పరుగులకు కుదించారు. అయితే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక దక్షిణాఫ్రికా వికెట్ల పతనం కొనసాగింది.చివరికి ఆల్‌రౌండర్ మార్కో జానెసన్ 21 పరుగులతో ఆజేయంగా నిలిచి దక్షిణాఫ్రికాను సెమీస్‌కు చేర్చాడు. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ రావెమన్ పావెల్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమిపాలైమని పావెల్ తెలిపాడు."ఈ మ్యాచ్‌లో ఓటమి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఆఖరి వరకు పోరాడినందుకు మా బాయ్స్‌కు క్రెడిట్ ఇవ్వాలనకుంటున్నాను. మేము ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాం. మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాము.సరైన భాగస్వామ్యాలు నెలకొల్పకపోవడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాం. కానీ 135 పరుగులను కాపాడుకోగలమని మా బౌలర్లు విశ్వసించారు. అందుకు తగ్గట్టు చివరివరకు తమ వంతు ప్రయత్నం చేశారు. మేము సెమీఫైనల్‌కు చేరుకోపోవచ్చు గానీ గత 12 నెలలగా మేము బాగా ఆడుతున్నాం. ఈ టోర్నీలోమాకు అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఇది నిజంగా మాకు చాలా సంతోషాన్నిచ్చింది. మాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికి ధన్యవాదాలని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పావెల్ పేర్కొన్నాడు. -
చెలరేగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్
టీ20 వరల్డ్‌కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.విండీస్ ఓపెనర్లు చార్లెస్, కింగ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ వికెట్‌కు వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 23 పరుగులు చేసిన కింగ్ గాయం కారణంగా రిటైర్డ్హట్గా వెనుదిరిగాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్.. చార్లెస్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చార్లెస్ ఔటయ్యాక కెప్టెన్ రావ్‌మెన్ పావెల్ సైతం తన బ్యాట్‌కు పని చెప్పాడు.విండీస్ బ్యాటర్లలో చార్లెస్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పూరన్(36), పావెల్(36), రుథర్‌ఫార్డ్(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అర్చర్, కుర్రాన్, మొయిన్ అలీ తలా వికెట్ సాధించారు.చదవండి: T20 WC: రోహిత్‌ను గుర్తు చేసిన కింగ్.. స్టేడియం బయటకు బంతి! వీడియో -
పూరన్ సిక్సర్ల సునామీ.. ఆసీస్‌కు ఝలక్ ఇచ్చిన విండీస్
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు ఊహించని ఝలక్ ఇచ్చింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. పూరన్ సిక్సర్ల సునామీనికోలస్ పూరన్ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. పూరన్ సిక్సర్ల సునామీ ధాటికి ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ మైదానం తడిసి ముద్దైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో పూరన్‌తో పాటు ప్రతి ఆటగాడు చెలరేగి ఆడారు. తలో చేయి వేశారు..హోప్ 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 14 పరుగులు.. జాన్సన్ ఛార్లెస్ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 40 పరుగులు.. రోవ్‌మన్ పావెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు.. హెట్‌మైర్ 13 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 18 పరుగులు.. రూథర్‌ఫోర్డ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. విండీస్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఆసీస్ బౌలర్లందరూ 10కిపైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. జంపా 2, టిమ్ డేవిడ్, ఆస్టన్ అగర్ తలో వికెట్ పడగొట్టారు.పోరాడిన ఆసీస్అనంతరం అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. గెలుపు కోసం చివరి దాకా పోటీపడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లోనూ ప్రతి ఒక్కరూ చెలరేగి ఆడారు. వార్నర్ 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 15 పరుగులు.. ఆస్టన్ అగర్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28.. మార్ష్ 4 బంతుల్లో బౌండరీ సాయంతో 4 పరుగులు.. ఇంగ్లిస్ 30 బంతుల్లో 5 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు.. టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు.. వేడ్ 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు.. నాథన్ ఇల్లిస్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39.. జంపా 16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 21.. హాజిల్‌వుడ్ 3 బంతుల్లో 3 పరుగులు చేశారు. మ్యాచ్ గెలిచేందుకు ఆసీస్‌కు ఈ మెరుపులు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, మోటీ చెరో 2 వికెట్లు.. అకీల్ హొసేన్, షమార్ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో కూడా ఆసీస్ తొలి వార్మప్ మ్యాచ్‌లోలా తొమ్మిది మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. ఆసీస్ రెగ్యులర్ జట్టు సభ్యులు అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం. -
జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్‌కప్-2024లో సన్నాహకాల్లో భాగంగా వెస్టిండీస్ తమ స్వదేశంలో ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలి దశ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఇరు జట్లు ఆడనునున్నాయి. టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత మరో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.మే 23న జమైకా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రోటీస్‌తో సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు ఐపీఎల్-2024లో భాగమైన విండీస్ ఆటగాళ్లు దూరమయ్యారు. కెప్టెన్ కెప్టెన్ రావ్‌మెన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, హెట్‌మైర్ వంటి కీలక ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు సన్నద్దమవుతున్నారు. ఈ సిరీస్‌లో విండీస్ కెప్టెన్‌గా బ్రాండన్ కింగ్ వ్యవహరించనున్నాడు.దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, అలిక్ అథానాజ్, జాన్సన్ చార్లెస్, ఆండ్రీ ఫ్లెచర్, మాథ్యూ ఫోర్డే, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్కాయ్, గుడాకేష్ మోటీ, రొమారియోడెన్ షెఫెర్డ్ వాల్ష్. -
T20 WC: బతిమిలాడుతున్నా వినడం లేదు.. ఇక వాళ్లదే భారం!
ఐపీఎల్ 2024.. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో చేసిన పరుగులు 276.. పడగొట్టిన వికెట్లు ఏడు(7/165).. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్ నమోదు చేసిన గణాంకాలివి. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 35 ఏళ్ల ఈ వెస్టిండీస్ ఆటగాడు కుర్రాళ్ల కళ్లు చెదిరే రీతిలో అద్బుతమైన షాట్లతో అలరించాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా ఇరగదీస్తున్నాడు విధ్వంసకర శతకంతో విరుచుకుపడి తన ఆటలో పస తగ్గలేదని మరోసారి నిరూపించాడు. కేకేఆర్‌కు దొరికిన విలువైన ఆస్తి అంటూ నీరాజనాలు అందుకుంటున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. 𝐍𝐚𝐫𝐢𝐧𝐞, naam toh suna hi hoga 😉 He scores his maiden 💯 in T20s at the iconic Eden Gardens 🏟️#KKRvRR #TATAIPL #IPLonJioCinema #SunilNarine | @KKRiders pic.twitter.com/TKFSFsc3Lp — JioCinema (@JioCinema) April 16, 2024 కేవలం పరుగుల తీయడానికే పరిమితం కాని ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే ఓ క్యాచ్ కూడా అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు క్యాచ్, వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 12 నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నా ఇక ఈ వెటరన్ ఆల్‌రౌండర్ ప్రతిభకు వెస్టిండీస్ కెప్టెన్, రాజస్తాన్ రాయల్స్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ కూడా ఫిదా అయ్యాడు. నరైన్‌ను ఎలాగైనా ఒప్పించి ఈసారి వరల్డ్‌కప్‌లో ఆడించే ప్రయత్నం చేస్తామంటున్నాడు. కేకేఆర్‌పై రాజస్తాన్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన పావెల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘గత 12 నెలలుగా నేను నరైన్ చెవిలో జోరీగలా మొత్తుకుంటూనే ఉన్నాను. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని అడుగుతున్నాను. కానీ అతడు ఏదో దాస్తున్నాడు. ఎవరితోనూ తన మనసులోని భావాలు పంచుకోవడం లేదు. ఈ విషయం గురించి ఇప్పటికే కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్‌లతో చర్చించాను.ప్రపంచకప్ జట్టు ఎంపిక కంటే ముందే వీళ్లు అతడి మనసులో ఏముందో కనిపెట్టగలరనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. విండీస్‌లో ఈసారి వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా మొదలుకానున్న టీ20 ప్రపంచకప్-2024లో సునిల్ నరైన్ ఆడించడమే తన లక్ష్యమని రోవ్‌మన్ పావెల్ ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో పావెల్ 13 బంతుల్లో 26 పరుగులు చేసి నరైన్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో 29 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నరైన్.. మరో 20 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 2023లో రిటైర్ అయిన నరైన్ 2012, 2014 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగిన సునిల్ నరైన్.. 2019 నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో.. 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. అందుకే వరుణ్ చేతికి బంతి!
రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్ ఆద్యంతం తమను భావోద్వేగాల డోలికలో ఊగిసలాడేలా చేసిందని.. కానీ తమకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ ఓటమిని అంగీకరించక తప్పదన్న శ్రేయస్.. టోర్నీ మధ్యలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఒక రకంగా మంచిదైందని పేర్కొన్నాడు. లోపాలు సరిచేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగే వీలుంటుందన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుతంగా రాణించిన సునిల్ నరైన్ గురించి ప్రస్తావిస్తూ.. కేకేఆర్‌కు దొరికిన అత్యంత విలువైన ఆస్తి నరైన్ అని ప్రశంసించాడు. అదే విధంగా ఆఖరి ఓవర్లో బంతిని కావాలనే వరుణ్ చక్రవర్తికి ఇచ్చానన్న శ్రేయస్ అయ్యర్.. ఫలితం రాబట్టలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. On Display: 𝗘𝗳𝗳𝗼𝗿𝘁𝗹𝗲𝘀𝘀 𝗛𝗶𝘁𝘁𝗶𝗻𝗴 😍 Sunil Narine smacking it with perfection👌👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvRR | @KKRiders pic.twitter.com/yXC3F5r1SY — IndianPremierLeague (@IPL) April 16, 2024 అందుకే వరుణ్ చేతికి బంతి జోస్ బట్లర్‌ను నిలువరించేందుకు తాము అనుసరించి వ్యూహాలు ఫలించలేదని పేర్కొన్నాడు. కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో ఓడిపోవడం బాధగా ఉందని శ్రేయస్ అయ్యర్ అసంతృప్తిని వెళ్లగక్కాడు. అయితే ఓటమినే తలచుకుంటూ కూర్చోలేమని.. తదుపరి మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతామని శ్రేయస్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా సొంతమైదానంలో కేకేఆర్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కోల్‌కతా రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఈ సీజన్లో కేకేఆర్‌కు ఇది రెండో ఓటమి. An Impactful Innings 😍 🔝 class effort from a 🔝 player ft. Jos Buttler Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z — IndianPremierLeague (@IPL) April 16, 2024 నరైన్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్ 56 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 109 పరుగులు సాధించాడు. అదే విధంగా.. రెండు వికెట్లు కూడా పడగొట్టాడు ఈ స్పిన్ ఆల్‌రౌండర్. అయితే, రాయల్స్ స్టార్ జోస్ బట్లర్ అజేయ శతకం కారణంగా నరైన్సుడిగాలి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. వాళ్లిద్దరి వల్లే ఓటమి 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 128 పరుగులకే పరిమితమైన వేళ బట్లర, రోవ్‌మన్ పావెల్‌తో కలిసి దూకుడుగా ఆడాడు. పావెల్ మెరుపు ఇన్నింగ్స్(13 బంతుల్లో 26)తో ఆకట్టుకోగా.. సెంచరీ వీరుడు బట్లర్(60 బంతుల్లో 107) ఆఖరి ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఆఖరి బంతికి సింగిల్ తీసి రాజస్తాన్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. అలా నమ్మశక్యంకాని రీతిలో కేకేఆర్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ పైవిధంగా స్పందించాడు. బట్లర్, రోవ్‌మన్ పావెల్ అద్భుతంగా ఆడారని వారిద్దరికి క్రెడిట్ ఇచ్చాడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్‌టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సైమ్ అయూబ్ విధ్వంసం.. రోవ్‌మన్ పావెల్ ఊచకోత
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ఇవాళ (ఫిబ్రవరి 25) లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఖలందర్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సైమ్ అయూబ్ (55 బంతుల్లో 88; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (20 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్ హరీస్ (5 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో పెషావర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్ అలీ (6) తక్కువ స్కోర్‌కు ఔట్ కాగా.. పాల్ వాల్టర్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-33-3) విజృంభించగా.. జహాన్దాద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన లాహోర్ ఇంతవరకు బోణీ కొట్టలేదు. ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లు ఆడిన పెషావర్ ఓ విజయం, రెండు పరాజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ముల్తాన్ సుల్తాన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
ILT20 2024: దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్
International League T20: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగం కానున్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ జట్టు దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అతడు నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్యాపిటల్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కెప్టెన్ మార్వెల్ అంటూ వార్నర్ ఆగమాన్ని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది. కాగా టీమిండియా స్టార్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఐపీఎల్-2023లో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. గతేడాది సీజన్లో మొత్తంగా 14 మ్యాచ్‌లలో కలిపి 516 పరుగులు సాధించిన వార్నర్.. ఆటగాడిగా సఫలమైనా.. కెప్టెన్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అతడి కెప్టెన్సీలో ఢిల్లీ పద్నాలుగింట కేవలం ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రోవ్‌మన్ పావెల్ స్థానంలో వార్నర్ అయినప్పటికీ వార్నర్ నాయకత్వ పటిమపై నమ్మకం ఉంచిన క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఈసారి ఐఎల్టీ20 లీగ్‌లో అతడిని తమ సారథిగా ఎంచుకుంది. ఇక దుబాయ్ క్యాపిటల్స్‌కు తొలి ఎడిషన్(2023)లో వెస్టిండీస్ స్టార్ రోవ్‌మన్ పావెల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పది మ్యాచ్‌లలో నాలుగు గెలిపించి ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. ప్రస్తుత సీజన్ కోసం 37 ఏళ్ల వార్నర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. కాగా జనవరి 13 నుంచి ఐఎల్టీ20 -2024 ఎడిషన్ ఆరంభం కానుంది. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను టైటిల్ విజేతగా నిలిపిన ఘనత కలిగిన వార్నర్‌కు టీ20లలో బ్యాటర్‌గానూ మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయ వన్డేలకూ రిటైర్మెంట్ పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు మొత్తంగా 356 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్.. 11695 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాను టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలపడంలో అతడిది కీలక పాత్ర. ఇదిలా ఉంటే.. తన కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ టెస్టు సిరీస్ ఆడుతున్న వార్నర్.. తాజాగా వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఆండ్రూ టై, దసున్ షనక, దుష్మంత చమీర, జో రూట్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, మొహమ్మద్ మొహ్సిన్, నువాన్ తుషార, రహ్మనుల్లా గుర్బాజ్, రజా ఆకిఫ్, రోవ్‌మన్ పావెల్, రోలోఫ్ వాన్‌డెర్ మెర్వే, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్, సికిందర్ రజా. చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా? View this post on Instagram A post shared by Dubai Capitals (@dubaicapitals) -
ఇంగ్లండ్ వెన్ను విరిచిన మోటీ.. సిరీస్ విండీస్‌దే..!
ట్రినిడాడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది, 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. గుడకేశ్ మోటీ (4-0-24-3), ఆండ్రీ రసెల్ (4-0-25-2), అకీల్ హొసేన్ (4-0-20-2),హోల్డర్ (3.3-0-24-2) ధాటికి 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫిలిప్ సాల్ట్ (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లివింగ్‌స్టోన్ (28), మొయిన్ అలీ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. జాన్సన్ ఛార్లెస్ (27), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (30) సాయంతో షాయ్ హోప్ (43 నాటౌట్) విండీస్‌ను గెలిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే, ఆదిల్ రషీద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, సామ్ కర్రన్ తలో వికెట్ దక్కించుకున్నారు. 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ వెనువిరిచిన మోటీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన (వరుసగా రెండు సెంచరీలు) ఫిలిప్ సాల్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. కాగా, 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం కరీబియన్ దీవుల్లో పర్యటించిన ఇంగ్లండ్.. వరుసగా రెండు సిరీస్‌లను కోల్పోయింది. వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్.. టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ సిరీస్‌ను చేజార్చుకుంది. -
ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన విండీస్ కెప్టెన్.. ఎన్ని కోట్లంటే?
ఐపీఎల్-2024 మినీ వేలంలో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్‌కు జాక్‌పాట్ తగిలింది. పావెల్‌ను రూ.7.40 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగొలు చేసింది. ఈ వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరగా ఉన్న పావెల్ కోసం కోల్‌కత్ నైట్‌రైడర్స్ కూడా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఎంతైనా తగ్గేదేలే అని భావించిన రాజస్తాన్.. భారీ మొత్తానికి పావెల్‌ను దక్కించుకుంది. కాగా పావెల్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో అతడిని రూ.2.8 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు పావెల్‌ను విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన పావెల్‌పై కాసుల వర్షం కురిసింది. కాగా టీ20ల్లో పావెల్‌కు మంచి రికార్డు ఉంది. వరల్డ్‌క్రికెట్‌లో విధ్వంసకర ఆటగాడిగా పావెల్‌కు పేరొంది. ఇప్పటివరకు 66 మ్యాచ్‌లు ఆడిన పావెల్ 1202 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ పావెల్ అదరగొడుతున్నాడు. చదవండి: IPL 2024: ఐపీఎల్లో కొత్త రూల్.. ఇక బ్యాటర్లకు చుక్కలే!? -
రీఎంట్రీలో రసెల్ బ్యాటింగ్ విధ్వంసం.. విండీస్ చేతిలో ఇంగ్లండ్ చిత్తు
West Indies vs England, 1st T20I: వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ జాతీయ జట్టులో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బంతితో చెలరేగిన ఈ ఆల్‌రౌండర్.. అనంతరం లక్ష్య ఛేదనలో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి రీఎంట్రీ అదుర్స్ అనిపించాడు. కాగా మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. మూడు వికెట్లు పడగొట్టిన రసెల్ ఈ క్రమంలో వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి ఇంగ్లిష్ జట్టుకు షాకిచ్చిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌ను విజయంతో ఆరంభించి సత్తా చాటింది. బార్బడోస్ వేదికగా బుధవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ 20 బంతుల్లో 40, జోస్ బట్లర్ 31 బంతుల్లో 39 పరుగులతో శుభారంభం అందించగా.. మిగతా వాళ్లలో లియామ్ లివింగ్ స్టోన్(27) ఒక్కడే ఇరవై పరుగుల పైచిలుకు స్కోరు రాబట్టాడు. కరేబియన్ బౌలర్ల ధాటికి మిగిలిన ఇంగ్లిష్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో పేస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్, మరో ఫాస్ట్‌బౌలర్ అల్జారీ జోసెఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మిగిలిన వాళ్లలో పేసర్లు జేసన్ హోల్డర్ ఒకటి, రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు కూల్చారు. ఇక స్పిన్నర్ అకీల్ హొసేన్‌కు ఒక వికెట్ దక్కింది. Unstoppable Russell Mania! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/VjbBCJMMIV — FanCode (@FanCode) December 13, 2023 పావెల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్(22), కైలీ మేయర్స్(35) మంచి ఆరంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ షాయీ హోప్ 36 పరుగులతో రాణించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన నికోలస్ పూరన్ 13, షిమ్రన్ హెట్మెయిర్ ఒక్క పరుగుకే పరిమితమయ్యారు. అయితే, ఆరో నంబర్ బ్యాటర్, కెప్టెన్ రోవ్‌మన్ పావెల్, ఎనిమిదో స్థానంలో వచ్చిన ఆండ్రీ రసెల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. పావెల్ 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 206.67 స్ట్రైక్‌రేటుతో 31 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు. సునామీ ఇన్నింగ్స్‌తో రసెల్ విధ్వంసం మరోవైపు రసెల్ కూడా 14 బంతులు ఎదుర్కొని 207కు పైగా స్ట్రైక్‌రేటుతో 29 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కాగా రసెల్ దాదాపు రెండేళ్ల తర్వాత వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగడం ఇదే తొలిసారి. Russell roars back! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/zdlJBWJdWA — FanCode (@FanCode) December 13, 2023 ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో జోస్ బట్లర్ బృందానికి మరోసారి నిరాశే మిగిలింది. ఇరు జట్ల మధ్య గురువారం రెండో టీ20 జరుగనుంది. చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్ -
శివాలెత్తిన గప్తిల్.. 9 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదైంది. బార్బడోస్ రాయల్స్‌తో నిన్న (ఆగస్ట్ 31) జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 58 బంతుల్లో బౌండరీ, 9 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. గప్తిల్‌కు పోలార్డ్ (32 బంతుల్లో 46; ఫోర్, 4 సిక్సర్లు), మార్క్ దెయాల్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. Raise your bat Martin Guptill. What a knock from the kiwi sensation 🙌 #CPL23 #BRvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Betbarter @BetBarteronline pic.twitter.com/GdqWmEzPx5 — CPL T20 (@CPL) August 31, 2023 నైట్‌రైడర్స్‌లో గప్తిల్, పోలార్డ్‌తో పాటు నికోలస్ పూరన్ (6), ఆండ్రీ రసెల్ (5), డ్వేన్ బ్రావో (0) లాంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. గప్తిల్ ధాటికి బార్బడోస్ బౌలర్ ఓబెద్ మెక్కాయ్ బలయ్యాడు. అతను 4 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 47 పరుగులు సమర్పించుకున్నాడు. గప్తిల్ మరో బార్బడోస్ బౌలర్ రకీమ్ కార్న్‌వాల్‌ను కూడా ఆడుకున్నాడు. కార్న్‌వాల్ కేవలం 2 ఓవర్లు వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు. బార్బడోస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 2.. కైస్ అహ్మద్, వాన్ డర్ మెర్వ్ తలో వికెట్ దక్కించుకున్నారు. వకార్ దెబ్బకు కుప్పకూలిన బార్బడోస్.. నైట్‌రైడర్స్ నిర్ధేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బార్బడోస్.. వకార్ సలామ్ కైల్ (3.1-0-14-4), ఆండ్రీ రసెల్ (2-0-13-2), అకీల్ హొసేన్ (4-0-16-2), సునీల్ నరైన్ (2-0-11-1) దెబ్బకు 12.1 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. బార్బడోస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రకీమ్ కార్న్‌వాల్, కైల్ మేయర్స్ డకౌట్లు కాగా.. లారీ ఈవాన్స్ (5), అథనేజ్ (2), కెవిన్ విక్హమ్ (9), యంగ్ (3), వాన్ డర్ మెర్వ్ (3), ఓబెద్ మెక్ కాయ్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జేసన్ హోల్డర్ (14), రోవ్‌మన్ పావెల్ (10), కైస్ అహ్మద్ (10 నాటౌట్) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. -
నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్ వాళ్లకే! అతడు హీరో: విండీస్ కెప్టెన్
స్వదేశంలో టీమిండియాతో టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయిన వెస్టిండీస్.. టీ20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఫ్లోరిడా వేదికగా టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కరేబియన్ జట్టు సొంతం చేసుకుంది. 6 ఏళ్ల తర్వాత భారత్‌పై విండీస్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం కావడం గమానార్హం. విండీస్ చివరగా 2017లో టీమిండియాపై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక చారిత్రత్మక సిరీస్ విజయంపై మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ స్పందించాడు. "టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో ఏమి మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించడానికి చాలా కష్టపడ్డాం. మ్యాచ్‌కు ముందు రోజు సాయంత్రం మేము ఓ మీటింగ్ పెట్టుకున్నాం. కరేబియన్ ప్రజలు మన నుంచి గెలుపు ఆశిస్తున్నారని మా బాయ్స్‌కు చెప్పా. మేము విజయం సాధించడంలో కోచింగ్ స్టాప్‌ది కీలక పాత్ర. మేము వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందడంతో కాస్త నిరాశ చెందాము. కానీ మా కోచింగ్ స్టాప్ మాత్రం మాకు మద్దతుగా నిలిచారు. ఈ సిరీస్‌లో మా జట్టు నుంచి చాలా మంది ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనతో అకట్టుకున్నారు. జట్టులో ఎవరో ఒకరు రాణించినా కొన్ని సందర్భాల్లో మేలు జరుగుతుంది. ముఖ్యంగా నికోలస్ పూరన్ ఈ సిరీస్‌లో మాకు కీలక విజయాలు అందించాడు. అతడు మా జట్టులో ముఖ్యమైన ఆటగాడు. పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉన్న మా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలనకుంటున్నాను. అదే విధంగా మాకు సపోర్ట్‌గా నిలిచిన విండీస్ క్రికెట్‌కు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పావెల్ పేర్కొన్నాడు. చదవండి: #Hardik Pandya: ఇంత చెత్త కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్? Drought broken 👏 The West Indies claim T20I series bragging rights over India in Florida! More from #WIvIND 👇https://t.co/dvEJ9cwGIw — ICC (@ICC) August 14, 2023 -
IND VS WI 5th T20: టాస్ గెలిచిన టీమిండియా.. అదే జట్టుతో బరిలోకి..!
5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఫ్లోరిడా వేదికగా విండీస్‌తో ఇవాళ (ఆగస్ట్ 13) జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయి 0-2తో వెనుకపడిన భారత్.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచి 2-2తో సిరీస్‌లో సమంగా నిలిచింది. చివరిదైన ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టునే టీమిండియా యధాతథంగా కొనసాగించగా.. విండీస్ ఓ మార్పు చేసింది. ఒబెద్ మెక్కాయ్ స్థానంలో అల్జరీ జోసఫ్ బరిలోకి దిగాడు. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (సి), జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకీల్ హోసేన్, అల్జరీ జోసెఫ్ భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
విండీస్‌తో టీమిండియా కీలక పోరు.. వెస్టిండీస్ స్కోరు ఎంతంటే!
India tour of West Indies, 2023 - West Indies vs India, 4th T20I: టీమిండియాతో నాలుగో టీ20లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్‌కు 3, కుల్దీప్ యాదవ్‌కు రెండు, అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, ముకేశ్ కుమార్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. 19.2: అర్ష్‌దీప్ మరోసారి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హెట్‌మైర్ అవుట్. 61 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించిన హిట్టర్. విండీస్ స్కోరు 171/8 (19.3) ఏడో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ 15.3: ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన జేసన్ హోల్డర్. స్కోరు: 132-7 14.2: అక్షర్ పటేల్‌కు తొలి వికెట్ షెపర్డ్(9) రూపంలో వెస్టిండీస్ ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో షెపర్డ్ ఇచ్చిన క్యాచ్‌ను సంజూ ఒడిసిపట్టాడు. స్కోరు: 119/6 (14.3) ఐదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ 12.5: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ వెస్టిండీస్‌కు షాకిచ్చాడు. అర్ధ శతకం దిశగా వెళ్తున్న షాయీ హోప్[45(29)]ను పెవిలియన్‌కు పంపాడు. 109/5 (13.3) 12 ఓవర్లలో విండీస్ స్కోరు: 102/4 నిలకడగా ఆడుతున్న షాయీ హోప్(43), హెట్మెయిర్(22) 10 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 79/4 6.5: మళ్లీ దెబ్బేసిన కుల్దీప్ టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఏడో ఓవర్ మొదటి బంతికి పూరన్‌ను అవుట్ చేసిన ఈ స్టార్ స్పిన్నర్.. ఐదో బంతికి విండీస్ సారథి పావెల్(1)ను అవుట్ చేశాడు. స్కోరు: 57-4(7) 6.1: మూడో వికెట్ కోల్పోయిన విండీస్ కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్‌కు భారీ షాకిచ్చాడు. బిగ్ హిట్టర్ నికోలస్ పూరన్(1)ను పెవిలియన్‌కు పంపాడు. విండీస్ స్కోరు: 55/3 (6.1) 5.4: విండీస్‌ను దెబ్బకొట్టిన అర్ష్‌దీప్ బ్రాండన్ కింగ్[18(16)] రూపంలో రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్. 5 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 48-1 1.4: తొలి వికెట్ కోల్పోయిన విండీస్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో మేయర్స్ [17(7)] అవుట్. కింగ్, షాయీ హోప్ క్రీజులో ఉన్నారు. Arshdeep loves making these mini comebacks!#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/ksPeRQB4c2 — FanCode (@FanCode) August 12, 2023 టాస్ గెలిచిన వెస్టిండీస్ వెస్టిండీస్ మరో కీలక మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం నాటి నాలుగో టీ20కి అమెరికాలోని ఫ్లోరిడా వేదికైంది. రీజినల్ పార్క్ స్టేడియంలో హార్దిక్ సేన.. రోవ్‌మన్ పావెల్ బృందంతో తలపడేందుకు సిద్ధమైంది. టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించగా.. వెస్టిండీస్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. కాగా ఫ్లోరిడా పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 13 టి20 మ్యాచ్‌లలో 11 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య విండీస్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగో టీ20లో విజయం సాధిస్తేనే భారత జట్టు సిరీస్ సాధించే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న టీమిండియా.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. తుది జట్లు టీమిండియా: యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్( వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్. వెస్టిండీస్ బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రన్ హెట్‌మైర్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హోసిన్, ఒబెడ్ మెకాయ్. చదవండి: టీమిండియాతో మ్యాచ్.. మనకు ఎవరూ సపోర్ట్ చేయరు: షాదాబ్ ఖాన్ -
IND VS WI 3rd T20: టాస్ ఓడిన టీమిండియా, యశస్వి జైస్వాల్ అరంగేట్రం
5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గయానా వేదికగా విండీస్‌తో ఇవాళ (ఆగస్ట్ 8) జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడి 0-2తో వెనుకపడిన భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని భావిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ఇషాన్ కిషన్ స్థానంలో అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ జట్టులోకి రాగా.. రవి బిష్ణోయ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులో చేరాడు. మరోవైపు విండీస్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జేసన్ హోల్డర్ స్థానంలో రోస్టన్ ఛేజ్ బరిలోకి దిగనున్నాడు. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (సి), రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్ భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
విండీస్‌తో రెండో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా, ఒక్క మార్పు
5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గయానా వేదికగా విండీస్‌తో ఇవాళ (ఆగస్ట్ 6) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో తొలి టీ20 ఓడి 0-1తో వెనుకపడిన భారత్.. ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20 ఆడిన కుల్దీప్ యాదవ్ స్థానంలో రవి బిష్ణోయ్ బరిలోకి దిగనున్నాడు. మరోవైపు విండీస్ తొలి మ్యాచ్ ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (సి), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్ భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
'చాలా సంతోషంగా ఉంది.. టీమిండియాను చూశాక తప్పుచేశా అనుకున్నా'
టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ విజయంతో ఆరంభించింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో కరేబియన్లు అదరగొట్టారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ స్పందించాడు. తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందంటూ పావెల్ చెప్పుకొచ్చాడు. మేము ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు చాలా కష్టపడ్డాం. ఏదైమనప్పటికీ విజయంతో సిరీస్‌ను ఆరంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత భారత బౌలింగ్ ఎటాక్ చూశాక, మేము అదనంగా ఒక స్పిన్నర్‌ను తీసుకుని వుంటే బాగుండేది అన్పించింది. కానీ మా ఫాస్ట్ బౌలర్లు మరో స్పిన్నర్ అవసరం లేకుండా చేశారు. మా విజయంలో బౌలర్లదే కీలక పాత్ర. ట్రినిడాడ్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో మాకు మంచి స్కోర్ వచ్చింది. కానీ మిడిల్ ఓవర్లలో పెద్దగా పరుగులు సాధించలేకపోయాము. మిడిల్ఓవర్లలో విండీస్ బ్యాటర్లు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారో అన్నదానిపై సిరీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక హోల్డర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో పావెల్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత్-విండీస్ మధ్య రెండో టీ20 ఆగస్టు 6న గయానా వేదికగా జరగనుంది. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టీ20.. కన్నీరు పెట్టుకున్న హార్దిక్! వీడియో వైరల్ -
ఆదుకున్న పూరన్, పావెల్.. టీమిండియా టార్గెట్ 150
టీమిండియాతో జరుగుతున్న తొలి టి20లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రోవ్‌మెన్ పావెల్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నికోలస్ పూరన్ 34 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో యజ్వేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లు చెరొక వికెట్ తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్‌ను యజువేంద్ర చాహల్ దెబ్బకొట్టాడు. ఆదిలోనే కీలకమైన కైల్ మేయర్స్(1) బ్రాండన్ కింగ్(28)లను వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన జాన్సన్ చార్లెస్(3)ను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. కష్టాల్లో పడిన విండీస్‌ను కెప్టెన్ పావెల్, పూరన్ ఆదుకున్నారు. వీళ్లు వికెట్‌కు పరుగులు జోడించారు. దాంతో, ఆతిథ్య జట్టు పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. చదవండి: Tilak Varma: స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన తిలక్ వర్మ -
టాస్ గెలిచిన వెస్టిండీస్.. జైశ్వాల్‌కు దక్కని చోటు
వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను ముగించుకున్న టీమిండియా ఇక టి20 సిరీస్‌పై దృష్టి పెట్టింది. రోహిత్, కోహ్లి సహా సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు విండీస్‌తో తలపడనుంది. గురువారం ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో విండీస్, భారత్‌ల మధ్య తొలి టి20 మొదలైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్టు సిరీస్‌లో సెంచరీతో రాణించిన యశస్వి జైశ్వాల్‌కు తొలి టి20లో చోటు దక్కలేదు. దీంతో తొలి టి20లో ఓపెనర్లుగా గిల్, ఇషాన్ కిషన్ రానున్నారు. వన్‌డౌన్‌లో సంజూ శాంసన్, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు రానున్నారు. చివర్లో హార్దిక్ పాండ్యా , అక్షర్ పటేల్‌లు రానున్నారు. ఇక బౌలింగ్‌లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. స్పిన్నర్లుగా చహల్, కుల్దీప్, అక్షర్ పటేల్‌లు ఉండగా.. ముకేశ్ కుమార్ టి20ల్లో అరంగేట్రం చేయనుండగా.. అర్ష్‌దీప్ సింగ్ ప్రధాన పేసర్‌గా ఉన్నాడు. ఇక నికోలస్ పూరన్, అల్జారీ జోసెఫ్‌ల రాకతో విండీస్ టి20 జట్టు బలంగా కనిపిస్తోంది. వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (సి), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్ భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
జింబాబ్వే చేతిలో ఓటమి ఎఫెక్ట్.. వైస్ కెప్టెన్‌నే తప్పించిన విండీస్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 గ్రూప్ దశ మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. నెదర్లాండ్స్‌తో ఇవాళ (జూన్ 26) జరిగే కీలక మ్యాచ్‌కు ఏకంగా వైస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్నే దూరం పెట్టింది. అతనితో పాటు గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్‌ను కూడా పక్కన పెట్టింది. రోవ్‌మన్ పావెల్ గత కొన్ని మ్యాచ్‌లుగా చెత్త ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో అతనిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు పావెల్ స్థానంలో రొమారియో షెపర్డ్, కైల్మేయర్స్ స్థానంలో షమారా బ్రూక్స్‌ను తుది జట్టుకు ఎంపిక చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (16), జాన్సన్ ఛార్లెస్ (27) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, విండీస్ ఇదివరకే సూపర్ సిక్స్‌కు చేరినా నెదర్లాండ్స్‌పై గెలుపు తదుపరి దశలో ఆ జట్టుకు కీలకం కానున్న నేపథ్యంలో విండీస్ మేనేజ్మెంట్ కీలక ఆటగాడిని తప్పించినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విండీస్ గెలిస్తే రెండు పాయింట్లు ఖాతాలో పెట్టుకుని సూపర్ సిక్స్‌కు చేరుతుంది. ఫైనల్‌కు చేరే క్రమంలో ఈ పాయింట్లు ఆ జట్టుకు చాలా కీలకం కానున్నాయి. మరోవైపు గ్రూప్-ఏలో టేబుల్ టాపర్‌గా ఉన్న జింబాబ్వే.. తమతో పాటు సూపర్ సిక్స్‌కు చేరుకున్న విండీస్, నెదర్లాండ్స్‌లపై విజయాలు సాధించినందున 4 పాయింట్లు ఖాతా పెట్టుకుని సూపర్ సిక్స్‌కు చేరింది. గ్రూప్-బి విషయానికొస్తే.. శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య రేపు (జూన్ 27) జరుగబోయే మ్యాచ్ అనంతరం ఏ జట్టు 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుతుందో తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు 4 పాయింట్లు, ఓడిన జట్టు 2 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటాయి. సూపర్ సిక్స్ దశలో ఈ పాయింట్లు కలుపుకుని ఒక్కో జట్టు 3 మ్యాచ్‌లు ఆడిన అనంతరం ఏ జట్లు టాప్-2లో ఉంటాయో అవి ఫైనల్లో తలపడటంతో పాటు ఈ ఏడాది చివరల్లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. -
IPL 2023: వైరలవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ పెళ్లి ఫోటోలు
Mitchell Marsh: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఇటీవలే తన లాంగ్ టర్మ్ పార్ట్నర్ గ్రెటా మాక్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలోని గ్రేస్టౌన్లో అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం నిరాడంభరంగా జరిగింది. వివాహ వేడుకలో మార్ష్ బ్లాక్ కలర్ సూట్లో మెరిసిపోగా.. మాక్, సంప్రదాయ తెల్లని గౌనులో తళుక్కుమంది. నూతన వధూవరులకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, పెళ్లి నిమిత్తం మార్ష్ ఐపీఎల్-2023 మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు మార్ష్ అందుబాటులో లేడు. డీసీ ఆడబోయే మరో 3, 4 మ్యాచ్‌లకు మార్ష్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. మార్ష్ గైర్హాజరీలో డీసీ రోవ్‌మన్ పావెల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అయితే ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్‌లో అతను దారుణంగా నిరాశపరిచాడు. దీంతో మార్ష్ లేని లోటు డీసీ శిబిరంలో స్పష్టంగా కనిపించింది. ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఏప్రిల్ 11న జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తలపడబోయే ఇరు జట్లు ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలు కాగా.. ముంబై ఇండియన్స్ ఆడిన 2 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో రేపు జరుగబోయే మ్యాచ్‌ను ఇరు జట్లు చాలా సీరియస్‌గా తీసుకోనున్నాయి. గెలుపు కోసం ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.