స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వెస్టిండీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆ జట్టు.. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ హవా కొనసాగిస్తుంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగియగా.. ఆదివారం జరిగిన రెండో టీ20లో కరీబియన్ జట్టు 35 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు.. రోవ్‌మన్ పావెల్ (28 బంతుల్లో 61 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ సాయంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. పావెల్ సహా బ్రాండన్ కింగ్ (43 బంతుల్లో 57; 7 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ పూరన్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు.
Powell power on display 💪
— ICC (@ICC) July 4, 2022
Shakib heroics can't save Bangladesh 🙌
West Indies eye T20 World Cup 👀
Talking points from the second #WIvBAN T20I 👇https://t.co/HmQoL9E7Hy
అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. షకీబ్ అల్ హసన్ (52 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) బంగ్లాదేశ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెక్ కాయ్, రొమారియో షెపర్డ్ తలో 2 వికెట్లు.. ఓడియన్ స్మిత్, అకీల్ హోసేన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. నిర్ణయాత్మక మూడో టీ20 గయానా వేదికగా జులై 7న జరుగనుంది.
చదవండి: హర్షల్ ఆల్‌రౌండ్ షో.. రెండో మ్యాచ్‌లోనూ టీమిండియాదే విజయం
Comments
Please login to add a commentAdd a comment