West Indies vs Bangladesh
-
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ దూరం
వెస్టిండీస్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు నజ్ముల్ షాంటో సారథ్యం వహించాడు. అదేవిధంగా విండీస్‌తో సిరీస్‌కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం దూరమయ్యాడు. షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డేలో ముష్ఫికర్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. దీంతో సిరీస్ మధ్యలోనే రహీం వైదొలిగాడు. అతడు తిరిగి మళ్లీ విండీస్‌తో వన్డే సిరీస్ సమయానికి కోలుకునే అవకాశమున్నట్లు బంగ్లా క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.ఇక వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్‌హసన్‌ను ఈ సిరీస్‌కు కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో అతడి కెరీర్ ముగిసినట్లే చెప్పుకోవాలి. ఇంతకుముందు దక్షిణాఫ్రికా సిరీస్‌కు అతడిని బంగ్లా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఆంటిగ్వా వేదికగా నవంబర్ 22 నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.విండీస్‌తో టెస్టులకు బంగ్లా జట్టునజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, మోమినుల్ హక్ షోరబ్, మహిదుల్ ఇస్లాం అంకోన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లాం, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్ , హసన్ మహమూద్, నహిద్ రాణా, హసన్ మురాద్చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్ -
WC 2023: టాప్‌లోకి దూసుకువచ్చిన బంగ్లాదేశ్.. ఏడో స్థానంలో రోహిత్ సేన!
ICC ODI WC Super League Standings: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన బంగ్లాదేశ్ ఐసీసీ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. విండీస్‌తో రెండో వన్డేలో విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లా.. మొత్తంగా 130 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. వన్డే ప్రపంచకప్-2023 టోర్నీలో భాగంగా 2020-23గానూ ఇప్పటి వరకు బంగ్లాదేశ్ పందొమ్మిది మ్యాచ్‌లు ఆడి.. 13 గెలిచింది. ఈ నేపథ్యంలో టాప్‌లోకి దూసుకువచ్చింది. కాగా వెస్టిండీస్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్.. టెస్టు, టీ20 సిరీస్‌లను కోల్పోయినప్పటికీ వన్డే సిరీస్‌ను మాత్రం ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తేడాతో కైవసం చేసుకుంది. TOSS🪙: Captain @nicholas_47 is second best at toss today. 🇧🇩 have sent West Indies in to 🏏 in this 2nd One-Day International at Providence stadium 🇬🇾. #WIvBAN pic.twitter.com/AyYdD0vxJR — Windies Cricket (@windiescricket) July 13, 2022 Not the #MenInMaroon day at the office. Well played to 🇧🇩 @BCBtigers #WIvBAN pic.twitter.com/gj6rJ26tM0 — Windies Cricket (@windiescricket) July 13, 2022 ఇక ఇంగ్లండ్ 18 మ్యాచ్‌లకు గానూ 12 గెలిచి 125 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్ వరుసగా టాప్-5లో స్థానం దక్కించుకున్నాయి. మరోవైపు తాజాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన పరాజయాల సంఖ్య 14కు చేరింది. దీంతో ఆడిన 22 మ్యాచ్‌లలో కేవలం ఎనిమిది మాత్రమే గెలుపొందిన విండీస్ జట్టు ఆరోస్థానంలో ఉంది. ఇక ఇంగ్లండ్‌తో మొదటి వన్డేలో అదరగొట్టిన టీమిండియా ఏడో స్థానం దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక ఆసీస్‌తో వన్డే సిరీస్ రద్దు చేసుకున్న దక్షిణాఫ్రికా పదకొండో స్థానానికి పడిపోయి పదమూడింటిలో కేవలం 4 విజయాలతో పదకొండో స్థానంలో నిలిచింది. కాగా ప్రపంచకప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించాలంటే ఆయా జట్లు టాప్-8లో నిలవాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. కాగా ఐసీసీ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే జట్టు గణాంకాలతో సంబంధం లేకుండా నేరుగా అర్హత సాధిస్తుంది. ఈసారి భారత్ ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తోంది. ఇక టాప్-8లో అడుగుపెట్టిన జట్లతో పాటు క్వాలిఫైయర్ రౌండ్లో విజయం సాధించిన రెండు జట్లు ప్రపంచకప్ రేసులో నిలుస్తాయి. చదవండి: Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే! Virat Kohli: అప్పుడు నేను, సచిన్, ద్రవిడ్! ఇప్పుడు కోహ్లి వంతు.. ఇక ముందు కూడా! -
WI Vs Ban: విండీస్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఈ సిరీస్ వాళ్లదే!
WI Vs Ban 2nd ODI: వెస్టిండీస్‌తో రెండో వన్డేలో బంగ్లాదేశ్‌తో ఘన విజయం సాధించింది. ఆతిథ్య విండీస్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా 2-0తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్.. వెస్టిండీస్ పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో టెస్టు, టీ20 సిరీస్‌లను విండీస్ కైవసం చేసుకుంది. ఇక ప్రపంచకప్-2023 నేపథ్యంలో సూపర్ లీగ్‌లో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్ పర్యాటక బంగ్లా సొంతమైంది. కాగా గయానా వేదికగా బుధవారం(జూలై 13) వెస్టిండీస్- బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే జరిగింది. విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలం టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 108 పరుగులకే కుప్పకూలింది. కీమో పాల్(25- నాటౌట్) మినహా ఎవరూ కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. కెప్టెన్ నికోలస్ పూరన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 35 ఓవర్లలోనే పూరన్ బృందం కథ ముగిసింది. TOSS🪙: Captain @nicholas_47 is second best at toss today. 🇧🇩 have sent West Indies in to 🏏 in this 2nd One-Day International at Providence stadium 🇬🇾. #WIvBAN pic.twitter.com/AyYdD0vxJR — Windies Cricket (@windiescricket) July 13, 2022 బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్ 4 వికెట్లు తీయగా.. నాసుమ్ అహ్మద్ 10 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ శుభారంభం అందించాడు. అదరగొట్టిన బంగ్లా కెప్టెన్ అర్ధ శతకంతో రాణించి సత్తా చాటాడు. మరో ఓపెనర్ శాంటో 20 పరుగులు చేసి నిష్క్రమించగా.. లిటన్ దాస్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో 20.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసిన బంగ్లాదేశ్ భారీ విజయం సాధించింది. నాసుమ్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. Not the #MenInMaroon day at the office. Well played to 🇧🇩 @BCBtigers #WIvBAN pic.twitter.com/gj6rJ26tM0 — Windies Cricket (@windiescricket) July 13, 2022 చదవండి: Ind Vs WI: టీ20 సిరీస్‌కు కోహ్లి దూరం! ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్! వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు! Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే! -
WI Vs Ban: చేదు అనుభవాల నుంచి కోలుకుని.. బంగ్లాదేశ్ ఘన విజయం
Bangladesh tour of West Indies, 2022- 1st ODI: వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. మొదటి వన్డేలో ఆతిథ్య విండీస్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. కాగా బంగ్లాదేశ్ ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్, టీ20 సిరీస్‌లను విండీస్ సొంతం చేసుకోవడంతో పర్యాటక బంగ్లాకు చేదు అనుభవం మిగిలింది. ఈ నేపథ్యంలో గయానా వేదికగా సాగిన మొదటి వన్డేలో గెలుపొంది ఊరట విజయాన్ని అందుకుంది బంగ్లాదేశ్. మ్యాచ్ సాగిందిలా... వరణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. ఇందులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన పూరన్ బృందం.. 41 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో 33 పరుగులతో బ్రూక్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్ మాత్రమే పదికి పైగా పరుగులు చేశారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది వెస్టిండీస్ జట్టు. 6 వికెట్ల తేడాతో.. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు.. కెప్టెన్, ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 33 పరుగులతో రాణించి మంచి పునాది వేశాడు. మరో ఓపెనర్ లిటన్ దాస్ విఫలమైనా(1).. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన న్ముల్ హుసేన్ 37, నాలుగో స్థానంలో వచ్చిన మహ్మదుల్లా 41 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆఖర్లో నారుల్ హుసేన్ 20 పరుగులతో రాణించాడు. దీంతో 31. 5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు నష్టపోయి బంగ్లాదేశ్ విజయం సాధించింది. 9 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించిన బంగ్లా బౌలర్ మోహెదీ హసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన విండీస్ ఆటగాడు గుడకేశ్ మోటీ ఒక వికెట్ తీసి మధుర జ్ఞాపకం మిగుల్చుకున్నాడు. వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ మొదటి వన్డే: టాస్: బంగ్లాదేశ్- బౌలింగ్ వెస్టిండీస్ స్కోరు: 149/9 (41) బంగ్లాదేశ్ స్కోరు: 151/4 (31.5) విజేత: బంగ్లాదేశ్.. 6 వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మెహెదీ హసన్(3 వికెట్లు) చదవండి: Rohit Sharma: అతడు అద్భుతం.. మాకు ఇదొక గుణపాఠం.. ఓటమికి కారణం అదే! IRE Vs NZ 1st ODI: భళా బ్రేస్‌వెల్.. ఐర్లాండ్‌పై కివీస్ విజయం Motie takes our #MastercardPricelessMoment of the match with his maiden International wicket! pic.twitter.com/47iHGOVUqB — Windies Cricket (@windiescricket) July 10, 2022 Motie takes his 1st International wicket! #WIvBAN #MenInMaroon Live Scorecard - https://t.co/pQMuJ0sNHj pic.twitter.com/iKOdfXOhY4 — Windies Cricket (@windiescricket) July 10, 2022 Congrats on your ODI debut Motie! All the best!👏🏿 #WIvBAN #MaroonMagic pic.twitter.com/ziGsRgSWFE — Windies Cricket (@windiescricket) July 10, 2022 -
WI Vs Ban: పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. టీ20 సిరీస్ కూడా విండీస్‌దే!
West Indies vs Bangladesh: బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ అదరగొట్టాడు. గయానా వేదికగా సాగిన మూడో టీ20లో 39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. పూరన్ మెరుపు ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో పర్యాటక బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్ ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో టెస్టు సిరీస్‌లో ఆతిథ్య విండీస్ వరుసగా 7, 10 వికెట్ల తేడాతో గెలుపొంది విజేతగా నిలిచింది. ఇక మొదటి టీ20లో వర్షం కారణంగా ఫలితం తేలలేదు. రెండో టీ20లో 35 పరుగుల తేడాతో గెలుపొందిన పూరన్ బృందం... గురువారం నాటి మూడో టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్ కైవసం చేసుకుంది. వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ మూడో టీ20 ►టాస్: బంగ్లాదేశ్- బ్యాటింగ్ ►బంగ్లాదేశ్ స్కోరు: 163/5 (20) ►వెస్టిండీస్ స్కోరు: 169/5 (18.2) ►విజేత: వెస్టిండీస్(5 వికెట్ల తేడాతో విండీస్ గెలుపు) ►పూరన్, కైల్ మేయర్స్ అర్ధ శతకాలు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నికోలస్ పూరన్(39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు- నాటౌట్) ►బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్: ఆఫిఫ్ హొసేన్(50 పరుగులు) చదవండి: Rohit Sharma: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! BAN vs WI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ దూరం..! A big knock and a big moment to seal the series! Nicholas Pooran takes our #MastercardPricelessMoment of the 3rd T20I. #WIvBAN pic.twitter.com/Xo6nVibUwJ — Windies Cricket (@windiescricket) July 7, 2022 The power of Kyle Mayers!! #WIvBAN pic.twitter.com/xWKe5Jrf5W — Windies Cricket (@windiescricket) July 7, 2022 -
రోవ్‌మన్ పావెల్ ఊచకోత.. రెండో టీ20లో విండీస్ ఘన విజయం
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వెస్టిండీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆ జట్టు.. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ హవా కొనసాగిస్తుంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగియగా.. ఆదివారం జరిగిన రెండో టీ20లో కరీబియన్ జట్టు 35 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు.. రోవ్‌మన్ పావెల్ (28 బంతుల్లో 61 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ సాయంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. పావెల్ సహా బ్రాండన్ కింగ్ (43 బంతుల్లో 57; 7 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ పూరన్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. Powell power on display 💪 Shakib heroics can't save Bangladesh 🙌 West Indies eye T20 World Cup 👀 Talking points from the second #WIvBAN T20I 👇https://t.co/HmQoL9E7Hy — ICC (@ICC) July 4, 2022 అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. షకీబ్ అల్ హసన్ (52 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) బంగ్లాదేశ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెక్ కాయ్, రొమారియో షెపర్డ్ తలో 2 వికెట్లు.. ఓడియన్ స్మిత్, అకీల్ హోసేన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. నిర్ణయాత్మక మూడో టీ20 గయానా వేదికగా జులై 7న జరుగనుంది. చదవండి: హర్షల్ ఆల్‌రౌండ్ షో.. రెండో మ్యాచ్‌లోనూ టీమిండియాదే విజయం -
విండీస్ క్రికెటర్ వింత ప్రవర్తన.. సూపర్ అంటున్న ఫ్యాన్స్
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా మ్యాచ్‌లో విండీస్ బౌలర్ అఫీ ఫ్లెచర్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూడు కీలక వికెట్లు తీసిన ఫ్లెచర్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. కాగా ఈ విషయం పక్కనబెడితే.. ఫ్లెచర్ ఫ్లెచర్ వన్డే ప్రపంచకప్ కోసం తన ఏడు నెలల కొడుకుని వదిలివచ్చింది. ఈ సందర్భంగా తన చిన్నారిని గుర్తుచేసుకుంటూ సూపర్ సెలబ్రేషన్‌తో మెరిసింది. బంగ్లా బ్యాటర్ ఫర్గానా హోక్యూ వికెట్ తీసిన తర్వాత ఫ్లెచర్.. తన చేతిని ఫోన్‌గా మార్చి నెంబర్ డయల్ చేసి కొడుకుతో మాట్లాడినట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. హాయ్ బేబీ.. హౌ ఆర్ యూ మై చైల్డ్ అంటూ నవ్వడం అందరిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్లెచర్ కంటే ముందే పాకిస్తాన్ మహిళా ప్లేయర్ బిస్మా మరూఫ్ క్రాడిల్ రాకింగ్ సెలబ్రేషన్‌తో మెరిసింది. ఇక ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ వుమెన్స్ నాలుగు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వుమెన్స్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కీపర్ క్యాంప్‌బెల్ 53 పరుగులతో టాప్‌స్కోరర్ కాగా.. హేలీ మాథ్యూస్ 18, అఫీ ఫ్లెచర్ 17 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ వుమెన్స్ 49.3 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌట్ అయింది. నిగర్ సుల్తానా 25, నదియా కేర్ 25 నాటౌట్, సల్మాన్ కాతున్ 23 పరుగులు చేశారు. విండీస్ వుమెన్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 4, అఫీ ఫ్లెచర్ 3, స్టిఫానీ టేలర్ 3 వికెట్లు తీశారు. #CWC22 #BANvWIhttps://t.co/jPcITcLslf pic.twitter.com/QGecvbIxqG — hypocaust (@_hypocaust) March 18, 2022 -
World Cup 2022: నరాలు తెగే ఉత్కంఠ.. 4 పరుగుల తేడాతో విజయం!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ గెలుపొందింది. ఆఖరి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. కాగా మౌంట్ మాంగనీ వేదికగా విండీస్‌తో తలపడిన బంగ్లాదేశ్ మహిళా జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు డియేండ్ర డాటిన్(17 పరుగులు), హేలీ మ్యాథ్యూస్(18 పరుగులు) శుభారంభం అందించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన విలియమ్స్(4), ఆ తర్వాత కెప్టెన్ టేలర్(4) సింగిల్ డిజిట్ స్కోరు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. జట్టు ఇలా కష్టాల్లో కూరుకుపోయిన వేళ వికెట్ కీపర్ బ్యాటర్ కాంప్‌బెల్ నేనున్నానంటూ భరోసా ఇచ్చింది. 107 బంతులు ఎదుర్కొన్న ఆమె ఓపికగా పరుగులు తీస్తూ 53 పరుగులు సాధించింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఈ క్రమంలో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టును విండీస్ బౌలర్ హేలీ మ్యాథ్యూస్ ఆదిలోనే దెబ్బకొట్టింది. ఓపెనర్లను వెనక్కి పంపింది. మొత్తంగా నాలుగు వికెట్లు కూల్చి బంగ్లా పతనాన్ని శాసించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 136 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా 4 పరుగుల తేడాతో విజయం విండీస్ సొంతమైంది. హేలీ మ్యాథ్యూస్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022 వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు వెస్టిండీస్- 140/9 (50) బంగ్లాదేశ్- 136 (49.3) చదవండి: View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup WI Vs BAN: వరుస పరాజయాలు... టోర్నీ నుంచి అవుట్!
వీరాభిమానుల ఆశలు ఆవిరి చేస్తూ... ఉత్కంఠ పోరులో తడబడిన బంగ్లాదేశ్ టి20 ప్రపంచకప్‌లో వరుసగా మూడో పరాజయం చవిచూసింది. కీలక సమయంలో బౌలింగ్‌లో... ఆ తర్వాత బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన బంగ్లాదేశ్ జట్టు మూల్యం చెల్లించుకుంది. వెస్టిండీస్ చేతిలో మూడు పరుగుల తేడాతో ఓడిన బంగ్లాదేశ్ ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ చేరే అవకాశాలను చేజార్చుకుంది. Bangladesh Lost To West Indies By 3 Runs Out Tourney: అత్యున్నత వేదికపై మంచి ఫలితాలు రావాలంటే ఆద్యంతం నిలకడగా రాణించాల్సి ఉంటుంది. లేదంటే ఎంతటి మేటి జట్టుకైనా భంగపాటు తప్పదు. వీరాభిమానులకు కొదువలేని బంగ్లాదేశ్ జట్టు అంచనాలను అందుకోవడంలో విఫలమై టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన చోట బంగ్లాదేశ్ చతికిలపడింది. ఈసారికి సూపర్–12తోనే సరిపెట్టుకోనుంది. చివరి బంతికి 4 పరుగులు అవసరం గ్రూప్–1 లో శుక్రవారం షార్జాలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ మూడు పరుగుల తేడా తో బంగ్లాదేశ్‌ను ఓడించి ఎట్టకేలకు ఈ టోర్నీలో గెలుపు బోణీ కొట్టింది. విజయం సాధించాలంటే ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ 9 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. బంగ్లాదేశ్ గెలుపునకు చివరి బంతికి 4 పరుగులు అవసరమయ్యాయి. విండీస్ ఆల్‌రౌండర్ రసెల్ వేసిన బంతిపై క్రీజులో ఉన్న బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్ముదుల్లా ఒక్క పరుగూ తీయలేకపోయాడు. దాంతో విండీస్ విజయం, బంగ్లాదేశ్ ఓటమి ఖాయమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ దూకుడు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... తొలి టి20 మ్యాచ్ ఆడిన రోస్టన్ చేజ్ (46 బంతుల్లో 39; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది. లిటన్ దాస్ (43 బంతుల్లో 44; 4 ఫోర్లు), కెప్టెన్ మహ్ముదుల్లా (24 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా జట్టును విజయతీరానికి చేర్చలేకపోయారు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ (బి) మెహదీ హసన్ 4; లూయిస్ (సి) ముష్ఫికర్ (బి) ముస్తఫిజుర్ 6; రోస్టన్ చేజ్ (బి) ఇస్లామ్ 39; హెట్‌మైర్ (సి) సౌమ్య సర్కార్ (బి) మెహదీ హసన్ 9; పొలార్డ్ (నాటౌట్) 14; రసెల్ (రనౌట్) 0; పూరన్ (సి) నైమ్ (బి) ఇస్లామ్ 40; బ్రావో (సి) సౌమ్య సర్కార్ (బి) ముస్తఫిజుర్ 1; హోల్డర్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–12, 2–18, 3–32, 4–62, 5–119, 6–119, 7–123. బౌలింగ్: మెహదీ హసన్ 4–0–27–2, తస్కిన్ అహ్మద్ 4–0–17–0, ముస్తఫిజుర్ 4–0–43–2, షోరిఫుల్ 4–0–20–2, షకీబ్ 4–0–28–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: నైమ్ (బి) హోల్డర్ 17; షకీబ్ (సి) హోల్డర్ (బి) రసెల్ 9; లిటన్ దాస్ (సి) హోల్డర్ (బి) బ్రావో 44; సౌమ్య సర్కార్ (సి) గేల్ (బి) హొసీన్ 17; ముష్ఫికర్ (బి) రాంపాల్ 8; మహ్ముదుల్లా (నాటౌట్) 31; అఫిఫ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–21, 2–29, 3–60, 4–90, 5–130. బౌలింగ్: రవి రాంపాల్ 4–0– 25–1, హోల్డర్ 4–0–22–1, రసెల్ 4–0– 29–1, హొసీన్ 4–0–24–1, బ్రావో 4–0– 36–1. -
గురి తప్పకుండా.. బ్యాట్స్‌మన్‌కు తగలకుండా
-
గురి తప్పకుండా.. బ్యాట్స్‌మన్‌కు తగలకుండా
టాంటాన్: ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకొని ఔరా అనిపించిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కాట్రెల్ సిక్సర్ వెళ్లే బంతిని గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన కాట్రెల్ బౌండరీ హద్దును తాకబోతున్నట్లు గమనించి బంతిని లోపలికి విసిరేశాడు. అనంతరం మళ్లీ లైన్ లోపలికి వచ్చి బంతిని అందుకొని ఆశ్చర్యపరిచాడు. ఈ వరల్డ్‌కప్‌లో కాట్రెల్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ ఇది. కాగా, సోమవారం బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఒక అద్భుతమైన రనౌట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ లక్ష్య ఛేదనలో భాగంగా 18 ఓవర్‌ను కాట్రెల్ వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికి తమీమ్ పరుగు తీయగా, రెండో బంతికి షకీబుల్ హసన్ పరుగు సాధించాడు. ఇక మూడో బంతిని తమీమ్ నేరుగా బౌలర్ ఎండ్‌వైపు ఆడాడు. అదే సమయంలో కాస్త ముందుకొచ్చి వెనక్కు వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతిని అందుకున్న బౌలర్ కాట్రెల్..స్ట్రైకింగ్ ఎండ్‌లోకి వేగంగా విసిరాడు. ఎంత వేగంగా అంటే, బంతిని అందుకోవడం అంతే కచ్చితత్వంతో వికెట్లను నేలకూల్చడం చేశాడు. బ్యాట్స్‌మన్ తమీమ్ తేరుకునే లోపే అద్భుతమైన త్రోను విసిరి రనౌట్ చేయడం అభిమానుల్ని ఫుల్ జోష్‌లో ముంచెత్తింది. ఇక్కడ బంతి గురి తప్పకుండా, బ్యాట్స్‌మన్‌కు తగలకుండా విసరడం వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఇది ఈ వరల్డ్‌కప్ బెస్ట్ మూమెంట్స్‌లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది.(ఇక్కడ చదవండి: భళారే బంగ్లా!) -
భళా.. బంగ్లా
టాంటాన్ : సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్.. మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం స్థానిక మైదానంలో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో బంగ్లా ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. మరో 51 బంతులు మిగిలుండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. బంగ్లా ఆటగాళ్లలో సీనియర్ ఆటగాడు షకీబుల్ హసన్(124నాటౌట్; 99 బంతుల్లో 16ఫోర్లు) సెంచరీతో చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. షకీబుల్‌కు తోడుగా లిట్టన్ దాస్(94 నాటౌట్; 69 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా, తమీమ్(48) పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో రసెల్, థామస్లకు చెరో వికెట్ దక్కింది. సెంచరీతో రెండు వికెట్లు పడగొట్టిన షకీబ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. విండీస్‌కు ఊహించని పరిణామం 321 పరుగులు చేశాక కూడా ఓడిపాతమని విండీస్ కలలో కూడా ఊహించకపోవచ్చు. బలమైన బౌలింగ్ లైనప్, మెరుపు ఫీల్డింగ్ గల విండీస్‌పై బంగ్లా గెలుస్తుందని కనీసం ఎవరూ కూడా అంచనా వేయలేకపోయారు. అయితే సీనియర్ ఆటగాడు షకీబ్ తన అనుభవంతో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా చివరి వరకు ఉండి బంగ్లాకు విజయాన్ని అందించాడు. షకీబ్‌కు తోడుగా తమీమ్ ఆకట్టుకున్నాడు. అయితే లిట్టన్ దాస్ వచ్చాక మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన దాస్ విజయాన్ని త్వరగా పూర్తి కావడంలో ముఖ్య పాత్ర పోషించాడు. వీరిద్దరి సూపర్ షోతో బంగ్లా క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. విధ్వంసకరులు సున్నాకే పరిమితం అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. విండీస్ ఆటగాళ్లలో ఎవిన్ లూయిస్(70; 67 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు), షాయ్ హోప్(96; 121 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), హెట్ మెయిర్(50; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించడంతో పాటు జేసన్ హోల్డర్(33; 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ విధ్వంసకర ఆటగాళ్లు క్రిస్ గేల్, రసెల్‌లు పరుగులేమి చేయకుండానే ఔటవ్వడం గమనార్హం. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, సైఫుద్దీన్‌లు తలో మూడు వికెట్లు పడగొట్టగా.. షకీబ్ రెండు వికెట్లు నేలకూల్చాడు. -
వికెట్లను కొట్టినా ఔట్ కాలేదు!
టాంటాన్: క్రికెట్లో హిట్ వికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాట్స్‌మన్ తనకు తాను వికెట్లను కొడితే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. అది మన పరిభాషలో చెప్పుకోవాలంటే సెల్ఫ్ ఔట్ అంటాం. అయితే బ్యాట్స్‌మన్ వికెట్లను బ్యాట్‌తో కొట్టినా అది ఔట్ కాకపోతే అది కాస్త ఆలోచించాల్సిన విషయమే. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన కనిపించింది. విండీస్ ఇన్నింగ్స్‌లో భాగంగా ముస్తాఫిజుర్ 49 ఓవర్ ఐదో బంతిని ఆఫ్ సైడ్ యార్కర్‌గా సంధించాడు. అది కాస్తా స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ఓష్నీ థామస్ దాటుకుని కీపర్ రహీమ్ చేతుల్లోకి వెళ్లింది. (ఇక్కడ చదవండి: వెస్టిండీస్ ఇరగదీసింది) ఆపై థామస్ వికెట్లను బ్యాట్‌తో కొట్టాడు. ఆ క్రమంలోనే బెయిల్స్ కూడా పడటం జరిగింది. దీనిపై అనుమానం వచ్చిన ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేశారు. కాగా, ఇది ఔట్ కాదని తేలింది. సదరు బంతిని థామస్ ఆడే క్రమంలో ఆ షాట్ పూర్తయిన తర్వాతే వికెట్లను బ్యాట్‌తో తాకడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇది పెద్ద విషయం కాకపోయినా, బ్యాట్స్‌మన్ వికెట్లను కొట్టినా ఎందుకు ఔట్ ఇవ్వలేదనేది సగటు క్రీడాభిమానికి వచ్చే ఆలోచన. కాగా, థర్డ్ అంపైర్ నిర్ణయంతో దీనిపై స్పష్టత రావడంతో ఇదా విషయం అనుకోవడం అభిమానుల వంతైంది. -
చిత్రం బ్యాట్ వికెట్లను తాకినా..
-
వెస్టిండీస్ ఇరగదీసింది..
టాంటాన్: వరల్డ్‌కప్‌లో వరుస ఓటములతో వెనుకబడిన వెస్టిండీస్.. తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టింది. విండీస్ ఆటగాళ్లలో ఎవిన్ లూయిస్(70; 67 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు), షాయ్ హోప్(96; 121 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), హెట్ మెయిర్(50; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించడంతో పాటు జేసన్ హోల్డర్(33; 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు 322 పరుగుల టార్గెట్‌ను నిర్దేశిచింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో విండీస్ బ్యాటింగ్ చేపట్టింది. విండీస్ ఇన్నింగ్స్‌ను క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్‌లు ఆరంభించారు. అయితే విండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. క్రిస్ గేల్ పరుగులేమీ చేయకుండా తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 13 బంతులాడిన గేల్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో విండీస్ ఆరు పరుగుల వద్ద మొదటి వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో లూయిస్‌కు జత కలిసిన హోప్ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలోనే లూయిస్ హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత లూయిస్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై నికోలస్ పూరన్-హోప్‌లు బంగ్లా బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగారు. (ఇక్కడ చదవండి:13 బంతులాడి ఖాతా తెరవకుండానే..!) కాగా, పూరన్(25) భారీ షాట్ ఆడే క్రమంలో మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో హోప్‌తో కలిసి హెట్ మెయిర్ ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత తీసుకున్నాడు. ఈ జోడి 85 పరుగులు జత చేయడంతో విండీస్ స్కోరు బోర్డు మళ్లీ గాడిలో పడింది. హెట్ మెయిర్ హాఫ్ సెంచరీ సాధించగా, పరుగు వ్యవధిలో ఆండ్రీ రసెల్(0) డకౌట్ అయ్యాడు. అటు తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జేసన్ హోల్డర్ విండీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండు భారీ సిక్సర్లు కొట్టి తన ఉద్దేశం ఏమిటో చెప్పాడు. అయితే హోల్డర్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. చివర్లో డారెన్ బ్రేవో(19; 15 బంతుల్లో 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఈ వరల్డ్‌కప్‌లో విండీస్‌కు ఇదే అత్యధిక స్కోరు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్, మహ్మద్ సైఫుద్దీన్ తలో మూడు వికెట్లు సాధించగా, షకీబుల్ హసన్ రెండు వికెట్లు తీశాడు. -
13 బంతులాడి క్రిస్ గేల్ డకౌట్..!
-
13 బంతులాడి ఖాతా తెరవకుండానే..!
టాంటాన్: వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ మరోసారి నిరాశ పరిచాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గేల్ డకౌట్‌గా నిష్క్రమించాడు. బంగ్లాదేశ్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఆరంభం నుంచి తడబడిన గేల్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాటపట్టాడు. తన సహజ సిద్ధమైన భారీ షాట్లను వదిలిపెట్టి కుదురుగా ఆడటానికి యత్నించిన గేల్ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. 13 బంతులాడి ‘సున్నా’కే ఔటయ్యాడు.(ఇక్కడ చదవండి: ‘సెకండ్ విక్టరీ’ ఎవరిదో?) ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను గేల్, ఎవిన్ లూయిస్‌లు ఆరంభించారు. ఈ క్రమంలోనే మొర్తాజా వేసిన తొలి ఓవర్ మెయిడిన్ అయ్యింది. స్టైకింగ్ ఎండ్‌లో గేల్ ఉన్నప్పటికీ మొదటి ఓవర్లో విండీస్ పరుగుల ఖాతా తెరలేదు. ఆపై రెండో ఓవర్లో గేల్ ఐదు బంతులాడినప్పటికీ కనీసం పరుగు కూడా చేయలేదు. దాంతో విండీస్ రెండు ఓవర్లు ముగిసే సరికి రెండు పరుగులు మాత్రమే చేసింది. ఇక సైఫుద్దీన్ వేసిన నాల్గో ఓవర్ రెండో బంతికి కీపర్ రహీమ్‌కు క్యాచ్ ఇచ్చి గేల్ ఔటయ్యాడు. ఫలితంగా విండీస్ ఆరు పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. -
‘సెకండ్ విక్టరీ’ ఎవరిదో?
టాంటాన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ద కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ మష్రాఫ్ మొర్తజా ముందుగా వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకూ తలో నాలుగు మ్యాచ్‌లు ఆడగా చెరో మ్యాచ్ మాత్రమే గెలిచాయి. ఇందులో ఇరు జట్లు ఆడాల్సిన ఒక్కో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన వెస్టిండీస్.. ఆపై గెలుపును అందుకోలేకపోయింది. ఇక దక్షిణాఫ్రికాను కంగుతినిపించిన బంగ్లాదేశ్‌ది కూడా అదే పరిస్థితి. దాంతో ఇక నుంచి ఇరు జట్లకు ప్రతీ మ్యాచ్ కీలకం. ఈ నేపథ్యంలో ఆసక్తికర సమరం జరిగే అవకాశం ఉంది. కాగా, ముఖాముఖి రికార్డులో వెస్టిండీస్‌దే పైచేయి. ఇప్పటివరకూ ఇరు జట్ల 37 వన్డేలు తలపడగా, అందులో విండీస్ 21 మ్యాచ్‌లు విజయం సాధించింది. బంగ్లాదేశ్ 14 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందగా, రెండింట ఫలితం తేలలేదు. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా, మూడు మ్యాచ్‌ల్లో విండీస్ విజయం సాధించగా, బంగ్లాదేశ్ మాత్రం విజయాన్ని సాధించడంలో విఫలమైంది. మరొక మ్యాచ్ రద్దయ్యింది. ఇదిలా ఉంచితే, వెస్టిండీస్‌తో తలపడిన చివరి నాలుగు వన్డేల్లో బంగ్లానే విజయం సాధించడంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. అదే సమయంలో విండీస్ కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉండటంతో విజయంపై ధీమాగా ఉంది. ఇరు జట్లు రెండో విజయం కన్నేయడంతో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. తుది జట్లు వెస్టిండీస్ జేసన్ హోల్డర్(కెప్టెన్), క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, షాయ్ హోప్, డారెన్ బ్రేవో, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయిర్, ఆండ్రీ రసెల్, షెల్డాన్ కాట్రెల్, ఓష్నీ థామస్, షెనాన్ గాబ్రియెల్ బంగ్లాదేశ్ మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, లిటాన్ దాస్, మహ్మదుల్లా, మొసద్దెక్ హుస్సేన్, మహ్మద్ సైఫుద్దీన్, మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మాన్