WI Vs BAN 3rd T20I: Nicholas Pooran Blasts, West Indies To Series Win Over Bangladesh - Sakshi
Sakshi News home page

WI Vs Ban: పూరన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.... బంగ్లాకు పరాభవం.. టీ20 సిరీస్‌ కూడా విండీస్‌దే!

Published Fri, Jul 8 2022 10:55 AM | Last Updated on Fri, Jul 8 2022 1:13 PM

WI Vs Ban 3rd T20: Pooran Slams 39 Ball 74 West Indies Won Series - Sakshi

West Indies vs Bangladesh: బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ అదరగొట్టాడు. గయానా వేదికగా సాగిన మూడో టీ20లో 39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. పూరన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌ 5 వికెట్ల తేడాతో పర్యాటక బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.

తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్‌ ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో టెస్టు సిరీస్‌లో ఆతిథ్య విండీస్‌ వరుసగా 7, 10 వికెట్ల తేడాతో గెలుపొంది విజేతగా నిలిచింది.

ఇక మొదటి టీ20లో వర్షం కారణంగా ఫలితం తేలలేదు. రెండో టీ20లో 35 పరుగుల తేడాతో గెలుపొందిన పూరన్‌ బృందం... గురువారం నాటి మూడో టీ20 మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్ కైవసం చేసుకుంది.

వెస్టిండీస్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ మూడో టీ20
టాస్‌: బంగ్లాదేశ్‌- బ్యాటింగ్‌
బంగ్లాదేశ్‌ స్కోరు: 163/5 (20)
వెస్టిండీస్‌ స్కోరు: 169/5 (18.2)
విజేత: వెస్టిండీస్‌(5 వికెట్ల తేడాతో విండీస్‌ గెలుపు)
పూరన్‌, కైల్‌ మేయర్స్‌ అర్ధ శతకాలు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: నికోలస్‌ పూరన్‌(39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు- నాటౌట్‌)
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌: ఆఫిఫ్‌ హొసేన్‌(50 పరుగులు)

చదవండి: Rohit Sharma: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్‌ శర్మ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో!
BAN vs WI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌.. బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ దూరం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement