వెస్టిండీస్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు నజ్ముల్ షాంటో సారథ్యం వహించాడు. అదేవిధంగా విండీస్‌తో సిరీస్‌కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం దూరమయ్యాడు.
షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డేలో ముష్ఫికర్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. దీంతో సిరీస్ మధ్యలోనే రహీం వైదొలిగాడు. అతడు తిరిగి మళ్లీ విండీస్‌తో వన్డే సిరీస్ సమయానికి కోలుకునే అవకాశమున్నట్లు బంగ్లా క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
ఇక వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్‌హసన్‌ను ఈ సిరీస్‌కు కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో అతడి కెరీర్ ముగిసినట్లే చెప్పుకోవాలి. ఇంతకుముందు దక్షిణాఫ్రికా సిరీస్‌కు అతడిని బంగ్లా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఆంటిగ్వా వేదికగా నవంబర్ 22 నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
విండీస్‌తో టెస్టులకు బంగ్లా జట్టు
నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, మోమినుల్ హక్ షోరబ్, మహిదుల్ ఇస్లాం అంకోన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లాం, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్ , హసన్ మహమూద్, నహిద్ రాణా, హసన్ మురాద్
చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment