Mushfiqur Rahim
-
ఛాంపియన్స్ ట్రోఫీలో ఫెయిల్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల రహీమ్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022లో టీ20లకు వీడ్కోలు పలికిన రహీమ్.. ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ముష్పికర్ వెల్లడించాడు.అన్నివిధాలగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రహీమ్ తెలిపాడు. కాగా పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రహీమ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో రహీమ్ వన్డేలకు విడ్కోలు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది."నేను ఈరోజు నుంచి వన్డే ఫార్మాట్ నుండి రిటైర్ అవుతున్నాను. నా కెరీర్లో ఇప్పటివరకు సాధించిన ప్రతీ విజయం వెనక ఆ దేవుడు ఉన్నాడు. ప్రపంచ స్థాయిలో మేము సాధించిన పరిమితం అయినప్పటికీ.. నేను మాత్రం నా దేశం కోసం ఎంతో నిజాయతీతో, అంకితభావంతో పనిచేశాను. గత కొన్ని వారాలగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. ఇక టెస్టు క్రికెట్‌పై మరింత దృష్టిసారిస్తాను. నాకు మద్దతుగా నిలిచిన బంగ్లా క్రికెట్‌కు, అభిమానులకు, సహచరులకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను" అని ముష్ఫికర్ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చాడు.2006లో జింబాబ్వేతో జరిగిన వన్డేతో రహీమ్ బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన కెరీర్లో బంగ్లా తరపున 274 వన్డేలు ఆడిన ముష్ఫికర్.. 36.42 సగటుతో 7,795 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన రికార్డు రహీమ్ పేరిటే ఉంది. అదేవిధంగా వికెట్ కీపర్‌గా కూడా ముష్ఫికర్ 243 క్యాచ్‌లు అందుకున్నాడు.చదవండి: సచిన్ హాఫ్ సెంచరీ వృథా.. భారత్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ దూరం
వెస్టిండీస్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు నజ్ముల్ షాంటో సారథ్యం వహించాడు. అదేవిధంగా విండీస్‌తో సిరీస్‌కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం దూరమయ్యాడు. షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డేలో ముష్ఫికర్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. దీంతో సిరీస్ మధ్యలోనే రహీం వైదొలిగాడు. అతడు తిరిగి మళ్లీ విండీస్‌తో వన్డే సిరీస్ సమయానికి కోలుకునే అవకాశమున్నట్లు బంగ్లా క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.ఇక వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్‌హసన్‌ను ఈ సిరీస్‌కు కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో అతడి కెరీర్ ముగిసినట్లే చెప్పుకోవాలి. ఇంతకుముందు దక్షిణాఫ్రికా సిరీస్‌కు అతడిని బంగ్లా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఆంటిగ్వా వేదికగా నవంబర్ 22 నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.విండీస్‌తో టెస్టులకు బంగ్లా జట్టునజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, మోమినుల్ హక్ షోరబ్, మహిదుల్ ఇస్లాం అంకోన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లాం, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్ , హసన్ మహమూద్, నహిద్ రాణా, హసన్ మురాద్చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్ -
ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాభవం.. అంతలోనే బంగ్లాదేశ్‌కు మరో ఎదురుదెబ్బ..!
షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు 11 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గెలవాల్సిన మ్యాచ్‌లో అనూహ్య పరిస్థితుల్లో ఓటమిని ఎదుర్కోవడంతో బంగ్లాదేశ్ జట్టు నిరాశలో కూరుకుపోయింది. ఆఫ్ఘన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ తన స్పిన్ మాయాజాలంతో (6/26) బంగ్లాదేశ్ భరతం పట్టాడు.ఈ ఘోర పరాభవం నుంచి కోలుకోక ముందే బంగ్లా జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కమ్ వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. వికెట్‌కీపింగ్ చేస్తున్న సమయంలో ముష్ఫికర్ చేతి వేలుకు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ చీఫ్ సెలెక్టర్ ఘాజీ అష్రఫ్ హొసేన్, ఆ జట్టు చీఫ్ ఫిజీషియన్ డాక్టర్ దేబశిష్ చౌదురి ధృవీకరించారు. గాయం కాస్త సీరియస్‌గానే ఉన్నట్లు వారు వెల్లడించారు.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ను మొహమ్మద్ నబీ (79 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 84 పరుగులు), హష్మతుల్లా షాహిది (92 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 52 పరుగులు) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. ఆఖర్లో టెయిలెండర్లు వేగంగా ఆడటంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఓ దశలో (132/3) సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ బంగ్లా చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఘజన్ఫర్ ధాటికి బంగ్లాదేశ్ చివరి 7 వికెట్లను 11 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఘజన్ఫర్ దెబ్బకు బంగ్లాదేశ్ 143 పరుగులకు కుప్పకూలి, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. -
Ban vs Afg ODIs: బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా అతడే
అఫ్గనిస్తాన్‌తో వన్డేలకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో పాల్గొననున్న పదిహేను మంది సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. ఈ క్రమంలో నజ్ముల్ హుసేన్ షాంటోనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు స్పష్టమైంది. కాగా ఇటీవల పాకిస్తాన్ గడ్డపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ సాధించిన బంగ్లాదేశ్ సారథిగా రికార్డులకెక్కాడు షాంటో.టెస్టులకు, టీ20లకు వేరే కెప్టెన్లు!అయితే, ఆ తర్వాత భారత పర్యటనలో టెస్టుల్లో 2-0తో క్లీన్‌స్వీప్ సహా.. స్వదేశంలో సౌతాఫ్రికాలో చేతిలోనూ టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది బంగ్లాదేశ్. ఈ నేపథ్యంలో షాంటో కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, బంగ్లా బోర్డు అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ షాంటో వన్డే సారథిగా కొనసాగేలా ఒప్పించినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడినే సారథిగా కొనసాగిస్తున్నట్లు తాజా ప్రకటనతో వెల్లడైంది. మరోవైపు.. టెస్టులకు మెహదీ హసన్ మిరాజ్, టీ20లకు టస్కిన్ అహ్మద్ లేదంటే తౌహీద్ హృదోయ్ సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ పర్యటనఇదిలా ఉంటే.. వన్డే సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ పర్యటనకు రానుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య షార్జా వేదికగా నవంబరు 6, నవంబరు 9, నవంబరు 11 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత కాలమానం ప్రకారం బంగ్లా- అఫ్గన్ మ్యాచ్‌లు సాయంత్రం ఐదు గంటలకు ఆరంభం కానున్నాయి.ఇక.. అఫ్గన్‌తో వన్డే సిరీస్ ఆడే జట్టులో పేసర్ సషీద్ రాణా తొలిసారి చోటు దక్కించుకోగా.. లిటన్ దాస్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక తంజీమ్ అహ్మద్ సైతం భుజం నొప్పి వల్ల విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే, సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సెలక్షన్‌కు అందుబాటులో ఉండలేదని బంగ్లా బోర్డు అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ తెలిపాడు.అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుసౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, జకీర్ హసన్, నజ్ముల్ హుసేన్ షాంటో(కెప్టెన్), ముష్ఫికర్ రహీం, మహ్మదుల్లా రియాద్, తౌహీద్ హృదోయ్, జాకెర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్(వైస్ కెప్టెన్), రిషాద్ హొసేన్, నసూం అహ్మద్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, నషీద్ రాణా. -
రబాడ దెబ్బకు ముష్ఫికర్‌కు ఫ్యూజులు ఔట్..!
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా పట్టు బిగించింది. మూడో రోజు లంచ్ విరామం సమయానికి బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ ఇంకా ఒక్క పరుగు వెనుకపడి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గట్టెక్కలేదు. ఆ జట్టు చేతిలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండున్నర రోజులకు పైగా ఆట మిగిలి ఉంది. మెహిది హసన్ (55), జాకెర్ అలీ (30) బంగ్లాదేశ్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరూ ఔటైతే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పరిసమాప్తమైనట్టే.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేసి 202 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కైల్ వెర్రిన్ అద్బుతమైన సెంచరీ (114) చేసి సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.THE SOUND. 🔊THE DELIVERY. 🥶KAGISO RABADA, YOU BEAUTY...!!!pic.twitter.com/ZuVxm1ovxq— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2024రబాడ దెబ్బ.. ముష్ఫికర్ అబ్బ..!ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పేసర్ రబాడ బంగ్లాదేశ్ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా వెటరన్ ముష్ఫికర్ రహీం పాలిట విలన్ అయ్యాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రబాడ ముష్ఫికర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ క్లీన్ బౌల్డ్ అయిన తీరు ఎలా వైరల్ అయ్యిందో.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సీన్ కూడా అలాగే వైరలవుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో రబాడ సంధించిన ఇన్ స్వింగర్ దెబ్బకు ముష్ఫికర్ మిడ్ వికెట్ గాల్లో పల్టీలు కొట్టింది. ఈ సీన్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. కాగా, రబాడ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 3, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు నేలకూల్చాడు. చదవండి: కేఎల్ రాహుల్‌ను వదిలేయనున్న లక్నో.. మయాంక్ యాదవ్‌కు 14 కోట్లు..? -
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డు
బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో బంగ్లాదేశ్ తరఫున 6000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా రహీం ఈ ఘనత సాధించాడు. రహీం 172 ఇన్నింగ్స్‌ల్లో 38.24 సగటున 6003* పరుగులు సాధించాడు. బంగ్లా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రహీం తర్వాత తమీమ్ ఇక్బాల్ (5134), షకీబ్ అల్ హసన్ (4609), మొమినుల్ హక్ (4269), హబీబుల్ బషార్ (3026) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ రహీం 31 పరుగులతో అజేయంగా ఉన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రహీంతో పాటు మహ్మదుల్ హసన్ జాయ్ (38) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ ఇంకా 101 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌కీపర్ కైల్ వెర్రిన్ సూపర్ సెంచరీతో (114) సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. వెర్రిన్‌కు వియాన్ ముల్దర్ (54), డీన్ పైడిట్ (32) సహకరించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జీ (30), ర్యాన్ రికెల్టన్ (27), ట్రిస్టన్ స్టబ్స్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం ఐదు వికెట్లు తీయగా.. హసన్ మహమూద్ 3, మెహిది హసన్ మిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.చదవండి: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. కష్టాల్లో బంగ్లాదేశ్ -
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం
బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తమ దేశం తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. టీమిండియాతో తొలి టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ 2005లో బంగ్లాదేశ్ తరఫున అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు 90 టెస్టులు, 271 వన్డేలు, 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులో 5892, వన్డేల్లో 7792, టీ20లలో 1500 పరుగులు సాధించాడు. అయితే, టీమిండియాతో తాజా టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ముష్ఫికర్ పెద్దగా రాణించలేకపోయాడు.తమీమ్ ఇక్బాల్‌ను అధిగమించితొలి ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 13 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అయితే, మొత్తంగా 21 పరుగులు చేయగలిగిన ముష్ఫికర్.. తన అంతర్జాతీయ కెరీర్లో 15,196 రన్స్ పూర్తి చేసుకున్నాడు. తద్వారా తమీమ్ ఇక్బాల్(15192)ను అధిగమించి.. బంగ్లాదేశ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.ఇంకో 357 పరుగులు అవసరంఇదిలా ఉంటే.. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యం విధించింది. కాగా శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లా.. 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలుపొందాలంటే ఇంకో 357 పరుగులు అవసరం. టీమిండియా బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒకటి, రవిచంద్రన్ అశ్విన్‌కు మూడు వికెట్లు తీశారు. ఇదిలా ఉంటే.. వెలుతురులేమి కారణంగా శనివారం అరగంట ముందుగానే ఆటను ముగించడం గమనార్హం. బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు15196- ముష్ఫికర్ రహీం *15192- తమీమ్ ఇక్బాల్14696- షకీబ్ అల్ హసన్10694- మహ్మదుల్లాచదవండి: భారీ లక్ష్యం.. బంగ్లాదేశ్ ఒక్కటీ గెలవలేదు!.. టీమిండియాదే విజయం! -
పాక్‌ను చిత్తు చేశాం.. భారత్‌తో సిరీస్‌కు సిద్ధం: బంగ్లా కెప్టెన్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్‌ను సొంతగడ్డపై ఓడించి తొలిసారి.. ఆ జట్టుపై టెస్టు సిరీస్ విజయం సాధించింది. స్వదేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాక్ పర్యటన సాగుతుందా లేదోనన్న సందేహాల నడుమ.. అక్కడికి వెళ్లడమే కాదు ఏకంగా ట్రోఫీ గెలిచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నజ్ముల్ షాంటో బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఆరు వికెట్ల తేడాతో ఓడించికాగా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ 2023- 25 సీజన్లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్.. మంగళవారం ముగిసిన రెండో మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.మాటలు రావడం లేదుఈ క్రమంలో చారిత్మక విజయంపై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో మాట్లాడుతూ.. ‘‘ఈ గెలుపు మాకెంతో కీలకమైనది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. చాలా చాలా సంతోషంగా ఉంది. పాకిస్తాన్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నాం. అందుకు తగ్గట్లుగానే జట్టులోని ప్రతి ఒక్కరు తమ పాత్రను చక్కగా పోషించి ఈ గెలుపునకు కారణమయ్యారు.మా జట్టు అద్బుతంగా ఆడింది. ముఖ్యంగా రెండో టెస్టులో మా పేసర్లు అత్యుత్తమంగా రాణించడం వల్లే అనుకున్న ఫలితం రాబట్టగలిగాం. గెలవాలన్న కసి, పట్టుదల మమ్మల్ని ఈస్థాయిలో నిలిపాయి. తదుపరి టీమిండియాతో తలపడబోతున్నాం. ఆ సిరీస్ కూడా ఎంతో ముఖ్యమైనది. టీమిండియాతో సిరీస్‌కు సిద్ధంఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో భారత్‌లో అడుగుపెడతాం. టీమిండియాతో సిరీస్‌లో ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్ అత్యంత కీలకం కానున్నారు. ఇక మిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అతడు ఐదు వికెట్లు పడగొట్టిన తీరు అద్భుతం. భారత్‌తో మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతం చేస్తాడని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. టీమిండియాతో సిరీస్‌కు ముందు పాక్‌ను క్లీన్‌స్వీప్ చేయడం తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని నజ్ముల్ షాంటో తెలిపాడు.కాగా సెప్టెంబరు 19 నుంచి రోహిత్ సేనతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు స్కోర్లువేదిక: రావల్పిండిటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 274 ఆలౌట్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 262 ఆలౌట్పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 172 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 185/4ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్‌పై బంగ్లా గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లిటన్ దాస్ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: మెహదీ హసన్ మిరాజ్చదవండి: సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ -
పాక్‌పై సూపర్ సెంచరీ.. బంగ్లా తొలి బ్యాటర్‌గా రికార్డు
పాకిస్తాన్‌తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం అద్భుత శతకం(191)తో అలరించాడు. ఆతిథ్య జట్టు బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి పట్టుదలగా క్రీజులో నిలబడి సెంచరీతో కదం తొక్కాడు. టెస్టుల్లో అతడికి ఇది పదకొండో సెంచరీ. అయితే, దురదృష్టవశాత్తూ డబుల్ సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.అయినప్పటికీ జట్టును మాత్రం పటిష్ట స్థితిలో నిలపగలిగాడు ముష్ఫికర్ రహీం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన పర్యాటక బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాక్ బ్యాటర్ల శతకాలుబంగ్లా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసిన అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ సయీమ్ అయూబ్(56) రాణించగా.. సౌద్ షకీల్(141), మహ్మద్ రిజ్వాన్(171 నాటౌట్) శతకాలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(93) శుభారంభం అందించాడు.అయితే, మరో ఓపెనర్ జాకిర్ హసన్(12), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో(16) పూర్తిగా నిరాశపరిచారు. వీరి తర్వాతి స్థానాల్లో వచ్చిన మొమినుల్ హక్(50) అర్ధ శతకం సాధించగా.. ముష్ఫికర్ రహీం విశ్వరూపం ప్రదర్శించాడు. మొత్తంగా 341 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 191 పరుగులు సాధించాడు.బంగ్లా తొలి బ్యాటర్‌గా రికార్డు ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో పదిహేను వేల పరుగుల మైలురాయిని దాటేశాడు ముష్ఫికర్ రహీం. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బంగ్లా బ్యాటర్‌గానూ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున 2005లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు 80 టెస్టుల్లో 11 శతకాలు, 3 ద్విశతకాల సాయంతో 5867, 271 వన్డేల్లో 9 సెంచరీల సాయంతో 7792 రన్స్, 102 టీ20లలో 1500 పరుగులు సాధించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పాక్- బంగ్లా తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో భాగంగా.. ముష్ఫికర్‌తో పాటు లిటన్ దాస్(56), మెహదీ హసన్ మిరాజ్(71 బ్యాటింగ్) రాణించడంతో బంగ్లాదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది. 167.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 565 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం సంపాదించింది.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు తుదిజట్లుపాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఆఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, నసీం షా, ఖుర్రం షెహజాద్, మహ్మద్ అలీ.బంగ్లాదేశ్నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మన్ ఇస్లాం, జాకిర్ హసన్, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నహీద్ రాణా.Mushfiqur Rahim completes his 11th Test century, much to the delight of his teammates and fans 🇧🇩🏏#PAKvBAN | #TestOnHai pic.twitter.com/jWqAX7YVdR— Pakistan Cricket (@TheRealPCB) August 24, 2024 -
రావల్పిండి టెస్టు.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న బంగ్లాదేశ్
రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాను ఆదిలోనే పేసర్ ఖుర్రం షాజాద్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ జకీర్ హోస్సేన్, కెప్టెన్ శాంటోను ఔట్ చేసి బంగ్లాను బ్యాక్ ఫుట్‌లో ఉంచే ప్రయత్నం చేశాడు. కానీ షాద్మాన్ ఇస్లాం(93), మోమినుల్ హక్(50) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి పాక్ బౌలర్లకు ధీటుగా బదులిచ్చారు. షాద్మాన్, మోమినుల్ ఔటైన తర్వాత వారి బాధ్యతను లిట్టన్ దాస్, ముష్పికర్ రహీమ్ తీసుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా మూడో రోజు ఆటను ముగించారు. మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ కంటే బంగ్లా ఇంకా 132 పరుగులు వెనకబడి ఉంది.ప్రస్తుతం క్రీజులో లిట్టన్ దాస్(52), ముష్పికర్ రహీమ్(55) పరుగులతో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఖుర్రం షాజాద్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీం షా, అయూబ్, మహ్మద్ అలీ తలా వికెట్ సాధించారు. కాగా పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 448/6 వద్ద డిక్లేర్ చేసింది. -
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ
మార్చి 22 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు, సీనియర్ వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. శ్రీలంకతో నిన్న జరిగిన మూడో వన్డే సందర్భంగా రహీం కుడి చేతి బొటన వేలుకి గాయం కాగా.. ఎంఆర్ఐ రిపోర్ట్‌లో ఫ్రాక్చర్ అని తేలింది. దీంతో అతను అర్దంతరంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. రహీంకు ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించాల్సి ఉంది. 36 ఏళ్ల రహీం బంగ్లాదేశ్ టెస్ట్ జట్టులో కీలక సభ్యుడు. అతను ఇప్పటివరకు 88 టెస్ట్‌లు ఆడి 3 డబుల్ సెంచరీలు, 10 సెంచరీలు, 27 అర్దసెంచరీల సాయంతో 5676 పరుగులు చేశాడు. నిన్న శ్రీలంకపై వన్డే సిరీస్ విజయానంతరం రహీం హంగామా చేశాడు. స్వదేశంలో శ్రీలంకను మట్టికరిపించిన ఆనందంలో రహీం శ్రీలంక ఆటగాళ్లను ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ప్రవర్తించాడు. During World Cup - Mathews was timed out vs Bangladesh due to helmet issue. After the T20I series - Sri Lanka celebrated the win with a timed-out move. Now after the ODI series - Mushfiqur bought his helmet to celebrate the win. This is Cinema. 😁👌pic.twitter.com/qgDXgY6FmN — Johns. (@CricCrazyJohns) March 18, 2024 గతంలో శ్రీలంక ఆటగాళ్లు చేసిన ఓవరాక్షన్‌కు ప్రతిగా హెల్మట్ పట్టుకుని రీకౌంటర్ ఇచ్చాడు. ఈ ఉదంతం నిన్నటి నుంచి నెట్టింట హల్చల్ చేస్తుంది. బంగ్లాదేశ్, శ్రీలంక ఆటగాళ్లకు మైదానంలో కౌంటర్‌కు రీకౌంటర్ ఇచ్చుకోవడం కొత్తేమీ కాదు. కాగా, శ్రీలంకతో నిన్న జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో శ్రీలంకను మట్టికరిపించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 40.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను చేతిక్కించుకుంది. -
శ్రీలంక, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య కొనసాగుతున్న "రివెంజ్ వార్"
ఇటీవలికాలంలో శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య ప్రతీకార చర్యలు ఎక్కువై పోయాయి. ఈ ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో ఎప్పుడు ఎదురుపడ్డా కొట్టుకున్నంత పని చేస్తున్నారు. వన్డే వరల్డ్‌కప్ 2023 సందర్భంగా మొదలైన ఈ రివెంజ్ వార్.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ అనంతరం పతాక స్థాయి చేరింది. THE CINEMA OF WORLD CRICKET. - The Nagin Rivalry. 😄💪 pic.twitter.com/hiNpdUD0MD — Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హెల్మెట్ సమస్య కారణంగా లంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్డ్ అవుట్‌గా ప్రకటించారు. బంగ్లా ఆటగాళ్ల అనైతిక అప్పీల్ కారణంగా ఆ మ్యాచ్‌లో మాథ్యూస్ అరుదైన రీతిలో ఔటయ్యాడు. During World Cup - Mathews was timed out vs Bangladesh due to helmet issue. After the T20I series - Sri Lanka celebrated the win with a timed-out move. Now after the ODI series - Mushfiqur bought his helmet to celebrate the win. This is Cinema. 😁👌pic.twitter.com/qgDXgY6FmN — Johns. (@CricCrazyJohns) March 18, 2024 అప్పట్లో బంగ్లా ఆటగాళ్ల అనైతికతను బహిరంగంగా ఎండగట్టిన లంక ఆటగాళ్లు తాజాగా జరిగిన ఓ సిరీస్ సందర్భంగా వారిపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్ నెగ్గిన లంకేయులు.. అనంతరం జరిగిన గెలుపు సంబురాల్లో "టైమ్డ్ అవుట్" అంశాన్ని సూచిస్తూ ఓవరాక్షన్ చేశారు. The Lanka-Bangla encounters never fail to impress us🦁🐯 📸: Fan Code pic.twitter.com/1EIlBcoQ5o — CricTracker (@Cricketracker) March 18, 2024 ఆ చర్యకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం బంగ్లాదేశ్‌కు ఇవాళ (మార్చి 18) వచ్చింది. వన్డే సిరీస్‌లో శ్రీలంకను 2-1 తేడాతో చిత్తు చేసిన అనంతరం బంగ్లాదేశ్ వెటరన్ ముష్ఫికర్ రహీం హెల్మట్‌ను పట్టుకుని శ్రీలంక టైమ్డ్ అవుట్ యాక్షన్‌కు రీకౌంటర్ ఇచ్చాడు. శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య జరుగుతున్న ఈ ప్రతీకార చర్యల యుద్దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ అంశానికి నెటిజన్లు "నాగిన్ రైవల్రీ" అని నామకరణం చేశారు. కాగా, శ్రీలంకతో ఇవాళ జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 40.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను చేతిక్కించుకుంది. -
Ban vs NZ: న్యూజిలాండ్‌కు మరో షాకిచ్చిన బంగ్లాదేశ్.. తొలిరోజే..
Bangladesh vs New Zealand, 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులోనూ న్యూజిలాండ్‌కు శుభారంభం లభించలేదు. తొలి ఇన్నింగ్స్ ఆతిథ్య జట్టును 172 పరుగులకే కట్టడి చేశామన్న సంతోషం కివీస్ జట్టుకు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజు ఆట ముగిసే సరికి అనూహ్యంగా బంగ్లాదేశ్ ఆధిక్యంలోకి వచ్చింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిల్హైట్లో జరిగిన తొలి మ్యాచ్‌లో కివీస్‌కు ఘోర పరభావం ఎదురైంది. బంగ్లాదేశ్ గడ్డపై మొదటిసారి ఆతిథ్య జట్టు చేతిలో.. అది కూడా 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా సత్తా చాటాలని భావిస్తోంది టిమ్ సౌథీ బృందం. ఇందులో భాగంగా ఢాకాలో బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాను 172 పరుగులకు కట్టడి చేసింది. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్ రెండు, సౌథీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆరంభంలోనే కివీస్‌కు షాక్ ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ టామ్ లాథమ్‌ను 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(11), వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(13)ను మెహిది హసన్ మిరాజ.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్(1)ను తైజుల్ అవుట్ చేశారు. ఆరో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ టామ్ బ్లండెల్‌ను హసన్ మిరాజ్ డకౌట్ చేయగా.. వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 12, ఎనిమిదో స్థానంలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో బుధవారం నాటి ఆట పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ 12.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 55 పరుగులు మాత్రమే చేసి వెనుకబడిపోయింది. హైలైట్స్ ఇవే ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం వింతైన పద్ధతిలో అవుట్ కావడం హైలైట్‌గా నిలిచింది. జెమీసన్ బౌలింగ్‌లో వికెట్ల దిశగా వెళ్తున్న బంతిని చేతితో ఆపి రహీం హ్యాండిలింగ్ ద బాల్ నిబంధన వల్ల పెవిలియన్ చేరాడు. మరోవైపు.. తొలిరోజు ఆటలోనే మొత్తంగా 15 వికెట్లు కూలడం మరో విశేషం. మొత్తానికి ఢాకా పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. ఇక న్యూజిలాండ్ ప్రస్తుతం బంగ్లా కంటే 117 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు! నా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: లారా Did Mushfiqur Rahim really need to do that? He's been given out for obstructing the field! This one will be talked about for a while... . .#BANvNZ pic.twitter.com/SC7IepKRTh — FanCode (@FanCode) December 6, 2023 -
అలా ఔటైన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన ముష్ఫికర్ రహీం
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 6) మొదలైన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్ల తర్వాత ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బంగ్లా టాపార్డర్ బ్యాటర్లంతా (హసన్ జాయ్ (14), జకీర్ హసన్ (8), షాంటో (9), మొమినుల్ హక్ (5)) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా.. ముష్ఫికర్ రహీం (35), షాదత్ హొసేన్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేసి జట్టును ఆదుకున్నారు. మెహిది హసన్ మీరజ్ (9 నాటౌట్), నురుల్ హసన్ (0 నాటౌట్) బంగ్లాను గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్, మిచెల్ సాంట్నర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా.. బంగ్లాదేశ్ వెటరన్ ఆటగాడు, ఆ జట్టు వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం ఓ అరుదైన పద్దతిలో ఔటయ్యాడు. బంతికి చేతితో అడ్డుకుని ముష్ఫికర్ పెవిలియన్‌కు చేరాడు. హ్యాండిల్ ద బాల్ నిబంధన మేరకు రహీం ఔటైనట్లు అంపైర్లు ప్రకటించారు. జేమీసన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేస్తున్న రహాం బంతిని డిఫెన్స్ ఆడగా అది కాస్త వికెట్లను ముద్దాడే దిశగా వెళ్లింది. దీంతో అప్రమత్తమైన రహీం బంతి వికెట్లు తాకకుండా అడ్డుకున్నాడు. టెస్ట్‌ల్లో హ్యాండిల్ ద బాల్ నిబంధన ద్వారా ఔటైన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రహీం రికార్డుల్లోకెక్కాడు. Mushfiqur Rahim becomes the first Bangladesh player to be dismissed for handling the ball.pic.twitter.com/cMdWVcNpNt— CricTracker (@Cricketracker) December 6, 2023 టెస్ట్‌ల్లో ఓవరాల్‌గా ఈ నిబంధన ద్వారా ఇప్పటివరకు 11 మంది ఔటయ్యారు. రహీం 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రహీంకు ముందు మైఖేల్ వాన్, మహేళ జయవర్ధనే, మర్వన్ ఆటపట్టు, స్టీవ్ వా, గ్రహం గూచ్, డెస్మండ్ హేన్స్, మొహిసిన్ ఖాన్, ఆండ్రూ హిల్డిచ్, రసెల్ ఎండీన్, లియోనార్డ్ హట్టన్ హ్యాండిల్ ద బాల్ నిబంధన ద్వారా ఔటయ్యారు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో ఓటమిపాలై సిరీస్‌లో వెనుకపడి ఉంది. -
వరల్డ్‌కప్‌లో సూపర్ క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన షోర్ఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో.. ఆఖరి బంతికి కుశాల్ పెరీరా ఆఫ్ సైడ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ల వెనుక ఉన్న ముష్ఫికర్ రహీమ్ తన ఎడమవైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ సింగిల్ హ్యాండ్ క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్క షాక్‌కు గురయ్యాడు. ముష్పికర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో అసలంక(108) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు నిస్సాంక(41), సమరవిక్రమ(41) పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ సాకిబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్, షోర్ఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: #Timed Out: కనీవినీ ఎరుగని రీతిలో! మాథ్యూస్‌ను చూసి నవ్వుకున్న షకీబ్.. అలా అనుకున్న వాళ్లదే తప్పు! View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్‌కప్ హిస్టరీలో..
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బంగ్లా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్- టీమిండియాతో పుణె వేదికగా మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 27.4 ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఓపెనర్ లిటన్ దాస్(66) అవుట్ కాగా.. ముష్ఫికర్ రహీం క్రీజులోకి వచ్చాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు.. 29.4 ఓవర్ వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రెండు పరుగులు తీశాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా ముష్ఫికర్ రహీం కంటే ముందు ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ తరఫున ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు షకీబ్ వరల్డ్‌కప్ చరిత్రలో 1201 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. 42.3 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇక ముష్ఫికర్ రహీం 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్(42.3)లో అవుటయ్యాడు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా ఇప్పటి వరకు రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు. చదవండి: Hardik Pandya Injury Update: టీమిండియాకు భారీ షాక్.. పాండ్యాకు గాయం.. బీసీసీఐ ప్రకటన View this post on Instagram A post shared by ICC (@icc) -
నేనెప్పుడు విరాట్ జోలికి పోను.. అతన్ని రెచ్చగొడితే ఏం చేస్తాడో తెలుసు..!
బంగ్లాదేశ్ వెటరన్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 19) జరుగబోయే మ్యాచ్‌కు ముందు అతను స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ కోహ్లి ఆన్ ఫీల్డ్ మనస్తత్వంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా స్లెడ్జింగ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ముష్ఫికర్ మాట్లాడుతూ.. సాధారణంగా కోహ్లి బ్యాటింగ్ చేసేప్పుడు చాలా నెమ్మదిగా ఉంటాడని, పొరపాటున అతన్ని ఎవరైనా స్లెడ్జ్ చేస్తే అతనిలోని అత్యుత్తమ ప్రదర్శన బయటివచ్చి ఉగ్రుడిలా మారిపోతాడని అన్నాడు. అందుకే నేనెప్పుడూ కోహ్లిని స్లెడ్జ్ చేసే సాహసం చేయనని.. మా బౌలర్లకు కూడా ఇదే చెబుతానని తెలిపాడు. సహజంగానే కోహ్లి ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోవాలని అనుకోడని, స్లెడ్జింగ్ చేస్తే అతను మరింత రెచ్చిపోయి, అదనపు సంకల్పంతో బ్యాటింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. ప్రపంచంలో ఏ ఆటగాడినైనా స్లెడ్జింగ్ చేసి తమకనుకూలంగా ఫలితం రాబట్టవచ్చు కానీ, కోహ్లి ముందు ఆ పప్పులు ఉడకవని అన్నాడు. 36 ఏళ్ల ముష్ఫికర్ రహీం తన 17 ఏళ్ల కెరీర్లో కోహ్లిని చాలా దగ్గరగా చూశాడు. కోహ్లితో అతనికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో రహీం.. కోహ్లికి సంబంధించి తన అనుభవాలను పంచుకున్నాడు. ఇదిలా ఉంటే, పూణే వేదికగా ఇవాళ జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. టీమిండియాను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో (ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్) జయభేరి మోగించిన భారత్.. ఇవాల్టి మ్యాచ్‌లోనూ గెలుపుపై కన్నేసింది. మరోవైపు బంగ్లాదేశ్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు (ఆఫ్ఘనిస్తాన్), రెండు పరాజయాలతో (ఇంగ్లండ్, న్యూజిలాండ్) పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. భారత్.. న్యూజిలాండ్ తర్వాత రెండో స్థానంలో ఉంది. -
WC 2023: ముష్ఫికర్- షకీబ్ సరికొత్త చరిత్ర.. సెహ్వాగ్- సచిన్ రికార్డు బ్రేక్
ICC Cricket World Cup 2023- New Zealand vs Bangladesh: బంగ్లాదేశ్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీం- షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అరుదైన ఘనత సాధించారు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ జోడీ వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్.. తమ మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్(ఎంఏ చిదంబరం స్టేడియం) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సెంచరీ భాగస్వామ్యంతో.. ఈ క్రమంలో తొలి బంతికే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఓపెనర్ లిటన్ దాస్ డకౌట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ తాంజిద్ హసన్ 16 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ మెహిదీ హసన్ మిరాజ్ 30 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నజ్ముల్ హొసేన్ షాంటో(7) పూర్తిగా నిరాశపరిచాడు. ఇలా 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును కెప్టెన్ షకీబ్ అల్ హసన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం ఆదుకున్నారు. అద్భుత భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేసేందుకు బాటలు వేశారు. షకీబ్ 51 బంతుల్లో 40 రన్స్ తీయగా.. ముష్ఫికర్ రహీం 75 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించాడు. అత్యధిక పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీగా.. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అరుదైన భాగస్వామ్య రికార్డు నెలకొల్పారు. ఇద్దరూ కలిపి 19 ఇన్నింగ్స్‌లో 972 పరుగుల పార్ట్నర్షిప్ సాధించారు. తద్వారా సెహ్వాగ్- సచిన్‌ల రికార్డును అధిగమించారు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్ కలిపి 20 ఇన్నింగ్స్‌లో 971 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఈ జాబితాలో 20 ఇన్నింగ్స్‌లో 1220 పరుగుల భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా మాజీ స్టార్లు ఆడం గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బంగ్లా, టీమిండియా జోడీలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరో రికార్డు.. ఇది సమంగా.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక 50+ పార్ట్నర్షిప్స్ నమోదు చేసిన జోడీలు ఆడం గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్- 12 వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్- 8 ముష్ఫికర్ రహీం- షకీబ్ అల్ హసన్- 8. కాగా కివీస్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు స్కోరు చేసింది. చదవండి: ‘శార్దూల్ ఎందుకు? సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
సరిపోని ఐర్లాండ్ పోరాటం.. బంగ్లాదేశ్ ఖాతాలో మరో సిరీస్
ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్.. ప్రస్తుత పర్యటనలో ఐర్లాండ్‌ను మూడు ఫార్మాట్లలో మట్టికరిపించి, సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో జగజ్జేత ఇంగ్లండ్‌ను సైతం ఓ ఆట ఆడుకున్న (3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్) బంగ్లా టైగర్స్.. తాజాగా పసికూన ఐర్లాండ్‌పై అదే స్థాయిలో రెచ్చిపోయారు. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న ఆ జట్టు.. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో, టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది. మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగు రోజుల్లో ముగిసిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ అద్భుతంగా పోరాడినప్పటికీ, ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 286/8 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. మరో 6 పరుగులు మాత్రమే జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ముందు ఫైటింగ్ టార్గెట్ ఉంచుతుందని భావించిన ఐర్లాండ్ ఆఖరి 2 వికెట్లు వెంటవెంటనే కోల్పోయి ఓటమిని అప్పుడే పరోక్షంగా అంగీకరించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన (126) ముష్ఫికర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ (51 నాటౌట్) అర్ధసెంచరీ సాధించి, తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొమినుల్ హాక్ 20 పరుగులతో అజేయంగా నిలువగా.. తమీమ్ ఇక్బాల్ (31), లిటన్ దాస్ (23) జట్టు విజయంలో తలో చేయి వేశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ వికెట్‌కీపర్ టకెర్ (108) సెంచరీ పోరాటం వృధా అయ్యింది. స్కోర్ వివరాలు.. ఐర్లాండ్: 214 & 292 బంగ్లాదేశ్: 369 & 138/3 -
లేటు వయసులో ఇరగదీస్తున్న బంగ్లా బ్యాటర్.. వరుస సెంచరీలు
BAN VS IRE Test Match: బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ 35 ఏళ్ల ముష్ఫికర్ రహీం లేటు వయసులో కుర్రాళ్లకు మించి రెచ్చిపోతున్నాడు. ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన రహీం (తొలి ఇన్నింగ్స్‌లో 126) వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో చివరిసారిగా బ్యాటింగ్ (ఐర్లాండ్‌తో మూడో వన్డేలో రహీంకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా.. ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రహీం ఆడలేదు) చేసిన రహీం.. ఫలితం తేలకుండా ముగిసిన ఆ మ్యాచ్‌లో 60 బంతుల్లోనే అజేయమైన శతకాన్ని బాది శభాష్ అనిపించకున్నాడు. తాజా సెంచరీతో టెస్ట్‌ల్లో 10వ సెంచరీ నమోదు చేసిన రహీం.. తన జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు చాపచుట్టేయగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల భారీ స్కోర్ చేసి 155 పరుగుల ఆధిక్యం సాధించింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ టెక్టార్ (50) అర్ధసెంచరీతో రాణించగా.. బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం 5 వికెట్లతో చెలరేగాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో రహీంతో పాటు షకీబ్ అల్ హసన్ (87), మెహిది హసన్ (55) రాణించగా.. ఐరిష్ బౌలర్ ఆండీ మెక్‌బ్రైన్ 6 వికెట్లతో సత్తా చాటాడు. రెండో రోజు మూడో సెషన్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. పరుగులేమీ చేయకుండానే నాలుగో బంతికే వికెట్ కోల్పోయింది. జేమ్స్ మెక్కొల్లమ్ను షకీబ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. -
అరుదైన క్లబ్లో చేరిన తమీమ్ ఇక్బాల్.. తొలి బంగ్లాదేశీగా రికార్డు
బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన 34వ పుట్టిన రోజున ఓ అరుదైన క్లబ్లో చేరాడు. బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా, ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 40వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సిల్హెట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో తమీమ్ ఈ మైలురాయిని అధిగమించాడు. Congratulation Tamim Iqbal on becoming the first Bangladeshi batsman to complete 15000 runs in International Cricket. 🔥🏏#BCB | #Cricket pic.twitter.com/J4mj5W8k9T — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి రనౌటైన తమీమ్ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 15000 పరుగుల మైలురాయిని టచ్ చేశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తమీమ్.. ఇప్పటికే అత్యధిక సెంచరీలు, అత్యధిక వన్డే పరుగులు, టీ20ల్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశీగా రికార్డు, బంగ్లాదేశ్ తరఫున 3 ఫార్మట్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా పలు రికార్డులు కలిగి ఉన్నాడు. తమీమ్ ఖాతాలో 3 ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 25 సెంచరీలు ఉన్నాయి. మరే బంగ్లాదేశీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో ఇన్ని సెంచరీలు చేయలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 383 మ్యాచ్‌లు ఆడిన తమీమ్ 15009 పరుగులు చేశాడు. తమీమ్.. 69 టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 5082 పరుగులు, 235 వన్డేల్లో 14 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీల సాయంతో 8146 పరుగులు, 78 టీ20ల్లో సెంచరీ, 7 హాఫ్ సెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో రెండో వన్డేలో ముష్ఫికర్ రహీం సునామీ శతకంతో (60 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్), లిటన్ దాస్ (71 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హొస్సేన్ షాంటో (77 బంతుల్లో 73; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తౌహిద్ హ్రిదొయ్ (34 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 349 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. బంగ్లాదేశ్‌కు ఇది వన్డేల్లో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కాగా, ఇన్ని రికార్డులు నమోదైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో బంగ్లాదేశ్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పూర్తివగానే మొదలైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ రికార్డు స్కోర్
BAN VS IRE 2nd ODI: సిల్హెట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ వెటరన్ ముష్ఫికర్ రహీం సునామీ శతకం సాధించాడు. కేవలం 60 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. Mushfiqur Rahim 100 not out off 60 balls. Fastest hundred in ODIs for Bangladesh.#BCB | #Cricket | #BANvIRE. pic.twitter.com/NtjZXAR7a5 — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 ఈ క్రమంలో బంగ్లా టైగర్స్ వన్డేల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు కూడా నెలకొల్పారు. ముష్ఫికర్ మెరుపు సెంచరీతో పాటు లిటన్ దాస్ (71 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హొస్సేన్ షాంటో (77 బంతుల్లో 73; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తౌహిద్ హ్రిదొయ్ (34 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 349 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. Just days after posting their highest ever ODI score of 338 in the first ODI, Bangladesh have broken it again with 349/6 in the second ODI! Mushfiqur Rahim brings up a 60-ball century - the quickest for his nation - with the last ball of the innings #BANvIRE — 🏏Flashscore Cricket Commentators (@FlashCric) March 20, 2023 వన్డేల్లో బంగ్లాదేశ్‌కు ఇదే అత్యధిక స్కోర్. రోజుల వ్యవధిలోనే బంగ్లాదేశ్ అత్యధిక టీమ్ స్కోర్ రికార్డును బద్దలుకొట్టడం విశేషం. ఇదే సిరీస్‌లో మార్చి 18న ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 338 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. 2 రోజుల గ్యాప్‌లోనే రికార్డును మెరుగుపర్చుకుంది. Mushfiqur Rahim became the 3rd Bangladeshi batsman to complete 7000 runs in ODIs after Tamim Iqbal and Shakib Al Hasan during the second ODI against Ireland. 🔥#BCB | #Cricket | #BANvIRE pic.twitter.com/xdat9MLMfS — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 6వ స్థానంలో బరిలోకి దిగిన ముష్ఫికర్ ఆకాశమే హద్దుగా చెలరేగి వన్డే కెరీర్లో 9వ సెంచరీ నమోదు చేయడంతో పాటు 7000 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. తద్వారా తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బంగ్లా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీతో ముష్ఫికర్ మరో రికార్డు కూడా సాధించాడు. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో తమీమ్ ఇక్బాల్ 14 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. ముష్ఫికర్ (9), షకీబ్ (9)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. కాగా, ఇన్ని రికార్డులు నమోదైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో బంగ్లాదేశ్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పూర్తివగానే మొదలైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
టీ20లకు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్
పొట్టి క్రికెట్ నుంచి సీనియర్లు వరుసగా వైదొలుగుతుండటంతో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చ లేక వరుస పరాజయాల బాట పట్టిన బంగ్లాదేశ్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. ఆ జట్టు మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, స్టార్ వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం.. పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆదివారం ట్విటర్ వేదికగా ప్రకటన విడుదల చేశాడు. టెస్ట్‌లు, వన్డేలపై ఫోకస్ పెట్టేందుకు టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు రహీం వెల్లడించాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకున్నా.. ఫ్రాంచైజీ క్రికెట్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. I would like to announce my retirement from T20 INTERNATIONALS and focus on Test and ODI formats of the game. I will be available to play franchise leagues when the opportunity arrives. Looking forward to proudly represent my nation in the two formats-MR15 — Mushfiqur Rahim (@mushfiqur15) September 4, 2022 రహీం.. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో బ్యాటింగ్, వికెట్‌కీపింగ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన (1, 4 పరుగులు) కనబర్చి జట్టు పరాజయాలకు పరోక్ష కారణంగా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో కీలక సమయంలో క్యాచ్‌ను జారవిడిచి తన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడానికి కారణమయ్యాడు. కాగా, తమ కంటే చిన్న జట్ల చేతుల్లో కూడా వరుస పరాజయాలు ఎదుర్కొంటూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ ఈ ఏడాది ఇది రెండో షాక్ అని చెప్పాలి. ఇదే ఏడాది జులైలో సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ టీ20లకు గుడ్‌బై చెప్పి తొలి షాకివ్వగా.. తాజాగా ముష్ఫికర్ బంగ్లాను మరో దెబ్బేశాడు. 35 ఏళ్ల ముష్ఫికర్.. బంగ్లా తరఫున 82 టెస్ట్‌ల్లో 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5235 పరుగులు, 236 వన్డేల్లో 8 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీల సాయంతో 6774 పరుగులు, 102 టీ20ల్లో 115 స్ట్రయిక్ రేట్‌తో 6 హాఫ్ సెంచరీ సాయంతో 1500 పరుగులు సాధించాడు. వికెట్‌కీపింగ్‌లో రహీం అన్ని ఫార్మాట్లలో కలిపి 449 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. చదవండి: 'ఆసియా కప్‌లా లేదు.. బెస్ట్ ఆఫ్ త్రీ ఆడుతున్నట్లుంది' -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్లెవరంటే?
ఏప్రిల్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో అవార్డుకు ఈ అవార్డు కోసం ముగ్గురు ఆసియా క్రికెటర్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. వారిలో శ్రీలంక సీనియర్ ఆల్-రౌండర్ ఏంజెలో మాథ్యూస్, వెటరన్ బంగ్లాదేశ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్, శ్రీలంక యువ పేసర్ అసిత ఫెర్నాండో ఉన్నారు. ఇక మహిళల విభాగం నుంచి పాకిస్తాన్ యువ క్రికెటర్ తుబా హసన్, పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్, జెర్సీకి చెందిన ట్రినిటీ స్మిత్ ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఐసీసీ నామినేట్ చేసింది. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏంజెలో మాథ్యూస్ అధ్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో మాథ్యూస్ 344 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఇదే టెస్టు సిరీస్‌లో బంగ్లా వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అద్బుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో 303 పరుగులు రహీమ్ సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 5వేల పరుగుల సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ టెస్టు సిరీస్‌లో శ్రీలంక యువ పేసర్ అసిత ఫెర్నాండో తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. రెండు టెస్టుల్లో కలిపి 13 వికెట్లు పడగొట్టాడు. ఇక మహిళల విభాగంలో అవార్డుకు నామినేట్ అయిన పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్,తుబా హసన్.. ఇటీవల ముగిసిన శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టారు. అదే విధంగా జెర్సీకి చెందిన ట్రినిటీ స్మిత్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఫ్రాన్స్‌పై దుమ్మురేపింది. చదవండి: '10 వేల పరుగులు పూర్తి చేయడం.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లే' -
BAN Vs SL: బంగ్లాదేశ్ 365 ఆలౌట్
Bangladesh Vs Sri Lanka Test Series 2022- ఢాకా: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 116.2 ఓవర్లలో 365 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 277/5తో రెండో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ 88 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. ముష్ఫికర్ రహీమ్ (175 నాటౌట్; 21 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. ఇక లిటన్ దాస్ (141; 16 ఫోర్లు, 1 సిక్స్) తన వ్యక్తిగత ఓవర్‌నైట్ స్కోరుకు 26 పరుగులు జతచేసి అవుటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత ఐదు వికెట్లు, అసిథ ఫెర్నాండో నాలుగు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 2 వికెట్లకు 143 పరుగులు చేసింది. కాగా మొదటి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. చదవండి👉🏾 IPL 2022 GT Vs RR: అరంగేట్రంలోనే అదుర్స్.. అహ్మదాబాద్‌కు చలో చలో! చదవండి👉🏾Womens T20 Challenge: చెలరేగిన షఫాలీ.. హర్మన్‌ప్రీత్ సేనకు తప్పని పరాజయం -
BAN VS SL: సెంచరీలతో చెలరేగిన ముష్ఫికర్, లిటన్ దాస్
ఢాకా: శ్రీలంకతో సోమవారం మొదలైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్లకు 277 పరుగులు చేసింది. ఒకదశలో బంగ్లాదేశ్ 24 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ముష్ఫికర్ రహీమ్ (115 బ్యాటింగ్; 13 ఫోర్లు), లిటన్ దాస్ (135 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీలతో చెలరేగి బంగ్లాదేశ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 253 పరుగులు జోడించారు. -
వెస్టిండీస్ పర్యటనకు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్..!
వెస్టిండీస్ పర్యటనకు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు వెటరన్ వికెట్ ముష్ఫికర్ రహీమ్ వ్యక్తిగత కారణాలతో వెస్టిండీస్ సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడితో పాటు టాస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం,నయీమ్ ఇస్లాం వంటి కీలక ఆటగాళ్లు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. "ముష్ఫికర్ వెస్టిండీస్ టూర్‌కు అందుబాటులో ఉండడు. ఎందుకంటే అతడు తన కుటంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లనున్నాడు "అని బంగ్లాదేశ్ జట్టు డైరెక్టర్ ఖలీద్ మహ్మద్ పేర్కొన్నాడు. ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. జూన్ 16న ఆంటిగ్వా వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇక ప్రస్తుతం శ్రీలంకతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లు టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇరు జట్లు మధ్య తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీమ్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో 5,000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రహీమ్ నిలిచాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్-2022లో టాప్ రన్ స్కోరర్స్ వీళ్లే.. -
"నన్ను డాన్ బ్రాడ్‌మన్‌తో పోలుస్తారు.." ప్రగల్భాలు పలికిన బంగ్లా వికెట్ కీపర్
శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ ఓ అరుదైన రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (105) చేసిన రహీమ్.. టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు సాధించానన్న గర్వంతో ఊగిపోతున్న రహీమ్ తాజాగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌లో తనను క్రికెట్ మాంత్రికుడు డాన్ బ్రాడ్‌మన్‌తో పోలుస్తారంటూ రహీమ్ ప్రగల్భాలు పలికాడు. ఈ సందర్భంగా రహీమ్ మాట్లడుతూ.. బంగ్లాదేశ్ తరఫున 5 వేల టెస్టు పరుగులు చేసిన మొదటి ప్లేయర్‌గా నిలవడం గర్వంగా ఉంది. అయితే ఈ రికార్డును చాలామంది సీనియర్లు బద్దలు కొడతారు. బంగ్లా జట్టులో 8000, 10000 పరుగులు పూర్తి చేసే ఆటగాళ్లు కూడా ఉన్నారు. నేను బ్యాటింగ్ చేస్తుంటే బంగ్లాదేశీలకు బ్రాడ్‌మన్‌లా కనిపిస్తాను. అలా వారు అంటుంటే చాలా గర్వంగా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. బంగ్లాదేశ్ తరఫున 81 టెస్టులు ఆడిన ముష్ఫికర్ రహీమ్ 36.8 సగటున 3 డబుల్ సెంచరీలు, 8 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5037 పరుగులు చేశాడు. మరోవైపు ఆసీస్ ఆల్‌టైం గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ 52 టెస్టుల కెరీర్లో 99.94 సగటున 29 సెంచరీల సాయంతో 6996 పరుగులు చేశాడు. ఈ క్రికెట్ దిగ్గజంతో రహీమ్‌కు పోలికేంటీ అని నెటిజన్లు బంగ్లాదేశీ వికెట్‌కీపర్‌ను తూర్పారబెడుతున్నారు. చదవండి: BAN Vs SL Test: టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ అరుదైన రికార్డు! -
BAN Vs SL Test: టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ అరుదైన రికార్డు!
Mushfiqur Rahim achieved a wonderful milestone: బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా ఈ రికార్డు నమోదు చేశాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శ్రీలంక బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చిట్టోగ్రామ్ వేదికగా మొదటి టెస్టు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆటలో రహీమ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా రెండో సెషన్ సమయానికి అతడు 230 బంతులు ఎదుర్కొని 86 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక తమీమ్ ఇక్బాల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో ఈ అరుదైన రికార్డును చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 133 పరుగులు చేసిన అతడు టెస్టుల్లో 4981 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా మొదటి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 397 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ కొనసాగుతోంది. నాలుగో రోజు రెండో సెషన్ ఆరంభ సమయానికి 401 పరుగులు పూర్తి చేసుకుంది. చదవండి👉🏾IPL 2022: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్ చదవండి👉🏾IPL 2022: అతడి వల్లే సన్‌రైజర్స్‌కు విజయాలు.. బుమ్రా బౌలింగ్‌నూ చితక్కొట్టేస్తాడు! టీ20 సిరీస్‌కు ఎంపిక చేయండి! -
Eng Vs Ban: పాపం బంగ్లాదేశ్.. 29 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోరు!
England Beat Bangladesh By 8 Wickets Closer To Semis: టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చెలరేగుతోంది. గ్రూప్–1లో అదరగొట్టే విజయాలతో ప్రత్యర్థులను బెదరకొట్టేస్తోంది. వరుసగా రెండో విజయంతో సెమీఫైనల్ దిశగా మరో అడుగు వేసింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను చిత్తు చేసిన మోర్గాన్ బృందం రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దెబ్బకొట్టింది. అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అసాధారణ ప్రదర్శనతో దూసుకెళుతోంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. స్పిన్, పేస్, మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టుపై అల్రౌండ్ పిడుగులు కురిపించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ చేసిన 29 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోరు! ఇంకెవరినీ ఇంగ్లండ్ బౌలర్లు 20 పరుగులైనా చేయనివ్వలేదు. టైమల్ మిల్స్ మూడు, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్ 14.1 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జేసన్ రాయ్ (38 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించాడు. ఇంగ్లండ్ ‘పవర్’ప్లే... బంగ్లా డీలా! బంగ్లాకు టాస్ గెలిచిన ఆనందం బ్యాటింగ్‌కు దిగగానే ఆవిరైంది. కలిసొచ్చే పిచ్‌పై ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ తిప్పేశాడు. పేసర్ మిల్స్ కట్టడి చేశాడు. ఓపెనర్లు లిటన్ దాస్ (9), నైమ్ (5)లను అలీ వరుస బంతుల్లోనే పెవిలియన్ చేర్చగా, షకీబ్ (4)ను వోక్స్ ఔట్ చేశాడు. దీంతో ‘పవర్ ప్లే’లో బంగ్లా మూడు టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్లను కోల్పోతూనే ఇన్నింగ్స్ కుదేలైంది. ముష్ఫికర్ ఉన్నంతసేపు 10 ఓవర్లలో 6 పరుగుల రన్‌రేట్ కనిపించింది. 11వ ఓవర్లో 63 పరుగుల స్కోరు వద్ద అతన్ని లివింగ్‌స్టోన్ ఎల్బీగా పంపడంతో వికెట్ల పతనం మళ్లీ జోరందుకుంది. బ్యాటింగ్‌లో తల్లడిల్లిన బంగ్లా బౌలింగ్‌లో అయితే డీలా పడింది. ఓపెనర్ రాయ్ అటాకింగ్‌కు చెల్లాచెదురైంది. మరో ఓపెనర్ బట్లర్ (18; ఫోర్, సిక్స్)ను తక్కువ స్కోరుకే ఔట్ చేసిన బంగ్లాకు అదే తృప్తి మిగిలింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) లివింగ్‌స్టోన్ (బి) మొయిన్ అలీ 9; నైమ్ (సి) వోక్స్ (బి) మొయిన్ అలీ 5; షకీబ్ (సి) రషీద్ (బి) వోక్స్ 4; ముష్ఫికర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లివింగ్‌స్టోన్ 29; మహ్ముదుల్లా (సి) వోక్స్ (బి) లివింగ్‌స్టోన్ 19; ఆఫిఫ్ (రనౌట్) 5; నూరుల్ (సి) బట్లర్ (బి) మిల్స్ 16; మెహదీ హసన్ (సి) వోక్స్ (బి) మిల్స్ 11; నజుమ్ అహ్మద్ (నాటౌట్) 19; ముస్తఫిజుర్ (బి) మిల్స్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–14, 2–14, 3–26, 4–63, 5–73, 6–83, 7–98, 8–124, 9–124. బౌలింగ్: మొయిన్ అలీ 3–0–18–2, వోక్స్ 4–0–12–1, రషీద్ 4–0–35–0, జోర్డాన్ 2–0–15–0, టైమల్ మిల్స్ 4–0–27–3, లివింగ్‌స్టోన్ 3–0–15–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) నజుమ్ అహ్మద్ (బి) షోరిఫుల్ ఇస్లామ్ 61; బట్లర్ (సి) నైమ్ (బి) నజుమ్ అహ్మద్ 18; మలాన్ (నాటౌట్) 28; బెయిర్‌స్టో (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (14.1 ఓవర్లలో 2 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–39, 2–112. బౌలింగ్: షకీబ్ 3–0–24–0, ముస్తఫిజుర్ 3–0–23–0, షోరిఫుల్ ఇస్లామ్ 3.1–0–26–1, నజుమ్ అహ్మద్ 3–0–26–1, మెహదీ హసన్ 2–0–21–0. చదవండి: T20 World Cup 2021: మోకాలిపై కూర్చుంటాం... ఆ విషయం గురించి స్పందించలేను: వార్నర్ -
మే నెల మొనగాడు.. ఈ బంగ్లా ఆటగాడు
దుబాయ్: మే నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ దక్కించుకున్నాడు. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం పాకిస్తాన్‌కు చెందిన హసన్ అలీ, శ్రీలంకకు చెందిన ప్రవీణ్ జయవిక్రమ పోటీపడగా.. చివరకు ముష్ఫికర్ రహీమ్‌ను ఈ అవార్డు వరించింది. దీంతో ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలిచిన తొలి బంగ్లా ఆటగాడిగా ముష్ఫికర్ రహీమ్ రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ అవార్డు రేసులో నిలిచిన పాక్ యువ బౌలర్ హసన్ అలీ.. మే నెలలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల్లో 8.92 సగటుతో 14 వికెట్లు పడగొట్టగా, శ్రీలంక అరంగేట్ర బౌలర్ప్రవీణ్ జయవిక్రమ బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టులో మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. ఇక ముష్ఫికర్ రహీమ్.. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 79 సగటుతో 237 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎగురేసుకుపోయాడు. ఈ సిరీస్‌లో జరిగిన రెండో వన్డేలో రహీమ్ 125 పరుగులు సాధించడంతో బంగ్లా తొలిసారి లంకపై వన్డే సిరీస్ గెలిచింది. రహీమ్ ఈ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఐసీసీ ఓటింగ్ అకాడమీ సభ్యుడు వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. 15 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన తర్వాత కూడా ముష్ఫికర్ రహీమ్ పరుగుల దాహం తీరలేదని వ్యాఖ్యానించాడు. మరోవైపు మహిళల క్రికెట్లో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును స్కాట్లాండ్ ఆల్‌రౌండర్ కాథరిన్ బ్రైస్ దక్కించుకుంది. ఆమెకు గేబీ లూయిస్(ఐర్లాండ్), లీ పాల్(ఐర్లాండ్)ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. చదవండి: WTC Final: ‘కోహ్లి క్రేజ్ అలాంటిది మరి.. జాన్ సీన మద్దతు భారత్‌కే’! -
టీమిండియా క్రికెటర్లు లేకుండానే ఐసీసీ అవార్డులు
దుబాయ్: ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులకు వరుసగా రెండో నెల కూడా భారత క్రికెటర్లు నామినేట్ కాలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రకటిస్తూ వస్తున్న ఈ అవార్డులను తొలిసారి(జనవరి) టీమిండియా డాషింగ్ క్రికెటర్ రిషబ్ పంత్ దక్కించుకోగా, ఫిబ్రవరి నెలకు అశ్విన్, మార్చిలో భువనేశ్వర్ కుమార్, ఏప్రిల్ నెలకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ దక్కించుకున్నారు. కాగా, మే నెలకు గాను నామినేట్ అయిన పురుషులు, మహిళా క్రికెటర్ల జాబితాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. పురుషుల క్రికెట్లో హసన్ అలీ(పాకిస్థాన్), ప్రవీణ్ జయవిక్రమ(శ్రీలంక), ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్)లు నామినేట్ కాగా, మహిళల క్రికెట్లో క్యాథరిన్ బ్రైస్(స్కాట్లాండ్), గేబీ లూయిస్(ఐర్లాండ్), లీ పాల్(ఐర్లాండ్) నామినేట్ అయ్యారు. The ICC Men's Player of the Month nominees for May are in 👀 Hasan Ali 🇵🇰 14 Test wickets at 8.92 Praveen Jayawickrama 🇱🇰 11 Test wickets at 16.18 Mushfiqur Rahim 🇧🇩 237 ODI runs at 79.00 Vote now 🗳️ https://t.co/PPTfbb1PT5#ICCPOTM pic.twitter.com/C9IFIyI35A — ICC (@ICC) June 8, 2021 మే నెలలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల్లో పాక్ యువబౌలర్హసన్అలీ 8.92 సగటుతో 14 వికెట్లు పడగొట్టి ఈ నెల ఐసీసీ అవార్డుల రేసులో ముందుండగా, శ్రీలంక అరంగేట్ర బౌలర్ప్రవీణ్ జయవిక్రమ బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టులో ఏకంగా 11 వికెట్లు పడగొట్టి, హసన్‌అలీకి గట్టి పోటీగా నిలిచాడు. మరోవైపు బంగ్లా ఆటగాడు ముష్ఫికర్ రహీమ్.. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 79 సగటుతో 237 పరుగులు చేసి, తాను కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో ఉన్నానని సవాల్ విసురుతున్నాడు. ఈ సిరీస్‌లో జరిగిన రెండో వన్డేలో రహీమ్ 125 పరుగులు సాధించడంతో బంగ్లా తొలిసారి లంకపై వన్డే సిరీస్ గెలిచింది. చదవండి: టీమిండియాకు శుభవార్త.. ఆ మ్యాచ్ అయ్యాక 20 రోజులు రిలాక్స్ -
ఈసారి అడ్డువస్తే పక్కకు తోసేయ్..
కొలంబో: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పికర్ రహీమ్ మంగళవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. రహీమ్ సెంచరీతో 246 పరుగులు సాధించిన బంగ్లా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో లంకపై 103 పరగులుతో గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన రహీమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో రహీమ్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. కెప్టెన్ కుషాల్ పెరీరా వికెట్ కోల్పోయాకా క్రీజులోకి వచ్చిన నిసాంకతో కలిసి మరో ఓపెనర్ గుణతిలక ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. మెహదీ హసన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ చివరి బంతిని నిసాంకా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే నిసాంకా బ్యాట్‌కు తగిలిన బంతి హసన్వైపు వెళ్లింది. అయితే హసన్ బంతిని వదిలేసాడని భావించి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే గుణతిలక బంతిని డిఫెండ్ చేసే క్రమంలో హసన్‌కు అడ్డు వచ్చాడు. ఇది చూసిన రహీమ్.. ''ఈసారి అడ్డు వస్తే అతన్ని తోసేసి కింద పడేయ్'' అంటూ గట్టిగా అరిచాడు. ఇది స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. దీనికి సంబంధించిన ఒక వ్యక్తి తన ఫేస్బుక్లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రహీమ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడంతో ఈ విషయం పెద్దగా వెలుగులోకి రాలేదు. కాగా ఇరు జట్ల మధ్య మూడో వన్డే మే 28న జరగనుంది. ఇక ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో బంగ్లాదేశ్ అగ్రస్థానానికి చేరుకుంది. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుని పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక 2023 వరల్డ్ కప్‌నకు అర్హత సాధించే క్రమంలో ఇప్పటివరకు మొత్తంగా 8 వన్డేలు ఆడిన బంగ్లాదేశ్... ఐదింటిలో గెలుపొంది 50 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. కాగా ఆడిన 9 మ్యాచ్‌లలో నాలుగింటిలో గెలుపొందిన ఇంగ్లండ్ 40 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... రన్‌రేట్‌లో వెనుకబడిన పాకిస్తాన్ 40 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉంది. చదవండి: ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నా.. రేపు వీల్‌చైర్‌లో ఉంటానేమో -
BAN Vs SL: బంగ్లాదేశ్‌దే వన్డే సిరీస్; అలా అయితే ఇంకా సంతోషించేవాడిని!
ఢాకా: ముష్ఫికర్ రహీమ్ (125; 10 ఫోర్లు) శతక్కొట్టడంతో వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2–0తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 103 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. మొదట బంగ్లాదేశ్ 48.1 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో లంక లక్ష్యాన్ని 40 ఓవర్లలో 245 పరుగులుగా నిర్దేశించారు. అయితే శ్రీలంక 40 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేసి ఓడింది. మెహదీ హసన్, ముస్తఫిజుర్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ నెల 28న ఇదే వేదికపై ఆఖరి వన్డే జరుగుతుంది. ఇక విజయం గురించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ముష్ఫికర్ రహీం మాట్లాడుతూ.. ‘‘నా ఇన్నింగ్స్ తృప్తినిచ్చింది. అయితే, చివరి 11 బంతులు ఆడలేకపోవడం నిరాశ కలిగించింది. మహ్మదుల్లా కూడా గొప్పగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు అద్భుతంగా రాణించారు. ఇలాంటి పిచ్‌పై ఆడటం అంత తేలికేమీ కాదు. కాబట్టి నేటి మ్యాచ్‌తో మా బ్యాట్స్‌మెన్ మరిన్ని పాఠాలు నేర్చుకున్నారనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. అప్పుడే మరింత సంతోషం: తమీమ్ ఇక్బాల్ అదే విధంగా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘‘రెండు మ్యాచ్‌లు గెలవడం అదృష్టంగా భావిస్తున్నాం. అయితే, సిరీస్‌లో ఇంతవరకు మేం పరిపూర్ణంగా ఆడలేదనే అనుకుంటున్నా. ముషి, మహ్మదుల్లా ఇన్నింగ్స్‌తో గౌరవప్రదమైన స్కోరు చేశాం. బౌలింగ్, ఫీల్డింగ్ బాగుంది. కానీ అది సరిపోదు. ఇంకా మెరుగుపడాలి. కొన్ని క్యాచ్‌లు మిస్సయ్యాయి. అవికూడా పట్టి ఉంటే నేను మరింత సంతోషంగా ఉండేవాడిని’’ అని పేర్కొన్నాడు. అనుభవలేమి కనబడింది: కుశాల్ పెరీరా ‘‘రెండు మ్యాచ్‌లలోనూ మాకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా మిడిలార్డర్ కుప్పకూలింది. అనుభవలేమి కారణంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. సమీక్ష చేసుకుంటాం. నిర్భయంగా ఆడాల్సిన అవసరం గురించి చర్చిస్తాం’’ అని శ్రీలంక కెప్టెన్ కుశాల్ పెరీరా ఓటమి గురించి స్పందించాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Skipper .@TamimOfficial28 speaks after the 2nd ODI against Sri Lanka.#BCB pic.twitter.com/VRw7V0LqPn — Bangladesh Cricket (@BCBtigers) May 26, 2021 చదవండి: BAN Vs SL:నేనేమీ పొలార్డ్ లేదా రస్సెల్ కాదు.. కానీ! -
BAN Vs SL:నేనేమీ పొలార్డ్ లేదా రస్సెల్ కాదు.. కానీ!
ఢాకా: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 33 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 257 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (84; 4 ఫోర్లు, సిక్స్), మహ్ముదుల్లా (54; 2 ఫోర్లు, సిక్స్), తమీమ్ ఇక్బాల్ (52; 6 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం శ్రీలంక 48.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో మిరాజ్ (4/30), ముస్తఫిజుర్ (3/34) లంకను దెబ్బతీశారు. ఇక అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ముష్ఫికర్ రహీమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఇదేమీ అంత ఈజీ వికెట్ కాదు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయాం. అయితే, మేం నిలదొక్కుకున్నాం. తమీమ్, రియాద్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇక నా విషయానికి వస్తే.. భారీ షాట్లు ఆడేందుకు నేనేమీ పొలార్డ్ లేదా రస్సెల్‌ను కాదు. నా బలాలు ఏంటో నాకు తెలుసు. ముఖ్యంగా వికెట్ కాపాడుకుంటూ, పరుగులు రాబట్టాలని ఆలోచించాను. అదే చేశాను. నిజంగా ఇదొక మంచి గేమ్. మిరాజ్, ముస్తఫిజుర్, సైఫుద్దీన్ కూడా రాణించారు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: అతని శతక దాహం ఇంగ్లండ్ పర్యటనలో తీరుతుంది.. -
'క్షమించండి.. మళ్లీ రిపీట్ కానివ్వను'
ఢాకా : బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ బంగబంధు టీ20 కప్‌లో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సహచర ఆటగాడు నజుమ్ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒక జూనియర్ క్రికెటర్‌పై రహీమ్ ఇలా ప్రవర్తించడమేంటని పలువురు మాజీ, సీనియర్ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. రహీమ్ చర్యకు మ్యాచ్ రిఫరీ అతని ఫీజులో 25శాతం జరిమానా విధించాడు.తాజాగా రహీమ్ తాను చేసిన పనికి బాధపడుతున్నానని.. మళ్లీ ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటాని ఫేస్బుక్ వేదికగా అభిమానులకు చెప్పుకొచ్చాడు. (చదవండి : కొట్టేస్తా... ఏమనుకున్నావ్!) 'మ్యాచ్ సందర్భంగా తోటి క్రికెటర్‌పై నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా. మ్యాచ్ ముగిసిన వెంటనే నజుమ్ అహ్మద్‌కు క్షమాపణ కోరాను. ఒక మనిషిగా నేను అలా ప్రవర్తించడం తప్పు. అతన్ని కొట్టడానికి చేయి చూపించడం సరైనది కాదు. అందుకే నా చర్యను తప్పుబడుతూ క్రికెట్ అభిమానులకు.. ఆరోజు మైదానంలో ఉన్న ప్రేక్షకులకు మరోసారి క్షమాపణలు కోరుతున్నా. ఇలాంటి ఘటన నానుంచి మళ్లీ పునరావృతం కావని మీకు ప్రామిస్ చేస్తున్నా.' అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రహీమ్ జట్టు బెక్సింకో ఢాకా 9 పరుగులతో ఫార్చున్ బరిషల్‌పై నెగ్గి ప్లే ఆఫ్‌కు చేరింది. -
కొట్టేస్తా... ఏమనుకున్నావ్!
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. మైదానంలో తన సహచరుడిపైనే చెయ్యెత్తాడు. కుడి చేతితో దాదాపు తన సహచరుడి ముఖం మీద కొట్టినంత పని చేశాడు. జట్టులోని ఆటగాళ్లంతా సముదాయించినా అతనిలో కోపం తగ్గలేదు. వివరాల్లోకెళితే ‘బంగబంధు టి20 కప్’ సందర్భంగా సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఇందులో రహీమ్ జట్టు బెక్సింకో ఢాకా 9 పరుగులతో ఫార్చున్ బరిషల్‌పై నెగ్గి ప్లే ఆఫ్‌కు చేరింది. మ్యాచ్ జరుగుతుండగా బౌన్సర్‌ను ఆడే క్రమంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ అఫిఫ్ హొస్సేన్ కొట్టిన షాట్ అక్కడే గాల్లోకి లేచింది. కీపర్ రహీమ్, ఫైన్ లెగ్ ఫీల్డర్ నజుమ్ అహ్మద్ క్యాచ్ అందుకునే క్రమంలో ఢీకొట్టుకోబోయారు. కానీ రహీమ్ తడబడుతూనే క్యాచ్ పట్టేశాడు. క్యాచ్ పట్టిన వెంటనే సహచరుడు నజుమ్‌ను అదే చేత్తో కొట్టబోయాడు. రహీమ్ చర్యకు నజుమ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. నిజానికి ఈ క్యాచ్‌ను ఫైన్‌లెగ్‌లో ఉన్న నజుమ్ అందుకోవాలి. కానీ రహీమ్ ఎలాంటి సంజ్ఞ ఇవ్వకుండానే పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టడం గమనార్హం. సీనియర్ ప్లేయర్ అయిన రహీమ్ ఓ జూనియర్ క్రికెటర్ పట్ల ఇలా ప్రవర్తించి విమర్శల పాలయ్యాడు. -
సహనం కోల్పోయిన క్రికెటర్.. తోటి ఆటగాడిపై
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం సహనం కోల్పోయాడు. సహచర ఆటగాడిపై కోపంతో విరుచుకుపడ్డాడు. అతడిని కొట్టినంత పని చేశాడు. ఇతర ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పడంతో కాస్త కూల్ అయ్యాడు. కానీ అతడి చేతిలో తిట్లు తిన్న ప్లేయర్ మాత్రం భయంతో బిక్కచచ్చిపోయాడు. అసలేం జరిగిందంటే.. బంగ్లాదేశ్‌లో బంగాబంధు టీ20 కప్ పేరిట టోర్నీ నిర్వహిస్తున్నారు. దాదాపు 20 మ్యాచ్‌ల తర్వాత టాప్ 5 జట్ల నుంచి నాలుగు జట్లు ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో బెక్సిమ్కో ఢాకా, ఫార్చూన్ బరిషల్ జట్ల మధ్య సోమవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ఢాకా కెప్టెన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీంకు ఆ జట్టు ఆటగాడు నసూమ్ అహ్మద్ మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించే దిశగా అడుగులు పడుతున్న వేళ.. బరిషల్ క్రికెటర్ అఫిఫ్ హుస్సేన్ బంతిని గాల్లోకి లేపాడు. దీనిని పట్టుకునేందుకు ముష్పికర్, అహ్మద్ పరుగెత్తారు. ఈ క్రమంలో ఒకరినొకరు ఢీకొన్నారు. బంతి చేజారే పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు బాల్‌ను క్యాచ్ చేసిన ముష్ఫికర్, అహ్మద్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అతడి మీద చేయి చేసుకుంటాడా అన్నంతలా బెంబేలెత్తించాడు. (చదవండి: 5 మిలియన్ల ప్రేమ; అత్యధికులు వాళ్లే: వార్నర్) అయితే అహ్మద్ మాత్రం అతడిని కూల్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సహచర ఆటగాళ్లు వచ్చి సారథికి సర్దిచెప్పారు. అహ్మద్ భుజం తట్టి ఊరడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘‘కూల్ రహీమ్.. అంతగా ఆవేశపడితే ఎలా.. ఇది జస్ట్ మ్యాచ్ అంతే ’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఢాకా జట్టు 9 పరుగుల తేడాతో గెలుపొందింది. ఒకవేళ ఈ క్యాచ్ మిస్ అయి ఉంటే కథ వేరేలా ఉండేది. అందుకే కెప్టెన్ అంతలా నారాజ్ అయ్యాడని ముష్పికర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఢాకా జట్టు నిర్ణీత ఓవర్లలో 150 పరుగులు చేసింది. 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నవేళ ముష్పికర్ 43, యాసిర్ అలీ 54 పరుగులతో రాణించడంతో ఢాకా జట్టు మంచి స్కోరు నమోదు చేయగలిగింది. ఇక చివరికంటా పోరాడిన బరిషల్ జట్టు 141 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
ముష్ఫికర్‌కు ‘నో’ చెప్పిన బీసీబీ
ఢాకా: కరోనాతో విరామం తర్వాత తిరిగి ప్రాక్టీస్‌ను ప్రారంభించాలనుకున్న బంగ్లాదేశ్ అగ్రశ్రేణి క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్‌కు మొండి చేయి ఎదురైంది. అతనితో పాటు మరికొంత మంది క్రికెటర్లు మిర్పూర్లోని షేర్–ఎ–బంగ్లా స్టేడియంలో ప్రాక్టీస్‌లో పాల్గొంటామని విజ్ఞప్తి చేయగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించింది. కోవిడ్–19 వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడంతో ఈ సమయంలో బహిరంగ శిక్షణ మంచిది కాదంటూ వారి ప్రతిపాదనను తిరస్కరించింది. ‘ప్రాక్టీస్ చేసేందుకు ఇది తగిన సమయం కాదని మేం ముష్ఫికర్‌ను వారించాం. ట్రెయినింగ్ ముఖ్యమే కానీ ఆటగాళ్ల ఆరోగ్య భద్రత అన్నింటికన్నా ప్రధానం. మిర్పూర్లో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టాం. పూర్తి స్థాయిలో మైదాన పరిసరాలు సురక్షితం కాలేదు’ అని బీసీబీ స్పష్టం చేసింది. -
ఆ బ్యాట్‌ను అఫ్రిది సొంతం చేసుకున్నాడు..
కరాచీ: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ వేలంలో ఉంచిన బ్యాట్‌ను పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కొనుగోలు చేశాడు. కరోనా వైరస్ నివారణలో భాగంగా చేయూతనివ్వడానికి ముందుకొచ్చిన రహీమ్.. శ్రీలంకపై 2013లో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్‌ను గత నెల్లో వేలానికి పెట్టాడు. అయితే దీన్ని అఫ్రిది తన ఫౌండేషన్ కోసం కొనుగోలు చేశాడు. ఈ బ్యాట్‌కు 20 వేల డాలర్లు చెల్లించి అఫ్రిది సొంతం చేసుకున్నాడు. దీనిపై ముష్ఫికర్ రహీమ్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘అఫ్రిది తన ఫౌండేషన్‌లో ఉంచడం కోసం నా బ్యాట్‌ను తీసుకోవడం గొప్పగా భావిస్తున్నా. మాకు అఫ్రిది మద్దతుగా నిలిచినందుకు చాలా థాంక్స్. గత వారం చాలా మంది వేలంలో పోటీ పడ్డారు. ఈ పోటీ ఇలా కొనసాగుతూనే వచ్చింది. ('ఆ మాటలు నా మనుసు నుంచి వచ్చాయి') అయితే అఫ్రిది బ్యాట్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించడంతో వేలం రద్దయ్యింది. వేలంలో బ్యాట్‌ను ఉంచిన విషయంపై నాకు వ్యక్తిగతంగా అఫ్రిది ఫోన్ చేసి మాట్లాడాడు. మే 13వ తేదీన బ్యాట్‌ను కొంటున్నట్లు ఒక ఆఫర్ లెటర్‌ను పంపాడు. 20 వేల యూఎస్ డాలర్లకు బ్యాట్‌ను కొన్నాడు. ఇది బంగ్లాదేశ్ కరెన్సీలో 16.8 లక్షలు ఉంటుంది’ అని రహీమ్ తెలిపాడు. ఈ మేరకు అఫ్రిది మాట్లాడిన వీడియోను కూడా ముష్ఫికర్ రహీమ్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ‘నువ్వు ఒక గొప్ప పని చేశావ్. ఇది కేవలం రియల్ హీరోలు మాత్రమే చేస్తారు. ఈ కఠిన సమయంలో ప్రతీ ఒక్కరూ తమకు తోచిన సాయాల్ని చేసుకుని ముందుకు సాగాలి’ అని అఫ్రిది పేర్కొన్నాడు.(టీవీ సిరీస్‌లో నటించింది కోహ్లీనా!) -
నేను వెళ్లనంటే వెళ్లను: ముష్ఫికర్
ఢాకా: పాకిస్తాన్లో పర్యటనకు సంబంధించి మరోసారి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) చేసిన విజ్ఞప్తి చేసిన ముష్ఫికర్ రహీమ్ తోసిపుచ్చాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్తాన్ పర్యటనకు తాను వెళ్లేది లేదంటూ తేల్చిచెప్పాడు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా తాను పాకిస్తాన్లో పర్యటించే బంగ్లాదేశ్ జట్టులో సభ్యుడిని కాబోనంటూ స్పష్టం చేశాడు. పాకిస్తాన్ పర్యటనపై ముష్ఫికర్‌ను బీసీబీ సంప్రదించింది. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లననే గత నిర్ణయాన్ని ఒకవేళ మార్చుకుంటే మార్చుకోవచ్చని తెలిపింది. దీనిని ముష్ఫికర్ వినమ్రంగా తిరస్కరించాడు. ‘ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అందులో వెనుకడగు వేసే ప్రసక్తే లేదు. నేను పాక్ పర్యటనకు వెళ్లనని ఇప్పటికే చెప్పా. దాన్ని బీసీబీ పెద్దలు కూడా అంగీకరించారు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా పాక్‌కు వెళ్లను. నాకు ఇదివరకే పీఎస్ఎల్ ఆఫర్ వచ్చింది. నా పేరు పీఎస్ఎల్లో ఉందా..లేదా అనేది సమస్య కాదు. పాకిస్తాన్‌తో టోర్నమెంట్లో భాగంగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉండను. దీన్ని బోర్డు తప్పకుండా గౌరవించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌కు వెళ్లడం మంచిది కాదనేది నా అభిప్రాయం. ఇక్కడ నా అభిప్రాయం చాలా క్లియర్‌గా ఉంది. భవిష్యత్తులో కూడా నా నిర్ణయం మారదు. అక్కడకి వెళ్లే బంగ్లా క్రికెటర్లకు నా విషెస్ తెలియజేస్తున్నా’ అని ముష్ఫికర్ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: ముష్ఫికర్ ‘డబుల్’ చరిత్ర) పాకిస్తాన్లో క్రికెట్ ఆడటం ఏమీ ప్రమాదం కాదని చెప్పడం కోసమే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షికి సిరీస్‌లో భాగంగా జనవరి 24వ తేదీ నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకూ ఇరు జట్లు సిరీస్‌లు ఆడుతున్నాయి. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌తో పాటు, ఒక టెస్టు మ్యాచ్ జరిగింది. ఇక ఏకైక వన్డేతో పాటు మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉంది. ఈ ఫైనల్ ఫేజ్ సిరీస్‌లో ఏప్రిల్3వ తేదీన వన్డే మ్యాచ్ జరుగనుండగా, రెండో టెస్టు మ్యాచ్ ఏప్రిల్5వ తేదీ నుంచి కరాచీలో ఆరంభం కానుంది. దీనిపై ముష్పికర్‌ను బీసీబీ సంప్రదించినా ఉపయోగం లేకుండా పోయింది. -
ముష్ఫికర్ ‘డబుల్’ చరిత్ర
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ మరోసారి అరుదైన ఫీట్‌ను సాధించాడు. జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీమ్ మరోసారి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. మూడో రోజు ఆటలో రహీమ్ డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. దాంతో తన టెస్టు కెరీర్లో మూడో ద్విశతకం సాధించి ఆ దేశం తరఫున అత్యధికసార్లు డబుల్ సెంచరీలు సాధించిన ఘనతను సవరించుకున్నాడు. ఇప్పటివరకూ బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీ చేసిన వారిలో ముష్ఫికరే ముందుండగా మరోసారి ఆ మార్కును సాధించి తన రికార్డును మెరుగుపరుచుకున్నాడు. బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో డబుల్ సెంచరీలు సాధించిన వారిలో తమీమ్ ఇక్బాల్, షకీబుల్ హసన్‌లు తలో ఒకసారి మాత్రమే ద్విశతకాలు సాధించగా, ముష్ఫికర్ మూడో డబుల్ సెంచరీని సాధించడం విశేషం. జింబాబ్వేతో టెస్టులో ముష్ఫికర్( 203 నాటౌట్) డబుల్ సెంచరీ పూర్తయిన తర్వాత బంగ్లాదేశ్ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 560/6 వద్ద ఉండగా డిక్లేర్డ్ చేసింది. దాంతో బంగ్లాకు 295 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ముష్పికర్కు జతగా కెప్టెన్ మోమినుల్ హక్(132) సెంచరీ సాధించాడు. మళ్లీ వారిదే అత్యధికం.. టెస్టుల్లో నాల్గో వికెట్‌కు ముష్పికర్-మోమినుల్‌లు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో నాల్గో వికెట్‌కు రెండోసారి అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని ఈజోడి సాధించినట్లయ్యింది. 2018లో జింబాబ్వేపైనే వీరిద్దరూ 266 పరుగుల భాగస్వామ్యాన్ని నాల్గో వికెట్‌కు సాధించగా, ఇప్పుడు మరొకసారి రెండొందలకు పైగా పరుగుల్ని అదే జట్టుపై సాధించారు. ఇక బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు కూడా ముష్పికర్ పేరిటే ఉంది. 2018లో జింబాబ్వేపై ముష్ఫికర్ అజేయంగా 219 పరుగులు సాధించాడు. ఇదే బంగ్లా తరఫున ఇప్పటికే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. ఆ తర్వాత షకిబుల్ ఉన్నాడు. 2017లో షకిబుల్ 217 పరుగుల్ని న్యూజిలాండ్‌పై సాధించాడు. -
'పాకిస్తాన్లో క్రికెట్ కంటే నాకు ప్రాణం ముఖ్యం'
పాకిస్తాన్లో క్రికెట్ ఆడటం కన్నా తనకు తన ప్రాణాలు ముఖ్యం అంటూ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశాడు. దీంతో అతని లేఖ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. పాకిస్తాన్లో శ్రీలంక క్రికెటర్లపై దాడి తరువాత ఆ దేశంలో పర్యటించేందుకు ఏ జట్టు ముందుకు రావడం లేదు. ఆ ఘటన జరిగి 10 ఏళ్లు కావస్తున్నా భద్రతా పరమైన కారణాలు చూపుతూ ఏ దేశం కూడా పాక్‌లో పర్యటించడం లేదు. దీంతో తమ దేశంలో జరగాల్సిన మ్యాచులను ఇప్పటి వరకు పాకిస్తాన్ తటస్థ వేదికలపై నిర్వహిస్తూ వస్తోంది. ఇటీవల శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించింది. అయితే ఆ పర్యటనకు శ్రీలంక సీనియర్ క్రికెటర్లు దూరంగా ఉండడంతో జూనియర్ జట్టునే పాక్‌కు పంపించింది. జనవరి 14 నుంచి మూడు టీ20లు, ఒక వన్డే, రెండు టెస్టుల సిరీస్‌ని పాకిస్తాన్లో బంగ్లా, పాక్ జట్లు ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే తాజాగా ముష్ఫికర్ తీసుకున్న నిర్ణయంతో అతని దారిలోనే మరికొంతమంది క్రికెటర్లు పయనించే అవకాశం ఉంది. ముష్ఫికర్ రహీమ్ మరో అడుగు కూడా ముందుకేసి బీసీబీ(బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు)కి లేఖ రాసి మరీ తాను వెళ్లడం కుదరదని స్పష్టం చేశారు. చదవండి: నువ్వు లేకుండా క్రికెట్ ఎలా ఆడాలి? 'పాకిస్తాన్లో భద్రతపై మా ఫ్యామిలీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే నేను పాక్ పర్యటనకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. గతంలో కంటే పాక్‌లో ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గానే ఉంది. కానీ.. క్రికెట్ కంటే జీవితం ముఖ్యం కదా..? పాక్‌లో పిచ్‌లు బ్యాటింగ్‌కి బాగా అనుకూలిస్తుంటాయి. సిరీస్ జరుగుతుంటే.. ఇంట్లో కూర్చోవడం కష్టమే. కానీ.. తప్పట్లేదు' అని రహీమ్ ఆలేఖలో పేర్కొన్నాడు. ఇక రహీమ్ బాటలోనే మరికొంతమంది క్రికెటర్లు నడిచే అవకాశం ఉంది. చదవండి: సచిన్, ద్రవిడ్‌ల తర్వాత ముష్ఫికర్.. గతంలో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై పాక్‌లో ఉగ్రదాడి జరిగింది. అప్పుడు ఆ జట్టులోని చాలా మంది క్రికెటర్లకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ ఘటన తర్వాత ఏ క్రికెట్ జట్టు కూడా పాక్ గడ్డపై పర్యటించేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. గత ఏడాది చివర్లో మళ్లీ శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించింది. అయినా బంగ్లాదేశ్ క్రికెటర్లు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. దీంతో పాకిస్తాన్లో బంగ్లాదేశ్ పర్యటించడం అనుమానంగా మారింది. బీసీబీ పాకిస్థాన్ సిరీస్‌పై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. -
రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ‘సెంచరీ’!
ఇండోర్: టెస్టు క్రికెట్లో సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు చేసి రికార్డులు నెలకొల్పడం ఒకటైతే, జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేయడం మరొకటి. బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు ముష్పికర్ రహీమ్.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఒకవైపు బంగ్లా టాపార్డర్ ఆటగాళ్లు వరుస విరామాల్లో పెవిలియన్ చేరిన వేళ.. ముష్ఫికర్ ఎంతో బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో 105 బంతులు ఆడి 43 పరుగులు చేసిన ముష్ఫికర్.. రెండో ఇన్నింగ్స్‌ల్లో కూడా అదే తరహాలో ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టాప్ స్కోరర్‌గా నిలిచిన ముష్ఫికర్.. రెండో ఇన్నింగ్స్‌ల్లో కూడా ఆ జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో వందకు పైగా బంతులు ఆడిన రహీమ్ హాఫ్ సెంచరీ సాధించాడు. బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా 53 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఆ సమయానికి ముష్ఫికర్ 114 బంతులు ఆడి 53 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసి ఆటగాడిగా నిలవడమే కాకుండా, ‘సెంచరీ’కి పైగా బంతులు ఆడటం విశేషం. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వందకు పైగా బంతుల్ని ఎదుర్కొన్నాడు. -
సచిన్, ద్రవిడ్‌ల తర్వాత ముష్ఫికర్..
ఇండోర్: బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు ఫార్మాట్లో భారత్‌పై అత్యధిక పరుగులు సాధించిన బంగ్లా ఆటగాడిగా నిలిచాడు. భారత్‌తో తాజా టెస్టులో భాగంగా ముష్పికర్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో పడ్డ సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ముష్పికర్ ఆచితూచి ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను సాధ్యమైనంతవరకూ చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో భారత్‌పై బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. దీనిలో భాగంగా మహ్మద్ అష్రాఫుల్ పేరిట ఉన్న రికార్డును ముష్పికర్ బ్రేక్ చేశాడు. అంతకుముందు అష్రాఫుల్ భారత్‌పై 386 టెస్టు పరుగులు చేయగా, దాన్ని ముష్ఫికర్ బద్ధలు కొట్టాడు.(ఇక్కడ చదవండి: బంగ్లా ఓపెనర్లు.. 6,6,6,6..!) ఇక భారత్-బంగ్లాదేశ్‌ల ఓవరాల్ టెస్టుల్లో ఇరు దేశాల ఆటగాళ్లు పరంగా అత్యధిక పరుగులు సాధించిన జాబితాను పరిశీలిస్తే ముష్ఫికర్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ వరుసలో తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్(820), రాహుల్ ద్రవిడ్(560)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత స్థానాన్ని ముష్పికర్ ఆక్రమించాడు. టెస్టుల్లో భారత్‌పై 55పైగా సగటుతో ఉన్నాడు. భారత్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ముష్పికర్.. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.ఐదో వికెట్‌గా మహ్మదుల్లా(15) ఔటయ్యాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి మహ్మదుల్లా పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్ కోల్పోయిన ఐదు వికెట్లలో మూడు వికెట్లు షమీ సాధించగా, ఇషాంత్, ఉమేశ్‌లకు తలో వికెట్ లభించింది. -
నువ్వు లేకుండా క్రికెట్ ఎలా ఆడాలి?
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించడాన్ని అతడి సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. హసన్ లేకుండా క్రికెట్ ఎలా ఆడాలంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. హసన్‌తో తమకున్న అనుబంధాన్ని సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీం, వెటరన్ బౌలర్ మోర్తాజా సోషల్ మీడియా వేదికగా పంచుకుకున్నారు. చాంపియన్‌లా హసన్ తిరిగొస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘సమ వయస్కులమైన మనమిద్దరం 18 ఏళ్ల పాటు కలిసి క్రికెట్ ఆడాం. మైదానంలో నువ్వు లేకుండా క్రికెట్ ఆడాలన్న ఆలోచన ఎంతో బాధగా ఉంది. త్వరలోనే నువ్వు చాంపియన్‌లా తిరిగొస్తావు. నీకు ఎల్లప్పుడు నా మద్దతు, మొత్తం బంగ్లాదేశ్ అండదండలు ఉంటాయి. ధైరంగా ఉండు’ అంటూ ముష్ఫికర్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. హసన్‌తో కలిసివున్న ఫొటోను షేర్ చేశాడు. షకీబ్ కెప్టెన్సీలో వరల్డ్‌కప్ ఫైనల్ ఆడతాం: మోర్తాజా షకీబ్ అల్ హసన్‌పై ఐసీసీ నిషేధం తదనంతర పరిణామాలతో తాను నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుందని మోర్తాజా పేర్కొన్నాడు. భవిష్యత్తులో కచ్చితంగా హాయిగా నిద్రపోతానని అన్నాడు. షకీబ్ కెప్టెన్సీలో 2023 ప్రపంచకప్ ఫైనల్ ఆడతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. (చదవండి: షకీబ్ అల్ హసన్‌పై రెండేళ్ల నిషేధం) -
పోరాడి ఓడిన బంగ్లా
నాటింగ్‌హామ్: సంచలనాల బంగ్లాదేశ్ మరోసారి తన పోరాటపటిమతో ఆకట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్, అన్ని రంగాల్లో తనకంటే బలమైన ఆస్ట్రేలియాపై గెలిచేంత పనిచేసింది. ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 48 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆసీస్ నిర్దేశించిన 382 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఆటగాళ్లలో ముష్పీకర్ రహీమ్(102 నాటౌట్; 97 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సర్) అసాధరణ రీతిలో సెంచరీతో పోరాడగా.. తమీమ్(62), మహ్మదుల్లా(69)లు అర్దసెంచరీలు సాధించారు. సీనియర్ ఆటగాడు షకీబ్(41), లిట్టన్ దాస్(20) భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్‌నైల్, స్టొయినిస్, స్టార్క్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జంపా ఒక్క వికెట్ దక్కించుకున్నారు. బంగ్లాపై వీరవిహారం చేసి భారీ శతకం సాధించిన డేవిడ్ వార్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గెలుస్తుందా అనిపించేలా.. ఆసీస్ లాంటి బలమైన జట్టు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంతో కనీసం పోరాటం చేయకుండానే బంగ్లా చాపచుట్టేస్తుందనుకున్నారు. అయితే గత బంగ్లా జట్టు కాదని నిరూపిస్తూ ఓటమిని అంత త్వరగా ఒప్పుకోలేదు. ఓ దశలో బంగ్లా పోరాటంతో ఆసీస్ ఆటగాళ్లతో పాటు అభిమానులకు కూడా ఓడిపోతామనే అనుమానం కలిగింది. అయితే కొంచెం స్కోర్ తక్కువైనా ఆసీస్ ఓడిపోయేదే అని సగటు అభిమాని భావించాడు. ముఖ్యంగా రహీమ్ చివరి వరకు ఉండి విజయం కోసం పోరాడాడు. మహ్మదుల్లా కూడా చివర్లో బ్యాట్ ఝులిపించడంతో లక్ష్యానికి దగ్గరికి వచ్చింది. అయితే భారీ స్కోర్ కావడం, చివర్లో వికెట్లు పడటంతో బంగ్లా ఓటమి ఖాయం అయింది. అంతకుముందు ఓపెనర్ డేవిడ్ వార్నర్ (166: 147 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ శతకానికి తోడు సారథి ఆరోన్ ఫించ్(53: 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), వన్‌డౌన్‌లో ఉస్మాన్ ఖవాజా (89: 72 బంతుల్లో 10 ఫోర్లు) అర్ధసెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 381పరుగులు చేసింది చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సౌమ్య సర్కార్ మూడు, ముస్తాఫిజుర్ ఒక్క వికెట్ పడగొట్టారు. అదిరే ఆరంభం... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వార్నర్, ఫించ్ అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి నాలుగు ఓవర్లు కొంచెం ఆచితూచి ఆడిన ఈ జోడీ ఐదో ఓవర్ నుంచి గేర్ మార్చింది. మోర్తాజా వేసిన ఈ ఓవర్ తొలి బంతినే సిక్సర్ మలచి ఫించ్ తన ఉద్దేశాన్ని చాటాడు. అయితే, ఇదే ఓవర్ చివరి బంతికి వార్నర్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతడిచ్చిన క్యాచ్‌ను పాయింట్లో షబ్బీర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వార్నర్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. చకచకా బౌండరీలు, సిక్స్‌లు బాదుతూ 55 బంతుల్లో అర్ధసెంచరీ మార్కు చేరుకున్నాడు. కాసేపటికే ఫించ్ సైతం అర్ధశతకం పూర్తిచేసుకొని ఆ వెంటనే వెనుదిరిగాడు. దీంతో 121 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం ఉస్మాన్ ఖవాజాతో కలసి మరో భారీ భాగస్వామ్యాన్ని(160) నెలకొల్పిన వార్నర్ టోర్నీలో రెండో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత ఫోర్లు, సిక్సర్లతో చకచకా 150 దాటిన అతన్ని సౌమ్య సర్కార్ పెవిలియన్‌కు చేర్చాడు. అతని తర్వాత వచ్చిన మాక్స్వెల్ 10 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే, ఆఖరి నాలుగు ఓవర్లలో పుంజుకున్న బంగ్లా బౌలర్లు ఖవాజా, స్టీవ్‌స్మిత్‌లను వెంట వెంటనే పెవిలియన్‌కు చేర్చడంతో ఆసీస్ స్కోరు కొంత తగ్గింది. -
దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ అద్భుత విజయం
-
బంగ్లా.. రికార్డులే రికార్డులు
లండన్: అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బలమైన పేస్ అటాకింగ్ ఉన్న దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ భారీ స్కోర్ సాధించింది. ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లా సఫారీ బౌలింగ్‌ను చిత్తుచిత్తు చేసింది. బంగ్లా ఓపెనర్లు గొప్పగా రాణించనప్పటికీ సీనియర్ ఆటగాళ్లు షకీబుల్ హసన్, ముష్పికర్ రహీమ్‌లు తమ భాద్యతను సక్రమంగా నిర్వర్తించారు. వీరికి తోడు మహ్మదుల్లా-మొసెదెక్లు చివర్లో చితక్కొట్టడంతో బంగ్లా భారీ స్కోర్వైపు అడుగులు వేసింది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సాధించిన పరుగులే బంగ్లాకు వన్డేల్లో అత్యుత్తమ స్కోర్ కావడం విశేషం. ఈ క్రమంలో గతంలో పాకిస్తాన్‌పై చేసిన అత్యధిక పరుగుల రికార్డును(329) తిరగరాసింది. ఇక ప్రపంచకప్‌లోనూ బంగ్లాకు ఇదే అత్యుత్తమ స్కోర్. 2015 ప్రపంచకప్ సందర్భంగా స్కాట్లాండ్పై 322 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో షకీబుల్-రహీమ్‌లు మూడో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇది ఓవరాల్ వరల్డ్‌కప్‌లో బంగ్లాకు అత్యధిక పరుగుల భాగస్వామ్యంగా నమోదైంది. అంతకుముందు మహ్మదుల్లా, రహీమ్‌లు గత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజాగా ఆ రికార్డును షకీబ్, రహీమ్‌లు సవరించారు. -
ముష్ఫికర్ రహీమ్ మరో ఘనత
ఢాకా: బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ మరో ఘనతను సాధించాడు. కొన్ని రోజుల క్రితం జింబాబ్వేతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన రహీమ్.. రెండో డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా టెస్టు ఫార్మాట్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. కాగా, ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగువేల టెస్టు పరుగుల మైలురాయిని చేరాడు. దాంతో ఈ ఘనత సాధించిన రెండో బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రహీమ్ గుర్తింపు సాధించాడు. అంతకుముందు తమీమ్ ఇక్బాల్ ఒక్కడే నాలుగు వేల టెస్టు పరుగుల్ని సాధించిన బంగ్లాదేశ్ క్రికెటర్ కాగా, ఇప్పుడు అతని సరసన రహీమ్ నిలిచాడు. విండీస్‌తో మ్యాచ్‌కు ముందు నాలుగు వేల పరుగులకు ఎనిమిది పరుగుల దూరంలో ఉన్న రహీమ్.. బిషూ వేసిన 65 ఓవర్లో ఆ మార్కును చేరుకున్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 14 వ్యక్తిగత పరుగుల వద్ద ఉండగా పెవిలియన్ చేరాడు. -
ముష్ఫికర్ ‘డబుల్’ ధమాకా
ఢాకా: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ కెరీర్లో రెండో డబుల్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. 9 గంటల 49 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన ముష్ఫికర్ (421 బంతుల్లో 219 నాటౌట్; 18 ఫోర్లు, 1 సిక్స్) సాధించిన అజేయ ద్విశతకంతో జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ భారీ స్కోరు నమోదు చేసింది. మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌ను 7 వికెట్లకు 522 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 25 పరుగులు చేసిన జింబాబ్వే మరో 497 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 303/5తో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ వేగంగా పరుగులు సాధించింది. తన స్కోరుకు రెండో రోజు మరో 108 పరుగులు జోడించిన ముష్ఫికర్‌కు ఆరంభంలో మహ్ముదుల్లా (36) అండగా నిలిచాడు. ఆరిఫుల్ (4) త్వరగానే ఔటైనా...మెహదీ హసన్ (102 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి బంగ్లా కీపర్ భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. టీ విరామం తర్వాత మవుటా వేసిన బంతిని స్క్వేర్‌లెగ్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో ముష్ఫికర్ డబుల్ సెంచరీ పూర్తయింది. గతంలో వికెట్ కీపర్లు ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), సంగక్కర (శ్రీలంక), ధోని (భారత్), తస్లీం ఆరిఫ్ (పాకిస్తాన్), ఇంతియాజ్ అహ్మద్ (పాకిస్తాన్), గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా), కురుప్పు (శ్రీలంక) ఒక్కో డబుల్ సెంచరీ మాత్రమే చేయగా... ఇప్పుడు ముష్ఫికర్ వారిని అధిగమించి రెండో డబుల్‌ను నమోదు చేశాడు. మరోవైపు బంగ్లాదేశ్ తరఫున షకీబ్ (217) పేరిట ఉన్న అత్యధిక స్కోరును, అత్యధిక బంతులు ఆడిన అష్రాఫుల్ (417) ఘనతను, అత్యధిక సమయం క్రీజ్‌లో నిలిచిన అమీనుల్ ఇస్లాం (535 నిమిషాలు) రికార్డును కూడా ముష్ఫికర్ సవరించడం విశేషం. -
టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు
ఢాకా: టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్పికర్ రహీం అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో రహీం డబుల్ సెంచరీ సాధించాడు. 407 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో రహీం ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇది రహీంకు రెండో డబుల్ సెంచరీ. ఫలితంగా టెస్టు చరిత్రలో రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లను ఓ ఆటాడుకుంటూ తనదైన మార్కు చూపెట్టిన రహీమ్ డబుల్ సెంచరీతో మెరిశాడు. రెండో రోజు ఆటలో టీ బ్రేక్ తర్వాత రహీం ఈ ఘనత సాధించాడు. దాంతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో మోమినుల్ హక్(161) కూడా భారీ సెంచరీ చేయడంతో ఆ జట్టు ఐదొందల స్కోరును సునాయాసంగా చేరింది. జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. దాంతో ఈ టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని బరిలోకి దిగిన బంగ్లాదేశ్ అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తోంది. 303/5 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్ నిలకడగా బ్యాటింగ్ చేసింది. ఆదివారం సెంచరీ పూర్తి చేసుకున్న రహీమ్.. ఈరోజు ఆటలో దాన్ని డబుల్ సెంచరీగా మలచుకున్నాడు. -
బంగ్లాతో మ్యాచ్: పాకిస్తాన్ లక్ష్యం 240
అబుదాబి : ఆసియాకప్‌లో భాగంగా ఫైనల్ పోరు కోసం జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్ బౌలర్ జునైద్ ఖాన్ (4/20) దాటికి బంగ్లా 239 పరుగులకు ఆలౌట్ అయింది. ముస్తాఫికర్ రహీమ్ 99(116 బంతుల్లో 9 ఫోర్లు), మహ్మద్ మిథున్ 60(84 బంతులు, 4 ఫోర్లు), మహ్మదుల్లా (25)లు రాణించడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కష్టాల్లో ఉన్న బంగ్లాను రహీమ్, మిథున్లు ఆదుకున్నారు. ఈ క్రమంలో రహీమ్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ నాలుగు, సహీన్ షా అఫ్రిది, హసన్ అలీ రెండు వికెట్లు తీయగా షాదబ్కాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో భారత్ ఫైనల్ ఆడనుందన్న విషయం తెలిసిందే. -
కోహ్లి, యూనిస్ ఖాన్ల తర్వాతి స్థానంలో..
దుబాయ్: ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్..మరో ఘనతను కూడా సాధించాడు. ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రహీమ్ మూడో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రహీమ్(144) భారీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించడమే కాకుండా, ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి(183) తొలి స్థానంలో ఉండగా, యూనిస్ ఖాన్(144) రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో రహీమ్ నిలిచాడు. ఈ క్రమంలోనే షోయబ్ మాలిక్(143)ను రహీమ్ అధిగమించాడు. చదవండి: సూపర్ ముష్ఫికర్ -
ఆసియా కప్: బంగ్లాదేశ్ బోణీ
-
నాదస్వరం ఊది రహీమ్‌కు సెండాఫ్
-
నాగిని డ్యాన్స్ చేస్తే.. నాదస్వరం ఊదుతా!
కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ నాగిని డ్యాన్స్ చేసి అలరించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ విజయం సాధించిన తర్వాత ముష్పికర్ నాగిని డ్యాన్స్‌తో చిందేశాడు. అయితే ఇరు జట్ల మధ్య జరిగిన చివరిదైన రెండో లీగ్ మ్యాచ్‌లో ముష్పికర్ రహీమ్ ఎక్స్ట్రా కవర్ మీదుగా భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. అపోన్స్ వేసిన 13 ఓవర్ మూడో బంతికి తిషారా పెరీరా చక్కటి క్యాచ్ పట్టడంతో రహీమ్(28) పెవిలియన్ బాట పట్టాడు. దాంతో బౌలర్ అపోన్సో మాత్రం నాదస్వరం ఊది రహీమ్‌కు సెండాఫ్ ఇచ్చాడు. గత మ్యాచ్‌లో బంగ్లా గెలిచిన తర్వాత ముష్పికర్ నాగిన డ్యాన్స్ చేస్తే దానికి ఇప్పుడు అపోన్సో ఇలా సమాధానమిచ్చాడు. ' నువ్వు నాగిన డ్యాన్స్ చేస్తే.. నేను నాదస్వరం ఊదుతా' అనే అర్థం వచ్చేలా అపోన్సో స్లెడ్జ్ చేశాడు. ఇరు జట్ల మధ్య చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ రెండు వికెట్ల తేడాతో గెలిచి భారత్‌తో తుది పోరుకు సిద్ధమైంది. -
వైరల్ : బంగ్లాదేశ్ క్రికెటర్ నాగిని డ్యాన్స్!
కొలంబో : నిదహాస్ ట్రోఫీలో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ నాగిని డ్యాన్స్‌తో అలరించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు చారిత్రాత్మక విజయం అందించిన ఈ బంగ్లా ఆటగాడు పట్టరాని సంతోషంతో నాగిని డ్యాన్స్‌తో చిందేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ముష్ఫికర్ బ్యాటింగ్ ప్రదర్శనతో పాటు నాగిని డ్యాన్స్ సైతం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ బంగ్లా క్రికెటర్‌ను ప్రశంసిస్తూ నెటిజన్లు వరుస ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. ‘నీ ప్రదర్శనతో మా మనసులు గెలుచుకున్నావు,’ అని ఒకరంటే.. ముష్పికర్ నీ డ్యాన్స్ ఇప్పటి వరకు చూడలేదని మరొకరు.. ఇండియన్ నాగిని డ్రామాలా ఉందని ఇంకొకరు ట్వీట్ చేస్తున్నారు. ముష్ఫికర్ రహీమ్ (35 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), లిటన్ దాస్ (19 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల వీరోచిత ఆటతో ఆతిథ్య శ్రీలంకపై బంగ్లాదేశ్ చరిత్రలో రికార్డు ఛేదన నమోదు చేసింది. -
బంగ్లాదేశ్ క్రికెటర్ నాగిని డ్యాన్స్!
-
ఆల్‌టైం రికార్డ్.. వన్డేల్లో తొలిసారిగా ఓ బంగ్లా క్రికెటర్
కింబర్లీ : బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో దక్షిణాఫ్రికా జట్టుపై సెంచరీ చేసిన తొలి బంగ్లా బ్యాట్స్‌మెన్‌గా రహీమ్ రికార్డు నెలకొల్పాడు. సఫారీలతో జరుగుతున్న తొలి వన్డేలో రహీమ్ ఈ ఫీట్ తన ఖాతాలో వేసుకున్నాడు. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. ఈ క్రమంలో 108 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ముష్ఫికర్ సెంచరీ చేశాడు. రబాడా వేసిన ఇన్నింగ్స్ 46 ఓవర్లో మూడో బంతికి రెండు పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా జట్టుపై తొలి వన్డే శతకం చేసిన తొలి బంగ్లా క్రికెటర్‌గా ముష్ఫికర్ నిలిచాడు. గతంలో సౌమ్య సర్కార్ చేసిన 90 పరుగులే వన్డేల్లో దక్షిణాఫ్రికా జట్టుపై బంగ్లా క్రికెటర్ చేసిన అత్యుత్తమ స్కోరు. ఓవైపు సఫారీ సంచలనం రబాడా బంతితో నిప్పులు చెరుగుతున్నా ముష్ఫికర్ మాత్రం చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ బంగ్లా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ముష్ఫికర్ అజేయ శతకం (116 బంతుల్లో 110 నాటౌట్: 11 ఫోర్లు, 2 సిక్సర్లు)తో నిలవడంతో బంగ్లా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు సఫారీల ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిలిపింది. బంగ్లా ఆటగాళ్లలో ఓపెనర్ ఇమ్రుల్ కయోస్(31), షకీబ్ అల్ హసన్ (29), మహ్మదుల్లా(26) పరవాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో రబాడా నాలుగు వికెట్లతో చెలరేగగా, ప్రిటోరియస్ 2 వికెట్లు తీశాడు. ఇమ్రాన్ తాహిర్‌కు ఒక్క వికెట్ దక్కింది. -
'నేను కెప్టెన్సీ నుంచి తప్పుకోను'
కేప్ టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో బంగ్లాదేశ్ వైట్ వాష్ అయిన నేపథ్యంలో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్ గా ఉన్న తాను రాజీనామా చేయాలంటూ వస్తున్న విమర్శలపై ముష్పికర్ రహీమ్ ఘాటుగా స్పందించాడు. తాను ఎట్టిపరిస్థితుల్లోనే కెప్టెన్సీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదంటూ విమర్శలను తిప్పికొట్టాడు. 'నేను రాజీనామా చేయాలంటూ మా క్రికెట్ బోర్డు బీసీబీ ఏమీ కోరలేదు. మా జట్టు చెత్త ప్రదర్శనపై కారణాలు చెప్పాలని అనుకోవడం లేదు. నేను ఎప్పుడూ జట్టును ముందుకు తీసుకువెళ్లడానికే యత్నిస్తున్నా. నేను ముందుండి నడిపిస్తున్నా..కానీ నేను ఒక మనిషినే.. నేను కూడా తప్పులు చేస్తా. అంతేకానీ ప్రతికూల ఫలితాలు వస్తే జట్టు కెప్టెన్సీకి ఎందుకు ఉద్వాసన చెప్పాలి''అని ముష్ఫికర్ ప్రశ్నించాడు.ప్రధానంగా రెండు టెస్టుల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంపై ముష్ఫికర్ పై విమర్శల వర్షం కురుస్తోంది. తాను చేసింది తప్పంటూ పరోక్షంగా ఒప్పుకుంటూనే సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం కూడా ఇవ్వాలని కోరుతున్నాడు.తొలి టెస్టులో 333 పరుగుల తేడాతో ఓటమి పాలైన బంగ్లాదేశ్.. రెండో టెస్టులో సైతం ఇన్నింగ్స్ 254 పరుగుల భారీ తేడాతో పరాజయం చెందింది. -
బంగ్లాకు ‘వంద’నం
తమ 100వ టెస్టులో లంకపై చిరస్మరణీయ విజయం కొలంబో: టెస్టు హోదా పొందినప్పటి నుంచి 99 మ్యాచ్‌లాడినా... కూనలుగానే ముద్రపడిన బంగ్లాదేశ్ వందో టెస్టులో మాత్రం సమష్టి ఆటతీరుతో చారిత్రక విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. లంక తమ ముందుంచిన 191 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా 57.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (82; 7 ఫోర్లు, 1 సిక్స్) చక్కని పోరాటం చేశాడు. షబ్బీర్ (41; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. జట్టు స్కోరు 131 పరుగుల వద్ద లక్ష్యానికి ఇంకా 60 పరుగుల దూరంలో తమీమ్ మూడో వికెట్‌గా నిష్క్రమించడం, కాసేపటికే షబ్బీర్ కూడా ఔట్ కావడంతో బంగ్లా శిబిరంలో కలవరం మొదలైంది. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (22 నాటౌట్), షకీబుల్ హసన్ (15) కుదురుగా ఆడటంతో బంగ్లా గట్టెక్కింది. లంక బౌలర్లు పెరీరా, హెరాత్‌లు చెరో 3 వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 268/8తో ఆదివారం చివరి రోజు ఆట కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 319 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి టెస్టులో లంక గెలవడంతో రెండు టెస్టుల ఈ సిరీస్ 1–1తో ముగిసింది. తమీమ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... షకీబుల్ కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి. విదేశీ గడ్డపై బంగ్లాకిది నాలుగో విజయంకాగా... శ్రీలంకపై తొలి గెలుపు. ఆస్ట్రేలియా, పాక్, విండీస్ తర్వాత తమ వందో టెస్టులో విజయాన్ని అందుకున్న నాలుగో జట్టు బంగ్లాదేశ్ కావడం విశేషం. -
కొలంబోలో బంగ్లా క్రికెటర్ రికార్డు
ఢాకా: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో 100 డిస్మిసల్స్ చేసిన తొలి బంగ్లా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇందులో 88 క్యాచ్ అవుట్లు, మరో 12 స్టంప్ అవుట్లు ఉన్నాయి. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న కొలంబో టెస్టు మ్యాచ్‌లో ముష్ఫికర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ముష్ఫికర్ తర్వాత అత్యధిక డిస్మిసల్స్ చేసిన బంగ్లా క్రికెటర్‌గా ఖలీద్ మసూద్ (87) రెండో స్థానంలో ఉన్నాడు. 28 ఏళ్ల ముష్ఫికర్ ఇప్పటి వరకు 54 టెస్టులు ఆడాడు. 2005లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 5 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలతో కలిపి 3243 పరుగులు చేశాడు. -
'నా బాధ్యతల పట్ల సంతోషంగా ఉన్నా'
హైదరాబాద్:బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తరపున మూడు రకాల పాత్రలు నిర్వర్తించడం పట్ల కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఆనందం వ్యక్తం చేశాడు. అటు కెప్టెన్ గానే కాకుండా, ఇటు బ్యాట్స్‌మన్ గా, వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. 2011 నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) తనపై నమ్మకం ఉంచి పలు రకాల బాధ్యతలు అప్పజెప్పడం పట్ల ముష్పికర్ కృతజ్ఞతలు తెలియజేశాడు. సుదీర్ఘకాలంగా బంగ్లాదేశ్ క్రికెట్ లో కీలక పాత్రలు నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. 'నాకు అప్పజెప్పిన పాత్రలతో ఆనందంగా ఉన్నా. బ్యాట్స్‌మన్ గా నా యావరేజ్ 33 నుంచి 34 మాత్రమే ఉంది. అటు వంటప్పుడు బంగ్లాదేశ్ కు నంబర్ వన్ బ్యాట్స్‌మన్ ను ఎలా అవుతాను?, నీ దగ్గర పలు రకాల బాధ్యతలను నిర్వర్తించే ప్రతిభ ఉంటే, అప్పుడు మేనేజ్మెంటే కచ్చితంగా నీపై నమ్మకం ఉంచుతుంది. అది కూడా ఆ బాధ్యతలను సరిగా నిర్వర్తించినప్పుడు ఎక్కువ కాలం బోర్డు నమ్మకాన్ని పొందుతాం. కాని పక్షంలో బోర్డు తీసుకుని ఏ నిర్ణయానికైనా బాధ్యత వహించక తప్పదు.ప్రస్తుతం నాకు అప్పజెప్పిన బాధ్యతలను ఎంజాయ్ చేస్తూ నిర్వర్తిస్తున్నా. జట్టుతో పాటు ఉంటూ సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపటాన్ని ఇష్టపడుతున్నా. కెప్టెన్నీ అనేది నా చేతుల్లో లేదు. ఒకవేళ నన్ను కెప్టెన్ ఉంచాలన్నా, తీసేయాలన్నా మా బోర్డు నిర్ణయంపై ఆధారపడుతుంది'అని ముష్ఫికర్ తెలిపాడు. -
ఒకే ఒక్కడు... ముష్ఫికర్
హైదరాబాద్: భారత్ తో ఇక్కడ జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ సెంచరీ నమోదు చేశాడు. 235 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో ముష్ఫికర్ శతకం సాధించాడు. 322/6 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ ఆదిలో రెండు వికెట్లను కోల్పోయింది. ఓవర్ నైట్ ఆటగాడు మెహిది హసన్ మిరాజ్(51) ఇన్నింగ్స్ ఆరంభించిన నాల్గో బంతికే భువనేశ్వర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆపై తైజుల్ ఇస్లామ్(10) ను ుమేశ్ యాదవ్ అవుట్ చేశాడు. దాంతో బంగ్లాదేశ్ 339 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ ను నష్టపోయింది. అయితే మరో ఓవర్ నైట్ ఆటగాడు ముష్ఫికర్ మాత్రం ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ మార్కును చేరాడు. టెయిలెండర్ల సాయంతో క్రీజ్ ను అంటిపెట్టుకుని శతకం పూర్తి చేశాడు. ఇది ముష్ఫికర్ టెస్టు కెరీర్లో ఐదో సెంచరీ. కాగా, భారత్ పై రెండో సెంచరీ. తద్వారా భారత్ పై అత్యధిక సెంచరీలు చేసిన ఒకే ఒక్క బంగ్లా ఆటగాడిగా ముష్ఫికర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. -
తలకు బంతి తగిలి.. కుప్పకూలిన బంగ్లా కెప్టెన్
-
తలకు బంతి తగిలి.. కుప్పకూలిన బంగ్లా కెప్టెన్
వెల్లింగ్టన్: బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అపశృతి చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి రోజు సోమవారం న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీం గాయపడ్డాడు. రహీం బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో అతని తల వెనుక భాగంలో హెల్మెట్‌కు బంతి తగలడంతో కుప్పకూలిపోయాడు. ఇరు జట్ల వైద్య సిబ్బంది వెంటనే మైదానంలోకి పరుగులు పెట్టి రహీంకు ప్రథమ చికిత్స చేశారు. వెంటనే అంబులెన్స్‌లో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ హఠాత్పరిణామంతో మ్యాచ్ 20 నిమిషాలు ఆగిపోయింది. రహీంకు ఎలాంటి ప్రమాదం లేదని, క్షేమంగా ఉన్నారని టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. బంగ్లాదేశ్‌లోని రహీం కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పినట్టు తెలిపారు. రహీంకు ఎక్స్ రే, ఇతర వైద్య పరీక్షలు చేశారని చెప్పారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు చెప్పినట్టు వెల్లడించారు. కాగా ఇదే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ ఇమ్రుల్ కేస్ కాలికి గాయం కావడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. -
షకీబ్ జోరు.. న్యూజిలాండ్ బేజారు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ డబుల్ సెంచరీ(207 నాటౌట్: 263 బంతుల్లో 30 ఫోర్లు) సాధించాడు. బంగ్లా తరఫున ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ గా నిలిచాడు షకీబ్. కివీస్ బౌలర్ గ్రాండ్ హోమ్మీ బౌలింగ్ లో ఫోర్ కొట్టి ఈ అరుదైన మార్క్ ను చేరుకున్నాడు. ఈ క్రమంలో మరిన్ని ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బంగ్లా ఆటగాడిగానూ రికార్డులు సవరించాడు. గతంలో తమీమ్ ఇక్బాల్ (206) పేరిట ఉన్న రికార్డును షకీబ్ బద్ధలుకొట్టాడు. తమీమ్ ఇక్బాల్(206), బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్(200) మాత్రమే గతంలో డబుల్ సెంచరీ చేసిన బంగ్లా ఆటగాళ్లు. డబుల్ సెంచరీ సాధించే క్రమంలో టెస్ట్ కెరీర్ లో మూడు వేల పరుగులు పూర్తిచేసుకున్న మూడో బంగ్లా క్రికెటర్ గానూ వ్యక్తిగత రికార్డును నెలకొల్పాడు షకీబ్. గతంలో బంగ్లా తరఫున తమీమ్ ఇక్బాల్, హబీబుల్ బషర్ మాత్రమే టెస్టుల్లో ఈ ఫీట్ సాధించారు. అయితే షకీబ్ బౌలింగ్ లోనూ రాణించి 159 వికెట్లు సాధించడం విశేషం. డబుల్ సెంచరీ హీరో షకీబ్, కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ సెంచరీ(159) తో కలిసి ఐదో వికెట్ కు బంగ్లా తరఫున 359 పరుగుల అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పాడు. 130 ఓవర్లలో బంగ్లా 5 వికెట్లు కోల్పోయి 531 పరుగులు చేసింది. -
భారత్ ఓడిపోవడమే అతనికి ఆనందమట!
బౌలర్ల వైఫల్యంతో టీమిండియా సెమీస్‌లో పరాభవాన్ని మూటగట్టుకుంది. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ లెండ్ల్ సిమన్స్ 51 బంతుల్లో 82 పరుగులు చేసి.. అద్భుతంగా రాణించడంతో కరేబియన్ జట్టు ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్ ఇలా ముగిసిందో లేదో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ట్విట్టర్లో ఓ తీవ్ర వ్యాఖ్య చేశాడు. 'ఆనందమంటే ఇదే.. హాహాహా! సెమీస్‌లో భారత్ ఓడిపోయింది' అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై వెంటనే ట్విట్టర్లో దుమారం రేపింది. అప్పటికే భారత్ ఓటమితో నిరాశచెందిన అభిమానులకు ఈ ట్వీట్ మరింత ఆగ్రహం కలిగించింది. రహీమ్ తీరును తప్పుబడుతూ వాళ్లు కామెంట్ చేశారు. దీంతో రహీమ్ తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. తాను ఆ వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. ' అందరికీ సారీ.. వెస్టిండీస్‌కు నేను పెద్ద మద్దతుదారుడిని. అయినప్పటికీ పరుషమైన వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరుతున్నా' అని పేర్కొన్నారు. అయితే, ముష్ఫికర్ రహీమ్ ట్వీట్‌ను తప్పబడుతూ టీమిండియా అభిమానులు పెద్ద ఎత్తున ట్విట్టర్లో కామెంట్లతో ముంచెత్తుతున్నారు. Indian fans to Mushfiqur Rahim .... #WT20 #INDvWI pic.twitter.com/vSm1m38Kvz — Taimoor Zaman (@taimoorza1) 31 March 2016 Happiness is this....!!!!!! #ha ha ha..!!!! @mushfiqur15 pic.twitter.com/1Fi8Sy6DVK — Ankur Singh (@iAnkurSingh) 31 March 2016 -
'ఏదో ఒక రోజున ఓడిస్తాం'
కాన్ బెర్రా: పటిష్టమైన ఆస్ట్రేలియా ఓడించే సత్తా తమకుందని బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీం అన్నాడు. తమదైన రోజున ఆసీస్ ను కూడా కట్టడి చేస్తామని దీమా వ్యక్తం చేశాడు. తాజా ప్రపంచకప్ లో అప్ఘానిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడిన బంగ్లాదేశ్ 105 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 56 బంతుల్లో 71 పరుగులు చేసిన ముష్ఫికర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. బిస్బ్రేన్ లో శనివారం జరగనున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఢీకొట్టబోతోంది. ఆసీస్ ను ఆపడం కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదని ముష్ఫికర్ అన్నాడు. ఏదో ఒక రోజున కంగారూలను ఓడిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
బంగ్లాకు తప్పని ఓటమి
10 వికెట్లతో విండీస్ గెలుపు కింగ్స్టౌన్: బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫిఖర్ రహీమ్ (243 బంతుల్లో 116; 15 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీ ఆ జట్టును పరాజయం నుంచి తప్పించలేకపోయింది. మంగళవారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఐదో రోజు 15.3 ఓవర్లలో 58 పరుగులు జోడించిన బంగ్లా తమ రెండో ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ 2.4 ఓవర్లలో అందుకుంది. రహీమ్ తన పోరాట పటిమతో బంగ్లాను ఇన్నింగ్స్ ఓటమి పాలుకాకుండా మాత్రమే కాపాడగలిగాడు. సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు శనివారం నుంచి సెయింట్ లూసియాలో జరుగుతుంది. -
కుప్పకూలిన బంగ్లా
ఢాకా: శ్రీలంక పేసర్లు షమింద ఎరంగ (4/49), సురంగ లక్మల్ (3/66) పదునైన బంతులకు బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. పిచ్ నుంచి అందివచ్చిన సహకారంతో చెలరేగిన ఈ జోడి సంయుక్తంగా ఏడు వికెట్లను తీయడంతో బంగ్లా జట్టు కోలుకోలేకపోయింది. ఫలితంగా షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన తొలి టెస్టులో 63.5 ఓవర్లలో 232 పరుగులకే తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. కెప్టెన్ ముష్ఫికర్ రహీం (122 బంతుల్లో 61; 9 ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (91 బంతుల్లో 55; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా... గజీ (56 బంతుల్లో 42; 6 ఫోర్లు; 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ నిర్ణయాన్ని లంక బౌలర్లు వమ్ము చేయలేదు. వీరి ధాటికి ఏడుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు. బంగ్లాదేశ్ 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో షకీబ్, ముష్ఫికర్ కలిసి 86 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌లో లంక 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. కరుణరత్నే (58 బంతుల్లో 28 బ్యాటింగ్; 4 ఫోర్లు), సిల్వ (57 బంతుల్లో 30 బ్యాటింగ్; 5 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నారు.