ఏప్రిల్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో అవార్డుకు ఈ అవార్డు కోసం ముగ్గురు ఆసియా క్రికెటర్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. వారిలో శ్రీలంక సీనియర్ ఆల్-రౌండర్ ఏంజెలో మాథ్యూస్, వెటరన్ బంగ్లాదేశ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్, శ్రీలంక యువ పేసర్ అసిత ఫెర్నాండో ఉన్నారు. ఇక మహిళల విభాగం నుంచి పాకిస్తాన్ యువ క్రికెటర్ తుబా హసన్, పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్, జెర్సీకి చెందిన ట్రినిటీ స్మిత్ ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఐసీసీ నామినేట్ చేసింది.
ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏంజెలో మాథ్యూస్ అధ్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో మాథ్యూస్ 344 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఇదే టెస్టు సిరీస్‌లో బంగ్లా వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అద్బుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో 303 పరుగులు రహీమ్ సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 5వేల పరుగుల సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇక ఈ టెస్టు సిరీస్‌లో శ్రీలంక యువ పేసర్ అసిత ఫెర్నాండో తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. రెండు టెస్టుల్లో కలిపి 13 వికెట్లు పడగొట్టాడు. ఇక మహిళల విభాగంలో అవార్డుకు నామినేట్ అయిన పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్,తుబా హసన్.. ఇటీవల ముగిసిన శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టారు. అదే విధంగా జెర్సీకి చెందిన ట్రినిటీ స్మిత్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఫ్రాన్స్‌పై దుమ్మురేపింది.
చదవండి: '10 వేల పరుగులు పూర్తి చేయడం.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లే'
Comments
Please login to add a commentAdd a comment