ICC Award
-
ఐసీసీ అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటేందుకు సిద్ధమైపోయాడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. మొదటి బ్యాచ్‌తో కాకుండా కాస్త ఆలస్యంగా అమెరికా చేరుకున్న ఈ రన్‌మెషీన్.. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నాడు.ఈ నేపథ్యంలో తను గెలుచుకున్న ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తాజాగా అందుకున్నాడు కోహ్లి. అదే విధంగా.. ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 క్యాప్‌ను కూడా స్వీకరించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా 2023లో విరాట్ కోహ్లి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ గతేడాది 27 వన్డేలు ఆడి 1377 పరుగులు సాధించాడు.ఇందులో ఆరు సెంచరీలు, ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక గతేడాది కోహ్లి అత్యుత్తమ స్కోరు 166*. అదే విధంగా ఆసియా కప్-2023లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సూపర్ స్టేజ్‌లో సాధించిన 122(నాటౌట్) కూడా హైలైట్‌గా నిలిచిపోయింది.ఇక వన్డే వరల్డ్‌కప్-2023లోనూ ఈ రికార్డుల రారాజు దుమ్ములేపిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో 11 మ్యాచ్‌లలో కలిపి 765 పరుగులు సాధించాడు కోహ్లి. టాప్ స్కోరర్‌గా నిలవడమే గాకుండా.. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతేగాక వన్డేల్లో 50వ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లి.. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అదే విధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా కూడా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన టీమిండియా వార్మప్ మ్యాచ్‌కు కోహ్లి(విశ్రాంతి) దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన బంగ్లాను 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఐసీసీ అవార్డు గెలుచుకున్న ఫాస్ట్ బౌలింగ్ సంచలనం
బౌలింగ్ సంచలనం, విండీస్ ఫాస్ట్ బౌలర్ షమార్ జోసఫ్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు (2024 జనవరి) దక్కించుకున్నాడు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను షమార్ ఈ అవార్డు గెలుచుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్, ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ పోటీపడినప్పటికీ.. విండీస్ సంచలన బౌలర్‌నే అవార్డు వరించింది. వివిధ పద్దతుల్లో జరిగిన ఓటింగ్‌లో అత్యధిక శాతం ఓట్లు షమార్‌కే దక్కాయి. మహిళల విషయానికొస్తే.. ఈ విభాగంలో జనవరి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అమీ హంటర్(ఐర్లాండ్) దక్కించుకుంది. గత నెలలో అద్భుత ప్రదర్శనల నేపథ్యంలో అమీ హంటర్ ఈ అవార్డుకు ఎంపికైంది. అమీతో పాటు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) పోటీపడ్డారు. కాగా, షమార్ జోసఫ్ గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ విండీస్ యువ పేసర్ తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ పర్యటనలో ఆసీస్ బ్యాటర్లను గడగడలాడించిన షమార్ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమార్ విశ్వరూపం (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్ 30 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. -
ఇది కదా క్రికెటింగ్ స్పిరిట్ అంటే.. అవకాశం దొరికినా..!
నేపాల్ క్రికెటర్ ఆసిఫ్ షేక్ 2022 సంవత్సరానికి గాను క్రిస్టఫర్ జెన్కిన్స్ మార్టిన్ (CJM) స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) 2023 మార్చి 21న ప్రకటించింది. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన ఆసిఫ్ 2022 ఫిబ్రవరిలో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆండీ మెక్‌బ్రైన్‌ను రనౌట్ చేసే అవకాశం వచ్చినా ఔట్ చేయకుండా వదిలిపెట్టడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. తన చర్య వల్ల జెంటిల్మెన్ గేమ్ యొక్క ప్రతిష్ఠను పెంచినందుకు గాను ఆసిఫ్‌కు ఈ ఏడాది ఆరంభంలో ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు కూడా దక్కింది. Nepal's Aasif Sheikh has won a Spirit of Cricket Award for this special moment ❤️ pic.twitter.com/FrkBT1y3jC — England's Barmy Army (@TheBarmyArmy) March 20, 2023 అసలేం జరిగిందంటే.. 2022 ఫిబ్రవరిలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కమల్ సింగ్ వేసిన 19వ ఓవర్ మూడో బంతిని ఐర్లాండ్ బ్యాటర్ మార్క్ అదైర్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అదైర్ కొట్టిన షాట్ అతనికి కాళ్లకే తాకి లెగ్‌సైడ్ దిశగా వెళ్లింది. బౌలర్ బంతి కోసం పరుగు పెట్టే క్రమంలో నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న ఆండీ మెక్‌బ్రైన్‌ను ఢీకొట్టాడు. దీంతో అతను పిచ్ మధ్యలో కింద పడిపోయాడు. మెక్‌బ్రైన్ లేచి పరుగు పూర్తి చేసే లోపు బౌలర్ బంతిని వికెట్‌కీపర్ ఆసిఫ్‌కు చేరవేయగా, అతను రనౌట్ చేయడమే తరువాయి అని అంతా అనుకున్నారు. అయితే, తమ బౌలర్ ఢీకొట్టడం వల్లనే మెక్‌బ్రైన్ కిందపడి రనౌటయ్యే ప్రమాదంలో పడ్డాడని భావించిన ఆసిఫ్.. అతన్ని రనౌట్ చేసేందుకు ఇష్టపడలేదు. దీంతో మెక్‌బ్రైన్ విజయవంతంగా పరుగు పూర్తి చేయగలిగాడు. ఆ సమయంలో ఆసిఫ్ చూపిన క్రీడాస్పూర్తికి యావత్ క్రీడాప్రపంచం జేజేలు పలికింది. క్రికెట్ విశ్లేషకులు ఆసిఫ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ నిర్ణీత ఓవరల్లో 127 చేయగా.. ఛేదనలో నేపాల్ 111 పరుగులకు మాత్రమే పరిమితమై 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ.. మెక్‌బ్రైన్‌ను రనౌట్ చేసి ఉంటే తాము గెలిచే వాళ్లమో లేదో తెలీదు, అతన్ని ఔట్ చేసుంటే మాత్రం క్రీడాస్పూర్తి అనే మాటకు అర్ధం లేకుండా పోయేది అంటూ మెచ్యూర్డ్ కామెంట్స్ చేశాడు. కాగా, సీజేఎమ్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు కోసం ఇంగ్లండ్ పరిమిత ఓవర్లు, టెస్ట్ జట్ల కెప్టెన్లు జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ కూడా పోటీపడ్డారు. 2022 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని మాథ్యూ వేడ్ ఔట్ అయినప్పటికీ బట్లర్ అప్పీల్ చేయకుండా వదిలిపెట్టాడు. బెన్ స్టోక్స్ విషయానికొస్తే.. పాక్‌పై సిరీస్ విక్టరీ అనంతరం స్టోక్స్.. యువ ఆటగాడు రెహాన్ అహ్మద్‌కు ట్రోఫీ అందించి క్రీడాస్పూర్తిని చాటాడు. అలాగే ఈ సిరీస్ ఆడటం ద్వారా తనకు వచ్చే పారితోషికం మొత్తాన్ని పాక్‌లో వరద బాధితులకు అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. -
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బాబర్ ఆజం
2022 ఏడాదికి గానూ ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం నిలిచాడు. గతేడాది 9 వన్డేల్లో 84.87 సగటుతో 679 పరుగులు చేసిన బాబర్ ఖాతాలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న బాబర్ ఆజం వరుసగా రెండో ఏడాది కూడా అవార్డు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం బాబర్ ఆజం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో(బ్యాటింగ్ విభాగం) నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. 2021 జూలైలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఇక 2022 ఐసీసీ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచిన విషయం విధితమే. ఇక వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 రేసులో నిలిచిన ఆడమ్ జంపా, సికిందర్ రజా, వెస్టిండీస్ ఓపెనర్ షెయ్ హోప్‌ల కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకొని బాబర్ ఆజం తొలి స్థానంలో నిలిచాడు. ఎంఎస్ ధోనీ, ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ తర్వాత వరుసగా రెండో ఏడాది వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుడు సొంతం చేసుకున్న ఆటగాడిగా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు. దీంతో పాటు బాబర్ ఆజం 2022 ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులోనూ ఉన్నాడు. ఈ అవార్డుకు బాబర్ ఆజంతో పాటు ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజా, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీలు పోటీ పడుతున్నారు ఇంగ్లండ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వార్త్.. ఐసీసీ 2022 అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ అంపైర్‌కు అవార్డు రావడం ఇది రెండోసారి. గతంలో 2019లోనూ ఇల్లింగ్‌వార్త్ విజేతగా నిలిచాడు.సౌతాఫ్రికా యంగ్ ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు కైవసం చేసుకున్నాడు. గతేడాది 36 టెస్టు వికెట్లు తీసిన మార్కో జాన్సెన్.. వన్డేల్లో రెండు, టి20ల్లో ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 234 పరుగులు సాధించాడు. Babar Azam is the ICC Men's ODI Cricketer of the Year for the second year in a row ✨#ICCAwards pic.twitter.com/JcTIEtwwPe — Pakistan Cricket (@TheRealPCB) January 26, 2023 చదవండి: టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై Hulk Hogan: అసభ్యకర ట్వీట్ చేసిన రెజ్లింగ్ స్టార్.. ఆపై తొలగింపు 'సూర్య లేకుంటే మూడు ఫార్మాట్లు లేనట్లే' -
టీమిండియా క్రికెటర్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
ICC Womens Emerging Cricketer Of The Year 2022: భారత స్టార్ మహిళా క్రికెటర్ రేణుకా సింగ్ ఠాకూర్‌కు ఐసీసీ అత్యున్నత పురస్కారం లభించింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న ఈ సిమ్లా (హిమాచల్ ప్రదేశ్) అమ్మాయి.. ఐసీసీ వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఐసీసీ వరల్డ్ గవర్నింగ్ బాడీ ఇవాళ (జనవరి 25) ప్రకటించింది. 𝗣𝗿𝗲𝘀𝗲𝗻𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗜𝗖𝗖 𝗪𝗼𝗺𝗲𝗻’𝘀 𝗘𝗺𝗲𝗿𝗴𝗶𝗻𝗴 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗬𝗲𝗮𝗿 2️⃣0️⃣2️⃣2️⃣ Congratulations Renuka Singh 👏🏻👏🏻#TeamIndia pic.twitter.com/ZKfk7ENDm3 — BCCI (@BCCI) January 25, 2023 26 ఏళ్ల రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ అయిన రేణుకా.. అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి రెండేళ్లకే ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. రేసులో ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, ఇంగ్లండ్ ప్లేయర్ అలైస్ క్యాప్సీ, సహచర క్రికెటర్ యష్తిక భాటియా పోటీపడినప్పటికీ.. రేణుకానే ఈ అవార్డు వరించింది. Impressing everybody with her magnificent displays of seam and swing bowling, the ICC Emerging Women's Cricketer of the Year had a great 2022 👌#ICCAwards2022 — ICC (@ICC) January 25, 2023 రేణుకా టీమిండియా తరఫున ఇప్పటివరకు 7 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 41 వికెట్లు (వన్డేల్లో 18, టీ20ల్లో 23) పడగొట్టింది. ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆమె లేని లోటును భర్తీ చేస్తున్న రేణుకా.. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ ప్రదర్శన తర్వాత రాత్రికిరాత్రి స్టార్ అయిపోయింది. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చిన రేణుకా 4 కీలక వికెట్లు తీసి ఆసీస్ వెన్ను విరిచింది. రేణుకా స్పెల్‌లో ఏకంగా 16 డాట్ బాల్స్ ఉండటం విశేషం. -
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో టీమిండియా పేసర్
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుధవారం ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల పేర్లను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్, అఫ్గానిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జర్దన్, న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్‌లు నామినేట్ అయ్యారు. అర్ష్‌దీప్ సింగ్: టీమిండియాకు ఈ ఏడాది టి20ల్లో లభించిన ఆణిముత్యం అర్ష్‌దీప్ సింగ్. ముఖ్యంగా టి20 ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీరుస్తూ అర్ష్‌దీప్ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్‌గా ఈ మెగాటోర్నీలో పది వికెట్లు తీసిన అర్ష్‌దీప్ ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి20 క్రికెట్లో అడుగుపెట్టాడు. మొత్తంగా 21 మ్యాచ్‌లాడి 18.12 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్స్‌లో యార్కర్ల స్పెషలిస్ట్‌గా ముద్రపడిన అర్ష్‌దీప్ ఎటువంటి గొడవలు, బెరుకు లేకుండా బౌలింగ్ వేసి వికెట్లు పడగొట్టాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో మెల్బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్ హైలైట్‌గా నిలిచింది. ఆరంభంలో తొలి బంతికే బాబర్ ఆజంను గోల్డెన్ డకౌట్ చేసిన అర్ష్‌దీప్ తన మరుసటి ఓవర్లో మహ్మద్ రిజ్వాన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత డెత్ ఓవర్లలో బౌలింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్ ఈసారి ఆసిఫ్ అలీని ఔట్ చేసి ఓవరాల్‌గా 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్: సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ ఈ ఏడాది టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా, బంగ్లాదేశ్‌లతో జరిగిన వన్డేల్లో మ్యాచ్‌ల్లో పలు వికెట్లు తీసిన జాన్సెన్కు ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ మరిచిపోలేనిది. ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 158 పరుగులకే కుప్పకూలడంలో జాన్సెన్ది కీలకపాత్ర. ఆ మ్యాచ్‌లో 35 పరుగులకే ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఇబ్రహీం జర్దన్: ఈ ఏడాది అఫ్గానిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జర్దన్కు మరిచిపోలేని ఏడాదిగా మిగిలిపోనుంది. ఎందుకంటే జర్దన్ ఈ ఏడాది వన్డేల్లో 71.83 సగటుతో 431 పరుగులు.. అలాగే 36.70 సగటుతో టి20ల్లో 367 పరుగులు చేశాడు. ఇక పల్లకెలే వేదికగా లంకతో మ్యాచ్‌లో 162 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్లో మరిచిపోలేనిది. ఆ ఇన్నింగ్స్‌తో అఫ్గాన్ తరపున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే మహ్మద్ షెహజాద్ 131 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. ఫిన్ అలెన్: టి20 మెగాటోర్నీ ఆరంభానికి ముందు స్కాట్లాండ్తో జరిగిన టి20 సిరీస్‌లో భాగంగా 56 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌లో 24 బంతుల్లోనే 42 పరుగులు చేసి ఢిపెండింగ్ చాంపియన్ ఆసీస్ ఓటమికి కారణమయ్యాడు. ఇక ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా ఐర్లాండ్ టూర్లో హాప్ సెంచరీతో మెరిసిన అలెన్ ఆ తర్వాత ఇండియా, వెస్టిండీస్‌లతో మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఇక మహిళల విభాగంలో ఈ అవార్డుకు టీమిండియా నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లు నామినేట్ కావడం విశేషం. పేసర్ రేణుకా సింగ్‌తో పాటు వికెట్ కీపర్ యస్తిక బాటియా ఈ అవార్డు రేసులో ఉన్నారు. వీరిద్దరితో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ డార్సీ బ్రౌన్, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అలిస్ కాప్సీ కూడా పోటీలో ఉన్నారు. ఐసీసీ 2022 అవార్డ్స్‌ను మొత్తంగా 13 కేటగిరీల్లో ఇవ్వనున్నారు. ఇందులో ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన ఆటగాడికి ప్రతిష్టాత్మక సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అందజేయనున్నారు. అలాగే ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన క్రికెటర్‌కు రేచల్ హేయో ఫ్లింట్ అవార్డు ఇవ్వనున్నారు. The future looks bright 🙌 Our nominees for the ICC Men’s Emerging Cricketer of the Year were phenomenal in 2022. Find out more about them 👉 https://t.co/eHhghBmGo3#ICCAwards pic.twitter.com/rY5AAyBSK1 — ICC (@ICC) December 28, 2022 The four nominees for the ICC Women’s Emerging Cricketer in 2022 produced some amazing performances 🔥 More on their achievements 👉 https://t.co/04vQypUyAt #ICCAwards pic.twitter.com/eWir1w81Rk — ICC (@ICC) December 28, 2022 చదవండి: మాట నిలబెట్టుకున్న కేన్ మామ.. 722 రోజుల నిరీక్షణకు తెర -
ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న క్రికెటర్లు వీరే
జూన్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లకు ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. వారిలో ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో, జో రూట్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డార్లీ మిచెల్ ఉన్నారు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బెయిర్ స్టో, రూట్ అదరగొట్టారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బెయిర్ స్టో 394 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు,ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల సాధించిన జాబితాలో అతడు మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఇదే సిరీస్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డార్లీ మిచెల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో 538 పరుగులు చేసి మిచెల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు సెంచరీలు, రెండు ఆర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక రూట్ విషయానికి వస్తే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌లలో రూట్ 396 పరుగులు సాధించాడు. అతడు ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ చేశాడు. చదవండి: Rishabh Pant: టెస్టుల్లో పంత్ అరుదైన రికార్డు.. 49 ఏళ్ల తర్వాత..! -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్లెవరంటే?
ఏప్రిల్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో అవార్డుకు ఈ అవార్డు కోసం ముగ్గురు ఆసియా క్రికెటర్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. వారిలో శ్రీలంక సీనియర్ ఆల్-రౌండర్ ఏంజెలో మాథ్యూస్, వెటరన్ బంగ్లాదేశ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్, శ్రీలంక యువ పేసర్ అసిత ఫెర్నాండో ఉన్నారు. ఇక మహిళల విభాగం నుంచి పాకిస్తాన్ యువ క్రికెటర్ తుబా హసన్, పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్, జెర్సీకి చెందిన ట్రినిటీ స్మిత్ ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఐసీసీ నామినేట్ చేసింది. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏంజెలో మాథ్యూస్ అధ్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో మాథ్యూస్ 344 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఇదే టెస్టు సిరీస్‌లో బంగ్లా వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ అద్బుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో 303 పరుగులు రహీమ్ సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 5వేల పరుగుల సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ టెస్టు సిరీస్‌లో శ్రీలంక యువ పేసర్ అసిత ఫెర్నాండో తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. రెండు టెస్టుల్లో కలిపి 13 వికెట్లు పడగొట్టాడు. ఇక మహిళల విభాగంలో అవార్డుకు నామినేట్ అయిన పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్,తుబా హసన్.. ఇటీవల ముగిసిన శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టారు. అదే విధంగా జెర్సీకి చెందిన ట్రినిటీ స్మిత్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఫ్రాన్స్‌పై దుమ్మురేపింది. చదవండి: '10 వేల పరుగులు పూర్తి చేయడం.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లే' -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్లెవరంటే?
ఏప్రిల్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో అవార్డుకు ముగ్గురు పోటీ పడుతుండగా.. అందులో సౌతాఫ్రికా నుంచి కేశవ్ మహారజ్, సిమోన్ హార్మలు ఉండగా.. ఓమన్ నుంచి జతింధర్ సింగ్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇక మహిళల విభాగం నుంచి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిసా హేలీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నటాలీ సివర్, ఉగాండా ఆల్‌రౌండర్ జానెట్ బబాచిలు ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. రెండు టెస్టులు కలిపి 16 వికెట్లు పడగొట్టాడు. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కేశవ్ మహారాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఏడు వికెట్లతో చెలరేగాడు. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాను 53 పరుగులకే కుప్పకూల్చడంలో మహరాజ్ పాత్ర మరువలేనిది. తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేయడంతో పాటు.. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఫలితంగా సౌతాఫ్రికా 332 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 2-0 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తన ప్రదర్శనతో కేశవ్ మహరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను కూడా ఎగురేసుకపోయాడు. అదే బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సిమోన్ హార్మర్ కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌తో బ్యాటింగ్‌లో కీలకమైన 38 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కేశవ్ మహరాజ్‌కు సపోర్ట్ ఇచ్చిన సిమోన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరిసిన సిమోన్.. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఒమన్ ఓపెనర్‌గా జతింధర్ సింగ్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్2లో భాగంగా స్కాట్లాండ్, పీఎన్‌జీలతో ఏప్రిల్‌లో జరిగిన ట్రై సిరీస్‌లో దుమ్మురేపాడు. నాలుగు మ్యాచ్‌లు కలిపి 259 పరుగులు చేసిన జతింధర్ ఖాతాలో ఒక సెంచరీతో పాటు, మూడు అర్థశతకాలు ఉన్నాయి. ఇక మహిళల విభాగంలో అవార్డుకు నామినేట్ అయిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిసా హేలీ ఇటీవలే ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 138 బంతుల్లోనే 170 పరుగులు చేసి ఆసీసీ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఇక అదే ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన నటాలి సివర్ 121 బంతుల్లో 148 పరుగులు నాటౌట్‌గా నిలిచి తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. -
ఆ ఒక్క నిర్ణయం.. ధోని లాంటి దిగ్గజాల సరసన నిలబెట్టింది
న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డారెల్ మిచెల్ ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ 2021 అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఒత్తిడిలో సింగిల్ తీయకుండా తెలివితో వ్యహరించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించినందుకు మిచెల్‌కు ఈ అవార్డు ఇస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. విషయంలోకి వెళితే.. 2021 నవంబర్ 10న ఇంగ్లండ్, న్యూజిలాండ్ టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: ఓటమి కొనితెచ్చుకోవడమంటే ఇదే.. అనుభవించండి తొలుత బ్యాటిగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ అర్థసెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ లక్ష్యం దిశగా సాగుతుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఆదిల్ రషీద్ వేశాడు. క్రీజులో జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్ ఉన్నారు. స్ట్రైకింగ్‌లో ఉన్న నీషమ్.. రషీద్ వేసిన బంతిని మిడాఫ్ దిశగా ఆడాడు. ఇక్కడ ఈజీ సింగిల్‌కు ఆస్కారమున్నప్పటికి.. బంతి కోసం పరిగెడుతున్న రషీద్‌కు మిచెల్ అడ్డువచ్చాడు. ఇక్కడే మిచెల్ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. రషీద్‌ను తోసేసి పరుగుకు వెళ్లొచ్చు.. కానీ మిచెల్ అలా చేయకుండా సింగిల్ వద్దంటూ నీషమ్‌ను వారించాడు. అలా చేస్తే అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్ కిందకు వస్తుందని.. ఇది మంచి పద్దతి కాదని మ్యాచ్ అనంతరం మిచెల్ వివరించాడు. కాగా డారిల్ మిచెల్ క్రీడాస్పూర్తికి పలువురు మాజీ ఆటగాళ్లు ఫిదా అయ్యారు. అంత ఒత్తిడిలోనూ మిచెల్ తెలివిగా వ్యవహరించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించడం గొప్ప విషయమని లైవ్ కామెంటరీలో ఉన్న మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సెన్ తెలిపాడు. ఇక మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవడంలో డారిల్ మిచెల్ కీలకపాత్ర పోషించాడు. 47 బంతుల్లో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన న్యూజిలాండ్ రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలిచిన నాలుగో న్యూజిలాండ్ ఆటగాడిగా డారిల్ మిచెల్ నిలిచాడు. అంతకముందు డేనియల్ వెటోరి, బ్రెండన్ మెక్కల్లమ్, కేన్ విలియమ్సన్‌లు ఈ అవార్డు తీసుకున్నారు. ఇక టీమిండియా నుంచి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును ఎంఎస్ ధోని (2011), విరాట్ కోహ్లి(2019)లో గెలుచుకోవడం విశేషం. A gesture that won the hearts of millions 🙌 Daryl Mitchell – the winner of the ICC Spirit of Cricket Award 2021 👏 Details 👉 https://t.co/pLfSWlfIZB pic.twitter.com/zq8e4mQTnz — ICC (@ICC) February 2, 2022 -
శెభాష్ స్మృతి మంధాన... ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన ఓపెనర్
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు సముచిత గౌరవం దక్కింది. 2021 ఏడాదికి గానూ ఆమె ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా భారత్ కేవలం రెండే మ్యాచ్‌లలో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ రెండు విజయాల్లోనూ ఓపెనర్ స్మృతి కీలక పాత్ర పోషించింది. రెండో వన్డేల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచిన ఆమె... చివరి టీ20 మ్యాచ్‌లో 48 పరుగులు చేసింది. అదే విధంగా.... ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో 78 పరుగులు సాధించిన ఆమె... మ్యాచ్ డ్రా కావడంలో తన వంతు పాత్ర పోషించింది. అంతేగాక భారత్ గెలిచిన ఏకైక వన్డే సిరీస్‌లో 49 పరుగులతో రాణించింది. ఇక టీ20 సిరీస్‌లో భాగంగా 15 బంతుల్లో కీలకమైన 29 పరుగులతో పాటు అర్ధ సెంచరీ సాధించి సత్తా చాటింది. అంతేగాక ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో స్మృతి మంధాన 86 పరుగులు చేసింది. ఇక కంగారూలతో జరిగిన ఏకైక టెస్టులో సెంచరీ సాధించింది. ఇలా పలు మ్యాచ్‌లలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న స్మృతిని ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టమీ బేమౌంట్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs SA - Deepak Chahar: గెలిచే అవకాశం ఇచ్చాడు కానీ! కన్నీళ్లు పెట్టుకున్న దీపక్ చహర్.. వైరల్ A year to remember 🤩 Smriti Mandhana's quality at the top of the order was on full display in 2021 🏏 More on her exploits 👉 https://t.co/QI8Blxf0O5 pic.twitter.com/3jRjuzIxiT — ICC (@ICC) January 24, 2022 -
‘ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ రేసులో స్మృతి
దుబాయ్: ప్రతిష్టాత్మక వార్షిక అవార్డు ఎంపిక ప్రక్రియలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ‘ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ నామినేషన్ల వివరాలను ప్రకటించింది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ‘రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ’ పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం నాలుగు పేర్లను ఐసీసీ నామినేట్ చేసింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ అవార్డు కోసం పోటీ పడుతోంది. చదవండి: Kohli Vs BCCI: 'కోహ్లి మాటల్లో నిజం లేదు.. టి20 కెప్టెన్‌గా తప్పుకోవద్దని సూచించాం' ఈ జాబితాలో స్మృతితో పాటు బీమాంట్ (ఇంగ్లండ్), లిజెల్లి లీ (దక్షిణాఫ్రికా), గ్యాబీ లెవిస్ (ఐర్లాండ్) ఉన్నారు. ఈ ఏడాది స్మృతి 22 అంతర్జాతీయ మ్యాచ్‌లలో కలిపి 38.86 సగటుతో 855 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన ‘పింక్ టెస్టు’లో సెంచరీ చేసిన స్మృతి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. పాకిస్తాన్ నుంచి ఇద్దరు... ఐసీసీ అవార్డుల్లో అన్నింటికంటే మేటిగా భావించే ‘మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ నామినేషన్లను ఐసీసీ ప్రకటించింది. ‘సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మొహమ్మద్ రిజ్వాన్, పేస్ బౌలర్ షాహిన్ అఫ్రిది పోటీ పడుతున్నారు. చదవండి: IND Vs SA: తొలి టెస్టు విజయం.. టీమిండియాకు ఐసీసీ షాక్ -
'మెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'.. టీమిండియా నుంచి ఒక్కరు లేరు!
ఐసీసీ మెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు సంబంధించి ఐసీసీ బుధవారం నలుగురు ఆటగాళ్లను నామినేట్ చేసింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్, శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగా, ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు మిచెల్ మార్ష్, పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లు ఉన్నారు. ►ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్ ఈ ఏడాది టి20 క్రికెట్లో అద్భుత ఫామ్ కనబరిచాడు. ఈ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ 589 పరుగులు సాధించాడు. ఇటీవలే జరిగిన టి20 ప్రపంచకప్ 2021లో 269 పరుగులతో దుమ్మురేపాడు. ►ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు మిచెల్ మార్ష్ పేరు చెప్పగానే.. 2021 టి20 ప్రపంచకప్ ఫైనల్ గుర్తురాక మానదు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 50 బంతుల్లో 77 పరుగులు చేసి ఆసీస్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా మార్ష్ ఈ ఏడాది టి20 క్రికెట్లో 627 పరుగులు సాధించాడు. ►పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్.. టి 20 క్రికెట్లో ఓపెనర్‌గా దుమ్మురేపాడు. ఒక్క ఏడాదిలో టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రిజ్వాన్ రికార్డు అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది టి20 క్రికెట్లో పాకిస్తాన్ తరపున 1326 పరుగులు చేశాడు. ఇక టి20 ప్రపంచకప్ 2021లో రిజ్వాన్ 281 పరుగులు సాధించడం విశేషం. ►శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగా టి20 ప్రపంచకప్ 2021లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. అంతేకాదు ఈ ఏడాది టి20 క్రికెట్లో 36 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ తనదైన పాత్ర పోషించాడు. -
'టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' ఎవరు? రేసులో టీమిండియా స్పిన్నర్
టెస్టు క్రికెట్లో ప్రతీ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాడికి టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వడం ఆనవాయితీ. ఇక 2021 సంవత్సరానికి పోటీ పడుతున్న నలుగురు ఆటగాళ్ల నామినేషన్ జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమిసన్, శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఉన్నారు. ►ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్లో 15 టెస్టులాడి 1708 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్, వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ తర్వాత రూట్ ఒకే క్యాలండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసి మూడోస్థానంలో నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ జట్టుగా విఫలమైనప్పటికి రూట్ మాత్రం స్థిరంగా రాణించడం విశేషం. ►టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో ఈ ఏడాది అత్యద్బుత ఫామ్‌ను కనబరిచాడు. 8 టెస్టుల్లో 52 వికెట్లు తీసిన అశ్విన్ బ్యాటింగ్‌లోనూ 337 పరుగులు సాధించాడు. ఇందులో ఒక టెస్టు సెంచరీ ఉండడం విశేషం. ►ఇక న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమిసన్ అరంగేట్రం చేసిన ఏడాదిలోనే మంచి పేరు సంపాదించాడు. ఈ 12 నెలల కాలంలో జేమిసన్ ఐదు టెస్టు మ్యాచ్‌లాడి 27 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కివీస్ జట్టు టెస్టులో తొలిసారి ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలవడంలో జేమీసన్ కీలకపాత్ర పోషించాడు. అంతేగాక టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ జేమీసన్ అద్భుతంగా రాణించాడు. ►శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఈ ఏడాది టెస్టు ఓపెనర్‌గా అద్భుతంగా ఆడాడు. ఏడు మ్యాచ్‌ల్లో 902 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో వరుసగా శతకాలు బాది లంక బెస్ట్ ఓపెనర్‌గా అవార్డు నామినేషన్లో చోటు దక్కించుకున్నాడు. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా సందీప్ లమిచ్చానే
Sandeep Lamichhane As ICC Mens Palyer Of Month.. సెప్టెంబర్ నెలకు గానూ ప్రతిష్టాత్మక మెన్స్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును నేపాల్ లెగ్ స్పిన్నర్ సందీప్ లమిచ్చానే సొంతం చేసుకున్నాడు. ఇక మహిళల విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన హెథర్ నైట్ వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికైంది. కాగా లమిచ్చానేకు బంగ్లాదేశ్ బౌలర్ నసూమ్ అహ్మద్, యూఎస్ఏ బ్యాటర్ జస్క్రన్ మల్హోత్రాలతో గట్టిపోటీ ఎదురైంది. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2లో చేసిన ప్రదర్శన ఆధారంగానే సందీప్ లమిచ్చానే ఈ అవార్డుకు ఎంపికయ్యడంటూ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ఐసీసీ ఓటింగ్ అకాడమీ మెంబర్ జేపీ డుమిని పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2021: మూడో స్థానం అంటే చాలా ఇష్టం.. అవకాశమొస్తే హెథర్ నైట్, ఇంగ్లండ్ మహిళ క్రికెటర్ ఆ టోర్నమెంట్లో 6 వన్డేలాడిన లమిచ్చానే 3.17 ఎకానమీ రేటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఒమన్, పపువా న్యూజినియాతో జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పపువా న్యూ జినియాతో మ్యాచ్‌ల్లో 4/35, 6/11 నమోదు చేసిన లమిచ్చానే ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4/18తో మెరిశాడు. కాగా లమిచ్చానే గతంలో ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక నేపాల్ తరపున 16 వన్డేల్లో 41 వికెట్లు.. 26 టి20ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. ఇక వుమెన్స్ విభాగంలో అవార్డు గెలుచుకున్న హెథర్ నైట్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 4-1తో గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో 214 పరుగులు చేసిన నైట్ బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచింది. చదవండి: T20WC IND Vs PAK: తప్పులు తక్కువ చేసిన జట్టుదే విజయం -
ఫీల్డర్లను పరుగులు పెట్టించిన కుక్క.. ఐసీసీ ప్రత్యేక అవార్డు
దుబాయ్: ఐసీసీ తాజాగా ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల జాబితాలో ఒక బుజ్జి కుక్క చోటు సంపాదించింది. ఐసీసీ డాగ్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న ఆ బుజ్జి కుక్క ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ అవార్డుపై ఐసీసీ ట్విటర్లో స్పందింస్తూ.. ''ఈసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల్లో ఒక కొత్త అతిథి వచ్చి చేరింది. బంతిని నోట కరచుకొని మైదానంలో ఫీల్డర్లను పరుగులు పెట్టించిన కుక్క అది.. అందుకే దాన్ని అథ్లెట్ డాగ్ పరిగణిస్తూ.. ''ఐసీసీ డాగ్ ఆఫ్ ది మంత్'' అవార్డును బహుకరించాం'' అంటూ పోస్ట్ చేసింది. చదవండి: రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు గతవారం ఐర్లాండ్ క్లబ్ క్రికెట్లో భాగంగా మైదానంలో బుజ్జి కుక్క ఫీల్డర్లను పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. బ్రీడీ, సీఎస్ఎన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అబ్బీ లెక్కీ స్కేర్‌లెగ్ దిశగా షాట్ ఆడింది. ఫీల్డర్ బంతిని అందుకొని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరింది. అదే సమయంలో ఒక బుజ్జి కుక్క తన యజమాని నుంచి తప్పించుకొని మైదానంలోకి పరుగులు తీసింది. బంతిని అందుకున్న బౌలర్ వికెట్లను గిరాటేసే ప్రయత్నం చేయగా.. మిస్ అయింది. అలా రనౌట్ అవకాశం కూడా పోయింది. ఇక బంతిని బుజ్జి కుక్క తన నోట కరుచుకొని గ్రౌండ్లో పరుగులు పెట్టింది. అలా ఫీల్డర్లు కూడా ఆ కుక్క వెంబడి పరుగులు తీశారు. ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది. చదవండి: జో రూట్ ఘనత.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్‌గా Exceptional athleticism in the field 👌pic.twitter.com/N5U1szC5ZI — ICC (@ICC) September 13, 2021 -
‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ రేసులో టీమిండియా మహిళా క్రికెటర్లు
దుబాయ్: జూన్ నెలకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ నామినీలను ఐసీసీ ప్రకటించింది. కాగా టీమిండియా మహిళల జట్టు నుంచి భారత టీనేజ్ బ్యాట్స్‌వుమెన్ షఫాలీ వర్మ, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’ మహిళల కేటగిరీ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో రాణించడం ద్వారా గత నెల అవార్డు రేసులో ఉన్నారు. అరంగేట్రం చేసిన టెస్టులోనే వీళ్లిద్దరు అర్ధసెంచరీలతో కదంతొక్కి భారత జట్టును ‘డ్రా’తో గట్టెక్కించారు. ఇక పురుషుల కేటగిరీలో న్యూజిలాండ్ క్రికెటర్లు డెవన్ కాన్వే, జేమీసన్, దక్షిణాఫ్రికా ప్లేయర్ డికాక్ అవార్డు రేసులో ఉన్నారు. టీమిండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కైల్ జేమిసన్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు మొత్తంగా ఏడు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్, టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో బ్యాటింగ్‌లో డెవన్ కాన్వే మెరిశాడు. కాగా ఈసారి టీమిండియా పురుషుల జట్టు నుంచి ఒక్కరు కూడా ఎంపికవలేదు. ఇక షఫాలీ వర్మ టీ 20 ఫార్మాట్లో ఆకట్టుకోవడంతో.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులు, వన్డేల్లో అరంగేట్రం చేసింది. ఈ సిరీస్‌లోనూ ఆకట్టుకోవడంతో పాటు ఏకైక టెస్టులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకుంది. దాంతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్థ సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాట్స్‌వుమెన్‌గా నిలిచింది. ఆల్‌రౌండర్ స్నేహ్రాణా ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టును డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించింది. 154 బంతుల్లో 80 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. చివరకు ఇంగ్లండ్ టీంకు విజయాన్ని దూరం చేసింది. బౌలింగ్‌లోనూ రాణించి నాలుగు వికెట్లు పడగొట్టింది. అవార్డుకు నామినేట్ అయిన ఇంగ్లండ్ బౌలర్సోఫీ ఎకిల్‌స్టోన్ 8 వికెట్లు పడగొట్టింది. -
'ప్లేయర్ ఆఫ్ ద మంత్' రవిచంద్రన్ అశ్విన్
దుబాయ్: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిబ్రవరి నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన అశ్విన్‌ను ఈ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ రేసులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ ఉన్నప్పటికీ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన అశ్విన్‌వైపే ఐసీసీ మొగ్గుచూపింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు తీసిన అశ్విన్.. చెన్నైలో జరిగిన రెండో టెస్ట్‌లో సెంచరీ కూడా సాధించాడు. ఒక సిరీస్‌లో 30కిపైగా వికెట్లు సాధించడం అశ్విన్‌కు ఇది రెండోసారి. అంతేకాదు ఈ ఫీట్‌ను సాధించిన ఏకైక ఇండియన్ బౌలర్ కూడా అశ్వినే కావడం విశేషం. కాగా, టీమిండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించినట్లు ఐసీసీ తన ట్వీటర్ ఖాతాలో పేర్కొంది. ఐసీసీ ఈ ఏడాది ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్‌ను జనవరి నెలకుగాను టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎగురేసుకుపోగా, ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్‌ను అశ్విన్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుతంగా రాణించిన పంత్.. ఈ అవార్డును గెలుచుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. -
ఐసీసీ అవార్డు రేసులో ముగ్గురు.. విజేత ఎవరో!
దుబాయ్: గత జనవరి చివరి వారంలో ఐసీసీ కొత్తగా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అన్ని రకాల ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. పురుషులతో పాటు మహిళ క్రికెటర్లను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరుగుతుంది. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించి 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లను నామినేట్ చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. అందులో టీమిండియా నుంచి ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ ఉన్నారు. ఐసీసీ వెబ్సైట్ ద్వారా అభిమానులు తమకు నచ్చిన ఆటగాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఓటింగ్ ఆధారంగా మార్చి 8న అవార్డు ఎవరికి వరిస్తుందో తేలనుంది. కాగా రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా తరపున ఇంగ్లండ్ సిరీస్‌లో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆ టెస్టులో అశ్విన్ 106 పరుగులు చేయడమే గాక బౌలింగ్‌లోనూ 8 వికెట్లతో రాణించాడు. అంతేగాక మొటేరా వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 400 వికెట్ల ఫీట్‌ను అందుకోవడమేగాక ఆ మ్యాచ్‌లో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక రూట్ విషయానికి వస్తే.. టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో మెరిసి ఇంగ్లండ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. వీరిద్దరిని పక్కనపెడితే.. విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ నామినేట్ కావడం ఆసక్తి కలిగించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మేయర్స్ డెబ్యూ మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీతో(210 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఈ ఫీట్‌ను మేయర్స్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో అందుకోవడం విశేషం. అంతేగాక అతని ఇన్నింగ్స్‌తో విండీస్ టెస్టు క్రికెట్ చరిత్రలో 5వ అత్యధిక స్కోరును చేధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. వీరితో పాటు మహిళా క్రికెటర్లలో ఇంగ్లండ్ నుంచి టామీ బ్యూమాంట్ ,నాట్ సైవర్, బ్రూక్ హిల్లాడే( న్యూజిలాండ్) 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు నామినేట్ అయ్యారు. చదవండి: 'అందుకే ఐపీఎల్ నుంచి పక్కకు తప్పుకున్నా' దుమ్మురేపిన అశ్విన్.. కెరీర్ బెస్ట్‌కు రోహిత్ Who’s your ICC Men’s Player of the Month for February? Joe Root 🏴 218 Test runs at 55.5 & six wickets at 14.16 R Ashwin 🇮🇳 106 Test runs at 35.2 & 24 wickets at 15.7 Kyle Mayers 🌴 261 Test runs at 87 Vote here 👉 https://t.co/FBb5PMqMm8 pic.twitter.com/Mwiw5fuauy — ICC (@ICC) March 2, 2021 -
ఐసీసీ అవార్డ్స్‌లో కోహ్లి, రోహిత్ హవా..!
ముంబై: ఐసీసీ అవార్డుల్లో టీమిండియా క్రికెటర్లు సత్తా చాటారు. టీమిండియా వన్డే కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ అవార్డుల్లో దుమ్ము దులిపారు. కోహ్లికి స్పిరిట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, రోహిత్‌కి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు దక్కాయి. కాగా.. 2019 వరల్డ్‌కప్‌లో రోహిత్ ఐదు సెంచరీలతో ఆకట్టుకోగా, కోహ్లీ అటు టెస్ట్‌ల్లో, వన్డేల్లో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తాజాగా మరోసారి ఐసీసీ అవార్డుల్లో కూడా హవా చూపారు. -
ఐసీసీ అవార్డు రేసులో భువనేశ్వర్
దుబాయ్: భారత యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరును ఐసీసీ అవార్డుకు నామినేట్ చేశారు. పీపుల్స్ చాయిస్ అవార్డుకు భువితో పాటు మరో నలుగురు క్రికెటర్లను నామినేట్ చేశారు. అయితే వీరిలో ఒక్కరినే అవార్డుకు ఎంపిక చేస్తారు. క్రికెట్ అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. గెలిచిన వారికి వార్షిక ఐసీసీ అవార్డుల కార్యక్రమంలో అందజేస్తారు. www.lgiccawards.com ద్వారా తమ అభిమాన క్రికెటర్‌కు ఓటు వేయవచ్చు. అవార్డు రేసులో భవితో పాటు ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్, ఆస్ట్రేలియా ఫేసర్ మిచెల్ జాన్సన్, శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్, దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ ఉన్నారు.