జూన్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లకు ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. వారిలో ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో, జో రూట్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డార్లీ మిచెల్ ఉన్నారు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బెయిర్ స్టో, రూట్ అదరగొట్టారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బెయిర్ స్టో 394 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు,ఒక హాఫ్ సెంచరీ ఉంది.
ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల సాధించిన జాబితాలో అతడు మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఇదే సిరీస్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డార్లీ మిచెల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో 538 పరుగులు చేసి మిచెల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు సెంచరీలు, రెండు ఆర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక రూట్ విషయానికి వస్తే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌లలో రూట్ 396 పరుగులు సాధించాడు. అతడు ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ చేశాడు.
చదవండి: Rishabh Pant: టెస్టుల్లో పంత్ అరుదైన రికార్డు.. 49 ఏళ్ల తర్వాత..!
Comments
Please login to add a commentAdd a comment