ICC announcement
-
వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకటనకు ముహూర్తం ఖరారు..!
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్ ప్రకటనను ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల (జూన్) 27న షెడ్యూల్ విడుదల చేసేందుకు ఐసీసీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వరల్డ్‌కప్ ప్రారంభ తేదీ అయిన అక్టోబర్ 5కు జూన్ 27 సరిగ్గా 100 రోజులు ముందుండంతో ఐసీసీ ఈ తేదీన షెడ్యూల్ విడుదల చేసేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాగా, బీసీసీఐ-పీసీబీల మధ్య ఆసియా కప్-2023, వన్డే వరల్డ్‌కప్-2023 వేదికల వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకటన ఆలస్యం అవుతూ వస్తుంది. ఐసీసీ పంపిన ముసాయిదా షెడ్యూల్‌కు పీసీబీ ఇంత వరకు ఆమోదం తెలుపలేదు. షెడ్యూల్‌కు ఆమోదం తెలపాల్సింది తమ ప్రభుత్వమని పీసీబీ తాత్కాలిక అధ్యక్షుడిగా దిగిపోయే ముందు నజమ్ సేథి ప్రకటన చేశాడు. భద్రత కారణాల దృష్ట్యా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పీసీబీ స్పష్టం చేసింది. ఈ విషయంలోనే బీసీసీఐ-పీసీబీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. మరోవైపు పీసీబీ కాబోయే ఛైర్మన్ జకా అష్రాఫ్ ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించడం ఇష్టం లేదని, దీనికి తాను వ్యతిరేకమంటూ బాంబు పేల్చాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ అధికారికంగా షెడ్యూల్ ప్రకటించాక అయినా పీసీబీ దానికి అమోదం తెలుపుతుందా లేక ఏవైనా కారణాలు సాకుగా చూపించి అడ్డుపుల్ల వేస్తుందా అన్న విషయం తేలాంటే ఒకటి రెండ్రోజుల వరకు వేచి చూడాల్సిందే. -
జై షా చెప్పిందే నిజమైంది.. ఐపీఎల్‌పై ఐసీసీ కీలక నిర్ణయం
ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పిందే అక్షరాల నిజమైంది. నివేదికల ప్రకారం.. ఐసీసీ 2023-27 ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (ఎఫ్టీపీ)లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సింహ భాగాన్ని దక్కించుకుంది. తదుపరి ఎఫ్టీపీలో ఐపీఎల్‌ను రెండున్నర నెలల పాటు నిర్వహించుకునేందుకు ఐసీసీ పచ్చజెండా ఊపింది. ఐపీఎల్‌తో పాటు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్, ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్‌లు కూడా ఎఫ్టీపీలో తమ బెర్తులను పొడిగించుకున్నాయి. ఈ మేరకు ఐసీసీ ఎఫ్‌టీపీని రూపొందిచినట్లు తెలుస్తోంది. తాజా సవరణలతో ఐపీఎల్ మార్చి చివరి వారంలో ప్రారంభమైన జూన్ మొదటి వారంలో (రెండున్నర నెలలు) ముగుస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లు ఎంటర్ కావడంతో మ్యాచ్‌ల సంఖ్య 60 నుంచి 74కు పొడిగించబడగా.. ఈ సంఖ్య 2023, 2024 సీజన్లలో ఆలాగే కొనసాగి.. 2025, 2026 ఎడిషన్లలో 84కు, 2027 సీజన్లో 94కు చేరుతుంది. ఐపీఎల్ విండో పొడిగించబడినప్పటికీ.. ఇప్పట్లో ఫ్రాంచైజీల సంఖ్య పెంచే ఆలోచన లేదని బీసీసీఐ తెలపడం కొసమెరుపు. ఇదిలా ఉంటే, ఐసీసీ 2023-27 ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాంలో ఐసీసీ విండో పొడిగింపుపై జై షా గత నెలలోనే ట్వీట్ చేశాడు. షా చెప్పినట్లుగానే ఐసీసీ తమ ఎఫ్టీపీలో ఐపీఎల్‌కు అగ్రతాంబూలం అందించింది. చదవండి: అందుకే బీసీసీఐ కోహ్లిని తప్పించే సాహసం చేయలేకపోతుంది..! -
డోపింగ్‌కు పాల్పడ్డ బంగ్లాదేశ్ పేసర్‌పై వేటు
బంగ్లాదేశ్ యువ పేసర్ షోహిదుల్ ఇస్లాంపై ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) అనర్హత వేటు వేసింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు రుజువు కావడంతో ఐసీసీ అతనిపై 10 నెలల నిషేధం విధించింది. ఈ ఏడాది మే 28 నుంచి పది నెలల పాటు నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించింది. అనర్హత వేటు అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని వివరించింది. బంగ్లాదేశ్ తరఫున ఓ టీ20 ఆడిన 27 ఏళ్ల షోహిదుల్.. 2023 మార్చి 28 తర్వాతే మైదానంలోకి అడుగపెట్టాలని ఆదేశించింది. డోపింగ్ నిరోధక కోడ్ ఆర్టికల్ 2.1ని ఉల్లంఘించిన నేరాన్ని షోహిదుల్ అంగీకరించిన తరువాత ఐసీసీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. షోహిదుల్ మూత్ర నమూనాలో నిషేధిత పదార్థం క్లోమిఫెన్ ఉన్నట్లు ఐసీసీ నిర్ధారించింది. కాగా షోహిదుల్ ఇస్లాం ఇటీవల న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ల్లో పర్యటించిన బంగ్లాదేశ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే జట్టు సమీకరణల్లో భాగంగా అతనికి తుది జట్టులో అవకాశం లభించలేదు. చదవండి: WC 2023: టాప్‌లోకి దూసుకువచ్చిన బంగ్లాదేశ్.. ఏడో స్థానంలో రోహిత్ సేన! -
ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న క్రికెటర్లు వీరే
జూన్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డుకు ముగ్గురు ఆటగాళ్లకు ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. వారిలో ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో, జో రూట్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డార్లీ మిచెల్ ఉన్నారు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బెయిర్ స్టో, రూట్ అదరగొట్టారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బెయిర్ స్టో 394 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు,ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల సాధించిన జాబితాలో అతడు మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఇదే సిరీస్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డార్లీ మిచెల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో 538 పరుగులు చేసి మిచెల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు సెంచరీలు, రెండు ఆర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక రూట్ విషయానికి వస్తే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌లలో రూట్ 396 పరుగులు సాధించాడు. అతడు ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ చేశాడు. చదవండి: Rishabh Pant: టెస్టుల్లో పంత్ అరుదైన రికార్డు.. 49 ఏళ్ల తర్వాత..! -
టీ20 వరల్డ్‌కప్-2022కు సంబంధించి కీలక ప్రకటన
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను సెప్టెంబర్ 15లోపు ప్రకటించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆయా జట్లకు డెడ్‌లైన్ విధించింది. నిర్ధేశిత గడువులోగా జట్లన్నీ ప్రపంచకప్ బరిలోకి దిగబోయే 15 మంది సభ్యుల వివరాలను సమర్పించాలని సంబంధిత క్రికెట్ బోర్డులను ఐసీసీ ఆదేశించింది. ఐసీసీ నుంచి వెలువడిన ఈ ప్రకటనతో మెగా టోర్నీలో పాల్గొనబోయే జట్లన్నీ అలర్టయ్యాయి. ఆటగాళ్ల ఎంపిక విషయంలో కసరత్తును వేగవంతం చేశాయి. కాగా, అక్టోబర్ 16న జరిగే క్వాలిఫయర్ మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. గ్రూప్ స్టేజ్‌లో నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, యూఏఈ జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. అనంతరం రెండు గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో సూపర్ 12 రౌండ్లో అమీతుమీ తేల్చుకుంటాయి. సూపర్ 12 రౌండ్ గ్రూప్ 1లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడనుండగా.. గ్రూప్ 2 నుంచి బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు తలపడతాయి. ఈ టోర్నీలో టీమిండియా దాయాది పాక్‌తో అక్టోబర్ 23న తలపడనుంది. చదవండి: T20 WC 2022: పంత్ వైఫల్యం.. డీకే జోరు.. ద్రవిడ్ ఏమన్నాడంటే! -
ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో ఒకే ఒక్క భారతీయుడు
ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో భారత అంపైర్ నితిన్ మీనన్ మరోసారి స్థానం దక్కించుకున్నాడు. మీనన్ సేవలను మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఐసీసీ గురువారం ప్రకటించింది. ఈ నెలాఖరులో శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా మీనన్ న్యూట్రల్ అంపైర్‌గా అరంగేట్రం చేయనున్నాడు. ఐసీసీ ప్రకటించిన 11 మంది సభ్యుల ఎలైట్ ప్యానెల్లో ఇండోర్‌కు చెందిన 38 ఏళ్ల నితిన్ మీనన్ ఏకైక భారత అంపైర్ కావడం విశేషం. 2020లో కోవిడ్ సమయంలో మీనన్ తొలిసారి ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకున్నాడు. ఎస్. వెంకటరాఘవన్, ఎస్. రవి తర్వాత ఎలైట్ క్లబ్లో చేరిన మూడో భారతీయుడిగా నితిన్ మీనన్ రికార్డుల్లో నిలిచాడు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా మీనన్ కేవలం భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు మాత్రమే అంపైర్‌గా వ్యవహరించాడు. తాజాగా విదేశాల్లో ప్రయాణ అంక్షలు ఎత్తివేయడంతో మీనన్ తొలిసారి న్యూట్రల్ అంపైర్‌గా కనిపించనున్నాడు. మీనన్ ప్రస్తుతంభారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో మీనన్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన అలీమ్ దార్, న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్ ఎరాస్మస్, మైఖేల్ గోఫ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, ఆస్ట్రేలియా నుండి పాల్ రీఫిల్, ఇంగ్లండ్ నుంచి రాడ్ టక్కర్, వెస్టిండీస్ నుండి జోయెల్ విల్సన్ ఉన్నారు. చదవండి: 'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్ట్‌తో సంబంధం అంటగట్టి' -
రష్యా నేరాలపై ఐసీసీలో విచారణ
హేగ్: ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడిలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) విచారణ ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న నరమేధంపై విచారణ ప్రారంభించినట్టుగా ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ చెప్పారు. రష్యా యుద్ధ నేరాలపై విచారణ జరగాలని అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. రష్యా అనాగరిక చర్యలపై విచారణ జరిపించి దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు యూకే, దాని మిత్రదేశాలు పోరాటం చేస్తాయని చెప్పారు. రష్యా చేస్తున్న నేరాలకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరిస్తున్నామని తెలిపారు. రష్యా నేరాలపై విచారణకు ఐసీసీ న్యాయమూర్తులు అంగీకరించిన తర్వాత ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ తాము ఆధారాలు సేకరించే పని మొదలు పెట్టినట్టుగా తెలిపారు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ దాడుల్లో 2 వేల మందికిపైగా పౌరులు మరణించారని చెబుతోంది. రష్యా విచక్షణారహితంగా పౌరులు నివసించే ప్రాంతాలు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటివాటిపై బాంబులు వేస్తూ ఉండడంతో హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో మానవ హక్కుల హననం జరుగుతోందని ఐసీసీ విచారణకు అంగీకరించడంతోనే అర్థమవుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తాత్కాలిక అధ్యక్షుడు బల్కీస్ జర్రా చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్,అధికారులపై అభియోగాలు మోపే అవకాశాలున్నాయి. (చదవండి: భారత్‌పై కాట్సా.. బైడెన్‌దే నిర్ణయం) -
టీమిండియా క్రికెటర్లను దారుణంగా అవమానించిన ఐసీసీ
2021 ఐసీసీ టీ20 జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా అవకాశం కల్పించకుండా ఘోరంగా అవమానించిన ఐసీసీ.. గంటల వ్యవధిలోనే మరోసారి టీమిండియా ఆటగాళ్లను చులకన చేసింది. తాజాగా విడుదల చేసిన మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ 2021లో కూడా భారత ఆటగాళ్లకు చోటు కల్పించకుండా చిన్న చూపు చూసింది. పైగా దాయాది పాక్ ఆటగాళ్లను మరోసారి అందలం ఎక్కించింది. పాక్ సారధి బాబర్ ఆజమ్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంచుకున్న ఐసీసీ.. వన్డే జట్టు పగ్గాలు కూడా అతనికే అప్పగించింది. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారు. Power-hitters, terrific all-rounders, fiery pacers 🔥 The 2021 ICC Men's ODI Team of the Year has all the bases covered 🤩 pic.twitter.com/R2SCJl04kQ — ICC (@ICC) January 20, 2022 వన్టే జట్టులో ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్, దక్షిణాఫ్రికా ఆటగాడు జన్నెమన్ మలాన్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేసిన ఐసీసీ.. వన్ డౌన్ కోసం బాబర్ ఆజమ్, నాలుగో స్థానంలో పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్, ఐదో ప్లేస్‌లో సౌతాఫ్రికా చిచ్చర పిడుగు డస్సెన్‌లను ఎంచుకుంది. ఆల్‌రౌండర్ల కోటాలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హాసన్, సిమి సింగ్(ఐర్లాండ్), వికెట్ కీపర్‌గా ముష్ఫికర్ రహీం(బంగ్లాదేశ్), ఏకైక స్పిన్నర్‌గా వనిందు హసరంగ(శ్రీలంక), పేసర్ల కోటాలో ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్), దుష్మంత చమీర(శ్రీలంక)లను ఎంపిక చేసింది. కాగా, నిన్న ప్రకటించిన టీ20 జట్టుకు ఓపెనర్లుగా జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్‌లను ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం బాబర్ ఆజమ్‌ను, నాలుగో ప్లేస్‌కు మార్క్రమ్(దక్షిణాఫ్రికా), ఐదో ప్లేస్‌కు మిచెల్ మార్ష్(ఆస్ట్రేలియా), ఆ తరువాత వరుసగా డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా), వనిందు హసరంగ(శ్రీలంక), తబ్రేజ్ షంషి(దక్షిణాఫ్రికా), జోష్ హేజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్), షాహీన్ అఫ్రిది(పాకిస్థాన్)లను ఎంచుకుంది. కాగా, గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా క్రికెటర్లు ఆశించిన మేర రాణించకపోవడం వల్లే ఐసీసీ జట్లలో చోటు దక్కలేదని తెలుస్తోంది. చదవండి: టీమిండియా క్రికెటర్లకు ఘోర అవమానం..! -
టీ20 వరల్డ్‌కప్-2022కు సంబంధించి కీలక ప్రకటన
దుబాయ్: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల(జనవరి) 21న వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను వెల్లడించనున్నట్లు ఐసీసీ పేర్కొంది. టిక్కెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. 🗓 21.01.2022 The ICC Men's T20 World Cup Australia 2022 fixture is coming! #T20WorldCup pic.twitter.com/9Z2ASZgaty — T20 World Cup (@T20WorldCup) January 14, 2022 మొత్తం 12 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 13-నవంబర్ 16 మధ్యలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది టీ20 ప్రపంచకప్ దుబాయ్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఫించ్ నేతృత్వంలో ఆసీస్ జట్టు తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను గెలిచింది. \ఇదిలా ఉంటే, టీ20 ర్యాంకింగ్స్‌లో గతేడాది చివరి నాటికి టాప్-8లో ఉన్న జట్లు ప్రపంచకప్-2022కు నేరుగా అర్హత సాధించగా.. మిగతా నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయర్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే ప్రపంచకప్‌కు అర్హత సాధించగా.. శ్రీలంక, వెస్టిండీస్, నమీబియా, స్కాట్లాండ్ జట్లు క్వాలిఫైయర్స్‌లో తలపడతాయి. చదవండి: ఆ ఇద్దరి వల్లే టీమిండియా ఓడింది.. 'పురానే'పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్ -
WTC Final: విజేతకు భారీ ప్రైజ్‌మనీ
లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత, రన్నరప్‌లు అందుకోబోయే ప్రైజ్ మనీని ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఈ నెల 18న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రోజ్ బౌల్ సౌతాంప్టన్ వేదికగా జరుగబోయే ఫైనల్ మ్యాచ్‌లో విజేతకు భారత కరెన్సీ ప్రకారం రూ. 11.72 కోట్లు అందనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. అలాగే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 5.85 కోట్ల ప్రైజ్ మనీ లభించనున్నట్లు పేర్కొంది. ఏదైనా కారణం చేత మ్యాచ్ డ్రాగా ముగిసినట్లైతే, ప్రైజ్ మనీని ఇరు జట్లకు సమంగా పంచనున్నట్లు ఐసీసీ వివరించింది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుని జోరు మీదున్న న్యూజిలాండ్ జట్టు టీమిండియాకు సవాల్ విసురుతుంది. మరోవైపు ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా సైతం అదగొట్టి, టైటిల్ పోరుకు సై అంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(94 బంతుల్లో 121 నాటౌట్) శతక్కొట్టగా, ఓపెనర్ శుభ్‌మన్ గిల్(85), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(54) అదిరిపోయే అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లు ఇషాంత్(3/36), మహ్మద్ సిరాజ్(2/22)లు సైతం బంతితో రాణించారు. చదవండి: అతని కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయి.. -
చారిత్రక మ్యాచ్‌కు అంపైర్లు ఖరారు.. జాబితాలో ఐరన్ లెగ్ అంపైర్
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు సంబంధించిన అఫిషియల్స్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరగనున్న చారిత్రక పోరులో ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, మైకేల్ గాఫ్.. నాలుగో అంపైర్‌గా అలెక్స్ వార్ఫ్, మ్యాచ్ రిఫరీగా క్రిస్ బ్రాడ్ వ్యవహరించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అయితే ఈ జాబితాలో భారత అభిమానులు ఐరెన్ లెగ్గా పరిగణించే రిచర్డ్ కెటిల్ బరోకు కూడా స్థానం లభించింది. కెటిల్ బరోను థర్డ్ అంపైర్‌గా నియమిస్తూ ఐసీసీ ప్రకటన విడుదల చేయడంతో భారత అభిమానులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేసిన అన్ని ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది. దీంతో అతన్ని అంపైర్‌గా తీసుకోవద్దని భారత అభిమానులు ఐసీసీని రిక్వెస్ట్ చేశారు. 2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ వరకు.. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పరంపర కొనసాగింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచ కప్‌లోనూ భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 95 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి ఇంటి దారిపట్టింది. అలాగే, 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. టోర్నీ ఆసాంతం దూకుడుగా ఆడిన టీమిండియా.. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఆతర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో పాక్ చేతిలో 180 పరుగుల తేడాతో ఓడి టైటిల్ చేజార్చుకుంది. చివరిసారిగా ఆయన అంపైరింగ్ చేసిన 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లోనూ భారత్.. న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో ధోనీ రనౌట్ అయినప్పుడు లెగ్ అంపైర్‌గా ఉన్న కెటిల్‌బరో.. ‘అయ్యో' అని ఇచ్చిన ఎక్స్ప్రెషన్ను భారత అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. కాగా, భారత అభిమానులకు సానుకూలాంశం ఏంటంటే, డబ్ల్యూటీసీ ఫైనల్లో కెటిల్ బరో టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తుండటం. చదవండి: టీమిండియా క్రికెటర్లు లేకుండానే ఐసీసీ అవార్డులు -
ఐసీసీ టోర్నీల్లో కీలక మార్పులు..
దుబాయి: 2023-2031 మధ్య ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన ఫ్యూచర్టూర్స్ ప్రోగ్రామ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. బోర్డు మెంబర్లతో మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహాలోనే టీ20 ప్రపంచ కప్ రెండేళ్లకోసారి నిర్వహించాలని, అయితే అందులో16 జట్లకు బదులు 20 జట్లను ఆడించాలని నిర్ణయించింది. అలాగే 50 ఓవర్ల వన్డే ప్రపంచ కప్ టోర్నీని 10 జట్లకు బదులు 14 జట్లతో జరిపించాలని, ప్రస్తుతం రెండేళ్లకోసారి జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని, నాలుగేళ్లకోసారి జరపాలని ప్రకటించింది. 2019లో చివరిసారిగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో 10 పది జట్లు మాత్రమే పాల్గొనగా, 2027, 2031 ప్రపంచకప్‌లలో ఆ సంఖ్య 14కు పెంచాలని, మొత్తం మ్యాచ్‌ల సంఖ్యను 54కు మార్చాలని ఐసీసీ నిర్ణయించింది. వన్డే ప్రపంచ కప్ ఫార్మాట్లో 14 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూప్‌లో టాప్-3 జట్లను సూపర్ సిక్స్‌గా పరిగణించి, ఆతర్వాత సెమీస్, ఫైనల్స్నిర్వహిస్తారని ప్రకటించింది. ఐసీసీ.. 2003 ప్రపంచకప్‌లో ఇదే పద్ధతిని అనుసరించింది. అలాగే 2024, 2026, 2028, 2030లలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లను 20 జట్లతో నిర్వహించి, మొత్తం మ్యాచ్‌ల సంఖ్యని 55కి పెంచనున్నట్లు పేర్కొంది. టీ20 ప్రపంచ కప్ ఫార్మాట్లో 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూప్‌లో టాప్-2 జట్లను సూపర్-8గా పరిగణించి, ఆతర్వాత నాకౌట్, సెమీస్, ఫైనల్స్నునిర్వహిస్తారని తెలిపింది. వీటితో పాటు ఎనిమిది జట్లతో నిర్వహించే ఛాంపియన్స్‌ట్రోఫీని ప్రతి నాలుగేళ్లకోసారి (2025, 2029), ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌ను రెండేళ్లకోసారి (2025, 2027, 2029, 2031) నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఛాంపియన్స్‌ట్రోఫీని గతంలో లాగే ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ఆతర్వాత సెమీస్, ఫైనల్స్ నిర్వహిస్తారని పేర్కొంది. చదవండి: శవాలతో రోడ్లపై క్యూ కట్టడం చూశాక నిద్రపట్టేది కాదు.. The ICC events schedule from 2024-2031 has a lot to look forward to 🙌 The Men's events cycle 👇 pic.twitter.com/iNQ0xcV2VY — ICC (@ICC) June 2, 2021 -
డబ్యూటీసీ ఫైనల్ యధావిధిగా జరుగుతుంది: ఐసీసీ
లండన్: భారత్‌లో కరోనా ఉద్ధృతి తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అక్కడి నుండి విమాన రాకపోకలపై బ్రిటీష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరుగనున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై ఐసీసీ క్లారిటీనిచ్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే డబ్యూటీసీ ఫైనల్ యధావిధిగా జరుగుతుందని వివరణ ఇచ్చింది. కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు సురక్షితంగా ఎలా నిర్వహించాలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు(ఈసీబీ) బాగా తెలుసని, ఇదివరకే పలు టోర్నీలు విజయవంతంగా నిర్వహించిందని ఈసీబీ వెల్లడించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతుందని ఐసీసీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా ఈ ఫైనల్ మ్యాచ్‌ను బయో సెక్యూర్ బబుల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, ఐసీసీ తొలిసారి నిర్వహిస్తున్న టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. చదవండి: అతను బంతితో మ్యాజిక్ చేయడం చూడాలి: ముంబై కోచ్ -
ఐసీసీ వరల్డ్‌కప్ జట్టులో పూనమ్
దుబాయ్: టి20 ప్రపంచకప్ ప్రదర్శన ఆధారంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన జట్టులో భారత లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కు చోటు దక్కింది. టీమ్ ఫైనల్‌కు చేరినా... పూనమ్ మినహా మరెవరికీ ఈ టీమ్‌లో చోటు లేదు. టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ 12వ ప్లేయర్‌గా ఎంపికైంది. మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, లిసా స్తాలేకర్, అంజుమ్ చోప్రా తదితరులతో కూడిన ప్యానెల్ ఈ టీమ్‌ను ఎంపిక చేసింది. చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు, ఇంగ్లండ్ నుంచి నలుగురు ఐసీసీ జట్టులో ఉన్నారు. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టి20 ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), అలీసా హీలీ, బెత్ మూనీ, జెస్ జొనాసెన్, మెగాన్ షూట్ (ఆస్ట్రేలియా), నాట్ సివెర్, హెథర్ నైట్, సోఫీ ఎకెల్‌స్టోన్, అన్య ష్రబ్సోల్ (ఇంగ్లండ్), లారా వోల్వార్ట్ (దక్షిణాఫ్రికా), పూనమ్ యాదవ్ (భారత్); 12వ ప్లేయర్ షఫాలీ వర్మ (భారత్). -
‘రిజర్వ్ డే’ సాధ్యం కాదు
లండన్: ప్రపంచ కప్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మరికొన్ని మ్యాచ్ లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీ నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఈవెంట్లో అన్ని మ్యాచ్‌లకు ‘రిజర్వ్ డే’ ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చింది. 45 లీగ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంచడం సాధ్యం కాదని... అది తీవ్ర శ్రమతో కూడుకున్న వ్యవహారమని స్పష్టం చేసింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రం రిజర్వ్ డే ఉన్నట్లు వెల్లడించింది. ‘ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌కు రిజర్వ్ డే పెట్టడం సాధ్యం కాదు. రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడదని ఎవరూ హామీ ఇవ్వలేరు’ అని ఐసీసీ వివరణ ఇచ్చింది. -
కోహ్లికే కిరీటం
దుబాయ్: గత రెండేళ్లుగా పరుగుల వరద పారిస్తూ ప్రపంచ క్రికెట్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి సముచిత బహుమతి లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక అవార్డుల్లో కోహ్లి ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యాడు. దిగ్గజ ఆల్‌రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ అవార్డును తొలిసారి కోహ్లి అందుకోనున్నాడు. భారత్ తరఫున గతంలో ద్రవిడ్, సచిన్, అశ్విన్ దీనిని గెల్చుకున్నారు. ఇక 50 ఓవర్ల ఫార్మాట్లో తిరుగులేని ప్రదర్శన కనబర్చి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన కోహ్లి ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఐసీసీ టెస్టు, వన్డే జట్లలో స్థానం లభించడంతో పాటు ఆ రెండు టీమ్‌లకు కూడా అతనే కెప్టెన్‌గా ఎంపిక కావడం కోహ్లికి లభించిన మరో అరుదైన గౌరవం. మరో ప్రధాన అవార్డు ఐసీసీ ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు లభించింది. ఇంగ్లండ్‌పై భారత యువ లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చహల్ బౌలింగ్ (6/25) 2017 టి20 అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు హసన్ అలీ (పాకిస్తాన్)కు దక్కగా... అఫ్ఘానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. పరుగుల ప్రవాహం... అవార్డు ఎంపికకు సెప్టెంబర్ 21, 2016 నుంచి డిసెంబర్ 31, 2017 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సమయంలో కోహ్లి 18 టెస్టుల్లో 77.80 సగటుతో 2,203 పరుగులు సాధించాడు. వీటిలో ఎనిమిది సెంచరీలు (ఆరు డబుల్ సెంచరీలు), మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 31 వన్డేల్లో 82.63 సగటుతో 1,818 పరుగులు సాధించాడు. ఏడు సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. వీటికి తోడు టి20ల్లో 153 స్ట్రైక్‌రేట్‌తో 299 పరుగులు కూడా చేశాడు. మరోవైపు స్టీవ్ స్మిత్ ఇదే సమయంలో 16 టెస్టుల్లో 78.12 సగటుతో 1,875 పరుగులు చేసి టెస్టు క్రికెటర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. స్మిత్ మొత్తం ఎనిమిది సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. కోహ్లి గతంలో 2012లో ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు. మరో నలుగురు... ఐసీసీ టెస్టు ఎలెవన్, వన్డే ఎలెవన్ జట్లను కూడా ప్రకటించింది. టెస్టు జట్టులో భారత్ తరఫున చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు లభించింది. మూడో డబుల్ సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ, పేస్ అస్త్రం జస్ప్రీత్ బుమ్రా వన్డే టీమ్‌లోకి ఎంపికయ్యారు. వార్నర్, స్టోక్స్, డి కాక్ రెండు జట్లలోనూ ఉన్నారు. ఐసీసీ టెస్టు ఎలెవన్: కోహ్లి (కెప్టెన్), ఎల్గర్, వార్నర్, స్మిత్, పుజారా, స్టోక్స్, డి కాక్, అశ్విన్, స్టార్క్, రబడ, అండర్సన్. ఐసీసీ వన్డే ఎలెవన్: కోహ్లి (కెప్టెన్), వార్నర్, రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, డివిలియర్స్, డి కాక్, స్టోక్స్, బౌల్ట్, హసన్ అలీ, రషీద్ ఖాన్, బుమ్రా. గతంలో ఐసీసీ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్లు... ∙రాహుల్ ద్రవిడ్ (క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్టు క్రికెటర్ – 2004) ∙యువరాజ్ సింగ్ (టి20 పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ – 2008) ∙మహేంద్ర సింగ్ ధోని (వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్– 2008, 2009; స్పిరిట్ ఆఫ్ క్రికెట్–2011, పీపుల్స్ చాయిస్ అవార్డ్ – 2013) ∙గౌతం గంభీర్ (టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్– 2009) ∙సచిన్ టెండూల్కర్ (క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, పీపుల్స్ చాయిస్ అవార్డ్–2010) ∙వీరేంద్ర సెహ్వాగ్ (టెస్టు క్రికెటర్ ఆఫ్ ఇయర్–2010) ∙విరాట్ కోహ్లి (వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్–2012) ∙చతేశ్వర్ పుజారా (ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్–2013) ∙భువనేశ్వర్ కుమార్ (పీపుల్స్ చాయిస్ అవార్డ్–2014) ∙రవిచంద్రన్ అశ్విన్ (క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్–2016) ∙2007లో జులన్ గోస్వామి ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకోగా... 2010లో ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్‌గా భారత్ ఎంపికైంది. తొలిసారి సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డుకు ఎంపిక కావడం గొప్పగా అనిపిస్తోంది. ప్రపంచ క్రికెట్లో ఇది అతి పెద్ద అవార్డు. వరుసగా రెండేళ్లు దీనిని భారత ఆటగాళ్లే (గత ఏడాది అశ్విన్) గెలుచుకోవడం మరింత ప్రత్యేకంగా ఉంది. దీనిని సొంతం చేసుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. 2016 సంవత్సరం నా కెరీర్లో కీలక మలుపు. ఆ జోరును తర్వాతి ఏడాది కూడా కొనసాగిస్తూ మరింత ఎక్కువగా కష్టపడ్డాను. కాబట్టి 2017కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. నా దృష్టిలో ఇది నా అత్యుత్తమ దశ. భవిష్యత్తులో కూడా ఇంత బాగా ఆడేందుకు మరింతగా కష్టపడతాను. మా జట్టు తరఫున మంచి ప్రదర్శన ఇచ్చేందుకు మేం పడిన శ్రమను గుర్తించినందుకు ఐసీసీకి నా కృతజ్ఞతలు. ఇతర విజేతలకు కూడా నా అభినందనలు. – విరాట్ కోహ్లి స్పందన -
వివాదంలో కోహ్లీ.. స్పందించిన ఐసీసీ!
సాక్షి, న్యూఢిల్లీ: పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ విరాట్ కోహ్లీ సేన ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తమకు గతంలో సాధ్యంకాని విజయాన్ని సాధించి, టీమిండియా ఆస్వాదిస్తుండగా కెప్టెన్ కోహ్లీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. డగౌట్ లో జట్టు సభ్యులతో కూర్చున్న కోహ్లీ వాకీ టాకీ వాడకంపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా కోహ్లీ ప్రవర్తించాడంటూ భారీ ఎత్తున ప్రచారం జరిగింది. కేవలం జట్టు సహాయక సిబ్బంది మాత్రమే డగౌట్లో గానీ, లేక డ్రెస్సింగ్ రూమ్‌లో గానీ ఆటగాళ్లను సంప్రదించేందుకు వాకీ టాకీ వినియోగిస్తారని.. కోహ్లీ ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ప్రత్యర్థి కివీస్ జట్టుకు సైతం అనుమానాలు తలెత్తేలా విషయాన్ని రాద్ధాంతం చేయగా ఐసీసీకి చెందిన ఓ అధికారి దీనిపై వివరణ ఇచ్చారు. ఆ వాకీ టాకీ వినియోగించడానికి భారత కెప్టెన్ కోహ్లీ సంబంధిత అధికారిని అడిగి పర్మిషన్ తీసుకున్నారని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఐసీసీ అవినీతి నిరోధక భద్రతా విభాగం అనుమతితోనే కోహ్లీ వాకీ టాకీలో సంభాషించాడని వెల్లడించడంతో వివాదం సద్దుమణిగింది. సెల్ ఫోన్లను డ్రెస్సింగ్ రూములో నిషేధించారు, అయితే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఐసీసీ నిబంధనల ప్రకారం వాకీ టాకీ వాడవచ్చునని తెలియకపోవడంతోనే కోహ్లీపై దుష్ప్రచారం జరిగినట్లు తెలుస్తోంది. -
ప్రపంచకప్ ప్రచారకర్తగా...
⇒ వరుసగా రెండోసారి ‘మాస్టర్’ ఎంపిక ⇒ ఐసీసీ ప్రకటన దుబాయ్: వరుసగా రెండోసారి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్... వన్డే ప్రపంచకప్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు (2,278) సాధించిన ఆటగాడిగా సచిన్‌కు పేరుంది. 2003 టోర్నీలో 673 పరుగులతో అతను ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. ‘ఐసీసీ ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాలను ప్రచారకర్త హోదాలో సచిన్ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు జరిగే ఈ టోర్నీ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఈవెంట్’ అని ఐసీసీ తెలిపింది. మరోవైపు ఈ హోదాపై సచిన్ హర్షం వ్యక్తం చేశాడు. ‘వరుసగా రెండోసారి ప్రపంచకప్ అంబాసిడర్‌గా నియమించడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఓ ఆటగాడిగా ఆరు టోర్నీలు ఆడిన అనంతరం ఈసారి జరిగే ఈవెంట్ నాకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. 1987 ప్రపంచకప్‌లో ‘బాల్ బాయ్’గా బయటి నుంచి చూసినట్టే ఈసారి కూడా అలాగే చూడాలి. ఏ జట్టైనా ప్రపంచకప్ గెలుచుకుంటే అది చాలా మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా ఉంటుంది. కప్ సాధించాలనే కలను నేను 22 ఏళ్ల నిరీక్షణ తర్వాత తీర్చుకున్నాను’ అని 41 ఏళ్ల సచిన్ అన్నాడు.