లండన్: భారత్‌లో కరోనా ఉద్ధృతి తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అక్కడి నుండి విమాన రాకపోకలపై బ్రిటీష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరుగనున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై ఐసీసీ క్లారిటీనిచ్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే డబ్యూటీసీ ఫైనల్ యధావిధిగా జరుగుతుందని వివరణ ఇచ్చింది.
కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు సురక్షితంగా ఎలా నిర్వహించాలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు(ఈసీబీ) బాగా తెలుసని, ఇదివరకే పలు టోర్నీలు విజయవంతంగా నిర్వహించిందని ఈసీబీ వెల్లడించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతుందని ఐసీసీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా ఈ ఫైనల్ మ్యాచ్‌ను బయో సెక్యూర్ బబుల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, ఐసీసీ తొలిసారి నిర్వహిస్తున్న టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
చదవండి: అతను బంతితో మ్యాజిక్ చేయడం చూడాలి: ముంబై కోచ్
Comments
Please login to add a commentAdd a comment