లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేత, రన్నరప్‌లు అందుకోబోయే ప్రైజ్ మనీని ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఈ నెల 18న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రోజ్ బౌల్ సౌతాంప్టన్ వేదికగా జరుగబోయే ఫైనల్ మ్యాచ్‌లో విజేతకు భారత కరెన్సీ ప్రకారం రూ. 11.72 కోట్లు అందనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. అలాగే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 5.85 కోట్ల ప్రైజ్ మనీ లభించనున్నట్లు పేర్కొంది. ఏదైనా కారణం చేత మ్యాచ్ డ్రాగా ముగిసినట్లైతే, ప్రైజ్ మనీని ఇరు జట్లకు సమంగా పంచనున్నట్లు ఐసీసీ వివరించింది.
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుని జోరు మీదున్న న్యూజిలాండ్ జట్టు టీమిండియాకు సవాల్ విసురుతుంది. మరోవైపు ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా సైతం అదగొట్టి, టైటిల్ పోరుకు సై అంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(94 బంతుల్లో 121 నాటౌట్) శతక్కొట్టగా, ఓపెనర్ శుభ్‌మన్ గిల్(85), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(54) అదిరిపోయే అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లు ఇషాంత్(3/36), మహ్మద్ సిరాజ్(2/22)లు సైతం బంతితో రాణించారు.
చదవండి: అతని కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ ఎగబడతాయి..
Comments
Please login to add a commentAdd a comment