ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేతగా భార‌త్.. ప్రైజ్‌ మనీ ఎన్ని కోట్లంటే? | Champions Trophy 2025 Winner Prize Money: How Much Do India And New Zealand Receive? More Details Inside | Sakshi
Sakshi News home page

CT 2025 India Prize Money: ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేతగా భార‌త్.. ప్రైజ్‌ మనీ ఎన్ని కోట్లంటే?

Published Mon, Mar 10 2025 9:14 AM | Last Updated on Mon, Mar 10 2025 10:43 AM

Champions Trophy 2025 prize money: How much do India, New Zealand receive?

గత కొన్ని రోజులుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు శుభం కార్డ్ పడింది. ఈ మెగా టోర్నీ విజేతగా భారత్(Teamindia) నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు..  రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియ‌న్స్ ట్రోఫీని కైవసం చేసు​కుంది.

టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటిన రోహిత్‌​ సేన.. ఫైనల్లోనూ అదే జోరును కనబరిచి పుష్కరకాలం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని తిరిగి భారత్‌కు తీసుకొచ్చింది. భార‌త్ చివ‌ర‌గా 2013లో ధోని సార‌థ్యంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీని సొంతం చేసుకోగా.. మ‌ళ్లీ రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో తిరిగి సాధ్య‌మైంది. ఇక ఛాంపియ‌న్స్‌గా నిలిచిన భార‌త్ ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, ర‌న్న‌ర‌ప్‌గా న్యూజిలాండ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

విజేత‌కు ఎంతంటే?
ఛాంపియ‌న్స్ ట్రోఫీ విన్న‌ర్‌గా నిలిచిన టీమిండియాకు 2.4 మిలియ‌న్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) అందుకుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన కివీస్‌కు 1.12 మిలియ‌న్ డాల‌ర్ల‌ (రూ.9.72కోట్లు) ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. సెమీఫైన‌ల్‌లో ఓటిమిపాలైన ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్ల‌కు 560,000 డాల‌ర్లు (రూ.4.86కోట్లు) ల‌భించాయి. 

ఐదో, ఆరో స్ధానాల్లో నిలిచిన జ‌ట్లు 350,000 డాల‌ర్లు(రూ. 3 కోట్లు పైగా).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లు 140,000 డాల‌ర్లు(రూ. సుమారు 1.2 కోట్లు) ద‌క్కించుకున్నాయి. గ్రూపు స్టేజిలో విజ‌యం సాధించిన జ‌ట్టుకు 34,000 డాల‌ర్లు (సుమారు రూ. 33 లక్షలు) అంద‌నుంది. ఈ మెగా టోర్నీలో పాల్గోన్నంద‌కు ప్ర‌తీ జ‌ట్టుకు 125,000 డాల‌ర్లు(రూ.కోటి) ఐసీసీ అంద‌జేయ‌నుంది. అంటే ఈ మెత్తాన భార‌త్‌కు రూ. 21 కోట్ల‌పైనే అందింది.
చదవండి: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. ప్ర‌పంచంలోనే తొలి జ‌ట్టుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement