లండన్: ప్రపంచ కప్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మరికొన్ని మ్యాచ్ లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీ నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో అన్ని మ్యాచ్‌లకు ‘రిజర్వ్ డే’ ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చింది. 45 లీగ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంచడం సాధ్యం కాదని... అది తీవ్ర శ్రమతో కూడుకున్న వ్యవహారమని స్పష్టం చేసింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రం రిజర్వ్ డే ఉన్నట్లు వెల్లడించింది. ‘ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌కు రిజర్వ్ డే పెట్టడం సాధ్యం కాదు. రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడదని ఎవరూ హామీ ఇవ్వలేరు’ అని ఐసీసీ వివరణ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment