Reserve Day
-
టీ20 వరల్డ్‌కప్ 2024.. ఐసీసీ కీలక నిర్ణయం!? అలా అయితే కష్టమే
ఐపీఎల్-2024 ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూన్ 1 నంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా టీ20 వరల్డ్‌కప్-2024 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డల్లాస్ వేదికగా అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి.అయితే ఈ మెగా ఈవెంట్‌కు సబంధించి ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. ఈ మెగా టోర్నీలో సెకెండ్ సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉండదని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. సాధరణంగా ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్ గేమ్‌లకు రిజర్వ్ డే కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకారం.. రెండో సెమీఫైనల్‌కు, ఫైనల్ పోరుకు మధ్య కేవలం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ క్రమంలోనే ఐసీసీ సెకెండ్ సెమీఫైనల్‌కు రిజర్వ్‌డేను కెటాయించలేదని క్రిక్‌బజ్ తెలిపింది. అయితే రిజర్వ్ డే బదలుగా 250 నిమిషాల అదనపు సమయాన్ని ఐసీసీ, వెండీస్ క్రికెట్ బోర్డులు కెటాయించినట్లు తెలుస్తోంది. గయానా వేదికగా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫినిష్ కాకపోతే.. మరో నాలుగు గంటల సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అంటే అంపైర్లు మ్యాచ్‌ను ముగించడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం ఉంటుంది. -
T20WC: ఎడాపెడా దంచేసినా పర్లేదు కానీ.. ఇకపై అలా కుదరదు!
ICC’s new stop clock rule- దుబాయ్: పురుషుల జట్లు బ్యాటింగ్‌లో ఎడాపెడా దంచేసినా, చుక్కలు చూపించినా పర్లేదు. కానీ బౌలింగ్ సమయంలో మాత్రం జాగ్రత్త పడాలి. ఓవర్‌కు ఓవర్‌కు మధ్య నిక్కచ్చిగా 60 సెకన్ల సమయాన్ని మాత్రమే తీసుకోవాలి. నింపాదిగా బౌలింగ్ చేస్తానంటే ఇకపై అస్సలు కుదరదు. దుబాయ్‌లో సమావేశమైన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘స్టాప్ క్లాక్’ నిబంధనను ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్–అమెరికాలలో జరిగే టి20 ప్రపంచకప్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు టి20 ప్రపంచకప్‌లో నాకౌట్ దశ మ్యాచ్‌లన్నింటికీ రిజర్వ్ డేలను ఖరారు చేసింది. ‘స్టాప్ క్లాక్’ నిబంధన? రెండు ఓవర్ల మధ్య విరామ సమయాన్ని తగ్గించడమే ‘స్టాప్ క్లాక్’. ఒక బౌలర్ ఓవర్ ముగించిన వెంటనే మరో బౌలర్ 60 సెకన్లలోపే బౌలింగ్ చేయాలి. బౌలింగ్ జట్టు 60 సెకన్లలోపే ఓవర్ వేయకపోతే అంపైర్లు మూడుసార్లు హెచ్చరికలతో సరిపెడతారు. ఆ తర్వాత పునరావృతమైతే పెనాల్టీ విధిస్తారు. చదవండి: MI: బుమ్రా, హార్దిక్‌ను వదిలేద్దామంటే.. రోహిత్ శర్మనే అడ్డుకున్నాడు! -
రిజర్వ్ డేకు కూడా వర్షం ముప్పు.. దీనికి తోడు బ్యాడ్ లక్, ఆతర్వాతి రోజే..!
ఆసియా కప్-2023లో భారత్, పాక్‌లను వర్షం వెంటాడుతూ ఉంది. టోర్నీలో జరగాల్సిన గ్రూప్ లెవెల్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా.. సూపర్-4 దశలో జరగాల్సిన మ్యాచ్ రిజర్వ్ డే అయిన రేపటికి (సెప్టెంబర్ 11) వాయిదా పడింది. రిజర్వ్ డే రోజున అయినా మ్యాచ్ సాఫీగా సాగుతుందా అంటే అది చెప్పలేని పరిస్థితి. కొలొంబో వాతావరణ శాఖ వారి హెచ్చరికల ప్రకారం రేపు 99 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. The weather looks not in favour of India vs Pakistan clash on reserve day 👀 pic.twitter.com/xWqdjvHuoa — CricTracker (@Cricketracker) September 10, 2023 దీనికి తోడు భారత్‌కు రిజర్వ్ డే బ్యాడ్‌లక్ కూడా కలవరపెడుతుంది. రిజర్వ డే రోజు భారత్ పాక్‌పై ఒక్క మ్యాచ్ కూడా గెలిచింది లేదు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ చివరిసారిగా రిజర్వ్ డే రోజున మ్యాచ్ ఆడి ఓటమిపాలైంది. నాడు మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ భారత్ పరాభవాన్ని ఎదుర్కొంది. #INDvPAK: India never won a match on reserve day👀 pic.twitter.com/SYYYv0aEaB — CricTracker (@Cricketracker) September 10, 2023 India will be playing an ODI game on reserve day for the first time since the 2019 World Cup semi-finals against New Zealand in Manchester. pic.twitter.com/AhuABgQrR8 — CricTracker (@Cricketracker) September 10, 2023 ఇది చాలదన్నట్లు రిజర్వ్ డే మర్నాడే (సెప్టెంబర్ 12) భారత్.. శ్రీలంకతో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. వరుసగా మూడు రోజుల పాటు ఫీల్డ్‌లో ఉండి గెలవటం ఎంతటి జట్టుకైనా పెద్ద పనే అవుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్.. రేపటి మ్యాచ్‌లో పాక్‌పై పైచేయి సాధిస్తుందో లేదో వేచి చూడాలి. India will play ODI cricket for three consecutive days! pic.twitter.com/ATFphtFFLX — CricTracker (@Cricketracker) September 10, 2023 కాగా, ఇవాళ జరగాల్సిన భారత్-పాక్ సూపర్ 4 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు రేపు (సెప్టెంబర్ 11) రిజర్వ్ డే కావడంతో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ పూర్తి 50 ఓవర్ల మ్యాచ్‌గా సాగనుంది. వర్షం కారణంగా ఇవాల్టి ముగిసే సమయానికి భారత్ స్కోర్ 24.1 ఓవర్లలో 147/2గా ఉంది. రోహిత్ (56), గిల్ (58) ఔట్ కాగా.. కోహ్లి (8), రాహుల్ (17) క్రీజ్‌లో ఉన్నారు. -
భారత్, పాక్ మ్యాచ్‌కు ‘రిజర్వ్ డే’.. అందుకే ఆ నిర్ణయం!
కొలంబో: ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగే ‘సూపర్–4’ మ్యాచ్‌కు సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు కొలంబోలో వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా ‘రిజర్వ్ డే’ను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఆదివారం వాన కారణంగా మ్యాచ్ నిలిచిపోతే ఆట ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే సోమవారం కూడా మ్యాచ్ కొనసాగుతుంది. ఆసియా కప్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫైనల్ మ్యాచ్‌కు (సెప్టెంబర్ 17) మాత్రమే రిజర్వ్ డే ఉంది.ప్రేమదాస స్టేడియంలో మొత్తం ఐదు ‘సూపర్– 4’ మ్యాచ్‌లు ఉండగా... మిగతా నాలుగు మ్యాచ్‌లకు కాకుండా ఒక్క భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కే ‘రిజర్వ్ డే’ ఇవ్వడం గమనార్హం. లీగ్ దశ లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పాకిస్తాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. దాంతో టోర్నీ ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రసారకర్తల విజ్ఞప్తి మేర కు ఏసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
Ind vs Pak: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్! సిగ్గులేనితనానికి నిదర్శనం అంటూ..
Asia Cup 2023- India vs Pakistan: భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు క్రికెట్ ప్రపంచంలో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే! దాయాదులు తలపడుతున్నాయంటే క్రికెట్ ప్రేమికులంతా టీవీల ముందు కూర్చోవాల్సిందే..! ఇక గత కొంతకాలంగా మేజర్ ఈవెంట్లలో మాత్రమే ఎదురుపడుతున్న చిరకాల ప్ర్యతర్థుల మ్యాచ్‌ను నేరుగా చూడాలంటే జేబుకు చిల్లు తప్పదు! అయినప్పటికీ... తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చినా వెనక్కితగ్గడం లేదు. అలాంటిది ఆసియా కప్-2023లో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోటీపడుతుందనగానే అంతా ఎంతో ఆసక్తిగా సెప్టెంబరు 2 నాటి మ్యాచ్ కోసం ఎదురుచూశారు. అభిమానుల ఆశలపై నీళ్లు అయితే.. శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించాడు. హోరాహోరీ తప్పదంటూ కళ్లప్పగించి చూస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపిలేని వర్షం కారణంగా మ్యాచ్ రద్దైపోయింది. మరోసారి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఈ నేపథ్యంలో కొలంబో వేదికగా సూపర్-4 దశలో మరోసారి టీమిండియా- పాకిస్తాన్ పోటీకి సిద్ధమయ్యాయి. అయితే, ఇక్కడ కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. వాన మరోసారి దాయాదుల పోరుకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. వేదిక మారలేదు.. ఈ క్రమంలో వేదికను హోంబన్‌టోటకు మారుస్తారని వార్తలు వచ్చినా.. కొలంబోలోనే నిర్వహిస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. అయితే, మళ్లీ వర్షం ఆటంకం కలిగిస్తే పరిస్థితి ఏంటని అభిమానులు ఆందోళన పడుతున్న తరుణంలో ఓ శుభవార్త వచ్చింది. టిక్కెట్లు పడేయొద్దు.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ సెప్టెంబరు 10 నాటి భారత్- పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంటుందని ఆతిథ్య శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. వరణుడు అడ్డుపడితే సోమవారం మ్యాచ్ పూర్తిచేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు కొన్నవారు అసౌకర్యానికి గురికాకుండా ఉండాలంటే.. మరుసటి రోజు కూడా వాటిని అట్టిపెట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది. సిగ్గులేని తనానికి నిదర్శనం శ్రీలంక బోర్డు చెప్పిన వార్త అభిమానులకు సంతోషాన్నిచ్చినా.. నెటిజన్లు మాత్రం ఈ విషయంపై మండిపడుతున్నారు. కేవలం ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉండటం దేనికి సంకేతమని ఫైర్ అవుతున్నారు. మిగతా క్రికెట్ బోర్డు సభ్యులను పిచ్చోళ్లం చేయడమే ఇది అంటూ ఫైర్ అవుతున్నారు. ఆసియా కప్ నిర్వహణ ఒక పెద్ద బూటకంగా మారిపోయిందని.. కేవలం రెండు జట్ల కోసం ఇలాంటివి చేయడం అన్యాయమంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ‘‘శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య కూడా కీలక మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ కేవలం Ind vs Pak మ్యాచ్ కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం. ఛీ.. ఇంత వివక్ష ఎందుకు? సిగ్గులేనితనానికి నిదర్శనం’’ అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: ‘సారా’లతో ప్రేమాయణం: శుబ్‌మన్‌కు సచిన్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్! Only if rest of the nations had the power to protest this absurd decision of having a reserve day for just one Super 4 match. But since they don't, the top two boards will continue to bully them. — Saurabh Malhotra (@MalhotraSaurabh) September 8, 2023 Although it is highly unlikely, I really hope even experts & former cricketers from India & Pakistan stand against this bizarre decision of keeping reserve day only for IND-PAK game and post about it. #AsiaCup2023 — Saif Ahmed 🇧🇩 (@saifahmed75) September 8, 2023 A multi-nation tournament deserves a reserve day for each of the Super 4 games not just Indo-Pak. No rocket science there PS: Neither of the two teams are defending champions by the way. Sri Lanka are #AsiaCup — Vikrant Gupta (@vikrantgupta73) September 8, 2023 We already know ACC wants an overdose of India Pakistan games but now keeping a reserve day just for that one match shows they have shamelessly removed those clothes if they had any — Udit (@udit_buch) September 8, 2023 -
WTC ఫైనల్ డ్రా అయితే ట్రోఫీ ఏ జట్టుకంటే..!
-
IPL 2023 Final: మళ్లీ అదే రోజు గెలవాలని రాసి పెట్టి ఉందేమో.. వరుణుడు కూడా సహకరించాడు..!
గుజరాత్-చెన్నై జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. యాదృచ్చికమో ఏమో తెలీదు కానీ, సరిగ్గా ఇదే రోజే గతేడాది ఐపీఎల్ (2022) ఫైనల్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలుపొంది, అరంగేట్రం సీజన్లోనే టైటిల్ నెగ్గింది. వరుణుడి ఆటంకం కారణంగా (షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2023 ఫైనల్ మే 28న జరగాల్సి ఉంది) సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ అదే రోజు టైటిల్ గెలిచే అవకాశం గుజరాత్‌కు వచ్చింది. రిజర్వ్ డేకు కూడా వర్షం ముప్పు పొంచి ఉండటంతో ఈసారి కూడా గుజరాత్‌కే టైటిల్ గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మళ్లీ అదే రోజు (మే 29) టైటిల్ గెలవాలని వారికి రాసి పెట్టిందో ఏమో, అన్నీ వారికి అనుకూలంగా జరుగుతున్నాయి. మరోవైపు మ్యాచ్ పూర్తిగా జరిగినా లేక అరకొరగా సాధ్యపడినా గుజరాత్‌కే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయంటూ గుజరాత్ అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు. చెన్నైతో పోలిస్తే తమ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, శుభ్‌మన్ గిల్ భీకర ఫామ్ కొనసాగిస్తాడని.. లీగ్ టాప్-3 వికెట్టేకర్లు షమీ, రషీద్, మోహిత్ మరోసారి సత్తా చాటుతారని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గత రికార్డులు, లక్ కూడా తమకే అనుకూలంగా ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి గుజరాత్ అభిమానులు ప్రచారం చేసుకున్నట్లుగా హార్ధిక్ సేన గెలుస్తుందో, లేక మెజారిటీ శాతం అభిమానుల కోరిక ప్రకారం సీఎస్కే టైటిల్ గెలుస్తుందో వేచి చూడాలి. కాగా, నిబంధనల ప్రకారం రిజర్వ్ డే రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే, లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే (గుజరాత్) విజేతగా ప్రకటిస్తారు. చదవండి: IPL 2023 Final: 'రిజర్వ్ డే'కు కూడా వర్షం ముప్పు.. వాన పడిందా..! -
IPL 2023 Final: 'రిజర్వ్ డే'కు కూడా వర్షం ముప్పు.. వాన పడిందా..!
వర్షం కారణంగా నేటికి (మే 29) వాయిదా పడిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్.. రిజర్వ్ డే రోజు కూడా సజావుగా సాగే పరిస్థితి కనబడటం లేదు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. మ్యాచ్‌కు వేదిక అయిన అహ్మదాబాద్‌లో ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే నిన్నటి లాగా భారీ వర్షం కురవకపోవచ్చని సమాచారం. ఇదిలా ఉంటే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తారు. 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరిపేందుకు కృషి చేస్తారు. చివరకు అదీ సాధ్యం కాకపోతే చివరి ప్రయత్నంగా ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేల్చేందుకు చూస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలుస్తుంది. కాగా, ఐపీఎల్ 2023 ఫైనల్స్‌కు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్-1 విజేత -
IPL Final: వాన వచ్చె... వాయిదా పడె
ఐపీఎల్–2023 విజేత ఎవరో తేలేందుకు మరో రోజు వేచి చూడాల్సిందే. ఫైనల్ కోసం మైదానంలో లక్షకు పైగా ఉన్న అభిమాన సందోహం సరిపోదన్నట్లుగా నేనూ ఉన్నానంటూ వరుణ దేవుడు వచ్చేయడంతో అంతా మారిపోయింది. టాస్ సమయానికి అరగంట ముందు మొదలైన వాన నిరంతరాయంగా కురవడంతో ఆటకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. ఎంత ఎదురు చూసినా వర్షం తెరిపినివ్వలేదు. దాంతో ఆదివారం జరగాల్సిన తుది పోరును సోమవారానికి వాయిదా వేయక తప్పలేదు. రిజర్వ్ డే అయిన నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ కోసం తలపడతాయి. అన్నట్లు సోమవారం కూడా 10 శాతం వర్ష సూచన ఉంది. అయితే ఏమాత్రం వర్షసూచన లేని ఆదివారమే ఇలా జరిగితే సోమవారం ఏం జరుగుతుందనేది ఆసక్తికరం! అహ్మదాబాద్: ఐపీఎల్ తాజా సీజన్లో మొత్తం 73 మ్యాచ్‌లు జరిగాయి. ఒక మ్యాచ్ వర్షం బారిన పడి రద్దు కాగా, మరో మ్యాచ్‌లో వర్షం ఆటంకం కలిగించినా ఒక్క బంతి కూడా వృథా కాలేదు. కానీ అసలైన అంతిమ సమరం సమయానికి మాత్రం వరుణుడు పూర్తి ప్రతాపం చూపించాడు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫైనల్ పోరుకు అడ్డుగా నిలిచాడు. మండు వేసవిలో అహ్మదాబాద్‌లో వర్షం అంటే అలా కొద్దిసేపు వచ్చి పోయే చినుకుల్లా అందరూ భావించినా ఆదివారం మాత్రం అలా జరగలేదు. చివరకు ఫైనల్ మ్యాచ్ నేటికి వాయిదా పడింది. సాయంత్రం 6.30 సమయంలో స్వల్పంగా వాన మొదలైంది. ఆ తర్వాతి నుంచి తగ్గుతూ, పెరుగుతూ వచ్చింది. కవర్లు కప్పడం, తొలగించడం మళ్లీ మళ్లీ జరిగాయి. 9 గంటల సమయంలో మాత్రం వాన పూర్తిగా తగ్గిపోయింది. దాంతో అంపైర్లతో పాటు ఇరుజట్ల ఆటగాళ్లు, కోచ్‌లు మైదానంలోకి వచ్చారు. అంతా పిచ్‌ను, అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించడంతో పాటు వామప్ కూడా మొదలైంది. అయితే ఒక్కసారిగా వాన జోరందుకోవడంతో అంతా పరుగెడుతూ గ్రౌండ్ వీడారు. ఆ తర్వాత దాదాపు రెండు గంటల పాటు వేచి చూసినా ఫలితం కనిపించలేదు. రాత్రి 9.30కి ఆట ఆరంభమైతే పూర్తి ఓవర్లు సాగేవి. ఆపై ఓవర్ల కోతతోనైనా మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు ప్రయత్నించారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ ఆడాలన్నా అర్ధరాత్రి 12.06కు ఆట ఆరంభం కావాలి. దానికి కనీసం గంట ముందుగా వాన ఆగిపోవాలి. అయితే అనుకున్న సమయానికి వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ వాయిదా పడింది. ఇరు జట్ల కోచ్‌లు స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆశిష్ నెహ్రాల ‘షేక్ హ్యాండ్’తో అధికారికంగా ఖాయమైంది. నేడు వాన కురిస్తే... ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఎలాగైనా ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరపాల్సిందే. చివరకు అదీ సాధ్యం కాకపోతే రాత్రి. గం. 1.20 సమయంలో ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేలుస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ చాంపియన్‌గా నిలుస్తుంది. -
#GTvsCSK: ఫైనల్ మ్యాచ్ వాయిదా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం(మే 28న) ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిపోవాలి. కానీ వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్‌డేకు వాయిదా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మధ్యాహ్నం నుంచి ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కనీసం టాస్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. రాత్రి 11 దాటినా వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడం ఇదే తొలిసారి. వర్షం కారణంగా పలు సీజన్లలో మ్యాచ్‌లు రద్దు కావడం లేదా ఓవర్లు కుదించి ఆడడం జరిగింది. కానీ గత 15 సీజన్లలో ఏ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడింది లేదు.. రిజర్వ్ డేకు వాయిదా పడింది లేదు. ఇక ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. ఫైనల్మ్యాచ్ చూద్దామని వచ్చిన అభిమానులకు వరుణుడి కారణంగా తీవ్ర నిరాశే మిగిలింది. రాత్రి 9 గంటల తర్వాత అభిమానులు ఒక్కొక్కరిగా స్టేడియం నుంచి వెళ్లిపోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad. Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD — IndianPremierLeague (@IPL) May 28, 2023 Fans leave the Narendra Modi Stadium. A sad end to what could have been an amazing Sunday. #IPLFinals to be played tomorrow it seems. #Ahmedabad #IPL2023Final #CskvsGttickets #MSDhoni𓃵 #rain pic.twitter.com/vGlfVQzBb9 — 7 & 18 & 45 (@Tamil_paiyan_01) May 28, 2023 చదవండి: #IPL2023Final: డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారిపై మహిళ దౌర్జన్యం -
T20 WC: ప్రతిష్టాత్మక ఫైనల్ కోసం రూల్స్ సవరింపు!
క్రికెట్ అభిమానులు నెల రోజుల నుంచి ఎంజాయ్ చేస్తున్న టి20 ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇన్నాళ్లు ఫోర్లు, సిక్సర్ల వర్షంతో పాటు వరుణుడి జడివానల్లోనూ తడిసిన అభిమానులకు కిక్కు దిగిపోనుంది. రేపు(నవంబర్ 13న) పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే ముందు నుంచి చెప్పుకుంటున్నట్లు ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఫైనల్ మ్యాచ్ జరగనున్న రోజున వర్షం పడే సూచనలు 85 శాతం ఉన్నాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అయితే నాకౌట్ దశలో జరిగే మ్యాచ్‌లకు రిజర్వ్ డేను కేటాయిస్తారు. దీంతో ఫలితం వచ్చే అవకాశాలుంటాయి. అయితే రిజర్వ్ డే కూడా వర్షంలో కొట్టుకుపోతే అప్పుడు ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. అలా చేస్తే ఇప్పటివరకు టి20 ప్రపంచకప్‌పై ఉన్న జోష్ తగ్గిపోతుంది. ఇలా సంయుక్త విజేతలుగా ప్రకటించడం ద్వారా టోర్నీ ఆఖర్లో కళ తప్పినట్లవుతుందని భావించిన ఐసీసీ శనివారం.. ఫైనల్ మ్యాచ్ కోసం రూల్స్‌ను సవరించింది. అయితే ఆ రూల్స్ కేవలం మ్యాచ్ వరకు మాత్రమే పరిమితం. మరి ఐసీసీ సవరించిన కొత్త రూల్ ఏంటంటే.. రిజర్వ్ డే రోజున నిర్ణీత సమయంలో వర్షం తగ్గకపోతే.. మరో రెండు గంటలు అదనంగా కేటాయించనున్నారు. ఒకవేళ ఈ రెండు గంటలు ఎలాంటి వర్షం లేకపోతే 10 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. ఇది కూడా సాధ్యపడకపోతే అప్పుడు ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారని ఐసీసీ పేర్కొంది. ఇప్పటికే ఫైనల్ జరగనున్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)కి ఉత్తర్వులు పంపామని.. ఆ దిశగా వారు ప్రణాళికను సిద్ధం చేస్తారని తెలిపింది. ''వర్షం అడ్డుపడినా సాధ్యమైనంత వరకు ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించాలనే సంకల్పంతో ఉన్నాం. అందుకే నవంబర్ 13న వర్షంతో మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే అయిన నవంబర్ 14న మ్యాచ్ కొనసాగిస్తాము. అప్పటికి వర్షం అంతరాయం కలిగిస్తే మరో రెండు గంటలు మ్యాచ్ జరిగేందుకు అదనంగా సమయం కేటాయించాం. అప్పటికి ఫలితం రాకుండా వరుణుడు అడ్డుపడితే మాత్రం ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తాం. ఇది చివరి ఆప్షన్ మాత్రమే. కానీ ఇలా జరగడం మాకు ఇష్టం లేదు. కచ్చితంగా ఫైనల్ మ్యాచ్ సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం'' అంటూ టోర్నీ నిర్వాహుకులు పేర్కొన్నారు. చదవండి: T20 WC: టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే? -
T20 WC 2022: వర్షం కారణంగా సెమీస్ రద్దయితే.. టీమిండియానే విజేత!
టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్ మ్యాచ్‌లకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 9న సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్-పాకిస్తాన్, ఆ మరుసటి రోజు (నవంబర్ 10) అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ రెండు మ్యాచ్‌లకు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. ఒకవేళ సెమీస్ మ్యాచ్‌లు జరిగే సమయంలో అకస్మాత్తుగా వర్షం పడితే పరిస్థితి ఏంటన్న డౌట్ అభిమానుల మదిలో మెదలడం ప్రారంభమైంది. దీనికి సమాధానం.. ఐసీసీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లతో పాటు మెల్బోర్న్ వేదికగా నవంబర్ 13న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు కూడా రిజ్వర్ డే ఉంది. ఒకవేళ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించి, ఆ రోజు ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి (స్కోర్లు) రిజర్వ్ డేలో ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే (సెమీస్) మాత్రం గ్రూప్‌లో టేబుల్ టాపర్‌గా ఉన్న జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అంటే.. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్, రెండో సెమీస్‌లో భారత్ ఫైనల్‌కు చేరతాయి. అదే ఫైనల్ విషయానికొస్తే.. టైటిల్ డిసైడర్ మ్యాచ్ షెడ్యూలైన రోజు వర్షం పడితే రిజర్వ్ డేలో, ఆ రోజు కూడా ఆట సాధ్యపడకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. -
WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా న్యూజిలాండ్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు 2 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ 249 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 139 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన కివీస్ జట్టు భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గెలుపు దిశగా పయనిస్తున్న కివీస్.. 139 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్.. ఆతరువాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తుంది. కెప్టెన్ విలియమ్సన్(22), రాస్ టేలర్(30) ఆచితూచి ఆడుతున్నారు. కివీస్ గెలుపునకు మరో 47 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో మరో 8 వికెట్లు ఉన్నాయి. ఆఖరి రోజు ఆటలో మరో 18 ఓవర్లు మిగిలి ఉన్నాయి.భారత బౌలర్లలో అశ్విన్‌కు రెండు వికెట్లు దక్కాయి. రెండో వికెట్ కోల్పోయిన కివీస్.. కాన్వే(19) ఔట్ టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ కివీస్‌ను ముప్పతిప్పలు పెడుతున్నాడు. 33 పరుగుల వద్ద లాథమ్ వికెట్ పడగొట్టిన యాష్.. 44 పరుగుల వద్ద కివీస్ నయా సంచలనం డెవాన్ కాన్వేను(19) పెవిలియన్ బాట పట్టించాడు. కివీస్ గెలవాటంటే మరో 95 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లుండగా, మరో 35 ఓవర్ల ఆట మిగిలి ఉంది. తొలి వికెట్ కోల్పోయిన కివీస్.. లాథమ్(9) స్టంప్ అవుట్ 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు.. 33 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్ టామ్ లాథమ్(2).. అశ్విన్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. పంత్ అద్భుతంగా బంతిని అందుకుని వికెట్లకు గిరాటు వేయడంతో కివీస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. కాన్వే(14), విలియమ్సన్(0) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ గెలవాలంటే మరో 109 పరుగులు చేయాలి. టీమిండియా 170 ఆలౌట్.. కివీస్ టార్గెట్ 139 170 పరుగుల వద్ద టీమిండియా ఆలౌటైంది. సౌథీ బౌలింగ్‌లో లాథమ్ క్యాచ్ అందుకోవడంతో బుమ్రా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్.. కివీస్ ముందు 139 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బౌలర్లలో సౌథీ 4, బౌల్ట్ 3, జేమీసన్ 2, వాగ్నర్ ఓ వికెట్ పడగొట్టారు. టీమిండియా తొమ్మిదో వికెట్ డౌన్.. షమీ(13) ఔట్ 170 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో లాథమ్ క్యాచ్ అందుకోవడంతో షమీ 13 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 138 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో ఇషాంత్, బుమ్రా ఉన్నారు. టెయిలెండర్లపై బౌల్ట్ ప్రతాపం.. అశ్విన్(7) ఔట్ 156 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కూడా కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి యాష్(7) వెనుదిరిగాడు. దీంతో ఒకే స్కోర్ వద్ద టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. టీమిండియా టెయిలెండర్లపై బౌల్ట్ ప్రతాపం చూపుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా 124 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో షమీ, ఇషాంత్ ఉన్నారు. పంత్(41) ఔట్..124 పరుగుల ఆధిక్యంలో టీమిండియా భారత జట్టు ఆఖరి ఆశా కిరణం రిషబ్ పంత్ 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో హెన్రీ నికోల్స్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ వెనుదిరిగాడు. దీంతో 156 పరుగుల స్కోర్ వద్ద భారత్ ఏడో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 124 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో అశ్విన్(7), షమీ(0) ఉన్నారు. టీమిండియా ఆరో వికెట్ డౌన్, జడేజా(16) ఔట్ 142 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. అప్పటివరకు ఓపికగా ఆడిన జడేజా వాగ్నర్ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 110 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో పంత్(34), అశ్విన్(0) ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా, రహానే(15) ఔట్ బౌల్ట్ బౌలింగ్‌లో బౌండరీ బాది జోరుమీదున్నట్లు కనిపించిన రహానే 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. లెగ్ గ్లాన్స్ చేసే ప్రయత్నంలో వాట్లింగ్ చేతికి చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 109 పరుగుల స్కోర్ వద్ద టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 77 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రిషబ్ పంత్(21), జడేజా(0) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్, సౌథీ చెరో రెండు వికెట్లు, బౌల్ట్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాంప్టన్: ఆరో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాట్స్మెన్లు కోహ్లీ(13), పుజారా(15)లు పరుగు వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. వీరిద్దరిని కైల్ జేమీసన్ బోల్తా కొట్టించాడు. కోహ్లీ వికెట్ కీపర్ వాట్లింగ్‌కు క్యాచ్ అందించి ఔట్ కాగా, పుజారా.. రాస్ టేలర్ చేతికి చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. కైల్ జేమిసన్ మరో సారి తన బౌలింగ్ లైన్‌తో టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే దిశగా సాగేట్టు కనిపిస్తున్నాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీని జేమిసనే ఔట్ చేయడం విశేషం. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం టీమిండియా 40 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రహానే, పంత్ క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్, సౌథీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. -
WTC Final: ఆడతారా...ఓడతారా!
వర్షం సమస్య లేకపోతే రోజంతా అందుబాటులో ఉన్న మొత్తం ఓవర్లు 98... మరో 18 వికెట్లు పడితే గానీ విజేత ఎవరో తేలదు... ప్రస్తుతం భారత్ ఆధిక్యం 32 పరుగులు మాత్రమే. ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఎంత లక్ష్యం నిర్దేశిస్తే కివీస్‌కు సవాల్ విసరవచ్చో... దూకుడుగా ఆడి పరుగులు సాధించాలో, కుప్పకూలిపోకుండా వికెట్లు కాపాడుకోవాలో అర్థం కాని సంకట స్థితిలో టీమిండియా నిలిచింది. అదే న్యూజిలాండ్ మాత్రం ఆత్మవిశ్వాసంతో చివరి రోజున వికెట్ల వేటకు సిద్ధంగా ఉంది. లక్ష్యం కష్టసాధ్యంగా మారితే మ్యాచ్‌ను కాపాడుకునే అవకాశం కూడా ఆ జట్టుకు ఉంది. ఈ నేపథ్యంలో తొలి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చివరి రోజు ఆట ఎలా సాగుతుందనేది ఆసక్తికరం. సౌతాంప్టన్: డబ్ల్యూటీసీ ఫైనల్ ఊహించినట్లుగానే ఆరో రోజుకు చేరింది. ‘రిజర్వ్ డే’ కారణంగా మ్యాచ్‌లో ఇంకా జీవం మిగిలి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం కోల్పోయిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులు ముందంజలో నిలిచి మ్యాచ్ ఐదో రోజును ముగించింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. గిల్ (8) రోహిత్ (30; 2 ఫోర్లు) అవుట్ కాగా... పుజారా (12), కోహ్లి (8) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నా రు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 101/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (177 బంతుల్లో 49; 6 ఫోర్లు) రాణించగా... భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3 వికెట్లు తీశారు. పేసర్ల జోరు తొలి సెషన్లో కివీస్ బ్యాట్స్‌మన్ విలియమ్సన్, రాస్ టేలర్ (11) అతి జాగ్రత్తగా ఆడారు. మొదటి గంటలో 13 ఓవర్లలో ఆ జట్టు 16 పరుగులు మాత్రమే చేసింది. అయితే పేసర్లు చెలరేగి లంచ్‌లోపు మూడు వికెట్లు తీయడంతో భారత్ పైచేయి సాధించింది. షమీ బౌలింగ్‌లో గిల్ అద్భుత క్యాచ్‌కు టేలర్ వెనుదిరగ్గా, ఇషాంత్ బౌలింగ్‌లో నికోల్స్ (7) స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. వాట్లింగ్ (1)ను మరో చక్కటి బంతితో షమీ బౌల్డ్ చేశాడు. రెండో సెషన్లో గ్రాండ్‌హోమ్ (13) కూడా షమీ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోగా... మరో ఎండ్‌లో విలియమ్సన్ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. 32 పరుగుల వద్ద అతనికి కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. షమీ బౌలింగ్‌లో ఎల్బీ కోసం అప్పీల్ చేసిన భారత్ రివ్యూ కోరింది. అయితే వెంట్రుకవాసి తేడాతో ‘అంపైర్ కాల్’ ద్వారా అతను బయటపడ్డాడు. షమీ ఓవర్లో ఫోర్, సిక్స్‌తో దూకుడుగా ఆడబోయిన జేమీసన్ (21) అదే ఓవర్లో వెనుదిరగ్గా... కివీస్‌కు ఆధిక్యం లభించగానే ఇషాంత్ బౌలింగ్‌లో పేలవ షాట్‌కు విలియమ్సన్ వెనుదిరిగాడు. అయితే చివర్లో సౌతీ (46 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటం తో కివీస్ మెరుగ్గా ఇన్నింగ్స్‌ను ముగించగలిగింది. చివరి 4 వికెట్లకు ఆ జట్టు 77 రన్స్ జోడించింది. రాణించిన సౌతీ రెండో ఇన్నింగ్స్‌లో కూడా కివీస్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రోహిత్, గిల్ వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు. అయితే తొలి ఇన్నింగ్స్ లోటును పూరించక ముందే గిల్‌ను సౌతీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రోహిత్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడి కుదురుకుంటున్న దశలో స్వయంకృతంతో వెనుదిరిగాడు. సౌతీ బంతి సరిగా అంచనా వేయలేక బ్యాట్ ఎత్తేసిన అతను ఎల్బీగా వెనుదిరిగాడు. అతను రివ్యూ కోరే ప్రయత్నం కూడా చేయలేదు. అనంతరం మరో 19 బంతులు ఎదుర్కొన్న కోహ్లి, పుజారా ప్రమాదం లేకుండా జాగ్రత్తపడ్డారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 217; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 30; కాన్వే (సి) షమీ (బి) ఇషాంత్ 54; విలియమ్సన్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 49; టేలర్ (సి) గిల్ (బి) షమీ 11; నికోల్స్ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 7; వాట్లింగ్ (బి) షమీ 1; గ్రాండ్‌హోమ్ (ఎల్బీ) (బి) షమీ 13; జేమీసన్ (సి) బుమ్రా (బి) షమీ 21; సౌతీ (బి) జడేజా 30; వాగ్నర్ (సి) రహానే (బి) అశ్విన్ 0; బౌల్ట్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (99.2 ఓవర్లలో ఆలౌట్) 249 వికెట్ల పతనం: 1–70, 2–101, 3–117, 4–134, 5–135, 6–162, 7–192, 8–221, 9–234, 10–249. బౌలింగ్: ఇషాంత్ 25–9–48–3, బుమ్రా 26–9–57–0, షమీ 26–8–76–4, అశ్విన్ 15–5–28–2, జడేజా 7.2–2–20–1. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) సౌతీ 30; గిల్ (ఎల్బీ) (బి) సౌతీ 8; పుజారా (బ్యాటింగ్) 12; కోహ్లి (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (30 ఓవర్లలో 2 వికెట్లకు) 64 వికెట్ల పతనం: 1–24, 2–51. బౌలింగ్: సౌతీ 9–3–17–2 , బౌల్ట్ 8–1–20–0, జేమీసన్ 10–4–15–0, వాగ్నర్ 3–0–8–0. -
సెమీఫైనల్స్‌కు రిజర్వ్ డే కావాలి!
సిడ్నీ: ఇటీవలే ఆస్ట్రేలియాలో ముగిసిన మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేకుండా పోయింది. ఫలితంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన తొలి సెమీస్ రద్దు కాగా... ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో సెమీస్‌లోనూ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా ఫలితం తేలింది. అయితే లీగ్ దశలో ఎక్కువ విజయాలు సాధించడంతో ఇంగ్లండ్‌ను వెనక్కి తోసి భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది. కీలకమైన సెమీస్‌కు కనీసం రిజర్వ్ డే పెట్టకపోవడంతో ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ప్రతిష్టాత్మక పురుషుల టి20 ప్రపంచకప్‌లో అలాంటి పరిస్థితి రాకూడదని ఆతిథ్య బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కోరుకుంటోంది. ఇప్పటికే అంగీకరించిన నిబంధనల ప్రకారం ఒక్క ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. ఇప్పుడు సెమీఫైనల్స్‌కు కూడా రిజర్వ్ డే పెట్టమంటూ ఐసీసీకి విజ్ఞప్తి చేయాలని సీఏ నిర్ణయించింది. త్వరలో జరగనున్న ఐసీసీ క్రికెట్ కమిటీ సమావేశంలో సీఏ ఈ ప్రతిపాదన పెట్టనుంది. ఈ సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందని, అనంతరం చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) ఆమోద ముద్ర వేస్తే తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తుందని ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మరి కొన్ని నెలల్లో టోర్నీ జరగనున్న నేపథ్యంలో నిబంధనలు మార్చడం అరుదుగా జరుగుతుందని, అయితే ఐసీసీ సభ్యదేశాల్లో ఎవరైనా వీటిని మార్చే విషయంపై చర్చ జరపవచ్చని ఆయన చెప్పారు. ‘ఒక టోర్నీ జరిగిన తర్వాత మంచి చెడుల గురించి విశ్లేషించడం, రాబోయే టోర్నీకి ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకోవడం ఎప్పుడైనా జరుగుతుంది. వేర్వేరు సమయంలో నిర్వహించినా టి20 ప్రపంచకప్ 2020కి సంబంధించి రెండు టోర్నీలకూ ఒకే తరహా నిబంధనలు మహిళా వరల్డ్ కప్ జరగక ముందే విధించారనేది వాస్తవం. అయితే నిబంధనల మార్పు గురించి మన వాదనలో వాస్తవం ఉండాలి. ఇంగ్లండ్ మహిళల జట్టు పరిస్థితి ఏమిటో మాకు బాగా తెలుసు. ఇప్పుడు మాలో చాలా మంది సెమీస్‌కు కూడా రిజర్వ్ డే ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు’ అని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ అభిప్రాయ పడ్డారు. ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబర్ 15 వరకు టి20 ప్రపంచ కప్ జరుగుతుంది. -
భారీ వర్షం; ఫైనల్లో భారత్!
సిడ్నీ: మహిళల టి20 ప్రపంచ కప్‌లో భాగంగా జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో టాస్ ఇంకా వేయలేదు. వర్షం తగ్గే సూచనలు కన్పించడం లేదని స్థానిక సమాచారం. కనీసం 10 ఓవర్లు మ్యాచ్ జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ వర్షం తగ్గితే వెంటనే మ్యాచ్ జరిపేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్, భారత జట్లు తలపడనున్నాయి. రిజర్వ్ డే లేకపోవడంతో మ్యాచ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనే ఈరోజే నిర్వహించాలి. ఒకవేళ మ్యాచ్ రద్దయితే భారత్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో భారత్‌కు ఫైనల్ చాన్స్ దక్కుతుంది. మొదటి మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన రెండో సెమీస్ రద్దయితే సఫారి టీమ్ ఫైనల్‌కు వెళుతుంది. గ్రూప్ ‘బి’లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. (చదవండి: నాలుగో ప్రయత్నం ఫలిస్తుందా..!) రిజర్వ్ డే ఎందుకు లేదు? టోర్నీ ప్రారంభానికి ముందు అంగీకరించిన నిబంధనల్లో రిజర్వ్ డే ప్రస్తావన లేకపోవడంతో దీన్ని పెట్టలేదు. ఆలస్యంగా మేలుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) తర్వాత రిజర్వ్ డే గురించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. ముందుగా అనుకున్నదాని ప్రకారం సెమీఫైనల్ మ్యాచ్‌ల కోసం రిజర్వ్ డే లేదని, చివరి నిమిషంలో షెడ్యూల్ మార్చలేమని సీఏకు ఐసీసీ స్పష్టం చేసింది. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే పెడితే టోర్నీ వ్యవధి మరింత పెరుగుతుందని, ఇది అనవసరపు ఇబ్బందికి దారి తీస్తుందని కూడా ఐసీసీ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వర్షం పడితే పిచ్, మైదానం పరిస్థితులను బట్టి రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ కూడా రద్దయితే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. -
నాటి రిజర్వ్‌డేలో భారత్ గెలిచింది.. ఇప్పుడూ?
మాంచెస్టర్ : వర్షం కారణంగా ప్రతిష్టాత్మక ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ రిజర్వేడేకు వాయిదాపడిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్‌లో భారత్ ప్రత్యర్థిగా ఉన్న ఓ మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా పడటం ఇది రెండోసారి. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన 1999 ప్రపంచకప్‌లో తొలిసారి ఈ సంఘటన జరిగింది. బర్మింగ్‌హామ్‌లో మే 29న భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ కూడా రిజర్వ్‌డేకు వాయిదా పడింది. అయితే తొలి రోజు భారత ఇన్నింగ్స్ (232/8) ముగిసి, ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాక వర్షం రావడంతో రిజర్వ్‌డే అయిన మే 30న ఈ మ్యాచ్‌ను కొనసాగించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాటి ఓపెనర్ సౌరవ్ గంగూలీ ఆల్‌రౌండ్ ప్రదర్శన(40 పరుగులు, 3 వికెట్లు)తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో భారత్ సూపర్ సిక్స్‌లో వెనుదిరగగా.. పాక్, ఆస్ట్రేలియా ఫైనల్లో తలపడ్డాయి. టైటిల్ మాత్రం ఆస్ట్రేలియానే వరించిన సంగతి తెలిసిందే. అయితే నాటి రిజర్వ్‌డే భారత్‌కు కలిసొచ్చిందని ఇప్పుడూ కూడా గెలుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ప్రపంచకప్: మళ్లీ వర్షం రావడమే మంచిదైంది
మాంచెస్టర్ : ప్రతిష్టాత్మక ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. భారత్, న్యూజిలాండ్ మధ్య మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్ పూర్తికాకుండానే వరుణుడు అడ్డుపడ్డాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ మ్యాచ్ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అయితే వర్షం పలుమార్లు దోబూచులాడటం భారత అభిమానులకు తెగ టెన్షన్ పెట్టింది. డక్‌వర్త్‌లూయిస్ పద్దతిలో భారత్ నిర్థేశించాల్సిన లక్ష్యాలను చూసి భారత అభిమానులు కొంత కలవరపాటుకు గురయ్యారు. నిజానికి మంగళవారం మళ్లీ వర్షం రావడమే భారత్‌కు మంచిదైందని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: అపరిచిత మహిళకు షమీ మెసేజ్) మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదిస్తే టీమిండియా విజయానికి 148 పరుగులు చేయాల్సి వచ్చేది. టీ20 స్టార్లు జట్టులో ఉన్నా...వర్షం ఆగిన తర్వాత పిచ్‌లో వచ్చే మార్పు, మబ్బు పట్టిన వాతావరణంలో కివీస్ బౌలర్లు స్వింగ్‌తో చెలరేగిపోయే ప్రమాదం ఉండేది. అదే జరిగితే భారత్‌కు ఛేదన కష్టంగా మారేది. పైగా కివీస్ ఆరంభం కూడా అంత బాగాలేదు. వరుస రెండు ఓవర్లు మెయిడిన్ అయ్యాయి. ఆ జట్టు తొలి పవర్‌ప్లేలో ఒక వికెట్ కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది. ఈ పరిస్థితులు పిచ్ ఎంత కఠినంగా ఉందో తెలియజేసింది. మ్యాచ్ రిజర్వ్‌డేకు వాయిదా పడటంతో అభిమానులంతా కొంత ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం కూడా మొత్తం ఆట సాగాలని లేకుంటే మ్యాచ్ రద్దు కావాలని ప్రార్ధిస్తున్నారు. (చదవండి: సెమీస్ సశేషం!) వాతావరణ శాఖ అంచనా ప్రకారం మాంచెస్టర్‌లో బుధవారం కూడా పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదు. ఒక వేళ మ్యాచ్ సమయంలో మళ్లీ వర్షం పడితే కివీస్ ఇన్నింగ్స్‌ను అక్కడితోనే ముగించి డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యమైనా డక్‌వర్త్ లూయిస్ వర్తిస్తుంది. అదీ జరగకుండా పూర్తిగా రద్దయితే మాత్రం లీగ్ దశలో టాప్ ర్యాంకులో నిలిచిన భారత్ ఫైనల్‌కు చేరుతుంది. (చదవండి: వరల్డ్‌కప్‌లో అరుదైన ఘట్టం!) -
తప్పని నిరాశ.. రేపటికి వాయిదా
మాంచెస్టర్ : ప్రపంచకప్ తొలి సెమీస్ వర్షం కారణంగా రిజర్వ్‌డే(బుధవారం)కు వాయిదా పడింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశచెందారు. మరో మూడు ఓవర్లలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగుస్తుందనుకున్న సమయంలో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. అదికాస్త భారీ వర్షంగా మారడంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రేపటికి వాయిదా వేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి కివీస్ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్(67 నాటౌట్), లాథమ్(3 నాటౌట్)లు ఉన్నారు. రేపటి ఆట మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్ బ్యాటింగ్‌తో మొదలవుతుంది. మ్యాచ్‌ను రేపటికి వాయిదా వేయడానికి ముందు అంపైర్లు తర్జనభర్జన పడ్డారు. ఎట్టిపరిస్థితిల్లోనూ ఈ రోజే మ్యాచ్ ముగించాలని భావించారు. వీలు కుదిరితే ఛేదనలో టీమిండియాను 20 ఓవర్లైనా ఆడించేందుకు ప్రయత్నించారు . అయితే వర్షం వస్తూ పోతుండటంతో మ్యాచ్ కొనసాగించడం కష్టమని భావించిన అంపైర్లు రిజర్వ్‌డేకు వాయిదా వేశారు. రిజర్వ్‌డే రోజు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంటే లీగ్ దశలో ఎక్కువ పాయింట్లతో ఉన్న కోహ్లీసేన ఫైనల్ చేరుకుంటుంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు టీమిండియా బౌలర్లు చెడుగుడు ఆడుకున్నారు. భువనేశ్వర్ (1/30), జస్ప్రీత్ బుమ్రా (1/25) తొలి రెండు ఓవర్లను మెయిడిన్ వేశారు. ఒక్క పరుగు వద్దే ఫామ్‌లో లేని కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (1; 14 బంతుల్లో)ను బుమ్రా ఔట్ చేసి కివీస్‌కు షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో హెన్రీ నికోలస్ (28; 51 బంతుల్లో 2×4)తో కలిసి సారథి కేన్ విలియమ్సన్ (67; 95 బంతుల్లో 6×4) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. జట్టు స్కోరు 69 వద్ద ఓ అద్భుతమైన బంతితో నికోలస్‌ను జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (67నాటౌట్; 85 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి విలియమ్సన్ ఇన్నింగ్స్ నడిపించాడు. అనంతరం అర్ధశతకం అందుకున్నాడు. భారత బౌలింగ్ దెబ్బకు కివీస్ 29 ఓవర్లకు గానీ 100 పరుగులు దాటలేదు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. అర్ధశతకం తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో చాహల్ బౌలింగ్‌లో విలియమ్సన్ ఔటయ్యాడు. అప్పుడు స్కోరు 134/3. జేమ్స్ నీషమ్ (12; 18 బంతుల్లో 1×4) కాసేపు నిలిచాడు. అతడిని పాండ్య ఔట్‌చేశాడు. క్రీజులోకి వచ్చిన గ్రాండ్‌హోమ్ (16; 10 బంతుల్లో 2×4)తో కలిసి టేలర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దూకుడుగా ఆడుతూ అర్ధశతకం అందుకున్నాడు. అంతలోనే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. -
‘రిజర్వ్ డే’ సాధ్యం కాదు
లండన్: ప్రపంచ కప్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మరికొన్ని మ్యాచ్ లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీ నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఈవెంట్లో అన్ని మ్యాచ్‌లకు ‘రిజర్వ్ డే’ ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చింది. 45 లీగ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంచడం సాధ్యం కాదని... అది తీవ్ర శ్రమతో కూడుకున్న వ్యవహారమని స్పష్టం చేసింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రం రిజర్వ్ డే ఉన్నట్లు వెల్లడించింది. ‘ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌కు రిజర్వ్ డే పెట్టడం సాధ్యం కాదు. రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడదని ఎవరూ హామీ ఇవ్వలేరు’ అని ఐసీసీ వివరణ ఇచ్చింది. -
ఫైనల్‌కు రిజర్వ్ డే
ముంబై: ఐపీఎల్–10 సీజన్లో ఒక్క ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంచారు. మే 21న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఏదేని కారణం వల్ల ఆ రోజు మ్యాచ్ జరగకపోతే మరుసటి రోజు మే 22న ఫైనల్ నిర్వహిస్తారు. అయితే లీగ్‌లోని మూడు ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు మాత్రం రిజర్వ్ డే ఉండదని బీసీసీఐ ప్రకటించింది. తొలి క్వాలిఫయర్ మే 16న ముంబైలో, ఎలిమినేటర్ మ్యాచ్ మే 17న బెంగళూరులో జరుగుతాయి. రెండో క్వాలిఫయర్ కూడా బెంగళూరులోనే మే 19న నిర్వహిస్తారు. -
కోహ్లి కొత్త సూచన
ఫతుల్లా: వన్డే మ్యాచ్ లకు ఉన్నట్టుగానే టెస్ట్ లకూ రిజర్వు డే ఉంటే బాగుంటుందని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కొత్త సూచన చేశాడు. పొడుగు ఫార్మెట్ కూ రిజర్వు డే ఉండాలన్న తన సూచనపై చర్చ జరగాలన్నాడు. భారత్-బంగ్లాదేశ్ ఏకైక టెస్టు డ్రా గా ముగిసిన తర్వాత కోహ్లి విలేకరులతో మాట్లాడాడు. '250 పైగా ఓవర్ల పాటు సాగిన టెస్టు మ్యాచ్ ఈరోజు డ్రాగా ముగిసింది. టెస్టులకూ రిజర్వు డే పెట్టి చూడాలి. మ్యాచ్ పరిస్థితిని బట్టి ఫలితం కోసం మరొక్క రోజు పొడిగించే అవకాశాన్ని పరిశీలించాలి. దీనిపై చర్చలు ఎలా జరుగుతాయనేది నాకు తెలియదు' అని కోహ్లి అన్నాడు.