నాటి రిజర్వ్‌డేలో భారత్‌ గెలిచింది.. ఇప్పుడూ? | India Won World Cup 1999 Reserve Day Match | Sakshi
Sakshi News home page

నాటి రిజర్వ్‌డేలో భారత్‌ గెలిచింది.. ఇప్పుడూ?

Jul 10 2019 12:21 PM | Updated on Jul 10 2019 12:21 PM

India Won World Cup 1999 Reserve Day Match - Sakshi

ప్రపంచకప్‌-1999లో భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌

నాటి ఓపెనర్‌ సౌరవ్‌​ గంగూలీ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత విజయంలో..

మాంచెస్టర్‌ : వర్షం కారణంగా ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వేడేకు వాయిదాపడిన విషయం తెలిసిందే. అయితే  ప్రపంచకప్‌లో భారత్‌ ప్రత్యర్థిగా ఉన్న ఓ మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా పడటం ఇది రెండోసారి. ఇంగ్లండ్‌ ఆతిథ్యమిచ్చిన 1999 ప్రపంచకప్‌లో తొలిసారి ఈ సంఘటన జరిగింది. బర్మింగ్‌హామ్‌లో మే 29న భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌ కూడా రిజర్వ్‌డేకు వాయిదా పడింది. అయితే తొలి రోజు భారత ఇన్నింగ్స్‌ (232/8) ముగిసి, ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమయ్యాక వర్షం రావడంతో రిజర్వ్‌డే అయిన మే 30న ఈ మ్యాచ్‌ను కొనసాగించారు.

ఈ మ్యాచ్‌లో భారత్‌ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాటి ఓపెనర్‌ సౌరవ్‌​ గంగూలీ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన(40 పరుగులు, 3 వికెట్లు)తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో భారత్‌ సూపర్‌ సిక్స్‌లో వెనుదిరగగా.. పాక్‌, ఆస్ట్రేలియా ఫైనల్లో తలపడ్డాయి. టైటిల్‌ మాత్రం ఆస్ట్రేలియానే వరించిన సంగతి తెలిసిందే. అయితే నాటి రిజర్వ్‌డే భారత్‌కు కలిసొచ్చిందని ఇప్పుడూ కూడా గెలుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement