రోహిత్ శర్మ.. టీమిండియా వన్డే ఓపెనర్‌గా సోమవారంతో దశాబ్ద కాలం పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా పదేళ్ల క్రితం.. జనవరి 23న మొహాలిలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గౌతం గంభీర్‌కు జోడీగా ఓపెనింగ్‌కు దిగాడు రోహిత్.
నాటి మ్యాచ్‌లో గంభీర్ 10 పరుగులకే పెవిలియన్ చేరగా.. హిట్‌మ్యాన్ 93 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 83 పరుగులతో అదరగొట్టాడు. రోహిత్‌కు తోడు సురేశ్ రైనా(89- నాటౌట్) రాణించడంతో ఆ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. నిలకడలేమి ప్రదర్శన కారణంగా 2011 వన్డే వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అతడు.. 2013 తర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.
ధోని తీసుకున్న నిర్ణయం
నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తీసుకున్న నిర్ణయం రోహిత్ కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పింది. విధ్వంసకర ఓపెనర్‌గా.. పరుగుల ప్రవాహం పారించే బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌కు పేరు తెచ్చిపెట్టింది. ఇక 2013 చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ.. శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
డబుల్ సెంచరీల ఓపెనర్
ఆ తర్వాత ఆస్ట్రేలియా మీద డబుల్ సెంచరీ సాధించి వన్డేల్లో ఈ రికార్డు నమోదు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు... మూడుసార్లు ద్విశతకం బాదిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా రోహిత్(264) పేరిటే ఉంది.
ఆ ఐదు శతకాలు
ఇక అన్నింటిలోనూ 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ మరింత ప్రత్యేకం. ఈ మెగా ఐసీసీ ఈవెంట్‌లో హిట్‌మ్యాన్ ఏకంగా ఐదు సెంచరీలు బాదడం విశేషం. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 240 వన్డేల్లో రోహిత్.. 9681 పరుగులు చేశాడు.
టీమిండియా సారథిగా
ఇందులో 29 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు, 48 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక తన కెరీర్‌లో అత్యధికంగా హిట్‌మ్యాన్ వన్డేల్లో 886 ఫోర్లు, 267 సిక్సర్లు బాదాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ధోని పేరిట ఉన్న సిక్సర్ల రికార్డు బద్దలు కొట్టాడు. కాగా 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లలో టీమిండియాను విజయపథంలో నిలిపి సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అనిపించుకుంటున్నాడు.
చదవండి: KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే..
IND-W Vs WI- W: దంచికొట్టిన మంధాన, హర్మన్.. టీమిండియా ఘన విజయం
Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్?
The best moments of Rohit Sharma as an ODI opener, 5 hundreds in 2019 World Cup. pic.twitter.com/dggD8a1rNK
— Johns. (@CricCrazyJohns) January 24, 2023
Comments
Please login to add a commentAdd a comment