
ఫైనల్‌కు రిజర్వ్ డే
ముంబై: ఐపీఎల్–10 సీజన్‌లో ఒక్క ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంచారు. మే 21న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఏదేని కారణం వల్ల ఆ రోజు మ్యాచ్ జరగకపోతే మరుసటి రోజు మే 22న ఫైనల్ నిర్వహిస్తారు. అయితే లీగ్‌లోని మూడు ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు మాత్రం రిజర్వ్ డే ఉండదని బీసీసీఐ ప్రకటించింది. తొలి క్వాలిఫయర్ మే 16న ముంబైలో, ఎలిమినేటర్ మ్యాచ్ మే 17న బెంగళూరులో జరుగుతాయి. రెండో క్వాలిఫయర్ కూడా బెంగళూరులోనే మే 19న నిర్వహిస్తారు.