ఛేదించిన జట్లే గెలుపొందడం విశేషం!
3–1తో సిరీస్ నెగ్గిన ఇంగ్లండ్
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): కరీబియన్ పర్యటనలో ఆఖరిదైన ఐదో టి20 రద్దవడంతో ఇంగ్లండ్ 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరగాల్సిన మ్యాచ్ సరిగ్గా ఐదు ఓవర్లు ముగిశాక వర్షంతో ఆగిపోయింది. అప్పటికే మ్యాచ్ నిలిచే సమయానికి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది.
ఓపెనర్లు లూయిస్ (20 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (10 బంతుల్లో 14 నాటౌట్, 3 ఫోర్లు) అజేయంగా ఉన్నారు. అయితే భారీ వర్షంతో అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. తిరిగి ఆట నిర్వహించలేని పరిస్థితి తలెత్తడంతో ఫీల్డు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో మొదటి మూడు టి20ల్లో వరుసగా ఇంగ్లండే గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను నెగ్గింది.
ఈ సిరీస్‌లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ సీమర్ సాకిబ్ మహ్మూద్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ పర్యటనలో ముందు మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య వెస్టిండీస్ 2–1తో కైవసం చేసుకుంది. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో ఫలితాలు వచ్చిన ఈ ఏడు మ్యాచ్‌ల్లోనూ టాస్ నెగ్గి... ఫీల్డింగ్ ఎంచుకొని, లక్ష్యాన్ని
Comments
Please login to add a commentAdd a comment