కొలంబో: ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగే ‘సూపర్–4’ మ్యాచ్‌కు సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు కొలంబోలో వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా ‘రిజర్వ్ డే’ను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.
అంటే ఆదివారం వాన కారణంగా మ్యాచ్ నిలిచిపోతే ఆట ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే సోమవారం కూడా మ్యాచ్ కొనసాగుతుంది. ఆసియా కప్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫైనల్ మ్యాచ్‌కు (సెప్టెంబర్ 17) మాత్రమే రిజర్వ్ డే ఉంది.ప్రేమదాస స్టేడియంలో మొత్తం ఐదు ‘సూపర్– 4’ మ్యాచ్‌లు ఉండగా... మిగతా నాలుగు మ్యాచ్‌లకు కాకుండా ఒక్క భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కే ‘రిజర్వ్ డే’ ఇవ్వడం గమనార్హం.
లీగ్ దశ లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పాకిస్తాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. దాంతో టోర్నీ ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రసారకర్తల విజ్ఞప్తి మేర కు ఏసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment