ACC
-
యువ ఆటగాళ్ల ఆసియా సమరం
దుబాయ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్–19 ఆసియా కప్ 11వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో 8 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్, యూఏఈ, జపాన్‌తో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగుతుండగా... శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఉంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్తాన్... శ్రీలంకతో నేపాల్ తలపడతాయి. దుబాయ్, షార్జాలలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఏసీసీ ఆసియా కప్‌ను 10 సార్లు నిర్వహించగా... అందులో ఎనిమిదిసార్లు భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. డిసెంబర్ 8న జరగనున్న తుది పోరుతో టోర్నమెంట్ ముగుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు సాధించేందుకు ఆటగాళ్లకు ఈ టోర్నీ ఎంతో ఉపయోగపడనుంది. గతంలో అండర్–19 స్థాయిలో మెరుపులు మెరిపించి... ఆ తర్వాత గ్లోబల్ స్టార్స్‌గా ఎదిగిన ప్లేయర్లు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం యువ భారత జట్టుకు మొహమ్మద్ అమాన్ సారథ్యం వహిస్తుండగా... కిరణ్ చోర్మలే వైస్ కెపె్టన్‌గా వ్యవహరించనున్నాడు. టోర్నీలో భాగంగా భారత జట్టు శనివారం తమ తొలి పోరులో పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. అనంతరం డిసెంబర్ 2న జపాన్‌తో, 4న ఆతిథ్య యూఏఈతో మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత అండర్–19 జట్టు: మొహమ్మద్ అమాన్ (కెపె్టన్), కిరణ్ చోర్మలే (వైస్ కెపె్టన్), ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్ధార్్థ, కేపీ కార్తికేయ, ప్రణవ్ పంత్, హార్దిక్ రాజ్, నిఖిల్ కుమార్, హర్వంశ్ సింగ్, అనురాగ్, ఇనాన్, సమర్థ్ నాగరాజ్, యుధాజిత్ గుహ, చేతన్ శర్మ. -
ఒకే జట్టుకు ఆడనున్న టీమిండియా- పాక్ ఆటగాళ్లు?
బెనోనీ (దక్షిణాఫ్రికా): సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఆఫ్రో–ఆసియా కప్ నిర్వహించే దిశగా చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు రెండుసార్లు జరిగిన ఈ కప్‌ను పునరుద్ధరించాలని ఆఫిక్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీతో)తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 2005లో తొలిసారి దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆఫ్రో ఆసియా కప్ ‘డ్రా’గా ముగియగా... 2007లో భారత్ వేదికగా జరిగిన టోర్నీలో ఆసియా జట్టు విజేతగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం 2009లో కెన్యా వేదికగా మూడో ఎడిషన్ జరగాల్సి ఉన్నా అది సాధ్యపడలేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ దీనిపై చర్చ జరుగుతోంది. ‘ఆఫ్రో–ఆసియా కప్ ద్వారా కేవలం ఆటే కాదు... రెండు సంఘాలకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని ఏసీఏ తాత్కాలిక చైర్మన్ తవెంగ్వా ముకులాని అన్నాడు. జింబాబ్వే క్రికెట్ సంఘం అధ్యక్షుడిగానూ పని చేస్తున్న తవెంగ్వా దీని కోసం చర్చలు జరుగుతున్నాయని వెల్లడించాడు. ‘ఆసియా క్రికెట్ కౌన్సిల్‌తో ఈ కప్ గురించి చర్చ జరుగుతుంది. ఆఫ్రికా వాసులంతా ఈ టోర్నీని తిరిగి తీసుకు రావాలని కోరుకుంటున్నారు’ అని తవెంగ్వా పేర్కొన్నాడు. 2005లో జరిగిన ఆఫ్రో–ఆసియా కప్‌లో ఆసియా జట్టుకు అప్పటి పాకిస్తాన్ సారథి ఇంజమాముల్ హక్ సారథిగా వ్యవహరించగా... భారత్ నుంచి రాహుల్ ద్రవిడ్, ఆశిష్ నెహ్రా, అనిల్ కుంబ్లే పాల్గొన్నారు. ఇక 2007 లో జరిగిన టోర్నీలో భారత్ నుంచి ధోనీ, సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహా్వగ్, సచిన్ టెండూల్కర్ పాల్గొనగా... పాక్ జట్టు నుంచి మొహమ్మద్ యూసుఫ్, షోయబ్ అక్తర్, మొహమ్మద్ ఆసిఫ్ ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఆఫ్రో–ఆసియా కప్‌ను ఐపీఎల్ తరహాలో నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎక్కడ నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి, ఎలాంటి పద్ధతిలో ముందుకు వెళ్లాలి అనే దశ వరకు చర్చలు జరగనట్లు సమాచారం. కాగా... సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లే ఆడటం లేదు. అలాంటిది ఇప్పుడు ఇరు దేశాల ఆటగాళ్లు కలిసి ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అంటే అది అంత సులభం మాత్రం కాదు. -
భారత్ వేదికగా ఆసియాకప్-2025.. పాకిస్తాన్ వస్తుందా?
పురుషుల ఆసియాకప్-2025కు భారత్ ఆతిథ్యమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈసారి టీ20 ఫార్మాట్లో ఆసియాకప్ జరగనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తాజాగా 2024 నుంచి 2027 కాలానికి గాను స్పాన్సర్షిప్ హక్కుల కోసం ఐఈవోఐ(IEOI)లను ఆహ్వానించింది. దీని ప్రకారం ప్రకారం వచ్చే ఏడాది ఆసియాకప్ భారత్‌లో జరగనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా గతేడాది వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్‌కు పాకిస్తాన్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ వంతు. అదే విధంగా ఆసియాకప్-2026(వన్ఢే ఫార్మాట్)కు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. ఇక ఈ రిపోర్ట్ ప్రకారం భారత్ వేదికగా జరిగే ఆసియాకప్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నేరుగా ఆర్హత సాధించగా.. మరో జట్టు క్వాలిఫియర్స్ ఆరో జట్టుగా టోర్నీలో అడుగుపెడుతుంది. అదే విధంగా మొత్తం 13 మ్యాచ్‌లో ఈ ఈవెంట్లో జరగనున్నాయి. ఆసియాకప్-2023(వన్డే ఫార్మాట్) విజేతగా భారత్ నిలవగా.. అంతకుముందు ఆసియాకప్-2022(టీ20 ఫార్మాట్) ఛాంపియన్స్‌గా శ్రీలంక నిలిచింది.పాక్ వస్తుందా?వన్డే ప్రపంచకప్-2023లో తలపడేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ మరోసారి తమ దాయాది గడ్డపై అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అయితే వాస్తవానికి గతేడాది ఆసియాకప్‌కు పాకిస్తాన్ ఒంటరిగానే ఆతిథ్యమివ్వాల్సింది. కానీ భారత జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరిచిండంతో హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరిగింది.భారత్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు కూడా పాక్‌ను ఆతిథ్యమివ్వనుంది. కానీ మరోసారి తమ జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ సిద్దంగా లేదు. ఆసియాకప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇంక ఈ విషయంపై ఎటువంటి స్పష్టత లేదు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు టీమిండియా తమ దేశానికి రాకపోతే.. పాక్ ఆసియాకప్‌లో తలపడేందుకు భారత్‌కు వస్తుందో లేదో వేచి చూడాలి. -
భారత్, పాక్ మ్యాచ్‌కు ‘రిజర్వ్ డే’.. అందుకే ఆ నిర్ణయం!
కొలంబో: ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగే ‘సూపర్–4’ మ్యాచ్‌కు సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు కొలంబోలో వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా ‘రిజర్వ్ డే’ను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఆదివారం వాన కారణంగా మ్యాచ్ నిలిచిపోతే ఆట ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే సోమవారం కూడా మ్యాచ్ కొనసాగుతుంది. ఆసియా కప్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫైనల్ మ్యాచ్‌కు (సెప్టెంబర్ 17) మాత్రమే రిజర్వ్ డే ఉంది.ప్రేమదాస స్టేడియంలో మొత్తం ఐదు ‘సూపర్– 4’ మ్యాచ్‌లు ఉండగా... మిగతా నాలుగు మ్యాచ్‌లకు కాకుండా ఒక్క భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కే ‘రిజర్వ్ డే’ ఇవ్వడం గమనార్హం. లీగ్ దశ లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పాకిస్తాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. దాంతో టోర్నీ ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రసారకర్తల విజ్ఞప్తి మేర కు ఏసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
ఏసీసీ బ్యాటరీకి మహర్దశ
న్యూఢిల్లీ: దేశంలో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ భారీ వృద్ధిని చూడనుంది. డిమాండ్ ఏటా 50 శాతం కాంపౌండెడ్ చొప్పున (సీఏజీఆర్) పెరుగుతూ, 2022 నాటికి ఉన్న 20 గిగావాట్ అవర్ (జీడబ్ల్యూహెచ్) నుంచి.. 2030 నాటికి 220 గిగావాట్ అవర్‌కు చేరుకుంటుందని సీఐఐ అంచనా వేసింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ వృద్ధికి స్థానికంగా అభివృద్ధి చెందుతున్న బ్యాటరీ తయారీ పరిశ్రమ, బలమైన స్థానిక సరఫరా మద్దతునిస్తాయని పేర్కొంది. మొత్తం వ్యాల్యూచైన్ (మెటీరియల్ ప్రాసెసింగ్, అసెంబ్లింగ్, ఇంటెగ్రేషన్)లో అధిక భాగాన్ని భారత్ స్థానికంగానే తయారు చేసే స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ఈ అధ్యయనం కోసం 6డబ్ల్యూరీసెర్చ్ సాయాన్ని సీఐఐ తీసుకుంది. ‘‘వాహనం పవర్‌ట్రెయిన్‌ను బ్యాటరీ నడిపిస్తుంది. మెరుగైన బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) అభివృద్ధికి వీలుగా, బ్యాటరీ టెక్నాలజీలో పురోగతి అవసరం. తయారీ సామర్థ్యాల ఏర్పాటు, జాతీయ స్థాయిలో బ్యాటరీ ముడి పదార్థాల సరఫరా బలోపేతం చేయడమే కాకుండా.. చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు భారత్‌కు అధిక నాణ్యత, వినూత్నమైన బ్యాటరీ మెటీరియల్స్‌ను సరఫరా చేసే విశ్వసనీయ సరఫరా వ్యవస్థలు అవసరం’’ అని సీఐఐ నేషనల్ కమిటీ చైర్మన్ అయిన విపిన్ సోది తెలిపారు. మైనింగ్‌ను ప్రోత్సహించాలి.. కోబాల్ట్, నికెల్, లిథియం, కాపర్ మైనింగ్, రిఫైనింగ్‌ను దేశీయంగా ప్రోత్సహించాలని సీఐఐ నివేదిక సూచించింది. బ్యాటరీ తయారీలో వినియోగించే కీలకమైన ఖనిజాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. బ్యాటరీ తయారీని పెంచేందుకు వీలుగా పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాల రూపంలో మద్దతుగా నిలవాలని అభిప్రాయపడింది. అలాగే, ఖనిజాల ప్రాసెసింగ్ ప్లాంట్‌కు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలకు (ఆర్అండ్డీ) ప్రోత్సాహకాలు అందించాలని సూచించింది. అత్యాధునిక టెక్నాలజీ కోసం ఇతర దేశాలతో సహకారం ఇచ్చిపుచ్చుకోవడం, బ్యాటరీ కెమికల్స్ పరిశ్రమ పర్యావరణ ఇతర అనుమతులు, లైసెన్స్‌లను పొందే విషయంలో నియంత్రణలను సులభతరం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. కేంద్ర సర్కారు 20 గిగావాట్ అవర్ ఏసీసీ తయారీకి వీలుగా ఉత్పత్తి ఆధారిత అనుసంధాన పథకం కింద (పీఎల్ఐ) రూ.18,100 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. దేశీయంగా బ్యాటరీల ముడిసరుకు ఉత్పత్తి ► ఎల్ఎఫ్పీ తయారీలో ఆల్ట్‌మిన్ బ్యాటరీల్లో కీలకమైన క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ (క్యామ్)కి సంబంధించిన ముడి సరుకు లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ)ని తొలిసారి దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు ఆల్ట్‌మిన్ శ్రీకారం చుట్టింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖలో భాగమైన ఏఆర్‌సీఐ తోడ్పాటుతో పైలట్ ప్రాతిపదికన 10 మెగావాట్ల సామర్ధ్యంతో ప్లాంటును ప్రారంభిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు మౌర్య సుంకవల్లి, కిరీటి వర్మ తెలిపారు. దీనిపై దాదాపు రూ. 25 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. విద్యుత్ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో సామరŠాధ్యన్ని 3 గిగావాట్లకు పెంచుకునే ప్రణాళికలు ఉన్నట్లు పేర్కొన్నారు. భారత్‌కు 2025 నాటికి 25 గిగావాట్లు, 2030 నాటికి 150 గిగావాట్ల సామర్ధ్యం అవసరమవుతుందని చెప్పారు. ఎల్ఎఫ్పీ విషయంలో స్వయం సమృద్ధి సాధించడం వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. ఎల్ఎఫ్పీకి అవసరమయ్యే లిథియంను బొలీవియా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. -
Ind Vs Pak: రాత్రి 7:45కు ముహూర్తం.. దాయాదుల మ్యాచ్ సెప్టెంబర్ 2న!
ఉపఖండపు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ(జూలై 19, బుధవారం) రాత్రి 7:45 గంటలకు మ్యాచ్‌లు షెడ్యూల్, వేదికల వివరాలను పీసీబీ విడుదల చేసే యోచనలో ఉంది. కాగా ఆసియా కప్‌కు ఈసారి హైబ్రీడ్ మోడ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఆడే మ్యాచ్‌లు సహా మొత్తం 9 మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుండగా.. పాకిస్తాన్ నాలుగు మ్యాచ్‌లకు వేదిక కానుంది. వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో ఆసియా కప్ ఈసారి 50 ఓవర్ల ఫార్మాట్లో జరగనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 2న కాండీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్‌లోనే దాయాదులు రెండుసార్లు తలపడే అవకాశముంది(లీగ్ దశలో, సూపర్ 4లో మరోసారి). ముందుగా ఆగస్టు 31 నుంచి నిర్వహించాలనుకున్న ఆసియా కప్ ఒకరోజు ముందుగానే టోర్నీని ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) వెల్లడించింది. ఇక టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్‌లోని ముల్తాన్ లో పాకిస్థాన్, నేపాల్ మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు శ్రీలంకలోని కొలంబో ఆతిథ్యమివ్వనుంది.ఆసియా కప్ కు సంబంధించి ఏసీసీ షెడ్యూల్ ను ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇందులో మరికొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి పాకిస్థాన్, శ్రీలంకలలో టోర్నీ జరగనుండటంతో డ్రాఫ్ట్ షెడ్యూల్లో తరచూ మార్పులు తప్పడం లేదు. మొత్తం 13 మ్యాచ్‌లు ఆసియాకప్ 2023లో భాగంగా మొత్తం 13 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్థాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఈ లెక్కన ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ సూపర్ 4లోనూ తలపడటం ఖాయం. ఈ లెక్కన ఆసియా కప్ లో కనీసం రెండుసార్లు ఈ రెండు జట్లు పోటీ పడతాయి. అదే జరిగితే ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా సెప్టెంబర్ 10న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఉంటుంది. డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఏ1, ఏ2 మధ్య క్యాండీలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక సూపర్ 4 స్టేజ్ లో సెప్టెంబర్ 6న ఒక్క మ్యాచ్ మాత్రమే పాకిస్థాన్ లో జరుగుతుంది. ఈసారి డ్రాఫ్ట్ షెడ్యూల్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. గ్రూప్ స్టేజ్ లో టీమ్స్ ఏ స్థానంలో నిలిచాయన్నదానితో సంబంధం లేకుండా వాటికి నంబర్లు కేటాయించారు. ఈ లెక్కన గ్రూప్ ఎలో పాకిస్థాన్ ఏ1 కాగా.. ఇండియా ఏ2గా ఉంది. అటు గ్రూప్ బిలో శ్రీలంక బీ1, బంగ్లాదేశ్ బీ2గా ఉంటుంది. ఒకవేళ ఈ ఇవి కాకుండా ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ సూపర్ 4కు అర్హత సాధిస్తే అవి గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన జట్ల స్థానాలను ఆక్రమిస్తాయి. చదవండి: యాషెస్ నాలుగో టెస్ట్‌కు వర్షం ముప్పు.. బజ్‌బాల్ డోస్ పెంచుతామన్న స్టోక్స్ SL Vs PAK 1st Test: లంక కీపర్‌ను ముప్పతిప్పలు పెట్టిన పాక్ బౌలర్ -
జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్‌కు గ్రీన్ సిగ్నల్
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆసియా క్రికెట్ కౌన్సిల్ పర్యవేక్షిస్తోంది. ఈసారి ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్లో జరగనుంది. శ్రీలంక, పాకిస్తాన్‌లు ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లు పాకిస్తాన్లో.. మరో తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. ఇటీవలే పీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన జకా అష్రఫ్.. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఒక మెట్టు దిగిన జకా అష్రఫ్ తాను అలా అనలేదని.. ఆసియాకప్ టోర్నీని పాకిస్తాన్లో నిర్వహించి ఉంటే బాగుండేదని మాత్రమే అన్నట్లుగా పేర్కొన్నాడు. అయితే ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటివరకు విడుదల కాకపోవడానికి పీసీబీనే పరోక్ష కారణం. హైబ్రీడ్ మోడల్‌ను ఒకసారి ఒప్పుకోవడం.. మరోసారి తిరస్కరించడం.. వరల్డ్‌కప్‌తో ముడిపెట్టడంతో అసలు ఆసియా కప్ జరుగుతుందా అన్న అనుమానం కలిగింది. తాజాగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్.. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు జై షాతో భేటి అయ్యాడు. సోమవారం రాత్రి ఇద్దరు దుబాయ్‌లో కలుసుకొని ఆసియా కప్ గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించడంపై తమకు అభ్యంతరం లేదని స్వయంగా పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్ జైషాకు వెల్లడించారు. దీంతో ఆసియా కప్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ శుక్రవారం ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇదే విషయమై పీసీబీ చీఫ్ మాట్లాడుతూ.. ''జై షాతో మీటింగ్ మంచి ఆరంభం. ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్లో నిర్వహించడం మాకు ఓకే. ఇక రానున్న కాలంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మైత్రి బంధం బలపడే అవకాశముంది. రిలేషన్స్‌ను పెంచుకుంటూ ముందుకు సాగుతాం'' అంటూ తెలిపాడు. చదవండి: Wimbledon 2023: సంచలనం.. నెంబర్ వన్ స్వియాటెకు షాకిచ్చిన స్వితోలినా -
'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది'
ఆసియా కప్ 2023 నిర్వహణపై సందిగ్ధత వీడింది. పీబీసీ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోక్కు ఓకే చెప్పిన ఆసియా క్రికెటర్ కౌన్సిల్(ఏసీసీ) గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇక ఆసియా కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో రానుంది. కాగా ఆసియా కప్ నిర్వహణలో పీసీబీ ప్రతిపాదనను అంగీకరించిన ఏసీసీకి.. పీసీబీ చైర్మన్ నజమ్ సేథీ కృతజ్ఞతలు తెలిపారు. ఆసియా కప్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాగానే నజమ్ సేథీ మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ తన ట్విటర్లో షేర్ చేసింది. నజమ్ సేథీ మాట్లాడుతూ.. ''ACC ఆసియా కప్ 2023 కోసం మా హైబ్రిడ్ వెర్షన్ ఆమోదించింనందుకు నేను సంతోషిస్తున్నా. ఆసియా కప్ హోస్ట్‌గా మేము ఉండడం.. భారత్ పాకిస్తాన్ రాలేని కారణంగా శ్రీలంక తటస్థ వేదికగా ఉండనుంది. అయితే గత 15 ఏళ్లలో ఆసియా కప్ ద్వారా టీమిండియా పాకిస్తాన్లో అడుగుపెడుతుందని అనుకున్నాం. కానీ బీసీసీఐ పరిస్థితి మాకు అర్థమైంది. మాలాగే బీసీసీఐకి కూడా బార్డర్ దాటి పాక్‌లో ఆసియా కప్ ఆడేందుకు వారి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌తో పాటు ఆమోదం కావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగదని తెలుసు. కానీ మా ప్రతిపాదనను అర్థం చేసుకున్న ఏసీసీకి కృతజ్ఞతలు.'' అంటూ చెప్పుకొచ్చాడు. کرکٹ کے شائقین کے لیے بڑی خوشخبری ایشیا کپ ایک بار پھر پاکستان میں۔ پاکستان کرکٹ بورڈ کی مینجمنٹ کمیٹی کے چیئرمین نجم سیٹھی کا پیش کردہ ہائبرڈ ماڈل منظور, ایشیا کپ31 اگست سے17 ستمبر تک ہوگا۔ ابتدائی میچز پاکستان میں ہونگے جس کے بعد بقیہ میچز سری لنکا میں کھیلے جائیں گے۔ pic.twitter.com/r9jUZ8jCGX — Pakistan Cricket (@TheRealPCB) June 15, 2023 ఇక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. పాకిస్తాన్లో 4 మ్యాచ్‌లు... శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. గ్రూప్ దశ తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్ ఫోర్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ ఫోర్’ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. పాకిస్తాన్‌లోని నాలుగు మ్యాచ్‌లకు లాహోర్ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్‌కప్ జరగడంతో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. చదవండి: ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల -
ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల
ఎట్టకేలకు ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో జరగనున్న ఈ టోర్నీని ‘హైబ్రిడ్ మోడల్’లో నిర్వహించేందుకు జై షా అధ్యక్షుడిగా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆగస్టు 31 నుంచి సెపె్టంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. పాకిస్తాన్లో 4 మ్యాచ్‌లు... శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. గ్రూప్ దశ తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్ ఫోర్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ ఫోర్’ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. పాకిస్తాన్‌లోని నాలుగు మ్యాచ్‌లకు లాహోర్ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్‌కప్ జరగడంతో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. -
పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్ ఇండియా ఆలా చేస్తే పాకిస్థాన్ కి బారి నష్టమే..!
-
AsiaCup 2023: కొత్త ట్విస్ట్.. పాక్ లేకుండానే టోర్నీ నిర్వహణ!
ఆసియా కప్ 2023 విషయమై ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య సయోధ్య కుదిరేలా సూచనలు కనిపించడం లేదు. ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని చూసిన పీసీబీకి చుక్కెదురైనట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడ్ ప్రకారం పాక్‌లో కొన్ని మ్యాచ్‌లు.. భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించాలని పీసీబీ భావించింది. కానీ హైబ్రిడ్ మోడ్‌కు బీసీసీఐ అంగీకరించలేదని.. ఆ సమయంలో దుబాయ్‌లో వేడి ఎక్కువగా ఉంటుందని.. ఆటగాళ్లు తట్టుకోలేరని ఏసీసీకి బీసీసీఐ వివరించినట్లు సమాచారం. ఏసీసీలో భాగంగా ఉన్న ఇతర దేశాలు కూడా పాక్ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడ్‌కు ఒప్పుకోనట్లు తెలిసింది. దీంతో పాకిస్తాన్ లేకుండానే ఆసియా కప్ జరగనున్నట్లు తెలిసింది. రిపోర్టు ప్రకారం, టోర్నమెంట్‌కు అధికారిక హోస్ట్ అయిన పాకిస్థాన్ మినహా ఆసియా కప్ ఆడేందుకు ఏసీసీ సభ్యులందరూ అంగీకరించినట్లు తెలిసింది. పాకిస్థాన్ కాకుండా వేరే దేశంలో ఆసియా కప్ నిర్వహించేందుకు అంగీకరించినట్లు సమాచారం. కానీ పాకిస్థాన్ మాత్రం హైబ్రిడ్ మోడల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్ల పాకిస్థాన్ తన నిర్ణయాన్ని సడలించకపోతే ఈసారి పాక్ జట్టు లేకుండానే ఆసియాకప్ జరగనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) రాబోయే ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో పాల్గొనే ఇతర దేశాలన్నీ శ్రీలంకలో ఆసియా కప్ ఆడేందుకు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి స్పష్టమైన సందేశం పంపే అవకాశాలు ఉన్నాయి. అలాగే, శ్రీలంకలో ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ కాకుండా ఇతర దేశాల నుంచి మద్దతు ఎక్కువగా ఉన్నందున ఏసీసీ నిర్ణయాన్ని అంగీకరించడం లేదా పూర్తిగా వైదొలగడం మినహా పాకిస్థాన్‌కు ఇప్పుడు వేరే మార్గం లేదు. ఒకవేళ ఈ ఈవెంట్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పాల్గొనకపోతే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్‌లు శ్రీలంక వేదికగా ఆసియా కప్‌లో ఆడతాయి. అయితే ఇప్పుడు పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌ను భారత్ తిరస్కరిస్తే.. అక్టోబర్, నవంబర్లలో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగే అవకాశం ఉంది. అయితే ఇది పాకిస్తాన్‌కే నష్టం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఆసియా కప్ సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు జరిగే నిర్వహించే యోచనలో ఏసీసీ ఉంది. చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. 38 బంతుల్లోనే సెంచరీ శ్రీలంకలో ఆసియాకప్.. జరుగుతుందా? లేదా? ఫామ్‌లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు -
ఆసియా కప్ జరగడం అనుమానమే.. 'అందుకు' ససేమిరా అంటున్న శ్రీలంక, బంగ్లాదేశ్
ఆసియా కప్-2023 నిర్వహణ రోజుకో మలుపు తిరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. అయితే, భద్రత కారణాల దృష్ట్యా పాక్‌లో అడుగుపెట్టేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో, సగం మ్యాచ్‌లు యూఏఈలో (భారత్ ఆడే మ్యాచ్‌లు), సగం మ్యాచ్‌లు తమ దేశంలో నిర్వహించేందుకు పాక్ అయిష్టంగా ఒప్పుకుంది. వేదిక విషయంలో ప్రధాన జట్లైన భారత్, పాక్ అంగీకారం తెలపడంతో టోర్నీ సజావుగా సాగుతుందని అంతా ఊహించారు. అయితే, తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు యూఏఈలో మ్యాచ్‌లు ఆడేందుకు ససేమిరా అంటుండటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సెప్టెంబర్ నెలలో యూఏఈలో ఎండలు భయానకంగా ఉంటాయని ఈ రెండు దేశాలు సాకుగా చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యలో యూఏఈ, పాక్‌లలో కాకుండా టోర్నీ మొత్తాన్ని శ్రీలంకలో నిర్వహించే మధ్యేమార్గ ప్రతిపాదనను ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెరపైకి తెచ్చింది. అయితే ఈ ప్రతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటున్నట్లు సమాచారం. టీమిండియా ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేందుకు తాము అంగీకరించినప్పుడు.. కొత్తగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అనవసర లొల్లి చేయడం సరికాదని పీసీబీ చీఫ్ అన్నట్లు సమాచారం. గతంలో ఐపీఎల్, ఆసియా కప్ టీ20 టోర్నీలు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో యూఏఈలో జరిగిన విషయాన్ని గుర్తు చేసినప్పటికీ శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ససేమిర అన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాదు కూడదని టోర్నీని శ్రీలంకలోనే నిర్వహిస్తామంటే తాము వైదొలుగుతామని పీసీబీ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. శ్రీలంక, బంగ్లాదేశ్‌లను ఒప్పించేందుకు పీసీబీ చీఫ్ నజమ్ సేథి స్వయంగా రంగంలో దిగినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో టోర్నీ నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు జరగాల్సి ఉన్న ఆసియా కప్-2023 టోర్నీకి సంబంధించి వచ్చే నెల(జూన్)లో జరిగే సమావేశంలో ఏసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. చదవండి: వన్డే ప్రపంచకప్.. భారత్ తొలి మ్యాచ్ ఎవరితో అంటే? మరి పాక్‌తో -
'కోట్లు నష్టపోతామని తెలుసు'.. మొండివైఖరి పనికిరాదేమో!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్ నజామ్ సేథీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌ను మా జట్టు బహిష్కరిస్తే పీసీబీ ఆదాయంలో మూడు అమెరికన్ మిలియన్ డాలర్లు(సుమారు రూ.25 కోట్ల రూపాయలు) నష్టపోతుందని తెలిపాడు. మేము చేసిన ప్రతిపాదనకు ఒకవేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అంగీకరించకుంటే ఆసియాకప్‌ను బహిష్కరించేందుకు కూడా వెనుకాడమని.. దీనివల్ల కోట్ల రూపాయల నష్టం వచ్చినా భరించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపాడు. ''ఆసియా కప్ విషయంలో మా వైఖరి ఏంటో ఇప్పటికే ఏసీసీకి క్లియర్‌గా చెప్పాం. హైబ్రిడ్ మోడ్‌లో టోర్నీ నిర్వహించడంపై మాకు అభ్యంతరం లేదు. హైబ్రిడ్ మోడ్‌లో భారత్ తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఆడుకోవచ్చు.. మిగతా మ్యాచ్‌లు మాత్రం(ఫైనల్‌తో పాటు) పాక్‌లో జరిగేలా చూడాలని చెప్పాం. అయితే దీనివల్ల మేము ఆతిథ్య హక్కులు కోల్పోకుండా ఉంటాం. ఒకవేళ ఆసియా కప్‌కు మరో షెడ్యూల్‌ను ప్రకటిస్తే మేము ఒప్పుకోం. ఆసియా కప్‌ను బహిస్కరిస్తాం. ఇక దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. అయితే తమ దేశంలో ఆసియాకప్ ఆడడానికి భద్రతాపరమైన కారణాలు చూపిస్తున్న బీసీసీఐ ఒక విషయంలో క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మా దేశంలో భద్రత కరువయ్యిందని వారు ప్రూఫ్స్ చూపిస్తే బాగుండు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి జట్లు మా దేశంలో ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పనప్పుడు.. భారత్ మాత్రం ఎందుకు ఈ కారణం చూపిస్తుందో అర్థం కావడం లేదు. అయితే ఏసీసీలో 80 శాతం ఆదాయం పాకిస్తాన్, భారత్‌ల మ్యాచ్‌ల వల్లే వస్తుంది. ఒకవేళ మా ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించకపోతే వచ్చే నష్టాన్ని భరించడానికి సిద్దంగా ఉన్నాం'' అని పేర్కొన్నాడు. నజామ్ సేథీ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ''ఇంత మొండితనం పనికిరాదేమో.. నష్టం భరిస్తామనడం మంచి పద్దతి కాదు.. బీసీసీఐతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటే మంచిది'' అంటూ హితబోధ చేశారు. చదవండి: ODI WC 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. హైదరాబాద్ స్టేడియానికి మహర్దశ -
పాక్‌లోనే ఆసియా కప్.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్-2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. అయితే టోర్నీ పాక్‌లో జరుగుతుండడంతో టీమిండియా అక్కడ ఆడేందుకు నిరాకరించింది. దీంతో మొదట ఆసియా కప్‌ను తటస్థ వేదికకు మార్చాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) భావించింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆసియా కప్ తమ దేశంలో నిర్వహించకపోతే ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ను బహిష్కరిస్తామని తెలిపింది. అటు బీసీసీఐ కూడా ఈ విషయంలో మొండి వైఖరితోనే ఉంది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇరుబోర్డుల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే గురువారం రాత్రి ఏసీసీ ఆధ్వర్యంలో పీసీబీ, బీసీసీఐ బోర్డులు సమావేశమయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆసియా కప్ ఆడుతుందని.. టోర్నీ పాకిస్తాన్‌లోనే జరుగుతుందని ఏసీసీ తెలిపింది. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లను మాత్రం తటస్థ వేదికపై నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ ఆడే మ్యాచ్‌లకు సంబంధించి ఒమన్, యూఏఈ, ఇంగ్లండ్, శ్రీలంక పేర్లను పరిశీలించారు. ఈ వేదికల్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయనున్నట్లు తెలిసింది. ఒకవేళ టీమిండియా ఆసియా కప్ ఫైనల్ బెర్తు బుక్ చేసుకుంటే.. ఫైనల్ కూడా తటస్థ వేదికలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఇందుకు పీసీబీ కూడా అంగీకరించినట్లు ఏసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కన ఆసియా కప్ విషయంలో బీసీసీఐ తమ పంతం నెగ్గించుకున్నట్లే. మరోవైపు పీసీబీ మాత్రం ఏసీసీ ప్రతిపాదనకు అంగీకరించడంతో ఒక మెట్టు దిగినట్లయింది. ఇక ఏడాది చివర్లో వన్డే వరల్డ్‌కప్ ఉండడంతో ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లోనే నిర్వహించాలని ఏసీసీ భావిస్తోంది. ఆసియా కప్‌లో మొత్తం ఆరు దేశాలు పాల్గొననుండగా.. భారత్, పాకిస్తాన్, క్వాలిఫయర్లు ఒక గ్రూప్‌లో ఉండగా.. మరొక గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. మొత్తం 13 రోజుల పాటు జరగనున్న టోర్నీలో గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సూపర్-4లో టాప్ రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. చదవండి: ఎలిమినేటర్.. ఫైనల్‌కు వెళ్లేది ఎవరు? ఐపీఎల్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు -
హైదరాబాద్‌లో ఫెడెక్స్ ‘ఏసీసీ’
హైదరాబాద్: లాజిస్టిక్స్ సేవల్లోని ఫెడెక్స్ హైదరాబాద్‌లో తన తొలి అడ్వాన్స్డ్ క్యాపబులిటీ కమ్యూనిటీ (ఏసీసీ)ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా కావాల్సిన భిన్నమైన మానవవనరుల నియామకం, అభివృద్ధి కోసం దీన్ని వినియోగించు కోనుంది. తద్వారా మరింత చురుకైన, సమర్థ వంతమైన సంస్థగా కస్టమర్లకు డెలివరీ అనుభవాన్ని ఇవ్వాలని అనుకుంటున్నట్టు ఫెడెక్స్ తెలిపింది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏసీసీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. వ్యాపార అవసరాలు, అధిక నైపుణ్య మావన వనరుల అవసరాల ఆధారంగా ప్రాంతాలను ఎంపిక చేస్తామని పేర్కొంది. -
పాక్‌కు ఎదురుదెబ్బ.. యూఏఈలో ఆసియాకప్!
ఆసియా కప్ తమ దేశంలో నిర్వహించాలనుకున్న పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆసియాకప్ పాక్‌లో నిర్వహిస్తే తాము ఆడబోయేది లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఈసారి కూడా ఆసియాకప్‌ను యూఏఈ వేదికగా నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శనివారం బహ్రెయిన్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) సభ్య దేశాల మధ్య జరిగిన సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఏసీసీ ఛైర్మన్ జై షా, పీసీబీ అధ్యక్షుడు నజామ్ సేథీ టోర్నీని యూఏఈకి మార్చే అంశంపై చర్చించారు. కాగా ఆసియాకప్‌ను ఎక్కడ నిర్వహించాలనేది మార్చిలో ఖరారు చేయనున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియాకప్ పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. కానీ ఈ టోర్నీలో ఆడేందుకు పాక్‌కు వెళ్లమని గతేడాది అక్టోబర్‌లోనే బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ టోర్నీలో భారత్ ఆడకుంటే ఆసియా కప్ పాక్ నిర్వహించినప్పటికి ఆదాయం మాత్రం పెద్దగా రాదు. భారత్ సహా అన్ని దేశాలతో తటస్థ వేదికలో టోర్నీ నిర్వహించినా ఆతిథ్య హక్కులు కలిగిన పీసీబీకి తగినంత గ్రాంటు లభిస్తుంది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆసియా కప్ నిర్వహణ పేరుతో బీసీసీఐతో సున్నం పెట్టుకోవడం కంటే భారత్‌కు అనుగుణంగా టోర్నీని యూఏఈలో నిర్వహించడమే మేలని పీసీబీ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగానైనా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ప్రసార హక్కుల ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని యోచిస్తోంది. చదవండి: యువరక్తం ఉరకలేస్తుంది.. కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు 'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా' -
అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్లకు స్పందన అంతంతే
న్యూఢిల్లీ: సిమెంట్ రంగ దిగ్గజాలు ఏసీసీ, అంబుజా వాటాదారులకు అదానీ గ్రూప్ ప్రకటించిన ఓపెన్ ఆఫర్లలో నామమాత్ర స్పందనే కనిపించింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన దేశీ బిజినెస్ కొనుగోలులో భాగంగా అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్లను చేపట్టింది. పబ్లిక్ నుంచి 26 శాతం అదనపు వాటా కొనుగోలుకి ప్రకటించిన ఓపెన్ ఆఫర్లు వారాంతాన(9న) ముగిశాయి. సిమెంట్ దిగ్గజాలు వెల్లడించిన వివరా ల ప్రకారం 4.89 కోట్ల షేర్లకుగాను ఏసీసీ వాటాదారుల నుంచి 40.51 లక్షల షేర్లు మాత్రమే లభించాయి. ఇక అంబుజా సిమెంట్స్ విషయంలో మరింత తీసికట్టుగా కేవలం 6.97 లక్షల షేర్లు టెండర్ అయ్యాయి. కంపెనీ 51.63 కోట్ల షేర్ల కోసం ఆఫర్ ఇచ్చింది. రెండు కంపెనీల ఓపెన్ ఆఫర్లు ఆగస్ట్ 26న ప్రారంభమయ్యాయి. ఏసీసీ షేరుకి రూ. 2,300, అంబుజాకు రూ. 385 చొప్పున అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. హోల్సిమ్ దేశీ సిమెంట్ బిజినెస్‌ను సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్ 10.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 84,000 కోట్లు)డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఓపెన్ ఆఫర్లు విజయవంతమైతే రూ.31,000కోట్లు వెచ్చించవలసి వచ్చేది. వారాంతాన ఏసీసీ షేరు ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే బీఎస్ఈలో 3 శాతం అధికంగా రూ. 2,365 వద్ద ముగిసింది. అంబుజా సిమెంట్స్ ఆఫర్ ధరకంటే 18 శాతం ప్రీమియంతో రూ. 454 వద్ద స్థిరపడింది. -
లంకదే ఆసియాకప్.. ముందే నిర్ణయించారా!
15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ ముగింపుకు మరొక్క రోజు మాత్రమే మిగిలింది. వరల్డ్ కప్ అంత కాకపోయినా.. ఆసియా ఖండంలో చాంపియన్‌గా నిలిచే అవకాశం ఆసియా కప్ ద్వారా ఉపఖండంలో ఉన్న జట్లకు అవకాశం ఉంటుంది. అయితే ఎన్నో అంచనాల మధ్య ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్-4 దశలోనే వెనుదిరిగింది. ప్రభావం చూపిస్తుందనుకున్న బంగ్లాదేశ్.. పసికూన హాంకాంగ్ కంటే దారుణంగా ఆడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఇక ఫైనల్ పోరు సెప్టెంబర్ 11న(ఆదివారం) పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరగనుంది. ఇక ఆసియా కప్‌ను అత్యధికంగా భారత్ ఏడుసార్లు గెలవగా.. శ్రీలంక ఐదుసార్లు, పాకిస్తాన్ రెండుసార్లు టైటిల్స్ అందుకున్నాయి. మరి 15వ ఎడిషన్ ఆసియాకప్‌ను శ్రీలంక, పాకిస్తాన్లలో ఎవరు అందుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి ఆసియా కప్‌ను లంకకు అందివ్వాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ముందుగానే నిర్ణయం తీసుకుందా అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. మొదట ఆసియా కప్‌ను నిర్వహించాల్సింది శ్రీలంకలోనే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ఆసియా కప్‌ను నిర్వహించలేమని చెప్పేసింది. దీంతో ఆఖరి నిమిషంలో ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి మార్చారు. ఇక గత కొన్ని నెలలుగా శ్రీలంక ఎంతో ఆర్థిక సంక్షోభానికి గురయ్యింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స వ్యవహారంపై లంక ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు కొన్ని నెలలపాటు దర్నాలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే లంక టూరిజం బాగా దెబ్బతిని ఆర్థిక సంక్షోభ సమస్య మరింత ముదిరిపోయింది. ముదిరి పాకాన పడడంతో మరో దిక్కులేక దేశం విడిచి పారిపోయిన రాజపక్స తన రాజీనామాను సమర్పించారు. ఆ తర్వాత అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే లంక ఆర్థిక పరిస్థితి గాడినపడ్డట్లు కనిపిస్తోంది. ఇక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక పరిస్థితిని అర్థం చేసుకున్న ఏసీసీ.. లంకను ఆసియాకప్ గెలిచేలా ప్రోత్సహించిందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి శ్రీలంక ఆసియాకప్‌ను కైవసం చేసుకుంటే లంక బోర్డుకు పెద్ద మొత్తంలో అందనున్నట్లు సమాచారం. కాగా లంక క్రికెట్ బోర్డు ఈ మొత్తాన్ని దేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు తమ వంతు సహకారం అందించాలని భావిస్తునట్లు సమాచారం. కాగా ఆసియాకప్‌ను లంక గెలిచినా.. గెలవకపోయినా ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) లంక బోర్డుకు ప్రత్యేక నగదు బహుమతిని అందించాలని ముందే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఆసియా కప్‌ను లంక గెలిచినా.. గెలవకపోయినా.. క్రికెట్ ఫ్యాన్స్ మనసులు మాత్రం గెలుచుకోవడం ఖాయం అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరొక విషయమేంటంటే.. ఎలాగు టీమిండియా సూపర్-4 దశలో వెనుదిరగడంతో.. భారత్ అభిమానుల మద్దతు కూడా శ్రీలంకకే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆట పరంగా ఆసియా కప్‌లో శ్రీలంక ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. లీగ్ దశలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దారుణ ఓటమి చవిచూసిన శ్రీలంక.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించి సూపర్-4లో అడుగుపెట్టింది. ఇక సూపర్-4లో మొదట అఫ్గన్‌పై విజయంతో ప్రతీకారం తీర్చుకున్న లంక.. భారత్‌కు షాక్ ఇచ్చింది. ఇక చివరగా పాకిస్తాన్‌తో జరిగిన పోరులో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి శ్రీలంక మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక తుదిపోరులోనూ పాకిస్తాన్‌ను మట్టి కరిపించి శ్రీలంక ఆరోసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా సూపర్-4 ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవడమే గాక మూడోసారి ఆసియాకప్‌ను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. చదవండి: Kane Williamson: గమ్మత్తుగా కేన్ మామ వ్యవహారం.. వీడియో వైరల్ కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తిన చెన్నై సూపర్ కింగ్స్ -
ఆసియా కప్ ఎలా పుట్టిందో తెలుసా?.. ఆసక్తికర విషయాలు
భారత క్రికెట్లో 1983లో కొత్త శకం ప్రారంభమైంది. ఎందుకంటే ఇదే ఏడాది కపిల్ డెవిల్స్ తొలి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్ ఇంగ్లండ్ గడ్డపై విశ్వవిజేతగా అవతరించింది. ఇలా ప్రపంచకప్‌లో తొలిసారి ఒక ఆసియా జట్టు కప్ గెలిచిన సందర్భం అదే. అప్పటికి పాకిస్తాన్, శ్రీలంకలు మాత్రమే ఆసియా నుంచి క్రికెట్ ఆడుతున్నాయి, ఈ నేపథ్యంలోనే ఆసియాలో క్రికెట్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC)ను 1983లో స్థాపించారు. ప్రస్తుతం ఈ కౌన్సిల్‌కు బీసీసీఐ సెక్రటరీ జై షా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ACCఏ ఆసియాకప్ పుట్టుకకు కారణమైంది. ఆసియా దేశాల మధ్య మాత్రమే నిర్వహించే టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు ఆసియా చాంపియన్‌గా అవతరిస్తుంది. తాజాగా మరికొన్ని గంటల్లో 15వ ఆసియా కప్‌కు తెరలేవనున్న నేపథ్యంలో దాని పుట్టుక, నిలిపివేసిన సందర్భాలు, ఎవరెవరు విజేతలుగా నిలిచారనేది ఒకసారి చూద్దాం. -సాక్షి, వెబ్‌డెస్క్ ఆసియాకప్ పుట్టిన సంవత్సరం: ఐసీసీ ఆధీనంలో ఉండే ఆసియా క్రికెట్ కౌన్సిల్ 1984లో యూఏఈ వేదికగా పురుషుల క్రికెట్లో తొలిసారి ఆసియాకప్ నిర్వహించింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ టోర్నీ జరగాల్సి ఉండగా.. మధ్యలో కొన్నిసార్లు నాలుగేళ్లకోసారి కూడా నిర్వహించారు. అన్ని ఆసియా కప్‌లు ఆడిన ఏకైక జట్టుగా శ్రీలంక ఇప్పటివరకు 14 ఆసియాకప్‌లు జరిగితే అన్ని టోర్నీలు ఆడిన ఏకైక జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక భారత్, పాకిస్తాన్‌లు చెరో 13సార్లు ఆసియాకప్‌లో పాల్గొన్నాయి. శ్రీలంకతో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా 1986లో భారత్ ఆసియా కప్‌ను బహిష్కరించింది. ఇదే కారణంతో 1993లో ఆసియాకప్‌ను నిర్వహించలేదు. ఇక భారత్‌తో రాజకీయ సంబంధాలు సరిగ్గా లేనందున పాకిస్తాన 1990-91 టోర్నీలో ఆడలేదు. ఐసీసీ చేతిలోకి అధికారాలు ఇక 2015లో ఆసియాకప్‌పై ఐసీసీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. టోర్నీ నిర్వహించే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు అధికారాలు తగ్గించి.. ఇక నుంచి ఆసియాకప్ రెండేళ్లకోసారి వన్డే, టి20 ఫార్మాట్లో రొటేషన్ పద్దతిలో జరుగుతుందని తెలిపింది. ఐసీసీ టోర్నీలకు అనుగుణంగా ఆసియాకప్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీని ప్రకారమే 2016 టి20 ప్రపంచకప్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు బంగ్లాదేశ్ వేదికగా తొలిసారి ఆసియాకప్‌ను టి20 తరహాలో నిర్వహించారు. ఆ తర్వాత 2019 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకొని.. 2018లో వన్డే ఫార్మాట్లో జరిగింది. తాజాగా 15వ ఎడిషన్ ఆసియా కప్ మరోసారి టి20 ఫార్మాట్లో జరగనుంది. ఇక 2023 ఆసియాకప్‌ను పాకిస్తాన్లో వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఇక 1984లో తొలిసారి నిర్వహించిన ఆసియాకప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక మధ్య మాత్రమే జరిగింది. 1986లో బంగ్లాదేశ్.. 2004లో యూఏఈ , హాంకాంగ్‌లు.. 2014లో అఫ్గనిస్తాన్‌లు ఆసియా కప్‌లో అరంగేట్రం చేశాయి. ఇక ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా ఏడుసార్లు ఆసియాకప్‌ను కైవసం చేసుకోగా.. ఆ తర్వాత శ్రీలంక ఐదుసార్లు, పాకిస్తాన్ రెండుసార్లు ఈ టోర్నీని ముద్దాడాయి. ఇక చివరగా 2018లో వన్డే ఫార్మాట్లో జరిగిన టోర్నీలో రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమిండియా టైటిల్ సాధించింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్ బరిలోకి దిగుతోంది. మరి 15వ ఆసియాకప్‌లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ 15వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్, ఇతర వివరాలు Asia Cup 2022: ‘ఆసియా’ అందుకునేందుకు.. -
అదానీ దూకుడు: రూ. 31 వేల కోట్ల ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. తద్వారా స్విస్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన దేశీ అనుబంధ సంస్థల్లో 26 శాతం చొప్పున వాటాలను కొనుగోలు చేయనుంది. ఇందుకు మొత్తం రూ. 31,000 కోట్లు వెచ్చించనుంది. ఈ ఏడాది మే నెలలో హోల్సిమ్ లిమిటెడ్ దేశీ బిజినెస్‌ల కొనుగోలుకి అదానీ గ్రూప్ 10.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 84,000 కోట్లు) విలువైన డీల్‌ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు గత వారం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందింది. సెప్టెంబర్ 9 వరకూ అంబుజా సిమెంట్స్ వాటాదారులకు షేరుకి రూ. 385, ఏసీసీ వాటాదారులకు షేరుకి రూ. 2,300 చొప్పున అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ శుక్రవారం(26న) ప్రారంభమై 2022 సెప్టెంబర్ 9న ముగియనుంది. వెరసి అంబుజా సిమెంట్స్‌కు చెందిన 51.63 కోట్ల షేర్లు(26 శాతం వాటా) అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 19,880 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో ఏసీసీకి చెందిన 4.89 కోట్ల షేర్ల కోసం రూ. 11,260 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. డీల్‌లో భాగంగా అంబుజా సిమెంట్స్‌లో 63.19 శాతం వాటాతోపాటు ఏసీసీలో 54.53% వాటాను అదానీ సొంతం చేసుకోనుంది. ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో అంబుజా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం బలపడి రూ. 403 వద్ద ముగిసింది. ఇక ఏసీసీ నామమాత్ర లాభంతో రూ. 2,286 వద్ద ముగిసింది. -
తొమ్మిదేళ్ల తర్వాత ప్రారంభం కానున్న టోర్నీ.. జై షా ట్వీట్ వైరల్
ACC Women's T20 Championship 2022: ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మహిళల టి20 చాంపియన్‌షిప్ టోర్నీ తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. జూన్ 17 నుంచి 25 వరకు జరగనున్న ఈ టోర్నీకి మలేషియా క్రికెట్ అసోసియేషన్ ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నీలో జరగనున్న మ్యాచ్‌లకు కిన్రారా ఓవల్, వైఎస్‌డీ యుకెఎమ్ ఓవల్‌లు వేదికలు కానున్నాయి. ఈ టర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. యూఏఈ, మలేషియా, ఒమన్, ఖతార్, నేపాల్, హాంకాంగ్, కువైట్, బహ్రెయిన్, సింగపూర్, బూటాన్‌లు ఈ లిస్టులో ఉన్నాయి. 10 జట్లు రెండు గ్రూఫులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడనుండగా.. రెండు గ్రూఫుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. దీనికి సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ''2013లో చివరిసారి ఏసీసీ మహిళల టి20 చాంపియన్‌షిప్‌ను నిర్వహించాం. తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత జూన్ 25న టోర్నీ ఆరంభం కానుంది. ఇకపై ప్రతీ ఏడాది నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటాం. ఆసియాలో మహిళల క్రికెట్ అభివృద్ధికి ఇలాంటి టోర్నీలు బాగా ఉపయోగపడుతాయి. మహిళా క్రికెటర్లు భవిష్యత్తులో మరింత రాణించేందుకు దోహద పడుతాయని చెప్పొచ్చు. అలాగే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్‌తో పాటు మరో రెండు జట్లతో మహిళల ఆసియాకప్ టి20 టోర్నీని కూడా త్వరలో నిర్వహించనున్నాం. ఈ టోర్నీలో పాల్గొనబోయే మిగిలిన రెండు జట్లను ఏసీసీ టి20 చాంపియన్‌లో ఫైనల్ చేరే రెండు జట్లుగా ఉంటాయి. ఆల్‌ది బెస్ట్'' అంటూ ట్వీట్ చేశాడు. I'm pleased to announce the commencement of the ACC Women's T20 Championship in Malaysia. Good luck to all ten participating teams! We're playing against each other, but playing as one. May the best team win. @ACCMedia1#AsianCricketCouncil #WomensT20Championship2022 pic.twitter.com/TsddSKA4La — Jay Shah (@JayShah) June 16, 2022 చదవండి: Viral Video: క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్ చూసి ఉండరనుకుంటా! 'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు' -
ఫలితాలు, ప్రపంచ సంకేతాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం(18–22) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ సంకేతాలపై ఆధారపడి కదలనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాల విడుదల ప్రారంభమైన నేపథ్యంలో ఇకపై మరిన్ని కంపెనీలు ఆర్థిక పనితీరును వెల్లడించనున్నట్లు తెలియజేశారు. క్యూ2లో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ తదితర ఐటీ బ్లూచిప్ కంపెనీలతోపాటు ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ బాటలో ఫలితాల సీజన్ మరింత వేడెక్కనున్నట్లు నిపుణులు తెలియజేశారు. క్యూ2 జాబితా ఇలా ఈ వారం రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న దిగ్గజాల జాబితాలో అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీతోపాటు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఇవేకాకుండా జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్తాన్ జింక్, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ సైతం క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. ఇక మరోవైపు చైనా క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెపె్టంబర్ నెలకు యూఎస్పారిశ్రామికోత్పత్తి వివరాలు వెల్లడికానున్నాయి. సెంటిమెంటుపై ఎఫెక్ట్ ఈ వారం దలాల్ స్ట్రీట్‌లో త్రైమాసిక ఫలితాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. తదుపరి కాలానికి కంపెనీలు ప్రకటించే ఆదాయ అంచనాలు(గైడెన్స్) తదితరాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నట్లు తెలియజేశారు. దీంతో ఆయా కంపెనీలు విడుదల చేసే ప్రోత్సాహకర లేదా నిరుత్సాహకర ఫలితాల ఆధారంగా మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. వారాంతాన ఫలితాలు వెలువడిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ కౌంటర్లలో నేడు(సోమవారం) అధిక యాక్టివిటీ నమోదుకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటితోపాటు ఈ వారం ఎఫ్ఎంసీజీ, సిమెంట్ దిగ్గజాలుసహా ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితర ఫలితాలు మార్కెట్లను నడిపించే వీలున్నట్లు అంచనా వేశారు. కరెక్షన్ తదుపరి కొద్ది రోజుల దిద్దుబాటు తదుపరి ఈ వారం గ్లోబల్ మార్కెట్లు జోరందుకునే వీలున్నట్లు సంతోష్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఫలితాలకు ఇవి జత కలిసే అవకాశమున్నట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో బ్యాంకింగ్ రంగం కీలకంగా నిలవనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్ రంగంలోని సంస్థలు క్యూ2 పనితీరు వెల్లడించవలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ ఆర్జనల్లో పటిష్ట రికవరీపట్ల పెరుగుతున్న అంచనాలు మార్కెట్లలో బుల్ రన్ కొనసాగేందుకు దోహదపడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే మార్కెట్ అంచనాలు విఫలమైతే ఆయా రంగాలలో స్వల్పకాలానికి దిద్దుబాటు జరగవచ్చని అంచనా వేశారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ఇటీవల జోరు చూపుతున్న ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల తీరు తదితర అంశాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు. కాగా.. గత గురువారం ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,247 పాయింట్లు(2 శాతం) పుంజుకోవడం ద్వారా మార్కెట్ చరిత్రలోనే తొలిసారి 61,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో నిఫ్టీ 18,000 పాయింట్ల మార్క్ ఎగువన నిలిచింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గత శుక్రవారం మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. రుణ మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు అక్టోబర్‌లో నికరంగా వెనకడుగు అక్టోబర్‌లో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లలో నికర అమ్మకందారులుగా నిలిచారు. గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్‌కు విరుద్ధంగా ఎఫ్‌పీఐలు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు రూపాయి మారకపు విలువ పతనం, ప్రపంచ పరిణామాలు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 1,472 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రధానంగా రుణ(డెట్) మార్కెట్లో అమ్మకాల ట్రెండ్ నమోదైంది. ఫలితంగా రూ. 1,698 కోట్లు విలువైన సెక్యూరిటీలను విక్రయించారు. ఇదేసమయంలో మరోపక్క రూ. 226 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా కొనుగోలు చేశారు. -
ఏసీసీ పుష్- సిమెంట్ షేర్ల దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) ద్వితీయ త్రైమాసికంలో దిగ్గజ కంపెనీ ఏసీసీ ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో సిమెంట్ రంగ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి ఏసీసీసహా అంబుజా, జేకే, రామ్‌కో, శ్రీ సిమెంట్ తదితర కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఏసీసీ జనవరి-డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీసీ క్యూ2 ఫలితాలతోపాటు.. సిమెంట్ రంగ షేర్ల జోరు వివరాలు చూద్దాం.. ఏసీసీ ఫలితాలు ఈ ఏడాది క్యూ2(ఏప్రిల్-జూన్)లో ఏసీసీ సిమెంట్ నికర లాభం 41 శాతం క్షీణించి రూ. 271 కోట్లకు పరిమితమైంది. ఇందుకు లాక్‌డవున్ ప్రభావం చూపగా.. నికర అమ్మకాలు సైతం 38 శాతం తక్కువగా రూ. 2520 కోట్లకు చేరాయి. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు 1.56 శాతం బలపడి 20.8 శాతాన్ని తాకాయి. ఏప్రిల్ నెలలో దాదాపు అమ్మకాలు నిలిచిపోయినప్పటికీ మే, జూన్ నెలల్లో సిమెంట్ విక్రయాలలో పటిష్ట రికవరీ కనిపించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమయంలో సరఫరా సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు, వ్యయాలను తగ్గించుకోవడంపై యాజమాన్యం దృష్టిసారించడంతో ఇకపై మెరుగైన ఫలితాలు సాధించే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. షేర్ల స్పీడ్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఏసీసీ 5 శాతం జంప్‌చేసి రూ. 1397 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1424కు ఎగసింది. అంబుజా సిమెంట్స్ 5.5 శాతం పెరిగి రూ. 207ను తాకగా.. జేకే సిమెంట్ 5 శాతం లాభపడి రూ. 1500కు చేరింది. తొలుత రూ. 1512 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో తొలుత రూ. 696 వరకూ ఎగసిన రామ్‌కో సిమెంట్ 2.25 శాతం పుంజుకుని రూ. 690 వద్ద ట్రేడవుతోంది. అల్ట్రాటెక్ 1.4 శాతం లాభంతో రూ. 3916 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3,955 వరకూ ఎగసింది. ఇదే విధంగా శ్రీ సిమెంట్ తొలుత రూ. 22,810 వరకూ ఎగసింది. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 22,634 వద్ద కదులుతోంది. ఇతర కౌంటర్లలో ఇండియా సిమెంట్స్ 2.3 శాతం పురోగమించి రూ. 122 వద్ద, బిర్లా కార్పొరేషన్ 2 శాతం బలపడి రూ. 575 వద్ద, హీడెల్‌బర్గ్ 1.5 శాతం పుంజుకుని రూ. 179 వద్ద ట్రేడవుతున్నాయి. -
చెప్పాల్సింది గంగూలీ కాదు: పీసీబీ
ఇస్లామాబాద్: ఆసియా కప్ 2020 రద్దయ్యింది అంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీడియా డైరెక్టర్ శామ్యూల్ హసన్ బర్నీ స్పందించారు. ఆ మాటలకు ఎలాంటి విలువ లేదంటూ కొట్టి పారేశారు. ఆసియా కప్ రద్దు విషయాన్ని ధృవీకరించాల్సింది ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ( ఏసీసీ) అని తెలిపారు. ‘ఇలాంటి ప్రకటనలు కేవలం ఏసీసీ ప్రెసిడెంట్ మాత్రమే చేయాలి. గంగూలీ వ్యాఖ్యాలు మ్యాచ్ షెడ్యూల్‌కు సంబంధించిన ప్రొసిడింగ్స్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. గంగూల్ ప్రతి వారం ఏదో ఒకటి ప్రకటిస్తూ ఉంటారు, ఆయన మాటలకు విలువ లేదు అని అన్నారు. దీనికి సంబంధించి ఏసీసీ ప్రెసిడెంట్ నజ్నూల్ హసన్ మాత్రమే ప్రకటన చేయాలి. మాకు తెలిసినంత వరకు ఏసీసీ సమావేశం షెడ్యూల్ ఇంకా ప్రకటించబడలేదు’ అని పేర్కొన్నారు. (ఆసియాకప్ 2020 వాయిదా : గంగూలీ) ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్‌తో జరిగిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో గంగూలీ ఆసియా కప్ 2020 రద్దైనట్లు పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల మధ్య ఎప్పుడు మ్యాచ్‌లు జరుగుతాయో చెప్పలేమని గంగూలీ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా ముందుకు వెళతామని, ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమని గంగూలీ పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆసియాకప్‌ను పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కానీ బీసీసీఐ భద్రతా విషయాలకు సంబంధించి అభ్యంతరం తెలపడంతో మ్యాచ్ జరగాల్సిన వేదికను దుబాయ్‌కు మార్చారు. సెప్టెంబరులో ఈ టోర్ని జరగాల్సి ఉండగా గురువారం (జూలై 9న) ఆసియా క్రికెట్ మండలి సమావేశం జరగనుంది. అయితే దీనికి ముందే ఈ టోర్నీ రద్దైనట్లు గంగూలీ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. . (ఐపీఎల్ లేకుండా 2020 ముగిసిపోవద్దు) -
ప్రధాని వ్యక్తిగత కార్యదర్శికి కీలక పదవి
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శి రాజీవ్ టోప్నో ప్రపంచ బ్యాంకులో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు సీనియర్ సలహాదారుగా సేవలందించనున్నారు. అతనితో పాటు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో పని చేస్తున్న పలువురు అధికారులకు ఇతర పదవులను కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) గురువారం ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా ఐదుగురు అధికారులను విదేశీ వ్యవహారాలు చూసుకునేందుకు కేటాయించింది. కాగా 2009లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ టోప్నో ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ ఆఫీసర్‌గా నియమితులు అయ్యారు. ఆ తర్వాత 2014లో ప్రధానిగా ఎన్నికైన మోదీ రాజీవ్ టోప్నోను తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. ఇక 1999 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బ్రజేంద్ర నవనీత్ జెనీవాలోని ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత అంబాసిడర్‌గా దేశం తరపు శాశ్వత ప్రతినిధిగా నియామకమయ్యారు. 1993 ఐఏఎస్ బ్యాచ్ అధికారి రవికోటను వాషింగ్టన్లో భారత ఎంబసీ మంత్రిగా ఏసీసీ నియమించింది. లేఖన్ తక్కర్‌ను బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయంలో ఎకనామిక్ కౌన్సిలర్‌గా, హెచ్ అతేలీని ఆసియా బ్యాంకులో ఈడీకి సలహాదారుగా, అన్వర్ హుస్సేన్ షేఖ్‌ను ప్రపంచ వాణిజ్య సంస్థలో పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియా కౌన్సిలర్‌గా నియమించింది. (ప్రధాని సలహాదారులుగా రిటైర్డ్ ఐఏఎస్‌లు) -
ప్రధాని సలహాదారులుగా రిటైర్డ్ ఐఏఎస్‌లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారులుగా ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ఎంపికయ్యారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నియామకాలను క్యాబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) ఈ నియామకాలను ఆమోదించింది. భాస్కర్ ఖుల్బే, అమర్జీత్ సిన్హాను ప్రధాని సలహాదారులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలు కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రారంభంలో రెండేళ్ల కాలానికి లేదా తదుపరి ఉత్తర్వుల వరకు అమల్లో ఉంటాయని ప్రకటించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్లు అయిన ఇద్దరూ 1983 బ్యాచ్‌కు చెందినవారు. ఖుల్బే పశ్చిమ బెంగాల్ కేడర్ చెందిన వారు కాగా, సిన్హా బీహార్ కేడర్‌కు చెందినవారు. సిన్హా గత సంవత్సరం గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఖుల్బే పీఎంఓలో పనిచేశారు. -
ఏసీసీ లాభం రూ.209 కోట్లు
న్యూఢిల్లీ: సిమెంట్ కంపెనీ ఏసీసీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన మూడో త్రైమాసిక కాలంలో 15 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది క్యూ3లో రూ.182 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది క్యూ3లో రూ.209 కోట్లకు పెరిగిందని ఏసీసీ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,141 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.3,466 కోట్లకు పెరిగిందని ఏసీసీ ఎమ్డీ, సీఈఓ నీరజ్ అఖోరి చెప్పారు. దీంట్లో సిమెంట్ విభాగం ఆదాయం రూ.3,185 కోట్లుగా, రెడీ మిక్స్ కాంక్రీట్ విభాగం ఆదాయం రూ.303 కోట్లుగా ఉన్నాయని వివరించారు. మొత్తం వ్యయాలు రూ.2,877 కోట్ల నుంచి రూ.3,160 కోట్లకు చేరాయని తెలిపారు. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తోంది. -
ఏసీసీ బాధితులను ఆదుకుంటాం
మైలవరం : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోనికి రా గానే ఏసీసీ బాధితులను ఆదుకుంటామని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైలా నరసింహా, వద్దిరాల రామాంజనేయుల యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీఎంపీ మాట్లాడుతూ 23 సంవత్సరాల నుంచి ఏసీసీ బాధితులు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. స్థానిక నాయకులు మోసపూరిత మాటలు నమ్మి రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. 2016 నవంబర్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులో మంత్రి ఆదినారాయణ రెడ్డి రైతులకిచ్చిన హామీ ఇంత వరకు నిలబెట్టుకోకపోవడం దురదృష్ణకరమన్నారు.వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు మాట్లాడుతూ ఏసీసీ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రజలు గళమెత్తితే వారిపై అక్రమ కేసులను ఆదినారాయణరెడ్డి పెట్టించారన్నారు. తన అనుచరులపై ఎటువంటి కేసులు లేకుండా కేవలం వైఎస్సార్సీపీ మద్దతు దారులపైనే పెట్టించారన్నారు. డాక్టర్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మైలవరం మండలంలో ఏసీసీ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను తాము అధికారంలోకి వచ్చి న వెంటనే తిరిగి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలో గొల్లపల్లె గ్రామానికి 110 ఇళ్లు మంజూరు చేశారని భూములు లేని నిరుపేదల కు 400 ఎకరాల భూపంపిణీ చేశారన్నారు.ప్రస్తుతం గ్రామంలో ఏడు ఇళ్లు మంజూరయ్యాయని, నాలుగేళ్లలో ఒక్క సెంటు భూమి కూడా పేదలకు టీడీపీ ప్రభుత్వం పంపిణి చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మైసూరారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు జయరామకృష్ణారెడ్డి, మహేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి హనుమంతరెడ్డి, సిం గిల్‌విండో అధ్యక్షుడు శివగుర్విరెడ్డి, మాజీ సర్పంచ్‌శంకర్, గురుమూర్తి యాదవ్,యువజన నాయకుడు పోచిరెడ్డి, శివ, వెంకటరాముడు, శ్రీధర్‌రెడ్డి, వినయ్, బాబుల్‌రెడ్డి,నాగేంద్ర, చిన్నగైబు బాష,రామమోహన్‌రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిక... గొల్లపల్లె గ్రామానికి చెందిన 45 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. లక్ష్మీనారాయణ సోమశేఖర్, శివకేశవులు సుబ్బనర్సయ్య, చిన్నరామయ్య జోసఫ్, మత్తయ్య, శ్రీనివాసులు,బాబు, చిన్నవెంకటసుబ్బయ్య, శ్రీరాములు సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ వైఎస్ ఆవినాష్‌రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్‌బాబు సమక్షంలో పార్టీతీర్థం పుచ్చుకున్నారు. -
అమాత్యా.. ఇది తగునా!
సాక్షి ప్రతినిధి, కడప : ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా 23ఏళ్లు ఎదురుచూపులు...వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలోని వద్దిరాల పరిసర గ్రామాల్లో సిమెంటు ఫ్యాక్టరీ నెలకొల్పుతామని అసోషియేటెడ్ సిమెంటు కంపెనీ (ఏసీసీ) లిమిటెడ్ 1995 సంవత్సరం నుంచి పలు దఫాలుగా సుమారు 3వేల ఎకరాల పంట పొలాలను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉపాధి లభిస్తోందని, తక్కువ ధరతో భూములిచ్చిన వందలాది మంది రైతుల నోట్లో మన్ను కొట్టిన ఏసీసీ నేటికి ఫ్యాక్టరీ నిర్మాణం మొదలెట్టలేదు. తుపాకీ నీడలో సదస్సు నిర్వహణ... 2015 మైనింగ్ చట్టం (ఎంఎంబిఆర్) ప్రకారం 2016 అక్టోబర్ 29లోగా అనుమతులు తీసుకోకపోతే కంపెనీ టీఓఆర్ రద్దు అవుతుంది. సొంత భూముల్లోని గనులు సైతం వేలంలోనే పాడుకోవాల్సి వస్తుంది. దాంతో బయపడ్డ ఏసీసీ యాజమాన్యం పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ కాలుష్యనియంత్రణ మండలికీ 2016లో దరఖాస్తు చేసుకుంది. ఫ్యాక్టరీ నిర్మాణంపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడంలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి అప్పటి జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ అధ్యక్షతన 2016 సెప్టెంబర్ 9వతేదీన ప్రజాభిప్రాయసేకరణ సదస్సును ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీ నిర్మిస్తామని గత రెండు దశాబ్దాలుగా మోసపుచ్చుతూ వచ్చిన ఏసీసీ యాజమాన్యం ఇప్పుడు నిర్మిస్తుందన్న నమ్మకం తమకు లేదని, ముందు తమ సమస్యలను పరిష్కారించాకే సదస్సు నిర్వహించాలంటూ మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, జమ్మలమడుగు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధిత రైతులు సదస్సును అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కయిన రాష్ట్ర ప్రభుత్వం 500 మందికిపైగా పోలీసులను రంగంలోకి దింపి 2016 అక్టోబర్ 20న తుపాకీ నీడలో ప్రజాభిప్రాయసేకరణ సదస్సును మమ అన్పించింది. పెండింగ్‌లో మైనింగ్ దరఖాస్తులు... సదస్సు నిర్వహణ పూర్తి కావడంతో ఇక తమకు మైనింగ్ అనుమతులు మంజూ రు చేయాలని ఏసీసీ యాజమాన్యం అదే ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే రెండేళ్లుగా ఈ ఫైలు రాష్ట్ర సచివాలయం వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం తమకు అనుమతులు మంజూరు చేసిన వెంటనే ఫ్యాక్టరీ నిరా ్మణం మొదలు పెట్టడానికి తాము సిద్ధం గా ఉన్నామని ఏసీసీ డైరెక్టర్ నారాయణరావు ఇక్కడి రైతులకు తరచూ ఫోన్ ద్వారా వివరిస్తూ వస్తున్నారు.కాగా,అధికారపార్టీ పెద్దలు–కంపెనీ యాజమాన్యం మధ్య పర్సెంటేజీల విషయంలో రహస్య ఒప్పందాలు ఓ కొలిక్కి రాకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు నిలిపివేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ ఏదో ఒక అబద్ధం చెప్పి రైతుల చెవిలో పూలుపెట్టి ఇంకొంతకాలం పొద్దు పుచ్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. గంటకో మాట... జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి మొదటి నుంచి ఏసీసీ బాధిత రైతులను మోసగిస్తూనే వస్తున్నారని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. తనను నమ్మి సదస్సు నిర్వహణకు సహకరించాలంటూ 2016 సెప్టెంబర్ 9న రైతులను కోరిన ఆది ఫ్యాక్టరీ నిర్మించకుండా ఇన్నాళ్లు ఆలస్యం చేసినందుకు కంపెనీ నుంచి ఎకరాకు రూ.3.50 లక్షలు నష్ట పరిహారం ఇప్పిస్తామని సభా సాక్షిగా రైతులకు హామీ ఇచ్చారు. సమస్యలను పరిష్కరించి మూడు నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణం మొదలు పెట్టిస్తానని ముఖ్యమంత్రి స్వయంగా తనకు హామీ ఇచ్చారని అదే ఏడాది అక్టోబర్‌లో ఆది రైతులను భ్రమల్లో దించారు. సదస్సు పూర్తి అయిన తర్వా త ఆదినారాయణరెడ్డి రైతులతో మాట్లాడుతూ 2017 ఉగాది నాటికి పరిహారం డబ్బులు మీ అకౌంట్లుల్లో జమ అవుతాయని, ఆ డబ్బులతోనే ఉగాది పండగ చేసుకోండంటూ ఊదరగొట్టారు. 2018 ఉగాది కూడా ముగిసినప్పటికీ ఇటు నష్టపరిహారం చెల్లించే విషయంలో, అటు ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో మరోసారి రైతు ల చెవిలో పూలు పెట్టడానికి ఆదినారా యణరెడ్డి సిద్ధపడ్డారు. ఆమేరకు ఈసారి 4వాహనాలల్లో 200 మంది రైతులను అమరావతికి తీసుకెళ్లిన ఆయన 2018 మే1 సాయంత్రం ముఖ్యమంత్రితో భేటీ చేయించారు. కాగా, సీఎం చంద్రబాబు నోటనైనా ఖచ్చితమైన హామీ వస్తుందనుకున్న రైతులకు అక్కడ నిరాశే ఎదురైంది. ఫైలు పెండింగ్‌లో ఉందా... చూద్దాం... చేద్దాం...అంటూ ఆయన గారు దాటవేత ధోరణితో మాట్లాడారు. దీంతో రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఈ ప్రశ్నకు జవాబేదీ? రెండు దశాబ్దాలుగా పేరుకుపోయిన తమ సమస్యలకు పరిష్కారం చూపాలని, ఆ తర్వాతే సదస్సు నిర్వహించుకోవాలంటూ బాధిత రైతులు 2016 సెప్టెంబర్ 9న ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును అడ్డుకుంటే.. నెలన్నర రోజు ల వ్యవధిలోనే వందలాది మంది పోలీ సు బలగాలను పిలిచి తుపాకీ నీడలో సదస్సు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ అనుమతులు ఇవ్వటంలో ఎం దుకు ఇంత జాప్యం చేస్తుందన్న ప్రశ్నకు ఇటు అమాత్యుని వద్ద, అటు కంపెనీ యాజమాన్యం వద్ద జవాబు దొరకడం లేదు. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు తమకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా కనీసం ఫ్యాక్టరీ నిర్మిస్తే భూములు కోల్పోయినా వందలాది మందికి ఉద్యోగాలు, వేల మందికి ఉపాధి లభిస్తుందని రైతులు ఆశపడితే అందులో కూడా స్వార్థ ప్రయోజనాలను ఆశించి తమ నోట్లో మన్ను వేశారని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాలు భూములు కొని బీడుగా పెట్టి రైతుల జీవితాలతో 23 ఏళ్లుగా చెలగాటం ఆడుతోన్న ఏసీసీ యాజమాన్యం మెడలు వంచి ఫ్యాక్టరీ నిర్మింపజేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... అనుమతులు కోసం కంపెనీ పెట్టుకున్న దరఖాస్తులు సైతం పెండింగ్‌లో ఉంచడం ఎంతవరకు సమంజసమని బాధిత రైతుల ప్రశ్నిస్తున్నారు. అమాత్యుని కమ్మని మాటలు విని విసిగి వేశారిన బాధిత రైతాంగం ఉద్యమబాట పట్టడానికి సిద్ధమవుతోంది. అప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును సరిదిద్దుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే! -
ఏసీసీ-అంబుజా మెర్జర్‌కు బ్రేక్: షేర్ల పతనం
సాక్షి, ముంబై: సిమెంట్ రంగ దిగ్గజ కంపెనీలు ఏసీసీ, అంబుజా మధ్య విలీనాకి చెక్ పడిందన్న వార్తలతో మంగళవారం నాటి మార్కెట్లో ఈ రెండు షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా అంబుజా 4శాతం, ఏసీసీ2 శాతం నష్టపోయాయి. విలీనం చర్చలను నిలిపివేయాలని నిర్ణయించినట్టు ఇరు కంపెనీలూ స్టాక్ ఎక్స్చేంజెస్‌కు అందించిన సమాచారంలో వెల్లడించాయి. సంస్థ ప్రత్యేక కమిటీ, బోర్డు డైరెక్టర్లు రెండింటి ద్వారా జరిపిన సమగ్ర పరిశీలన ఆధారంగా ప్రస్తుతం ఈ విలీనం అమలులో కొన్ని పరిమితులు ఉన్నాయని అభిప్రాయపడినట్టు ఏసీసీ తెలిపింది. కానీ భారతదేశం రెండవ అతిపెద్ద సిమెంటు తయారీ సంస్థను సృష్టించాలనేదే తమ "అంతిమ లక్ష్యం" మని ఏసీసీ, అంబూజా పేర్కొన్నాయి. మైనింగ్ ఆస్తుల బదిలీకి సమస్యలు ఎదురుకావడంతో ప్రస్తుతానికి ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్ విలీనానికి తెరపడినట్లు తెలుస్తోంది. 18-20 రాష్ట్రాలలో మైనింగ్ ఆస్తుల హక్కుల బదిలీకి సంబంధించి సమస్యలు ఎదురుకావచ్చని విలీన కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే రెండు కంపెనీలూ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి పరస్పరం సహకరించుకోనున్నట్లు పరిశ్రమవర్గాల సమాచారం. కాగా సిమెంట్ రంగంలో ఇటీవల కీలక విలీనాలకు అడుగులు పడుతున్నాయి. గతేడాది మే నెలలో ఏసీపీ, అంబుజా విలీనానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో బినాని సిమెంట్‌ను విలీనం చేసుకునేందుకు అల్ట్రా టెక్ సిమెంట్ ప్రయత్నిస్తోంది. -
ఏసీసీ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: సిమెంటు తయారీ దిగ్గజం ఏసీసీ నికర లాభం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో రెట్టింపయి రూ.206 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.91 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ.3,102 కోట్ల నుంచి రూ.3,540 కోట్లకు పెరిగింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.15 తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. ప్రీమియం ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి పెట్టడం, ఆదాయాలు మెరుగుపడటం తదితర అంశాలు లాభాల వృద్ధికి తోడ్పడ్డాయని సంస్థ సీఈవో నీరజ్ అఖోరి తెలిపారు. బడ్జెట్లో ఇన్ఫ్రా అభివృద్ధి, స్మార్ట్ సిటీలు, అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణానికి పెద్ద పీట వేసిన నేపథ్యంలో సిమెంటు రంగానికి ఈ ఏడాది మరింత మెరుగ్గానే ఉండగలదని నీరజ్ తెలిపారు. బీఎస్ఈలో ఏసీసీ షేరు ధర 7% పెరిగి రూ. 1,692 వద్ద క్లోజయ్యింది. -
ఏసీసీ లాభం రూ.326 కోట్లు
న్యూఢిల్లీ: మెరుగైన అమ్మకాలతో సిమెంట్ దిగ్గజం ఏసీసీ జూన్ త్రైమాసికంలో రూ.326 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.246 కోట్లతో పోల్చుకుంటే తాజాగా 32 శాతం మేర వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్ విక్రయాలు 18 శాతం అధికమై రూ.3,818 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు రూ.3,238 కోట్లు. సిమెంట్ విక్రయాలు 10 శాతం అధికంగా 6.74 మిలియన్ టన్నులు అమ్ముడుపోయినట్టు కంపెనీ తెలిపింది. కొత్త బ్రాండ్లు విడుదల చేయడంతోపాటు ప్లాంట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి చర్యలు చక్కని పనితీరుకు నిదర్శనంగా ఏసీసీ ఎండీ నీరజ్ అఖోరీ తెలిపారు. కాగా, ప్రతీ రూ.10 ముఖ విలువ కలిగిన షేరుకు మధ్యంతర డివిడెండ్ కింద రూ.11 ఇవ్వాలని బోర్డు సిఫారసు చేసింది. జనవరి–డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరంగా ఏసీసీ పాటిస్తోంది. -
మార్కెట్లు జూమ్.. ఏసీసీ అదరహో
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రయ్ మని దూసుకెళ్లాయి. యూరోపియన్ మార్కెట్లు స్ట్రాంగ్ గా ట్రేడవడంతో, మన దేశీయ మార్కెట్లు ర్యాలీ జరిపాయి. 300 పాయింట్లకు పైన ర్యాలీ జరిపిన సెన్సెక్స్ ఆఖరికి 290.54 పాయింట్ల లాభంలో 29,655.84 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఏప్రిల్ 12 తర్వాత మొదటిసారి తన కీలక మార్కు 9200 పైన నమోదైంది. 98.55 పాయింట్ల లాభంలో 9217.95 వద్ద క్లోజైంది. ఫ్రాన్స్ ఎన్నికల తొలి రౌండ్ ఫలితాల్లో ఇమ్మాన్యూల్ మాక్రోన్ గెలిచినట్టు వెల్లడికాగానే, యూరోపియన్ మార్కెట్లు బలపడ్డాయి. యూరోజోన్‌లో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఫ్రాన్స్‌లో రెండు రౌండ్లుగా జరిగే ఈ ఎన్నికల తుది ఫలితాలు మే 11న వస్తాయి. నేడు తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ సంకేతాలు మార్కెట్లకు మంచి ఊపునిచ్చాయి. హెచ్ డీఎఫ్సీ బ్యాంకు, హెచ్ డీఎఫ్సీ , రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ కంపెనీల షేర్లు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. నిఫ్టీ స్టాక్స్ లో ఎక్కువగా లాభాలార్జించిన కంపెనీగా ఏసీసీ నిలిచింది. ఈ కంపెనీ స్టాక్ 7.5 శాతం మేర దూసుకెళ్లింది. ఆల్ట్రా టెక్ సిమెంట్, గ్రాసిమ్, గెయిల్, అంబుజా సిమెంట్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్సీ బ్యాంకు, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీలు కూడా లాభాలు పండించాయి. మరోవైపు ఫార్మా దిగ్గజం లుపిన్ స్టాక్ 3.33 శాతం మేర పడిపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలు పాలైన ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు, చివర్లో కొంతమేర కోలుకున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 64.46 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 379 రూపాయలు పడిపోయి 29,039గా నమోదయ్యాయి. -
ఏసీసీ, అంబుజా సిమెంట్స్ విలీనం !
ఈ ఏడాది ఉండొచ్చని వార్తలు ముంబై: అంబుజా సిమెంట్స్, ఏసీసీ... ఈ రెండు కంపెనీలు విలీనం కానున్నాయని సమాచారం. ఈ రెండు కంపెనీల మాతృ కంపెనీ లఫార్జే హోల్సిమ్ ఈ దిశగా యోచిస్తోందని ఒక ప్రముఖ బిజినెస్ వార్తా చానెల్ పేర్కొంది. స్విట్జర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లఫార్జే హోల్సిమ్కు అంబుజా సిమెంట్స్‌లో 63%, ఏసీసీలో 50.05 శాతం చొప్పున వాటాలున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ ఏడాదే ఈ విలీనం ఉండొచ్చని అంచనా. ఏసీసీకే ప్రయోజనం.. ఈ రెండు కంపెనీల విలీన యోచన 2013 నుంచే వార్తల్లో నలుగుతోంది. ఏసీసీ ఇబిటా టన్నుకు రూ.300 ఉండగా, అంబుజా సిమెంట్స్ ఇబిటా టన్నుకు రూ.800గా ఉంది. ఒక వేళ విలీనం జరిగితే ఏసీసీ కంపెనీకి బాగా ప్రయోజనం కలుగుతుంది. ఈ విలీనం వల్ల ఉత్పత్తి వ్యయాలు కలిసివస్తాయని రెలిగేర్ క్యాపిటల్ మార్కెట్స్‌కు చెందిన నవీన్ సహదేవ్ చెప్పారు. వ్యయాలు, బ్రాండింగ్, రవాణా, పంపిణి, పన్ను ఆదాల పరంగా చూస్తే, ఈ విలీనం సమంజసమేనని మరో నిపుణులు రాకేశ్ అరోరా పేర్కొన్నారు. హోల్సిమ్ లఫార్జేకు ఒక్క భారత్‌లోనే రెండు, మూడు కంపెనీలు ఉండడం అర్థం లేనిదని వ్యాఖ్యానించారు. అయితే విలీనం బలపడటానికి కాకుండా, బలహీనతకే దారితీస్తుందని ఐకాన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్‌కు చెందిన అనిల్ సింఘ్వి చెప్పారు. స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే ఇది ఏమీ ఉత్సుకత కలిగించే విషయం కాదని పేర్కొన్నారు. ఈ విలీనం ఇప్పటికే మూడేళ్లు ఆలస్యమైందని, ఈ కాలంలో ఈ కంపెనీలు తమ మార్కెట్ వాటాను కోల్పోయాయని వివరించారు. వృద్ధి, ఇబిటా మార్జిన్లు తదితర అంశాల్లో ఈ రెండు కంపెనీలు వెనకబడే ఉన్నాయని వివరించారు. కాగా ఈ విలీన వార్తలతో రెండు కంపెనీల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. బీఎస్ఈలో ఏసీసీ షేర్ 4 శాతం లాభంతో రూ.1,480 వద్ద, అంబుజా సిమెంట్స్ షేర్ 5 శాతం లాభంతో రూ.240 వద్ద ముగిశాయి. అయితే విలీన వార్తల్ని సంబంధిత కంపెనీలు ధృవీకరించలేదు. ఈ ఊహాజనిత వార్తలపై వ్యాఖ్యానించబోమని లఫార్జేహోల్సిమ్ స్పష్టం చేసింది. మరోవైపు మాతృ కంపెనీ నుంచి విలీనం విషయమై తమకెలాంటి సమాచారం లేదని అంబుజా సిమెంట్స్ పేర్కొంది. విలీన ప్రతిపాదన ఏదీ లేదని ఏసీసీ తెలిపింది. -
సిమెంట్ కంపెనీలకు సీసీఐ
రూ. 6,715 కోట్ల జరిమానా న్యూఢిల్లీ: కూటమి కట్టి, ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా సిమెంట్ ధరలను తమ ఇష్టాను సారం నడిపించినందుకు 11 సిమెంట్ కంపెనీలకు, సిమెంటు తయారీదారుల సంఘాని(సీఎంఏ)కి రూ.6,715 కోట్ల మేర భారీ జరిమానా విధిస్తూ అనైతిక వ్యాపార విధానాల నిరోధక సంస్థ (సీసీఐ) ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు సైతం ఉన్నాయి. అన్ని సిమెంట్ కంపెనీలు కుమ్మక్కు కాకుండా, ధరలు, ఉత్పత్తి, సరఫరాను నియంత్రించే చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. కాంపిటీషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సూచనల మేరకు సీసీఐ బుధవారం ఈ ఆదేశాలు వెలువరించింది. కంపెనీలు, సీఎంఏ అనుసరించిన వ్యవహార శైలి వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతకరమని సీసీఐ పేర్కొంది. నిర్మాణ, మౌలిక వసతుల రంగాలకు కీలకమైన సిమెంట్ విషయంలో ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థకు కూడా చేటు అని వ్యాఖ్యానించింది. ‘సిమెంటు కంపెనీలు సీఎంఏ ప్లాట్ ఫామ్ ద్వారా ధరల వివరాలు, ఎంత మేర ఉత్పత్తి చేస్తుంది, సరఫరాల గురించి వివరాలను ఇచ్చిపుచ్చుకున్నారు. దాంతో ఉత్పత్తి, మార్కెట్లో సరఫరాలను నియంత్రించారు. సిమెంటు ధరలను నియంత్రించడం వ్యాపార పోటీ నిబంధనలకు విరుద్ధం’ అని సీసీఐ స్పష్టం చేసింది. ఏ కంపెనీపై ఎంత..?: ఏసీసీపై రూ.1,147.59 కోట్లు, జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (రూ.1,323.60 కోట్లు), అల్ట్రాటెక్ సిమెంట్ (రూ.1,175.49కోట్లు), సెంచురీ (రూ.274.02కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ.187.48కోట్లు), జేకే సిమెంట్స్ (రూ.128.54 కోట్లు), లఫార్జ్ (రూ.490 కోట్లు), రామ్‌కో రూ.258.63 కోట్లు), ఏసీఎల్ (రూ.1,163.91 కోట్లు), బినాని (రూ.167.32 కోట్లు), సీఎంఏపై రూ.0.73 కోట్ల జరిమానా భారం పడింది. అనుచిత వ్యాపార విధానాలను అనుసరించినందుకు రూ.397.51 కోట్ల జరిమానా చెల్లించాలని శ్రీ సిమెంట్‌ను సీసీఐ ఆదేశించింది. -
ఎక్స్‌లెంట్‌గా ఏసీసీ లాభాలు
న్యూఢిల్లీ : దేశంలో సిమెంట్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఏసీసీ రెండో త్రైమాసిక లాభాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. 79 శాతం వృద్ధితో కన్సాలిడెటెడ్ నికర లాభాలు రూ.239.12 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు రూ.133.46 కోట్లగా ఉన్నాయి. ఈ సంస్థ జనవరి- డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా ఫాలో అవుతూ ఉంటోంది. దీంతో అన్నీ కంపెనీ 2016 ఆర్థిక సంవత్సర తొలి ఫలితాలను విడుదల చేస్తుండగా.. వాటికి ఒక త్రైమాసికం ముందుగా జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలను ఏసీసీ మంగళవారం రిలీజ్ చేసింది. అయితే మొత్తంగా కన్సాలిడెటెడ్ ఆదాయం 3 శాతం కోల్పోయి, రూ.2,917.26 కోట్లగా నమోదుచేసింది.2015 ఇదే క్వార్టర్లో ఈ ఆదాయాలు రూ.3,015.29 కోట్లగా ఉన్నాయి. కంపెనీ మొత్తం ఖర్చులను సైతం 9శాతం తగ్గించుకుంది. పెట్‌కోక్ ఎక్కువగా వాడడంతో, ఫ్యూయల్ మిక్స్‌లో ఆప్టిమైజేషన్‌ను సాధించగలిగామని కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా స్లాగ్, బూడిద, జిప్సం, జిప్సం మిశ్రమాల ఆప్టిమైజేషన్, ఉత్పత్తి ధరలను తగ్గించిందని పేర్కొంది. సంస్థ మొత్తం వ్యయాలు ఏప్రిల్-జూన్ క్వార్టర్లో రూ.2,603.18 కోట్లకు పడిపోయాయని, గతేడాది ఇదే పీరియడ్‌లో ఇవి రూ.2,848.46 కోట్లగా ఉన్నాయని ఏసీసీ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ఒక్కో షేరుకు 11రూపాయల మధ్యంతర డివిడెంట్ను ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ధరల తగ్గింపుపై ఫోకస్‌ను కంపెనీ ఇలాగే కొనసాగిస్తుందని, చత్తీస్ గఢ్లోని జముల్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు, కంపెనీ స్థాయిని, లాభాలను మరింత పెంచుతుందని ఏసీసీ ఆశాభావం వ్యక్తంచేసింది.మంచి రుతుపవనాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ఇన్ ఫాక్ట్ర్చర్ డెవలప్మెంట్, హౌసింగ్, ఇతర మెగా ప్రాజెక్టుల ప్రేరణ వచ్చే త్రైమాసికంలో నిర్మాణ కార్యక్రమాలపై పాజిటివ్ ప్రభావం చూపుతాయని కంపెనీ ఫలితాల సందర్భంగా పేర్కొంది. -
కౌమారాం వద్దు!
న్యూఢిల్లీ: యువత దేశానికి వెన్నుముక అన్నారు పెద్దలు. దేశ భవిష్యత్‌ను తీర్చి దిద్దేది యువతరం. అలాంటి యువకులు పాశ్చాత్య పోకడలను అనుకరిస్తూ పెడ మార్గం పడుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీనేజ్లోనే మద్యం సేవించడం, ధూమపానం అలవాటు చేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. అందుకే.. అలాంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్న ఆరోగ్య, మానసిక నిపుణులు. మద్యపానం.. ధూమపానం వద్దు.. కౌమార దశ రాగానే పెద్దవారం అయిపోయామనే ఫీలింగ్‌తో యువత మద్యం, సిగరేట్కు అలవాటు పడడం సాధారణం. చెడు చెలిమితో.. నూనుగు మీసాల వయసులోనే ఇలాంటి వ్యసనాల బారినపడుతున్నారు. అలా చేయడం వల్ల భవిష్యత్ నాశనం అవడమే కాకుండా.. కన్నవారిని మోసం చేసినట్లే అవుతుంది. గత ఆదివారం ఏసీసీలో జరిగిన క్వారీ జాతరలో యువకులు తాగి నానా హంగామా చేయడం తాజా ఉదాహరణగా పేర్కొనవచ్చు. మద్యం మత్తులో గొడవలు, యువతులకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడంలాంటివి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. పాన్‌షాప్‌లు, హోటళ్ల వద్ద యువకులు రింగ్రింగ్లుగా సిగరేట్ పొగ వదులుతూ.. ఇదే స్వర్గలోకమంటూ తన్మయత్వం చెందుతున్నారు. ఇలాంటి వాటికి దూరం ఉండడం చాలా మంచిది. దూకుడు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి.. యువత చేత బైక్పట్టి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఆ బైక్ ఎంత స్పీడ్‌లో పోతుందో వారికే తెలియదు. అలాంటి సమయంలో జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే నష్టం తప్పదు. కన్నవారికి కడుపుకోతా తప్పదు. ముఖ్యంగా కౌమార దశలోనే ద్విచక్ర వాహనాల జోలికి పోకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా కొద్దోగొప్పో స్పీడ్‌లో డ్రైవ్ చేయడం మంచిది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు, నలుగురు కూర్చోని రయ్‌మంటూ దూసుకెళ్లకుండా ఉంటే మంచిది. అమ్మాయిలకు గౌరవం ఇవ్వాలి.. కౌమార దశ యువకులు సినిమాల పోకడలను అనుకరిస్తూ యువతులను వేధించడం ఫ్యాషన్‌గా భావిస్తుంటారు. కళాశాలలో చదివే సహచర విద్యార్థినులను వేధించడం, వారికి ప్రేమ లేఖలు రాయడం చేస్తుంటారు. అలాంటి వాటికి మొత్తంగా దూరంగా ఉండడం భవిష్యత్తుకు మేలు. మహిళలను వేధిస్తే కఠిన చట్టాలున్నాయి. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తే భవిష్యత్ అంధకారమవుతుంది. అందుకే.. యువత ఉన్నత భావాలను అలవర్చుకుని.. ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజం గౌరవించే స్థాయికి ఎదగాలి. తల్లీదండ్రుల బాధ్యత కీలకం విద్యార్థుల భవిష్యత్ తల్లిదండ్రుల చేతుల్లోనూ ఉంది. పిల్లల మీద ప్రేమ కంటే వారి దిన చర్యలను, చెడు నడవడికను బాగా పరిశీలించాలి. విద్యార్థులు జల్సాలకు అలవాటు పడి వాహనాల దొంగలుగా, చైన్‌స్నాచర్‌గా మారుతూ పట్టుబడి జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అందుకే.. పిల్లలు ఏం చేస్తున్నారో నిశితంగా పరిశీలించాలి. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ రెండూ అందుబాటులో లేకుండా చూడాలి. సెల్ఫోన్ల వల్లనే విద్యార్థుల జీవితాలు గాడి తప్పుతున్నాయి. చెడు స్నేహాలూ చేయకుండా చూడాలి. బంగారు భవిష్యత్ ఎలా సాధ్యమవుతుందో ఎప్పటికప్పుడు వారికి వివరించాలి. మానవతా విలువలు తెలియజేయాలి యుక్త వయస్సు వారి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వారిని మంచి మార్గంలో పయనింపజేయడానికి అధ్యాపకు లు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. మానవతా విలువలు తెలియజేయాలి. జాతీయ నాయకులు, దేశ భక్తుల చరిత్రను తెలియజేయాలి. మంచి పుస్తకాలు చదివేలా వారిని ప్రోత్సహించాలి. పాశ్చాత్య సంస్కృతికి బానిసలు కాకుండా చూడాలి. అమానవీయ సినిమాలు, సీరియల్స్‌ను చూడనీయొద్దు. తరగతి గదులే వారికి మార్గ నిర్దేశం కావాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి... ఆత్మ విశ్వాసం.. ఇది లేకపోతే మానవుడు జీవితంలో ముందుకు సాగలేడు. ఎదుగూబొదుగు ఉండదు. కష్టాల కడలిని ఎదురీదడానికి ఆత్మ విశ్వాసం ఎంతో అవసరం. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఉండాలి. నిర్వేదం, నిరుత్సాహం, నిరాశను సమాధి చేయాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలం. ఆత్మవిశ్వాసం లేకపోతే చంద్ర మండలానికి చేరుకునే వారమా..? తమిళనాడుకు చెందిన సుధారామచంద్రన్ ప్రమాదంలో కాలు కోల్పోయినా కఋత్రమ (పెట్టుడు కాలు)తో నాట్యం చేసి ప్రపంచాన్ని నివ్వెర పరచలేదా..? అంతెందుకు తాజాగా రాష్ట్రానికి చెందిన ఆనంద్, పూర్ణ అనే విద్యార్థులు హిమాలయ పర్వతాలను అతిచిన్న వయస్సులోనే అధిరోహించి చరిత్ర సృష్టించ లేదా..? శాస్త్ర, సాంకేతిర రంగాల్లో అనేక మంది చరిత్రలో నిలిచిపోయారంటే అందుకు ఆత్మవిశ్వాసమే ప్రధాన కారణమనే విషయాన్ని ఎలా విస్మరించ గలం. ఆత్మ విశ్వాసం వెంట ఉంటే చదువులో, వ్యాపారంలో ఏ రంగంలోనైనా రాణించగలమని నిరూపించొచ్చు. అందుకే.. యుక్త వయస్సుల్లోకి అడుగు పెట్టే యువతీ, యువకులు ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. ఆత్మన్యూనతా భావాన్ని దరికి చేరనివ్వ వద్దు. మానసికంగా ఎప్పుడూ కుంగిపోవద్దు. కుటుంబ పెద్దలపై ఆధారపడి సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామనే నిర్వేదం చెందొద్దు. దృఢ సంకల్పం కలిగి ఉండాలి. అప్పుడే విద్యలోనూ, జీవితంలోనూ అగ్రస్థానాలకు చేరుకుంటారు. సాహసం చేయరా డింభకా.. సాహసం చేయరా డింభకా... ఈ డైలాగ్ తెలుగునాట ఇప్పటికీ పాపులరే. సాహసం చేస్తే ఏదైనా సాధించవచ్చు. చదువులో, వ్యాపారం, ఆటల్లో, పాటల్లో, మార్షల్ ఆర్ట్స్‌లో ఇలా అన్నింట్లో ప్రావీణ్యత సాధిం చాలి. ధైర్యంతో పోటీలో పాల్గొని విజయలక్ష్మిని అక్కున చేర్చుకోవాలి. ‘నాకు ఏదీ రాదు, ఏమి చేయలేననే’ సంకుచిత భావాన్ని త్యజించాలి. ధై ర్యంగా ముందుకు సాగితే ఎలాంటి కష్టాలనైనా ఇ ష్టంగా అధిగమించవచ్చు. ముఖ్యంగా విద్యా రంగంలో కఠినం అనుకునే పాఠ్యాంశాలను సులువుగా నేర్చుకుని ధైర్యంగా పరీక్షలు రాయాలి. నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి.. యుక్త వయస్సు విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు ఎంతో అవసరం. చదువు, క్రమ శిక్షణ, సభ్యతా, సంస్కారంతోపాటు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. కళాశాల స్థాయి నుంచి నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకుంటే సమాజానికి మేలు చేసే స్థాయికి ఎదుగుతారు. కళాశాల స్థాయిలోనే నాయకత్వ లక్ష ణాలకు శ్రీకారం చుట్టి ఎందరో రాజకీయాలు, చట్టసభల్లో అడుగుపెట్టి రాణిస్తున్నారు. ఒకప్పుడు అస్సాం రాష్ట్రంలో కళాశాల విద్యార్థులు అస్సాం గణ పరిషత్ స్థాపించి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. తాజా ఉదాహరణకు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యారంగ సమస్యలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై గళమెత్తిన బాల్క సుమన్ ఏకంగా పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మంచి నాయకుడు కావాలంటే యుక్త వయస్సులోనే నాయకత్వం బీజం పడాలి. ఉపకారం.. అందరికీ సహకారం.. ‘పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని..’ అంటారు ఓ సినీ కవి. పరోపకార గుణం లేని మనిషి జీవితం దండగ ంటారు పెద్దలు. పాశ్చాత్య సంస్కృతి ప్రజ్వరిల్లుతున్న నేటి రోజుల్లో ఉపకారం, సహకారం అనేవి సామెతగానే మిగిలాయి. అందుకే.. మానవ సంబంధాలు మరుగునపడిపోకుండా కష్టాల్లో ఉన్న వారికి ఉపకారం, ఆపదలో ఉన్న వారికి సహకారం అందించే గుణాన్ని టీనేజర్లు అలవర్చాలి. బలం- బలహీనతలు.. మనిషికి బలం, బలహీనతలు రెండూ ఉంటాయి. బలం మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తే బలహీనత తిరోగమనం వైపునకు పంపిస్తుంది. బలమంటే శారీరక బలం కాదు. ఆలోచనా అనే శక్తి బలం. ఆ ఆలోచనలు బలంగా ఉంటే భవిష్యత్ ఎంతో ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. ‘దేనికైనా నేను వెంటనే నిర్ణయాలు తీసుకోలేను. అదే నా బలహీనత’ అని అంటుంటారు కొందరు. అలాంటి బలహీనతకు బానిసలు కావద్దు. బలాన్నే నమ్ముకోవాలి. -
సిమెంట్ మార్కెట్ స్థిరపడుతోంది: హోల్సిమ్
న్యూఢిల్లీ: దేశీయ సిమెంట్ మార్కెట్ ఈ ఏడాది ప్రారంభం నుంచి స్థిరపడడం మొదలైందని స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ సంస్థ హోల్సిమ్ తెలిపింది. జనవరి - మార్చి త్రైమాసికంలో సిమెంటు విక్రయాలు నిలకడగా ఉన్నాయని పేర్కొంది. అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌ల్లో మెజారిటీ వాటా కలిగిన హోల్సిమ్, తొలి త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఈ విషయం తెలిపింది. ఏసీసీ, అంబుజా సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5.80 కోట్ల టన్నులు. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ తర్వాత దేశంలో అత్యధికంగా సిమెంటు ఉత్పత్తి చేసే సంస్థ హోల్సిమ్. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో హోల్సిమ్ సిమెంట్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. సంస్థ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 20.6 కోట్ల టన్నులు. జనవరి - మార్చిలో ఏసీసీ 64.80 లక్షల టన్నుల సిమెంటును విక్రయించగా, అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 64.20 లక్షట టన్నులను అమ్మింది. ఇదేకాలంలో అంబుజా అమ్మకాలు 59.60 లక్షల టన్నుల నుంచి 60.60 లక్షల టన్నులకు పెరిగాయి. -
ఏసీసీ నికర లాభం 9% డౌన్
న్యూఢిల్లీ: సిమెంట్ దిగ్గజం ఏసీసీ జనవరి-మార్చి(క్యూ1) కాలానికి రూ. 400 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 438 కోట్లతో పోలిస్తే ఇది 9% క్షీణత. బొగ్గు, ఫ్లైయాష్, జిప్సమ్ వంటి ముడిసరుకుల వ్యయాలు పెరగడం, సిమెంట్ ధరలు తగ్గడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. జనవరి-డిసెంబర్ కాలాన్ని కంపెనీ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఈ కాలంలో సిమెంట్ విక్రయాలు 6.48 మిలియన్ టన్నులకు చేరగా, టర్నోవర్ రూ. 2,967 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలంలో రూ. 2,906 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ మూడు నెలల కాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాధారణ నిర్మాణ కార్యకలాపాలు వంటివి పెద్దగా ఊపందుకోలేదని కంపెనీ వ్యాఖ్యానించింది. వెరసి సిమెంట్ విక్రయాల్లో పురోగతి సాధ్యపడలేదని తెలిపింది. సమీపకాలంలో సైతం సిమెంట్‌కు డిమాండ్ పుంజుకునే సంకేతాలు కనిపించడంలేదని అభిప్రాయపడింది.