నేటి నుంచి ఏసీసీ అండర్–19 ఆసియా కప్
అమాన్ సారథ్యంలో టీమిండియా సిద్ధం
ఉదయం గం. 10:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
దుబాయ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్–19 ఆసియా కప్ 11వ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో 8 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీ పడుతున్నాయి.
పాకిస్తాన్, యూఏఈ, జపాన్‌తో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగుతుండగా... శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఉంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్తాన్... శ్రీలంకతో నేపాల్ తలపడతాయి.
దుబాయ్, షార్జాలలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఏసీసీ ఆసియా కప్‌ను 10 సార్లు నిర్వహించగా... అందులో ఎనిమిదిసార్లు భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. డిసెంబర్ 8న జరగనున్న తుది పోరుతో టోర్నమెంట్ ముగుస్తుంది.
అంతర్జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు సాధించేందుకు ఆటగాళ్లకు ఈ టోర్నీ ఎంతో ఉపయోగపడనుంది. గతంలో అండర్–19 స్థాయిలో మెరుపులు మెరిపించి... ఆ తర్వాత గ్లోబల్ స్టార్స్‌గా ఎదిగిన ప్లేయర్లు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం యువ భారత జట్టుకు మొహమ్మద్ అమాన్ సారథ్యం వహిస్తుండగా... కిరణ్ చోర్మలే వైస్ కెపె్టన్‌గా వ్యవహరించనున్నాడు.
టోర్నీలో భాగంగా భారత జట్టు శనివారం తమ తొలి పోరులో పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. అనంతరం డిసెంబర్ 2న జపాన్‌తో, 4న ఆతిథ్య యూఏఈతో మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.
భారత అండర్–19 జట్టు: మొహమ్మద్ అమాన్ (కెపె్టన్), కిరణ్ చోర్మలే (వైస్ కెపె్టన్), ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్ధార్‌్థ, కేపీ కార్తికేయ, ప్రణవ్ పంత్, హార్దిక్ రాజ్, నిఖిల్ కుమార్, హర్‌వంశ్ సింగ్, అనురాగ్, ఇనాన్, సమర్థ్ నాగరాజ్, యుధాజిత్ గుహ, చేతన్ శర్మ.
Comments
Please login to add a commentAdd a comment