దుబాయ్: ఆసియా కప్ అండర్–19 వన్డే క్రికెట్ టోర్నీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. యూఏఈలో జరుగుతున్న ఈ టోర్నీలో నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో యువ భారత జట్టు తలపడుతుంది. ఉదయం గం. 10:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ లీగ్ పోరులో శుభారంభం చేయాలని మొహమ్మద్ అమాన్ సారథ్యంలోని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు 10 సార్లు జరిగిన ఈ టోర్నీలో ఎనిమిదిసార్లు విజేతగా నిలిచిన యువ భారత్... ఈసారి కూడా టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఉంది.
ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో రూ.1.10 కోట్లకు అమ్ముడుపోయిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో అఫ్గానిస్తాన్‌పై బంగ్లాదేశ్; నేపాల్ జట్టుపై శ్రీలంక విజయం సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment