పురుషుల ఆసియాకప్-2025కు భారత్ ఆతిథ్యమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఆసియాకప్ జరగనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తాజాగా 2024 నుంచి 2027 కాలానికి గాను స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం ఐఈవోఐ(IEOI)లను ఆహ్వానించింది. దీని ప్రకారం ప్రకారం వచ్చే ఏడాది ఆసియాకప్ భారత్‌లో జరగనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
కాగా గతేడాది వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్‌కు పాకిస్తాన్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ వంతు. అదే విధంగా ఆసియాకప్-2026(వన్ఢే ఫార్మాట్)కు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. ఇక ఈ రిపోర్ట్ ప్రకారం భారత్ వేదికగా జరిగే ఆసియాకప్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి.
భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నేరుగా ఆర్హత సాధించగా.. మరో జట్టు క్వాలిఫియర్స్ ఆరో జట్టుగా టోర్నీలో అడుగుపెడుతుంది. అదే విధంగా మొత్తం 13 మ్యాచ్‌లో ఈ ఈవెంట్‌లో జరగనున్నాయి. ఆసియాకప్-2023(వన్డే ఫార్మాట్) విజేతగా భారత్ నిలవగా.. అంతకుముందు ఆసియాకప్-2022(టీ20 ఫార్మాట్) ఛాంపియన్స్‌గా శ్రీలంక నిలిచింది.
పాక్ వస్తుందా?
వన్డే ప్రపంచకప్-2023లో తలపడేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ మరోసారి తమ దాయాది గడ్డపై అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. అయితే వాస్తవానికి గతేడాది ఆసియాకప్‌కు పాకిస్తాన్ ఒంటరిగానే ఆతిథ్యమివ్వాల్సింది. కానీ భారత జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరిచిండంతో హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీ జరిగింది.
భారత్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు కూడా పాక్‌ను ఆతిథ్యమివ్వనుంది. కానీ మరోసారి తమ జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ సిద్దంగా లేదు. ఆసియాకప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఇంక ఈ విషయంపై ఎటువంటి స్పష్టత లేదు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు టీమిండియా తమ దేశానికి రాకపోతే.. పాక్ ఆసియాకప్‌లో తలపడేందుకు భారత్‌కు వస్తుందో లేదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment