ఎట్టకేలకు ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో జరగనున్న ఈ టోర్నీని ‘హైబ్రిడ్ మోడల్’లో నిర్వహించేందుకు జై షా అధ్యక్షుడిగా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆగస్టు 31 నుంచి సెపె్టంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు.
పాకిస్తాన్‌లో 4 మ్యాచ్‌లు... శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి.
గ్రూప్ దశ తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్ ఫోర్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ ఫోర్’ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. పాకిస్తాన్‌లోని నాలుగు మ్యాచ్‌లకు లాహోర్ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్‌లు ఉంటాయి.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్‌కప్ జరగడంతో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్‌లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment