hybrid models
-
‘హైబ్రిడ్’ మోడల్‌కు అంగీకరించాల్సిందే!
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ‘హైబ్రిడ్ మోడల్’కు అంగీకరించబోమని మంకు పట్టు ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హెచ్చరిక జారీ చేసింది. వెంటనే ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని... లేదంటే టోర్నీని పూర్తిగా పాకిస్తాన్ నుంచి తరలిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు పాకిస్తాన్ జట్టు కూడా ఆడకుండా టోర్నీని జరుపుతామని కూడా తేల్చేసింది. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి శుక్రవారం వర్చువల్‌గా జరిగిన సమావేశం 15 నిమిషాల్లోపే ముగిసింది! ఇందులో ఎలాంటి ఫలితం రాకపోయినా, తాము చెప్పినట్లు చేస్తేనే శనివారం సమావేశం కొనసాగుతుందని కూడా ఐసీసీ పాక్‌కు చెప్పేసింది. దుబాయ్‌లోనే ఉన్న పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నక్వీ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనగా, మిగతా దేశాల బోర్డు సభ్యులంతా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే గైర్హాజరు కావడంతో డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. భారత్ మ్యాచ్‌లను మరో దేశంలో నిర్వహిస్తూ ఇతర మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరిపేలా ప్రతిపాదిస్తున్న ‘హైబ్రిడ్’ మోడల్‌ను పీసీబీ ఇక్కడా తిరస్కరించింది. దీనికి ఎట్టి పరిస్థితిల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. పాక్ పరిస్థితిపై వివిధ దేశాలకు సానుభూతి ఉన్నా... ప్రస్తుత స్థితిలో ‘హైబ్రిడ్’ మోడల్‌కు మించి మరో ప్రత్యామ్నాయం లేదని అందరూ అంగీకరించారు. దీనిని అమలు చేస్తే భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ యూఏఈలో జరుగుతాయి. ‘భారత జట్టు టోర్నీ లో లేకపోతే ఏ ప్రసారకర్త అయినా ఐసీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. ఈ విషయం పాక్‌కూ తెలుసు. కాబట్టి వెంటనే అంగీకరిస్తే శనివారం తుది నిర్ణయం వెలువడవచ్చు’ అని సమావేశంలో పాల్గొన్న సభ్యుడొకరు వెల్లడించారు. టోర్నీ పాక్ దాటి వెళితే ఆతిథ్య హక్కుల కోసం ఐసీసీ ఇచ్చే 6 మిలియన్ డాలర్లతోపాటు టోర్నీ ద్వారా వచ్చే ఆదాయం కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగాల్సి ఉంది. -
‘హైబ్రిడ్’ మోడల్‌పైనే చర్చ!
దుబాయ్: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం వెలువడే సమయం వచి్చంది. పాకిస్తాన్ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చి నెలలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే భారత క్రికెట్ జట్టు పాక్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో వేదిక విషయంపై సందిగ్ధత నెలకొంది. టోర్నీ ప్రసారకర్తలతో ఒప్పందం ప్రకారం కనీసం 90 రోజుల ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అది జరగనేలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ బోర్డు సభ్యులు శుక్రవారం సమావేశం కానున్నారు. వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారు. లేదంటే ఓటింగ్ కూడా జరపాల్సి రావచ్చు. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ వన్డే టోర్నీ కి సంబంధించి ఐసీసీ వద్ద చర్చ కోసం మూడు ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది హైబ్రిడ్ మోడల్. దీని ప్రకారం దాదాపు అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్‌లోనే నిర్వహించి భారత్ ఆడే మ్యాచ్‌ల కోసం మరో దేశంలో ప్రత్యామ్నాయ వేదికను చూడటం. భారత్ నాకౌట్ దశకు చేరితే కూడా ఇదే వర్తిస్తుంది. ప్రస్తుత స్థితిలో ఇది సరైందిగా ఐసీసీ భావిస్తోంది. గత ఏడాది ఆసియా కప్‌ను కూడా ఇలాగే నిర్వహించారు. అయితే దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీపీ) ససేమిరా అంటోంది. దీనికి ఒప్పుకునేది లేదని గురువారం మరోసారి ఐసీసీకి సమాచారం అందించింది. రెండో ప్రతిపాదనతో పూర్తిగా టోరీ్నలో మరో దేశంలో (యూఏఈ కావచ్చు) నిర్వహించి ఆతిథ్య హక్కులు మాత్రం పాకిస్తాన్ వద్దే ఉంచడం. అయితే ఇప్పటికే టోర్నీ కోసం లాహోర్, కరాచీ స్టేడియాలను ఆధునీకరించి సిద్ధమవుతున్న పాకిస్తాన్ దీనికి ఎలాగూ అంగీకరించదు. పైగా 1996 వరల్డ్ కప్ తర్వాత అక్కడ ఒక్క ఐసీసీ టోర్నీ జరగలేదు. టోర్నీ దేశం దాటిపోతే ఆర్థికపరంగా బాగా నష్టం కూడా. మూడోది భారత్ లేకుండా టోర్నీని జరపడం. వాణిజ్యపరమైన అంశాలను చూసుకుంటే ఇది అసాధ్యమైన ప్రతిపాదన. మరోవైపు లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ను ఎక్కడ జరపాలనే అంశంపై కూడా ప్రత్యేక చర్చ జరగనుంది. హైబ్రిడ్ మోడల్‌కు తాము అంగీకరించాలంటే భారత్‌లో రాబోయే ఐదేళ్లలో జరిగే నాలుగు టోర్నీలకు కూడా దీనిని వర్తింపజేస్తామని హామీని ఇవ్వాలని... తామూ భారత్‌కు వెళ్లమని పాక్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. -
'పాక్‌కు ఇది అవమానం.. హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నా'
''ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించడం ఇష్టం లేదని.. దీనిని వ్యతిరేకిస్తున్నానంటూ''.. పీసీబీకి కాబోయే చైర్మన్ జకా అష్రఫ్ బాంబు పేల్చాడు. ఇటీవలే పీసీబీ తాత్కాలిక చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న నజమ్ సేథీ ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కు ప్రతిపాదన పంపారు. దీనిపై సుధీర్ఘంగా చర్చించిన ఏసీసీ పాక్ ప్రతిపాదనను ఒప్పుకొని ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడల్లో నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఆసియా కప్ షెడ్యూల్ కూడా విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరగాల్సి ఉంది. దీని ప్రకారం పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్ లు.. శ్రీలంకలో 9 మ్యాచ్ లు ఆడించేందుకు పీసీబీ అంగీకారం తెలిపింది.తాజాగా బుధవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అష్రఫ్ మాట్లాడుతూ ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను ఈ హైబ్రిడ్ మోడల్‌ను గతంలోనే వ్యతిరేకించా. ఇదో అర్థం పర్థం లేని విధానం. నేను దీనికి అంగీకరించను. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ).. ఈ ఏడాది ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తానని తెలిపింది. దాని ప్రకారం ఈ టోర్నీ ఇక్కడే జరగాలి. ఇక టోర్నీలో ప్రధాన మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్ బయటే జరగనున్నాయి. భూటాన్, నేపాల్ వంటి చిన్న జట్లు మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. ఇది పాకిస్తాన్ కు ఒకరకంగా అవమానమే. గతంలో మా బోర్డు ఏం నిర్ణయం తీసుకుందో నాకైతే అవగాహన లేదు. ఆ సమాచారం గురించి నాకు తెలియదు. కానీ క్లారిటీ మాత్రం ఉంది. ఈ తక్కువ వ్యవధిలో ఏం చేయగలనో అది చేస్తా'' అని చెప్పుకొచ్చాడు. PCB Nominated Chairman Zaka Ashraf Reject PCB hybrid Model for Asia Cup Interesting days ahead & controversy related #AsiaCup2023 #WorldCup2023 pic.twitter.com/3El1ISj0ym — Abdul Ghaffar 🇵🇰 (@GhaffarDawnNews) June 21, 2023 అష్రఫ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ఏడాది ఆసియా కప్ భవితవ్యం మళ్లీ ప్రమాదంలో పడ్డట్టే. హైబ్రిడ్ మోడల్ ను తిరస్కరించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆడితే పూర్తి మ్యాచ్ లు శ్రీలంకలోనే ఆడాలి లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించాలి. ఇంతకుమించి పాక్‌కు మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇదివరకే తాము పాకిస్తాన్ కు వెళ్లేది లేదని కుండబద్దలు కొట్టింది. ఒకవేళ భారత్ లేకున్నా ఆసియా కప్ నిర్వహించడం అసాధ్యం. ఇక జకా అష్రఫ్ పీసీబీ చైర్మన్‌గా ఉన్న సమయంలో టీమిండియా, పాకిస్తాన్‌లు చివరి'సారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. చదవండి: 'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది! #AsiaCup2023: 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది'
ఆసియా కప్ 2023 నిర్వహణపై సందిగ్ధత వీడింది. పీబీసీ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోక్కు ఓకే చెప్పిన ఆసియా క్రికెటర్ కౌన్సిల్(ఏసీసీ) గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇక ఆసియా కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో రానుంది. కాగా ఆసియా కప్ నిర్వహణలో పీసీబీ ప్రతిపాదనను అంగీకరించిన ఏసీసీకి.. పీసీబీ చైర్మన్ నజమ్ సేథీ కృతజ్ఞతలు తెలిపారు. ఆసియా కప్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాగానే నజమ్ సేథీ మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ తన ట్విటర్లో షేర్ చేసింది. నజమ్ సేథీ మాట్లాడుతూ.. ''ACC ఆసియా కప్ 2023 కోసం మా హైబ్రిడ్ వెర్షన్ ఆమోదించింనందుకు నేను సంతోషిస్తున్నా. ఆసియా కప్ హోస్ట్‌గా మేము ఉండడం.. భారత్ పాకిస్తాన్ రాలేని కారణంగా శ్రీలంక తటస్థ వేదికగా ఉండనుంది. అయితే గత 15 ఏళ్లలో ఆసియా కప్ ద్వారా టీమిండియా పాకిస్తాన్లో అడుగుపెడుతుందని అనుకున్నాం. కానీ బీసీసీఐ పరిస్థితి మాకు అర్థమైంది. మాలాగే బీసీసీఐకి కూడా బార్డర్ దాటి పాక్‌లో ఆసియా కప్ ఆడేందుకు వారి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌తో పాటు ఆమోదం కావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగదని తెలుసు. కానీ మా ప్రతిపాదనను అర్థం చేసుకున్న ఏసీసీకి కృతజ్ఞతలు.'' అంటూ చెప్పుకొచ్చాడు. کرکٹ کے شائقین کے لیے بڑی خوشخبری ایشیا کپ ایک بار پھر پاکستان میں۔ پاکستان کرکٹ بورڈ کی مینجمنٹ کمیٹی کے چیئرمین نجم سیٹھی کا پیش کردہ ہائبرڈ ماڈل منظور, ایشیا کپ31 اگست سے17 ستمبر تک ہوگا۔ ابتدائی میچز پاکستان میں ہونگے جس کے بعد بقیہ میچز سری لنکا میں کھیلے جائیں گے۔ pic.twitter.com/r9jUZ8jCGX — Pakistan Cricket (@TheRealPCB) June 15, 2023 ఇక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. పాకిస్తాన్లో 4 మ్యాచ్‌లు... శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. గ్రూప్ దశ తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్ ఫోర్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ ఫోర్’ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. పాకిస్తాన్‌లోని నాలుగు మ్యాచ్‌లకు లాహోర్ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్‌కప్ జరగడంతో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. చదవండి: ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల -
ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల
ఎట్టకేలకు ఆసియా కప్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో జరగనున్న ఈ టోర్నీని ‘హైబ్రిడ్ మోడల్’లో నిర్వహించేందుకు జై షా అధ్యక్షుడిగా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆగస్టు 31 నుంచి సెపె్టంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. పాకిస్తాన్లో 4 మ్యాచ్‌లు... శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. గ్రూప్ దశ తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్ ఫోర్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ ఫోర్’ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. పాకిస్తాన్‌లోని నాలుగు మ్యాచ్‌లకు లాహోర్ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్‌కప్ జరగడంతో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి.. కొత్త వర్క్ పాలసీని అమలు చేయనున్న మెటా!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. వర్క్ ప్రమ్ హోమ్‌ను తగ్గించేలా చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం కొత్త వర్క్ పాలసీని తయారు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త పని నిబంధనలు అమల్లోకి వస్తే ఉద్యోగులు కనీసం వారానికి మూడు రోజులు కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. వర్క్‌లో సమర్ధత, ఉత్పాదకత వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకున్న మెటా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కొత్త పాలసీని అమలు చేయనుంది. అయితే, ఇప్పటికే రిమోట్ వర్క్‌కి పరిమితమైన ఉద్యోగులు వారి ప్రస్తుత స్థానాల నుంచి విధులు నిర్వహించేందుకు మెటా అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మెటా ప్రతినిధులు కొత్త వర్క్ పాలసీ విషయంలో ఉద్యోగులు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కార్యాలయం నుంచి లేదంటే ఇంటి నుంచి పని చేసినా ఉద్యోగుల పనితీరులో ఎలాంటి మార్పులు ఉండవని, సమర్ధవంతంగా పనిచేస్తారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సహకారం, సంబంధాలు, అనుకూలమైన పని సంస్కృతిని పెంపొందించేందుకే కొత్త పని విధానంపై పనిచేస్తున్నట్లు మెటా ప్రతినిధి ప్రస్తావించారు.ఈ నిర్ణయం మెటా గత కొంతకాలంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌తో జరిగిన ఇంటర్నల్ మీటింగ్‌లో ఇంజినీర్లు వారంలో కనీసం మూడు రోజులు సహచరులతో కలిసి పనిచేసినప్పుడే మెరుగైన పనితీరు కనబరుస్తామనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మెటా వర్క్ పాలసీ అమలు చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
ఆ వార్తల్లో నిజం లేదు.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలకనున్నారా?
రిటర్న్ టూ ఆఫీస్ వర్క్ పాలసీ పాటించని ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ కొట్టి పారేసింది. వెలుగులోకి వచ్చిన నివేదికలు నిరాధారమైనవని టీసీఎస్ ప్రతినిధి అధికారిక ప్రకటన చేశారు. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు వచ్చేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అంతే తప్పా సిబ్బంది కెరియర్ని ప్రమాదంలోకి నెట్టేలా తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నెలలో కనీసం 12 రోజులు ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని టీసీఎస్ మెమోలు పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎవరైతే సంస్థకు విరుద్దంగా వ్యవహరిస్తారో వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని నోటీస్‌లో హెచ్చరించింది. ఆ నివేదికలపై టీసీఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ..‘గత కొన్ని నెలలుగా దేశీయంగా పనిచేస్తున్న ఉద్యోగులు అసోసియేట్ కార్యాలయానికి తిరిగి రావాలని, వారానికి 3 రోజులు ఆఫీస్‌లో పనిచేసేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. చదవండి👉 మూన్‌లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’ ఈ తరహా పని విధానం వల్ల అనుకున్న ఫలితాలను రాబట్టినట్లు తెలిపారు. అందుకే, సంస్థకు చెందిన మొత్తం ఉద్యోగులు కార్యాలయాల్లో వారానికి మూడు రోజులు పనిచేసే లక్క్ష్యంతో అందరం కలిసి పని చేస్తున్నామని అన్నారు. ఉద్యోగులు ఆఫీస్‌కు రాకపోతే వారిపై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి గత ఏడాది ఉద్యోగులు 100 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు టీసీఎస్ తెలిపింది. కరోనా తగ్గుముఖం పట్టిన తరుణంలో సిబ్బంది వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని మెయిల్స్ పంపింది. టీసీఎస్ వర్క్ విధానం ప్రకారం.. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు ఆహ్వానిస్తుంది. ఇందులో, ఒక నిర్దిష్ట సమయంలో 25 శాతానికి మించకుండా కార్యాలయం నుండి ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ అవసరాల ఆధారంగా రోస్టరింగ్ ఉంటుందని, ఫ్రెషర్లు, అనుభవజ్ఞులైన ఉద్యోగుల్ని కార్యాలయానికి పిలుస్తున్నట్లు టీసీఎస్ సంస్థ ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో తెలిపింది. చదవండి👉 లక్షల్లో ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్ సంచలనం! -
హోండా నుంచి ఏటా కొత్త కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఏటా ఒక కొత్త మోడల్ లేదా వేరియంట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మార్కెట్లో కంపెనీ వాటాను పెంచుకోవడం లక్ష్యంగా వచ్చే 3–5 ఏళ్లపాటు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. హోండా వాటా ప్రస్తుతం 2.5 శాతం మాత్రమే. 2023 సెప్టెంబర్‌లోగా ఒక ఎస్‌యూవీని పరిచయం చేయనున్నట్టు హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు. హైబ్రిడ్ మోడల్ ఒకటి రానుందని చెప్పారు. అలాగే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ మోడల్ సైతం రంగ ప్రవేశం చేయనుందని వెల్లడించారు. 2022–23లో 8 శాతం వృద్ధితో దేశీయంగా 92,000 యూనిట్ల అమ్మకాలను కంపెనీ ఆశిస్తోంది. అలాగే 25 శాతం వృద్ధితో ఎగుమతులు 23,000 యూనిట్లు నమోదు కానున్నాయి. రాజస్థాన్‌లోని ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 1.8 లక్షల యూనిట్లు. -
‘ఆఫీస్‌కు రావొద్దు..ఇంటి నుంచి పనిచేయండి’, ఉద్యోగుల దారికొస్తున్న సంస్థలు
చైనాలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. సంవత్సరాలు గడుస్తున్నా కోవిడ్ తీవ్రత ఎక్కడా అదుపులోకి రావడం లేదు. పైగా రోజుకు వేలు..లక్షల నుంచి కోట్ల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం.. 20 రోజుల వ్యవధిలో సుమారు 25 కోట్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డ్రాగన్ కంట్రీ చుట్టు పక్కల దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, కజికిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్,వియాత్నంతో పాటు భారత్, అమెరికా దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలకు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేలా జాగ్రత్తలు చెబుతున్నాయి. ఆఫీస్‌కు రావాల్సిందే ఈ తరుణంలో ఆయా దేశాలకు చెందిన సంస్థలు ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ మోడల్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఆఫీస్ కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. సంస్థలు సైతం ఉద్యోగులు ఆఫీస్ రావాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో చేసేది లేక ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదవండి👉 ఇదేందయ్యా..ఇది నేను చూడలా.. ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ వైరల్! ఆఫీస్‌కు వద్దు ఇంట్లోనే ఉండండి కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారైనట్లు తెలుస్తోంది. ఆఫీస్ రావాల్సిందేనని పట్టుబట్టిన కంపెనీలు .. ఉద్యోగులు ఆఫీస్‌కు రావాల్సిన అవసరం లేదని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని బ్రతిమలాడుతున్నాయి. వచ్చే ఏడాది మొత్తం భారత్‌లో ఫ్లిప్‌కార్ట్, మారికో, టాటా స్టీల్, ఎల్‌టీఐమైండ్ ట్రీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తో పాటు ఇతర దిగ్గజ కంపెనీలన్నీ 2023 లో సైతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను కొనసాగించేందుకు సిద్ధమయ్యాయి. అంతేకాదు తాము కల్పిస్తున్న ఈ సౌకర్యానికి ఉద్యోగులు ఆఫీస్ వర్క్ తో పాటు పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. జై కొడుతున్న 92 శాతం మంది ఉద్యోగులు గతనెలలో టెక్ సంస్థ హెచ్‌పీ ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో 92 శాతం మంది ఉద్యోగులు హైబ్రిడ్ మోడల్‌కు జై కొడుతున్నట్లు తేలింది. కోవిడ్ రాకతో మొదలైన ఈ కొత్త వర్క్ కల్చర్ వల్ల ఇటు ఆఫీస్ వర్క్‌ను.. అటు పర్సనల్ వర్క్‌ను బ్యాలెన్స్ చేసుకోవచ్చని ఉద్యోగులు చెబుతున్నారు. 88 శాతం మంది ఉద్యోగులు రిటెన్షన్ ఎక్కువగా ఉందని, 72 శాతం మంది వర్క్‌లో ప్రొడక్టివిటీ పెరుగుతుందనే తెలిపారు. చదవండి👉 ‘మిలీనియల్స్’ భారీ షాక్, టెక్ దిగ్గజం టీసీఎస్‌కు కొత్త తలనొప్పులు! -
హైబ్రిడ్ మోడళ్లపైనే టయోటా ఫోకస్
ముంబై: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను భవిష్యత్తులో ప్రవేశపెడతాం. ప్రస్తుతానికి హైబ్రిడ్ మోడళ్లపైనే టయోటా కిర్లోస్కర్ ఫోకస్ చేసిందని కంపెనీ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో హైబ్రిడ్లపై దృష్టిసారించారన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘కర్బన ఉద్గారాలను తగ్గించడమే దేశ లక్ష్యం అని నేను భావిస్తున్నాను. మీరు దానిని సమగ్రంగా, శాస్త్రీయ ప్రాతిపదికన చూడాలి. అదే మేము చేస్తున్నాము’ అని చెప్పారు. సమీప కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకువచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పునరుత్పాదక విద్యుత్తు వాటా కనీసం 50–60 శాతానికి చేరితే తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేస్తామని స్పష్టం చేశారు. ఇన్నోవా హైక్రాస్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇవీ ఇన్నోవా హైక్రాస్ ఫీచర్లు.. మల్టీ పర్పస్ వెహికల్ ఇన్నోవా ప్లాట్‌ఫామ్‌పై హైక్రాస్ పేరుతో హైబ్రిడ్ వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. బుకింగ్స్ మొదలయ్యాయి. జనవరి మధ్యకాలం నుంచి డెలివరీలు ఉంటాయి. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తోనూ లభిస్తుంది. సెల్ఫ్ చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్‌తో 2 లీటర్ పెట్రోల్ ఇంజిజన్ పొందుపరిచారు. మైలేజీ లీటరుకు 21.1 కిలోమీటర్లు అని కంపెనీ ప్రకటించింది. డైనమిక్ రాడార్ క్రూజ్ కంట్రోల్, ప్రీ కొలీషన్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ–డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్ సిస్టమ్, 7–8 సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ జోడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవా వాహనాలు 26 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2005లో భారత్‌లో ఇది రంగ ప్రవేశం చేసింది. ఇప్పటి వరకు 10 లక్షల పైచిలుకు ఇన్నోవాలు రోడ్డెక్కాయి. కంపెనీ మొత్తం అమ్మ కాల్లో ఈ మోడల్ వాటా ఏకంగా 50 శాతం ఉంది. చదవండి: బైక్ కొనాలనుకునే వారికి షాక్.. ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ! -
'వర్క్ ఫ్రం హోం' వద్దు!.. సగం రోజులు ఆఫీస్, సగం రోజులు ఇంటి నుంచి, లేదా
సాక్షి, హైదరాబాద్: ఇకపై పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే ‘వర్క్ ఫ్రం హోం’ విధానానికి కాలం చెల్లినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోవిడ్ మహమ్మారి వల్ల దాదాపు రెండున్నరేళ్ల పాటు బాగా అలవాటైన ఈ పద్ధతిని క్రమంగా మార్చుకోవాల్సిందేనని అంటున్నారు. ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ఇతర ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’ విధానానికి తగ్గట్టుగా తమను మలుచుకున్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొన్ని కేసులొస్తున్నా స్వల్ప లక్షణాలే ఉంటుండడంతో పరిస్థితులు దాదాపు సాధారణమయ్యాయి. ఈ పరిస్థితుల్లో సగం రోజులు ఆఫీస్, సగం రోజులు ఇంటి నుంచి, లేదా వీలునుబట్టి పనిచేసే ‘హైబ్రిడ్ వర్కింగ్ మోడల్’కే కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా సీబీఆర్ఈ దక్షిణాసియా ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్‌లోని 73 శాతం కంటే ఎక్కువ ‘ఆఫీస్ స్పేస్ ఆక్యుపయర్స్’ పూర్తిగా వర్క్ ఫ్రం హోం కాకుండా ఈ హైబ్రిడ్ వర్కింగ్ విధానాన్ని కోరుకుంటున్నట్టు స్పష్టమైంది. సీబీఆర్ఈ ‘2022 ఇండియా ఆఫీస్ స్పేస్ ఆక్యుపయర్స్ సర్వే’లో... అవసరమైన సందర్భాల్లో పూర్తిగా రిమోట్ వర్కింగ్, మూడు రోజులు ఆఫీస్ – మూడు రోజులు ఇంటి నుంచి పని, ఆఫీస్ లేదా ఇల్లు అవసరానికి తగ్గట్టు మార్చుకునే అవకాశం, మూడు రోజులకు పైగా వర్క్ ఫ్రం హోం, రెండు రోజులు ఆఫీస్ ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఇందులో 35 శాతం మంది మూడు రోజులకు మించి ఆఫీసు నుంచి పని చేయాలని కోరుకుంటే, 38 శాతం మంది ఆఫీస్, రిమోట్ వర్క్ డేస్ సమానంగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగుల ఆరోగ్యం, యోగ క్షేమాలు ప్రధానం కాబట్టి వారు ఆఫీసులకు సులభంగా వచ్చేందుకు ఈ హైబ్రిడ్ విధానం ఉపయోగపడుతుందని కంపెనీలు సైతం దీనివైపే మొగ్గు చూపుతున్నాయి. చదవండి: ఐఐసీటీ శాస్త్రవేత్తలకు అరుదైన గుర్తింపు -
కోవిడ్ పోయింది.. హైబ్రిడ్ వచ్చింది!
ఆఫీసుకు వెళ్లి బాధ్యతలకు అనుగుణంగా పని చేయడం అనేది అందరికీ తెలిసిన విధి నిర్వహణ. కరోనా దెబ్బకు అదే ఆఫీసు పని ఇంటికి వచ్చి పడింది. వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్క్ సిస్టమ్ నగరవాసులకు పరిచయమైంది కరోనా వేవ్స్‌ని మార్చుకుంటున్న కొద్దీ పనితీరు కూడా మార్పు చేర్పులకు లోనవుతూ వస్తోంది. అదే క్రమంలో సిటీ కంపెనీలు ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ సిస్టమ్‌ను జపిస్తున్నాయి. నిజానికి పలు కంపెనీలు గత డిసెంబరు నెలాఖరునే ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌కి రమ్మని ఆదేశించాయి. దశల వారీగా ఆపీస్ కార్యకలాపాలను పునరుద్ధరించాలని, మార్చి నెలాఖరుకి పూర్తి స్థాయిలో ఉద్యోగులతో నిర్వహించాలని ఆశించాయి. – సాక్షి, హైదరాబాద్ భయపెట్టిన ఒమిక్రాన్... ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం కంపెనీల యాజమాన్యాలను ఆందోళనకు గురిచేసింది. ఒమిక్రాన్ భయం.. కొన్నాళ్ల పాటు సందిగ్ధంలో పడేసింది. దాంతో డిసెంబర్ నుంచి వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు సిద్ధమవుతున్న కంపెనీలు తమ ఆలోచనను జూన్ నెలకు వాయిదా వేశాయి. అనంతర కాలంలో కరోనా థర్డ్‌వేవ్ ఎటువంటి ప్రభావం చూపలేకపోయినా.. పూర్తి స్థాయిలో తిరిగి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం కంపెనీలకు జటిల సమస్యగా మారింది. మరోవైపు కంపెనీలు యథాతధంగా తమ పనులు పునః ప్రారంభించాలని ఆరోగ్య శాఖాధికారులు సూచించారు. పలు ప్రభుత్వ శాఖల నుంచీ కూడా కంపెనీలకు ఉద్యోగులను రప్పించడంపై కొంత ఒత్తిడి వచ్చిందని సమాచారం. దీంతో నగర కంపెనీలు హైబ్రిడ్ పద్ధతికి ఓటేశాయి. పుంజుకుంటున్న హైబ్రిడ్.. ఆఫీస్ నుంచీ, ఇంటి నుంచీ కలిపి పనిచేసే హైబ్రిడ్ విధానాన్ని తొలుత టీసీఎస్ తదితర ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు గత ఏడాది మధ్యలో ప్రవేశపెట్టాయి. స్వల్ప కాలంలో ఈ విధానం బాగా ఆదరణ పొందింది. పలు సర్వేల్లో ఈ వర్క్ సిస్టమ్‌ని ఉద్యోగులు సమర్ధించారు. దీంతో ఈ హైబ్రిడ్ మరింత కొత్త పద్ధతుల్ని మోసుకొచ్చింది. ఆఫీస్‌లో నిర్ణీత సమయం పనిచేసిన తర్వాత మిగిలిన సమయం ఉద్యోగి ఇంటి నుంచో లేదా తన ఇష్టం వచ్చిన చోటు నుంచీ ఇష్టం వచ్చిన సమయంలో చేసుకునే వెసులుబాటుతో సరికొత్త హైబ్రిడ్ దూసుకొచ్చింది. ఇది మరింత ఆదరణ పొందడంతో ప్రస్తుతం పలు కంపెనీలు దీన్ని అనుసరిస్తున్నాయి. ఇటీవల కొన్ని కంపెనీలు తమ రిక్రూట్ మెంట్ ఆఫర్లలో ఈ విధానాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్న నేపధ్యంలో. కరోనా సరికొత్త వేరియంట్స్ రాకపోకలు ఎలా ఉన్నా.. ఈ సరికొత్త విధానాన్ని కంపెనీలు కొనసాగించడం తథ్యమని కార్పొరేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: ప్రాణం పోయినా సరే ‘తల’పెడితే.. తగ్గేదేలే!.. ఇతరులకు నో ఎంట్రీ! నగరం వెలుపల ఉద్యోగులు.. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించడంలో పెద్ద సంస్థల కన్నా చిన్న కంపెనీలే ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హెచ్‌వైఎస్‌ఇఎ) చేసిన సర్వే ప్రకారం, ఉద్యోగులు నగరం వెలుపల ఉండడమే ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి తీసుకురావడానికి పెద్ద కంపెనీలకు సంబంధించి ప్రధాన అడ్డంకిగా మారింది. దాదాపు 90శాతం కంపెనీలకు చెందిన ఉద్యోగులలో 25శాతానికిపైగా నగరం వెలుపలే ఉన్నారని సర్వేలో తెలిపాయి. దీంతో వీరికి తగినంత సమయం ఇచ్చేందుకు ఇంటి నుంచి కొంత, కార్యాలయం నుంచి కొంత అనే హైబ్రిడ్ మోడల్ని కంపెనీలు ప్రస్తుతానికి అమలు చేస్తున్నాయి. వారంలో 2/3 రోజులు ఆఫీస్‌కు రావాలని మిగిలిన రోజుల్లో ఇంట్లో నుంచే పని చేసుకోవచ్చునని చెబుతున్నాయి. ఈ హైబ్రిడ్ పద్ధతినే కనీసం జూన్ నెల వరకూ ఇదే విధానాన్ని అమలు చేయనున్నాయి. -
సీఐఎస్ఎఫ్ ఒక కర్మయోగి: అమిత్ షా
ఘజియాబాద్: కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం( సీఐఎస్ఎఫ్) ఒక కర్మయోగిలాగా పారిశ్రామికాభివృద్ధి, ప్రైవేట్ ఉత్పత్తి యూనిట్ల రక్షణలో పాలుపంచుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రశంసించారు. ఇకపై సంస్థ హైబ్రిడ్ మోడల్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. హైబ్రిడ్ మోడల్లో భాగంగా నాణ్యమైన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫై చేయాలన్నారు. తద్వారా వివిధ పారిశ్రామిక, ఉత్పత్తి యూనిట్ల రక్షణకు ప్రైవేట్ ఏజెన్సీల సేవలు ఉపయోగపడతాయని చెప్పారు. ఇండియా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉందని, ఇందులో భాగంగా కొత్తగా అనేక ఉత్పత్తి యూనిట్లు పుట్టుకువస్తాయని, వీటి రక్షణలో సీఐఎస్ఎఫ్ నూతన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సంస్థ 53వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. హైబ్రిడ్ మోడల్‌ను పెంపొందించడం వల్ల 1–5 వేల మంది సిబ్బందితో సేవలనందించే ప్రైవేట్ సంస్థలు వస్తాయన్నారు. వీటికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా సీఐఎస్ఎఫ్ బాధ్యతల బరువు పంచుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ సిబ్బంది 354 యూనిట్లకు రక్షణ కల్పిస్తున్నారు. ప్రైవేట్ రంగ ఏజెన్సీలు ప్రస్తుతం కేవలం 11 కంపెనీలకే రక్షణ బాధ్యతలు అందిస్తున్నాయని, ఇవి మరింత పెరిగేలా కృషి చేయాలని షా సూచించారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్ : ఉద్యోగులకు భారీ షాక్!!
దేశీయంగా ఉన్న 93శాతం టెక్ కంపెనీలు ఉద్యోగులకు భారీ షాకిచ్చాయి. కరోనా ప్రభావం లేకపోవడంతో సంస్థలు ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని మెయిల్స్ పంపిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంస్థల నుంచి మెయిల్స్ రావడంతో 72శాతం మంది ఉద్యోగులు తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని కోరుతున్నారు. కానీ సంస్థలు మాత్రం అందుకే ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఆఫీస్‌కు రావాలని, లేదంటే హైబ్రిడ్ వర్క్ చేయాల్సిందేనని ఉద్యోగుల్ని అదేశిస్తున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో అటు ఉద్యోగులు ఇటు సంస్థల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గూగుల్,ట్విట్టర్లు వర్క్ విషయంలో ఉద్యోగుల్ని ఒత్తిడి చేయమని స్పష్టం చేస్తుండగా..దేశీయ టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని ఆఫీస్‌లకు రప్పిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగులు మాత్రం తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కోరుతుండగా..కంపెనీలు మాత్రం ఐబ్రిడ్ వర్క్‌ను అలావాటు చేస్తున్నట్లు నాస్కామ్ రిపోర్ట్‌లో పేర్కొంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో నాస్కామ్ రూపొందించిన "టెక్నాలజీ రీషేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఇండియా ప్రాస్పెక్టీవ్ అనే విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. దీంతో పాటు అనేక అసక్తికర విషయాలు ఈ నివేదిక హైలెట్ చేసింది. హైబ్రిడ్ వర్క్ మోడల్ ►"ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఇండియా ఔట్లుక్" రిపోర్ట్‌లో మనదేశానికి చెందిన 70శాతం టెక్ కంపెనీలు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అవలంబించాయని, 85 శాతం మంది రిమోట్‌గా లేదా హైబ్రిడ్ వర్క్‌లో పనిచేస్తున్నారని నివేదిక పేర్కొంది. ►"దాదాపు 63 శాతం సంస్థలు హైబ్రిడ్ క్లౌడ్ సేవలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ►"సర్వేలో పాల్గొన్న దాదాపు 74 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ కొనసాగించాలని కోరుతున్నారు. ►"93 శాతం టెక్ సంస్థలు మహమ్మారికి మించి హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరించాలని చూస్తున్నాయి. భవిష్యత్ అంతా టెక్నాలజీదే ► నివేదిక ప్రకారం, మహమ్మారి కారణంగా వర్క్ కల్చర్ మార్చేందుకు అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త టెక్నాలజీలు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని 92 శాతం సంస్థలు విశ్వసిస్తున్నాయి. ► టెక్ ఇండస్ట్రీలో 90 శాతానికి పైగా ఉద్యోగులు కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన 2 నుంచి మూడు వారాల లోపే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ప్రారంభించారు. చదవండి: ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇద్దాం.. సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు -
ఒమిక్రాన్ ఎఫెక్ట్, వర్క్ ఫ్రమ్ హోంపై దిగ్గజ కంపెనీల సంచలన నిర్ణయం..?!
వచ్చే ఏడాది నుంచి హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను అమలు చేసే విషయంలో సంస్థలు యూటర్న్ తీసుకోనున్నాయి. కొన్ని కంపెనీలు వచ్చే ఏడాది మొత్తం ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితం చేయాలని చూస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్ని వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కార్యాలయాలకు ఆహ్వానించాలని భావించాయి. కానీ ప్రపంచ దేశాల్ని ఒమిక్రాన్ వణికిస్తుండడంతో రిటర్న్- టు- ఆఫీస్ ప్లాన్ అమలు చేయడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ►ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసుల్లో విధులు నిర్వహించేలా కార్యాలయాల్ని సిద్ధం చేశాయి. కానీ అనూహ్యంగా ఒమిక్రాన్ భయం ఉద్యోగుల్ని తిరిగి కార్యాలయాలకు రప్పించే అంశాన్ని మరింత ఆలస్యం చేయనున్నాయి. ►డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ప్రభావం తక్కువేనని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు యూఎస్‌తో పాటు ఇతర దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఉద్యోగులతో కార్యాలయాల్లో విధుల నిర్వహణ సంస్థలకు కత్తిమీద సాములా మారింది. ►బ్రిటన్, డెన్మార్క్, నార్వే, స్వీడన్‌కు చెందిన కంపెనీలు ఓమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ►టెక్ దిగ్గజం గూగుల్, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వాహన తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కంపెనీ..ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలిపించడంపై మరింత ఆలస్యం చేయనున్నాయి. ►ఇప్పటికే ఫేస్బుక్ (మెటా), రైడ్‌షేరింగ్ కంపెనీ 'లిఫ్ట్' వచ్చే ఏడాది ప్రారంభంలో ఉద్యోగులు ఆఫీసుల్లో పనిచేయాలన్న ఆంక్షలపై పునరాలోచనలో పడ్డాయి. ఫేస్బుక్ వచ్చే ఏడాది జున్ చివరి నాటికి ఉద్యోగుల్ని ఆఫీస్‌లకు పిలిపించాలని ప్రయత్నించింది. కానీ ఒమిక్రాన్ ప్రభావంతో మరింత ఆలస్యం కానుంది. అప్పటి వరకు ఉద్యోగులు ఇంటికే పరిమితం కానున్నారు. లిఫ్ట్ సంస్థ వచ్చే ఏడాది అంతా ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ►అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్స్యూరెన్స్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ జెఫ్ లెవిన్ షెర్జ్ ఒమిక్రాన్‌పై స్పందించారు. 18 నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన ఉద్యోగులు త్వరలో ఆఫీస్‌ల నుంచి విధులు నిర్వహిస్తారని భావించినట్లు తెలిపారు. కానీ ఒమిక్రాన్ విజృంభణతో మరింత ఆలస్యం కావడమే కాదు.. ఉద్యోగుల పట్ల సంస్థలు మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. ►కోవిడ్‌కు ముందు ఉన్న విధంగా ఆఫీసుల్లో పనిచేసే వాతావరణం తిరిగి ఇప్పట్లో వచ్చేలా లేదని ఒమిక్రాన్‌తో అర్ధమైందని అడ్వటైజింగ్ ఏజెన్సీ క్రియేటివ్ సివిలైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గిసెలా గిరార్డ్ చెప్పారు. చదవండి: గూగుల్ షాకింగ్ నిర్ణయం.. ఆ ఉద్యోగుల తొలగింపు! -
Work From Home: టీసీఎస్ రూల్స్ మార్చేసింది.. అవి ఏంటంటే?
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నవంబర్ 15తో డిప్యూటెడ్ లొకేషన్ (బేస్ బ్రాంచ్)లలో విధులు నిర్వహించే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ గడువు పూర్తయ్యింది. నవంబర్ 16నుంచి ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ ఉద్యోగుల విధులపై స్పందించింది. 2025 నాటికి 25 శాతం సిబ్బంది ఆఫీస్‌లో పనిచేసేలా ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు తెలిపింది. వర్క ఫ్రమ్ హోమ్ ముగిసింది..ఉద్యోగులు రావాల్సిందే కొద్ది రోజుల క్రితం టీసీఎస్ నవంబర్ 15 నాటికి ఉద్యోగులు వారి డిప్యూటెడ్ లొకేషన్ (బేస్ బ్రాంచ్)కి తిరిగి రావాలని కోరింది. కోవిడ్ తగ్గుముఖ పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ సూచించింది. అందుకు కారణం ఈ ఐబ్రిడ్ వర్క్ కల్చర్‌ను బిల్డ్ చేసేందుకేనని టీసీఎస్ ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావాలని కోరుతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. హైబ్రిడ్ వర్క్ కల్చర్ కొత్త హైబ్రిడ్ వర్క్ కల్చర్ ప్రకారం..2025 నాటికి 25 శాతం టీసీఎస్ ఉద్యోగులు ఏ సమయంలోనైనా ఆఫీస్‌ల నుంచి విధులు నిర్వహించాల్సి ఉంటుందని టీసీఎస్ ప్రతినిధి తెలిపారు. 25 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఆఫీస్‌లో పనిచేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 'ప్రస్తుతం టీసీఎస్‌లో దాదాపు 5 శాతం ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే క్యాలెండర్ ఇయర్ 2021 చివరి నాటికి ఆ శాతం 25కి పెంచేలా ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తున్నట్లు టీసీఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో ఈ ఐబ్రిడ్ వర్క్ కల్చర్ పై టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణియం స్పందించారు. 2025 నుంచి పూర్తిగా ఈ ఐబ్రిడ్ వర్క్ కల్చర్‌ను అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగా టీసీఎస్ సంస్థ 25 శాతం ఉద్యోగులు ఆఫీస్నుంచి పనిచేసే విధానం పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: గుడ్ న్యూస్: వారంలో 3 రోజులే పని..! వచ్చే ఏడాది నుంచే అమలు..?! -
వర్క్ ఫ్రం హోమ్ నుంచి హైబ్రిడ్ పని విధానం వైపు
ముంబై: కరోనా వైరస్ పరిణామాలతో వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మళ్లిన కంపెనీలు క్రమంగా హైబ్రిడ్ పని విధానం వైపు మొగ్గు చూపుతున్నాయి. అటు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం, ఇటు ఆఫీసులకు రాదల్చుకున్న వారు కార్యాలయాలకు వచ్చి ఉద్యోగ విధులను నిర్వర్తించే విధానాన్ని అమలు చేయడంపై కసరత్తు చేస్తున్నాయి. బిర్లా గ్రూప్, ఆర్పీజీ గ్రూప్, కోటక్ మహీంద్రా, టాటా మోటర్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్, టెక్ మహీంద్రా తదితర సంస్థలు దీని అమలుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవైపు కోవిడ్–19 వేక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోగా మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభించవచ్చన్న ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. జూలై నుంచి ఆఫీసులకు.. వేక్సినేషన్ ప్రక్రియ సింహభాగం పూర్తయ్యాక జూలై నుంచి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించవచ్చని చాలా మటుకు కంపెనీలు యోచిస్తున్నాయి. అయితే దీన్ని తప్పనిసరి చేయొద్దని భావిస్తున్నాయి. టీమ్‌లతో కలిసి పనిచేయడం, క్లయింట్లు.. టెక్నాలజీ ఇన్ఫ్రా అవసరాలను బట్టి ఇంటి నుంచే పనిచేయడమా లేక ఆఫీసుకు రావాలా అన్నది ఉద్యోగులే ఎంచుకునే అవకాశమివ్వాలని సంస్థలు యోచిస్తున్నాయి. కొన్ని సంస్థలు కన్వేయన్స్ రీయింబర్స్మెంట్ చేయడం, హోమ్ ఆఫీసులను ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వడం వంటి విధానాలు కూడా అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ (డబ్ల్యూఎఫ్‌హెచ్) విధానానికి అలవాటు పడినప్పటికీ చాలా మంది ఉద్యోగులు .. ముఖ్యంగా మహిళలు ఇంటి సంబంధ బాధ్యతల కారణంగా ఉద్యోగ విధులు నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆఫీసుల్లో ఉండే మౌలిక సదుపాయాలు, ఇతర ఉద్యోగులతో బృందంగా కలిసి పనిచేయడం వల్ల ఉండే ప్రయోజనాలను వారు కోల్పోతున్నారని పేర్కొన్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తిరిగి ఆఫీసు బాట పట్టాలని కూడా భావిస్తున్నట్లు వివరించాయి. దీంతో అందరి అభిప్రాయాలు సేకరించి, హైబ్రిడ్ విధానం ప్రయోజనాలు .. అంతర్జాతీయంగా అమలు చేస్తున్న విధానాలు తదితర అంశాలను అధ్యయనం చేసిన మీదట ఉద్యోగులను దశలవారీగా ఆఫీసులకు తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు ఐటీ దిగ్గజం టీసీఎస్ వర్గాలు తెలిపాయి. టీసీఎస్‌లో 4,70,000 పైచిలుకు ఉద్యోగులు ఉండగా వీరిలో చాలా మందికి జూన్ ఆఖరు దాకా వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్‌ను కంపెనీ అమలు చేస్తోంది. అయితే, కనీసం 5 శాతం దాకా సిబ్బంది .. ఉద్యోగ విధుల నిర్వహణ కోసం ప్రతి రోజు దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలకు హాజరు అవుతున్నారని సంస్థ వర్గాలు తెలిపాయి. పనిలో హైబ్రిడ్ మోడల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పని విషయంలో రానున్న రోజుల్లో హైబ్రిడ్ మోడల్ వైపు అత్యధికులు ఆసక్తి చూపుతున్నారని స్టీల్‌కేస్ నివేదిక చెబుతోంది. మారుతున్న అంచనాలు, పని భవిష్యత్తు అన్న అంశంపై జరిగిన ఈ సర్వేలో భారత్‌తోపాటు 10 దేశాలకు చెందిన 32,000 మంది ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, రియల్టీ సంస్థల అధిపతులు పాలుపంచుకున్నారు. రెండుచోట్ల నుంచి.. అంటే ఇంటితోపాటు కార్యాలయం నుంచి కూడా పని చేసేందుకు (హైబ్రిడ్ విధానం) తాము సిద్ధమని సర్వేలో పాల్గొన్న 85 శాతం మంది భారతీయులు తెలిపారు. మహమ్మారి తదనంతరం ఎక్కడి నుంచి విధులు నిర్వర్తించాలన్న విషయంపై ఉద్యోగులకు స్వేచ్ఛ ఉండాలని 90 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంటి నుంచి పని చేయడం వల్ల హెల్త్, ఫిట్‌నెస్‌కు సమయం కేటాయించవచ్చని 39 శాతం మంది చెప్పారు. విధులపై మెరుగ్గా దృష్టిసారించవచ్చని 33 శాతం మంది వివరించారు. అలాగే ఒంటరిగా అనిపిస్తోందని 26.4 శాతం, నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయని 21.7 శాతం, పని–జీవిత సమతుల్యతపై ప్రభావం చూపుతోందని 20.4 శాతం మంది వెల్లడించారు. జీవితం సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తామని అంతర్జాతీయంగా 72 శాతం మంది పేర్కొన్నారు. పూర్తిగా కార్యాలయం నుంచి పని చేస్తామని 23 శాతం, ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తామని 5 శాతం మంది తెలిపారు. -
హెల్మెట్ వాయిస్ కమాండ్స్‌తో ఇక బైకులు!
న్యూఢిల్లీ, సాక్షి: కొత్త హైబ్రిడ్ ఆధారిత పవర్‌ట్రెయిన్‌ను ఆటో దిగ్గజం కావసాకి తాజాగా ప్రదర్శించింది. తద్వారా భవిష్యత్‌లో హైబ్రిడ్ టెక్నాలజీతో కావసాకి మోటార్ సైకిళ్లను రూపొందించే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించింది. నిజానికి బైకులలో హైబ్రిడ్ టెక్నాలజీ అభివృద్ధి తొలి దశలో ఉన్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. పూర్తిస్థాయి కంబ్యూషన్ ఇంజిన్, పూర్తి ఎలక్ట్రిక్ ఇంజిన్ లేదా ఈ రెండింటి కలయికలో బైకులను తయారు చేసే యోచనలో ఉన్నట్లు కావసాకి చెబుతోంది. జాతీయ రహదారులకు కంబ్యూషన్, సిటీలలో ఎలక్ట్రిక్, రేస్ ట్రాకులు తదితర అవసరాలకు ఈ రెండింటి కలయికతోకూడిన మోటార్ సైకిళ్ల తయారీపై దృష్టిపెట్టినట్లు తెలియజేసింది. చదవండి: (కొత్త ఏడాదిలో ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ) ఫోటోటైప్ మోటార్ పూర్తి ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే ప్రోటోటైప్ మోటార్‌ను కావాసాకి తాజాగా ప్రదర్శించింది. కంబ్యూషన్ ఇంజిన్‌గానూ స్విచ్ఓవర్ చేసుకునేందుకు వీలు కలిగిఉన్న ఈ ప్రొటోటైప్ ద్వారా యూరోపియన్ మార్కెట్లకు అనువైన బైకులను రూపొందించాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. 2030కల్లా యూకేసహా యూరోప్‌లోని పలు నగరాలు కఠినతర యాంటీకంబ్యూషన్ చట్టాలను తీసుకువచ్చే ప్రణాళికల్లో ఉన్నాయి. దీంతో హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా బైకులను రూపొందించగలిగితే భారీ మార్కెట్‌కు అవకాశముంటుందని ఆటో రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు వీలుగా గిగాసెల్ నికెల్-మెటల్ హైబ్రిడ్(ఎన్ఐఎంహెచ్) టెక్నాలజీని కావసాకి అభివృద్ధి చేస్తోంది. దీనిని హైబ్రిడ్ మోటార్‌సైకిల్‌లో వినియోగంపై పరిశీలనలు చేయనున్నట్లు తెలుస్తోంది. హెల్మెట్ ద్వారా హెల్మెట్ ఆధారిత వాయిస్ కమాండ్స్ విధానాన్ని సైతం కావసాకి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా హెల్మెట్ వాయిస్ యాక్టివేటెడ్ సిస్టమ్‌కు రూపకల్పన చేస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. తద్వారా రైడర్లు చూపు తిప్పుకోకుండానే ఇంధనం, వాతావరణం, మీడియా లేదా మార్గనిర్దేశన తదితర సౌకర్యాలను అందించే సన్నాహాల్లో ఉన్నట్లు కంపెనీ ఇటీవల తెలియజేసింది. -
2020 నుంచి కొత్త కార్లన్నీ అవే!
లండన్: కర్బన్ ఉద్గారాలకు చెక్‌పెట్టి, కాల్యుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ కార్లకు ఆటో కంపెనీలన్నీ వరుస బెట్టి స్వస్తి పలుకుతున్నాయి. తాజాగా లగ్జరీ కారు తయారీదారి జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) తన ఎలక్ట్రిక్ వాహనాల ప్లాన్‌ను ప్రకటించింది. 2020 నుంచి తమ కొత్త వాహానాలన్నీ ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాలేనని వెల్లడించింది. వోల్వో ప్రకటించిన రెండు నెలల తర్వాత జేఎల్ఆర్ తన ప్లాన్‌ను ప్రకటించింది. జేఎల్ఆర్ అభివృద్ధి చేసే కొత్త మోడల్స్ అన్నీ ఇక పూర్తిగా ఎలక్ట్రిక్ లేదా విద్యుత్, సంప్రదాయ ఇంజిన్లతో కూడిన హైబ్రిడ్ వాహనాలేనని గురువారం తెలిపింది. వచ్చే ఏడాది తమ తొలి పూర్తి ఎలక్ట్రిక్ జాగ్వార్ ఐ-పేస్‌ను విడుదల చేయనున్నట్టు చెప్పింది. అయితే ప్రస్తుత మోడల్స్ అన్నీ పూర్తిగా పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో రూపొందుతున్నాయి. వీటిని ప్రస్తుతమైతే ఇలానే కొనసాగించనున్నట్టు జేఎల్ఆర్ సీఈవో రాల్ఫ్ స్పెత్ తెలిపారు. మరోవైపు ఎలక్ట్రిక్ మోడల్స్ డిమాండ్ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2040 నుంచి కొత్త పెట్రోల్, డీజిల్ వాహనాల విక్రయాలను నిషేధిస్తున్నట్టు బ్రిటన్ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఎలక్ట్రిక్ మోడల్స్‌పై ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. జేఎల్ఆర్ గతేడాది రూపొందించిన 1.7 మిలియన్ల కార్లలో 5,50,000 కార్లు బ్రిటన్ కోసమే అభివృద్ది చేసింది. తన స్వదేశీ మార్కెట్లో ఎలక్ట్రిక్ మోడల్స్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్నట్టు జేఎల్ఆర్ చెప్పింది. బ్రిటన్‌లో ఇది అతిపెద్ద కారు తయారీదారి.