ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నవంబర్ 15తో డిప్యూటెడ్ లొకేషన్ (బేస్ బ్రాంచ్)లలో విధులు నిర్వహించే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ గడువు పూర్తయ్యింది. నవంబర్ 16నుంచి ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ ఉద్యోగుల విధులపై స్పందించింది. 2025 నాటికి 25 శాతం సిబ్బంది ఆఫీస్‌లో పనిచేసేలా ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు తెలిపింది.
వర్క ఫ్రమ్ హోమ్ ముగిసింది..ఉద్యోగులు రావాల్సిందే
కొద్ది రోజుల క్రితం టీసీఎస్ నవంబర్ 15 నాటికి ఉద్యోగులు వారి డిప్యూటెడ్ లొకేషన్ (బేస్ బ్రాంచ్)కి తిరిగి రావాలని కోరింది. కోవిడ్ తగ్గుముఖ పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ సూచించింది. అందుకు కారణం ఈ ఐబ్రిడ్ వర్క్ కల్చర్‌ను బిల్డ్ చేసేందుకేనని టీసీఎస్ ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావాలని కోరుతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
హైబ్రిడ్ వర్క్ కల్చర్
కొత్త హైబ్రిడ్ వర్క్ కల్చర్ ప్రకారం..2025 నాటికి 25 శాతం టీసీఎస్ ఉద్యోగులు ఏ సమయంలోనైనా ఆఫీస్‌ల నుంచి విధులు నిర్వహించాల్సి ఉంటుందని టీసీఎస్ ప్రతినిధి తెలిపారు. 25 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఆఫీస్‌లో పనిచేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
'ప్రస్తుతం టీసీఎస్‌లో దాదాపు 5 శాతం ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే క్యాలెండర్ ఇయర్ 2021 చివరి నాటికి ఆ శాతం 25కి పెంచేలా ఉద్యోగుల‍్ని ప్రోత్సహిస్తున్నట్లు టీసీఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో ఈ ఐబ్రిడ్ వర్క్ కల్చర్ పై టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్‌జీ సుబ్రమణియం స్పందించారు. 2025 నుంచి పూర్తిగా ఈ ఐబ్రిడ్ వర్క్ కల్చర్‌ను అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగా టీసీఎస్ సంస్థ 25 శాతం ఉద్యోగులు ఆఫీస్‌నుంచి పనిచేసే విధానం పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: గుడ్ న్యూస్: వారంలో 3 రోజులే పని..! వచ్చే ఏడాది నుంచే అమలు..?!
Comments
Please login to add a commentAdd a comment