రిటర్న్ టూ ఆఫీస్ వర్క్ పాలసీ పాటించని ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ కొట్టి పారేసింది. వెలుగులోకి వచ్చిన నివేదికలు నిరాధారమైనవని టీసీఎస్ ప్రతినిధి అధికారిక ప్రకటన చేశారు. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు వచ్చేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అంతే తప్పా సిబ్బంది కెరియర్‌ని ప్రమాదంలోకి నెట్టేలా తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
నెలలో కనీసం 12 రోజులు ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని టీసీఎస్ మెమోలు పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎవరైతే సంస్థకు విరుద్దంగా వ్యవహరిస్తారో వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని నోటీస్‌లో హెచ్చరించింది. ఆ నివేదికలపై టీసీఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ..‘గత కొన్ని నెలలుగా దేశీయంగా పనిచేస్తున్న ఉద్యోగులు అసోసియేట్ కార్యాలయానికి తిరిగి రావాలని, వారానికి 3 రోజులు ఆఫీస్‌లో పనిచేసేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
చదవండి👉 మూన్‌లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’
ఈ తరహా పని విధానం వల్ల అనుకున్న ఫలితాలను రాబట్టినట్లు తెలిపారు. అందుకే, సంస్థకు చెందిన మొత్తం ఉద్యోగులు కార్యాలయాల్లో వారానికి మూడు రోజులు పనిచేసే లక్క్ష్యంతో అందరం కలిసి పని చేస్తున్నామని అన్నారు. ఉద్యోగులు ఆఫీస్‌కు రాకపోతే వారిపై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి
గత ఏడాది ఉద్యోగులు 100 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు టీసీఎస్ తెలిపింది. కరోనా తగ్గుముఖం పట్టిన తరుణంలో సిబ్బంది వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని మెయిల్స్ పంపింది. టీసీఎస్ వర్క్ విధానం ప్రకారం.. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు ఆహ్వానిస్తుంది. ఇందులో, ఒక నిర్దిష్ట సమయంలో 25 శాతానికి మించకుండా కార్యాలయం నుండి ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ అవసరాల ఆధారంగా రోస్టరింగ్ ఉంటుందని, ఫ్రెషర్లు, అనుభవజ్ఞులైన ఉద్యోగుల్ని కార్యాలయానికి పిలుస్తున్నట్లు టీసీఎస్ సంస్థ ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో తెలిపింది.
చదవండి👉 లక్షల్లో ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్ సంచలనం!
Comments
Please login to add a commentAdd a comment