ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల్లో ఉద్యోగులు తొలగింపులు కొనసాగుతున్నాయి. కానీ ప్రముఖ దేశీయ టెక్నాలజీ కంపెనీల్లో పరిస్థితులు అందుకు విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కోవిడ్-19 తగ్గుముఖం పట్టి, కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్న తరుణంలో ఆయా టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పరిమితమైన ఉద్యోగుల్ని తిరిగి కార్యాలయాలకు రావాలని పిలుపునిస్తున్నాయి. కానీ, ఉద్యోగులు మాత్రం ‘ఆఫీస్‌కు వచ్చేది లేదు.. అవసరమైతే చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేస్తామని’ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు.
India's largest female employer, TCS, is now facing a mass resignation of female employees.
— Neha Nagar (@nehanagarr) June 12, 2023
As the company, the end of the work-from-home arrangement after 3 years of the pandemic.
This will make it difficult for women to balance their work and family responsibilities.
ఇటీవల టెక్ దిగ్గజం టీసీఎస్ రిమోట్ వర్క్‌లో ఉన్న ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని మెయిల్స్ పెట్టింది. దీంతో వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు సుముఖంగా లేని ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్లు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్‌ఆర్‌వో) మిలింద్ లక్కడ్ ఇటీవల సంస్థ వార్షిక ఫలితాల విడుదల సందర్భంగా ఇదే అంశాన్ని లేవనెత్తారు.
చదవండి👉 జీతం రూ.8కోట్లు..వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దన్నారని జాబ్‌కు రిజైన్ చేశాడు!
ఉద్యోగాలకు రాజీనామా
ఆఫీస్ నుంచి వర్క్ చేయాలనే సమాచారంతో రిజైన్ చేస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. వారిలో మహిళా ఉద్యోగులే ఎక్కువ. ఎందుకుంటే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి’ అని నొక్కి వక్కాణించారు. గత ఆర్ధిక సంవత్సరంలో మహిళలు, పురుషులతో కలిపి మొత్తం 20 శాతం మంది వర్క్ ఫోర్స్‌ను కోల్పోయినట్లు చెప్పిన ఆయన.. రిటర్న్ టూ ఆఫీస్ కొత్త పాలసీలో భాగంగా ఎంతమంది టీసీఎస్‌కు రిజైన్ చేశారనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.
కారణం అదేనా?
విచిత్రంగా, టీసీఎస్‌లో పురుషుల ఉద్యోగుల కంటే మహిళా ఉద్యోగులే వేరే సంస్థలో చేరే సంఖ్య అధికంగా ఉంది. అందుకు గల కారణాలు ఏంటనేది స్పష్టత లేనప్పటికీ.. కోవిడ్ విజృంభణతో మహిళా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుగుణంగా తమ భవిష్యత్‌ను నిర్ధేశించుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆఫీస్‌కు రావాలనే నిబంధనలతో సంస్థను వదిలి వెళ్లుతున్నారేమోనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు లక్కడ్. ఆఫీస్‌కు వస్తే పరిస్థితులు అవే చక‍్కబడతాయని పేర్కొన్నారు.
It's a concerning trend of avoiding work.#Women are often seen shying away from #responsibility and this tendency persists.
— NYAY PRAYAAS FOUNDATION (@NyayPrayaas) June 11, 2023
Nowadays, they prefer the comfort of home over office work.
TCS FEMALE EMPLOYEE RESIGN PROTESTING WFH#WomanEmpowerment#WomanLaziness pic.twitter.com/uzTTPiFdfA
టీసీఎస్ లక్ష్యం ఒక్కటే
టీసీఎస్ లక్ష్యం ఒక్కటే సంస్థలో లింగ వివక్ష లేకుండా చూడడం. అందుకే.. పురుషులు, స్త్రీలు ఇలా ఇద్దరిని సమానంగా నియమించుకునేలా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. సంస్థలో మొత్తం వర్క్ ఫోర్స్ 6,00,000 మంది ఉన్నారు. వారిలో 35 శాతం మహిళా ఉద్యోగులేనని వెల్లడించారు.
25శాతం మంది ఆఫీస్ నుంచే విధులు
ఇక, 20 శాతం మంది టీసీఎస్ ఉద్యోగులు ఆఫీస్ నుంచే పనిచేస్తున్నారని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ తెలిపారు. భవిష్యత్‌లో 25*25 శాతం వర్క్ మోడల్‌ను కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. ఈ వర్క్ పాలసీలో టీసీఎస్ దేశీ, విదేశీ ఉద్యోగుల్లో 25 శాతం మంది ఆఫీస్ నుంచి పనిచేస్తుంటే.. మరో 25 శాతం మంది ఇంటి నుంచి పనిచేయడమే దీని ముఖ్య ఉద్దేశం.
పెరిగిపోతున్న వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఫోర్స్
రోజులు గడుస్తున్న కొద్ది కోవిడ్-19 తర్వాత ఆఫీస్‌కు వస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 20 శాతం మంది అంటే సుమారు లక్షమంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి చెప్పి రిటర్న్ టూ ఆఫీస్‌కు మొగ్గుచూపుతున్నారు. అదే సమయంలో సిబ్బంది అందించే ఇతర ప్రోత్సహకాలు 5శాతం పెరిగినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
చదవండి👉 ఐటీ ఉద్యోగులు:పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్! ఆఫీస్‌కు రాలేం!
Comments
Please login to add a commentAdd a comment