కరోనా మహమ్మారి విలయతాండవం కారణంగా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసలుబాటుని కల్పించాయి. గత కొన్ని నెలలుగా వైరస్ తగ్గుముఖం పట్టడంతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా దాదాపు పూర్తయింది. ఈ తరుణంలో కోవిడ్ తగ్గుముఖం పట్టి యధావిధిగా కార్యకాలపాలు కొనసాగుతుండడంతో కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్‌కు సిస్టమ్‌కు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాయి.
తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులను వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులో పని చేయాలని కోరింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపింది. టీసీఎస్ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో.. ఇప్పటికే సీనియర్ ఉద్యోగులు ఆఫీస్ నుంచి పని చేస్తున్నారని పేర్కొంది. ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులైనా ఆఫీసు నుంచి పని చేయాలని, అందుకు తగ్గట్టు సన్నద్ధం కావాలని సూచించింది.
రిటర్న్ టూ ఆఫీస్ మోడల్ ప్రకారం.. 25/25 ప్లాన్‌ను మరింత నియంత్రిత పద్ధతిలో అమలు చేయాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతానికి, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు గుడువు తేదిని మాత్రం తెలపలేదు. అయితే కొత్త వర్కింగ్ ప్లాన్ ప్రకారం.. వారి ప్రాజెక్ట్‌ల కోసం చేసిన ఏర్పాట్ల గురించి సంబంధిత మేనేజర్‌లను సంప్రదించాలని సూచించింది. అలాగే ఉద్యోగుల రోస్టరింగ్ పద్థతి ప్రాజెక్ట్ అవసరాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment