ఆసియా కప్ 2023 నిర్వహణపై సందిగ్ధత వీడింది. పీబీసీ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోక్‌కు ఓకే చెప్పిన ఆసియా క్రికెటర్ కౌన్సిల్(ఏసీసీ) గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇక ఆసియా కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో రానుంది. కాగా ఆసియా కప్ నిర్వహణలో పీసీబీ ప్రతిపాదనను అంగీకరించిన ఏసీసీకి.. పీసీబీ చైర్మన్ నజమ్ సేథీ కృతజ్ఞతలు తెలిపారు. ఆసియా కప్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాగానే నజమ్ సేథీ మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ తన ట్విటర్‌లో షేర్ చేసింది.
నజమ్ సేథీ మాట్లాడుతూ.. ''ACC ఆసియా కప్ 2023 కోసం మా హైబ్రిడ్ వెర్షన్ ఆమోదించింనందుకు నేను సంతోషిస్తున్నా. ఆసియా కప్ హోస్ట్‌గా మేము ఉండడం.. భారత్ పాకిస్తాన్ రాలేని కారణంగా శ్రీలంక తటస్థ వేదికగా ఉండనుంది. అయితే గత 15 ఏళ్లలో ఆసియా కప్ ద్వారా టీమిండియా పాకిస్తాన్‌లో అడుగుపెడుతుందని అనుకున్నాం. కానీ బీసీసీఐ పరిస్థితి మాకు అర్థమైంది. మాలాగే బీసీసీఐకి కూడా బార్డర్ దాటి పాక్‌లో ఆసియా కప్ ఆడేందుకు వారి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌తో పాటు ఆమోదం కావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగదని తెలుసు. కానీ మా ప్రతిపాదనను అర్థం చేసుకున్న ఏసీసీకి కృతజ్ఞతలు.'' అంటూ చెప్పుకొచ్చాడు.
کرکٹ کے شائقین کے لیے بڑی خوشخبری
— Pakistan Cricket (@TheRealPCB) June 15, 2023
ایشیا کپ ایک بار پھر پاکستان میں۔ پاکستان کرکٹ بورڈ کی مینجمنٹ کمیٹی کے چیئرمین نجم سیٹھی کا پیش کردہ ہائبرڈ ماڈل منظور, ایشیا کپ31 اگست سے17 ستمبر تک ہوگا۔ ابتدائی میچز پاکستان میں ہونگے جس کے بعد بقیہ میچز سری لنکا میں کھیلے جائیں گے۔ pic.twitter.com/r9jUZ8jCGX
ఇక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. పాకిస్తాన్‌లో 4 మ్యాచ్‌లు... శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి.
గ్రూప్ దశ తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్ ఫోర్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ ఫోర్’ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. పాకిస్తాన్‌లోని నాలుగు మ్యాచ్‌లకు లాహోర్ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్‌కప్ జరగడంతో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్‌లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment