
న్యూఢిల్లీ: సిమెంట్ కంపెనీ ఏసీసీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన మూడో త్రైమాసిక కాలంలో 15 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది క్యూ3లో రూ.182 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది క్యూ3లో రూ.209 కోట్లకు పెరిగిందని ఏసీసీ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,141 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.3,466 కోట్లకు పెరిగిందని ఏసీసీ ఎమ్‌డీ, సీఈఓ నీరజ్ అఖోరి చెప్పారు.
దీంట్లో సిమెంట్ విభాగం ఆదాయం రూ.3,185 కోట్లుగా, రెడీ మిక్స్ కాంక్రీట్ విభాగం ఆదాయం రూ.303 కోట్లుగా ఉన్నాయని వివరించారు. మొత్తం వ్యయాలు రూ.2,877 కోట్ల నుంచి రూ.3,160 కోట్లకు చేరాయని తెలిపారు. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment