Cement
-
కేశోరామ్ విడదీత మార్చి1న
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ రంగ దిగ్గజం అ్రల్టాటెక్ బోర్డు కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు చెందిన సిమెంట్ బిజినెస్ విడదీతకు నిర్ణయించింది. దీంతో 2025 మార్చి1 నుంచి విడదీత పథకం అమలుకానున్నట్లు అ్రల్టాటెక్ సిమెంట్ పేర్కొంది. దీని ప్రకారం కేశోరామ్ ఇండస్ట్రీస్ నుంచి సిమెంట్ బిజినెస్‌ను విడదీసి అ్రల్టాటెక్ సిమెంట్‌లో విలీనం చేస్తారు. మంగళవారం సమావేశమైన బోర్డు 1:52 నిష్పత్తిలో ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అ్రల్టాటెక్ వెల్లడించింది. కేశోరామ్ ఇండస్ట్రీస్ వాటాదారులకు తమ వద్ద గల ప్రతీ 52 షేర్లకుగాను 1 అ్రల్టాటెక్ షేరును జారీ చేస్తారు. కేశోరామ్ ప్రిఫరెన్స్ వాటాదారులకు 7.3 శాతంతో 54.86 లక్షల మార్పిడికి వీలుకాని రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల(ఎన్సీఆర్పీ)ను జారీ చేయనుంది.90 లక్షల(5 శాతం) క్యుములేటివ్ ఎన్సీఆర్పీల స్థానే వీటిని కేటాయించనుంది. అంతేకాకుండా 19.19 లక్షల ఆప్షనల్లీ కన్వర్టిబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల స్థానే 7.3 శాతంతో 8.64 లక్షల ఎన్సీఆర్పీలను జారీ చేయనుంది. ఈ పథకానికి 2023 నవంబర్ 30న రెండు కంపెనీల బోర్డులూ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆపై సీసీఐ, ఎన్సీఎల్టీ తదితర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు సైతం లభించాయి.కాగా.. సిమెంట్ బిజినెస్ విడదీత తదుపరి ట్రాన్స్పరెంట్ పేపర్, రేయాన్ విభాగాలతో కేశోరామ్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మరోపక్క అ్రల్టాటెక్‌కు వార్షికంగా 7 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యం జత కలవనుంది. ప్రస్తుత అ్రల్టాటెక్ సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 183 మిలియన్ టన్నులుకాగా.. సిమెంట్ తయారీలో చైనా వెలుపల ప్రపంచంలోనే మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. -
వెల్లుల్లిని కొంటున్నారా.. ఇది తెలిస్తే
ఘాటైన వాసన దాని సహజ లక్షణం. అందుకే దాన్ని చూడగానే చాలామంది ముక్కు చిట్లాస్తారు. కానీ అదిలేని వంటిల్లు సాధారణంగా ఉండదు. ఎందుకంటే ఆ ఘాటే నోరూరించే రుచికి కారణం. ఆ ఘాటే ఆరోగ్యానికి అద్భుతమైన ఔషదం. అందుకే పప్పు నుంచి చికెన్ దాకా ఏది వండాలన్నా వెల్లుల్ని ఉండాల్సిందే. అలాంటి దివ్య ఔషదాలున్న వెల్లుల్ని ధరలు విపరీతంగా ఉన్నాయి. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు కాసుల కక్కుర్తికోసం అడ్డదార్లు తొక్కుతున్నారు.మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సిమెంట్‌తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో వెల్లుల్ని పొట్టు ఒలిచిన తర్వాత రాయిలా గట్టిగా ఉండడం మనకు కనిపిస్తుంది. ఆ దృశ్యాలు ఇప్పుడు వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో కొన్ని కూరగాయల మార్కెట్లలో నకిలీ వెల్లుల్లిని విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తాజా వెలుగులోకి వచ్చిన కొనుగోలు దారులలో భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న వెల్లుల్ని స్వచ్ఛతపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.देशभर में लहसुन के दाम फिलहाल आसमान छू रहे हैं। इस बीच एक हैरान करने वाला मामला सामने आया है, जहां महाराष्ट्र के अकोला में कुछ फेरीवाले नागरिकों को सीमेंट से बना नकली लहसुन बेचकर धोखा दे रहे हैं। #Garlic #Maharashtra #Akola इनपुट्स: धनंजय साबले pic.twitter.com/Q4v1hZBhR9— सत्य सनातन भारत (Modi ka parivar)🚩🙏🕉️🙏🕉 (@NirdoshSha33274) August 18, 2024 -
మరో సిమెంట్ కంపెనీపై అదానీ కన్ను?
దేశీయంగా సిమెంట్ పరిశ్రమలో వేగంగా దివాలా చర్యలను ఎదుర్కొంటున్న జైప్రకాశ్(జేపీ) అసోసియేట్స్‌కు చెందిన జేసీ సిమెంట్స్‌ను అదానీ కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అల్ట్రాటెక్, అదానీ గ్రూప్, దాల్మియా, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ రంగంలో ఇప్పటికే భారీ ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. సిమెంట్ తయారీలో అదానీ గ్రూప్.. దిగ్గజ కంపెనీలు ఏసీసీ, అంబుజాలోని ప్రధాన వాటాను కొనుగోలు చేసి దేశంలోనే రెండో పెద్ద సంస్థగా నిలిచింది. ఈ పరిశ్రమ అభివృద్ధిపై అదానీ గ్రూప్ ఎంతో ఆసక్తిగా ఉందని నిపుణులు చెబుతున్నారు. జేపీ సిమెంట్స్‌ను కూడా ఆ గ్రూప్ కొనుగోలు చేసే వీలుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జేపీ సిమెంట్స్ 9 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒకవేళ ఈ కంపెనీని అదానీ కొనుగోలు చేస్తే అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావాజూన్ మొదటి వారంలో జేపీ గ్రూప్‌పై దివాలా చట్టం పరంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ దరఖాస్తు చేయడంతో అలహాబాద్‌లోని జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) కోర్టు జేపీ అసోసియేట్స్‌పై దివాలా చట్ట ప్రక్రియను ప్రారంభించింది. జేపీ గ్రూప్ ఆధ్వర్యంలోని సిమెంట్ ఉత్పత్తికి ఉపయోగపడే లైమ్‌స్టోన్ గనులు, విద్యుత్ ప్లాంటుసహా సంస్థ ఆస్తులను పొందేందుకు అదానీ గ్రూప్ సన్నాహాలు మొదలు పెట్టే వీలున్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకూ జేపీ ఆస్తుల విక్రయానికి ఎలాంటి ఆదేశాలు మాత్రం జారీకాలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2022, సెప్టెంబర్ 15 వరకు జేపీ గ్రూప్ అప్పులు రూ.6,893 కోట్లుగా ఉన్నట్లు తేలింది. -
సిమెంట్ వాడకుండా.. గోరువెచ్చని ఇల్లు!
బెల్లం, పసుపు, మెంతి ఆకు, వేప ఆకు... ఇదంతా ఇప్పుడు కిచెన్ మెటీరియల్ మాత్రమే కాదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఈ నిజానికి నిదర్శనం కోసం రాజస్థాన్ కెళ్లాల్సిందే. రాజస్థాన్ లోని అల్వార్‌కు చెందిన ఆర్కిటెక్ట్ శిప్రా సింఘానియా తన మేధను రంగరించి ఇల్లు కట్టుకుంది. అందరూ సిమెంట్, ఇసుక కలిపి ఇల్లు కడుతుంటే మీరెందుకిలా కట్టుకున్నారని అడిగితే ఆమె చెప్పే సమాధానమేమిటో చూద్దాం...‘‘మాది ఎడారి రాష్ట్రం. ఉష్ణోగ్రతలు వేసవిలో 41 డిగ్రీలకు చేరుతాయి, శీతాకాలంలో ఎనిమిది డిగ్రీలకు పడిపోతాయి. ఆ వేడిని భరించడమూ కష్టమే, అంత చలిని కూడా తట్టుకోలేం. ఇంటి నిర్మాణం ఈ ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే విధంగా ఉండాలని కోరుకున్నాను. అందుకోసం బురదమట్టి, సున్నపురాయిలో వేపాకులు బెల్లం, పసుపు, మెంతి ఆకు వంటి అనేక పదార్థాలను సమ్మిళితం చేసి ఇల్లు కట్టుకున్నాను. నిజానికి ఈ ఫార్ములా నేను కొత్తగా కనిపెట్టినదేమీ కాదు.ఇంటి లోపల అధునాతన సౌకర్యాలతో..భవన నిర్మాణంలో సిమెంట్ ఉపయోగించడానికి ముందు మనదేశంలో పాటించిన విధానాన్నే పునరుద్ధరించాను. ఇది రెండువేల చదరపు అడుగుల నిర్మాణం. పైకప్పు కేంద్రభాగం 23 అడుగుల ఎత్తు ఉంది. ఇందుకోసం స్వయంగా నేనే డిజైన్ గీసుకున్నాను. వేపాకు చెద పురుగుల నుంచి రక్షణనిస్తుంది. బెల్లం, మెంతిలోని జిగురుకు నిర్మాణ ముడిసరుకులో ఇతర వస్తువులను గట్టిగా పట్టుకునేటంతటి సామర్థ్యం ఉంటుంది.ఈ నిర్మాణంలో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తాయి. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జీరో సిమెంట్ నిర్మాణం అన్నమాట’’ అని చెప్పారు శిప్రా సింఘానియా. ఈ విధమైన నిర్మాణ శైలి ఇప్పుడిప్పుడే అందరి దృష్టిలో పడుతోంది. బహుశా ఇక నుంచి ఆ ఇంటిని ‘శిప్రా సింఘానియా ఇల్లు’ అని చెప్పుకుంటారేమో. ఇంతకీ ఈ ఇల్లు ఎండను, చలిని ఎంత మేర తగ్గిస్తుందంటే వేడిని కనీసంగా ఎనిమిది డిగ్రీలు తగ్గిస్తుంది. శీతాకాలంలో పదహారు డిగ్రీలకు తగ్గకుండా కాపాడుతుంది.ఇవి చదవండి: 'నిద్ర'కూ ఓ స్టార్టప్.. సూపర్ సక్సెస్! -
శ్రీ సిమెంట్ ఉత్పత్తి షురూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రభుత్వ సహకారంతో నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 6 నెలల ముందుగానే ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా శ్రీ సిమెంట్ రికార్డు సృష్టించింది. గతేడాది విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకున్న శ్రీ సిమెంట్ రికార్డు సమయంలోనే యూనిట్‌ను సిద్ధం చేసింది. పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద రూ.2,500 కోట్లతో ఏర్పాటు చేసిన సిమెంట్ పరిశ్రమ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్టు శ్రీ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ అకోరే ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రారం¿ోత్సవ కార్యక్రమాలు నిర్వహించకుండానే ఉత్పత్తిని ప్రారంభించినట్టు కంపెనీ అధికారులు వెల్లడించారు. ఏటా 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన దాచేపల్లి యూనిట్‌తో శ్రీ సిమెంట్ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 56.4 మిలియన్ టన్నులకు చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అవసరాలను తీర్చేవిధంగా దాచేపల్లిలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు శ్రీ సిమెంట్ ప్రకటించింది. ఈ యూనిట్ రాకతో మొత్తం 2,000 మందికి ఉపాధి లభించిందని, ఇందులో అత్యధికంగా స్థానిక యువతకే ప్రాధాన్యతను కల్పించామని పేర్కొంది. దేశంలోనే తొలి పర్యావరణహిత యూనిట్ పూర్తిగా పర్యావరణహితంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దాచేపల్లి యూనిట్ నిర్మించినట్టు నీరజ్ తెలిపారు. ఈ యూనిట్‌కు అవసరమయ్యే ఇంధన వినియోగంలో 30 శాతం మునిసిపల్ వ్యర్థాలు, బయోమాస్‌తో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించి 30 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్న తొలి సిమెంట్ యూనిట్‌గా దాచేపల్లి రికార్డులకు ఎక్కింది. అదేవిధంగా సున్నపురాయి తవ్వకాన్ని కూడా ప్రయోగాత్మకంగా చేపట్టడం ద్వారా ఇంధన పొదుపు చేస్తున్నట్టు తెలిపారు. భూ మట్టానికి 40 అడుగుల దిగువన సున్నపురాయి క్రషింగ్‌ను చేపట్టడం ద్వారా డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించగలిగినట్టు వివరించారు. భారీగా విస్తరణ భంగర్బ్రాండ్ పేరుతో శ్రీ సిమెంట్ భారీ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మరో 13 యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఏడాదికి 56.4 మిలియన్ టన్నులుగా ఉన్న సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 2028 నాటికి 80 మిలియన్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2025 నాటికి మరో 5 యూనిట్లను వాణిజ్యపరంగా ఉత్పత్తిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
Fact Check: ఈనాడు కథనానికి ఇంజనీరు బలి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ భవనాల నిర్మాణానికి తెచ్చిన సిమెంట్‌ను అవసరమైన చోట్ల వాడామని, బిల్లులు వచ్చిన తర్వాత వెనక్కి తెప్పిస్తున్నామని ‘ఈనాడు’ పత్రికకు వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా వక్రభాష్యాలు చెబుతూ కథనాలను ప్రచురించింది. దీంతో ఒత్తిడికి గురైన విజయనగరం జిల్లా రాజాం పంచాయతీరాజ్ జేఈ (కాంట్రాక్ట్ ఉద్యోగి) వి.రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను వైఎస్సార్సీపీ నాయకులకు ముడిపెడుతూ ఈనెల 30వతేదీన ఈనాడు తప్పుడు కథనాలను ప్రచురించింది. ఈనెల 29న ఉదయం రేగిడి మండల జేఈ (కాంట్రాక్టు) వి.రామకృష్ణ రాజాం పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు మంగళవారం విచారణ ప్రారంభించారు. గ్రామ సచివాలయాల వారీగా వచ్చిన సిమెంట్ బస్తాలు, వినియోగంపై ఇంజినీరింగ్ అసిస్టెంట్లను రాజాం సీఐ ఎస్.శ్రీనివాస్ ఆరా తీశారు. అవసరాన్ని బట్టి ఒక సచివాలయం నుంచి మరో సచివాలయం పరిధిలో భవనాల నిర్మాణానికి సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈనెల 25న ‘ఆ సిమెంట్ బస్తాల మాటేమిటి?’ శీర్షికతో ఈనాడులో కథనం వచ్చినప్పటి నుంచి తన భర్తపై ఒత్తిళ్లు ప్రారంభమైనట్లు రామకృష్ణ భార్య ఉమాదేవి వాపోతున్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, సిమెంట్ బస్తాలు వేరే సచివాలయం పరిధిలోని భవనాలకు సరఫరా చేశామని రామకృష్ణ మొత్తుకున్నా ‘ఈనాడు’ కథనంపై వివరణ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో రామకృష్ణ మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు!
నిర్మాణ రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతమైన భవనాలు ఈ రోజుకీ పురుడుపోసుకుంటున్నాయి. ఇలాంటి భవనాలు లేదా నగరాల నిర్మాణానికి కావాల్సిన ప్రధానమైన ముడిపదార్ధాలు సిమెంట్, ఉక్కు (స్టీల్), ఇసుక. 2020లో ప్రపంచంలో ఈ ముడిపదార్ధాల ఉత్పత్తి ఎంత? ఏ దేశంలో ఎక్కువ ఉత్పత్తి ఉంది.. వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిమెంట్ అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, 2020లో అత్యధికంగా సిమెంట్ ఉత్పత్తి చేసిన దేశాల జాబితాలో చైనా (2200 మిలియన్ టన్నులు) అగ్ర స్థానంలో, రెండవ స్థానంలో భారత్ (340 మిలియన్ టన్నులు) నిలిచాయి. చివరి స్థానంలో సౌత్ కొరియా మొదలైన దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సిమెంట్ ఉత్పత్తి 2020లో 4.1 బిలియన్ టన్నులు. ప్రపంచలోని అన్ని దేశాలు ఉత్పత్తి చేసిన సిమెంటుతో ఒక దిమ్మె నిర్మిస్తే.. అది 1,195 మీటర్ల పొడవు, 1.7 బిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉంటుంది. బరువు ఏకంగా 4.1 బిలియన్ టన్నులు ఉంటుంది. ఈ దిమ్మె పొడవు బుర్జ్ ఖలీఫా కంటే 365 మీటర్లు ఎక్కువ ఉంటుందన్నమాట. సిమెంట్ తయారు చేసేటప్పుడు టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్ (CO2) విడుదలవుతుంది, అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. కాంక్రీట్ ఉత్పత్తిలో అధిక కార్బన్ ఉద్గారాలు, నీటి వినియోగాన్ని తగ్గించేందుకు, స్వీడిష్ పవర్ కంపెనీ వాటెన్ఫాల్ ఓ ప్రత్యేకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా CO2 ఉద్గారాలు బాగా తగ్గుతాయి. ఉక్కు (స్టీల్) సిమెంట్ తరువాత నిర్మాణానికి కావాల్సిన ముఖ్యమైన లోహం ఉక్కు. 2020లో ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి మొత్తం 180 కోట్ల టన్నుల బరువైన ఉక్కుని ఉత్పత్తి చేశాయి. అంతకు ముందు 1900 నుంచి ఉక్కు పరిశ్రమ 2500 కోట్ల టన్నుల స్టీల్ స్క్రాప్‌ను రీసైకిల్ చేసింది. దీని వల్ల 3500 కోట్ల టన్నుల ఇనుము వినియోగం, 1800 కోట్ల టన్నుల బొగ్గు వినియోగం తగ్గింది. ప్రపంచ దేశాల్లో ఉత్పత్తి అయిన ఉక్కుతో ఓ దిమ్మె నిర్మిస్తే.. అది 610 మీటర్ల ఎత్తు, 227.8 మిలియన్స్ ఘనపు మీటర్ల పరిమాణం, 180 కోట్ల టన్నుల బరువుతో నిర్మితమవుతుంది. ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు! రంగాల వారీగా రికవరీ రేట్లు ఇసుక నిర్మాణ రంగంలో మరో ముఖ్యమైన మెటీరియల్ ఇసుక, కంకర (చిన్న రాళ్లు). 2020లో ఉత్పత్తి అయిన ఇసుక 26.5 కోట్ల టన్నులు. ఇంత ఇసుకతో ఏకంగా 555 మీటర్ల ఎత్తు, 171 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంతో ఓ దిమ్మె నిర్మించవచ్చు. ప్రస్తుతం చాలా నగరాల్లో ఇసుక అవసరం లేకుండానే పెద్ద పెద్ద భవనాలను గాజు, ఇతర మెటీరియల్స్ ఉపయోగించి ఎంతో అందంగా నిర్మిస్తున్నారు. -
సిమెంట్‌కు ఇన్ఫ్రా దన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్‌కు డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. మౌలిక వసతుల కోసం ప్రభుత్వం చేస్తున్న భారీ వ్యయాలు ఈ వృద్ధికి దోహదం చేస్తాయని వెల్లడించింది. క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం.. రోడ్లు, రైల్వే లైన్లు, విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరులు, నగరాభివృద్ధి, టెలికం, పోర్టులు, విమానాశ్రయాలు, నీరు వంటి మౌలిక వసతులకు 2022–23తో పోలిస్తే రూ.1.6 లక్షల కోట్ల అదనపు బడ్జెట్ కేటాయింపులతో ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.5.9 లక్షల కోట్లకు చేరింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో పటిష్ట ప్రయాణాన్ని కొనసాగిస్తూ సిమెంట్ డిమాండ్ 2023–24లో 10–12 శాతం అధికమై 440 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉంది. సిమెంట్ డిమాండ్ 2022–23లో 12 శాతం, 2021–22లో 8 శాతం ఎగసింది. నిర్వహణ లాభం జూమ్.. స్థిరంగా ఉన్న సిమెంట్ ధరలకుతోడు విద్యుత్, ఇంధన ఖర్చులు కాస్త తగ్గడంతో సిమెంట్ తయారీదారుల నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023–24లో టన్నుకు రూ.200 పుంజుకునే చాన్స్ ఉంది. మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం చేస్తున్న వ్యయం సిమెంట్ డిమాండ్‌ను నడిపిస్తోంది. సిమెంట్ వార్షిక అమ్మకాల్లో మౌలిక సదుపాయాల వాటా 30 శాతం ఉంది. ప్రధాన మౌలిక సదుపాయాల రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఈ ఆర్థిక సంవత్సరంలో 38 శాతం పెరిగాయి. బడ్జెట్ మొత్తంలో చేసిన ఖర్చు 2023 జూలై వరకు 40 శాతంగా ఉంది. సిమెంట్ డిమాండ్‌లో 55 శాతం వాటాను కలిగి ఉన్న గృహ విభాగం స్థిర వృద్ధిని సాధిస్తుందని అంచనా. సరసమైన గృహాలకు ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్దతు డిమాండ్‌ను పెంచుతుంది. రెండంకెల వృద్ధికి.. 2023 ఏప్రిల్–సెప్టెంబర్‌లో సిమెంట్ డిమాండ్ 13–15 శాతంగా ఉంది. అధిక బేస్, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్రం చేయబోయే మూలధన వ్యయం కొంత మందగించవచ్చు. దీంతో ద్వితీయార్థంలో డిమాండ్ 7–9 శాతానికి మధ్యస్థంగా ఉండవచ్చు. అయితే ఆలస్యమైన, అసమాన రుతుపవనాల కారణంగా గ్రామీణ గృహాల డిమాండ్ కొంత తగ్గే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లే మూడవ త్రైమాసికంలో కార్మికుల పరిమిత లభ్యత కూడా పాత్ర పోషిస్తుంది. బలమైన ప్రథమార్ధం ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధికి దోహదం చేస్తుంది. దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు 2023 ఏప్రిల్–ఆగస్ట్ మధ్య 2.5 శాతం పడిపోయాయి. సిమెంట్ ధరలు ఇటీవల స్వల్పంగా పెరగడంతో అధికం అవుతున్న డిమాండ్ తయారీ కంపెనీల ఆదాయ వృద్ధికి సహాయపడుతుంది. -
అదానీ చేతికి సంఘీ సిమెంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభిన్న రంగాల్లో ఉన్న అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్.. హైదరాబాద్ కంపెనీ సంఘీ సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. డీల్ విలువ రూ.6,000 కోట్లు. ఇందులో భాగంగా ప్రమోటర్లకు చెందిన 72.72% వాటాల కొనుగోలుకు రూ.4,500 కోట్లను అంబుజా పెట్టుబడి పెట్టనుంది. అలాగే సంఘీ సిమెంట్‌పై ఉన్న రూ.1,500 కోట్ల రుణాల బాధ్యతను సైతం స్వీకరించనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడి కానుంది. సంఘీ సిమెంట్‌కు గుజరాత్‌లోని కచ్ వద్ద 61 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక తయారీ సామర్థ్యం గల సిమెంట్ ప్లాంటుతోపాటు 66 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల క్లింకర్ ప్లాంట్ ఉంది. అదానీ గ్రూప్‌లోని అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌కు సంయుక్తంగా ఏటా 7 కోట్ల టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. 2030 నాటికి 14 కోట్ల టన్నులకు చేర్చాలన్నది లక్ష్యం. -
దాల్మియా డీల్: సిమెంట్ బిజినెస్ నుంచి ‘జేపీ’ ఔట్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ జైప్రకాష్ అసోసియేట్స్(జేఏఎల్), సహచర సంస్థ నుంచి సిమెంట్, సంబంధ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు దాల్మియా భారత్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 5,666 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువ ప్రకారం తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. పూర్తి అనుబంధ సంస్థ దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్(డీసీబీఎల్) ద్వారా క్లింకర్, సిమెంట్, పవర్ ప్లాంట్ల కొనుగోలుకి జేపీ గ్రూప్ సంస్థలతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా 9.4 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల(ఎంటీపీఏ) సిమెంట్ ప్లాంట్లతోపాటు.. 6.7 ఎంటీపీఏ క్లింకర్, 280 మెగావాట్ల థర్మల్ విద్యుత్ యూనిట్లను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. ఈ ఆస్తులు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో విస్తరించి ఉన్నట్లు దాల్మియా పేర్కొంది. ఈ కొనుగోలుతో మధ్యభారతంలోనూ కార్యకలాపాలు విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇదే సమయంలో తమ వద్ద మిగిలిన సిమెంట్ ఆస్తులను విక్రయించడం ద్వారా సిమెంట్ బిజినెస్ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు జేపీ గ్రూప్ వెల్లడించింది. ఇందుకు దాల్మియా భారత్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. రుణ భారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది. విస్తరణ లక్ష్యంతో..: 2027కల్లా దేశవ్యాప్త సిమెంట్ కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంలో భాగంగా జేపీ ఆస్తుల కొనుగోలుతో దాల్మియా భారత్ ముందడుగు వేసింది. 2027కల్లా 75 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని అందుకోవాలని ఆశిస్తోంది. ఈ బాటలో 2031కల్లా 110-130 ఎంఎన్టీకి చేరాలని ప్రణాళికలు వేసింది. జేపీ ఆస్తుల కొనుగోలు ద్వారా దాల్మియా భారత్ సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 45.3 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్రస్తుత సామర్థ్యం 35.9 ఎంటీపీఏగా ఉంది. సిమెంట్ తయారీకి దాల్మియా ప్రస్తుతం దేశంలో నాలుగో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. అల్ట్రాటెక్, అదానీ సిమెంట్(ఇటీవలే ఏసీసీ, అంబుజాలను సొంతం చేసుకుంది), శ్రీ సిమెంట్ తొలి మూడు ర్యాంకులను ఆక్రమిస్తున్నాయి. -
జేసీ మనుషులమంటూ దౌర్జన్యం
చిలమత్తూరు(శ్రీసత్యసాయి జిల్లా): తాము జేసీ ప్రభాకరరెడ్డి మనుషులమని, తమను ప్రశ్నించినా... చర్యలను అడ్డుకున్నా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కర్ణాటక ప్రాంతానికి చెందిన కొందరు దౌర్జన్యానికి దిగారు. వివరాలు... రాష్ట్రంలో ప్రభుత్వ భవన నిర్మాణాలకు సరఫరా చేసిన సిమెంట్ కర్ణాటకకు యథేచ్ఛగా తరలిపోతోంది. వందలాది సిమెంట్ బస్తాలు కర్ణాటక ప్రాంతంలోని ప్రైవేట్ భవన నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం బాగేపల్లిలో ప్రైవేట్ భవన నిర్మాణానికి ఏపీ ప్రభుత్వ సిమెంట్ వినియోగిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న చిలమత్తూరు మండల అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఆ సమయంలో అక్కడి వారు అధికారులను అడ్డుకున్నారు. ఫొటోలు డెలిట్ చేయాలని బలవంతం చేశారు. తాము తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మనుషులమని, తాము తలుచుకుంటే అక్కడి నుంచి అడుగు కూడా పక్కకు వేయలేరంటూ బెదిరింపులకు దిగారు. అవసరమైతే జేసీ ప్రభాకరరెడ్డితో ఫోన్లో మాట్లాడిస్తామంటూ దౌర్జన్యానికి దిగారు. విచారణలు, దర్యాప్తులు ఏవైనా ఉంటే ఆంధ్రలో చూసుకోవాలని తమ ప్రాంతానికి వచ్చి ప్రశ్నిస్తే తిరిగి వెళ్లలేరంటూ హెచ్చరించడంతో మారు మాట్లాడకుండా అధికారులు వెనుదిరిగి వచ్చారు. ఈ విషయంగా చిలమత్తూరు ఎంపీడీఓ రామ్‌కుమార్‌ను వివరణ కోరగా... అక్కడ వినియోగిస్తున్న సిమెంట్ ఏపీ ప్రభుత్వం సరఫరా చేసిందేనని స్పష్టం చేశారు. అయితే అది చిలమత్తూరు మండలానికి సంబంధించినది కాదన్నారు. భవన యాజమాన్యం మాట్లాడిన తీరును బట్టి అది కచ్చితంగా అనంతపురం జిల్లా నుంచే సరఫరా అయినట్లుగా తెలుస్తోందన్నారు. దీనిపై లోతైన విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. -
రూ.390 సిమెంట్ బస్తా రూ.235కే!
సాక్షి, అమరావతి: గత రెండేళ్లుగా దేశమంతా సిమెంట్ ధరలు పెరుగుతున్నా రాష్ట్రంలో తక్కువ ధరలకే కంపెనీలు సిమెంట్ సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు, వివిధ అభివృద్ధి పనులకు సబ్సిడీ ధరకే సిమెంట్‌ను అందిస్తున్నాయి. రూ.390 సిమెంట్ బస్తాను రూ.235కే ఇస్తున్నాయి. ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్లకు కాకుండా నేరుగా సిమెంట్ కంపెనీలకే మొత్తాన్ని చెల్లిస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.970 కోట్లు వరకు ఆదా అయ్యింది. ధరల్లో వ్యత్యాసమున్నా తక్కువ ధరకే.. దేశంలో గత రెండేళ్లలో ఇళ్ల నిర్మాణాల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో సిమెంట్ బస్తా ధర దేశమంతా దాదాపు రూ.400కు చేరుకుంది. కంపెనీ, దూరాభారం ఆధారంగా ఈ మొత్తంలో రూ.10–20 వరకు తేడా ఉంటోంది. మన రాష్ట్రంలో రూ.380–390 మధ్య సిమెంట్ బస్తా ధర ఉంది. అయితే.. రాష్ట్రంలో సిమెంట్ కంపెనీలు ప్రభుత్వ భవన నిర్మాణ పనులకు గత రెండున్నరేళ్లుగా రూ.235కే సిమెంట్ బస్తాను అందిస్తున్నాయి. సిమెంట్ రేటులో భారీ తేడాల వల్ల అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోవడం, లేదంటే ఆటంకం కలగకూడదని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయా సిమెంట్ కంపెనీలతో చర్చలు జరిపింది. దీంతో అప్పుడు మార్కెట్లో రూ.330 దాకా ఉన్న సిమెంట్ బస్తాను రూ.235కే కంపెనీలు సరఫరా చేశాయి. అప్పటి నుంచి «సిమెంట్ ధరల్లో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా అదే ధరకు అందిస్తున్నాయి. ఇప్పటిదాకా 38.83 లక్షల టన్నుల సిమెంట్ సరఫరా.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల నిర్మాణ పనులకు ఇప్పటిదాకా 38,83,894 టన్నుల సిమెంట్‌ను రూ.235 సబ్సిడీ ధరకే ఆయా కంపెనీలు అందించాయి. గ్రామాల్లో ప్రస్తుతం ఒక్క పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలోనే దాదాపు 44,522 భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. వీటిలో రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల భవనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకోగా.. మరికొన్ని ముగింపు దశకు చేరుకున్నాయి. గ్రామాల్లో భవన నిర్మాణ పనులకే 14,98,941 టన్నుల సిమెంట్‌ను కంపెనీలు సరఫరా చేశాయి. మరో 2.19 లక్షల టన్నుల సిమెంట్ సరఫరా ప్రస్తుతం పురోగతిలో ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. 14.98 లక్షల టన్నుల్లో అత్యధికంగా 2.10 లక్షల టన్నులను భారతి సిమెంట్స్ సరఫరా చేయగా, ఆ తర్వాత 2.04 లక్షల టన్నులు అల్ట్రాటెక్ కంపెనీ సరఫరా చేసిందని తెలిపారు. అలాగే కేసీపీ, పెన్నా సిమెంట్స్ కంపెనీలు లక్ష టన్నులకుపైగా సరఫరా చేశాయన్నారు. బాబు ప్రభుత్వంలో నాసిరకం పనులు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సిమెంట్ ధరల్లో వ్యత్యాసం కారణంగా ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. దీంతో నాసిరకం పనులు జరిగాయని అధికారులు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో వేసిన అంతర్గత సిమెంట్ రోడ్లలో కొన్నింటిని ఇంజనీరింగ్ విజిలెన్స్ అధికారులు పరిశీలించగా మూడింట రెండొంతులు రోడ్లు ఏ మాత్రం నాణ్యత లేనివిగా తేలింది. ప్రభుత్వానికి భారీగా ఆదా.. గ్రామాల్లో నిర్మాణ పనులకు కంపెనీలు తక్కువ ధరకే సిమెంట్ సరఫరా చేయడంతో ప్రభుత్వానికి రూ.375 కోట్లు దాకా ఆదా అయిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని శాఖల ద్వారా జరిగిన పనుల్లో మొత్తం రూ.970 కోట్లు దాకా ఆదా జరిగిందన్నారు. మరోవైపు సబ్సిడీ ధరకు సిమెంట్ సరఫరాలో ఎక్కడా ఎటువంటి అవినీతి చోటు చేసుకోకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందుకోసం ‘వైఎస్సార్ నిర్మాణ్’ పేరుతో ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. -
సిమెంటుకు పెరగనున్న డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–8 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ‘దేశవ్యాప్తంగా 2022–23లో సిమెంట్ అమ్మకాలు దాదాపు 382 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకోవచ్చని అంచనా. గ్రామీణ గృహాలు, మౌలిక సదుపాయాల రంగాల నుండి బలమైన డిమాండ్ ఇందుకు కారణం. అధిక తయారీ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా పరిశ్రమకు నిర్వహణ లాభం 270–320 బేసిస్ పాయింట్స్ తగ్గి 16.8–17.3 శాతం నమోదు కావొచ్చు. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి కాలంలో సిమెంట్ ఉత్పత్తి 323 మిలియన్ మెట్రిక్ టన్నులు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 22 శాతం అధికం. తుఫాన్లు, అకాల వర్షాలతో 2021 నవంబర్‌లో సిమెంట్ డిమాండ్ పడిపోయింది. డిసెంబర్ నుంచి తిరిగి అమ్మకాలు పుంజుకున్నాయి. 2021–22లో ఉత్పత్తి 18–20 శాతం అధికమై కోవిడ్–19 ముందస్తు స్థాయి 355 మిలియన్ మెట్రిక్ టన్నులని అంచనా’ అని ఇక్రా వివరించింది. వ్యవసాయం, అందుబాటు ధర గృహాలు, మూలధన వ్యయం కోసం ఇటీవల బడ్జెట్లో రూ.9.2 లక్షల కోట్ల కేటాయింపులు జరగడం సిమెంట్ డిమాండ్‌కు ఊతమిస్తుందని ఇక్రా ఏవీపీ, సిమెంట్ విభాగం హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 545 మిలియన్ మెట్రిక్ టన్నులు. సిమెంట్ తయారీలో చైనా తర్వాత ప్రపంచంలో భారత్ రెండవ స్థానంలో ఉంది. చదవండి: ఆల్‌టైమ్ గరిష్టానికి రియల్టీ సెంటిమెంట్ -
నిర్దేశిత లక్ష్యం మేరకు సిమెంట్ అందించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా జరుగుతున్న నిర్మాణాలకు అవసరమైన సిమెంట్‌ను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అందించాలని సిమెంట్ కంపెనీలకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్ సూచించారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తగిన సహకారం అందించాలని కోరారు. మంగళవారం సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులిద్దరూ సమావేశమయ్యారు. నిర్దేశించిన మొత్తంలో 30 శాతం సిమెంట్ కూడా కొన్ని కంపెనీలు అందించలేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా సీఎం జగన్ లక్షలాది మందికి ఇళ్ల స్థలాలిచ్చారని, మొదటి దశలో దాదాపు 16 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, బల్క్ మిల్క్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు సహా ప్రభుత్వ విభాగాలకు పక్కా భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. నాడు–నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వీటన్నింటినీ వేగంగా పూర్తి చేసేందుకు సహకారం అందించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. సిమెంట్ కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ.. నిర్దిష్ట కాలవ్యవధిలో సిమెంట్ సరఫరాను పెంచుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, గనుల శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు -
పేదల ఇళ్లకు రాయితీపై 140 బస్తాల సిమెంట్
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రస్తుతం రాయితీపై ఇస్తున్న 90 బస్తాల సిమెంట్‌ను ఇకపై 140 బస్తాలకు పెంచుతున్నట్లు గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. తద్వారా లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సచివాలయం 4వ బ్లాక్‌లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం విశాఖపట్నంలో లక్ష మంది మహిళలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు ఫైలుపై తొలి సంతకం చేశారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు 140 బస్తాల సిమెంట్ ఇచ్చే ఫైలుపై రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి రమేష్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో లక్ష మంది మహిళలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుంటే కొందరు అడ్డుపడ్డారన్నారు. నవరత్నాల్లో మేలిమి రత్నం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకమని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిమందికే ఇళ్లు ఇచ్చారని.. నేడు కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంతృప్త స్థాయిలో ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక న్యాయం చేస్తున్న విప్లవవాది, అభినవ పూలే, బీఆర్ అంబేడ్కర్‌కు అసలైన వారసుడు వైఎస్ జగన్ అని ఉద్ఘాటించారు. కాగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డి. నాగేశ్వరరావు, రక్షణ నిధి, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్‌గుప్త, జాయింట్ ఎండీ శివశంకర్ జోగి రమేష్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. -
జనవరిలో మౌలిక రంగం వృద్ధి 3.7 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగ పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు జనవరిలో 3.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 1.3 శాతం. 2021 డిసెంబర్లో ఈ రేటు 4.1 శాతం. అధికారిక గణాంకాల ప్రకారం, బొగ్గు, సహజ వాయువు, సిమెంట్ పరిశ్రమల పనితీరు సమీక్షా నెల్లో కొంత మెరుగ్గా ఉంది. క్రూడ్ ఆయిల్, ఎరువుల ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది. బొగ్గు (8.2 శాతం), సహజ వాయువు (11.7 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (3.7 శాతం), సిమెంట్ (13.6 శాతం) ఉత్పత్తులు బాగున్నాయి. స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాల పనితీరు అంతంతమాత్రంగానే నమోదయ్యింది. కాగా, ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకూ గడచిన 10 నెలల్లో ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంటే, 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ధిలేకపోగా 8.6 క్షీణత నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 44 శాతం. రానున్న రెండు వారాల్లో ఐఐపీ జనవరి గణాంకాలు వెలువడనున్నాయి. -
తగ్గడంలే... ఇళ్ల ధరలు పెరుగుతాయట!
సాక్షి, వెబ్‌డెస్క్: అద్దె ఇళ్లలో ఉండే సవాలక్ష నిబంధనలకు తోడు కరోనా సంక్షోభం నేర్పిన పాఠాలతో సొంతిళ్లు అవసరమనుకునే వారి సంఖ్య పెరిగింది. అప్పు చేసైనా సరే ఇది నా ఇల్లు అనిపించుకుందామనే ప్రయత్నాలు పెరిగాయి. అయితే అంతకు ముందే ఇంటి నిర్మాణ రంగంలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సొంతింటికి కల మరోసారి మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షగానే మారుతోంది. స్టీలు ధరలకు రెక్కలు ఇంటి నిర్మాణ రంగంలో కీలకమైన స్టీలు ధరలు ఏడాది కాలంలో దాదాపు 30 శాతం పెరిగాయి. లాక్డౌన్ కంటే ముందు హోల్‌సేల్ మార్కెట్లో 8 మిల్లీమీటరు స్టీలు టన్ను ధర రూ.42,000 ఉండగా ఇప్పుడు టన్ను స్టీలు ధర రూ.57,00లకు చేరుకుంది. ఇదే తరహాలో సిమెంటు బ్యాగు ధర సగటున వంద రూపాయల వరకు పెరిగింది. వీటితో పాటు ఇంటి నిర్మాణంలో కీలకమైన కాపర్ ధర 40 శాతం, అల్యుమినియం ధర 60 శాతం పెరిగినట్టు డెవలపర్లు చెబుతున్నారు. డిమాండ్ పెరిగింది కరోనా కల్లోల సమయంలో అద్దె ఇళ్లలో ఎదురైన ఇబ్బందులతో సొంత ఇల్లు కావాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో నిర్మాణంలో ఉన్న వెంచర్లు, అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరిగింది. అయితే పెరిగిన ధరలు వారికి షాక్ ఇస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే సేవింగ్స్ చాలా ఖర్చుకావడం, ఎక్కువ మందికి జీతాల్లో కోతలు పడ్డాయి. ఈ తరుణంలో లోన్లు తీసుకుని ఇళ్లు కొందామనుకునే వారికి పెరుగుతున్న ధరలు అశనిపాతంలా మారాయి. కట్టాలన్నా కష్టమే డెవలపర్లు ఒకేసారి పెద్ద ఎత్తున సిమెంటు, స్టీలు కొనడం వల్ల హోల్‌సేల్ ధరలకు లభిస్తున్నాయి. కానీ జిల్లా కేంద్రాలు, ఇతర చిన్న పట్టణాల్లో ఇంటి నిర్మాణం స్వంతంగా చేపట్టాలనుకునే వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో టన్ను స్టీలు ధర 65,000 దగ్గర ఉంది. సిమెంటు బ్యాగు రూ. 400 దగ్గర లభిస్తోంది. దీంతో సొంతింటి కల భారంగా మారుతోంది. పెరిగిన లేబర్ కష్టాలు గతంలో బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిషాల నుంచి లేబర్ పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌తో పాటు పెద్ద ప్రాజెక్టులు, జిల్లా కేంద్రాల్లో పనికి వచ్చే వారు. లోకల్ లేబర్‌తో పోల్చితే వీరు తక్కువ కూలీలకే పనులకు వచ్చేవారు. వరుస లాక్డౌన్లు, కోవిడ్ నిబంధనల కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిన లేబర్‌లో చాలా మంది అక్కడే ఉండి పోయారు. దీంతో పని ప్రదేశాల్లో కూలీల కొరత ఏర్పడింది. డబుల్ కూలీ ఇస్తే తప్ప లేబర్ దొరికే పరిస్థితి లేదంటున్నారు డెవలపర్స్. 30 శాతం పెరుగుతాయి కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. మరోవైపు క్రమంగా నిర్మాణ రంగం కూడా గాడిన పడుతోంది. ధీర్ఘకాలం పాటు మధ్యలో ఆగిపోయిన భవనాల్లో తిరిగి పనులు ప్రారంభం అవుతున్నాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్ల ధరలు పెరిగిన మాట వాస్తవమేని, అయినా సరే ఇప్పుడు ఇళ్లు కొనడమే మంచిందని, పెరిగిన ముడి పదార్థాల ధరల వల్ల రాబోయే రోజుల్లో ఇళ్ల ధరలు కనీసం 30 శాతం వరకు పెరగవచ్చని క్రెడాయ్ ప్రతినిధులు అంటున్నారు. స్టీలు ధరల పెరుగుదల (టన్ను ధర ) స్టీలు సైజు 2020 ఫిబ్రవరి 2021 ఆగస్టు 8 ఎంఎం రూ.42,000 రూ.57,000 10 ఎంఎం రూ. 41,000 రూ.56,000 12 ఎంఎం రూ.40,5000 రూ 56,000 14 ఎంఎం రూ.41,000 రూ.56,000 16 ఎంఎం రూ.41,000 రూ. 56,000 -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సిక్మా ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) ప్రతినిధులు కలిశారు. కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి రూ.2 కోట్ల విలువైన 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేశారు. ఒక్కొక్కటి 10 లీటర్ల కెపాసిటీ ఉన్న కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసి వివరాలు అందజేసిన వారిలో ఎం.రవీందర్ రెడ్డి (డైరెక్టర్, మార్కెటింగ్, భారతీ సిమెంట్స్), డాక్టర్ ఎస్.ఆనంద్ రెడ్డి (ఎండీ, సాగర్ సిమెంట్స్), ఇంజేటి గోపినాథ్ (సీఈవో, సిక్మా) ఉన్నారు. చదవండి: ‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’ థర్డ్‌వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక -
ధరలన్నీ పైపైకి.. సొంతిల్లు కలేనా!
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్‌రెడ్డి. వికారాబాద్ పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో 150 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. లాక్‌డౌన్‌కు ముందే కట్టుకోవాలని భావించాడు. అప్పటి అంచనాల ప్రకారం ఒక అంతస్తు నిర్మించేందుకు రూ.15 లక్షలు అవుతాయని భావించాడు. కరోనా ప్రభావంతో నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి పనులు ప్రారంభించాడు. స్టీల్, ఇటుక, సిమెంట్, ఇతర సామగ్రి ధరలు పెరగడంతో మొదట తాను అంచనా వేసిన డబ్బులతో నిర్మాణం పూర్తయ్యేలా కనిపించడం లేదని చెబుతున్నాడు. ప్రస్తుత ధరల ప్రకారం ఒక అంతస్తుకు రూ.18 లక్షలు ఖర్చు కావొచ్చని చెబుతున్నాడు. ఇతడి పేరు అఖిలేశ్వర్. వికారాబాద్ మహావీర్ ఆస్పత్రికి వెళ్లే రోడ్డులో 120 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. గతేడాది ప్రారంభించాలని భావించాడు. వ్యక్తిగత కారణాలతో జాప్యం జరిగింది. అంతలోనే కరోనా లాక్డౌన్ రావడంతో కొన్నిరోజుల క్రితం ఇంటి పనులు ప్రారంభించాడు. సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుందని చెబుతున్నాడు. స్టీల్, సిమెంట్ ధరలకు రెక్కలు వచ్చాయని, వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారని ఆందోళన చెందుతున్నాడు. వికారాబాద్ అర్బన్: కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో సరుకుల తయారీ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. లాక్డౌన్ తర్వాత సిమెంటు, ఇసుక, ఐరన్ ధరలు అమాంతంగా పెరిగాయి. సొంతిల్లు కట్టుకోవాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో బిల్డర్లు, బడా కాంట్రాక్టర్లు 100 మందికి పైగానే ఉన్నారు. వీరిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20వేల మంది ఆధారపడి ఉంటారు. జిల్లాలో నెలవారీగా సరాసరి 1,500 టన్నుల ఐరన్, లక్ష బస్తాల వరకు సిమెంటు అమ్మకాలు జరుగుతుంటాయి. కరోనా సంక్షోభానికి ముందుతో పోలిస్తే సిమెంటు, కాళేశ్వరం ఇసుక, ఎలక్ట్రికల్, ఐరన్, లేబర్ చార్జీలు, పీవీసీ పైపుల ధరలు 34 శాతం నుంచి 45 శాతం వరకు పెరిగాయి. ధరలు పెరగడంతో 30 శాతం మేర అమ్మకాలు పడిపోయాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి ఆశలు కలగానే మిగిలిపోతున్నాయి. ధరలన్నీ పైపైకి.. మూడేళ్లతో పోలిస్తే బస్తా సిమెంటు ధర రూ.110 నుంచి 350 రూ. వరకు పెరిగింది. లాక్డౌన్ కంటే ముందు బస్తా సిమెంట్ రూ. 320 ఉండగా ప్రస్తుతం రూ. 350కి పెరిగింది. కాళేశ్వరం ఇసుక టన్ను రూ. 1000 నుంచి రూ. 1700 వరకు పెరిగింది. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టడంతో నిర్మాణదారులు ఇసుకను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటున్నాడు. ఇసుక ధరతో పోలిస్తే తెల్ల డస్టు ధర తక్కువ ఉండటంతో కొందరు దానిని వినియోగిస్తున్నారు. లోకల్ ఇసుకకు డిమాండ్ పెరిగింది. జిల్లాకు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఇటుకను తీసుకొస్తారు. లాక్డౌన్ కంటే ముందు ఒక్కో ఇటుక ధర రూ. 4 నుంచి రూ. 5 ఉండగా ప్రస్తుతం రూ. 6 నుంచి 7 పలుకుతోంది. పేదలు ఇల్లు నిర్మించుకుందామంటే ధరలు చూసి భయపడుతున్నారు. నిర్మాణ సమయంలో.. ఇల్లు నిర్మించే సమయంలో యజమాని సదరు బిల్డర్ లేదా కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించే సమయంలో ఒప్పందం కుదుర్చుకుంటారు. చదరపు అడుగు సివిల్ పనులకు (కేవలం సిమెంటు) గతంలో రూ. 500 ఉండగా, ప్రస్తుతం రూ. 850 తీసుకుంటున్నారు. ఫర్నిచర్ మినహా వందశాతం పనుల కోసం చదరపు అడుగు గతంలో రూ. 1200 తీసుకోగా, ప్రస్తుతం రూ. 1,550, ఫర్నిచర్‌తో కలుపుకొని ప్రస్తుతం రూ. 1,850 ధర పలుకుతోంది. జిల్లా కేంద్రంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుమారు 200 మంది మేస్త్రీలు, ఇతర కారి్మకులు పనిచేసేవారు. కరోనా సమయంలో 50 శాతం మంది సొంత ఊళ్లకు వెళ్లడంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఐదునెలల పాటు పూర్తిగా పనులు నిలిచిపోగా ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమయ్యాయి. లేబర్ కొరత కూడా తీవ్రంగా ఉంది. గతంలో తాపీ మేస్త్రీకి రూ. 800 కూలి ఇవ్వగా ప్రస్తుతం రూ. 1000కి పెరిగింది. పార పనికోసం వచ్చే వారికి రోజుకు గతంలో రూ. 500 ఇవ్వగా ఇప్పుడు రూ. 600 ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. సిమెంట్, స్టీల్, ఇసుక ఇతర సామగ్రి ధరలను ప్రభుత్వం నియంత్రించాలని నిర్మాణదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
2021–22లో సిమెంటుకు డిమాండ్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ అమ్మకాలు తిరిగి పుంజుకోనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021–22లో పరిశ్రమలో 18–20 శాతం డిమాండ్ వృద్ధికి ఆస్కారం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. 2018–19, 2019–20 స్థాయికి పరిశ్రమ చేరుతుందని తెలిపింది. ఇక్రా ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌కుతోడు అందుబాటు గృహాలు, మౌలిక రంగం తిరిగి గాడిన పడనుండడం ఈ పెరుగుదలకు కారణం. ఖర్చుల వైపు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆపరేటింగ్ మార్జిన్స్ 20–21 శాతం స్థాయిలో ఉండొచ్చు. 20–22 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కొత్తగా తోడు కానుంది. 2020–21లో ఇది 15–17 మిలియన్ టన్నులు. తూర్పు ప్రాంతం నుంచే 15–17 మిలియన్ టన్నులు జతకూడే అవకాశం ఉంది. ప్లాంట్ల వినియోగం గతేడాది ఉన్న 56 శాతం నుంచి 2021–22లో 64 శాతానికి చేరనుంది. పెట్ కోక్ ధరలు కొన్ని నెలల క్రితం పెరిగాయి. డీజిల్ ధరలూ అధికమవుతున్నాయి. సకాలంలో రబీ నాట్లు పడడం, నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో ఉత్పదకత మెరుగై.. సెంటిమెంటు సానుకూలం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సిమెంటుకు డిమాండ్ ఉంటుందని ఇక్రా ఏవీపీ అనుపమ రెడ్డి తెలిపారు. రియల్టీ, పీఎంఏవై–అర్బన్, ఇన్ఫ్రా రంగాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ 3.0 ప్యాకేజ్ సిమెంట్ డిమాండ్‌ను నడిపిస్తుందని వివరించారు. చదవండి: హైదరాబాద్‌లో 39 వేల గృహాల ఇన్వెంటరీ -
బిల్డర్స్ లాబీని అడ్డుకోండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘భవన నిర్మాణ వ్యయంలో సిమెంటు పాత్ర అతి స్వల్పం. బిల్డర్లు 100 శాతానికిపైగా మార్జిన్లను ఉంచుకుని ఇళ్ల ధరలను నిర్ణయిస్తున్నారు. పైగా పెరిగిన ఇళ్ల ధరలకు సిమెంటు కంపెనీలను బాధ్యులను చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బిల్డర్లు ఇలా ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ సిమెంటు తయారీ సంస్థల ప్రతినిధులు ఘాటుగా స్పందించారు. కొత్తగా ఏర్పాటైన దక్షిణ భారత సిమెంట్ తయారీదారుల సంఘం మంగళవారం వర్చువల్‌గా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. బిల్డర్స్ లాబీని అడ్డుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని వారు వెల్లడించారు. ‘ప్రతి బిల్డర్ ధర విషయంలో పారదర్శకంగా ముందుకు రావడంతో పాటుగా ఇళ్ల ధరలను కనీసం 50% తగ్గించాల్సిందిగా కోరాలి. అదే రీతిలో చెక్ ద్వారా లావాదేవీలు జరపకపోతే తగిన చర్యలు తీసుకోవాలి’ అని లేఖ ద్వారా ప్రధానికి విన్నవించామన్నారు. సంఘం ప్రెసిడెంట్, ఇండియా సిమెంట్స్ వీసీ, ఎండీ ఎన్.శ్రీనివాసన్, వైస్ ప్రెసిడెంట్, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, సెక్రటరీ, పెన్నా సిమెంట్స్ డైరెక్టర్ కృష్ణ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడారు. లేఖలో వెల్లడించిన అంశాలు వారి మాటల్లోనే... సిమెంట్ తయారీ కేంద్రంగా..: అసలైన ఆత్మనిర్భర్ సాధించిన పరిశ్రమలలో సిమెంట్ రంగం ఒకటి. పరిమాణం పరంగా 500 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో భారత్ రెండవ స్థానంలో ఉంది. చైనా 2.5 బిలియన్ టన్నులతో అగ్రస్ధానంలో, యుఎస్ 70 మిలియ న్ టన్నులతో 3వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లోని కంపెనీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 200 మిలియన్ టన్నులకు చేరుకుంది. లైమ్‌స్టోన్ డిపాజిట్లతో కేవలం 7 రాష్ట్రాల్లోనే సిమెంట్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. భారత్ లైమ్‌స్టోన్ నిల్వల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడింట ఒకవంతు కలిగి ఉన్నా యి. భారత్‌తోపాటు ఎగుమతుల పరంగానూ భవిష్యత్‌లో సిమెంట్ కేంద్రంగా నిలిచే సామర్థ్యం దక్షిణాదికి ఉంది. కృత్రిమ ధరలతో విక్రయాలు..: సిమెంట్ పరిశ్రమకు తదనుగుణంగా భారతదేశపు వృద్ధికి సమస్యగా పరిణమిస్తున్నది గృహ రంగంలో వృద్ధి సానుకూలంగా లేకపోవడం. ఇందుకు ఏకైక కారణమేమిటంటే కృత్రిమంగా ఫ్లాట్స్, గృహాలను అధిక ధరలకు విక్రయిస్తుండటమే. క్రెడాయ్ మరియు బిల్డర్స్ అసోసియేషన్ పేరిట స్పష్టంగా బిల్డర్లతో కూడిన బృందం దీని కోసం పనిచేస్తోంది. వీరు ఏకంగా 100%కు పైగా మార్జిన్లును ఉంచుకుని ధరలను నిర్ణయిస్తున్నారు. ఎబిటా మార్జిన్ నిర్మాణ సంస్థలకు 35–50 శాతం ఉంటే, సిమెంటు కంపెనీలకు 15 శాతంలోపే ఉంది. దురదృష్టవశాత్తు అధికార యంత్రాంగ లాభదాయక విధానాల కోసమే పాటుపడుతున్న వీరిపై ఎలాంటి కఠినచర్యలనూ తీసుకోలేదు. కొనుగోలుదార్లకు ఫ్లాట్స్, గృహాలను సహేతుక ధరలో విక్రయిస్తే మనీ సర్క్యులేషన్ గణనీయంగా వృద్ధి చెందుతుంది. తద్వారా భారతీయ ఆర్ధిక వ్యవస్థ సైతం వృద్ధి చెంది ఉపాధి కల్పనకూ దోహద పడుతుంది. నిర్మాణ రంగం బాగుంటే సిమెంట్‌కు డిమాండ్ సైతం పెరుగుతుంది. నిర్మాణ వ్యయం కంటే అధికంగా.. ఓ ఫ్లాట్ ధరలో అత్యంత కీలకపాత్ర పోషించేది భూమి. చెన్నైలో అత్యధిక రేటు కలిగిన ప్రాంతంలో భూముల ధరలకు సంబంధించిన మార్గదర్శకాలను మేము పరిశీలించాము. అది చదరపు అడుగుకు రూ.10 వేలు. 2/2.4 ఎఫ్ఎస్ఐను తీసుకుంటే.. ఓ ఫ్లాట్‌లో అది చదరపు అడుగుకు సుమారు రూ.4,200 అవుతుంది. దీనికి నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.2,000–2,500 జోడిస్తే ఫ్లాట్ ఖర్చు గరిష్టంగా చదరపు అడుగుకు రూ.6,700 అవుతుంది. అయితే ఇక్కడ విక్రయ ధర చదరపు అడుగుకు రూ.15–20 వేలు ఉంది. అమ్ముడు కాకుండా అసాధారణ ఇన్వెంటరీ ఉంది. కానీ బిల్డర్స్ లాబీ మాత్రం ధరలను కొద్దిగా కూడా తగ్గడానికి అనుమతించడం లేదు. లక్షల్లో ఇన్వెంటరీ ఉన్నా.. దేశ వ్యాప్తంగా 9 ప్రధాన మార్కెట్లలోనే 75 లక్షల ఫ్లాట్స్ అమ్ముడు కాకుండా ఉన్నట్లు అంచనా. దీనిలో అసంపూర్తిగా నిర్మితమైన ఫ్లాట్స్‌ను మినహాయించడం జరిగింది. ఒకవేళ బిల్డర్లు తమ ధరలను తగ్గించుకుంటే ఈ మొత్తం అమ్ముడవుతుంది. రియల్టీ డిమాండ్ కూడా పెరుగుతుంది. మధ్య తరగతి, అల్పాదాయ వర్గాలకు ఓ గూడు కూడా లభ్యమవుతుంది. బిల్డర్లు ఇప్పుడు ప్రధానమంత్రి అందుబాటు గృహ పథక ప్రయోజనాలను పొందడమే కాదు.. ప్రజలకు ఈ లబ్ధి అందించేందుకు సైతం నిరాకరిస్తున్నారు. ఎవరైనా దీని గురించి ప్రశ్నిస్తే పెరిగిన ఇన్పుట్ ధరలు మరీ ముఖ్యంగా సిమెంట్ గురించి చెబుతుంటారు. కానీ ఒక చదరపు అడుగు నిర్మించడానికి అరబ్యాగు సిమెంట్ మాత్రమే ఖర్చవుతుంది. విక్రయ ధరలో సిమెంట్ వాటా కేవలం 1.5–2 శాతం మాత్రమే. ఒకవేళ బస్తాకు రూ.100 సిమెంట్ ధర పెరిగినా నిర్మాణ ఖర్చు అడుగుకు రూ.50 మాత్రమే అధికం అవుతుంది. -
సిమెంట్ షేర్లు.. భలే స్ట్రాంగ్
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా పటిష్టంగా సాగుతున్న సిమెంట్ రంగ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్(అక్టోబర్- డిసెంబర్) ఫలితాలపై అంచనాలతో ఇన్వెస్టర్లు సిమెంట్ షేర్ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు ఈ ఏడాది(2020-21) ద్వితీయార్ధంలో కంపెనీల మార్జిన్లు మరింత మెరుగుపడనున్న అంచనాలు సైతం జత కలుస్తున్నట్లు తెలియజేశారు. వెరసి సిమెంట్ రంగంలోని కొన్ని కౌంటర్లు తాజాగా చరిత్రాత్మక గరిష్టాలకు చేరగా.. మరికొన్ని కౌంటర్లు ఏడాది గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. లాభాలతో ఎన్ఎస్ఈలో తొలుత శ్రీ సిమెంట్ షేరు రూ. 25,655ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇదేవిధంగా జేకే సిమెంట్ రూ. 2,080 వద్ద, రామ్‌కో సిమెంట్ రూ. 900 వద్ద చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. ఈ బాటలో ఏసీసీ రూ. 1,785 వద్ద, దాల్మియా భారత్ రూ. 1,198 వద్ద, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రూ. 909 వద్ద 52 వారాల గరిష్టాలను తాకడం గమనార్హం. ఇతర కౌంటర్లలో కాకతీయ సిమెంట్స్, డెక్కన్ సిమెంట్స్, ఆంధ్రా సిమెంట్స్, అల్ట్రాటెక్, సాగర్‌సిమెంట్స్ 5-1.5 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం గ్రాసిమ్ 3.4 శాతం లాభపడి రూ. 906 వద్ద, దాల్మియా భారత్ 4.5 శాతం జంప్‌చేసి రూ. 1151 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక ఏసీసీ 2 శాతం పెరిగి రూ. 1740 వద్ద, శ్రీ సిమెంట్ 2 శాతం పుంజుకుని రూ. 24,748 వద్ద, జేకే సిమెంట్ 1.3 శాతం వృద్ధితో రూ. 2066 వద్ద కదులుతున్నాయి. అంచనాలు ఇలా ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో(అక్టోబర్- మార్చి) సిమెంట్ కంపెనీల మార్జిన్లు మరింత మెరుగుపడనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. సిమెంటుకు కనిపిస్తున్న పటిష్ట డిమాండ్ కారణంగా విద్యుత్, ఇంధనం, రవాణా తదితర వ్యయాలను మించి ధరలు బలపడనున్నట్లు అంచనా వేస్తున్నాయి. త్రైమాసిక ప్రాతిపదికన అక్టోబర్ -డిసెంబర్ కాలంలో ధరలు 0.8 శాతం పడినట్లు ఈ సందర్భంగా తెలియజేశాయి. వెరసి 2020-21లో సిమెంట్ రంగ నిర్వహణ లాభం వార్షిక ప్రాతిపదికన 18 శాతం పుంజుకోగలదని మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. రుతుపవనాల కాలంలో సిమెంట్ ధరలు స్వల్పంగా నీరసించినప్పటికీ తిరిగి 1-2 శాతం స్థాయిలో ప్రస్తుతం బలపడినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. పెట్‌కోక్ వంటి ముడిసరుకుల ధరలు పెరిగినప్పటికీ ఈ రంగంపై ప్రభావం స్వల్పమేనని అంచనా వేస్తోంది. ఈ ఏడాది క్యూ2లో సిమెంట్ అమ్మకాలు త్రైమాసిక ప్రాతిపదికన 35.7 శాతం పెరిగినట్లు తెలియజేసింది. -
ఇకపై కన్జూమర్ గూడ్స్, సిమెంట్ స్పీడ్
కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, గ్రామీణ గృహ నిర్మాణంపై దృష్టి పెట్టడంతో కన్జూమర్ డ్యురబుల్స్, సిమెంట్ రంగాలకు డిమాండ్ పెరిగే వీలున్నట్లు ఒక ఇంటర్వ్యూలో ఏంజెల్ బ్రోకింగ్ ఈక్విటీ వ్యూహకర్త జ్యోతి రాయ్ పేర్కొన్నారు. ఇంకా మార్కెట్లు, ఐపీవోలు, కంపెనీలపట్ల పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. మార్కెట్లు బలపడొచ్చు మార్కెట్లు తగ్గినప్పుడల్లా కొనుగోళ్లు చేపట్టవచ్చని భావిస్తున్నాం. గత నెలలో తయారీ రంగ పీఎంఐ 2012 జనవరి తదుపరి 56.8కు చేరింది. ఇది ఆర్థిక రికవరీని సూచిస్తోంది. ప్రభుత్వం అన్‌లాక్‌లో భాగంగా పలు నిబంధనలు సడలించడంతో కొద్ది నెలలపాటు సెంటిమెంటు బలపడే వీలుంది. అయితే ఆర్థిక వ్యవస్థను తిరిగి ఓపెన్ చేయడం ద్వారా కోవిడ్-19 కేసులు పెరిగే వీలుంది. ఇదే విధంగా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ ఆలస్యంకావచ్చు. యూఎస్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీపై వెనకడుగు వేయవచ్చు. ఇలాంటి అంశాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే వీలుంది. ఐపీవోల జోరు గత మూడు నెలల్లోనే 10 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టాయి. దీంతో రానున్న కాలంలో ప్రైమరీ మార్కెట్ వెలుగులో నిలవనుంది. ఇందుకు జోరుమీదున్న స్టాక్ మార్కెట్లు సహకరించనున్నాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న స్పెషాలిటీ కెమికల్స్ రంగం స్వల్ప కాలంలో అంత జోరు చూపకపోవచ్చు. పలు కంపెనీల షేర్ల ధరలు భారీగా లాభపడటమే దీనికి కారణం. అయితే దీర్ఘకాలంలో ఈ రంగంపట్ల సానుకూలంగా ఉన్నాం. ఈ రంగంలో అతుల్, పీఐ ఇండస్ట్రీస్, గలాక్సీ సర్ఫక్టాంట్స్ను పరిశీలించవచ్చు. క్యూ2పై అంచనాలు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆటో, సిమెంట్, ఐటీ, ఫార్మా, కెమికల్స్ రంగాలు పటిష్ట పనితీరు చూపే అవకాశముంది. వివిధ కంపెనీలు ప్రకటించే భవిష్యత్ ఆర్జన అంచనాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుంది. ప్రస్తుతం పండుగల సీజన్ కారణంగా స్వల్ప కాలంలో డిమాండ్ పుంజుకోవచ్చు. -
బ్యాంక్, సిమెంట్ షేర్ల జోరు
కంపెనీల క్యూ3 ఫలితాలు బాగా ఉండటం, బడ్జెట్‌పై ఆశావహ అంచనాలతో బ్యాంక్, సిమెంట్ షేర్లు పెరగడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. బలహీనంగా మొదలైనప్పటికీ, సెన్సెక్స్ 227 పాయింట్ల లాభంతో 41,613 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 12,248 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడ్డా, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. కరోనా వైరస్ చైనాలోనే తీవ్రంగా ఉందని, ఇతర దేశాల్లో ప్రభావం స్వల్పమేననని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు రికవరీ కావడం సానుకూల ప్రభావం చూపించింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 332 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల మేర పతనమయ్యాయి. బడ్జెట్ మరో వారంలో రానుండటంతో బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్ 2 శాతం, కోటక్ బ్యాంక్ 1.9 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.1 శాతం, ఎస్బీఐ 0.2 శాతం చొప్పున పెరిగాయి. చైనా, తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లకు సెలవు. హాంగ్‌కాంగ్, జపాన్ మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 1 శాతం మేర పెరిగాయి. ఈ క్యూ3లో నికర లాభం 80 శాతం మేర పెరగడంతో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్2.4 శాతం లాభంతో రూ.4,641 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. -
డోర్ల తయారీలోకి ఎన్సీఎల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ ఎన్సీఎల్ గ్రూప్ ప్రీమియం డోర్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. టర్కీకి చెందిన ఏజీటీ సాంకేతిక సహకారంతో ‘డ్యూరాడోర్’ బ్రాండ్ కింద కంపెనీ వీటిని లైఫ్‌టైం వారంటీతో విక్రయించనుంది. దీనికోసం చౌటుప్పల్ వద్ద రూ.50 కోట్లతో ప్లాంటును నిర్మించింది. బుధవారం ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. భారత్‌లో అతిపెద్ద, ప్రీమియం రెడీమేడ్ డోర్ల తయారీ ప్లాంటు ఇదేనని, షిఫ్టుకు 1,000 డోర్లు తయారు చేయగల సామర్థ్యం ఈ యూనిట్‌కు ఉందని ఎన్సీఎల్ చెబుతోంది. తొలుత భారత మార్కెట్ లక్ష్యంగా డోర్లను సరఫరా చేస్తారు. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి ఉపాధి లభించనుంది. నాగార్జున బ్రాండ్ కింద సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్, బైసన్ ప్యానెల్ బ్రాండ్‌లో సిమెంట్ బోర్డులను సైతం ఎన్సీఎల్ విక్రయిస్తోంది. ఈ ఏడాది బాగుంటుంది.. 2017–18లో కంపెనీ రూ.1,097 కోట్ల టర్నోవరుపై రూ.49 కోట్ల నికరలాభం ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ – డిసెంబరు కాలంలో రూ.855 కోట్ల టర్నోవరుపై రూ.20 కోట్ల నికరలాభం సాధించింది. తొలి 9 నెలలూ సిమెంటుకు ధర లేక నిరుత్సాహపరిచినట్లు ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఎండీ కె.రవి చెప్పారు. ‘రెండు నెలలుగా సిమెంటు ధరలు పెరిగాయి. ఈ త్రైమాసికం బాగుంటుంది. సిమెంటుతోపాటు సిమెంటు బోర్డులు, రెడీ మిక్స్ కాంక్రీట్‌కు డిమాండ్ బాగుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,400 కోట్ల ఆదాయం ఆశిస్తున్నాం. ఇదే డిమాండ్ కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో 2019–20లో మెరుగైన ఫలితాలు నమోదు చేస్తామన్న ధీమా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బోర్డ్స్ ప్లాంటు పూర్తి స్థాయి సామర్థ్యం వినియోగించుకుంటాం’ అని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. రూ.100 కోట్లతో విద్యుత్ ప్లాంట్.. సూర్యాపేట సమీపంలోని మట్టపల్లి వద్ద ఎన్సీఎల్ సిమెంటు ప్లాంటు విస్తరించింది. 17 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రైండింగ్ యూనిట్‌తోపాటు ఇక్కడ సిమెంటూ ఉత్పత్తవుతోంది. ప్లాంటులో జనించే వేడి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవర్ ప్రాజెక్టును ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్నారు. 8 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు రూ.80–100 కోట్లు వెచ్చిస్తామని రవి వెల్లడించారు. కంపెనీకి విజయవాడ సమీపంలోని కొండపల్లి వద్ద 10 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రైండింగ్ యూనిట్ ఉంది. 2018–19లో సిమెంటు విక్రయాలు 20 లక్షల టన్నులు దాటతాయని చెప్పారాయన. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి సామర్థ్యం 27 లక్షల టన్నులకు చేరుకుంటామన్నారు. ప్రస్తుతమున్న ప్లాంటులోనే విస్తరణ చేపట్టే అవకాశం ఉందన్నారు. -
బైరటీస్ ఖనిజానికి కాళ్లొచ్చాయ్..!
ఖమ్మంఅర్బన్: నగరంలోని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన భూమిలో తవ్వకాల్లో బయటపడిన బైరటీస్ ఖనిజాలను రాత్రికి రాత్రే అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఖనిజాలను ముందుగా సమీపంలోని రహస్య ప్రదేశంలో నిల్వ చేస్తున్నారని, రాత్రి వేళ తరలిస్తున్నారని సమాచారం. మూడేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో పుట్టకోట సమీపంలోని రైతుల పొలాల్లో దొరికిన బైరటీస్ ఖనిజాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ఎగు మతి చేశారు. దీనిపై అందిన ఫిర్యాదులతో అప్ప ట్లో సంబంధిత అధికారులు దాడులు చేశారు. నిల్వలను స్వాధీనపర్చుకున్నారు. తాజాగా, అదే ప్రాం తంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో బైరటీస్ ఖనిజం బయటపడింది. దానిని నూతన కలెక్టరేట్ సమీపం లోని భూముల్లో నిల్వచేసి, రాత్రివేళ లారీల ద్వారా తరలిస్తున్నట్టు తెలిసింది. ఈ ఖనిజం ధర నాణ్యతనుబట్టి 700 నుంచి 2000 రూపాయల వరకు పలుకున్నట్టు సమాచారం. ఇప్పటికే 10నుంచి 15లారీలలో ఖనిజం నిల్వలను తరలిం చినట్టుగా తెలిసింది. ప్రస్తుతం అక్కడ ఒక లారీ బైరటీస్ గనినిల్వలు ఉన్నాయి. బైరటీస్ వ్యాపారు లే ఈ రాయిని తరలిస్తున్నారని, వెంచర్ నిర్వాహకు లకు కొంత ముట్టజెబుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ ఖనిజాన్ని ఏం చేస్తారంటే... ఈ బైరటీస్ ఖనిజాన్ని కెమికల్స్‌లో, సిమెంట్ తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. కోదాడ సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఖనిజాన్ని కోదాడ సమీపంలోగల ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్టు తెలిసింది. మాకు తెలియదు... దీనిపై మైనింగ్ ఏడీ నరసింహారెడ్డి, రాయల్టీ ఇన్స్పెక్టర్ రాజారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘బైరటీస్‌ను అక్రమంగా తరలిస్తున్న విషయం మా నోటీసుకు రాలేదు. వెంటనే పరిశీలిస్తాం’’ అని అన్నారు. -
ఏసీసీ లాభం రూ.209 కోట్లు
న్యూఢిల్లీ: సిమెంట్ కంపెనీ ఏసీసీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన మూడో త్రైమాసిక కాలంలో 15 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది క్యూ3లో రూ.182 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది క్యూ3లో రూ.209 కోట్లకు పెరిగిందని ఏసీసీ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,141 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.3,466 కోట్లకు పెరిగిందని ఏసీసీ ఎమ్డీ, సీఈఓ నీరజ్ అఖోరి చెప్పారు. దీంట్లో సిమెంట్ విభాగం ఆదాయం రూ.3,185 కోట్లుగా, రెడీ మిక్స్ కాంక్రీట్ విభాగం ఆదాయం రూ.303 కోట్లుగా ఉన్నాయని వివరించారు. మొత్తం వ్యయాలు రూ.2,877 కోట్ల నుంచి రూ.3,160 కోట్లకు చేరాయని తెలిపారు. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తోంది. -
వైజాగ్‌లో వికా గ్రూపు గ్రైండింగ్ యూనిట్
ముంబై: ఫ్రెంచ్ సిమెంట్ దిగ్గజం వికా గ్రూపు భారత మార్కెట్లో వికా బ్రాండ్‌ను విడుదల చేసింది. దేశీయంగా తయారీ సామర్థ్య విస్తరణపై ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.300 కోట్లు వెచ్చించినట్టు వికా ఇండియా సీఈవో అనూప్ కుమార్ సక్సేనా ముంబైలో మీడియాకు తెలిపారు. ‘‘భారత్‌లో భారీ విస్తరణ ప్రణాళికలతో ఉన్నాం. 2021 నాటికి 1,700 కోట్లను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మా సిమెంట్ తయారీ సామర్థ్యం 13 మిలియన్ టన్నులకు విస్తరించనున్నాం. ఇప్పటికే ఈఏడాది రూ.300 కోట్లను ఖర్చు చేశాం. ముంబైలోని కలంబోలి వద్ద 1.2 మిలియన్ టన్నుల బల్క్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు, తర్వాత కల్బుర్గి సిమెంట్ ప్లాంట్‌ను 2.75 మిలియన్ టన్నులకు విస్తరణ, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో 1.7 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నాం. కడప జిల్లాలో రెండంచెల ఇంటెగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ కూడా ఉంది. భారత్‌లో మా మొత్తం సామర్థ్యం 7.75 మిలియన్ టన్నులు’’ అని సక్సేనా తెలిపారు. -
తండ్రి తిట్టాడని 2 కేజీల సిమెంట్ మింగాడు!
కోల్‌కతా: కంటిచూపు మందగించడం, మరోవైపు తండ్రి మందలింపుతో మనస్తాపం చెందిన ఓ యువకుడు(20) సిమెంట్ మింగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో జరిగింది. పాకుర్ జిల్లాకు చెందిన బిమల్ పాల్ సోషల్‌మీడియాలో ఎక్కువ సమయం గడిపేవాడు. కంటిచూపు సమస్యతో బాధపడుతున్న బిమల్ను అతని స్నేహితులు వెక్కిరించేవారు. తనకు విగ్రహాల తయారీలో సాయం చేయకుండా సోషల్‌మీడియాలో సమయం వృథా చేయడంపై బిమల్ను బుధవారం తండ్రి బిరేన్ మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బిమల్ తండ్రి పనికోసం వాడుతున్న 2 కేజీల సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను మింగేసి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో బాధితుడ్ని పశ్చిమబెంగాల్లోని బుర్ద్వాన్ వైద్య కళాశాలలో చేర్చారు. వైద్యుల బృందం ఆపరేషన్ చేసి బిమల్ కడుపులోని సిమెంట్, ప్లాస్టర్‌ను వెలికితీశారు. -
సిమెంట్ అవసరం లేని కాంక్రీట్
ఫ్లైయాష్ గురించి మీరెప్పుడైనా విన్నారా? థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వ్యర్థంగా మిగిలిపోయే ఈ పదార్థంతో ఇటుకలు తయారవుతున్నాయి. కొద్దోగొప్పో కలుపుకుని సిమెంట్ కూడా తయారు చేస్తున్నారు. ఇలాకాకుండా పూర్తిగా ఫ్లైయాష్‌తో కాంక్రీట్‌ను తయారు చేసేందుకు రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని కనుక్కున్నారు. తద్వారా కాంక్రీట్ తయారీ ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం, అదే సమయంలో వృధా అవుతున్న ఈ వనరును మళ్లీ వినియోగించుకోవడం సాధ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోవడంలో కాంక్రీట్ తయారీ రవాణా, విద్యుచ్ఛక్తి రంగాల తరువాత మూడో స్థానంలో ఉంది. ఇంకోవైపు ఫ్లైయాష్ పునర్వినియోగం చాలా తక్కువగా ఉంది. ఈనేపథ్యంలో తాము ఒక వినూత్నమైన బైండర్ను అభివృద్ధి చేశామని, దీన్ని వాడినప్పుడు సాధారణ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ అన్నది అస్సలు వాడకుండా దాదాపు 80 శాతం ఫ్లైయాష్‌ను వాడుకుని కాంక్రీట్‌ను తయారు చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రౌజబేషాసావరి అంటున్నారు. క్యాల్షియం పరిమాణం ఎక్కువగా ఉన్న ఫ్లైయాష్ 80 శాతం, ఐదు శాతం సోడియం ఆక్టివేటర్స్, మిగిలిన 15 శాతం నానో సిలికా, క్యాల్షియం ఆక్సైడ్లను కలిపి కాంక్రీట్‌ను తయారుచేస్తే అది సాధారణ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ కంటే దృఢంగా ఉండటంతోపాటు ఎక్కువ కాలం మన్నుతుంది కూడా అని ఆయన వివరించారు. కొత్త కాంక్రీట్ ధర్మాలను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే నాణ్యత మెరుగుపడే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. -
లాలూచీ ఎవరిది?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు ట్యాంకర్లలో వస్తున్న సిమెంటు పక్కదారి పడుతోంది. గత కొంత కాలంగాఈ వ్యవహారం గుట్టుగా జరుగుతోందని తెలుస్తోంది. ఇటీవల గోపాలపురం మండలంలోని కరిచర్లగూడెంలో ఒకేసారి 324 బస్తాల సిమెంటు అమ్మకానికి పెట్టడం, సమాచారం తెలిసి అధికారులు దాడులు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు వాడాల్సిన సిమెంటు పక్కదారి పట్టి అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. దాదాపు ఏడాది క్రితం ఇదే విషయమై పోలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, ట్యాంకర్ల డ్రైవర్లను అరెస్ట్ చేశారు. అప్పట్లో ఒక ట్యాంకర్ సిమెంటును ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నుంచి దారిమళ్లించి, బయట మార్కెట్లో అమ్ముకున్నట్టు పోలీసులు ధృవీకరించారు. మళ్లీ తాజాగా విషయం వెలుగులోకి రావడంతో సిమెంటు దారిమళ్లింపుపై చర్చ జరుగుతోంది. ప్రాజెక్టులో ట్యాంకరు సిమెంటును అన్లోడ్ చేసిన తరువాత అడుగున కొంత సిమెంటు మిగులుతుంది. అలా మిగిలిన దానిని మాత్రమే డ్రైవర్లు అమ్ముకుంటున్నారని ప్రాజెక్టు సిబ్బంది కొందరు చెప్పుకొస్తున్నా.. అన్లోడ్ చేసేటపుడు సరుకు పూర్తిగా ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాజాగా ప్రాజెక్టుకు చెందిన 324 బస్తాల సిమెంట్బయట ప్రయివేటు వ్యక్తులు అమ్మకానికి పెట్టడంతో ఇందులో పెద్ద కుంభకోణమే జరిగి ఉంటుందనే అనుమానాలకు తావిస్తోంది. అసలు సిమెంటు లోడు ట్యాంకర్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణప్రాంతానికి చేరకుండానే మార్గం మధ్యలో బస్తాలను బయటకు తీసి దాచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టు ఏజెన్సీలు ఏమంటున్నాయంటే.. ప్రాజెక్టుకు సంబంధించిన సిమెంటు బయట మార్కెట్లో అమ్ముకుంటున్న విషయమై తమకు ఏవిధమైన సంబంధంలేదని కాంట్రాక్ట్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరకుండానే సిమెంటును అమ్ముకుంటే.. నిర్మాణ ప్రాంతంలో అన్లోడ్ చేసేటపుడు తెలిసిపోతుందని అంటున్నారు. ట్యాంకర్లలో తెచ్చిన సిమెంటును పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో అప్పగించినట్లు రశీదు లేదా బిల్లులు చూపించకపోతే సిమెంటు కంపెనీలు ఊరుకోవు. సరుకు తగినంతగా అందకపోయినా అందినట్లు బిల్లులు ఇచ్చి ప్రాజెక్టు సిబ్బంది ఎవరైనా సిమెంటు కంపెనీలతో లాలూచీ పడ్డారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదో ఒకసారి జరిగితే డ్రైవర్లు డబ్బులకు ఆశపడి సిమెంటు అమ్ముకున్నారని అనుకోవచ్చు. కానీ తరచూ ఇటువంటి అమ్మకాలు జరుగుతుండటం అనేక అనుమానాలను కలిగిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఎవరైనా వీరికి సహకరిస్తున్నారా అనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇలాగే కాకుండా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సరుకు అప్పగించిన తరువాత ట్యాంకర్లలో మిగిలిన సిమెంటును కూడా డ్రైవర్లు అమ్ముకుంటారు. ట్యాంకర్ల నుంచి సిమెంటు కొనుగోలు చేసేందుకు గోపాలపురం మండలంలోని కరిచర్లగూడెం, జగన్నాథపురం, కోమటికుంట గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు సిద్ధంగా ఉంటారని తెలుస్తోంది. బస్తా (50 కేజీలు) సిమెంటును రూ.150 వరకు కొనుగోలు చేసి, అవసరమైన వారికి రూ.250కి అమ్ముతున్నారని చెబుతున్నారు. నిత్యం 35 నుంచి 40 ట్యాంకర్లు రాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా ప్రస్తుతం స్పిల్‌వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం నిత్యం 35 నుంచి 40 వరకు ట్యాంకర్లలో సిమెంటు మూడు కంపెనీల నుంచి వస్తోంది. ఒక్కో ట్యాంకర్ 30 టన్నుల అంటే 600 బస్తాల సిమెంటును తీసుకువస్తుంది. దాదాపు 10 లక్షల టన్నుల సిమెంటు వినియోగించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే తమ వద్ద ఎటువంటి పొరపాట్లకు ఆస్కారంలేదని, ఎంత సిమెంటు అప్పగిస్తే అంత సిమెంటుకే కంపెనీలకు సొమ్ము చెల్లిస్తామని నవయుగ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ క్రాంతి చెప్పారు. ఇటీవల జరిగిన సంఘటన నేపథ్యంలో గోపాలపురం పరిసర ప్రాంతాలలో తమ సిబ్బందితో రాత్రి సమయాల్లో గస్తీ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. తమకు అందిన సిమెంటుకే బిల్లు ఇస్తామన్నారు. -
అల్ట్రాటెక్ బిడ్‌ను పరిశీలించండి
కోల్‌కతా: బినానీ సిమెంట్ కొనుగోలు కోసం అల్ట్రాటెక్ దాఖలు చేసిన బిడ్‌ను పరిశీలించాలంటూ రుణదాతల కమిటీకి (కమిటీ ఆఫ్ క్రెడిటర్స్–సీవోసీ) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సూచించింది. దాల్మియా భారత్ గ్రూప్ సమర్పించిన దానికన్నా రూ.1,022 కోట్లు అధికంగా అల్ట్రాటెక్ బిడ్ వేసింది. ఒకవేళ దీనికి సమాన స్థాయిలో దాల్మియా భారత్ గ్రూప్ కొత్తగా మరో బిడ్ వేస్తే దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలని ఎన్సీఎల్టీ ఆదేశించింది. మొత్తం మీద జూన్ 24 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. బ్యాంకులకు దాదాపు రూ. 6,500 కోట్లు బకాయిపడిన బినానీ సిమెంట్స్ ప్రస్తుతం దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటోంది. -
40-50 పెరగనున్న సిమెంట్ ధరలు
-
పెరగనున్న సిమెంట్ డిమాండ్!
న్యూఢిల్లీ: భారత్‌లో సిమెంట్ డిమాండ్‌కు సంబంధించిన వృద్ధి 2018–19లో 4.5 శాతంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా మంగళవారం వెలువరించిన తన నివేదికలో పేర్కొంది. గృహ నిర్మాణ రంగం పుంజుకోవడం, మౌలిక రంగంలో పెట్టుబడుల వృద్ధి దీనికి కారణంగా అంచనావేసింది. ‘‘2017–18 ఏప్రిల్–డిసెంబర్ మధ్య దేశీయ సిమెంట్ ఉత్పత్తి 216.5 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటీ), 2016–17 ఇదే కాలంతో పోల్చిచూస్తే (210.8 ఎంఎంటీ) ఇది 2.7 శాతం అధికం. ప్రస్తుత ధోరణి చూస్తుంటే, నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 3 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నెలవారీగా చూస్తే, 2017 డిసెంబర్లో సిమెంట్ ఉత్పత్తి వృద్ధి 8.4 శాతం పెరిగి 26.3 ఎంఎంటీలుగా నమోదయ్యింది’’ అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ హెడ్ సవ్యసాచి మజుందార్ తాజా నివేదికలో వివరించారు. గ్రామీణ ఆదాయాల్లో మెరుగుదల, రుణ వృద్ధి పెరగడం, గ్రామీణ గృహ నిర్మాణ రంగంలో డిమాండ్ పెరుగుదలకు దోహదపడతాయని ఆయన విశ్లేషించారు. అక్టోబర్ నుంచీ పుంజుకుంది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఉత్పత్తి తగ్గడాన్ని కూడా నివేదికలో ఇక్రా ప్రస్తావించింది. ఇసుక కొరత, రియల్టీ రెగ్యులేటరీ అథారిటీ (ఆర్ఈఆర్ఏ) అమలు, కరువు వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇక రెండవ త్రైమాసికంలో జీఎస్టీ సంబంధిత అంశాలు, సగటుకన్నా తక్కువ వర్షపాతం, ఇసుక లభ్యతలో ఇబ్బందులు కొనసాగడం వంటి అంశాలు ఉత్పత్తి తగ్గడానికి కారణాలని పేర్కొంది. అయితే డిసెంబర్ త్రైమాసికంలో(అక్టోబర్–డిసెంబర్) ఉత్పత్తి 11.6 శాతం పెరిగి 75.6 ఎంఎంటీకి చేరిందని ఇక్రా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తూర్పు రాష్ట్రాలు (బిహార్ మినహా), పశ్చిమ మార్కెట్లు మెరుగుపడటం ఉత్పత్తి పెరగడానికి కారణాలుగా వివరించింది. -
ఏపీలో ఒడిశా సి‘మంట’
ఎవరికైనా కావలసిన వస్తువు కాస్త తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుంచి తెచ్చుకోవడం సహజం. అది నిత్యవసర సరకు కావచ్చు.. మరే ఇతర సామగ్రైనా కావచ్చు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలకు అత్యంత అవసరమైన సిమెంట్ మనకు సమీపంలోనే ఉన్న ఒడిశాలో తక్కువ ధరకు లభిస్తుండటంతో అక్కడినుంచే కొనుగోలు చేసుకుని తెలివిగా తెచ్చేసుకోవడంతో... స్థానిక వ్యాపారులు లబోదిబో మంటున్నారు. పార్వతీపురం: పార్వతీపురం ప్రాంతంలో వివిధ నిర్మాణాలు ఊపందుకున్నా యి. కానీ పనిలో పనిగా వాటిలో ముఖ్య మైన సిమెంట్ ధర మాత్రం కొండెక్కి కూచుంది. కానీ ఇక్కడకు సుమారు 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలో మాత్రం కారు చౌకగా లభి స్తోంది. ఈ వ్యత్యాసాన్ని గమనించిన భవన నిర్మాణదారులు అక్కడినుంచే కొనుగోలు చేసుకుని తెచ్చుకోవడం మొదలుపెట్టారు. వెంకంపేట మీదుగా అలమండ, నీలావడి, నారాయణపట్నం, కొరాపుట్ 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండట, అలాగే కూనేరు మీదుగా రాయగడ 35 కిలోమీటర్ల దూరమే ఉండటంతో పార్వతీపురం పట్టణ ప్రజలు ఆ ప్రాంతాలనుంచి సిమెంట్‌ను దిగుమతి చేసుకుంటున్నా రు. కాంట్రాక్టర్లయితే డీసీఎంలు, లారీ ల్లో దిగుమతి చేసుకుంటుండగా గృహనిర్మాణదారులు రోజూ తిరిగే ప్రైవేటు ట్రెక్కర్లు, వ్యాన్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. ధరలో భారీ వ్యత్యాసం నాగార్జున, విష్ణు కంపెనీలకు చెందిన సిమెంట్ బస్తా ఒక్కోటి స్థానికంగా రూ. 350 వరకు ధర పలుకుతుండగా... ఒడిశాలో అదే సిమెంట్‌బస్తా రూ. 240లకే లభిస్తోంది. ఒకే కంపెనీ రెండు ప్రాంతాలకు వేర్వేరు ధరలకు అందిస్తుండటంతో అవకాశం ఉన్నవారంతా అక్కడినుంచే తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటున్నారు. సిమెంట్ కంపెనీలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ఏపీలోని వ్యాపారులను ఇబ్బంది పెడుతోంది. నష్టపోతున్న వ్యాపారులు... వినియోగదారులు, కాంట్రాక్టర్లు పక్కరాష్ట్రమైన ఒడిశా నుంచి తక్కువ ధరకు లభిస్తున్న సిమెంట్‌ను దిగుమతి చేసుకుంటుండడంతో స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారు. అదే కంపెనీకి చెందిన సిమెంట్ ఒడిశా ధరకు ఆంధ్రాలో అందివ్వలేకపోతున్నారు. కారణం సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు సిండికేట్‌గా ఏర్పడి ఆంధ్రాలో డీలర్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. వినియోగదారులు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడికే వెళ్లిపోతున్నారు. అందువల్ల ఇక్కడ అమ్మకాలు పడిపోయాయి. తూతూ మంత్రంగా దాడులు.. ఒడిశా నుంచి అనధికారికంగా సిమెంట్‌ను దిగుమతి చేసుకుంటున్నా... వాణిజ్య పన్నులశాఖాధికారులు మాత్రం తూతూ మంత్రంగానే దాడులు కొనసాగిస్తున్నారు. జీఎస్టీ అమలైన తరువాత వీరు అనధికారికంగా తరలిస్తున్న సరుకులపై తనిఖీలు చేయడం భాగా తగ్గుముఖం పట్టింది. రోజూ ఒడిశా నుంచి 10 వరకు ట్రెక్కర్లు, 5 వరకు వ్యానుల్లో రామ్‌కో సిమెంట్‌ను దిగుమతి చేస్తూనే ఉన్నారు. కొ ంతమంది వే–బిల్లులు కలిగి ఉంటే ఎక్కువ మంది అవేవీ లేకుండానే తరలించేస్తున్నారు. తీవ్రంగా నష్టపోతున్నాం ఒడిశా నుంచి రామ్‌కో సిమెంట్‌ను వినియోగదారులు దిగుమతి చేసుకోవడంతో ఇక్కడ వ్యాపారాలు లేక తీవ్రంగా నష్టపోతున్నాం. ఆంధ్రాలో రూ.320లకు అమ్మే సిమెంట్ బస్తాను ఒడిశాలో కేవలం రూ. 240లకే ఇస్తుండడంతో వినియోగదారులు ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగా స్థానిక వ్యాపారులమైన మాపై తీవ్ర ప్రభావం పడుతోంది. – రాంబాబు, సిమెంట్ వ్యాపారి, పార్వతీపురం -
కంపెనీలకే కన్నం
కదిరి పట్టణానికి 3 కి.మీ దూరంలో ఉన్న సోమేష్‌నగర్‌లో సిమెంటు భలే చౌకగా లభిస్తుందని అందరూ అంటున్నారు. మార్కెట్లో సిమెంట్ బస్తా ధర రూ.340 ఉంటే ఇక్కడ మాత్రం రూ.240 నుండి రూ.250 మాత్రమే అమ్ముతున్నారట. ఇదేమని ఆరా తీస్తే అదో పెద్ద స్కాం.. అని తెలుస్తోంది. కదిరి: వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల నుంచి అనంతపురం జిల్లా కదిరి, గోరంట్ల మీదుగా బెంగుళూరుకు ప్రతి రోజూ వందలాది సిమెంట్ లారీలు వెళ్తుంటాయి. ఒక్కో లారీలో 500 బస్తాల దాకా సిమెంట్‌ను తరలిస్తారు. వీటిలో కొందరు లారీ డ్రైవర్లు బెంగుళూరులో సిమెంట్ బస్తాలున్న లారీ బరువు తూచిన తర్వాత అక్కడ అన్లోడ్ చేయకనే చేసినట్లు రికార్డుల్లో రాయించుకుంటున్నట్లు సమాచారం. తర్వాత అదే లోడ్‌ను వాపసు తీసుకొచ్చి కదిరి సమీపంలోని సోమేష్ నగర్లో అన్లోడ్ చేసి అక్కడున్న కొందరు స్థానికులకు బస్తా రూ180 నుంచి రూ.200కు అమ్ముతున్నారట. వారు ఈ సిమెంట్‌ను మార్కెట్ ధర కన్నా తక్కువకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మరికొన్ని లారీల డ్రైవర్లు బస్తాల్లో కాకుండా లూజ్ సిమెంట్ ఇక్కడ అన్లోడ్ చేసి అమ్ముతున్నారు. దాన్ని మళ్లీ ఇక్కడ బస్తాల్లోకి మార్చి విక్రయిస్తున్నారు. ఇలా తక్కువ ధరకు సిమెంట్ అమ్మే స్థావరాలు సోమేష్నగర్లోనే 5 పాయింట్లు ఉన్నాయి. యర్రగుంట్ల – గోరంట్ల మధ్య ఇలాంటి అనధికారికంగా ఉన్న సిమెంట్ స్థావరాలు 18 ఉన్నాయని తెలిసింది. లారీ డ్రైవర్లే ఇలా తమను నమ్మిన సిమెంట్ కంపెనీ ఓనర్లను మోసగిస్తే ఎలా అని కొందరు అంటున్నారు. ఈ వ్యాపారం ప్రతి రోజూ రూ.లక్షల్లో జరుగుతోందని, ఇదో పెద్ద స్కాం..అని కొందరు అంటున్నారు. ఇలా అనధికారికంగా సిమెంట్ అమ్ముతున్నందున తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని సిమెంట్ దుకా ణాల వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రాణం మీదకు తెచ్చుకున్న ఓ లారీ డ్రైవర్ ఇలా లారీ డ్రైవర్లు అనధికారికంగా సిమెంట్ స్థావరాలు ఏర్పాటు చేసుకొని అమ్ముతున్న విషయం కదిరి, గోరంట్ల ప్రాంతాల వాసులకు కొత్తేమీ కాదు. రెండేళ్లుగా ఈ తంతు సాగుతున్నట్లు తెలిసింది. గత కొన్ని నెలల క్రితం గోరంట్ల సమీపంలోని ఓ తోటలో ఓ లారీ డ్రైవర్ అనధికారికంగా 150 బస్తాల సిమెంట్ అన్లోడ్ చేసి, అందుకు సంబంధించిన డబ్బుల విషయంలో అక్కడి స్థానికుడు మద్య పేచీ వచ్చింది. స్థానికుడు సదరు లారీ డ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. కదిరి ప్రాంతంలోని సోమేష్ నగర్లో కూడా ఇప్పటికే పలు గొడవలు కూడా జరిగాయని స్థానికులు చెబుతున్నారు. అనధికారికంగా సిమెంటు అమ్ముతున్న వ్యాపారుల మధ్య పోటీ పెరగడంతో పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే హత్యలు జరిగే పరిస్థితి కూడా లేకపోలేదని వారంటున్నారు. ప్రత్యేక నిఘా పెట్టి ఈ సిమెంట్ స్కాంను వెలికి తీయాలని వారు కోరుతున్నారు. -
ఇన్ఫ్రా దిగాలు!
♦ ఏప్రిల్‌లో ఉత్పాదకత 2.5% క్షీణత ♦ బొగ్గు, క్రూడ్, సిమెంట్ పేలవం! న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా కలిగిన ఎనిమిది పరిశ్రమల ఇన్ఫ్రా గ్రూప్ ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల– ఏప్రిల్‌లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. 2016 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే, 2017 ఏప్రిల్‌లో అసలు వృద్ధిలేకపోగా ఉత్పత్తి 2.5 శాతం క్షీణించింది (మైనస్). బొగ్గు, క్రూడ్ ఆయిల్, సిమెంట్ రంగాల పేలవ పనితీరు దీనికి కారణం. ఇంకా ఈ గ్రూప్‌లో నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. ఈ గ్రూప్ 2016 ఏప్రిల్ వృద్ధి రేటు 8.7 శాతం. ఎనిమిది రంగాలూ వేర్వేరుగా... ⇔ బొగ్గు: –1.8% క్షీణత.. –3.8 శాతానికి చేరింది. ⇔ క్రూడ్ ఆయిల్: క్షీణతలోనే ఉన్నా ఇది –2.2 శాతం నుంచి –0.6 శాతానికి తగ్గింది. ⇔ సిమెంట్: 4.3 శాతం వృద్ధి రేటు నుంచి –3.7 శాతం క్షీణతకు పడిపోయింది. ⇔ నేచురల్ గ్యాస్: –6.9 శాతం క్షీణత నుంచి 2 శాతం వృద్ధికి మళ్లింది. ⇔ రిఫైనరీ: 19.1% వృద్ధి 0.2%కి పడింది. ⇔ ఎరువులు: –3% క్షీణత నుంచి 6.2%కి ఎగసింది. ⇔ స్టీల్: వృద్ధి 4.5% నుంచి 9.3 శాతానికి చేరింది. ⇔ విద్యుత్: ఉత్పాదకత వృద్ధి 14.5 శాతం నుంచి 4.7 శాతానికి పడిపోయింది. -
తగ్గనున్న స్మార్ట్‌ఫోన్, సిమెంట్ ధరలు
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుతో స్మార్ట్ఫోన్లు, వైద్య పరికరాలు, సిమెంట్ ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లపై సగటున 13.5 శాతం పన్ను ఉండగా.. జీఎస్టీలో 12 శాతమే వసూలు చేస్తారని ఆర్థిక శాఖ తెలిపింది. ఇక వైద్య పరికరాలపై ప్రస్తుతమున్న 13 శాతం పన్నును 12 శాతంగా నిర్ణయించారని, సిమెంట్‌పై 28 శాతం(ప్రస్తుతం 31 శాతం) జీఎస్టీ వసూలు చేస్తారని వెల్లడించింది. ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి, బయో కెమికల్ విధానంలో వాడే ముడిపదార్థాలపై జీఎస్టీని 12 శాతం(ప్రస్తుతం 13 శాతం)గా నిర్ణయించినట్లు తెలిపింది. -
మార్చిలో మౌలిక రంగం జూమ్
న్యూఢిల్లీ: బొగ్గు, ఉక్కు ఉత్పత్తి ఊతంతో మౌలిక రంగ వృద్ధి మార్చిలో 5 శాతం ఎగిసింది. గడిచిన మూడు నెలల్లో ఇదే అత్యధికం. అయితే, గతేడాది మార్చిలో నమోదైన 9.3 శాతంతో పోలిస్తే తక్కువే కావడం గమనార్హం. మౌలిక రంగ వృద్ధి చివరిసారిగా గతేడాది డిసెంబర్లో 5.6 శాతంగా నమోదైంది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో 3.4 శాతం, ఫిబ్రవరిలో 1 శాతంగానూ ఉంది. బొగ్గు, ముడిచమురు, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ వంటి ఎనిమిది కీలక పరిశ్రమలను మౌలిక రంగం గ్రూప్‌గా పరిగణిస్తారు. దేశ పారిశ్రామికోత్పత్తిలో ఈ గ్రూప్ వాటా 38 శాతం. బొగ్గు ఉత్పత్తి మార్చిలో 10 శాతం పెరిగింది. గతేడాది మార్చిలో ఇది 2.5%. ఉక్కు ఉత్పత్తి వృద్ధి 7.8% నుంచి 11%కి పెరిగింది. విద్యుదుత్పత్తి 5.9 శాతం, నేచురల్ గ్యాస్ ఉత్పత్తి 8.3% పెరిగాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే మార్చి 2017తో ముగిసిన సంవత్సరంలో మౌలిక రంగం 4.5% వృద్ధి సాధించింది. అంతక్రితం ఏడాది ఇది 4 శాతమే. -
భార్యపై వెరైటీగా ప్రతీకారం తీర్చుకున్న భర్త
-
రెయిన్ ఇండస్ట్రీస్‌లో అసైన్డ్ భూములు
– 15 నుంచి 20 ఎకరాలలను గతంలోనే కొనుగోలు చేసిన యాజమాన్యం – యాజమాన్యానికి జిల్లా కలెక్టర్ నోటీసులు కర్నూలు(అగ్రికల్చర్): అసైన్డ్ భూములను కొనుగోలు చేసి ఫ్యాక్టరీ స్థలంలో కలిపేసుకున్న రెయిన్ ఇండస్ట్రీస్ సిమెంట్ కంపెనీ యాజమాన్యానికి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నోటీసులు జారీ చేశారు. దాదాపు 10 రోజుల క్రితమే నోటీసులు జారీ కాగా.. వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వివిధ సర్వే నెంబర్లలోని 15 నుంచి 20 ఎకరాల అసైన్డ్ భూములను కలిపేసుకున్నందుకు మీపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని జిల్లా కలెక్టర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్యాపిలి తహసీల్దారు ద్వారా ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు పంపినట్లు సమాచారం. ప్యాపిలి మండలం రాచర్ల రెవెన్యూ గ్రామం పరిధిలో దాదాపు 20 ఏళ్ల క్రితం ఎన్సీసీ సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటయింది. ఆ తర్వాత ఈ ఫ్యాక్టరీని రెయిన్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ఆధీనంలోకి వచ్చింది. రాచర్ల రెవెన్యూ గ్రామం పరిధిలోని బోయిన్‌చెర్వుపల్లి గ్రామంలోని సర్వే నెంబర్లు 50, 54, 116, 287తో పాటు మరిన్ని సర్వే నెంబర్లలోని అసైన్డ్ భూములను యాజమాన్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీటిని కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. అయితే సిమెంటు ఫ్యాక్టరీ యాజమాన్యం ఽఅసైన్డ్ భూములను ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందే కొనుగోలు చేసినట్లు సమాచారం. వీటి విలువ ప్రస్తుతం రూ.2కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. తమ ఫ్యాక్టరీలో అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించిన యాజమాన్యం మార్కెట్ విలువ ప్రకారం ధర చెల్లిస్తాం.. ప్రభుత్వ భూములను స్వాధీనం చేయండంటూ(అలెనేషన్) ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దీనిపై జిల్లా కలెక్టర్‌ను నివేదిక కోరినట్లు సమాచారం. దీనిని కలెక్టర్ లోతుగా విచారించగా అసైన్డ్ భూములని స్పష్టమైంది. ఆ మేరకు నోటీసులు జారీ చేశారు. -
నాణ్యతా ప్రమాణాలతో భారతీ సిమెంట్
– తాపీ మేస్త్రీల సంక్షేమానికి రూ.లక్ష బీమా ఆదోని టౌన్: నాణ్యతా ప్రమాణాలకు పెట్టింది పేరు భారతీ సిమెంట్ అని ఆ సంస్థ జిల్లా సేల్స్ మేనేజర్ విజయ్‌భాస్కర్ తెలిపారు. బుధవారం రాత్రి ఆదోని పట్టణంలోని మోర్ ఫంక్షన్ హాల్లో భారతి సిమెంట్ తాపీ మేస్త్రీల సమావేశాన్ని స్థానిక డీలర్ నర్సింహారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ఉత్పత్తి ప్రారంభించిన ఆరేళ్లలోనే భారతి సిమెంట్ వినియోగదారుల మన్ననలను పొందిందన్నారు. జర్మనీ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్, ట్యాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్‌తో దేశంలోనే అగ్రగ్రామిగా నిలిచిందన్నారు. ప్రతి బస్తా రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ ద్వారా పరీక్షించబడుతుందన్నారు. భారతి సిమెంట్ కర్మాగారాన్ని కడప వైఎస్సార్ జిల్లాలోని నల్లలింగాయపల్లి గ్రామంలో స్థాపించినట్లు చెప్పారు. తాపీ మేస్త్రీల సంక్షేమం కోసం భారతి సిమెంట్ యాజమాన్యం ప్రతి కార్మికుడికి రూ.లక్ష బీమా అందిస్తుందన్నారు. పనులు చేసే సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.లక్ష బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. భారతి సిమెంట్ నాణ్యతా ప్రమాణాలపై టెక్నికల్ ఆఫీసర్ కిరణ్ కుమార్, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో స్థానిక డీలర్లు సర్దేసాయి గిరి, మల్లికార్జున, రమేష్ రెడ్డి, వినోద్ పాల్గొన్నారు. -
ఇండో-పాక్ పై మోదీకి స్వామి లేఖ
న్యూఢిల్లీ: ఇండో-పాక్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బీజీపీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. దేశీయ పరిశ్రమలు, జాతీయ భద్రత రీత్యా పాకిస్తాన్ నుంచి సిమెంట్ దిగుమతిని నిషేధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, దేశీయ సిమెంట్ పరిశ్రమ ఉనికిని కాపాడుకోవడం, జాతీయ భద్రతా కారణాలరీత్యా మాత్రమే దేశంలోకి సిమెంట్ దిగుమతి నిషేధించాలని అభ్యర్థిస్తున్నానని స్వామి మోదీకి రాసిన ఒక లేఖలో విజ్క్షప్తి చేశారు. పాకిస్తాన్ నుంచి సిమెంట్ దిగుమతులను అనుమతించడమంటే నిషిద్ధ వస్తువులు, హానికరమైన ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి అక్రమ రవాణాకు ఆస్కారం అందించినట్టేనని ఆయన వాదించారు. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ నుంచి సిమెంట్ దిగుమతికి మన దేశం ఒక డంపింగ్ గ్రౌండ్ గా మారిందన్నారు. పాకిస్తాన్ నుంచి పన్నులు లేని సిమెంట్ దిగుమతులకు అనుమతి ఇవ్వడం ద్వారా దేశీయ సిమెంట్ పరిశ్రలను పణంగా పెట్టారని విమర్శించారు. సిమెంట్ పై కాకుండా సిమెంట్ తయారీకి అవసరమైన పదార్థాలపై పన్నులు విధించడం ద్వారా దిగుమతి సుంకాన్ని ఆకర్షించవచ్చని స్వామి సూచించారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా కాన్సెప్ట్ కు ఇది వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. -
నిర్మాణాలకు సిమెంట్ పోటు
పెరిగిన ధరలు.. ఆందోళనలో నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు పాత గుంటూరు: పెరిగిన సిమెంట్ ధరల కారణంగా జిల్లాలో నిర్మాణాలకు ఆటంకం ఏర్పడింది. 20 రోజుల వ్యవధిలో సిమెంటు ధర పెరగడంతో భవన నిర్మాణ దారులు, కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణాలు చేపట్టడం కష్టతరంగా ఉందని వాపోతున్నారు. గతంలో రూ. 320లు ఉన్న సిమెంటు బస్తా ధర, ప్రస్తుతం రూ. 360లకు చేరింది. ఈ ప్రభావం తమను నష్టాలకు గురిచేస్తుందని కాంట్రాక్టర్లు సైతం బెంబేలెత్తుతున్నారు. భవన యజమానులతో తక్కువ ధరకు ఒప్పందాలు కుదుర్చుకొని పెరిగిన సిమెంట్ ధరల కారణంగా నిర్మాణాలు చేయలేక పోతున్నామని అంటున్నారు. జిల్లాలో ప్రతి నెలా లక్ష టన్నుల వరకు 23 కంపెనీలకు చెందిన సిమెంటు అమ్మకాలు జరుగుతాయి. గుంటూరు నగరంలో ఉన్న 100 సిమెంటు దుకాణాల ద్వారా 30 వేల టన్నుల వరకు అమ్మకాలు జరుగుతాయని సమాచారం. గత ఆరు నెలలుగా సిమెంట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఒకేసారి రూ.40 ధర పెరిగింది. సిమెంట్ ఉత్పత్తి లేదని చెప్పి సంస్థలు సరఫరా నిలిపివేయడంతోనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సిమెంటుకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉందని, ప్రస్తుతం వున్న రేటు ప్రకారం కొనుగోలు చేస్తేనే ఎగుమతి చేస్తామని ఉత్పత్తి సంస్థలు అంటున్నాయని, అయితే అధిక ధరలకు కొనుగోలు చేసి అమ్మకాలు కొనసాగించే పరిస్థితి ప్రస్తుతం లేదని సిమెంటు డీలర్లు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని సిమెంటు ధరలు దిగివచ్చేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. నష్టాల బాట పడుతున్నాం.. ఉత్పత్తి సంస్థలు సిమెంటు ధరలు పెంచడంతో అమ్మకాలు జరపలేకపోతున్నాం. పాత ధరలకే కొనుగోలు దారులకు సిమెంటును ఇవ్వాల్సి వస్తోంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టాల బాట పడుతున్నాం. – అబ్దుల్ మదన్, సిమెంటు వ్యాపారి -
చుక్కల్లో సిమెంటు ధరలు..!
– నెల రోజుల్లో సిమెంటు బస్తాకు రూ. 40 నుంచి రూ. 50 పెరుగుదల – ఆందోళనలో గృహ నిర్మాణదారులు మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది గృహ నిర్మాణ దారుల పరిస్థితి. అసలే అత్తెసరు వేతనాలతో అవస్థలు పడుతున్న వారిని పెరుగుతున్న సిమెంట్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నెల వ్యవధిలో సిమెంట్ బస్తా ధర 20 నుంచి 25 శాతం పెరగడంతో ఇంటి నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోందని వినియోగదారులు వాపోతున్నారు. పులివెందుల రూరల్ : రోజు రోజుకు సిమెంటు ధరలు పెరుగుతూ వినియోగదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. సిమెంట్ కంపెనీలు మూకుమ్మడిగా ధరలు పెంచుతుండడంతో గృహ నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. నెల వ్యవధిలో సిమెంటు బస్తా ధర రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగింది. నెలలో భారీగా పెరిగిన ధరలు గతనెల మొదటి వారంలో బస్తా ధర రూ. 260 నుంచి రూ. 270 ఉండగా.. అది పెరిగి రూ. 300 నుంచి రూ. 330కి చేరింది. దీంతో గృహ నిర్మాణదారులు తీవ్ర ఆందోళన చెందారు. తిరిగి కంపెనీలు సిమెంటు ధరలను ఆగస్ట్ చివరి వారంలో మరోసారి పెంచడంతో నిర్మాణదారులు ఖంగుతిన్నారు. ప్రస్తుతం సిమెంటు ధర రూ.360 వరకు పలుకుతోంది. కంపెనీ రకాలను బట్టి డీలర్లు వివిధ ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా ఇష్టానుసారం సిమెంటు ధరలు పెంచుకుంటూ పోతే ఇళ్లు నిర్మించుకోలేమని సామాన్యులు వాపోతున్నారు. జిల్లాలో 5 ఫ్యాక్టరీలున్నా ప్రయోజనం శూన్యం జిల్లాలో ఐదు ప్రముఖ సిమెంటు ఫ్యాక్టరీలున్నాయి. అయినా వినియోగదారులకు ప్రయోజనం ఉండడం లేదు. జిల్లాలో రవాణా ఖర్చులు లేకున్నా ధరలు పెరుగుతుండడంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో తయారైన వాటికి ట్రాన్స్పోర్ట్, ఇతర ఖర్చుల ఆధారంగా ధరలు చెల్లించాలి. జిల్లాలో ఫ్యాక్టరీలు ఉండి కనీసం స్థానికంగా కూడా సిమెంటు ధరల నియంత్రణ లేకపోవడం తీవ్ర అన్యాయమని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని సిమెంటు ధరలు తగ్గించాలని కోరుతున్నారు. -
సిమెంట్ రేట్లు పెరుగుతాయ్!
రైల్వేలు బొగ్గు రవాణా చార్జీలను పెంచడంతో సిమెంటు రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రవాణా చార్జీల పెంపు కారణంగా సిమెంటు పరిశ్రమపై రూ.2,000 కోట్లకు పైగానే ప్రతికూల ప్రభావం పడుతుందని.. ఈ భారాన్ని వినియోగదారులపైనే వేయాల్సి వస్తుందని వారు అంటున్నారు. బొగ్గు రవాణా టారిఫ్‌లలో రైల్వే శాఖ గత వారం కొన్ని మార్పులు చేసింది. ఎక్కువ దూరం రవాణా టారిఫ్‌లను కొంత తగ్గించి.. తక్కువ దూరానికి సంబంధించిన టారిఫ్‌లను పెంచింది. అంతేకాకుండా 100 కిలోమీటర్లకు మించిన బొగ్గు రవాణాపై లోడింగ్, అన్‌లోడింగ్‌కు టన్నుకు రూ.110 చొప్పున కోల్ టెర్మినల్ సర్‌చార్జీని కూడా విధించింది. రైల్వేల తాజా టారిఫ్ పెంపు వల్ల సిమెంటు పరిశ్రమ ఉత్పాదక వ్యయం పెరిగేందుకు దారితీస్తుంది. మరోపక్క, విద్యుత్ ఉత్పాదక వ్యయం కూడా పెరుగుతుంది. ఈ రెంటింటి కారణంగా పరిశ్రమపై రూ.2,000 కోట్ల భారం ఉంటుందని అంచనా. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని కంపెనీలు భరించడం కష్టమే. ఫలితంగా సిమెంటు ధరలు పెరిగే అవకాశం ఉంది’ అని సిమెంటు తయారీదార్ల అసోసియేషన్(సీఎంఏ) ప్రెసిడెంట్ శైలేంద్ర చౌక్సీ వ్యాఖ్యానించారు. -
రోడ్డు స్టాపర్స్ అందజేత
మఠంపల్లి : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు స్థానిక మై హోం సిమెంట్స్ పరిశ్రమ ఆధ్వర్యంలో రోడ్డు స్టాపర్స్, హై విజబిలిటీ జాకెట్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా పరిశ్రమ జనరల్ మేనేజర్ జగన్నాథరావు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టేందుకు గాను పరిశ్రమ ఆధ్వర్యంలో 30 రోడ్డు స్టాపర్స్, మరో 30 హైవిజబులిటీ జాకెట్స్‌ను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ అధికారులు రాజేశ్వరరావు, శ్రీనివాసులు, త్రిలోచనుడు ఉన్నారు. -
వైట్‌టాప్.. సిటీ టిప్‌టాప్!
ఒక్క వాన కురిస్తే చాలు.. నగరంలో ఎక్కడికక్కడ గుంత లు, మోకాళ్లలోతు నీళ్లు. ప్రత్యక్ష నరకం చూపిస్తున్న రోడ్ల సమస్యకు ఫుల్స్టాప్ పెట్టాలని మంత్రి కేటీఆర్ భావిస్తున్నారు. దీనికి వైట్ టాపింగే మార్గమనే నిర్ణయానికొచ్చారు. దశలవారీగా వెయ్యి కిలోమీటర్ల మేర ఈ తరహా రోడ్లను నిర్మిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మినిస్టర్ రోడ్ వరకు దాదాపు 1.3 కి.మీ. మేర వైట్‌టాపింగ్‌కు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. వర్షాలు పడుతుండటంతో పనులు సాగడం లేదు. గతేడాది జూలై చివరలో బంజారాహిల్స్‌లో సిమెంట్ ఉత్పత్తిదారుల సమాఖ్య నిర్మించిన వైట్‌టాపింగ్ రోడ్డుతో వాహనదారులు సంతృప్తికరంగా ఉన్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ రోడ్ల కోసం విజ్ఞప్తులు అందుతున్నాయి. నగరంలో వైట్ టాప్ రోడ్లు దశల వారీగా వెయ్యి కి.మీ. గుంతలు పడవు.. మన్నికెక్కువ.. నిర్వహణ వ్యయమూ తక్కువే 50 శాతం విద్యుత్ ఆదా మన్నిక... నాణ్యత... వాస్తవానికి గతేడాదే దాదాపు వెయ్యి కి.మీ. రోడ్లను వైట్‌టాపింగ్‌తో నిర్మించాలని భావించారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల నే పథ్యంలో నెల రోజుల్లోనే రోడ్ల నిర్మాణం పూర్తిచేయాల్సిరావడంతో ఈ ఆలోచన విరమించుకుంది. ఇటీవల నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్లను కళ్లారా చూసిన మంత్రి కేటీఆర్... ఆధునిక టెక్నాలజీతో కూడిన వైట్‌టాపింగ్ రోడ్లను వేసే ఆలోచన ఉందని తెలిపారు. వైట్ టాపింగ్ అంటే వాస్తవానికి సిమెంటు రోడ్లే. కాకపోతే పూర్తిగా సిమెంటుతో కాకుండా బీటీ పైభాగాన తిరిగి బీటీతో రీకార్పెటింగ్ బదులు పోర్ట్లాండ్ సిమెంటుతో కార్పెటింగ్ చేస్తారు. దీంతో బీటీ రోడ్లు వైట్‌గా మారతాయి కనుక వీటిని వైట్ టాపింగ్ రోడ్లుగా వ్యవహరిస్తున్నారు. వైట్‌టాపింగ్ రహదార్లపై తక్కువ ఓల్టుల బల్బులు చాలు. ప్రకాశవంతంగా కనబడటంతో రాత్రివేళ ప్రమాదాలు తగ్గుతాయి. ఫలితంగా 50 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అంచనా. నిధుల మిగులు... జీహెచ్ఎంసీ బడ్జెట్లో ప్రస్తుతం రూ.400 కోట్లు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చులకే వినియోగిస్తున్నారు. జీహెచ్ఎంసీలో అన్ని రకాల రోడ్లు వెరసి 9,103 కి.మీ. వీటిల్లో బీటీ రోడ్లు 4,173 కి.మీ. నాలుగైదు సంవత్సరాల్లో ఏటా సగటున రూ.300 కోట్లు ఖర్చు చేశారు. అయినా ప్రయోజనం అంతంతమాత్రమే. అదే వైట్ టాపింగ్ రోడ్డును ఒకసారి వేస్తే 30 సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయి. పెద్దగా మరమ్మతులు అవసరం లేదు. బీటీ రీకార్పెటింగ్/మరమ్మతులకు వెరసి కి.మీ.కు అయ్యే వ్యయం దాదాపు రూ. 25 లక్షలు. * 30 ఏళ్లకయ్యే వ్యయం రూ. 7.5 కోట్లు * వైట్ టాపింగ్ రోడ్డుకయ్యే ఖర్చు దాదాపు రూ. 2 కోట్లు * అంటే కి.మీ. రహదారిని పరిగణనలోకి తీసుకుంటే వైట్‌టాపింగ్, బీటీ రీకార్పెటింగ్/మరమ్మతుల మధ్య వ్యత్యాసం రూ. 5.5 కోట్లు * 4వేల కి.మీ. బీటీ రోడ్లను పరిగణనలోకి తీసుకుంటే రూ. 22 వేల కోట్ల ఖర్చు తగ్గుతుంది. ఇతర నగరాల్లోనూ... * ముంబై, నాగ్‌పూర్, చెన్నై, ఇండోర్లతో పాటు పలు నగరాల్లో వైట్‌టాపింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. * మైసూర్ మహారాజా సమయంలో నిర్మించిన బెంగళూర్- మైసూర్ రహదారి దశాబ్దాల పాటు మన్నికగా ఉంది * ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద 1939లో నిర్మించిన ఆ రోడ్డు ఇప్పటికీ వాడుకలో ఉంది. * అమెరికా, యూరప్‌లలో వైట్ టాపింగ్ రోడ్లు వినియోగంలో ఉన్నాయి. హైదరాబాద్‌కు అనుకూలం... * కి.మీ. వైట్ టాపింగ్ పని వారంలో పూర్తిచేయవచ్చు. అదే సీసీ వేయాలంటే నెలలు పడుతుంది. * 50 శాతం విద్యుత్ ఆదా కాగలదని అంచనా. వైట్‌టాపింగ్ రహదార్లపై తక్కువ ఓల్టుల బల్బులు చాలు. ప్రకాశవంతంగా కనబడటంతో రాత్రివేళ ప్రమాదాలు తగ్గుతాయి. * వాహనాలు స్లిప్ కాకుండా రోడ్డుపై చారలుగా పూత ఉంటుంది. టైర్లు కూడా ఎక్కువ రోజులు మన్నుతాయి. * పది శాతం ఇంధనం ఆదా అవుతుంది. దాంతో పాటు కాలుష్యం వెదజల్లే సీఓ2, ఎన్ఓ2, ఎస్ఓ2లు తగ్గుతాయి. * గుంతలు, కుదుపులు లేనందున వాహనాల నిర్వహణఖర్చు కూడా తగ్గుతుంది. వాన నీటి నిల్వ ఉండదు. * బీటీ రోడ్డు పైభాగాన్ని 5 అంగుళాల మందం తొలగించవచ్చు. నూరు శాతం రీసైక్లింగ్‌కు అనుకూలం. * అయితే 30 ఏళ్లు మన్నికగా ఉండేందుకు ఒకసారి రోడ్డు వేశాక తిరిగి తవ్వకూడదు. -
ఎక్స్‌లెంట్‌గా ఏసీసీ లాభాలు
న్యూఢిల్లీ : దేశంలో సిమెంట్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఏసీసీ రెండో త్రైమాసిక లాభాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. 79 శాతం వృద్ధితో కన్సాలిడెటెడ్ నికర లాభాలు రూ.239.12 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు రూ.133.46 కోట్లగా ఉన్నాయి. ఈ సంస్థ జనవరి- డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా ఫాలో అవుతూ ఉంటోంది. దీంతో అన్నీ కంపెనీ 2016 ఆర్థిక సంవత్సర తొలి ఫలితాలను విడుదల చేస్తుండగా.. వాటికి ఒక త్రైమాసికం ముందుగా జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలను ఏసీసీ మంగళవారం రిలీజ్ చేసింది. అయితే మొత్తంగా కన్సాలిడెటెడ్ ఆదాయం 3 శాతం కోల్పోయి, రూ.2,917.26 కోట్లగా నమోదుచేసింది.2015 ఇదే క్వార్టర్లో ఈ ఆదాయాలు రూ.3,015.29 కోట్లగా ఉన్నాయి. కంపెనీ మొత్తం ఖర్చులను సైతం 9శాతం తగ్గించుకుంది. పెట్‌కోక్ ఎక్కువగా వాడడంతో, ఫ్యూయల్ మిక్స్‌లో ఆప్టిమైజేషన్‌ను సాధించగలిగామని కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా స్లాగ్, బూడిద, జిప్సం, జిప్సం మిశ్రమాల ఆప్టిమైజేషన్, ఉత్పత్తి ధరలను తగ్గించిందని పేర్కొంది. సంస్థ మొత్తం వ్యయాలు ఏప్రిల్-జూన్ క్వార్టర్లో రూ.2,603.18 కోట్లకు పడిపోయాయని, గతేడాది ఇదే పీరియడ్‌లో ఇవి రూ.2,848.46 కోట్లగా ఉన్నాయని ఏసీసీ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ఒక్కో షేరుకు 11రూపాయల మధ్యంతర డివిడెంట్ను ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ధరల తగ్గింపుపై ఫోకస్‌ను కంపెనీ ఇలాగే కొనసాగిస్తుందని, చత్తీస్ గఢ్లోని జముల్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు, కంపెనీ స్థాయిని, లాభాలను మరింత పెంచుతుందని ఏసీసీ ఆశాభావం వ్యక్తంచేసింది.మంచి రుతుపవనాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ఇన్ ఫాక్ట్ర్చర్ డెవలప్మెంట్, హౌసింగ్, ఇతర మెగా ప్రాజెక్టుల ప్రేరణ వచ్చే త్రైమాసికంలో నిర్మాణ కార్యక్రమాలపై పాజిటివ్ ప్రభావం చూపుతాయని కంపెనీ ఫలితాల సందర్భంగా పేర్కొంది. -
రోడ్లకు సోలార్ సిమెంట్ వెలుగులు
మెక్సికోః ఇకపై చీకట్లో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. విద్యుత్ అవసరం లేకుండానే రహదార్లు ప్రకాశవంతం కానున్నాయి. మెక్సికో సైంటిస్టుల సృష్టి.. వాహనదారులకు, ప్రయాణీకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. సూర్యరశ్మితో తయారయ్యే విద్యుత్ విధానమైన సోలార్ పవర్ ను కరెంటు లేని సమయంలో వినియోగించుకునే విధానంతో రోడ్లను నిర్మించే దిశగా సైంటిస్టులు అడుగులు వేస్తున్నారు. తమ ప్రయత్నాలు ప్రయోగ స్థాయిని అధిగమించి విజయవంతమవ్వడంతో త్వరలో కొత్త రోడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెక్సికోలోని మికోకెన్స్ యూనివర్శిటీ ఆఫ్ శాన్ నికోలస్ హిడాల్గో (ఎంఎస్ఎన్ఎస్) కు చెందిన శాస్త్రవేత్తలు.. సోలార్ శక్తితో కూడిన రోడ్లకు రూపకల్పన చేశారు. సోలార్ విద్యుత్తును పీల్చుకోగలిగే సిమెంట్ తో రోడ్లను నిర్మించే విధానాన్ని కనిపెట్టారు. తొమ్మిదేళ్ళ క్రితం ప్రాజెక్టును ప్రారంభించిన సైంటిస్ట్ జోసే రూబియో.. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ లేకుండా రోడ్లపై కాంతిని ప్రసరింపచేసే కొత్త సిమెంట్ ను కనిపెట్టారు. జీబ్రా క్రాసింగ్స్ లోనూ, రెండు రోడ్లను విభజించేందుకు, డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు ఇప్పటిదాకా రేడియం పదార్థాన్ని, లైట్లను వాడుతుండగా ఇకపై స్వయం ప్రకాశిత సిమెంట్ ను వినియోగించి రోడ్లను కాంతివంతంగా మార్చే పద్ధతికి రూబియో శ్రీకారం చుట్టారు. కొత్తగా కనుగొన్న సిమెంట్ తో రోడ్లు వేయడం వల్ల... అవి పగటి పూట సూర్యరశ్మిని గ్రహించి, రాత్రి సమయంలో సోలార్ విద్యుత్ కాంతులను వెదజల్లుతాయి. ఈ సిమెంట్ తో నిర్మించిన రోడ్లపై ఆకుపచ్చ, నీలం రంగుల్లో కాంతి వెదజల్లుతుంటుంది. దీంతో రోడ్ లైట్స్ లేకుండానే వాహనాలు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వాడే రేడియం వంటి స్వయం ప్రకాశిత పదార్థాలు కేవలం మూడు నాలుగేళ్ళపాటు మాత్రమే పనిచేసి, ఆ తర్వాత వాటి శక్తిని కోల్పోయే పరిస్థితిలో... ఈ స్వయం ప్రకాశిత సిమెంట్ మాత్రం... వందల ఏళ్ళైనా తన కాంతిని కోల్పోదు. అయితే రోడ్లకు ఈ సిమెంట్ వాడితే దానిపై పడే దుమ్ము, ధూళి వల్ల కాంతిని కోల్పోతాయన్న అనుమానాలను చాలామంది వ్యక్తం చేశారని, సమస్యను అధిగమించేందుకు సిమెంట్ లో క్రిస్టల్స్ ను కూడ వినియోగించినట్లు రూబియో తెలిపారు. కొత్తరకం సిమెంట్ తో నిర్మించిన ఈ రోడ్లు ఒకరోజు మొత్తం సూర్యరశ్మిని గ్రహిస్తే దాదాపుగా వాటికి అందిన సోలార్ శక్తితో 12 గంటలపాటు ప్రకాశించగల్గుతాయి. అంతేకాక పర్యావరణ అనుకూలంగా ఉండటంతోపాటు, భూమికి సైతం ఎటువంటి ఇబ్బంది కలగదని, రోడ్ల నిర్మాణంపై ప్రయోగాలు పూర్తిచేసిన శాస్త్రవేత్తల బృందం పేటెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. పేటెంట్ పొందిన వెంటనే తమ ప్రాజెక్టుద్వారా రోడ్ల అభివృద్ధిని ప్రారంభిస్తామని రూబియో వెల్లడించారు. -
అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంటు ప్లాంట్లు
♦ ఏపీ సహా ఇతర రాష్ట్రాల యూనిట్లలో కొన్నింటి విక్రయం ♦ డీల్ విలువ రూ. 15,900 కోట్లు న్యూఢిల్లీ: సిమెంటు రంగంలో కన్సాలిడేషన్‌కు తెరతీస్తూ రుణ సంక్షోభంలో ఉన్న జైప్రకాష్ అసోసియేట్స్ (జేఏఎల్) తమ సిమెంటు వ్యాపారంలో కొంత భాగాన్ని అల్ట్రాటెక్ సంస్థకు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 15,900 కోట్లు. గత నెలలో కర్ణాటక ప్లాంటును కూడా విక్రయించాలని యోచించినప్పటికీ... తాజాగా దాన్ని పక్కన పెట్టడంతో ఒప్పందం విలువ రూ. 16,500 కోట్ల నుంచి రూ. 15,900 కోట్లకు తగ్గింది. కర్ణాటక ప్లాంటు వార్షికోత్పత్తి సామర్థ్యం 1.2 మిలియన్ టన్నులుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని 17.2 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ప్లాంట్లను, 4 మిలియన్ టన్నుల గ్రైండింగ్ యూనిట్‌ను (యూపీ) అల్ట్రాటెక్‌కు విక్రయించేందుకు బోర్డు ఆమోదించినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు జేఏఎల్ వెల్లడించింది. కర్ణాటకలోని షాబాద్ ప్లాంటును మినహాయించేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. మొత్తం డీల్ విలువ రూ. 15,900 కోట్లు కాగా, గ్రైండింగ్ యూనిట్ పనుల పూర్తి కోసం గాను యూటీసీఎల్ మరో రూ.470 కోట్లు చెల్లిస్తుంది. 9-12 నెలల్లోగా విక్రయ ప్రక్రియ పూర్తి కాగలదని జేఏఎల్ తెలిపింది. ఒప్పందం అనంతరం ఆంధ్రప్రదేశ్ సహా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జేఏఎల్ వద్ద మొత్తం 10.6 మిలియన్ టన్నుల సామర్ధ్యం గల ప్లాంట్లు మిగులుతాయి. అటు అల్ట్రాటెక్ సామర్థ్యం 91.1 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. తమ అంచనాల ప్రకారం కొనుగోలు ప్రక్రియ పూర్తికావటానికి 12-14 నెలలు పట్టొచ్చని స్టాక్ ఎక్స్చేంజీలకు అల్ట్రాటెక్ తెలిపింది. వేల కోట్ల రుణాలతో సతమతమవుతున్న జేపీ అసోసియేట్స్‌కి తాజా డీల్‌తో కొంత ఊరట లభించనుంది. తాజా పరిణామంతో జేఏఎల్ షేర్లు బీఎస్ఈలో 3.66 శాతం పెరిగి రూ. 7.64 వద్ద, అల్ట్రాటెక్ షేర్లు 1.09 శాతం పెరిగి రూ. 3,227 వద్ద ముగిశాయి. -
సిమెంట్ డిమాండ్ పెరగొచ్చు!: ఇండ్-రా
ముంబై: సిమెంట్ డిమాండ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4-6 శాతంమేర పెరిగే అవకాశముందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) తన నివేదికలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంపై అధిక దృష్టి కేంద్రీకరించడమే డిమాండ్ పెరుగుదలకు కారణమని పేర్కొంది. ఇండ్-రా నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 5.6 శాతంమేర పెరిగింది. ఈ డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3 శాతంగా ఉంటుందని అంచనా. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హౌసింగ్ డిమాండ్ పెరిగే అవకాశం లేదని ఇండ్-రా తెలిపింది. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపై అధికంగా దృష్టిపెట్టే అవకాశముందని పేర్కొంది. -
66 వేలకే సొంతిల్లు!
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అన్నారు పెద్దలు. సామాన్య మధ్యత రగతి కుటుంబాలకు ఆర్థికంగా అత్యంత భారమైన పనులివి. సాంకేతిక అభివృద్ధి చాలా రకాల సేవలను తక్కువ ధరకు, ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న వారికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నా, ఇంటి నిర్మాణంలో సౌకర్యాల అభివృద్ధి జరుగుతోంది కానీ ఖర్చు విషయంలో మాత్రం తగ్గుదల లేదింత వరకూ. సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము.. ఇలా ప్రతీదీ ఖరీదే. ఇలాంటి పరిస్థితుల మధ్య వియత్నాం పరిశోధకులు సరికొత్త గృహ నమూనాను ఆవిష్కరించారు. నాలుగేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ ‘ఎస్ హౌస్’ నిర్మాణానికి సంబంధించి తాజాగా నమూనాను ప్రదర్శించారు. కేవలం వెయ్యి డాలర్ల (భారత ద్ర వ్యమానంలో దాదాపు రూ.66 వేలు) ఖర్చుతో పూర్తి నిర్మాణం పూర్తయ్యే ఈ ఇంటి విశే షాలు ఆసక్తికరంగా ఉన్నాయి. - సాక్షి సెంట్రల్‌డెస్క్ ప్రస్తుతం ఈ ఇల్లు ప్రీ మార్కెట్ దశలో ఉంది. త్వరలోనే భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం.. ఆ తర్వాత అమ్మకానికి పెట్టడం అంతే! ఇల్లేమిటి ఉత్పత్తి చేయడం ఏమిటి? అంటే... ఈ ఇంటి విషయంలో అంతే. కాంక్రీట్ ఫౌండేషన్, వుడెన్ ఫ్లోర్, స్టీల్ ఫ్రేమ్, స్టీల్ షీట్ రూఫ్, ఒక స్టీల్ డ్రైనేజ్‌గటర్... వీటిని వేరువేరుగా తయారు చేస్తారు. అన్నింటినీ కలిపి ఒక చోట అమర్చుకుంటే చాలు ఇంటి నిర్మాణం పూర్తి అవుతుంది. మూడు గంటల్లో నిర్మాణం.. 30 ఏళ్ల జీవితం... పై సరంజామాతో ‘ఎస్ హౌస్’ను అమర్చడానికి మూడు గంటల సమయం పడుతుందని రూపకర్తలు చెబుతున్నారు. కనీసం ముప్పై సంవత్సరాల పాటు ఈ ఇంటిలో దర్జాగా నివ సించవచ్చని హామీ ఇస్తున్నారు. ఆ తర్వాత కూడా ఇల్లు చెక్కుచెదరదని అంటున్నారు. 340 చదరపు అడుగుల ఇల్లు ఫార్ములా ప్రకారం వెయ్యి డాలర్ల వ్యయం తో 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకోవచ్చు. అదనంగా వెచ్చించి ఇంతకంటే విశాలంగా కావాలన్నా నిర్మించుకోవచ్చు, ఒకటికి మించిన స్థాయిలో ఇళ్లను జాయింట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సిమెంట్, ఇసుక అవసరం లేదు ఈ ఫార్ములాలో పేర్కొన్న సరంజామా తప్ప నిర్మాణంలో అదనంగా ఎలాంటి అవసరాలూ ఉండ వు. అక్రమ రవాణా పాలవుతూ ధర విషయంలో కొండెక్కిన ఇసుక కానీ, సిమెంట్ కానీ, ప్రత్యేకంగా ఇనుము కానీ కొనాల్సిన అవసరం ఉండదు. తుప్పుపట్టదు, చెదలు దరిచేరవు ఈ నిర్మాణంలో ఉపయోగించే వుడ్‌కు, స్టీల్‌కు చెద, తుప్పు భయాలుండవని రూపకర్తలు హామీ ఇస్తున్నారు. ముప్పై సంవత్సరాలు గడిచినా కూడా అవి చెక్కుచెదరవని చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలనూ ఎదుర్కొనగలదు.. రాళ్లతో కట్టిన పునాదులేమీ లేకపోయినా, భారీగా ఖర్చు పెట్టకపోయినా... టైపూన్లు, హరికేన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని నిలబడే స్థాయిలో ఈ నిర్మాణం ఉంటుంది. ప్రస్తుతానికి వియత్నాంలో.. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం ‘ఎస్ హౌస్’ ప్రణాళికను ప్రారంభించారు. ఇప్పుడు ఇది ప్రొటోటైప్ దశ వరకూ వచ్చింది. అతి త్వరలోనే వియత్నాంలో ఇలాంటి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని దేశాల్లోని పేదలందరికీ ఇలాంటి ఇళ్ల నిర్మాణానికి వనరులను సమకూర్చే లక్ష్యం ఉంది రూపకర్తలకు. మరి వారి లక్ష్యం సిద్ధించి... మనదేశంలోని గుడిసెలకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆశిద్దాం. -
‘డబుల్’ రాయితీ!
♦ రెండు పడక గదుల ఇళ్లకు ఇసుక ఉచితం ♦ తగ్గింపు ధరలకు సిమెంటు, స్టీలు ♦ ప్రతిపాదిత అంచనాలో ఇళ్లు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలకు రాయితీ ♦ తొలి టెండర్లలో భారీగా కోట్ చేయడంతో కొత్త నిర్ణయం ♦ ఎస్ఎస్ఆర్ తగ్గించి నిర్మాణ అంచనా మొత్తం కుదింపు ♦ వరంగల్‌లో మలి టెండర్లు పిలిచిన అధికారులు సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు సిమెంటు, స్టీలును తగ్గింపు ధరలకు అందజేయనుంది. ఈ మేరకు ‘డబుల్’ ఇళ్ల నిర్మాణ సంస్థలకు రాయితీలు కల్పించి... ప్రతిపాదిత ధరలోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకోనుంది. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ. 946గా ప్రభుత్వం ఖరారు చేసింది. అన్ని పన్నులు కలిపి ఈ మొత్తం లోపే కొటేషన్లను ఆశిస్తోంది. కానీ పట్టణ ప్రాంతాల్లో కాలనీలుగా నిర్మించే చోట్ల మౌలిక వసతుల కల్పన భారీ వ్యయంతో కూడుకున్న నేపథ్యంలో... ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.5.30 లక్షల నిధులు సరిపోవని నిర్మాణ సంస్థలు స్పష్టం చేశాయి. ఈ మేరకు వరంగల్‌లో ఇటీవల జరిగిన తొలి టెండర్లలో చదరపు అడుగుకు రూ.1,200కు పైగా కోట్ చేశాయి. దీంతో ఆ టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై కాంట్రాక్టర్లతో అధికారులు చర్చించగా.. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మొత్తానికి నిర్మించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణ సామగ్రి ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) ధరలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆదేశాలు అందడంతో వరంగల్‌లోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో జీ ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మించే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని తగ్గించి తిరిగి టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. ఇసుక క్యూబిక్ మీటర్ ధర రూ.560 ఉండగా దాన్ని పూర్తి ఉచితంగా అందించనున్నారు. దీనిపై రవాణా చార్జీ మాత్రమే నిర్మాణ సంస్థ భరించాల్సి ఉంటుంది. ఇక సిమెంటు బస్తా ధర రూ.310 ఉండగా దాన్ని రూ.270కి తగ్గించారు. స్టీలు ధర టన్నుకు రూ.43 వేలు ఉండగా... రూ.36 వేలకు తగ్గించారు. వీటిని ప్రభుత్వమే నిర్ధారిత ధరలకు సరఫరా చేయనుంది. మొత్తంగా అంబేద్కర్ నగర్ ప్రాజెక్టు అంచనాను రూ.43.70 కోట్ల నుంచి రూ.39 కోట్లకు (10 శాతానికిపైగా) తగ్గించారు. కొత్త అంచనా ప్రకారం మళ్లీ టెండర్లు పిలిచారు. వీటిని సోమవారం తెరవనున్నారు. అన్ని పట్టణాలకు ఇదే తరహాలో..! కాలనీలుగా ‘డబుల్’ ఇళ్లను నిర్మించే అన్ని ప్రాంతాల్లో ఇదే తరహా పరిస్థితి ఉండే అవకాశముందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మౌలిక వసతుల కల్పనకు భారీగా వ్యయం అవుతున్నందున టెండర్లలో ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఈ పథకానికి నిర్మాణ సామగ్రి ధరలను తగ్గించి సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాలనీలుగా కాకుండా లబ్ధిదారులకు సంబంధించిన స్థలంలో వ్యక్తిగత నమూనాలో నిర్మించే ఇళ్ల వ్యయం తక్కువగా ఉంటుంది. మరోవైపు రాష్ట్ర ఖజానాకు చేరే పన్నుల తగ్గింపు, వ్యాట్‌ను రీయింబర్స్ చేయడం లాంటి మరిన్ని ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొత్తంగా ప్రతిపాదించిన ధరల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టనుంది. -
సిమెంట్ తయారీకి హబ్‌గా కర్నూలు!
-
‘తారు’లో తిరకాసు!
ఖజానాకు చిల్లుపెట్టేందుకు అధికారుల వ్యూహం కాంట్రాక్టర్లకు రూ.33 కోట్లు దోచిపెట్టేందుకు ఎత్తుగడ రోడ్ల నిర్మాణంలో స్టోన్డస్ట్కు బదులు సిమెంట్ కలపాలని నిబంధన కమీషన్ల దందా పెంచుకునేందుకేనని వెల్లువెత్తుతున్న ఆరోపణలు హైదరాబాద్: తారు రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు పంచాయతీరాజ్ విభాగం ఇంజనీరింగ్ అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు! గతంలో ఎన్నడూ లేని విధంగా నిబంధనల్లో సరికొత్త మెలిక పెట్టారు. బీటీ తయారీలో స్టోన్ డస్ట్‌కు బదులు సిమెంట్ కలపాలంటూ పేర్కొన్నారు. తద్వారా రాష్ట్ర సర్కారుపై రూ. 33 కోట్ల అదనపు భారం మోపారు. ఆర్ అండ్ బీ రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్లు సైతం పంచాయతీరాజ్ రోడ్లు చేపట్టేందుకు క్యూ కడుతున్న తీరు చూస్తే ఈ తారు తిరకాసులో ఏం జరిగిందో తేలిపోతుంది. కమీషన్ల దందా పెంచుకునేందుకే అధికారులు ఈ జిమ్మిక్కులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని నిబంధన... ఎంఆర్ఆర్ గ్రాంటు నిధులతో రాష్ట్రంలో 12,006 కిలోమీటర్ల రోడ్డు పనులకు ప్రభుత్వం గతేడాది నవంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు రూ.1,766.92 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే బీటీ రోడ్లకు సంబంధించి పాటించాల్సిన నిబంధనల తయారీ డేటాలో ఇంజనీరింగ్ అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు శాతం సిమెంట్‌ను జత చేయాలని పేర్కొన్నారు. సాధారణంగా బీటీ మిశ్రమంలో రెండు శాతం స్టోన్ డస్ట్‌ను కలుపుతారు. రాష్ట్రంలోని బీటీ ప్లాంట్లన్నింటా ఇదే తీరుగా బీటీ మిశ్రమం తయారవుతోంది. ఆర్ అండ్ బీతోపాటు గతంలో పంచాయతీరాజ్ రోడ్లన్నింటా ఇదే నిబంధన అమల్లో ఉంది. రూ.2,500 ఖర్చయ్యే డస్ట్ బదులుగా రూ.30 వేల విలువయ్యే సిమెంట్ ధరతో అదనపు భారం పెరిగిపోయింది. కానీ సిమెంట్ మిశ్రమంతో ఈ ఖర్చు ప్రతి కిలోమీటరుకు దాదాపు రూ.27,500 చొప్పున పెరిగిపోతుంది. రాష్ట్రంలో మండలాలవారీగా అనుమతించిన ప్యాకేజీ పనులను లెక్కగగితే... దాదాపు రూ.33 కోట్ల అంచనా వ్యయం పెరిగిపోతోంది. అంతమేరకు సర్కారుకు కుచ్చుటోపీ పెట్టినట్లేనని స్పష్టమవుతోంది. నాణ్యత అంతంతే... బీటీలో స్టోన్ డస్ట్‌ను కలిపినా సిమెంట్ కలిపినా నాణ్యత విషయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన రోడ్డు పనుల్లో సిమెంట్ ఉపయోగించిన దాఖలాలు లేవు. మరోవైపు పనులు జరిగాక బీటీ మిశ్రమంలో సిమెంట్ కలిపారా, డస్ట్ కలిపారా అనేది గుర్తించటం అసాధ్యమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అనుచిత నిబంధనలతో అంచనా వ్యయాన్ని పెంచినందుకు ప్రతి కాంట్రాక్టరు నుంచి అంతమేరకు కమీషన్లు పెంచుకోవాలనేది ఇంజనీరింగ్ అధికారుల ఎత్తుగడగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒక అధికారి కింది స్థాయి ఉద్యోగుల నుంచి డివిజన్‌కు రూ. 2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు గుప్పుమంటోంది. వీటితోపాటు సీఆర్ఆర్ నిధులతో మంజూరైన పనులకు సైతం డివి జన్లవారీగా వసూళ్ల పర్వం జోరందుకుంది. -
పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా సిమెంటు
పన్ను ఆదాయంకోల్పోతున్న తెలుగు రాష్ట్రాలు * రోజుకు 6,000 టన్నుల సిమెంటు రాక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొందరు సిమెంటు వ్యాపారుల కారణంగా తెలుగు రాష్ట్రాలు పన్ను ఆదాయాన్ని కోల్పోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లాలకు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి సిమెంటు అక్రమంగా రవాణా అవుతోంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. గత కొంత కాలంగా ఈ తంతు జరుగుతోందని తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌కు, ఒడిశా నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు, అలాగే ఛత్తీస్‌గఢ్ నుంచి ఖమ్మంకు సిమెంటు రవాణా అవుతోంది. వివిధ రాష్ట్రాల్లో సిమెంటు ధరల తారతమ్యం ఉంది. దీనికితోడు తెలుగు రాష్ట్రాల్లో సిమెంటు దిగుమతిపై ఎంట్రీ ట్యాక్స్ లేకపోవడంతో వ్యాపారులు అదనుగా తీసుకుంటున్నారు. నెలకు రూ. 18 కోట్లు.. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒరిస్సా నుంచి రోజుకు సుమారు 6 వేల టన్నుల సిమెంటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు దిగుమతి అవుతోందని సమాచారం. పొరుగు రాష్ట్రాల్లో అమ్మకాలు నమోదు కావడంతో ఆ మేరకు తెలుగు రాష్ట్రాలకు ఆదాయం రాకుండా పోతోంది. సిమెంటుపై వ్యాట్ 14.5% ఉంది. అంటే ఒక్కో బస్తాపై వ్యాట్ సుమారు రూ.45-50లు అవుతుంది. రోజుకు 6 వేల టన్నుల సిమెంటు దిగుమతి అవుతోందంటే ఈ లెక్కన నెలకు రూ.18 కోట్ల పన్ను ఆదాయాన్ని రెండు రాష్ట్రాలు చేజార్చుకుంటున్నాయి. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక వ్యాపారికి సిమెంటు పంపాలంటే అక్కడి ప్రభుత్వ వెబ్సైట్ ఇ-సుగమ్ ద్వారానే లావాదేవీలు జరపాల్సిందే. ఈ విధానంతో ఆ వ్యాపారి నుంచి కర్ణాటక ప్రభుత్వానికి వ్యాట్ ఖచ్చితంగా వస్తుంది. ఇటువంటి వ్యవస్థ ఇక్కడ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయి’ అని ఒక ప్రముఖ కంపెనీ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. -
ఇక కాంక్రీట్ రోడ్లే!
కంపెనీల నుంచి తక్కువ ధరకు సిమెంట్ దేశవ్యాప్తంగా ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం అందులో భాగంగానే రాష్ట్రానికీ రాయితీ సిమెంట్ త్వరలో ఢిల్లీకి ఉన్నతస్థాయి బృందం సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందిన దేశాల్లో దర్జాగా కనిపించే కాంక్రీట్ రోడ్లు త్వరలో మన రాష్ట్రంలో కూడా కనిపించబోతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా చేపట్టే జాతీయ రహదారులను సిమెంట్‌తో నిర్మించనున్నట్లు కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర రహదారుల విషయంలోనూ అదే మార్గాన్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటి వరకు కొన్ని చోట్లే కనిపించిన కాంక్రీట్ రోడ్లు ఇకపై విస్తృతం కానున్నాయి. తారు రోడ్లతో పోల్చితే సిమెంటు రోడ్ల నిర్మాణానికి 15 నుంచి 20 శాతం వరకు అధిక వ్యయమవుతుంది. కానీ నేరుగా సిమెంటు కంపెనీల నుంచే తక్కువ ధరకు సిమెంటును పొందేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు రాయితీ రేట్లకు సిమెంట్‌ను అందించేలా ఆయా కంపెనీలతో కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర రహదారుల నిర్మాణానికి ముందుకొచ్చే రాష్ట్రాలకు కూడా అదే ధరకు సిమెంట్‌ను అందజేస్తామని ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన రాష్ర్ట ప్రభుత్వం.. తెలంగాణలో కొత్తగా భారీ స్థాయిలో నిర్మించనున్న రోడ్లలో ముఖ్యమైన వాటిని సిమెంట్ డిజైన్లోకి మార్చాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన నితిన్ గడ్కారీతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. రాష్ర్టంలో నిర్మించనున్న కాంక్రీట్ రోడ్ల వివరాలతో నివేదికను అందజేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుతం రాష్ర్ట యంత్రాంగం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో బ్యాగుపై రూ. 100 ఆదా రోడ్లు, వంతెనలు నిర్మించే కాంట్రాక్టర్లు, సిమెంటు కంపెనీల మధ్య అనుసంధానం కోసం ఇటీవల కేంద్రం ప్రత్యేకంగా ఓ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. సిమెంటు తయారీదారులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి నేరుగా రోడ్ల నిర్మాణదారులకు సిమెంట్‌ను తక్కువ ధరకు పంపిణీ చేయాలని సూచించింది. దీనికి తయారీదారులు కూడా అంగీకరించారు. అయితే ఒక్కో కంపెనీ ఒక్కో ధరను కోట్ చేయనుంది. ఇలా ఈ ఒప్పందం పరిధిలో దాదాపు 101 కంపెనీలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వెరసి హీనపక్షంగా మార్కెట్ ధర కంటే ప్రతి బస్తాపై రూ.100 వరకు రాయితీ ఉంటుందని అంచనా. ఫలితంగా తారు రోడ్డు నిర్మాణానికయ్యే వ్యయం కంటే సిమెంట్ రోడ్డు నిర్మాణ వ్యయం మరీ ఎక్కువయ్యే అవకాశం లేదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లపై ఖర్చు తక్కువే... రాష్ట్రంలో ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో నిర్మించే రోడ్లకు తారు పొరలను ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి వ్యయం అధికంగా ఉంటోం ది. కానీ కాంక్రీట్ రోడ్లకు అదనంగా పొరలు నిర్మించాల్సిన అవసరం ఉండదు. అంటే తారు పొరలు ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల ఇంచుమించు సిమెంటు రోడ్డు వ్యయానికి సమానంగా ఖర్చవుతోంది. అలాంటి చోట్ల సిమెంటు రోడ్లు నిర్మిస్తే అదనంగా అయ్యే వ్యయం పెద్దగా ఉండదు. దీంతో అలాంటి రోడ్లను అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. రాష్ర్టవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ. 6 వేల కోట్లతో రోడ్లు, వంతెనలను నిర్మించబోతున్నారు. వీటికి వీలైనంత మేర రాయితీ ధరలకు సిమెంటును నేరుగా కంపెనీల నుంచి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రం నుంచి తెలుసుకునేందుకు త్వరలో ఓ ఉన్నత స్థాయిబృందాన్ని ఢిల్లీకి పంపుతోంది. -
లఫార్జ్-హోల్సిమ్ విలీనానికి బ్రేక్!
డీల్‌ను తిరస్కరించిన హోల్సిమ్ బోర్డు జెనీవా: ప్రపంచ సిమెంట్ దిగ్గజాలైన హోల్సిమ్, లఫార్జ్‌ల మధ్య కుదిరిన మెగా విలీనానికి బ్రేకులు పడ్డాయి. 40 బిలియన్ డాలర్ల ఈ ప్రతిపాదిత డీల్‌ను ఇప్పుడున్న ప్రకారం ఒప్పుకోబోమని స్విట్జర్లాండ్ సంస్థ హోల్సిమ్ డెరైక్టర్ల బోర్డు తిరస్కరించింది. అంతేకాకుండా విలీనం తర్వాత పాలనాపరమైన అంశాలపైనా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇరు కంపెనీలకూ భారత్‌లో గణనీయమైన స్థాయిలోనే సిమెంట్ కార్యకలాపాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ విలీన డీల్‌కు భారత్ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) నుంచి ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది కూడా. ఫ్రాన్స్ దిగ్గజం లఫార్జ్, హోల్సిమ్‌లు తమ విలీన ప్రణాళికలను 2014 ఏప్రిల్‌లో ప్రకటించాయి. ఈ విలీనంతో 90 దేశాల్లో కార్యకలాపాలతో పాటు 40 బిలియన్ డాలర్ల అమ్మకాలు గల సంస్థ ఆవిర్భవించనుంది. అంతేకాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ గ్రూప్‌గా కూడా అవతరించనుంది. పాలనా పరమైన అంశాలతో పాటు షేర్ల ఎక్స్ఛేంజ్ రేషియో విషయంలో కూడా మరింతగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని హోల్సిమ్ డెరైక్టర్ల బోర్డు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంబినేషన్ ఒప్పందాన్ని ఇక పరిగణనలోకి తీసుకోబోమని సమావేశంలో నిర్ణయించినట్లు హోల్సిమ్ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది జూలైలో ఇరు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు విలీనానికి సంబంధించి ఈ కాంబినేషన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కాగా, ఈ విలీనాన్ని సాకారం చేసేందుకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని... ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే ఏవైనా సవరణలకు ఆస్కారం ఉంటుందని లఫార్జ్ కూడా మరో ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకానీ ఇప్పుడున్న ఒప్పందాల్లో ఇతరత్రా ఎలాంటి మార్పులను అంగీకరించబోమని తేల్చిచెప్పింది. -
స్వల్పశ్రేణిలో షేర్ల కదలికలు!
ఇన్వెస్టర్ల పొజిషన్లు అంతంతే... సిమెంటు, ఆటోమొబైల్ కంపెనీల విక్రయాల డేటా నేపథ్యంలో అప్రమత్తత ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా న్యూఢిల్లీ: సంవత్సరాంతపు రోజులు కావడంతో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ పొజిషన్లు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని... దాంతో ఈ వారం షేర్లు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. అలాగే సిమెంటు, ఆటోమొబైల్ కంపెనీల డిసెంబర్ నెల అమ్మకపు గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారని చెప్పారు. 2014లో ఇప్పటివరకూ 30% పెరిగిన బీఎస్ఈ , సెన్సెక్స్, ఎన్ ఎస్ఈ నిఫ్టీలు ఈ సంవత్సరాంతపువారంలో కన్సాలిడేట్ కావొచ్చని వారు అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడుల తీరు, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపవచ్చని వారు వ్యాఖ్యానించారు. ఈ వారం జనవరి 2న హెచ్ఎస్బీసీ తయారీ సూచీకి సంబంధించిన డేటా వెల్లడవుతుందని, దీనికి తోడు డిసెంబర్ నెలకు సిమెంటు, ఆటోమొబైల్ కంపెనీలు సేల్స్ డేటా వెలువడుతుందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మలిక్ చెప్పారు. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్, రూపాయి కదలికలు సమీప భవిష్యత్తులో మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని క్యాపి టల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అన్నారు. ఈ వారం మార్కెట్ స్వల్పశ్రేణిలో కదలవచ్చని, మధ్యకాలికంగా నిఫ్టీ 8,100-8,550 మధ్య ట్రేడ్‌కావొచ్చని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ అంచనావేశారు. 2015 జనవరి రెండోవారం నుంచి వెలువడే కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు మార్కెట్లను భారీగా కదల్చవచ్చని నిపుణులు అంటున్నారు. దేశ ఆర్థిక చరిత్రలో 2015 ఏడాది ప్రధానమైనదిగా నిలుస్తుందని, దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి బాటలు వేసే పలు సంస్కరణలు అమలవుతాయని అంచనావేస్తున్నట్లు క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఫండ్ మేనేజర్ నిలేష్ షెట్టి చెప్పారు. 2 బిలియన్ డాలర్లకు ఎఫ్ఐఐ పెట్టుబడులు డిసెంబర్ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు దాదాపు 2 బిలియన్ డాలర్లకు చేరాయి. డిసెంబర్ 1-26 తేదీల మధ్య ఈక్విటీ మార్కెట్లో వారి పెట్టుబడులు 116 మిలియన్ డాలర్ల (రూ. 553 కోట్లు) మేర ఉన్నాయి. రుణ మార్కెట్లో ఇవి 1.94 బిలియన్ డాలర్లకు (రూ. 12,065 కోట్లు) చేరినట్లు సెబి తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది మొత్తం ఎఫ్ఐఐ పెట్టుబడులు 42 బిలియన్ డాలర్లకు (రూ.2.56 లక్షల కోట్లు) పెరిగాయి. ఈక్విటీల్లో 16 బిలియన్ డాలర్లు (రూ. 96 వేల కోట్లు) రుణపత్రాల్లో 26.4 బిలియన్ డాలర్ల (రూ.2.6 లక్షల కోట్లు) చొప్పున వారు పెట్టుబడి చేశారు. -
అందం కోసం...సిమెంట్ రాసుకుంటా!
వృద్ధాప్యం గురించి హాలీవుడ్ హాట్ లేడీ సోఫియా వెర్గరా చేస్తున్న వ్యాఖ్యలు హాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వయసు మీద పడే కొద్దీ ఒంటి మీద ముడతలు పడతాయి కదా... అవి పోవడానికి శస్త్ర చికిత్స చేయించుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చారు సోఫియా వెర్గరా. ఇప్పుడేమో ‘ఒకవేళ నా కంటి కింద ముడతలు వచ్చాయనుకోండి... సిమెంట్ రాసుకుంటే అవి మాయమయ్యే అవకాశం ఉందంటే, నేను రెడీ!’ అంటున్నారు. అది మాత్రమే కాదు అందం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని కూడా అన్నారు. ‘‘నా వయసు నాలుగు పదులు. కానీ, రెండు పదుల్లోనే ఉన్నానన్నది నా ఫీలింగ్’’ అని పేర్కొన్నారు. మొత్తానికి అందమంటే ఈ హాలీవుడ్ భామకు ఎంత పట్టింపో అర్థమవుతోంది. -
'రోబోటిక్ టెక్నాలజీతో సిమెంట్ తయారీ'
-
ఆర్ట్ ఈజ్ లైఫ్..
నందు మనవడిని పొదివి పట్టుకుని పేవ్‌మెంట్‌పై ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న అమ్మమ్మ ఆలింగనంలో ఆర్తి ఉంది. తుది శ్వాస వరకూ మనవడి భవిష్యత్తుకు ఆసరాగా నిలవాలన్న ఆదుర్దా ఉంది. వీటిని యథాతథంగా ప్రతిఫలింపజేసిన వర్ణ చిత్రం ఆహూతుల్ని ఆకట్టుకుంది. మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం ప్రారంభమైన ఆర్ట్‌లైఫ్ ఎట్ 55 ప్రదర్శన ఇలాంటి అర్థవంతమైన చిత్రాలకు వేదికైంది. గోమాతతో ముచ్చట్లాడుతున్న బాలుడి వదనంలో సంతోషాన్ని, ఆర్ఫన్ హోమ్‌లోని చిన్నారి దీనమైన చూపుల్ని ఒడిసిపట్టుకున్న చిత్రకారిణి ఎన్ఆర్ఐ రాధా వల్లూరి అచ్చమైన భారతీయతను ప్రతిబింబించే చిత్రాలను గీసి కళాభిమానుల ప్రశంసలు అందుకున్నారు. చిత్ర ప్రదర్శనను దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రారంభించారు. సినీ హీరో నందు, హీరోయిన్లు విమలారామన్, నిఖితా నారాయణన్, పేజ్‌త్రీ ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సినీనటి సమంత ఆధ్వర్యంలోని ప్రత్యూష సపోర్ట్‌కు నిర్వాహకులు ఆర్థిక సహాయం అందించారు. -
సీసీఐలో ఉద్రిక్తత
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామ శివారులో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని ఇళ్లు, ఆహారపదార్థాలు, తాగునీటిపై సిమెంట్ తో కూడిన దుమ్ము విపరీతంగా పడుతోందని గ్రామ యువకులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు. పర్సనల్ మేనేజర్ గుప్తాను అడ్డుకున్నారు. కార్మికులను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుతగిలారు. దీంతో కంపెని ప్రతినిధు లు, యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కరన్‌కోట్ గ్రామానికి చెందిన 50 మంది యువకులు సోమవారం ఉదయం సీసీఐ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు. పర్సనల్ మేనేజర్ గుప్తాను అడ్డుకున్నారు. లిఖిత పూర్వంగా హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించబోమని పట్టుబట్టారు. గుప్తాను తొలుకొని ఫ్యాక్టరీ పక్కనే ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనంలోని తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. గతంలో ఇచ్చిన హామీ ఏమైంది...! గతంలో సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి విపరీతంగా దుమ్ము వస్తే ఆందోళన చేసిన గ్రామస్తులకు త్వరలో పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని కంపెని ప్రతినిధులను యువకులు ప్రశ్నించారు. అనేకసార్లు వినతిపత్రం ఇచ్చినా ఎందు కు స్పందించ లేరని నిలదీశారు. స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. దుమ్ము వదిలితే కంపెనీకి తాళం వేస్తామని హెచ్చరించారు. రెండు నెలల్లో పరిష్కరిస్తా: జీఎం ఉన్నతాధికారులతో మాట్లాడి రెండు నెల ల్లో దుమ్మును నివారించేందుకు కృషి చేస్తానని కంపెనీ జీఎం వీకే పాండ్యా యువకులకువివరించారు. గ్రామ యువకులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై కూడా ఉన్నతాధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని యువకులు డిమాండ్ చేయడంతో కంపెనీ ప్రతినిధులు, యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న కరన్‌కోట పోలీస్‌స్టేషన్ ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ యువకులతో మాట్లాడి సర్దిచెప్పారు. -
ఇన్ఫ్రా రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్ట్
ఇవి కేవలం ఇన్ఫ్రా రంగానికి చెందిన షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఇన్ఫ్రా నిర్వచనం చాలా విస్తృతమైనది కావడంతో ఈ పరిధిలోకి చాలా రంగాలు అంటే.. ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, లోహాలు, బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్ ఇలా పలు రకాలకు రంగాలకు చెందిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రస్తుత ర్యాలీలో ఇన్ఫ్రా ఫండ్స్ ముందంజలో ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం వల్ల బాగా దెబ్బతిన్న ఈ రంగాన్ని మోడీ ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొస్తుందన్న ఆశతో ఈ రంగానికి చెందిన షేర్లు బాగా పెరిగాయి. గతేడాది కాలంలో ఈ ఫండ్స్‌లో చాలా మటుకు 80 శాతానికిపైనే రాబడిని అందించాయి. కానీ ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. 2008లో స్టాక్ మార్కెట్లు బూమ్‌లో ఉన్నప్పుడు ఇన్ఫ్రా ఫండ్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. ఆ సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పటికీ చాలామంది నష్టాల్లోనే ఉన్నారు. ఉదాహరణకు ఎల్అండ్టీ ఇన్ఫ్రా ఫండ్‌నే తీసుకుందాం... ఈ ఏడాది కాలంలో ఈ ఫండ్ 84 శాతం రాబడిని అందించింది. కాని 2007లో ఈ ఫండ్ యూనిట్ రూ. 10కు ఎన్ఎఫ్వోకి వస్తే ఇప్పుడు ఆ యూనిట్ విలువ రూ. 10.17 మాత్రమే. అంటే ఎన్ఎఫ్వో సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పటి వరకు ఒక శాతం కూడా లాభాలు రాలేదు. దీనికి కారణం మధ్యలో ఇన్ఫ్రా రంగం బాగా దెబ్బతినడంతో ఈ ఫండ్స్ యూనిట్ విలువలు కూడా బాగా దెబ్బతిన్నాయి. అందుబాటులో ఉన్న కొన్ని ఇన్ఫ్రా ఫండ్స్ : రెలిగేర్ ఇన్ఫ్రా (98%), ఫ్ల్రాంకిన్ బిల్డ్ ఇండియా (95%), హెచ్డీఎఫ్సీ ఇన్ఫ్రా (92%), పైన్ బ్రిడ్జ్ ఇన్ఫ్రా (92%), ఎల్అండ్టీ ఇన్ఫ్రా (84%). -
ఆగస్ట్‌లో మౌలిక రంగ వృద్ధి 5.8%
న్యూఢిల్లీ: కీలకైమైన 8 మౌలిక పరిశ్రమలు ఆగస్ట్‌లో 5.8% వృద్ధిని అందుకున్నాయి. ప్రధానంగా బొగ్గు, సిమెంట్, విద్యుత్ రంగాల పనితీరు ఇందుకు దోహదపడింది. గతేడాది(2014) ఆగస్ట్‌లో మౌలిక పరిశ్రమల పురోగమన రేటు 4.7% చొప్పున నమోదైంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం బొగ్గు రంగం 13.4% వృద్ధిని చూపగా, సిమెంట్ 10.3%, విద్యుత్ 12.6% చొప్పున పుంజుకున్నాయి. ఈ బాటలో స్టీల్ ఉత్పత్తి 9.1% మెరుగుపడినప్పటికీ, ముడిచమురు 4.9%, సహజవాయువు ఉత్పత్తి 8.3% చొప్పున క్షీణించడం గమనార్హం.ఇదే విధంగా రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల విభాగం 4.3% చొప్పున నీరసించాయి. కాగా, ఏప్రిల్-ఆగస్ట్ కాలానికి 8 కీలక పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం 4.4% వృద్ధిని సాధించింది. గతంలో ఇదే కాలానికి 4.2% వృద్ధి నమోదైంది. ఆగస్ట్‌లో 8 కీలక పరిశ్రమలు సగటున మెరుగైన ఫలితాలను సాధించడంతో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలు సానుకూలంగా వెలువడేందుకు వీలుచిక్కనుంది. ఐఐపీలో వీటికి 38% వెయిటేజీ ఉండటమే దీనికి కారణం. ఆర్థిక రికవరీకి సంకేతం ఆగస్ట్‌లో కీలక పరిశ్రమలు 5.8% వృద్ధి సాధించడం ద్వారా ఆర్థిక పురోగమన సంకేతాలను మరింత బలపరుస్తున్నాయని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ వ్యాఖ్యానించింది. బొగ్గు రంగ వేగం కొనసాగకపోయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఆటంకం ఉండబోదని అభిప్రాయపడింది. మెరుగుపడుతున్న పారిశ్రామికోత్పత్తిని గణాంకాలు పట్టిచూపుతున్నాయని పేర్కొంది. భవిష్యత్‌లో బొగ్గు రంగంలో జోష్ కొనసాగాలంటే బ్లాకులను ప్రభుత్వం తిరిగి వేలం ద్వారా కేటాయించాల్సిన అవసరం ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ చెప్పారు. ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టు మొత్తం 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. -
ఎలుకల పని పట్టండిలా..
సిమెంటు, మైదాపిండిలను సమ భాగాలుగా కలిపి పొట్లాలు కట్టి ఎలుకల బొరియల వద్ద ఉంచాలి. వాటిని తిన్న తర్వాత ఎలుకలు నీరు తాగడం వల్ల నోటి భాగాలు పిడుచకట్టుకుపోతాయి. కడుపులో సిమెంట్ గడ్డకడుతుంది. దీంతో ఎలుకలు చనిపోతాయి. బొరియల్లో తడిగడ్డితో నింపిన కుండల ద్వారా పొగబెడితే రంధ్రాల్లో ఉన్న ఎలుకలు చనిపోతాయి. పొలం గట్లపై జిల్లేడు, ఆముదం మొక్కలు పెంచితే ఎలుకలు పొలం గట్లపై బొరియలు పెట్టే అవకాశం ఉండదు. ఐరన్ బుట్టలను అమర్చి ఎలుకలను పట్టుకోవచ్చు. ఎలాస్టిక్ తాళ్లతో పెట్టే బుట్టల ద్వారా కూడా ఎలుకలను నిర్మూలించవచ్చు. ఎకరా పొలంలో సుమారు 20 వరకు బుట్టలు ఉంచాలి. ఈ బుట్టల్లో బియ్యాన్ని ఎరగా వాడాలి. ఇందులోకి ఎలుక రాగానే దీనిలో ఉన్న ఎలాస్టిక్ వల్ల పీక నొక్కకుపోయి మరణిస్తుంది. రసాయనాల ద్వారా.. చాలామంది రైతులు జింక్ ఫాస్ఫైట్ వినియోగిస్తుంటారు. ఈ మందుతో ఒకసారి ఎలుకలను నిర్మూలించినా.. రెండో దఫా మందు పెట్టినప్పడు ఎలుకలు గుర్తించి తప్పించుకుంటాయి. {బోమోడైల్ మందు ద్వారా ఎలుకలను నిర్మూలించవచ్చు. 480 గ్రాముల నూకలకు పది గ్రాముల నూనె పట్టించి మరో 10 గ్రాముల బ్రొమోడైల్ మందు కలిపి ఎరను తయారు చేసుకోవాలి. ఆ ఎరను బొరియల వద్ద ఉంచాలి. దీనిని తిని ఎలుకలు చనిపోతాయి. అయితే పొలంగట్లపై కనిపించిన ప్రతి బొరియ వద్ద ఎర పెట్టడం వల్ల ఫలితం ఉండదు. ముందుగా బొరియలను గుర్తించి వాటిని మట్టితో మూసేయాలి. తర్వాతి రోజు గమనించాలి. తెరుచుకున్న బొరియల్లో ఎలుకలు ఉంటున్నట్లు అర్థం. వాటి వద్ద మందు పెడితే ఉపయోగం ఉంటుంది. వారం తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. రైతులు విడివిడిగా ఎలుకలు నివారించేకంటే ఒక ఆయకట్టు రైతులంతా ఒకేసారి ఈ విధానాన్ని అవలంబిస్తే ఎలుకలను శాశ్వతంగా నిర్మూలించే అవకాశం ఉంటుంది. కొబ్బరి చిప్పల్లో పెడితే మేలు.. పంట పొలాల్లో, బొరియల వద్ద పెట్టే మందును కొబ్బరి చిప్పల్లో ఉంచడం ద్వారా రైతులు మరింత ప్రయోజనం పొందవచ్చు. మందు పొట్లాల్లో ఉంచితే వర్షాలకు కరిగిపోవడంతోపాటు కాకులు, పక్షులు తినే అవకాశం ఉంటుంది. కొబ్బరి చిప్పలో మందు ఉంచి పైన మరో చిప్పను ఉంచాలి. చిప్పల మధ్య ఉండే ఖాళీ ప్రదేశం నుంచి ఎలుకలు అందులోకి ప్రవేశించి మందును తింటాయి. పంట పొలాల్లో నీరు ఉన్న ఎత్తులో చిప్పలను కర్రలకు కట్టి ఎరలు ఏర్పాటు చేయాలి. పొలం మధ్యలోకి ఈదుకుంటూ వచ్చే ఎలుకలు చిప్పల్లోకి ప్రవేశించి మందును తిని చనిపోతాయి. -
కంట్రోల్ లేకపాయె
సాక్షి, ఖమ్మం: జిల్లాలో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాత చేసిన నిర్మాణ పనుల్లో నాణ్యతపై అధికారులు పట్టించుకోలేదు. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంలో కాంట్రాక్టర్లు అడిందే ఆట పాడిందే పాటగా సాగింది. ప్రశ్నించే ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఇసుక, సిమెంట్, కంకర తగిన పాళ్లలో వాడకపోవడంతో ఈ నిర్మాణాలు అప్పుడే మరమ్మతులకు గురవుతున్నాయి. నిర్మించిన తర్వాత 20 నుంచి 25 ఏళ్ల వరకు ఉండాల్సిన సీసీరోడ్లు, డ్రెయిన్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారుతూ శిథిలావస్థకు చేరుతున్నాయి. 12, 13 ఆర్థిక సంఘాలు, బీఆర్జీఎఫ్ పథకాల కింద ఖమ్మం కార్పొరేషన్, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీలకు 187 పనులు, పాల్వంచ మున్సిపాలిటీకి రూ.3.73 కోట్లతో 66 పనులు, ఇల్లెందు మున్సిపాలిటీకి రూ. కోటితో 65 పనులు మంజూరయ్యాయి. ఈ పనుల్లో గత ఏడాది, ఈ ఏడాది మంజూరైన వాటిలో చాలా వరకు ఇంకా నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ఇక పూర్తయిన పనులు నాసిరకంగా ఉండడంతో ఈ వర్షాలకు సీసీ రోడ్లపై గుంతలు పడుతున్నాయి. డ్రైనేజీలు అప్పుడే కూలిపోతున్నాయి. ఇదేంటని మున్సిపల్ అధికారులు, సిబ్బందిని ప్రశ్నిస్తే.. మళ్లీ కాంట్రాక్టర్లతో మరమ్మతులు చేయిస్తామంటూ దాటవేస్తున్నారే తప్ప పనులు చేయించడం లేదని ఆయా మున్సిపాలిటీల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో బీఆర్జీఎఫ్, 12, 13 ఆర్థిక సంఘం నిధులు, బీపీఎస్ఎల్ఆర్ఎస్ నిధులు రూ.23.14 కోట్లతో 121 పనులు చేపట్టారు. ఈపనుల్లో కొన్ని పూర్తి కాగా మరికొన్ని ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. అయితే పూర్తయిన పనుల్లోనూ చాలా వరకు నాసిరకంగానే ఉన్నాయి. పనిచేయని క్వాలిటీ విభాగాలు.. పురపాలకాల్లో ఏ నిర్మాణం జరిగినా ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగం నాణ్యతను పరిశీలించాలి. అయితే సిబ్బంది లేరన్న కారణంతో వీటిని మూసేశారు. ఖమ్మం నగర పాలక సంస్థలో గతంలో నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్ ఉండేది. అధికారులు, సిబ్బంది లేక ప్రస్తుతం ఈ విభాగం మూత పడింది. కార్పొరేషన్ హోదా పెరిగినా ల్యాబ్ మాత్రం తెరుచుకోలేదు. ప్రతి సీసీ రోడ్డు, డ్రైన్ల నిర్మాణం తొలి దశలోనే క్వాలిటీ విభాగం సిబ్బంది శాంపిల్స్ తీసుకొని ఇసుక, సిమెంట్, కంకర కాంట్రాక్టు నిబంధనల ప్రకారం కలిపారా..? లేదా..? అని దశల వారీగా పరిశీలించాలి. ఏఈ పర్యవేక్షణలో కొనసాగాల్సిన ఈ విభాగం అడ్రస్ లేకపోవడంతో కార్పొరేషన్ పరిధిలో చేస్తున్న నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు అధికారుల చేయి తడిపి తమ ఇష్టానుసారంగా రోడ్లు వేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేకంగా ఈ విభాగాలు లేకపోవడంతో నిర్మించిన రోడ్లు కనీసం ఏడాది కూడా సరిగా ఉండడం లేదు. అధికారులు మాత్రం ఈ విభాగాలు లేకున్నా తామే నాణ్యతను పరిశీలిస్తున్నామని చెబుతున్నా.. మరి నాణ్యత ఎందుకు కొరవడుతోందనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. నిధులన్నీ దుర్వినియోగం.. ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నా అధికారులు, కాంట్రాక్టర్ల మిలాఖత్ కావడంతో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు నాణ్యత లేకుండా సాగుతున్నాయి. ఇటీవల వేసిన కొన్ని సీసీ రోడ్లను పరిశీలిస్తే.. ఖమ్మం ముస్తఫానగర్‌లో రూ.10 లక్షలతో ఓ కాంట్రాక్టర్ సీసీ రోడ్డు వేయించాడు. నిర్మాణ సమయంలోనే ఇసుక దుబ్బ ఉందని, సిమెంట్ సరిగా వేయడం లేదని కాలనీ వాసులు గగ్గోలు పెట్టినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా ఆర్నెళ్లకే ఈ రోడ్డు కంకర తేలింది. అంతేకాకుండా చిన్నపాటి వర్షానికే గుంతలు పడుతున్నాయి. కొత్తగూడెంలోని 15వ వార్డులో సెయింట్ మేరీస్ పాఠశాల ఎదురుగా ఝాన్సీ హాస్పిటల్ నుంచి బర్లిఫిట్లో రామాటాకీస్ రోడ్ వరకు 2011లో బీఆర్జీఎఫ్ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారు. మూడేళ్ల కాలంలో రోడ్డు మొత్తం అధ్వానంగా మారింది. కంకర రాళ్లు పైకితేలి పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది పాల్వంచలో కేఎల్ఆర్ ఫార్మసీ కళాశాల నుంచి భద్రాచలం రోడ్డు వరకు నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యత లోపంతో కంకర తేలి గుంతలమయం అయింది. -
సిమెంట్ బ్యాగుపై రూ. 20-25 తగ్గింపు
ప్రభుత్వ ఒత్తిడితో కంపెనీల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సిమెంట్ ధరలు తగ్గించాలని బిల్డర్లు, కాంట్రాక్టర్లు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం బిల్డర్లు, సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన సమావేశం తరువాత ప్రభుత్వ ఒత్తిడి, బిల్డర్ల ఆందోళన నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు తమ పట్టును తగ్గించాయి. మార్కెట్లో ఉన్న ధరలపై ఒక బస్తాకు రూ. 20 నుంచి 25 వరకు తగ్గించుకోవడానికి ముందుకు వచ్చాయి. సీఎస్ రాజీవ్‌శర్మ వద్ద జరిగిన సమావేశంలో సాగర్, పెన్నా, ఓరియంట్, కేశోరాం, డెక్కన్, నాగార్జున, మై హోం సిమెంట్‌కంపెనీలప్రతినిధులు, క్రెడాయ్ ప్రతినిధులు శేఖర్‌రెడ్డి తదితర బిల్డర్లు పాల్గొన్నారు. ఈ సమావేశం తరువాత సాగర్ సిమెంట్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తమ భాగస్వామ్యం అందించడానికి పూర్తిసహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు మార్కెట్ ధరపై ఒక్కో బస్తా సిమెంటుకు రూ. 20 నుంచి రూ.25 వరకు తగ్గించి విక్రయించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమేనని, సిమెంట్ పరిశ్రమ ప్రతినిధులు ధరను తగ్గించడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. -
వ్యయాల కారణంగానే ధర పెరిగింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ వ్యయాలు దూసుకెళ్లడం వల్లే సిమెంటు ధర పెరుగుతోందని కంపెనీలు అంటున్నాయి. వ్యయంలో 80-90 శాతం మేర తమ చేతుల్లో లేదని పరిశ్రమల ప్రతినిధులు మంగళవారమిక్కడ మీడియాకు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక్కో బ్యాగు తయారీకి రూ.335 అవుతోంది. అమ్మకం ధర ఇంత కంటే తగ్గితే కంపెనీలు నష్టాలను చవిచూస్తాయని స్పష్టం చేశారు. సిమెంటు ధర వ్యయాలకు అనుగు ణంగా స్థిరీకరణ జరిగిందని వారు చెప్పారు. మీడియా సమావేశంలో సాగర్ సిమెంట్స్ జేఎండీ ఎస్.ఆనంద్ రెడ్డి, మై హోం ఇండస్ట్రీస్ ఈడీ ఎస్.సాంబశివరావు, ఇండియా సిమెంట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె.సాయి ప్రకాశ్, భవ్య సిమెంట్స్ ఎండీ వి.ఆనంద ప్రసాద్, పరాశక్తి సిమెంట్ ఈడీ యశ్వంత్ కృష్ణ, పెన్నా సిమెంట్స్ డెరైక్టర్ ఆర్.పి.సింగ్ మాట్లాడారు. నిర్మాణంలో సిమెంటు వ్యయం..: ఖరీదైన భవంతి నిర్మాణంలో సిమెంటుకు అయ్యే వ్యయం కేవలం 2-3 శాతమే. సాధారణ భవంతికి ఈ వ్యయం 4-5 శాతానికి మించదు. ఒక్కో బ్యాగు ధర రూ.50-60 పెరిగినా, నిర్మాణంలో ఒక్కో చదరపు అడుగుకు రూ.15-20 కంటే వ్యత్యాసం రాదన్నారు. ‘బిల్డర్లు సిమెంటును 2 శాతం సీఎస్టీ చెల్లించి కర్నాటక, మహారాష్ట్ర నుంచి తెప్పిస్తున్నారు. తెలంగాణలో వ్యాట్ 14.5 శాతముంది. ఇతర రాష్ట్రాల నుంచి బిల్డర్లు సిమెంటు కొనుగోలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.200 కోట్ల దాకా ఆదాయం కోల్పోతోంది’ అన్నారు. అన్నీ పెరిగాయి..: 2010లో ఒక టన్ను బొగ్గును సింగరేణి గనులు రూ.2,553కు విక్రయించాయి. ప్రస్తుతం ఇది రూ.5,459 ఉంది. విద్యుత్ చార్జీలు రెండేళ్లలో 60-70 శాతం పెరిగాయి. డీజిల్, రైల్వే రవాణా చార్జీలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రభావంతో సిమెంటు రవాణా చార్జీలు కూడా పెరిగాయని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక్కో బ్యాగు ధర రూ.315-330, వైజాగ్‌లో రూ.325 ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రూ.395 వరకు ఉందన్నారు. 2013 జూలైలో బ్యాగు ధర రూ.325-340 ఉందని గుర్తు చేశారు. బిల్డర్లు సిమెంటు ప్లాంటు పెట్టాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తన ప్లాంటును వారు ఉచితంగా తీసుకోవాల్సిందిగా భవ్య సిమెంట్స్ ఎండీ వి.ఆనంద ప్రసాద్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. లాభంలో 10% తనకు ఇస్తే చాలన్నారు. -
స్టీల్, సిమెంట్ ధరలు పైపైకి
బాన్సువాడ రూరల్ : సిమెంట్, స్టీల్, ఇటుకల ధరలు రోజురోజుకీ పెరుగుతుండటంతో భవన నిర్మాణ రంగం కుదేలవుతోంది. ఫలితంగా ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో ఉంటూ అప్పుచేసి సొంతిల్లు నిర్మించుకుందామనుకున్న సామాన్యుడి కల నెరవేరటం లేదు. అకాశాన్ని అంటుతున్న బిల్డింగ్ మెటీరియల్ ధరలతో సగంలోనే నిర్మాణాలు ఆగిపోతున్నాయి. బాన్సువాడలో నెలరోజుల క్రితం వరకు రూ. 200 ఉన్న బస్తా సిమెంట్ ధర ప్రస్తుతం రూ. 300కు చేరింది. సాధారణ ఇటుక ధరసైతం మొన్నటి వరకు వెయ్యికి రూ. 2,500 ఉండగా ప్రస్తుతం రూ. 3,000లకు చేరింది. స్టీలు క్వింటాలుకు రూ. 4,500 పలుకుతోంది. పెరిగిన ధరలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా సిమెంట్, ఇటుక, స్టీలు ధరలు పెరుగుతుండటంతో ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టిన వారుకూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకు ధరలు పెరుగిపోతూ ఉండటంతో పలువురు నిర్మాణాలను నిలిపివేస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలోనే గృహ నిర్మాణాలు ఎక్కువగా కొనసాగుతాయి. దీంతో నిర్మాణాలు ప్రారంభించినవారు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. నిర్మాణాలకు చేయాల్సిన ఖర్చు అంచనాలకు రెట్టింపు అవుతోందని భవన నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టీల్, సిమెంట్ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో సాధారణంగా గ్రామాల్లో పెంకుటిళ్లను మాత్రమే నిర్మించుకునేవారు. ఆర్సీసీ బిల్డింగ్‌ల నిర్మాణాలు అరుదుగా జరిగేవి. అయితే ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో భాగంగా పెంకుటిళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్సీసీ భవనాల నిర్మాణాలు పెరిగాయి. స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు కూడా మందగించాయి. ప్రభుత్వం స్పందించాలి.. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే సామాన్యుడికి సొంతింటి కల నెరవేరని పరిస్థితులు నెలకొంటాయి. సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ సీఏం కేసీఆర్ వెంటనే కొత్తవారితోపాటు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారికి సైతం గృహ నిర్మాణానికి రూ. 3 లక్షలు మంజూరు చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. -
5 నుంచి సిమెంట్ కొనుగోళ్లు బంద్!
సాక్షి, హైదరాబాద్: సిమెంట్ ధరల పెరుగుదలపై నిర్మాణ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈనెల 5- 12వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సిమెంట్ కొనుగోళ్లను నిలిపి వేయనున్నట్లు బిల్టర్ అసోసియేషన్లు ప్రకటించాయి. సిమెంట్ ధరలను నిరసిస్తూ బుధవారమిక్కడ జరిగిన సమావేశంలో భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాప్టర్లు, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్(అప్రెడా), తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్(టీరెడా), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ), తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్లు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సుమారుగా 60 వేల అపార్ట్మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 35-40 వేల అపార్ట్మెంట్లు ఒక్క హైదరాబాద్‌లోనే ఉంటాయి. వీటికి రోజుకు సుమారు 20 వేల టన్నుల సిమెంట్ అవసరం ఉంటుందని’ వివరించారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించకపోతే నిర్మాణాలనూ ఆపేస్తామని పేర్కొన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగంలో ఉన్న 1.2 కోట్ల మంది కార్మికులు రోడ్డున పడతారని హెచ్చరించారు.జూన్ 1న సిమెంట్ బస్తా ధర మార్కెట్లో రూ.210గా ఉంటే.. నేడది రూ.320కు చేరిందన్నారు. నెల రోజుల్లో రూ. 100 వరకు పెంచారన్నారు. పెంచిన సిమెంట్ ధరలపై గతంలో బీఏఐ మధ్యప్రదేశ్ చాప్టర్ లాగే జేఏసీ కూడా కాంపిటీషన్ కమీషన్(సీసీఐ)కు ఫిర్యాదు చేస్తుందని.. ఏపీ, తెలంగాణలోని అన్నిజిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని హచ్చరించారు. సిమెంట్ రెగ్యులేటరీ అథారిటీ.. సెబీ, ట్రాయ్, ఐఆర్డీఏ వంటి నియంత్ర ణ సంస్థల్లాగే సిమెంట్ కంపెనీల నియంత్రణకు, ధరలను అదుపులో పెట్టేందుకు సిమెంట్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సీఆర్ఏ) చట్టాన్ని తీసుకురావాలని బీఏఐ, జేఏసీ కో-కన్వీనర్ ఎస్ఎన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
సెసా స్టెరిలైట్ నుంచి గ్రీన్ సిమెంట్
కాలుష్య రహితం.. ఇసుక అవసరం లేదు.. అతి తక్కువ ఖర్చు రాయగడ (ఒడిశా): ఇసుక అవసరం లేదు.. కాలుష్యానికి తావులేదు.. అతి తక్కువ నీటి వినియోగం, తక్కువ వ్యయంతో నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా వేదాంత గ్రూప్ కంపెనీ సెసా స్టెరిలైట్ శ్రీకారం చుట్టింది. పరిశోధనలు ముగించుకుని మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్న గ్రీన్ సిమెంట్ గురించి సెసా స్టెరిలైట్ సంస్థ సీఈవో డాక్టర్ ముకేశ్ కుమార్ వినియోగం గురించి వివరించారు. రాయగడ, కలహండి జిల్లాల సరిహద్దులో గల లంజిగడలోని సెసా స్టెరిలైట్ కంపెనీ ఐఎంఎంటీ, భువనేశ్వర్ సాంకేతిక సహకారంతో గ్రీన్ సిమెంట్‌కు రూపకల్పన చేసింది. దీని తయారీకి ఇనుము తయారీ కంపెనీల్లో వృథాగా ఉండే రెడ్‌మార్ట్ మెటీరియల్ తో పాటు పలు కంపెనీల్లో నిరర్థక పదార్థమైన బూడిదను వినియోగించారు. ఇందులో 90 శాతం బూడిద, ఒక శాతం సున్నం, మూడు శాతం కెమికల్ ఉన్నాయని ముకేశ్ తెలిపారు. ప్రస్తుతం సిమెంట్ కాంక్రీట్ పనుల్లో 21 రోజులు వాటరింగ్ చేస్తుండగా, గ్రీన్సిమెంట్తో చేపట్టే కాంక్రీట్ పనులకు ఒక్కసారి మాత్రమే నీటిని వినియోగిస్తారు. దీని వినియోగంలో నీరు వృథా కాదని తెలిపారు. సాధారణ సిమెంట్ కన్నా 30 శాతం ఖర్చు తక్కువని తెలిపారు. దీని వినియోగానికి ఇసుక అవసరం లేదని చెప్పారు. మరో 8 నెలల్లో దీనిని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ముకేశ్ తెలిపారు. -
పరిశ్రమలకు రేల్వే షాక్...!
చార్జీల పెంపుతో సిమెంటు, ఉక్కు రవాణా భారం సిమెంటు రేట్లు 3% మేర పెరిగే అవకాశం 2.5 శాతం వరకూ పెరగనున్న ఐరన్ ధరలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేర పెంచాలన్న రైల్వేశాఖ నిర్ణయంతో సిమెంటు, స్టీలు తదితర ఉత్పత్తులు మరింత భారం కానున్నాయి. దాదాపు 40 శాతం సిమెంటు రవాణా రైల్వేల ద్వారానే ఉంటోంది. ఈ నేపథ్యంలో రవాణా చార్జీల పెరుగుదలతో సిమెంటు రేట్లు 3 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీంతో బస్తా ధరపై భారం రూ. 10కి కాస్త అటూ, ఇటూగా ఉండొచ్చని వివరించాయి. ఇక ఇనుము, దుక్కిఇనుము వంటి వాటి రేట్లు కూడా పెరగనున్నాయి. వీటి ధరలు సుమారు 2.5 శాతం దాకా పెరగవచ్చని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఫౌండ్రీమెన్ దక్షిణ ప్రాంత చైర్మన్ వి. రామస్వామి సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. ఉక్కు కంపెనీలపై కూడా అంతేశాతం భారం వుండవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేట్ల పెరుగుదల భారాన్ని కంపెనీలు.. వినియోగదారులకు బదలాయిస్తాయా లేదా ప్రస్తుతానికి అవే భరిస్తాయా అన్నది చూడాల్సి ఉంటుందని పరిశీలకులు పేర్కొన్నారు. ఏటా రూ. 8,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే లక్ష్యంతో రైల్వేస్ అటు రైలు ప్రయాణ చార్జీలను 14.2 శాతం మేర, సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. రియల్టీ రంగానికి దెబ్బ... ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న సిమెంటు, ఉక్కు తదితర ఉత్పత్తుల ధరలు రైల్వే రవాణా చార్జీల పెంపు వల్ల మరింత ఎగిసే అవకాశం ఉందని రియల్టీ దిగ్గజం పార్శ్వనాథ్ డెవలపర్స్ చైర్మన్ ప్రదీప్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఉక్కు, సిమెంటు..రెండూ ప్రధాన ముడి సరుకులని ఆయన చెప్పారు. గడ్డుకాలం ఎదుర్కొంటున్న రియల్టీ రంగానికి రవాణా చార్జీల పెంపు గట్టి ఎదురుదెబ్బగా ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే అమ్ముడుకాని ప్రాజెక్టు యూనిట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో మేం ప్రాపర్టీ రేట్లను పెంచే పరిస్థితి కూడా లేదు’ అని జైన్ పేర్కొన్నారు. కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ రంగానికి కాస్త ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నట్లు జైన్ తెలిపారు.ఇప్పటికే వృద్ధి మందగమనంలో ఉన్నందున ఉక్కు వంటి భారీ పరిశ్రమలపై రవాణా చార్జీల పెంపు భారాన్ని మోయగలిగే పరిస్థితి లేదని సీఐఐ పేర్కొంది. సరకు రవాణా ద్వారా రైల్వేస్‌కి సుమారు 20 శాతం ఆదాయం ఉక్కు రంగం నుంచే ఉందని, ఇప్పటికే ఈ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని బెనర్జీ పేర్కొన్నారు. ఎరువుల సబ్సిడీ భారం మరో రూ.200 కోట్లు: సరకు రవాణా చార్జీల పెంపుదలతో ఎరువుల సబ్సిడీ భారం ఏటా దాదాపు రూ. 200 కోట్ల మేర పెరగనుంది. అయితే, ఈ ప్రభావం రిటైల్ రేట్లపై ఉండబోదని ఎరువుల సంస్థల సమాఖ్య(ఎఫ్ఏఐ) డెరైక్టర్ జనరల్ సతీష్ చందర్ తెలిపారు. ప్రతి ఏటా దేశీయంగా 4.4 కోట్ల టన్నుల ఎరువులు రవాణా అవుతుండగా.. ఇందులో 80% రవాణా రైలు మార్గంలోనే ఉంటోంది. మధ్యంతర బడ్జెట్లో కేంద్రం రూ. 67,970 కోట్ల మొత్తాన్ని ఎరువుల సబ్సిడీగా నిర్ణయించింది. విశాఖ ఉక్కుపై ప్రభావం... సాక్షి,విశాఖపట్నం: రైల్వేశాఖ రవాణా చార్జీలు పెంచడంతో విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌పై మరింత భారం పడనుంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి నిత్యం లక్షల టన్నుల్లో ముడి ఇనుమును వైజాగ్‌పోర్టు,గంగవరం పోర్టుల నుంచి ప్లాంటు వరకూ సరుకును తీసుకురావడానికి రవాణా చార్జీల రూపంలోనే ఏటా రైల్వేకు కోట్లకు కోట్లు చెల్లిస్తోంది. ఇప్పుడు చార్జీలు మరింత పెరగడంతో ఆర్థికంగా మరింత సమస్య ఎదుర్కోనుంది. ఇప్పటికే ముడి ఇనుము విక్రయ ధరలను నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) భారీగా పెంచేసింది. మార్కెట్లో ఉక్కు అమ్మకాలు మందగించి సతమతమవుతోన్న స్టీల్ రంగానికి ఒకపక్క ముడి ఇనుము ధర పెంచడం, మరోపక్క రవాణా చార్జీలు పెంచడంతో ఆర్థిక భారం భరించలేక త్వరలో ఉక్కు ధరలను కూడా పెంచే అవకాశం ఉంది. రైల్వే నిర్ణయం వెలువడిన తర్వాత స్టీల్‌ప్లాంట్‌తోపాటు అనేక ప్రైవేటు ఉక్కు కంపెనీల యాజమాన్యాలు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆర్థికభారంపై చర్చించాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోపక్క ఇక్కడి ఎన్టీపీసీ ప్లాంటుపైనా రవాణా చార్జీల పెంపు భారం పడనుంది. తాల్చేరుతోపాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ నుంచి ఎన్టీపీసీ 8 లక్షల బొగ్గు దిగుమతి చేసుకుంటోంది. ద్రవ్యోల్బణం మరింత పైపైకి.. న్యూఢిల్లీ: రైలు ప్రయాణ చార్జీలు, సరకు రవాణా చార్జీల పెంపుదల అనివార్యమే అయినప్పటికీ.. దీని వల్ల ద్రవ్యోల్బణం మరికాస్త పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. రవాణా వ్యయాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమన్నారు. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొందని, అయితే దీని వల్ల రైల్వే ఆర్థిక పరిస్థితి మెరుగుపడగలదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ చీఫ్ ఎకానమిస్టు డీకే జోషి చెప్పారు. ఇటీవలే విడుదలైన గణాంకాల ప్రకారం.. టోకుధరల ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో ఏకంగా అయిదు నెలల గరిష్టమైన 6.01 శాతం మేర ఎగిసిన సంగతి తెలిసిందే. అటు, ప్రయాణికులపై కొంత భారం పడుతున్నప్పటికీ.. రైలు చార్జీల పెంపు స్వాగతించతగినదేనని ఎర్న్స్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ అభయ అగర్వాల్ తెలిపారు. తగినన్ని నిధులు ఉంటేనే రైల్వే శాఖ మెరుగైన సర్వీసులు అందించడం సాధ్యపడుతుందన్నారు. సాహసోపేత నిర్ణయం.. చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం సాహసోపేతంగా వ్యవహరించిందని, సబ్సిడీలను కట్టడి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్న సంకేతాలను ఇది పంపించినట్లయిందని వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సీఏసీపీ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ పేర్కొన్నారు. ఇది సర్వీసుల మెరుగుదలకు, ముందుముందు రేట్ల తగ్గుదలకు తోడ్పడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రైల్వేస్‌ని ఒడ్డున పడేసేందుకు దిద్దుబాటు చర్యలు అవసరమని, ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని అసోచాం ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. సరకు రవాణా, రైలు చార్జీలను పెంచడమనేది రైల్వేస్ మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడగలవని భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. సురక్షితమైన సర్వీసులు అందించే దిశగా వనరులు సమకూర్చుకోవడానికి ఉపయోగపడగలదని వివరించారు. రైల్వేస్ ప్రాజెక్టుల్లో పాల్గొనేలా బహుళజాతి ఫండింగ్ ఏజెన్సీలను ఆహ్వానించడం, రైల్వే స్థలాలను మెరుగ్గా వినియోగించుకోవడం, రైల్ అసెట్ లీజింగ్ అథారిటీని ఏర్పాటు చేయడం తదితర చర్యల ద్వారా మరిన్ని వనరులు సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, ఏళ్ల తరబడి పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా రేట్లను పెంచి ఉంటే.. ఇంత భారీగా ఒకేసారి పెంచాల్సిన అవసరం ఉండేది కాదని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా అభిప్రాయపడ్డారు. -
ఇల్లు...కట్టినోళ్లు గొల్లు!
సిమెంట్ ధరలు పైపైకి... అదే దారిలో ఇతర ముడి సరుకు ధరలు నిర్మాణాలపై అదనపు భారం ‘ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు...’ అన్నారు పెద్దలు. పెళ్లి మాటేమో గానీ ఇల్లు కట్టడం మాత్రం పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారంగా మారింది. సిమెంట్ ధర వారం రోజుల వ్యవధిలో గతంలో ఉన్నడూ లేనంతగా పెరిగింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ముడి సరుకు ధరలూ అదే తరహాలో పెరుగుతుండడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల వ్యవధిలో సిమెంట్, ఇటుక, స్టీల్, చిప్స్(కంకర), ఇసుక ధరలు పెరగడం వల్ల నిర్మాణాలపై అదనపు భారం పడుతోంది. పిల్లర్లు, స్లాబులకు ఉపయోగించే ఇనుము(స్టీల్) కొంత ఊరట నిస్తున్నాయి. కానీ మిగిలిన ముడి సరుకుల ధరలు పెరగడంతో ఇళ్ల నిర్మాణదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మండలంలో సొంత ఇళ్లు, ఇతర వాణిజ్య సముదాయాలు, పాఠశాల భవనాలు అధిక సంఖ్యలో నిర్మాణ దశల్లో ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా మందగించాయి. వేసవిలోనే నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలని భావించిన వారికి పెరిగిన ధరలు షాక్‌నిస్తున్నాయి. రూ.300 చేరిన సిమెంట్ వారం రోజుల క్రితం సిమెంట్ ధర అరకులోయలో రూ. 245 ఉంటే అదే సిమెంట్ ధర ఇపుడు రూ. 300 చేరింది. సిమెంట్ పరిశ్రమల యజమానులు సిండికేట్‌గా ఏర్పడడంతో ఒక్కసారిగా ధరలు ఆకాశనంటుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నారు. భవిష్యత్‌లో మరలా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బస్తాకు రూ. 60 వరకు పెరగడం గమనార్హం. ఇటుకల ధరలు పైపైకి... భవన నిర్మాణానికి అవసరమైన అన్ని ముడి సరుకుల మాదిరిగానే ఇటుకల ధరలు పెరిగాయి. రెండు వేల మట్టి ఇటుక గతంలో రూ. 8వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 10 వేలుకు పెరిగింది. వెయ్యి ఫాల్ జి బ్రిక్స్ రూ. 13వేలు నుంచి రూ. 15వేలకు పెరిగింది. ఇసుక బంగారమే... భవన నిర్మాణానికి ఇసుక ప్రాణదాత. చుట్టుపక్కల గెడ్డల్లో ఇసుక లభిస్తున్నా ధర మాత్రం ఎక్కువగానే ఉంది. ఇసుక బంగారంగా మారింది. ఇదే అదనుగా ట్రాక్టర్, లారీల యజమానులు అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక ధర రూ. 800 నుంచి రూ. 1000 పలుకుతోంది. వర్షాకాలం రానుండడంతో ట్రాక్టర్, లారీల యజమానులు ఇసుక నిల్వలు చేసుకుంటున్నారు. మార్కెట్లో గిరాకీని బట్టి ధరలు పెంచుతున్నారు. కంకర...ధర కటకట : నిర్మాణాలకు అవసరమైన కంకర ఎస్.కోట సమీపం నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువగా దిగుమతి అవుతోంది. నాణ్యమైన కంకర కావడంతో వినియోగదారులు వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో కంకర ధర బాగా పెరిగింది. కొద్ది రోజుల క్రితం రెండు యూనిట్ల లారీ లోడు రూ. రూ.10వేల నుంచి రూ.13వేలకు చేరింది. 40 యం.యం. లారీ లోడు రూ. 7,500 నుండి రూ.9 వేలుకు చేరింది. పునాది బండ...గుది బండ : పునాదులకు ఉపయోగించే బండ రాళ్ల ధర కూడ బాగా పెరిగింది. పునాదులకు అవసరమైన ట్రాక్టర్ లోడు బండరాళ్లు రూ. 1200 నుంచి రూ. 1500 చేరింది. అయినా ఒక యూనిట్ రాయి పూర్తిగా రావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. -
8 కీలక పరిశ్రమలు ఓకే
ఏప్రిల్‌లో వృద్ధి 4.2 శాతం విద్యుత్, ఎరువులు, సిమెంట్ బెటర్ న్యూఢిల్లీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 38 శాతం వాటా కలిగిన 8 కీలక పరిశ్రమల గ్రూప్ ఏప్రిల్‌లో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చింది. 4.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. 2014 మార్చిలో ఈ రేటు 2.5 శాతంకాగా, 2013 ఏప్రిల్ నెలలో 3.7 శాతం. విద్యుత్, ఎరువులు, సిమెంట్, బొగ్గు రంగాలు మంచి ఫలితాలను ఇవ్వడం వృద్ధి కొంత మెరుగ్గా ఉండడానికి కారణమయ్యింది. ఇంకా ఈ గ్రూప్‌లో క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్టులు, స్టీల్ ఉన్నాయి. సోమవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. వివిధ రంగాల పనితీరును 2013 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే... బొగ్గు: వృద్ధి రేటు 1.2% నుంచి 3.3%కి ఎగసింది. ఎరువులు: ఈ రంగం క్షీణత నుంచి బైటపడింది. ఈ రంగం మైనస్ (-) 2.4 శాతం నుంచి 11.1 శాతం వృద్ధిలోకి మళ్లింది. సిమెంట్: వృద్ధి 5.2% నుంచి 6.7 శాతానికి ఎగసింది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధి రేటు భారీగా 3.5 శాతం నుంచి 11.2 శాతానికి ఎగసింది. క్రూడ్ ఆయిల్: వృద్ధి క్షీణతలోనే ఉన్నా (-1.2 శాతం) ఇది కొంత తగ్గి మైనస్ (-) 0.1 శాతంగా ఉంది. సహజ వాయువులు: క్షీణత (-) 17.4 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. రిఫైనరీ ప్రొడక్టులు: 6.2% వృద్ధి రేటు క్షీణతలోకి జారిపోయింది. ఈ రేటు -2.2%గా నమోదయ్యింది. ఉక్కు: వృద్ధి రేటు 10.1% నుంచి 3.1%కి పడింది. ఐఐపీ నిరుత్సాహమే: ఇక్రా అంచనా కోర్ ఇన్ఫ్రా పరిశ్రమల పనితీరు బాగున్నప్పటికీ, ఏప్రిల్ 2014 ఐఐపీ వృద్ధి మాత్రం ఒక శాతం లోపే ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తోంది. ఈ గణాంకాలు ఈ నెల రెండవ వారం చివర్లో రానున్నాయి. ఐఐపీ గణాంకాలు వరుసగా రెండవనెల మార్చిలో క్షీణ దిశలో ఉన్నాయి. మార్చిలో ఈ రేటు -0.5 శాతంగా నమోదయ్యింది. -
ఇండియా సిమెంట్స్‌కు నష్టం రూ. 31 కోట్లు
చెన్నై: గడిచిన ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి)లో ఇండియా సిమెంట్స్ రూ. 30.6 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) క్యూ4లో రూ. 26.3 కోట్ల నికర లాభాన్ని సాధించింది. స్టాండెలోన్ ఫలితాలివి. సిమెంట్‌కు డిమాండ్ మందగించడం, సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమైనట్లు కంపెనీ వైస్‌చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ పేర్కొన్నారు. దక్షిణాదిలో డిమాండ్‌కు మించిన సరఫరా ఉండటంతో సిమెంట్ అమ్మకపు ధరలపై ఒత్తిడి పడినట్లు చెప్పారు. 2009లో ఆంధ్రప్రదేశ్‌లో సిమెంట్‌కు 24 లక్షల టన్నుల డిమాండ్ నమోదుకాగా, ప్రస్తుతం 16 లక్షల టన్నులకు పరిమితమైనట్లు తెలిపారు. కాగా, క్యూ4లో నికర అమ్మకాలు కూడా రూ. 1,191 కోట్ల నుంచి రూ. 1,080 కోట్లకు క్షీణించాయి. పూర్తి ఏడాదికి పూర్తి ఏడాదికి(2013-14) కంపెనీ రూ. 117 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. అంతక్రితం ఏడాదిలో రూ. 188 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక నికర అమ్మకాలు సైతం రూ. 5,159 కోట్ల నుంచి రూ. 5,085 కోట్లకు తగ్గాయి. సిమెంట్‌కు తగిన స్థాయిలో డిమాండ్ పుంజుకునేందుకు కనీసం ఆరు నెలల కాలం పడుతుందని శ్రీనివాసన్ అంచనా వేశారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి సిమెంట్ అమ్మకాలు పెరిగే అవకాశమున్నదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అమ్మకాలు పడిపోగా, తమిళనాడు, కేరళలో సిమెంట్‌కు మంచి డిమాండ్ ఉన్నదని చెప్పారు. దేశీ కరెన్సీ మారకంలో హెచ్చుతగ్గులు, రైల్వే రవాణా చార్జీల్లో పెరుగుదల వంటి అంశాలు కూడా ఫలితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు తెలిపారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా రూ. 166 కోట్ల ఆదాయం సమకూరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేరు దాదాపు 5% పతనమై రూ. 99 వద్ద ముగిసింది. -
రెయిన్ ఇండస్ట్రీస్ లాభంలో స్వల్ప క్షీణత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్, కార్బన్ ప్రొడక్టులను ఉత్పత్తి చేసే రెయిన్ ఇండస్ట్రీస్ మార్చితో ముగిసిన తొలి త్రైమాసిక నికర లాభంలో 7% క్షీణత నమోదయ్యింది. గతేడాది ఇదే కాలానికి రూ. 35 కోట్లుగా ఉన్న లాభం (కన్సాలిడేటెడ్) ఇప్పుడు రూ. 32 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో ఆదాయం రూ. 274 కోట్ల నుంచి రూ. 308 కోట్లకు పెరిగింది. కార్బన్ ప్రోడక్టుల మార్జిన్లు తగ్గడం, సిమెంట్ విభాగం ఉత్పత్తి తగ్గడం లాభాలు క్షీణించడానికి ప్రధాన కారణంగా కంపెనీ పేర్కొంది. -
ఏసీసీ నికర లాభం 9% డౌన్
న్యూఢిల్లీ: సిమెంట్ దిగ్గజం ఏసీసీ జనవరి-మార్చి(క్యూ1) కాలానికి రూ. 400 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 438 కోట్లతో పోలిస్తే ఇది 9% క్షీణత. బొగ్గు, ఫ్లైయాష్, జిప్సమ్ వంటి ముడిసరుకుల వ్యయాలు పెరగడం, సిమెంట్ ధరలు తగ్గడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. జనవరి-డిసెంబర్ కాలాన్ని కంపెనీ ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఈ కాలంలో సిమెంట్ విక్రయాలు 6.48 మిలియన్ టన్నులకు చేరగా, టర్నోవర్ రూ. 2,967 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలంలో రూ. 2,906 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ మూడు నెలల కాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాధారణ నిర్మాణ కార్యకలాపాలు వంటివి పెద్దగా ఊపందుకోలేదని కంపెనీ వ్యాఖ్యానించింది. వెరసి సిమెంట్ విక్రయాల్లో పురోగతి సాధ్యపడలేదని తెలిపింది. సమీపకాలంలో సైతం సిమెంట్‌కు డిమాండ్ పుంజుకునే సంకేతాలు కనిపించడంలేదని అభిప్రాయపడింది. -
‘గ్రేటర్’ ఆదాయం ఢమాల్
రాజకీయ అనిశ్చితే కారణం స్థిరాస్తి రంగానికి గడ్డుకాలం వాణిజ్య రంగం కుదేలు తగ్గిన పన్నుల చెల్లింపులు సర్కారు ఖజానాపై ప్రభావం సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ఖజానాకు కీలకమైన హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల ఆదాయం ఈసారి పడిపోయింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితితో ఆర్థిక వనరుల శాఖలన్నీ చతికిలబడ్డాయి. మహానగరంలో స్థిరాస్తి క్రయవిక్రయాలు నిలిచిపోగా.. యావత్తు వ్యాపార, వాణిజ్యరంగం కుదేలైంది. వెరసి ప్రభుత్వ రాబడి భారీగా పడిపోయింది. సర్కార్ ఖజానాకు కల్పతరువైన వాణిజ్య పన్నుల శాఖ రాబడి వెనకబడిపోగా.. రిజిస్ట్రేషన్, రవాణా తదితర శాఖల ఆదాయాలకు సైతం దెబ్బ తగిలింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల నుంచి వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ. 56,474 కోట్లు ఆదాయం సమకూరగా 2013-14 సంవత్సరానికి ఇది 60 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాణిజ్యపన్నుల శాఖ, రిజిస్ట్రేషన్, రవాణా సంస్థలు 2013-14 ఆర్థిక సంవత్సరం రూ.19,071 కోట్ల లక్ష్యానికి కేవలం రూ.13,280 కోట్ల సాధనకే పరిమితయ్యాయి. మిగతా శాఖల ఆదాయం లక్ష్యసాధన కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో సుమారు 12 శాతం మంది జంట జిల్లాల్లోనే ఉన్నందున ఏటా వివిధ పద్దుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుంది. మరోవైపు అధికశాతం పన్నుల చెల్లింపులు సైతం ఇక్కడి నుంచే జరుగుతుండటంతో రాబడీ అధికంగా ఉంటుంది. కానీ ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో విభజన ప్రభావంతో రాజకీయ అనిశ్చితి నెలకొని జంట జిల్లాల రాబడి మందగించింది. మందగించిన వాణిజ్య రాబడి.. మహానగరంలోని వ్యాపార, వాణిజ్య రంగాల టర్నోవర్ 2013-14 ఆర్థిక సం వత్సరంలో భారీగానే కుదేలైంది. ఫలితంగా సర్కార్‌కు అత్యధిక ఆదాయం సమకూర్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ పన్నుల చెల్లింపులు తగ్గాయి. రాష్ట్రం మొత్తం మీద వాణిజ్య పన్నుల శాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల రాబడి అత్యంత కీలకం. మొత్తం రాష్ట్ర రాబడిలో 74 శాతం వరకు ఇక్కడ నుంచే జమవుతోంది. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువ ఆథారిత పన్ను), అమ్మకం పన్నులు ప్రధానమైనవి. ఇవే కాకుండా వృత్తి, వినోద తదితర పన్నుల ద్వారా కూడా కొంత రాబడి లభిస్తుంది. మొత్తం వసూళ్లలో వ్యాట్ ద్వారానే సుమారు 85 శాతం, మిగతా పన్నుల ద్వారా మరో 15 శాతం వరకు ఆదాయం సమకూరుతోంది. జంట జిల్లాల్లో వాణిజ్య పన్నుల శాఖకు గల ఏడు డివిజన్లలో పన్నుల వసూళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా క్షీణించాయి. రాజకీయ అనిశ్చితి, ఆందోళనలు, ఉద్యమాలు తదితర అడ్డంకులతో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజల రాకపోకలు తగ్గి వ్యాపార, వాణిజ్య రంగ లావాదేవీలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా వాహనాల రాకపోకలు తగ్గడంతో పెట్రోల్ ఉత్పత్తుల వినియోగం మందగించింది. పంజగుట్ట, అబిడ్స్, సికింద్రాబాద్, బేగంపేట డివిజన్లకు పెట్రోల్, డీజిల్, లిక్కర్, సిమెంట్, ఐరన్, గోల్డ్, హోటల్ ఇండస్ట్రీ, షాపింగ్ మాల్స్ తదితర సంస్థల నుంచి భారీగా పన్నులు వసూలవుతా యి. ఆయా సంస్థల లావాదేవీలు తగ్గడంతో పన్నుల చెల్లింపులు తగ్గిపోయాయి. తగ్గిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేషన్, స్టాంప్‌ల శాఖకు 2013-14 ఆర్థిక సంవత్సరం అచ్చిరాలేదు. మహానగరంలో భూముల క్రయ, విక్రయాలు తగ్గి ఆదాయం పడిపోయింది. రాష్ట్ర విభజన స్థిరాస్తి రంగాన్ని అచేతనంగా మార్చినట్లయింది. భూములు, ఫ్లాట్లకు డిమాండ్ తగ్గడంతో పాటు ధర కూడా పడిపోయింది. గతంలో తెలంగాణ ఉద్యమ ప్రభావంతో సైతం క్రయవిక్రయాలు పడిపోగా.. తిరిగి ఊపందుకుని లక్ష్యానికి మించి గత ఆర్థిక సంవత్సరం ఆదాయం సమకూరింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన సెగతో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఈ ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండి కొట్టినట్లయింది. ఫలితంగా హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో స్థిరాస్తి లావాదేవీలు తగ్గి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పడిపోయింది. ఆశావహంగా లేని ‘రవాణా’ ఆదాయం ఇటీవల కాలంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి తదితర పరిణామాల నేపథ్యంలో 2013-14 ఆర్థిక సంవత్సరం రవాణా శాఖ ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని సంపాదించలేకపోయింది. వాహనాల అమ్మకాలు తగ్గడం వల్ల జీవిత కాల పన్ను తగ్గిపోయిం ది. అలాగే రవాణా వాహనాలకు ప్రతి 3 నెలలకు ఒకసారి వసూలు చేసే క్వార్టర్లీ ట్యాక్స్ కూడా టార్గెట్ చేరుకోలేకపోయింది. హైదరాబాద్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం మొత్తం రూ.669.64 కోట్ల రెవెన్యూ టార్గెట్‌ను పెట్టుకోగా, రూ.478.45 కోట్లు మాత్రమే సాధించింది. అలాగే రంగారెడ్డి జిల్లాలో రూ.783 కోట్లు లక్ష్యం. కాగా రూ.రూ.599.06 కోట్లు మాత్రమే లభించింది.