సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) ప్రతినిధులు కలిశారు. కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి రూ.2 కోట్ల విలువైన 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేశారు. ఒక్కొక్కటి 10 లీటర్ల కెపాసిటీ ఉన్న కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసి వివరాలు అందజేసిన వారిలో ఎం.రవీందర్ రెడ్డి (డైరెక్టర్, మార్కెటింగ్, భారతీ సిమెంట్స్), డాక్టర్ ఎస్.ఆనంద్ రెడ్డి (ఎండీ, సాగర్ సిమెంట్స్), ఇంజేటి గోపినాథ్ (సీఈవో, సిక్మా) ఉన్నారు.
చదవండి: ‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’
థర్డ్‌వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక
Comments
Please login to add a commentAdd a comment